సులభంగా పీఎఫ్ సొమ్ము తీసుకోవచ్చు
న్యూఢిల్లీ: ఉద్యోగులు తమ పెన్షన్ సొమ్మును తీసుకునే ప్రక్రియను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) సులభతరం చేసింది. ఇక ఉద్యోగి పనిచేసిన కంపెనీ ధ్రువీకరణ లేకుండానే పీఎఫ్ సొమ్మును తీసుకునేలా ఈపీఎఫ్‌ఓ కొత్తగా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) దరఖాస్తు (ఫారం 10 డి)ను ప్రవేశపెట్టింది.
ఈ దరఖాస్తును పూర్తిచేసి నేరుగా ఈపీఎఫ్ కార్యాలయంలో సమర్పించి పీఎఫ్ ఖాతాదారులు డబ్బు తీసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు యూఏఎన్‌లో అనుసంధానమై ఉంటాయి. కంపెనీ డిజిటల్ సంతకం, ఉద్యోగి పూర్తి వివరాలు ఫారం 11లో పొందుపరచబడి ఉంటాయి. వీటిని సంస్థ సరిపోల్చుకుంటుంది.