ఆదాయ పన్ను చెల్లించేవారు ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనలు తెలుసుకోవడం మాత్రమే కాదు, దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే డిసెంబర్ 15 వచ్చేస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరం మూడో విడత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుకు ఇదే చివరి గడువు.
డిసెంబర్ 15లోపు మూడో విడత పన్ను చెల్లించాలి. లేకుంటే భారీ ఫెనాల్టీ చెల్లించడం మాత్రమే కాకుండా.. చట్ట పరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందస్తుగా పన్నులు చెల్లించడం వల్ల జరిమానాలను నివారించవచ్చు. రూ.10,000 కంటే ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లించాల్సిన వారు.. జూన్ 15, సెప్టెంబరు 15, డిసెంబర్ 15, మార్చి 15 తేదీలలో నాలుగు వాయిదాలలో ముందస్తు పన్ను చెల్లించాలి.
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను. మూడవ ముందస్తు పన్ను వాయిదా డిసెంబర్ 15, 2024న ముగుస్తుంది. ఆ రోజు ఆదివారం కాబట్టి.. చెల్లింపుదారులు ఎలాంటి జరిమానాలు లేకుండా సోమవారం (డిసెంబర్ 16) చెల్లించవచ్చు. ఈ సౌలభ్యం 1994లో జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో వెల్లడించారు. అప్పటి నుంచి ఈ నియమంలో ఎలాంటి మార్పు చేయలేదు. కాబట్టి ట్యాక్స్ చెల్లించడానికి ఆఖరు రోజు సెలవు దినం అయితే.. ఆ మరుసటి పనిదినంలో చెల్లించవచ్చు.
అడ్వాన్స్ ట్యాక్స్ లెక్కించడం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. అందే అన్ని రకాల ఆదాయాలను అంచనా వేయాలి. అంచనా వేసిన మొత్తం నుంచి అందుబాటులో ఉన్న పన్ను మినహాయింపులను తీసివేయాలి. ఆ తర్వాత మిగిలిన ఆదాయంపై పన్నును లెక్కగట్టాలి. ఈ మొత్తం పన్ను విలువ రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ముందస్తు పన్ను చెల్లించాలి.
ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ టాక్స్ చెల్లింపు చేయడం ఎలా?
● ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలనుకునే వారు 'ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా' (భారత ఆదాయపు పన్ను శాఖ) ఈ-ఫైలింగ్ పోర్టల్‌ని ఓపెన్ చేయాలి.
● అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తరువాత.. ఎడమవైపు క్విక్ లింక్స్ కింద కనిపించే 'ఈ-పే ట్యాక్స్' (e-Pay Tax)పై క్లిక్ చేయాలి.
● ఈ-పే ట్యాక్స్ ఓపెన్ చేసిన తరువాత పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి.
● ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత మీ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి.
● 'ఇన్‌కమ్ ట్యాక్స్' కింద ట్యాక్స్ కేటగిరి ఎంచుకుని.. కంటిన్యూ అవ్వాలి.
● అడ్వాన్స్ ట్యాక్స్ 100కు చెల్లించాలనుకుంటే.. కేటగిరి 100ను ఎంచుకోవాలి.
● ట్యాక్స్ మొత్తాన్ని ఎంచుకున్న తరువాత.. ఏ విధంగా చెల్లింపులు చేస్తారో సెలక్ట్ చేసుకోవాలి.
● ట్యాక్స్ చెల్లించడానికి ముందు.. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా? లేదా? అని చెక్ చేసుకోవాలి. ఆ తరువాత ట్యాక్స్ చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment