
ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కటికీ ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉంటుంది. వీరందరూ.. ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం కింద ప్రయోజనాలను పొందడానికి, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ చేయడానికి మాత్రమే కాకుండా.. మీ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి. దీనికి గడువును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మార్చి 15, 2025 వరకు పొడిగించింది.
ఈపీఎఫ్ఓ.. ఈఎల్ఐ స్కీమ్ కింద ప్రయోజనాలను పొందడానికి, యూఏఎన్ యాక్టివేషన్ & బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. దీనికోసం గడువును మార్చి 15కు పొడిగిస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 21, 2025న జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ గడువును ఇప్పటికే పలుమార్పు పొడిగించారు. కాగా ఇప్పుడు మరోమారు పొడిగించారు.
యూఏఎన్ అంటే ఏమిటి?
యూఏఎన్ అనేది.. అర్హత కలిగిన జీతం పొందే ఉద్యోగికి 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' కేటాయించిన 12-అంకెల సంఖ్య. ఇది వారి కెరీర్ అంతటా వివిధ యజమానులలో వారి PF ఖాతాలను నిర్వహించడానికి ఒకే యాక్సెస్ పాయింట్‌గా పనిచేస్తుంది. ఒకే సంఖ్య కింద వారి ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌లను ట్రాక్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
యూఏఎన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?
➤ఈపీఎఫ్ఓ మెంబర్ మొదట అధికారిక ఈపీఎఫ్ఓ పోర్టల్ ఓపెన్ చేయాలి.
➤అధికారిక పోర్టల్ ఓపెన్ చేసిన తరువాత సర్వీసెస్ సెలక్ట్ చేసి.. అందులో ఫర్ ఎంప్లాయీఎస్ ఆప్షన్ ఎంచుకోవాలి.
➤తరువాత మెంబర్ యూఏఎన్ లేదా ఆన్‌లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. ఆలా క్లిక్ చేసిన తరువాత ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
➤కొత్త పేజీలో.. కుడివైపు కింద భాగంలో ఇంపార్టెంట్ లింక్స్ విభాగంలో యాక్టివేట్ యువర్ యూఏఎన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
➤క్లిక్ చేయగానే.. ఒక ఫారమ్ వంటిది కనిపిస్తుంది. అందులో మీ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ వంటి అవసరమైన అన్ని వివరాలను ఫిల్ చేయాలి.
➤అన్నీ ఫిల్ చేసిన తరువాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, ధృవీకరించడానికి కింద కనిపించే బాక్స్ మీద క్లిక్ చేయాలి.
➤తరువాత గెట్ ఆథరైజేషన్ పిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా చేసిన తరువాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది.
➤ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత.. ఐ అగ్రీపై క్లిక్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment