ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సభ్యులైన ఉద్యోగులందరూ ఆధార్ ఆధారిత ఓటీపీ వ్యవస్థ ద్వారా తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)లను యాక్టివేట్ చేసుకోవాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
ఈ మేరకు యాజమాన్యాలతో కలిసి వ్యూహాత్మకంగా పనిచేయాలని ప్రభుత్వం సూచించినట్లు ఈపీఎఫ్‌వో ఓ ప్రకటనలో తెలిపింది. సమర్థవంతమైన అమలు కోసం ఈపీఎఫ్‌వో జోనల్, ప్రాంతీయ కార్యాలయాలు ఇందులో పాలుపంచుకోనున్నాయి. 2024-25 యూనియన్ బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం అమలులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఆధార్ చెల్లింపు వ్యవస్థ ద్వారానే అన్ని సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించే క్రమంలో 100 శాతం బయోమెట్రిక్ ఆధార్ ప్రమాణీకరణను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.
ఆధార్‌ను గుర్తింపు పత్రంగా ఉపయోగించడం డెలివరీ ప్రక్రియ సులభతరం అవుతుందని, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదీ చదవండి: కొత్త క్రెడిట్ కార్డ్.. లైఫ్ టైమ్ ఫ్రీ!
మొదటి దశలో యజమాన్యాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరిన తమ ఉద్యోగులందరికీ నవంబర్ 30 నాటికి ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన ఉద్యోగులందరికీ ప్రక్రియను పూర్తి చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment