ఇది జూలై నెల. ట్యాక్స్ పేయర్లు అందరూ ఐటీ రిటర్న్ ఫైల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. జూలై 31 చివరి తేది దగ్గర పడుతోంది. అన్ని పత్రాలను సేకరించుకుని ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత దానిని 30 రోజులలోపు ధ్రువీకరించడం చాలా ముఖ్యం. మీరు దీన్ని సమయానికి చేయకపోతే పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది.
వెరిఫికేషన్ ఎలా చేయాలంటే..
ఆధార్-ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ లేదా ప్రీ వ్యాలిడేటెడ్ బ్యాంక్ ఖాతా/డీమ్యాట్ ఖాతా ద్వారా రిటర్న్‌ను ఈ-వెరిఫై చేయడం ఐటీఆర్ వెరిఫికేషన్‌కు సులభమైన మార్గం. ఆన్‌లైన్ వెరిఫికేషన్ సౌకర్యంగా లేకుంటే, ఐటీఆర్-వీ భౌతిక కాపీని బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC)కి పంపవచ్చు. అయితే, ఇది ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ. ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ పూర్తయ్యాక విజయవంతమైనట్లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు సందేశం వస్తుంది. దీంతో పాటు ట్రాన్సాక్షన్ ఐడీ వస్తుంది. అలాగే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి కూడా ఈమెయిల్ వస్తుంది.
తప్పితే జరిమానా కట్టాల్సిందే..
ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం, 30 రోజులు దాటినా వెరిఫికేషన్ చేయకపోతే సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుములను చెల్లించవలసి ఉంటుంది. 2024 మార్చి 31 నాటి CBDT (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) నోటిఫికేషన్ నం. 2/2024 ప్రకారం, ఇతర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. 5 లక్షల వరకు ఆదాయానికి ఆలస్య రుసుము రూ. 1,000, రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయానికి రూ. 5,000 పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment