ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పెంపు | ITR Filing Deadline Extended For Belated Or Revised Return | Sakshi
Sakshi News home page

ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పెంపు: లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

Published Tue, Dec 31 2024 3:34 PM | Last Updated on Tue, Dec 31 2024 4:25 PM

ITR Filing Deadline Extended For Belated Or Revised Return

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువును పెంచుతూ కీలక ప్రకటన చేసింది. దీంతో గడువు మరో 15 రోజులు ముందుకు సాగింది.

నిజానికి ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing) గడువు 2024 డిసెంబర్ 31.. అయితే ఈ గడువును ఆదాయ పన్ను శాఖ 2025 జనవరి 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పొడిగింపు పన్ను చెల్లింపుదారులు.. వారి ఫైలింగ్‌లను పూర్తి చేయడానికి లేదా సవరించడానికి ఓ అవకాశం అని తెలుస్తోంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 119 ప్రకారం.. బోర్డు అధికారాలను ఉపయోగించి ఈ మార్పు చేసింది.

సాధారణంగా ప్రతి ఏటా ఐటీఆర్ ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్ జులై 31. ఈ తేదీ లోపల ఐటీఆర్ ఫైల్ చేయనివారు.. జరిమానా చెల్లించి డిసెంబర్ 31 లోపల ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ గడువును కూడా మరో 15 రోజులు పొడిగిస్తూ ఆదాయ పన్ను శాఖ నిర్ణయం తీసుకుంది. జనవరి 15 లోపల ఐటీఆర్ ఫైల్ చేయని వారు మాత్రమే కాకుండా.. ఫైల్ చేసిన వారు కూడా ఏవైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చు.

బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న వారు రూ.1,000 జరిమానా చెల్లించాలి. ఆదాయం ఐదు లక్షల రూపాయలకంటే ఎక్కువ ఉంటే వారు రూ. 5 వేల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో బకాయిలపై వడ్డీ, ఫెనాల్టీ వంటివి కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్లకు శుభవార్త.. డెడ్‌లైన్‌ పొడిగింపు

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత జనాభాలో 6.68 శాతం మంది మాత్రమే ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేశారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) డిసెంబర్ 17న పార్లమెంటుకు తెలియజేశారు. ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసుకునే మొత్తం వ్యక్తుల సంఖ్య 8,09,03,315 అని ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement