
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇచ్చిన గడువు నేటితో (జనవరి 15) ముగియనుంది. ఇక రేపటి నుంచి ఐటీఆర్ ఫైల్ చేయాలనుకుంటే.. ఆలస్య రుసుము కింద రూ. 1000 నుంచి రూ. 5000 వరకు జరిమానాతో చెల్లించాల్సి ఉంటుంది.
ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing) గడువు 2024 డిసెంబర్ 31.. అయితే ఆ గడువును ఆదాయ పన్ను శాఖ 2025 జనవరి 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 119 ప్రకారం.. బోర్డు అధికారాలను ఉపయోగించి ఈ మార్పు చేసింది.
ఇదీ చదవండి: ఐఫోన్ కొనడానికి ఇదే మంచి సమయం!
బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న వారు రూ.1,000 జరిమానా చెల్లించాలి. ఆదాయం ఐదు లక్షల రూపాయలకంటే ఎక్కువ ఉంటే వారు రూ. 5 వేల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో బకాయిలపై వడ్డీ, ఫెనాల్టీ వంటివి కూడా చెల్లించాల్సి ఉంటుంది.