UAN
-
ఈపీఎఫ్ఓ చందాదారులకు శుభవార్త.. ఇక సులభంగానే!
ఈపీఎఫ్ఓ తన చందాదారులకు శుభవార్త అందించింది. మీరు ఒక కంపెనీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరొక కంపెనీలో చేరినట్లయితే ఉద్యోగం మానేసిన తేదీని సులభంగానే ఈపీఎఫ్ ఖాతాలో అప్డేట్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ట్విటర్ ఖాతా వేదికగా విడుదల చేసింది. మీరు ఈ వీడియోను చూడటం ద్వారా ఆన్లైన్ నిష్క్రమణ తేదీని మీరే స్వయంగా అప్డేట్ చేసుకోవచ్చు. తేదీని అప్డేట్ చేసుకోండి ఇలా.. యుఏఎన్, పాస్‌వర్డ్‌తో వెబ్ సైట్ లాగిన్ అవ్వండి. మేనేజ్ బటన్‌పై క్లిక్ చేసి మార్క్ ఎగ్జిట్‌పై క్లిక్ చేయండి. ఎంప్లాయ్మెంట్ డ్రాప్డౌన్ని ఎంచుకోవడం ద్వారా పీఎఫ్ ఖాతా నంబర్‌ను ఎంచుకోండి నిష్క్రమణ తేదీ, ఉద్యోగం నుంచి నిష్క్రమించడానికి గల కారణాన్ని తెలియజేయండి. రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేసి ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్లో అందుకున్న ఓటీపీని నమోదు చేయండి. చెక్ బాక్స్‌ని ఎంచుకుని అప్డేట్పై క్లిక్ చేసి ఆపై ఓకేపై క్లిక్ చేయండి. తర్వాత మీరు మునుపటి కంపెనీ నుంచి ఉద్యోగం మానేసిన తేదీని విజయవంతంగా అప్డేట్ చేసినట్లు మీ మొబైల్‌కు మెస్సేజ్ వస్తుంది. Employees can now update their Date of Exit on their own. To know more about this process, click on this link & watch this video- https://t.co/skGJdcqFW9#EPFO@byadavbjp @Rameswar_Teli @PMOIndia @LabourMinistry @PIB_India @PIBHindi @MIB_India @mygovindia @PTI_News @wootaum — EPFO (@socialepfo) January 24, 2022 (చదవండి: గుడ్‌న్యూస్: భారీగా తగ్గనున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలు!) -
PF New Rule: ఈ-నామినేషన్ ఫైల్ చేయకపోతే.. ఈపీఎఫ్ ప్రయోజనాలు బంద్?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సరికొత్త రూల్ తీసుకొని వచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్ 31 లోపు ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాలకు నామినీ పేరును జత చేసుకోవాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ నామినీ పేరును యాడ్ చేయకపోతే, ఈ రిటైర్మెంట్ బాడీ అందించే పలు ప్రయోజనాలను ఉద్యోగులు కోల్పోవాల్సి వస్తుందని తెలిపింది. ఈపీఎఫ్ అందించే ప్రయోజనాలను పొందాలంటే డిసెంబర్ 31 లోపల నామినీ పేరును తమ ఖాతాలకు జత చేసుకోవాలని, ఈ-నామినేషన్ ప్రక్రియను కూడా ఆన్లైన్ చేసినట్లు పేర్కొంది. భారత్‌లో పనిచేసే ఉద్యోగులందరికీ దాదాపు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతా తప్పనిసరిగా ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత వారికి ఈపీఎఫ్ఓ ఫండ్ ఒక ముఖ్యమైన ఆదాయపు వనరుగా ఉపయోగపడుతుంది. ఈపీఎఫ్ఓ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి ఖాతా నుంచి ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తంలో కట్ చేస్తారు. ఉద్యోగి ఖాతా నుంచి ఎంత మొత్తమైతే కట్ అవుతుందో, అంతే మొత్తంలో ఎంప్లాయర్స్ కూడా ఉద్యోగి ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ చేస్తారు. డిసెంబర్ 31 లోపల నామినీ వివరాలను అప్డేట్ చేయకపోతే, జనవరి 2022 నుంచి పెన్షన్, ఇన్సూరెన్స్ మనీ ఎలాంటి ప్రయోజనాలను ఉద్యోగులు పొందలేరు. ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్, పెన్షన్ పథకాల ప్రయోజనాలు నామినీ పొందేలా కొత్త నిబంధనను ఈపీఎఫ్ రూపొందించింది. ఈపీఎఫ్ఓలో ఈ-నామినేషన్ చేయండి ఇలా.. ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయండి. యుఏఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి. మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంచుకోండి. తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు. వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి. ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్ తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది. (చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను భారీగా పెంచిన ఎస్బీఐ బ్యాంక్..!) -
ఆ ఈపీఎఫ్ఓ చందాదారులకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: ఈపీఎఫ్ఓ చందాదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఈశాన్య సంస్థలు, కొన్ని ప్రత్యేక కేటగిరీ సంస్థలకు ఆధార్ నెంబర్‌తో యుఏఎన్ లింకు గడువును డిసెంబర్ 31, 2021 వరకు పొడగించింది. ఈశాన్య ప్రాంతంలో ఇంకా చాలా మంది ఆధార్ నెంబర్‌తో యుఏఎన్ లింకు చేయకపోవడంతో గడువు పొడగించినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. 220 మిలియన్లకు పైగా ఖాతాలు, ₹12 లక్షల కోట్ల కార్పస్ నిధి గల ఈపీఎఫ్ఓ ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై స్పష్టతనిచ్చిన ఆపిల్..!) ఈపీఎఫ్ ఖాతా యుఏఎన్ నెంబర్‌తో ఆధార్ ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది. దీని కోసం, ఈపీఎఫ్ఓ సామాజిక భద్రత కోడ్ 2020 సెక్షన్ 142లో కొన్ని కీలక మార్పులు చేసింది. ఇక నుంచి పీఎఫ్ మెంబర్లు సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఏదైనా ప్రయోజనాన్ని పొందాలంటే ఆధార్ నంబర్-యుఏఎన్ లింకింగ్ తప్పనిసరి అని పేర్కొంది. రెండింటిని లింక్ చేయనివారికి పీఎఫ్ కంట్రిబ్యూషన్ అందకపోవడమే కాదు.. ఇతర ఈపీఎఫ్ఓ సేవలు ఆగిపోతాయని సంస్థ పేర్కొంది. పెన్షన్ ఫండ్ నుంచి డబ్బు తీసుకోవడం కూడా కష్టమవుతుంది. వాస్తవానికి, గతంలో ఈపీఎఫ్ఓ ఉద్యోగులందరికీ ఆధార్ నెంబర్‌తో యుఎఎన్ ను లింక్ చేయడానికి చివరి తేదీగా సెప్టెంబర్ 1, 2021 అని పేర్కొంది. కానీ ఇప్పుడు డిసెంబర్ 31 వరకు పొడగించింది. Deadline for Aadhaar linking of UAN extended till 31.12.2021 for Establishments in NORTH EAST and certain class of establishments. Please check the circular here: pic.twitter.com/x4ZSGG5cy1 — EPFO (@socialepfo) September 11, 2021 -
5 నిమిషాల్లో ఈపీఎఫ్ నెంబర్ జనరేట్ చేయడం ఎలా..?
ఈపీఎఫ్ లేదా పీఎఫ్ సభ్యులు ఇప్పుడు ఆన్ లైన్ లో యూఏఎన్ ను జనరేట్ లేదా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను జారీ చేస్తుంది. యూఏఎన్ నెంబర్‌ను శాలరీ స్లిప్ మీద చూసుకోవచ్చు. ఒకవేళ మీ శాలరీ స్లిప్ మీద యూఏఎన్ నెంబర్ లేకపోతే ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్‌లో యూఏఎన్ నెంబర్ పొందవచ్చు. యూఏఎన్ నెంబర్ అనేది తొలిసారి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. యుఎఎన్ జనరేట్ చేయడానికి ముందు మీ ఆధార్ మొబైల్ నెంబరుతో మొదట లింకు అవ్వాలి. ఎందుకంటే మీ ఆధార్ తో లింకు చేసిన మొబైల్ నెంబర్ కు ఒక సందేశం వస్తుంది. యుఏఎన్ జనరేట్ లేదా యాక్టివేట్ చేసేటప్పుడు మీరు ఆధార్ కార్డు నెంబరును దగ్గర ఉంచుకోవాలి. మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా కూడా యూఏఎన్ నెంబర్ మాత్రం ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. #ईपीएफ सदस्य इन आसान स्टेप्स का पालन करके डायरेक्ट यूएएन जेनरेट कर सकते हैं। अधिक जानकारी के लिए लिंक पर क्लिक करें: https://t.co/vMcykaXRgS#EPFO #ईपीएफओ@byadavbjp @Rameswar_Teli @PMOIndia @PIB_India @MIB_India @DDNewslive @airnewsalerts @mygovindia @PTI_News @_DigitalIndia — EPFO (@socialepfo) July 20, 2021 యూఏఎన్ నెంబర్ జనరేట్ చేయు విధానం: మొదట మీరు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ పోర్టల్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత Important Links విభాగంలో ఉన్న Direct UAN Allotment by Employees ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీరు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు, క్యాప్చాను నమోదు చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఏదైనా ప్రయివేట్ కంపెనీ, ఎస్టాబ్లిష్ మెంట్ లేదా ఆర్గనైజేషన్ లో మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే 'అవును' మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు "ఎంప్లాయిమెంట్ కేటగిరీ" ఎస్టాబ్లిష్ మెంట్ పీఎఫ్ కోడ్ నెంబరు, చేరిన తేదీ, ఐడీని ఎంచుకోవాలి. మళ్లీ ఆధార్ నెంబరు చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చిన ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. చివరగా వ్యక్తిగత వివరాలు, కెవైసీ వివరాలతో కూడిన ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అన్ని వివరాలు సరిగ్గానే ఉన్నాయా? లేదా అని చెక్ చేసుకొని రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ మీ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. -
పీఎఫ్ ఖాతాదారులు వెంటనే కేవైసి అప్డేట్ చేసుకోండి
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) కస్టమర్లకు సంబంధించి క్లెయిమ్ చేయని డబ్బు రూ.58,000 కోట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. ఖాతాదారుల పరంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థగా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు క్లెయిమ్ చేయని వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో వారి బ్యాంక్ ఖాతా వివరాలను, కేవైసి ప్రక్రియను అప్డేట్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచిస్తుంది. అప్పుడే ఎటువంటి సమస్య లేకుండా పీఎఫ్ డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయని పేర్కొంది. ఇటీవల, అనేక బ్యాంకులు విలీనం అయ్యాయి కాబట్టి మరోసారి వాటి ఐఎఫ్ఎస్సీ కోడ్ లు మారే అవకాశం ఉంటుంది కాబట్టి క్లెయిమ్ చేసుకునేతప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండటానికి వారి వివరాలను అప్డేట్, కొత్త ఖాతాలను లింక్ చేయాలని ఇటీవల విలీనం అయిన ప్రభుత్వ బ్యాంకుల వినియోగదారులను ఈపీఎఫ్ఓ కోరింది. ఒకవేళ పీఎఫ్ ఖాతాలను బ్యాంకులతో లింక్ చేయనట్లయితే, ఈపీఎఫ్ సబ్ స్క్రైబర్లు వారి మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా క్లెయిమ్ చేసుకోలేరని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం దేశంలో 6 కోట్లకు పైగా పీఎఫ్ చందాదారులు ఉన్నారు. ఇంకా పీఎఫ్ ఖాతాదారుల తమ ఖాతాలను ఆధార్ తో లింక్ చేయకపోతే వెంటనే చేసేయండి లేకపోతే వారు ఈపీఎఫ్ఓ ఇతర సేవలను ఉపయోగించుకోలేరు. చదవండి: ఎస్బీఐ vs పోస్టాఫీస్: ఎందులో డబ్బులు పొదుపు చేస్తే మంచిది? -
సులభంగా పీఎఫ్ సొమ్ము తీసుకోవచ్చు
న్యూఢిల్లీ: ఉద్యోగులు తమ పెన్షన్ సొమ్మును తీసుకునే ప్రక్రియను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) సులభతరం చేసింది. ఇక ఉద్యోగి పనిచేసిన కంపెనీ ధ్రువీకరణ లేకుండానే పీఎఫ్ సొమ్మును తీసుకునేలా ఈపీఎఫ్ఓ కొత్తగా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) దరఖాస్తు (ఫారం 10 డి)ను ప్రవేశపెట్టింది. ఈ దరఖాస్తును పూర్తిచేసి నేరుగా ఈపీఎఫ్ కార్యాలయంలో సమర్పించి పీఎఫ్ ఖాతాదారులు డబ్బు తీసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు యూఏఎన్‌లో అనుసంధానమై ఉంటాయి. కంపెనీ డిజిటల్ సంతకం, ఉద్యోగి పూర్తి వివరాలు ఫారం 11లో పొందుపరచబడి ఉంటాయి. వీటిని సంస్థ సరిపోల్చుకుంటుంది.