Last date
-
ఐటీఆర్ ఫైలింగ్: రేపటి నుంచి రూ.5000 ఫైన్!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇచ్చిన గడువు నేటితో (జనవరి 15) ముగియనుంది. ఇక రేపటి నుంచి ఐటీఆర్ ఫైల్ చేయాలనుకుంటే.. ఆలస్య రుసుము కింద రూ. 1000 నుంచి రూ. 5000 వరకు జరిమానాతో చెల్లించాల్సి ఉంటుంది.ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing) గడువు 2024 డిసెంబర్ 31.. అయితే ఆ గడువును ఆదాయ పన్ను శాఖ 2025 జనవరి 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 119 ప్రకారం.. బోర్డు అధికారాలను ఉపయోగించి ఈ మార్పు చేసింది.ఇదీ చదవండి: ఐఫోన్ కొనడానికి ఇదే మంచి సమయం!బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న వారు రూ.1,000 జరిమానా చెల్లించాలి. ఆదాయం ఐదు లక్షల రూపాయలకంటే ఎక్కువ ఉంటే వారు రూ. 5 వేల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో బకాయిలపై వడ్డీ, ఫెనాల్టీ వంటివి కూడా చెల్లించాల్సి ఉంటుంది. -
ఆధార్ ఉచిత అప్డేట్.. రేపే లాస్ట్ డేట్!
మైఆధార్ పోర్టల్‌లో ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా.. ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ 'డిసెంబర్ 14' చివరి రోజుగా ప్రకటిస్తూ 'యూఐడీఏఐ' (UIDAI) వెల్లడించింది. అయితే పేర్కొన్న గడువు సమీపిస్తోంది. ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. అయితే ఈ డేట్లో ఏమైనా మార్పులు ఉంటాయా? లేదా? అనేది రేపు తెలుస్తుంది.యూఐడీఏఐ వెల్లడించిన గడువు (డిసెంబర్ 14) లోపల ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకుంటే మాత్రం.. రూ. 50 అప్లికేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మరో మారు గడువును పొడిగిస్తారా అనే విషయం మీద ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎలా?● మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి● లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 16 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.● నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.● రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.● అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.● మీరు ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.● అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ట్రాక్ చేయవచ్చు. -
పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ 15 డెడ్‌లైన్!
ఆదాయ పన్ను చెల్లించేవారు ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలు తెలుసుకోవడం మాత్రమే కాదు, దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే డిసెంబర్ 15 వచ్చేస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరం మూడో విడత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుకు ఇదే చివరి గడువు.డిసెంబర్ 15లోపు మూడో విడత పన్ను చెల్లించాలి. లేకుంటే భారీ ఫెనాల్టీ చెల్లించడం మాత్రమే కాకుండా.. చట్ట పరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందస్తుగా పన్నులు చెల్లించడం వల్ల జరిమానాలను నివారించవచ్చు. రూ.10,000 కంటే ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లించాల్సిన వారు.. జూన్ 15, సెప్టెంబరు 15, డిసెంబర్ 15, మార్చి 15 తేదీలలో నాలుగు వాయిదాలలో ముందస్తు పన్ను చెల్లించాలి.2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను. మూడవ ముందస్తు పన్ను వాయిదా డిసెంబర్ 15, 2024న ముగుస్తుంది. ఆ రోజు ఆదివారం కాబట్టి.. చెల్లింపుదారులు ఎలాంటి జరిమానాలు లేకుండా సోమవారం (డిసెంబర్ 16) చెల్లించవచ్చు. ఈ సౌలభ్యం 1994లో జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో వెల్లడించారు. అప్పటి నుంచి ఈ నియమంలో ఎలాంటి మార్పు చేయలేదు. కాబట్టి ట్యాక్స్ చెల్లించడానికి ఆఖరు రోజు సెలవు దినం అయితే.. ఆ మరుసటి పనిదినంలో చెల్లించవచ్చు.అడ్వాన్స్ ట్యాక్స్ లెక్కించడంప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. అందే అన్ని రకాల ఆదాయాలను అంచనా వేయాలి. అంచనా వేసిన మొత్తం నుంచి అందుబాటులో ఉన్న పన్ను మినహాయింపులను తీసివేయాలి. ఆ తర్వాత మిగిలిన ఆదాయంపై పన్నును లెక్కగట్టాలి. ఈ మొత్తం పన్ను విలువ రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ముందస్తు పన్ను చెల్లించాలి.ఆన్లైన్లో అడ్వాన్స్ టాక్స్ చెల్లింపు చేయడం ఎలా?● ఆన్లైన్లో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలనుకునే వారు 'ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా' (భారత ఆదాయపు పన్ను శాఖ) ఈ-ఫైలింగ్ పోర్టల్‌ని ఓపెన్ చేయాలి.● అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత.. ఎడమవైపు క్విక్ లింక్స్ కింద కనిపించే 'ఈ-పే ట్యాక్స్' (e-Pay Tax)పై క్లిక్ చేయాలి. ● ఈ-పే ట్యాక్స్ ఓపెన్ చేసిన తరువాత పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి.● ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత మీ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ● 'ఇన్కమ్ ట్యాక్స్' కింద ట్యాక్స్ కేటగిరి ఎంచుకుని.. కంటిన్యూ అవ్వాలి.● అడ్వాన్స్ ట్యాక్స్ 100కు చెల్లించాలనుకుంటే.. కేటగిరి 100ను ఎంచుకోవాలి. ● ట్యాక్స్ మొత్తాన్ని ఎంచుకున్న తరువాత.. ఏ విధంగా చెల్లింపులు చేస్తారో సెలక్ట్ చేసుకోవాలి. ● ట్యాక్స్ చెల్లించడానికి ముందు.. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా? లేదా? అని చెక్ చేసుకోవాలి. ఆ తరువాత ట్యాక్స్ చెల్లించాలి. -
ఆధార్ అప్డేట్ చేయకుంటే ఏమవుతుంది?: తప్పకుండా తెలుసుకోవాల్సిందే..
ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు, కేంద్రం ప్రకటించిన గడువు లోపల అప్డేట్ చేసుకోవాలి. లేకుంటే అలాంటి ఆధార్ కార్డులు రద్దవుతాయి. దీనిని ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి డిసెంబర్ 14 చివరి రోజు. ఇప్పటికే.. పలుమార్లు ఈ గడువును పెంచిన కేంద్రం, మళ్ళీ గడువును పెంచుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఆధార్ అప్డేట్ అనేది అవసరమా?.. ఇది ఎందుకు పనికొస్తుందనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఒక నగరం నుంచి మరో నగరానికి మారితే? లేదా అడ్రస్ ఏమైనా మార్చుకుంటే.. అలాంటి వారు తమ ఆధార్ కార్డులో కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇది మాత్రమే కాకుండా.. పేరు, పుట్టిన తేదీ, ఫోటో వంటి వాటిని అప్డేట్ చేసుకోవచ్చు.ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు పూర్తయిన వారు స్థాన చలనం జరగకుండా ఉంటే.. లేదా వ్యక్తిగత వివరాలలో ఎలాంటి అప్డేట్ అవసరం లేకుంటే.. అలాంటి వారు తప్పకుండా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే బయోమెట్రిక్, ఫోటో వంటివి అప్డేట్ చేసుకోవడం ఉత్తమం. దీని వల్ల మోసాలను నివారించవచ్చు.ఆధార్ ఫ్రీ అప్డేట్ కోసం గడువును పొడిగించిన ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ తేదీని పొడిగిస్తూ ప్రకటనలు జారీ చేశారు. అయితే ఇకపైన లేదా డిసెంబర్ 14 తరువాత గడువును పొడిగించే అవకాశం ఉండకపోవచ్చని సమాచారం. ఇప్పుడు ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకుంటే మాత్రం.. రూ. 50 అప్లికేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే కంటే ఎక్కువ ఉద్యోగాలు!.. జెప్టో ఫౌండర్ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎలా?➠మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి➠లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 16 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.➠నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.➠రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.➠అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.➠మీరు ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.➠అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ట్రాక్ చేయవచ్చు. -
ఆధార్ ఫ్రీ అప్డేట్: యూఐడీఏఐ కీలక నిర్ణయం
ఆధార్ కార్డులోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి కేంద్రం సెప్టెంబర్ 14 వరకు గడువును ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ గడువును 2024 డిసెంబర్ 14 వరకు పొడిగిస్తూ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.ఆధార్ కార్డ్ ఫ్రీ అప్డేట్ 'మై ఆధార్' (#myAdhaar) పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్‌లో అప్డేట్ చేసుకునేందుకు రూ.50 చెల్లించాల్సి ఉంది. ఆన్లైన్ పోర్టల్ యూఐడీఏఐ వెబ్సైట్లో పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను డిసెంబర్ 14 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ గడువును పొడిగించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఈ తేదీని 2023 డిసెంబర్ 15 నుంచి పొడిగిస్తూ.. మార్చి 14, ఆ తరువాత జూన్ 14, సెప్టెంబర్ 14కు పొడిగిస్తూ.. ఇప్పుడు తాజాగా ఈ తేదీని డిసెంబర్ 14కు పొడిగించారు.ఇదీ చదవండి: ఇలా అయితే బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే.. ఆన్లైన్లో ఆధార్ అప్డేట్➤మీ 16 అంకెల ఆధార్ నంబర్‌ను ఉపయోగించి https://myaadhaar.uidai.gov.in/ కి లాగిన్ అవ్వండి➤క్యాప్చా ఎంటర్ చేసి 'లాగిన్ యూజింగ్ ఓటీపీ'పై క్లిక్ చేయండి.➤మీ లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.➤మీరు ఇప్పుడు పోర్టల్‌ను యాక్సెస్ చేయగలరు.➤'డాక్యుమెంట్ అప్డేట్' ఎంచుకోండి. రెసిడెంట్ ప్రస్తుత వివరాలు కనిపిస్తాయి.➤మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్లను అంటే పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను ఎంచుకోండి➤ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ లేదా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్‌ను ఎంచుకోండి. అవసరమైన డాక్యుమెంటును అప్లోడ్ చేయండి.➤'సబ్మిట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.➤14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (యూఆర్ఎన్) జనరేట్ అవుతుంది.#UIDAI extends free online document upload facility till 14th December 2024; to benefit millions of Aadhaar Number Holders. This free service is available only on #myAadhaar portal. UIDAI has been encouraging people to keep documents updated in their #Aadhaar. pic.twitter.com/ThB14rWG0h— Aadhaar (@UIDAI) September 14, 2024 -
కేవైసీ అప్డేట్.. ఈ రోజే లాస్ట్ డేట్ - ఎలా చేయాలంటే?
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులను హెచ్చరిస్తూ.. కేవైసీ చేయడానికి ఈ రోజే (ఫిబ్రవరి 29) చివరి గడవని గతంలోనే వెల్లడించింది. కేవైసీ అప్డేట్ పూర్తి చేయకపోతే అటువంటి ఫాస్ట్‌ట్యాగ్స్ డీయాక్టివేట్ లేదా బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలంటే.. వినియోగదారుడు ముందుగా ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఓటీపీ అథెంటికేషన్ పూర్తయిన తరువాత.. డాష్‌బోర్డ్‌లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్లో KYC స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సులభంగా ఇలా చెక్ చేసుకుని ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అప్డేట్ అవ్వకపోతే.. అప్డేట్ చేసుకోవచ్చు. కేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలంటే.. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకున్న తరువాత.. పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తే.. కేవైసీ సబ్ సెక్షన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. దీని కోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్ వంటి వాటితో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరమవుతుంది. ఇవన్నీ సబ్మిట్ చేసిన తరువాత చెక్ చేసి, చివరిగా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది. కేవైసీ అప్డేట్ఎందుకంటే.. కొందరు ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు, మరి కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేస్తున్నట్లు గుర్తించి, ఈ విధానికి చరమగీతం పాడాలని ఉద్దేశ్యంతో 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుడు KYC అప్డేట్ చేసుకోవాల్సిందే. -
ఓటరుగా నమోదు అవడానికి ఈనెల 31 వరకు అవకాశం.. సద్వినియోగం చేసుకోండి..
సూర్యపేట్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో కేంద్ర ఎన్నికల సంఘం అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది. ఓటరు నమోదుకు గత నెల 19వ తేదీ వరకు గడువు ఉండగా, ఈ నెల 4వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేశారు. ఇంకా ఓటరుగా నమోదు చేసుకోని వారెవరైనా ఉంటారనే ఆలోచనతో ఈ నెల 31వ తేదీ వరకు కొత్తగా ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారే కాకుండా ఇప్పటివరకు ఓటు హక్కు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కోవాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఇలా తెలుసుకోవచ్చు ప్రజలు తమకు ఓటు హక్కు ఉందా లేదా అనే వివరాలను తెలుసుకునేందుకు వివిధ రకాల వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన వెబ్సైట్ www.nvsp.in, voters.eci.gov.inతో పాటు రాష్ట్రానికి సంబంధించి www.ceotelangana.nic.in వెబ్సైట్ చూసుకోవచ్చు. అంతేకాకుండా ఓటరు హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. 1950 నంబర్‌కు ఫోన్ చేసినా ఓటు హక్కు సంబంధించిన సమాచారం ఇస్తారు. కాగా ఓటు లేని వారు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చిరునామా మార్పునకు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. పూర్తిగా పేరు తొలగింపునకు మాత్రం ఇప్పుడు అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. అవగాహన కల్పిస్తున్నాం అక్టోబర్ 31వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకోవాలని ప్రజలతో పాటు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్యా కోర్సుల కళాశాలలో అవగాహన కల్పిస్తున్నాం.కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి ఎలా ఓటు వేయాలని అని వీవీ ప్యాట్లతో అవగాహన కల్పిస్తున్నాం. – భట్టు నాగిరెడ్డి, భువనగిరి జిల్లా నోడల్ అధికారి -
రేపే లాస్ట్ డేట్ - మిగిలిన రూ.2000 నోట్ల పరిస్థితి ఏంటి?
రూ. 2000 నోట్ల ఎక్స్చేంజ్ లేదా డిపాజిట్ కోసం ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుంది. అయితే ఇప్పటి వరకు 93 శాతం పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సమయంలో 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) గడువు పొడిగిస్తుందా? లేదా అనే దానిపైన చాలా మందికి సందేహం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రెండు వేలు నోట్లను బ్యాంకుల ద్వారా మార్చుకోవడానికి 2023 మే 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు సుమారు నాలుగు నెలలు గడువు కల్పించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఈ గడువు రేపటితో ముగుస్తుంది. ఇప్పటికి కూడా వెనక్కి రావాల్సిన నోట్లు 7 శాతం ఉన్నాయని, దీని కోసం ఆర్బీఐ గడువు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదీ చదవండి: ఆడి కారులో వచ్చి ఆకుకూర అమ్ముతున్నాడు - వీడియో ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, ఇతర వ్యాపారస్తులు తమ వద్ద ఉన్న రూ. 2000 నోట్లను బ్యాంకులో జమ చేయడానికి గడువు పొడిగించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ గడువు అక్టోబర్ 31 వరకు పొడిగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2023 మే 19 నుంచి సెప్టెంబర్ 2 వరకు 93 శాతం రెండు వేలు నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయి సంబంధిత శాఖ వెల్లడించింది. -
TS: గృహలక్ష్మి పథకానికి లాస్ట్‌డేట్ లేదు!
సాక్షి, హైదరాబాద్: ఆగష్టు 10వ తేదీతో గృహలక్ష్మి పథకం గడువు ముగుస్తుందంటూ జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించింది. అలాగే.. దరఖాస్తుల స్వీకరణకు రకరకాల పేపర్లు అడుగుతూ కొర్రీలు పెడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాల విమర్శలపైనా స్పందించింది. గృహలక్ష్మి పథకం అనేది తెలంగాణలో కొనసాగే నిరంతర ప్రక్రియ అని, కాబట్టి దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమైన ప్రకటన చేసింది. ఇళ్లులేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సొంత జాగా ఉండి.. ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల కోసం ప్రభుత్వం డెడ్ లైన్ విధించిందని, అర్హులైన వారు ఈనెల 10వ తేదీలోగా ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిందని పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దరఖాస్తు విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ‘‘గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ. దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అని స్పష్టం చేసింది. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తులు పంపించవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత.. రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారు అని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. గృహలక్ష్మి పథకం విషయంలో.. ప్రతి పక్షాలు, కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారాయన. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ - దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టుకోవడానికి రూ. 3 లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి… pic.twitter.com/yLp0zgYM0s — BRS Party (@BRSparty) August 9, 2023 మార్గదర్శకాలు ఇవే.. ► ఈ పథకం కింద 100 శాతం రాయితీతో ప్రభుత్వం రూ. 3 లక్షల ఈ ఆర్థిక సాయం అందించనుంది. ► రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున మెుత్తం 4 లక్షల మంది లబ్ధిదారులకు సాయం అందిస్తారు. ► మహిళల పేరు మీదే ఆర్థిక సాయం అందిస్తారు. ► లబ్ధిదారైన మహిళ పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి (జన్‌ధన్ ఖాతాను వినియోగించవద్దు) . ► కలెక్టర్లు, కమిషనర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. ► ఇంటి బేస్ మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, స్లాబ్ ఇలా మూడు దశల్లో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ► ఇప్పటికే ఆర్సీసీ (RCC) ఇళ్లు ఉన్న వారికి, 59 ఉత్తర్వులు కింద లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులు. ► ఈ పథకం కింద ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. దివ్యాంగులకు 5 శాతం ప్రత్యేక రిజర్వేషన్లను ప్రకటించారు. -
ఈ రోజే లాస్ట్.. ఆధార్ - పాన్ లింక్ చేయలేదా!
PAN-Aadhaar Linking: పాన్ - ఆధార్ లింక్ గురించి గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ లింకింగ్ గడువు ఈ రోజు కొన్ని గంటలలో ముగియనుంది. రేపటి నుంచి (జులై 01) ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్ ఖాతాలు పనిచేయవని ఇప్పటికే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. గతంలో దీని కోసం అనేక మార్లు గడువు పెంచడం కూడా జరిగింది. మరో సారి పొడిగిస్తుందో.. లేదో ప్రస్తుతానికి తెలియదు. నిజానికి పాన్ - ఆధార్ లింక్ గడువు ఎప్పుడో ముగిసింది. అయితే 2023 మార్చి 31 వరకు రూ. 1000 ఫైన్‌తో అదనపు గడువు కల్పించారు. ఆ కూడా జూన్ 30 వరకు పొడిగించారు. ఆ గడువు కాస్త ఈ రోజుతో ముగియనుంది. ఇంకో సారి పెంచే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నా.. దీనిపైనా ఎటువంటి స్పష్టత లేదు. ఆధార్ - పాన్ లింక్ చేయకపోతే ఏమవుతుంది.. ఆధార్ - పాన్ గడువు లోపలు చేయకుండా ఉంటే వారి బ్యాంకింగ్ సర్వీసులు, డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకం మాత్రమే కాకుండా.. ఆన్లైన్ చెల్లింపులు, యూపీఐ చెల్లింపులు, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు వీలుండదు, పెండింగ్ రిటర్నుల ప్రాసెస్ కూడా నిలిచిపోతుంది. (ఇదీ చదవండి: మీ పాన్ నెంబర్‌తో ఆధార్ లింక్ అయిందా? ఈ సింపుల్ టెక్నిక్స్‌తో తెలుసుకోండి) ఆధార్ - పాన్ లింక్ అనేది కొన్ని కేటగిరీకు సంబంధించిన వ్యక్తులకు తప్పనిసరి కాదని సీబీడీటీ (CBDT) తెలిపింది. ఇందులో 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భారత నివాసి కాని వారు & భారత పౌరులు కాని వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకు ఆధార్ - పాన్ లింక్ అవసరం లేదు. -
ఆధార్ అప్డేట్.. గడువు 10 రోజులే!
Aadhaar Update: భారతీయ పౌరులకు ఆధార్ కార్డు ఎంత ప్రధానమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు రావాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నా కూడా ఆధార్ కార్డే ఆధారం. అయితే ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోవడం మంచిది. అంతే కాకుండా ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు గడిచిన వారు తప్పనిసరిగా ఆధార్ కార్డుని ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ గతంలోనే సూచించింది. అయితే ఈ గడువు ఇప్పుడు సమీపిస్తోంది. గతంలో వెల్లడైన సమాచారం ప్రకారం ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆధార్ కార్డు వివరాలను రూపాయి చెల్లించకుండా జూన్ 14 లోపల అప్డేట్ చేసుకోవాలి. ఆ తరువాత ఆన్లైన్లో చేసిన కనీసం రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: మీ పాన్ నెంబర్‌తో ఆధార్ లింక్ అయిందా? ఈ సింపుల్ టెక్నిక్స్‌తో తెలుసుకోండి) నిజానికి ఈ గడువు మే చివరి నాటికి ముగియాల్సి ఉంది. కానీ అందరూ ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని 'యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' ఆధార్ కార్డుని ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేయడానికి అనుమతించింది. కావున ఇప్పటి వరకు ఆధార్ అప్డేట్ చేయని వారు ఈ నెల 14లోపు తప్పకుండా అప్డేట్ చేసుకోవడం మంచిది. -
Taxpayers-ITR Filing: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి!
2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను జూలై 31లోపు దాఖలు చేయాలి. ఏప్రిల్ 1 నుంచి 2023–24 అసెస్మెంట్ సంవత్సరానికి కొత్త ఐటీఆర్ ఫారమ్‌లు అందుబాటులో ఉంటాయి. నిబంధనల ప్రకారం రూ. 2.5 లక్షల ప్రాథమిక మినహాయింపు కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తులు తమ ఐటీఆర్‌లను గడువుకు ముందే సమర్పించాలి. ఇదీ చదవండి: Fact Check: ఐటీ నుంచి రూ.41 వేల రీఫండ్! నిజమేనా? అయితే రూ. 5 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపులకు అర్హత పొందిన వారు మాత్రం పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పలు కారణాల వల్ల ఐటీఆర్ దాఖలు గడువును గత ఏడాది జూలై 31 నుంచి సెప్టెంబర్ 30కి పొడిగించింది. అయితే ఈ సంవత్సరం కూడా పొడిగింపు ఏమైనా ఉంటుందా అన్నది ఇప్పటివరకూ తెలియదు. (ట్యాక్స్‌పేయర్ల కోసం స్పెషల్ యాప్, ఎలా పనిచేస్తుంది?) ఆలస్యమైతే ఏమవుతుంది? ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 234F కింద ఐటీఆర్ దాఖలు ఆలస్యమైతే ఆలస్య రుసుము రూ. 5,000 చెల్లించాలి. ఒక వేళ వార్షికాదాయం రూ. 5 లక్షల కంటే తక్కువైతే ఈ ఆలస్య రుసుమును రూ.1000లకు తగ్గిస్తారు. గడువు ముగిసిన తర్వాత రిటర్న్‌ను సమర్పించినట్లయితే ఆలస్య రుసుముతోపాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 234A ప్రకారం పన్ను బకాయిపై నెలకు 1 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్ గడువు దాటిపోతే మరో నష్టం కూడా ఉంది. ఆలస్య రుసుము, వడ్డీ చెల్లించి గడువు ముగిసిన తర్వాత కూడా రిటర్న్స్‌ను ఫైల్ చేయవచ్చు. కానీ తదుపరి సర్దుబాట్ల కోసం నష్టాలను అందులో చేర్చడానికి వీలుండదు. సాధారణంగా స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్లు, రియల్ ఎస్టేట్ లేదా ఏదైనా సంస్థల్లో పెట్టుబడుల వల్ల నష్టాలు ఉంటే వాటిని ఐటీఆర్‌లో చేర్చి వచ్చే ఏడాది ఆదాయంతో సర్దుబాటు చేసుకోవచ్చు. ఫలితంగా పన్ను భారం బాగా తగ్గుతుంది. ఇది గడువు తేదీలోపు ఐటీఆర్ సమర్పిస్తేనే. ఇదీ చదవండి: Hindenburg Research: త్వరలో హిండెన్‌బర్గ్ మరో బాంబ్.. ఈసారి ఎవరి వంతో..! -
గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్.. ఏడాదికి రూ.20,000
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) 2021 సంవత్సరానికి సంబంధించి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందిస్తారు. ► అర్హత: 2020–21 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు మిం^è కుండా ఉండాలి. మెడిసిన్/ఇంజనీరింగ్/ఏదైనా గ్రాడ్యుయేషన్ /ఇంటిగ్రేటెడ్ కోర్సులు/ఏదైనా విభాగంలో డిప్లొమా/తత్సమాన కోర్సులు/ఒకేషనల్ కోర్సు(ఐటీఐల్లో)ల్లో చేరాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ ఉపకార వేతనాలు అందజేస్తారు. ► 2020–21 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు మించకుండా ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీల్లో/ఐటీఐల్లో ఒకేషనల్ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్స్ అందజేస్తారు. ► ప్రత్యేకంగా బాలికలకు ఉపకార వేతనాలు: బాలికల విద్యను ప్రోత్సహించడానికి వీటిని అందిస్తున్నారు. కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై.. ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలు దీనికి అర్హులు. 2020–21 విద్యా సంవత్సరంలో 60 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2లక్షలు మించకూడదు. ► స్కాలర్షిప్ వ్యవధి: రెగ్యులర్ స్కాలర్స్‌కు సంబంధిత కోర్సు పూర్తయ్యే వరకు అందిస్తారు. బాలికలకు ప్రత్యేకంగా అందించే ఉపకార వేతనాలు రెండు సంవత్సరాలు అందిస్తారు. ► ఉపకార వేతనాల మొత్తం: రెగ్యులర్ స్కాలర్స్‌కు ఏడాదికి రూ.20,000లని మూడు వాయిదాల్లో అందిస్తారు. ► ప్రత్యేకంగా బాలికలకు ఏడాదికి రూ.10,000లని మూడు వాయిదాల్లో అందిస్తారు. ► ఎంపిక విధానం: 10/10+2లో సాధించిన మెరిట్ మార్కులు, తల్లిదండ్రుల కుటుంబ వార్షికాదాయం ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.12.2021 ► వెబ్సైట్: licindia.in -
ఎయిరిండియా రేసులో టాటా గ్రూప్
ముంబై, సాక్షి: విమానయాన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎయిర్ ఇండియా కొనుగోలు రేసులో ఎట్టకేలకు టాటా గ్రూప్ బరిలో నిలిచింది. మరోపక్క ఎయిర్ ఇండియా ఉద్యోగులు సైతం కంపెనీ కొనుగోలుకి ఆసక్తిని వ్యక్తం చేయడం గమనార్హం. భారీ రుణ భారంతో కుదేలైన ఎయిర్ ఇండియా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలలుగా సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తొలి దశలో భాగంగా ఆసక్తిని వ్యక్తం చేస్తూ(ఈవోఐ) బిడ్స్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం విధించిన గడువు నేటి(14)తో ముగియనుంది. దీంతో పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఈవోఐను దాఖలు చేసింది. మరోవైపు ఒక ఆర్ధిక సంస్థ సహకారంతో 209 మంది ఉద్యోగులు సైతం కన్సార్షియంగా ఏర్పడి ఈవోను దాఖలు చేశారు. వివరాలు చూద్దాం.. టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా వాటా కొనుగోలుకి టాటా గ్రూప్ డిజిన్వెస్ట్‌మెంట్ శాఖకు ఈవోఐను దాఖలు చేసింది. ఇది ఆసక్తిని వ్యక్తం చేయడం మాత్రమేనని, ఫైనాన్షియల్ బిడ్‌ను మరో రెండు వారాల్లోగా దాఖలు చేయనున్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ప్రస్తుతం టాటా గ్రూప్ దేశీయంగా ఎయిర్ ఏషియా, విస్తారా బ్రాండ్లతో భాగస్వామ్య సంస్థలను నిర్వహిస్తోంది. తద్వారా విమానయాన సర్వీసులను అందిస్తోంది. ఎయిర్ ఇండియాలో మెజారిటీ వాటా కొనుగోలుకి సొంతంగానే ముందుకెళుతుందా.. లేక భాగస్వాములను కలుపుకుని రేసులో నిలుస్తుందా అన్న అంశాలపై స్పష్టత లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. (80% విమానాలకు ఓకే- షేర్లకు రెక్కలు) ఉద్యోగులు ఇలా మొత్తం 209 మంది ఉద్యోగుల తరఫున ఎయిర్ ఇండియా కొనుగోలుకి.. కంపెనీ కమర్షియల్ డైరెక్టర్ మీనాక్షి మాలిక్ ఈవోఐను దాఖలు చేశారు. ఇందుకు ఒక ఆర్థిక సంస్థ భాగస్వామిగా నిలవనున్నట్లు తెలియజేశారు. అయితే డిజిన్వెస్ట్‌మెంట్ నిబంధనల్లో భాగంగా ప్రయివేట్ సంస్థతో ఉద్యోగులు జత కట్టేందుకు వీలు లేదని నిపుణులు తెలియజేశారు. బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో మాత్రమే భాగస్వామ్యానికి వీలున్నట్లు వివరించారు. కాగా.. ఒక్కో ఉద్యోగి నుంచి రూ. లక్షకు మించకుండా కంట్రిబ్యూషన్ వసూలు చేయనున్నట్లు మాలిక్ తెలియజేశారు. తద్వారా ఎయిర్ ఇండియాలో ఉద్యోగులకు 51 శాతం, ఆర్థిక సంస్థకు 49 శాతం వాటాను కేటాయించే వీలున్నట్లు తెలియజేశారు. (లాజిస్టిక్స్ కంపెనీలకు వ్యాక్సిన్ల బూస్ట్) రూ. 23,286 కోట్లు ఎయిర్ ఇండియా కొనుగోలు రేసులో నిలిచే కంపెనీ రూ. 23,286 కోట్ల రుణాలను స్వీకరించవలసి ఉంటుందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎయిర్ ఇండియాకున్న మొత్తం రూ. 60,000 కోట్ల రుణాలలో మిగిలిన వాటాను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఎస్‌పీవీకు బదిలీ చేయనున్నారు. ఎయిర్ ఇండియా అసెట్స్ హోల్డింగ్స్ పేరుతో ప్రభుత్వం ఎస్పీవీకి తెరతీయనుంది. ఎయిర్ ఇండియా ఎంటర్ప్రైజ్ విలువను మార్కెట్ క్యాపిటలైజేషన్, స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు, బ్యాలన్స్షీట్లో ఉన్న నగదు తదితరాల ఆధారంగా నిర్ణయించనున్నట్లు తెలుస్తో్ంది. కాగా.. గతంలో ప్రభుత్వం 2018లో ఒకసారి ఎయిర్ ఇండియాను విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం గమనార్హం! -
ఐటీఆర్ ఫైలింగ్ : గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్నుకు సంబంధించి 2018-19 రిటర్న్స్ దాఖలుకు తుది గడువును ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) మరో రెండు నెలలు పొడిగించింది. ఈ మేరకు బుధవారం ఒక ట్వీట్ చేసింది. నిజానికి ఈ గడువు సెప్టెంబర్‌తో ముగిసిపోయింది. కోవిడ్-19 నేపథ్యంలో రిటర్న్స్ దాఖలు విషయంలో కొన్ని అవరోధాలు ఏర్పడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ తెలిపింది. గడువు పొడిగింపు ఇది నాల్గవసారి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి అసెస్మెంట్ ఇయర్ 2019–20 అవుతుంది. అంటే 2020 మార్చినాటికి 2018–19 ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే దీనిని తొలుత జూన్ 30 వరకూ సీబీడీటీ పొడిగించింది. మళ్లీ జూలై 31 వరకూ పెంచింది. జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కొన్ని అధిక విలువలు కలిగిన లావాదేవీలు జరిగాయని పేర్కొంటూ, కొందరికి ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ఎస్ఎంఎస్, ఈ-మెయిల్‌ను పంపుతోంది. జీఎస్టీ రిటర్న్స్ గడువు అక్టోబర్ 31 వరకూ... మరోవైపు 2018-19 వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వార్షిక రిటర్న్స్, ఆడిట్ రిపోర్ట్ దాఖలుకు (జీఎస్టీఆర్-9, జీఎస్టీఆర్ 9సీ) గడువును మరోనెల అంటే అక్టోబర్ 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు సీబీఐసీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్డ్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్) మరో ట్వీట్లో ప్రకటించింది. మేలో ఈ గడువును సీబీఐసీ మూడు నెలల పాటు అంటే సెప్టెంబర్ వరకూ పొడిగించింది. కరోనా ప్రేరిత అంశాలు దీనికి నేపథ్యం. -
పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ
సాక్షి , వరంగల్: రానున్న ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లపై పోటీలో ఉన్న అభ్యర్థులు దృష్టి సారించారు. పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రచారంలో హడావుడిగా గడుపుతున్న అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఓ కన్నేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు శుక్రవారం వరకు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు.. ఉద్యోగులను తమ దారికి తెచ్చుకునేందుకు వారి చుట్టూ ప్రదక్షిణలు మొదలెట్టారు. మరోవైపు వంద శాతం పోలింగ్ లక్ష్యంగా చర్యలు చేపడుతున్న ఎన్నికల కమిషన్ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఉద్యోగి తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసింది. కాగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సైతం గెలుపును ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. దీంతో వారిని రాజకీయ పార్టీలు అనుకూలంగా మలుచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోలో ఉద్యోగులకు అనుకూలంగా ఉండే తాయిలాలను ప్రకటిస్తూ మచ్చిక చేసుకునే పనిలో ఉన్నాయి. 17,820 మంది ఉద్యోగులు.. ఉమ్మడి జిల్లాలో 17,820 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఎన్జీవోలు, ఉపాధ్యాయులు ఉన్నారు. వీరందరూ ఖజానా శాఖ పరిధిలో వేతనాలు పొందేవారే. వీరు కాకుండా ఆర్టీసీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన బీఎస్ఎన్ఎల్, పోస్టల్, సింగరేణి ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరందరికీ జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం’ (సీపీఎస్)ను రద్దు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొంత కాలంగా పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి అనుకూలంగా తమవంతు సహకారం చేస్తామని ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. అలాగే పీఆర్సీ, మధ్యంతర భృతిపై కూడా ఉద్యోగులు ఆశతో ఉన్నారు. దీంతో పాటు ఉద్యోగ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలని కొంత కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. తమ డిమాండ్లకు అనుకూలంగా ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలో ప్రకటించాలని సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ వచ్చారు. అన్ని పార్టీల నాయకులు సీపీఎస్ విషయమై సానుకూలంగా స్పంది స్తామని సంకేతాలు ఇవ్వడంతో అసలు ఉద్యోగులు ఏ పార్టీని నమ్మి ఓట్లు వేస్తారో తెలియని ప రిస్థితి నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కరించే విధంగా ఏ పార్టీ మేనిఫెస్టో ఉంటుందో వారి వైపే ఉద్యోగులు ఆకర్షితులయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ నెల 30తో గడువు పూర్తి.. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. ఈ నెలాఖరులోగా దరఖాస్తులు సమర్పిస్తే సమయానికి వారి చేతికి పత్రాలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి పోస్టల్ బ్యాలెట్ కోసం 9,995 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక నియోజకవర్గంలోని సిబ్బంది అదే అసెంబ్లీ పరిధిలో పోలింగ్ విధులు నిర్వర్తిస్తే పోస్టల్ బ్యాలెట్ అప్పుడే ఇస్తామని, ఇతర నియోజకవర్గంలో పోలింగ్ బాధ్యతలు ఉంటే పోస్ట్ ద్వారా లేదా ఆర్వోకు డ్యూటీ ఆర్డర్ కాపీతో పాటు పోస్టల్ బ్యాలెట్‌ను పంపిస్తామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇందుకు ఎన్నికల సిబ్బంది డ్యూటీ ఆర్డర్లను కూడా సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది శుక్రవారంలోపు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోకుంటే ఓటు వినియోగించుకోవడం కష్టమని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థుల ఆశలు.. గత ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉంటున్నందున ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నట్లు తెలు స్తోంది. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది ఓటు హక్కు వినియోగానికి అవకాశం దొరకడం లేదని సమాచారం. ఓటు వినియోగించుకున్న సిబ్బంది సైతం పోస్టల్ బ్యాలెట్‌పై అనుమానాస్పదంగా మార్క్ చేయడంతో కొన్ని ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ పోలింగ్ శాతం పె ంపుపై దృష్టి సారించింది. దీంతో ఈసారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే శక్తిగా మారే అవకాశం లేకపోలే దు. రాజకీయ పార్టీలు.. ఉద్యోగుల డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తూ వారిని మచ్చిక చేసుకునే పనిలో ఉంటున్నట్లు తెలుస్తోంది. -
నేటితో గడువు పూర్తి
కరీంనగర్‌సిటీ: మంచి పాలన కావాలి.. మంచి నేత రావాలి.. మరి ఏం చేయాలి? నినదించా లి? నిలువరించాలి? ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి? అంటే.. ఓటు వేయాలి? వేయాలంటే ముందు ఓటరుగా నమోదు చేసుకోవాలి.. ఇదే ఆఖరి అవకాశం.. వదిలితే అథఃపాతాళం.. ‘లేవండి! మేల్కొనండి! ఇకపై నిద్రించకండి.. అజ్ఞానాంధకారం నుం చి బయటికి రావాలి..’ అన్న స్వామీ వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఓటు అనే వజ్రాయుధం సంధించడంలో ముందు వరుసలో నిలవాల్సిన తరుణమిదే. ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం ఆఖరి అవకాశం ఇ చ్చింది. యువతకు ప్రాధాన్యం కల్పించాలన్న ప్రధాన ఉద్దేశంతోపాటు అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలనే లక్ష్యంతో విస్తృత అవగాహన కల్పిస్తోంది. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రత్యేక శ్రద్ధతో రెవెన్యూ, ఇతర శా ఖల అధికారులు, ఉద్యోగులు బిజీబిజీగా ఉన్నా రు. విధుల్లో దాదాపు 90 శాతం ఎన్నికల నిర్వహణ కసరత్తుపైనే దృష్టిసారించారు. ఓటరు నమోదుకు గడువు సమీపించడంతో అవగాహ న సదస్సులు, ర్యాలీలు విస్తృతం చేశారు. ఎన్నిక ల సంఘం ఈనెల 10న ప్రకటించిన ముసాయిదా జాబితా అనంతరం సెప్టెంబర్ 25 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. జిల్లాలో ఇంకా 60 వేలకు పైగా ఓటు హక్కు పొందాల్సి ఉన్నట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది. ఓటరు నమోదుకు స్పందన ఇప్పటివరకు ఓటరు నమోదుకు గాను 57,040 దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన ఓటరు న మోదుకు మంచి స్పందనే లభించినట్లు తెలు స్తోంది. తొలగింపు, ఆక్షేపణలకు సంబంధించి (ఫారం–7) 10,125, వివరాలను సరిదిద్దేందు కు (ఫారం–8) 4,314, ఒక పోలింగ్ నుంచి మరో పోలింగ్ కేంద్రానికి మార్పునకు (ఫారం–8ఏ) 3,640 దరఖాస్తులు వచ్చాయి. చిరునా మాలు మారడం, ఆధార్ ఇవ్వకపోవడం తదిత ర కారణాలతో జాబితాల్లో నుంచి భారీగా ఓట్లు తొలగించిన క్రమంలో దరఖాస్తుల సంఖ్య పెరగకపోవడం గమనార్హం. గల్లంతయిన పేర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు ఓటు కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఓటరు జా బితాలో పేరు ఉందో లేదో చూసి లేకుంటే అక్క డే ఫారం–6 ద్వారా ఓటు నమోదుకు దరఖాస్తులు ఇస్తున్నారు. కొత్త ఓటర్లతో పాటు మార్పులు, చేర్పులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గడువు పొడిగించేనా..? కొత్తగా ఓటర్లుగా నమోదు కావాలన్నా.. మా ర్పులు, చేర్పులు చేయించుకోవాలన్నా మంగళవారం (నేటి వరకు) వరకే అవకాశముంది. ఈ నెల 15 నుంచి ప్రా రంభమైన ఈ కార్యక్రమం 25 తేదీతో ముగియనుంది. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులు చేర్పులకు అవకాశం ఉండదని అధికారులు చె బుతున్నారు. బూత్‌స్థాయి అధికారులకు నేరుగా దరఖాస్తులు ఇవ్వడంతోపాటు ఆన్‌లైన్‌లోనూ ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఉంది. పోలింగ్ ఏజెంట్ల సాయంతో ప్రతి గ్రా మంలో జాబితాలో లేని వారిని గుర్తించి వారితో దరఖాస్తులు సమర్పించేలా చేస్తే ఫలితం ఉం టుంది. అయితే ఓటరు నమోదుకు మరిన్ని రోజులు గడువు పొడిగిస్తారా? లేదా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. సహాయ కేంద్రంలో సేవలు.. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం ద్వారా ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు సేవలందిస్తున్నారు. ఫోన్‌కాల్స్ స్వీకరించి వారి పే రు ఓటరు జాబితాలో ఉందో లేదో తెలియజేస్తున్నారు. బీఎల్వోలు అందుబాటులో ఉన్నారా లే దా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నగరంలోని 50 డివిజన్లలో 250 మంది బీఎల్వో లు, 100 మున్సిపల్ సిబ్బంది విధుల్లో ఉన్నా రు. డిగ్రీ పీజీ కళాశాలలల్లోనూ ఫారం–6లు అందజేస్తున్నారు. అందుకు ఎంపీడీవోలను పర్యవేక్షకులుగా నియమించారు. కలెక్టరేట్లో సహాయ కేంద్రం నంబర్ 0878–2234731కు సంప్రదించాలని సూచిస్తున్నారు. -
జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు మరోసారి పెంపు
న్యూఢిల్లీ: జీఎస్టీ ఫైలింగ్‌కు గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. జులైలో కొనుగోళ్లు, ఇన్పుట్-అవుట్‌పుట్ లావాదేవీల కోసం జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ రిటర్న్ దాఖలు సోమవారం మరోనెలపాటు పొడిగిస్తూ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. అక్టోబర్28న బెంగళూరులో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుతెలిపింది. జీఎస్టీ -2 రిటర్న్‌కు నవంబర్ 30 అని జీఎస్టీఆర్-2 దాఖలుకు చివరి తేదీ డిసెంబర్ 11 అని ట్విట్టర్లో వెల్లడించింది. అక్టోబర్ 31 నుంచి గడువు కొనుగోలు రిటర్న్ లేదా జీఎస్టీఆర్-2 గడువును నవంబర్ 30వరకు, ఇన్పుట్-అవుట్‌పుట్ లావాదేవీల జీఎస్టీఆర్ 3 దాఖలును డిసెంబర్ 11 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు ట్వీట్ చేసింది. గతంలో ఆడిట్ చేసిన ఆదాయం పన్ను రాబడిల సమర్పణకు జీఎస్టీ-2 దాఖలు చేసిన గడువు ముగియడంతో కొంతమంది పన్ను చెల్లింపుదారులపై ఒత్తిడి తెచ్చిందని క్లియర్ టాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆర్చిత్ గుప్తా తెలిపారు. ఇన్పుట్ పన్ను క్రెడిట్ లభ్యత దానిపై ఆధారపడి ఉండటం వలన ఇది అత్యంత ముఖ్యమైందన్నారు. -
కుప్పల తెప్పలు
-బీపీఎస్ దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర జాప్యం - నెలాఖరు వరకు గడువు - జిల్లాలో 3 వేల దరఖాస్తులు పెండింగ్ తణుకు : అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం చేసుకున్న దరఖాస్తులు మునిసిపల్ టౌన్‌ప్లానింగ్ కార్యాలయాల్లో కుప్పలుగా పడివున్నాయి. వాటి పరిష్కారం తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) కింద భవన యజమానుల నుంచి నిర్ధేశిత ఫీజుల వసూలు గడువును నెలాఖరు వరకు పొడిగిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాదిలో నాలుగోసారి గడువు పెంచుతూ ఉత్తర్వులు వెలువడటం విశేషం. బీపీఎస్ దరఖాస్తులను కంప్యూటరైజ్ చేసినప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో నిర్ధేశిత సొమ్ము చెల్లించే విషయంలో భవన యజమానుల నుంచి స్పందన కరువైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం సమకూరడం లేదు. పరిష్కారం అంతంతే.. జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థతోపాటు భీమవరం, నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలకు 4,634 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 1,319 మాత్రమే పరిష్కారమయ్యాయి. 3,313 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. గతేడాది మే 22న బీపీఎస్ ప్రకటించిన మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ అదే నెల 27 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. స్పందన లేకపోవడంతో తొలుత రెండు నెలలు ఇచ్చిన గడువును మరో రెండు నెలలు పొడిగించింది. తర్వాత పలుమార్లు పొడిగించుకుంటూ గత ఏడాది డిసెంబరు నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించారు. అప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉన్నా ఆన్లైన్లో సమస్యల కారణంగా ఆశించిన పురోగతి సాధించలేకపోయారు. దీంతో 3,313 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. భారీగా ఆదాయం సమకూరుతుందని భావించినా ఇప్పటివరకు సుమారు రూ.20 కోట్లు మాత్రమే సమకూరింది. ఈ నేపథ్యంలో మరోసారి గడువు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
కుప్పల తెప్పలు
- బీపీఎస్ దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర జాప్యం -నెలాఖరు వరకు గడువు - జిల్లాలో 3 వేల దరఖాస్తులు పెండింగ్ తణుకు : అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం చేసుకున్న దరఖాస్తులు మునిసిపల్ టౌన్‌ప్లానింగ్ కార్యాలయాల్లో కుప్పలుగా పడివున్నాయి. వాటి పరిష్కారం తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) కింద భవన యజమానుల నుంచి నిర్ధేశిత ఫీజుల వసూలు గడువును నెలాఖరు వరకు పొడిగిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాదిలో నాలుగోసారి గడువు పెంచుతూ ఉత్తర్వులు వెలువడటం విశేషం. బీపీఎస్ దరఖాస్తులను కంప్యూటరైజ్ చేసినప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో నిర్ధేశిత సొమ్ము చెల్లించే విషయంలో భవన యజమానుల నుంచి స్పందన కరువైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం సమకూరడం లేదు. పరిష్కారం అంతంతే.. జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థతోపాటు భీమవరం, నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలకు 4,634 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 1,319 మాత్రమే పరిష్కారమయ్యాయి. 3,313 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. గతేడాది మే 22న బీపీఎస్ ప్రకటించిన మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ అదే నెల 27 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. స్పందన లేకపోవడంతో తొలుత రెండు నెలలు ఇచ్చిన గడువును మరో రెండు నెలలు పొడిగించింది. తర్వాత పలుమార్లు పొడిగించుకుంటూ గత ఏడాది డిసెంబరు నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించారు. అప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉన్నా ఆన్లైన్లో సమస్యల కారణంగా ఆశించిన పురోగతి సాధించలేకపోయారు. దీంతో 3,313 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. భారీగా ఆదాయం సమకూరుతుందని భావించినా ఇప్పటివరకు సుమారు రూ.20 కోట్లు మాత్రమే సమకూరింది. ఈ నేపథ్యంలో మరోసారి గడువు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
టెన్త్ పరీక్ష ఫీజు గడువు నవంబర్ 15
సాక్షి, హైదరాబాద్: 2017 మార్చిలో జరిగే పదోతరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి నవంబర్ 15లోగా ఫీజు చెల్లించాల్సిందిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి రెగ్యులర్‌తో పాటు ప్రైవేటు, ఓపెన్, ఒకేషనల్ కేటగిరీ విద్యార్థులు కూడా ఆలోపు ఫీజు చెల్లించాలన్నారు. గడువు దాటితే రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 23, రూ.200ల అపరాధ రుసుముతో డిసెంబర్ ఒకటోతేదీ, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్ తోమ్మిదో తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125 చొప్పున, గతంలో ఫైయిలై మూడు సబ్జెక్టులలోపు పరీక్షలు రాసే విద్యార్థులు రూ.110, మూడు సబ్జెక్టులు మించితే రూ.125 చెల్లించాల్సి ఉంటుందన్నారు. పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.24వేల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20వేలు, ఐదు ఎకరాల మెట్ట భూమి ఉన్న పిల్లలు ఫీజు చెల్లించాల్సిన పనిలేదన్నారు. ఇందుకు తగిన సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందని, ప్రధానోపాధ్యాయుడు సంతృప్తి చెందితేనే ఫీజు మాఫీ చేయనున్నట్లు చె ప్పారు. పిల్లలు చెల్లించిన ఫీజుమొత్తాన్ని నిర్దేశిత గడువులోగా సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో లేదా స్టేట్‌బ్యాంకులో జమచేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థుల నామినల్‌రోల్స్‌ను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. -
ఇంటర్ పరీక్షలకు దరఖాస్తులు
ఏలూరు సిటీ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాసేందుకు దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించేందుకు నవంబర్ 1తేదీ వరకు అపరాద రుసుము లేకుండా అవకాశం ఉందని ఇంటర్ విద్యమండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎస్ఏ «ఖాదర్ మంగళవారం తెలిపారు. రూ.120ల అపరాధ రుసుముతో నవంబర్ 10తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.500ల అపరాధ రుసుముతో 17తేదీ వరకు, రూ.వెయ్యి అపరాద రుసుముతో 28తేదీ వరకు, రూ.2వేలు అపరాద రుసుముతో డిసెంబర్ 21తేదీ వరకు, రూ.3వేలు అపరాద రుసుముతో డిసెంబర్ 31తేదీ వరకు, రూ.5వేలు అపరాధ రుసుముతో 2017 జనవరి 18తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజులు చెల్లించాలని ఆయన కోరారు -
ఉపకార వేతనాల దరఖాస్తుల గడువు పెంపు
ఏలూరు (మెట్రో) : జిల్లాలోని పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తుల గడువును ఈ నెల 31 వరకూ పొడిగించినట్టు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు వి.ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈపాస్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు 31లోగా అందించాలని కోరారు. ఇతర వివరాల కోసం 08812–234146 నంబర్లో సంప్రదించాలని ప్రసాదరావు పేర్కొన్నారు. -
ఉపకార వేతనాల దరఖాస్తుల గడువు పెంపు
ఏలూరు (మెట్రో) : జిల్లాలోని పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తుల గడువును ఈనెల 31 వరకు పొడిగించినట్టు సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డైరెక్టర్ రంగలక్ష్మీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈపాస్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. రేషన్‌కార్డు లేకుంటే ఆదాయ ధ్రువీకరణ పత్రంతో ఆన్లైన్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించినట్టు ఆమె పేర్కొన్నారు. ఆన్లైన్లో సమస్యలు ఎదురైతే వారి పరిధిలోని సహాయకుల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఏలూరు డివిజన్లో 9963141266, జంగారెడ్డిగూడెం 7674932132, కొవ్వూరు 9989321976, నరసాపురం 9704782803 డివిజన్ల నంబర్లలో సంప్రదించాలని, ఇదే చివరి అవకాశమని ఆమె పేర్కొన్నారు. -
అభ్యంతరాలు.. ఏర్పాట్లు
అభ్యంతరాల్లో రాష్ట్రంలో జిల్లా నంబర్ 1 నేడు తుది గడువు.. జిల్లానుంచి 23,043 అభ్యంతరాలు కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం.. 16041 సిరిసిల్ల జిల్లా కోరుతూ 2వేలపైగా వినతులు ఉద్రిక్తంగా మారుతున్న ఆందోళనలు పరిపాలన సౌకర్యాల పనులు ముమ్మరం ముకరంపుర : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ముసాయిదా నోటì ఫికేషన్పై అభ్యంతరాలు, సూచనలు, విజ్ఞప్తులలో రాష్ట్రంలోనే జిల్లా నంబర్‌వన్ స్థానంలో ఉంది. అభ్యంతరాలకు ఒక్క రోజే మిగిలి ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 89,989 అభ్యంతరాలు వచ్చాయి. అందులో జిల్లా నుంచి 23,043 వినతులు వెళ్లాయి. ప్రతిపాదిత జగిత్యాల జిల్లా నుంచి 16,363 అభ్యంతరాలు రాగా.. అందులో కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోరుతూ 16,041 వినతులు రావడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ డివిజన్లు కోరుతూ 20,849 అభ్యంతరాలు, సూచనలు రాగా.. కోరుట్ల నుంచి 16 వేల మందికి పైగా వ్యక్తం చేయడం అక్కడి డిమాండ్‌ను స్పష్టంచేస్తోంది. సిరిసిల్ల జిల్లా కోరుతూ 2 వేలకు పైగా విజ్ఞప్తులు చేశారు. అతితక్కువగా జగిత్యాల జిల్లాకు సంబంధించినవి నమోదయ్యాయి. మరో వైపు సిరిసిల్ల జిల్లా, కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోరుతూ ఆందోళనలు ఉధృతరూపం దాల్చాయి. హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్దిపేటలో కలపకుండా కరీంనగర్‌లోనే కొనసాగించాలని నిరసనలు మిన్నంటాయి. ఏర్పాట్లలో నిమగ్నం... ఇక దసరా నుంచే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో పాలన ప్రారంభించాలనే ప్రభుత్వ నిర్ణయంతో పరిపాలన సౌకర్యాల కల్పనలో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతిపాదిత పెద్దపల్లి, జగిత్యాలలో కలెక్టరేట్, ఇతర కార్యాలయాల ఏర్పాటు దాదాపు ఖరారైంది. అద్దె భవనాలను ఒప్పందం చేసుకుంటున్నారు. ఫైళ్ల విభజన, స్కానింగ్, అద్దె కార్యాలయాలు, భవనాల మరమ్మతు, సామగ్రి కొనుగోలు, వసతుల కల్పన, ఫర్నిచర్ పంపకాలు తదితర పనులు తుదిదశకు వచ్చాయి. ఆయా ప్రతిపాదిత జిల్లాల్లో జనాభా, అక్షరాస్యత, ఆస్పత్రులు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు తదితర వాటిపై ముఖ్య ప్రణాళిక అధికారులు సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించారు. జిల్లా కేంద్రం నుంచి ఉద్యోగుల విభజన లెక్కను కూడా సిద్ధంచేశారు. జిల్లాస్థాయిలో 5601 పోస్టులుండగా.. 4,365 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని కరీంనగర్‌కు 2,083, జగిత్యాలకు 1,067, పెద్దపల్లికి 1,215 మందిని కేటాయించారు. పునర్విభజనపై కలెక్టర్ నీతూప్రసాద్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు.