Aadhaar authentication
-
ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆధార్ ఉచిత అప్డేట్ గడువును వచ్చే ఏడాదికి పొడిగించింది. గతంలో తెలిపిన విధంగా ఉచిత ఆధార్ అప్డేట్కు ఈ రోజు చివిరి తేదీ. కానీ దాన్ని వచ్చే ఏడాది జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటన విడుదల చేసింది. ఈమేరకు ఆధార్ అధికారిక ఎక్స్ లింక్‌లో వివరాలు పోస్ట్ చేసింది.యూఐడీఏఐ వెల్లడించిన గడువు (2025, జూన్ 14) లోపు ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకుంటే మాత్రం.. రూ.50 అప్లికేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.#UIDAl extends free online document upload facility till 14th June 2025; to benefit millions of Aadhaar Number Holders. This free service is available only on #myAadhaar portal. UIDAl has been encouraging people to keep documents updated in their #Aadhaar. pic.twitter.com/wUc5zc73kh— Aadhaar (@UIDAI) December 14, 2024ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎలా?● మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి● లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.● నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.● రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.● అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.● మీరు ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.● అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ట్రాక్ చేయవచ్చు. -
EPFO: కొత్త రూల్.. కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సభ్యులైన ఉద్యోగులందరూ ఆధార్ ఆధారిత ఓటీపీ వ్యవస్థ ద్వారా తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)లను యాక్టివేట్ చేసుకోవాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది.ఈ మేరకు యాజమాన్యాలతో కలిసి వ్యూహాత్మకంగా పనిచేయాలని ప్రభుత్వం సూచించినట్లు ఈపీఎఫ్‌వో ఓ ప్రకటనలో తెలిపింది. సమర్థవంతమైన అమలు కోసం ఈపీఎఫ్‌వో జోనల్, ప్రాంతీయ కార్యాలయాలు ఇందులో పాలుపంచుకోనున్నాయి. 2024-25 యూనియన్ బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం అమలులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.ఆధార్ చెల్లింపు వ్యవస్థ ద్వారానే అన్ని సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించే క్రమంలో 100 శాతం బయోమెట్రిక్ ఆధార్ ప్రమాణీకరణను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.ఆధార్‌ను గుర్తింపు పత్రంగా ఉపయోగించడం డెలివరీ ప్రక్రియ సులభతరం అవుతుందని, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఇదీ చదవండి: కొత్త క్రెడిట్ కార్డ్.. లైఫ్ టైమ్ ఫ్రీ!మొదటి దశలో యజమాన్యాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరిన తమ ఉద్యోగులందరికీ నవంబర్ 30 నాటికి ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన ఉద్యోగులందరికీ ప్రక్రియను పూర్తి చేయాలి. -
జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐ
ఆధార్‌కార్డులోని వ్యక్తిగత వివరాలను జూన్ 14 లోపు అప్డేట్ చేయకపోతే కార్డు పని చేయదంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యూఐడీఏఐ) స్పష్టతనిచ్చింది. అలా వస్తున్న వార్తలను నమ్మకూడదని చెప్పింది.ఆధార్‌లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి జూన్ 14 గడువు విధించినట్లు చెప్పింది. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు మార్చుకోకపోయినా ఆధార్ పనిచేస్తుందని స్పష్టం చేసింది. తర్వాత కూడా వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఆధార్ సెంటర్లలో నిర్దేశిత రుసుము చెల్లించి వివరాలు అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది.ఆన్లైన్లో ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఉడాయ్ గతంలో 2023 డిసెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చింది. తర్వాత దాన్ని రెండుసార్లు పొడిగించి చివరగా జూన్ 14 గడువు విధించింది. ఆలోపు ఆన్లైన్లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.ఉడాయ్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి కూడా ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా తాజా గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్, పాన్/ఇ-పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. -
ఎన్పీఎస్ కొత్త రూల్.. ఎలా లాగిన్ చేయాలో తెలుసా..
కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25)లో అనేక ఆర్థిక సంస్థల నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా నేషనల్ పెన్షన్ స్కీం(ఎన్పీఎస్) లాగిన్ అయ్యే విధానంలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అన్ని అకౌంట్లు ఆధార్‌తో లింక్ అవుతున్న తరుణంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ).. ఆధార్ ఆధారిత లాగిన్ అథెంటికేషన్‌ను ప్రవేశపెట్టింది. దాంతో పాత విధానంలోకాకుండా కొత్త పద్ధతిలో ఎన్పీఎస్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎలా లాగిన్ చేయాలంటే.. ఎన్పీఎస్ వెబ్సైట్లో పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (పీఆర్ఏఎన్)/ ఇంటర్నెట్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఐపీఐఎన్)తో లాగిన్ కావాలి. తర్వాత పీఆర్ఏఎన్/ ఐపీఐఎన్ టాబ్‌పై క్లిక్ చేయాలి. ఓ కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కింద ఉండే క్యాప్చా కోడ్‌ను టైప్ చేయాలి. తర్వాత తెరుచుకునే విండోలో ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తే ఎన్పీఎస్ ఖాతా ఓపెన్ అవుతుంది. ఇదీ చదవండి: ప్రముఖ భారత కంపెనీతో టెస్లా ఒప్పందం -
ఇప్పటికీ మీరు ఆధార్ ను అప్డేట్ చేసుకోలేదా..?
-
ఆధార్‌కార్డులో ఆంధ్రప్రదేశ్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు : కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
భద్రాద్రి/కొత్తగూడెం: ప్రజాపాలన దరఖాస్తులకు ఆదాయం, లోకల్ ఏరియా సర్టిఫికెట్లు జతపర్చాల్సిన అవసరంలేదని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై శుక్రవారం ఆమె స్పష్టతనిచ్చారు. ఆధార్‌కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అని ఉన్నా మార్చాలిన అవసరం లేదని తెలిపారు. ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్టు ఫొటో సరిపోతాయని పేర్కొన్నారు. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్, ఖమ్మం జిల్లా ఉంటే దరఖాస్తులు తీసుకోరని, ఆదాయం, కుల ధ్రువీకరణపత్రాలు అడుగుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. సందేహాలు ఉంటే ప్రజలు హెల్ప్‌డెస్క్‌ను, రెవెన్యూ, ఎంపీడీఓ, ఎంపీఓ, గ్రామకార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, మహిళాస్వయం సహాయక సంఘ సభ్యులను సంప్రదించాలని వివరించారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్‌రూం 08744–241950కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేయాలని చెప్పారు. రెండో రోజు 74 గ్రామ పంచాయతీల్లో, మూడు మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించామని తెలిపారు. 34,995 గృహాల లబ్ధిదారుల నుంచి 44,711 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోందని తెలిపారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు బాధ్యతగా రశీదు అందజేయడంతోపాటు ప్రత్యేకంగా రిజిస్టర్లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి దరఖాస్తులను ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. జిరాక్స్ కాపీలకు అధిక ధరలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, సంబంధిత జిరాక్స్ కేంద్రం అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే తహసీల్దార్, ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. 30న గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీలలో షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు జరుగుతాయని తెలిపారు. ఇవి చదవండి: దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్‌రాజ్ -
ఇకపై ఆధార్‌కు పాస్‌పోర్ట్ తరహా వెరిఫికేషన్.. కానీ..
కొత్తగా ఆధార్ కార్డ్ తీసుకునేవారిని పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ మాదిరే ప్రభుత్వ అధికారులు ఇంటికొచ్చి ఫిజికల్‌గా వెరిఫై చేయనున్నారు. 18 ఏళ్లు దాటిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ఆధార్ ఎన్రోల్మెంట్కు సంబంధించిన ఏ అంశాన్నైనా యూఐడీఏఐ నిర్వహిస్తోంది. కానీ ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను యూఐడీఏఐకి బదులు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవాలనుకునే వారు తమకు స్థానికంగా కేటాయించిన ఆధార్ కేంద్రాల్లోకి వెళ్లి ఈ సర్వీస్ పొందొచ్చు. ఆన్లైన్లో వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేసే ముందు అన్ని ఆధార్ అప్లికేషన్లలోని డేటాను క్వాలిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సబ్‌డివిజన్ మేజిస్ట్రేట్ ఈ వెరిఫికేషన్ విధానాన్ని పరిశీలిస్తారు. అన్ని వివరాలు సవ్యంగా ఉన్నాయని భావిస్తే 180 రోజుల్లో ఆధార్ కార్డును ఇష్యూ చేస్తారు. ఇదీ చదవండి: ఫోన్‌పే క్రెడిట్సెక్షన్, లోన్లు.. ఇవీ బెనిఫిట్లు..! తాజాగా యూఏడీఏఐ తీసుకొచ్చిన మార్పులపై సంస్థ లక్నో రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ సింగ్ స్పందించారు. ఒక్కసారి ఆధార్ కార్డు ఇష్యూ అయితే ఆ తర్వాత ఏదైనా మార్పులు చేసుకోవాలనుకుంటే యథావిధిగా పాత పద్ధతినే పాటించాలన్నారు. కానీ ఇప్పటివరకు ఆధార్ కార్డు తీసుకోనివారు మాత్రం ఈ కొత్త విధానాన్ని అనుసరించాలని తెలిపారు. -
రూపాయి ఎక్కువ తీసుకున్నా.. రూ.50 వేలు ఫైన్ కట్టాల్సిందే!
దేశంలో ఆధార్ కార్డ్ అప్ డేట్ విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ఉక్కు పాదం మోపేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆధార్ సేవలకు అధిక ఛార్జీ వసూలు చేస్తున్న ఆపరేటర్లను సస్పెండ్ చేస్తామని, వారిని నియమించిన యాజమాన్యానికి రూ. 50,000 జరిమానా విధిస్తున్నట్లు కేంద్రం పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టం చేసింది. బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ వివరాల అప్డేట్తో సహా ఆధార్ సేవలకు అధిక ఛార్జీలు విధించకూడదని..ఇప్పటికే అన్ని ఆధార్ ఆపరేటర్లకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఏఐ) ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ‘‘అయితే, అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ఫిర్యాదులు అందితే వెంటనే విచారణ చేపడతామని, నిజమని తేలితే సంబంధిత నమోదు రిజిస్ట్రార్‌పై రూ. 50,000 జరిమానా విధిస్తాం. ఆపరేటర్‌ను సస్పెండ్ చేస్తామని’’ చంద్రశేఖర్ తెలిపారు. ఆధార్ సంబంధిత విషయాలపై ఫిర్యాదు చేయాలంటే యూఐడీఏఐ ఈమెయిల్ ద్వారా లేదంటే టోల్ ఫ్రీ నంబర్ 1947కి కాల్ చేయొచ్చని చెప్పారు. -
ఆధార్‌పై ప్రశ్నలా..?
ఉచితంగా ఆన్లైన్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ మరోసారి పొడిగించింది. తొలుత 2023 డిసెంబర్ 14 వరకు మాత్రమే ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా.. తాజాగా మరో మూడు నెలలు గడువు ఇచ్చింది. అంటే 2024 మార్చి 14 వరకు ఉచితంగా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఇదిలాఉండగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ(యూఐడీఏఐ) ఆధార్‌ను తీసుకొచ్చి చాలా ఏళ్లు అయింది. అయితే ఎలాంటి అవసరంలేని వారికి అది కేవలం ఒక గుర్తింపు కార్డుగానే ఉంటుంది. కానీ నిజంగా ఏదైనా అవసరానికి ఆధార్ వినియోగించే క్రమంలో చాలా ప్రశ్నలు వస్తూంటాయి. ఈ-ఆధార్ అంటే ఏమిటి, అది ఎలా ఓపెన్ అవుతుంది, పాస్వర్డ్ ఏమిటి... వంటి ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ కొందరికి జవాబులు తెలియకపోవచ్చు. అందుకే ‘సాక్షి’ ఆధ్వర్యంలో సంబంధిత అధికారితో మాట్లాడి మీ అనుమానాలు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పే కార్యం మొదలైంది. అయితే మీ ప్రశ్నలను info@sakshi.com కు పంపించాల్సి ఉంటుంది. మీరు పంపించే ప్రశ్నలకు మన ‘సాక్షి బిజినెస్’లోనే శనివారం సమాధానాలిస్తాం. ఉదాహరణకు.. ఆధార్ ఎందుకు అప్డేట్ చేసుకోవాలి? ఆధార్ అప్డేట్ ఎలా చేసుకోవాలి? ఆధార్ అప్డేషన్కు ఎంత ఖర్చు అవుతుంది? ఆధార్ అప్డేషన్కు ఏ డాక్యుమెంట్లు అవసరం? ఆధార్ అప్డేషన్కు ముందే ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలి? ఎవరెవరు అర్హులు? ఎవరు కాదు? వర్చువల్ ఆధార్ అంటే ఏమిటి? ఆధార్ కార్డు ఏ ముఖ్యమైన అంశాలకు లింకవుతుంది? ఎన్ని సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆధార్ అప్డేట్ చేసుకోవాలి? చిన్న పిల్లలకు వయస్సు పరిమితులేమిటి? బ్యాంక్ ఖాతా, పాన్, ఇతర సేవలను ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఏదైనా హాని జరుగుతుందా? బ్యాంక్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, పాన్, ఇతర సేవలకోసం ఆధార్‌తో ఎందుకు ధ్రువీకరించాలి? అపరిచితులకు మన ఆధార్ నంబర్ తెలిస్తే ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయవచ్చా? మీకు ఎదురైన, మీరు అడగాలనుకుంటున్న ఆధార్‌కు సంబంధించి ఎలాంటి ప్రశ్నలనైనా info@sakshi.com కు పంపి సమధానాలు పొందగలరు. ఇదీ చదవండి: ‘పురుషుల కంటే మహిళలే బెటర్..!’ -
ఉచిత ఆధార్ అప్డేట్కు ఇదే చివరి తేది!
ఆధార్ తీసుకుని పదేళ్లు దాటితే అప్డేట్ చేయాలని కేంద్రం నిబంధనలు విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా అప్డేట్ చేయని వారు 2023 డిసెంబర్ 14లోపు అప్డేట్ చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యూఐడీఏఐ) తెలిపింది. త్వరలో గడువు ముగియనుండడంతో ఈ ప్రకటన విడుదల చేసింది. గడువు తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్నప్పటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు తగిన ధ్రువపత్రాలు సమర్పించి అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ సూచించింది. ఇకపై ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్లకోసారి గుర్తింపుకార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి (సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ-సీఐడీఆర్)లోని వివరాలను అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం సీఐడీఆర్ వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందని, ఇది కచ్చిత సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది. ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉడాయ్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను నమోదు చేయాలి. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ ఫొటో పాస్‌బుక్, పాస్‌పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్, పాన్/ఇ-ప్యాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని ఉడాయ్ తెలిపింది. విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా వాడుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. -
Blue Aadhaar Card: బ్లూ ఆధార్ ఎందుకో తెలుసా? పూర్తి వివరాలు..
దేశంలో ఆధార్ కార్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, సంక్షేమ పథకాలు, సబ్సిడీలు ఇలా ఎక్కడ పని జరగాలన్నా ఆధార్ తప్పనిసరైంది. అందుకే దీన్ని అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. పూర్తి పేరు, శాశ్వత చిరునామా, పుట్టిన తేదీ వంటి ప్రాథమిక సమాచారమంతా 12 అంకెల సంఖ్యకు అనుసంధానించి ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)’ ఆధార్ కార్డును జారీ చేస్తోంది. ఆధార్ కార్డులు సాధారణంగా తెలుపురంగులో ఉండడం గమనించే ఉంటాం. ఇవి వయోజనుల కోసం జారీ చేసే కార్డులు. కానీ, యూఐడీఏఐ పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఉండే ఆధార్ కార్డుల (బ్లూ ఆధార్)ను జారీ చేస్తోంది. వీటిని బాల ఆధార్ కార్డుగా వ్యవహరిస్తున్నారు. ఇవి 5 ఏళ్లలోపు పిల్లల కోసం జారీ చేస్తారు. వీరికి వేలిముద్రలు, కంటిపాప వంటి బయోమెట్రిక్ వివరాలు సేకరించకుండానే కార్డు అందజేస్తారు. అన్ని వివరాలు వెరిఫై చేసిన తర్వాత 60 రోజులలోపు బ్లూ ఆధార్ కార్డ్ జారీ అవుతుంది. కేవలం ఫొటో, పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేరు వంటి ప్రాథమిక సమాచారం అందులో ఉంటుంది. ఈ కార్డుని తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానిస్తారు. బాల ఆధార్ కార్డు కాలపరమితి పిల్లల వయసు ఐదేళ్లు వచ్చే వరకే. తర్వాత వేలి ముద్రలు, కంటిపాప వంటి వివరాలను అందజేసి ఆధార్‌కార్డుని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే, కార్డు చెల్లదు. 15 ఏళ్లు నిండిన తర్వాత వేలిముద్రలు, కంటిపాప వివరాలతో మరోసారి ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలి. నవజాత శిశువుల కోసం తల్లిదండ్రులు బాల్ ఆధార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనన ధ్రువీకరణ పత్రం లేదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన పత్రం వంటి డాక్యుమెంట్లు అందజేస్తే సరిపోతుంది. లేదా పిల్లల పాఠశాల ఐడెంటిటీ కార్డుని కూడా ఉపయోగించుకోవచ్చు. ఉపయోగాలివీ.. బ్లూ ఆధార్ కార్డును పిల్లలకు గుర్తింపు రుజువుగా వినియోగించవచ్చు. దీని సహాయంతో పిల్లలు అర్హత కలిగిన ప్రభుత్వ సబ్సిడీ పథకాలను పొందవచ్చు. పిల్లలకు మధ్యాహ్న భోజన స్కీమ్ పొందటానికి వీలవుతుంది. నకిలీ విద్యార్థుల వివరాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ వివరాలను వినియోగించుకుంటుంది. అడ్మిషన్ ప్రక్రియ కోసం తల్లిదండ్రులు బ్లూ ఆధార్ కార్డులను అందించాలని అనేక పాఠశాలలు పట్టుబడుతున్నాయి. -
ఆధార్ ఉన్నవారికి హెచ్చరిక - ఈమెయిల్ & వాట్సాప్‌లో..
ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి మీ డాక్యుమెంట్స్ షేర్ చేయమని ఏదైనా వాట్సాప్ మెసేజ్ లేదా ఈమెయిల్‌లు వస్తే వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI) హెచ్చిరికలు జారీ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆధునిక కాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలను భారీగా మోసం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని యూఐడీఏఐ కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ఆధార్ అప్డేట్ కోసం ఈ-మెయిల్ లేదా వాట్సాప్ మెజెజ్ రోపంలో సందేశాలు పంపదని, అలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని తెలియజేసింది. ఏదైనా ఆధార్ కార్డు అప్డేట్కి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవడానికి సమీపంలో ఉండే ఆధార్ కేంద్రానికి వెళ్లాలని సూచించారు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కావున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని తెలుస్తోంది. ఆధార్ అప్డేట్లో భాగంగా ఎవరూ తమ వివరాలను ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపకూడదు. ఇదీ చదవండి: ఫస్ట్ టైమ్ ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోకుంటే.. ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు దాటితే వారు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పలుమార్లు వెల్లడించింది. ప్రస్తుతం దీనిని ఉచితంగానే చేసుకోవచ్చు. దీనికి చివరి గడువు సెప్టెంబర్ 14 వరకు ఉంటుంది. ఇప్పటి వరకు అప్డేట్ చేసుకోని వారు గడువు లోపల చేసుకోవచ్చు. #BewareOfFraudsters UIDAI never asks you to share your POI/ POA documents to update your #Aadhaar over Email or Whatsapp. Update your Aadhaar either online through #myAadhaarPortal or visit Aadhaar centers near you. pic.twitter.com/QZlfOnBp54 — Aadhaar (@UIDAI) August 17, 2023 -
ఇకపై వాటికి ఆధార్ తప్పనిసరి.. పుట్టిన బిడ్డకు ఎంతో మేలు!
ఇప్పటివరకు 'ఆధార్' (Aadhaar) కార్డు డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకింగ్ రంగం వంటి వాటిలో తప్పనిసరిగా ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు జనన, మరణాల రిజిస్ట్రేషన్ల కోసం కూడా ఆధార్ తప్పనిసరి అంటూ కేంద్రం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. కేంద్ర హోమ్ మినిష్టర్ శాఖ (MHA) రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమీషనర్ కార్యాలయాన్ని జనన, మరణాల రిజిస్ట్రేషన్ల కోసం ఆధార్ ప్రామాణీకరణ చేయడానికి అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఇలాంటి రిజిస్ట్రేషన్స్ కోసం ఆధార్ అవసరం లేదు, కానీ కొత్త ఆదేశాలమేరకు ఇకపై వీటికి కూడా ఆధార్ తప్పనిసరి. ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు - కారణం తెలిస్తే అవాక్కవుతారు! 1969 చట్టాన్ని సవరించి ఇప్పుడు జనన మరణాల నమోదు చేసేవారు తప్పనిసరిగా ఆధార్ నిర్దారణని అందించాలి. అంతే కాకుండా ఈ డేటాను ప్రతి సంవత్సరం రాష్ట్రాలన్నీ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు నివేదించాల్సి ఉంటుంది. సుమారు 54 సంవత్సరాల తరువాత 1969 చట్టం మొదటిసారి సవరించినట్లు తెలుస్తోంది. ఆధార్ ఇవ్వడం ద్వారా జనాభా రిజిస్ట్రేషన్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన స్కీమ్స్ సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం సవరణకు లోనైన జనన మరణాల చట్టం 2023లో లేదా ఆ తర్వాత పుట్టిన బిడ్డకు చాలా ప్రయోజనం చేకూర్చుతుందని భావిస్తున్నారు. -
ఇకపై కుక్కలకు కూడా ఆధార్ కార్డు
ముంబై: ముంబైలోని వీధి కుక్కలకు క్యూఆర్ కోడ్ ఉన్న ఆధార్ కార్డులు జారీ చేసింది ఓ స్వచ్చంద సంస్థ. ఇప్పటికే ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో 20 కుక్కలకు ఆధార్ కార్డులు కూడా జారీ చేసి వాటి మెడలో ట్యాగ్స్ వేశామని తెలిపింది సదరు సంస్థ. ఎందుకంటే.. మనుషులకు ఆధార్ కార్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని పనులు తేలికైపోయాయి. ఎక్కడ ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు చూపిస్తే చాలు మొత్తం బయోడేటా కళ్ళముందు ప్రత్యక్షమవుతుంది. మనుషుల్లాగే కుక్కలకు కూడా ఒక గుర్తింపు ఉండాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు ముంబైకి చెందిన ఒక ఇంజినీరు. ఈ కార్డును స్కాన్ చేయగానే కుక్క వయసు, ఎక్కువగా సంచరించే ప్రాంతం, సంతానానికి సంబంధించిన వివారాలు, స్టెరిలైజేషన్ సమాచారం తోపాటు కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నెంబర్లు తదితర వివరాలన్నింటినీ తెలుసుకోవచ్చు. ముంబైకి చెందిన ఇంజనీర్ అక్షయ్ రిడ్లాన్ కుక్కలకు ఆధార్ కార్డులు జారీ చేయాలన్న ఈ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు. అనుకుందే తడవు "pawfriend.in" అనే స్వచ్చంద సంస్థ సాయంతో వీధి కుక్కల్లో కొన్నిటికి ఆధార్ కార్డులను రూపొందించి వాటి మెడలో ట్యాగ్ కట్టారు. ఈ కార్డు మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. క్యుఆర్ స్కానర్ ద్వారా ఆ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు ఆ కుక్క వివరాలన్నీ వచ్చేస్తాయి. తద్వారా వీధి కుక్కలు ఎప్పుడైనా తప్పిపోతే దాన్ని తిరిగి సొంతగూటికి చేర్చడం చాలా సులభమవుతుందని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వారు ఎయిర్‌పోర్టు సమీపంలోని వీధి కుక్కలను వల వేసి పట్టుకుని వాటికి వ్యాక్సినేషన్ కూడా చేస్తున్నట్లు స్థానికుల్లో ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా ముంబైలోని అన్ని ప్రాంతాల కుక్కలకు ఈ తరహా కార్డులు జారీ చేయాలన్నది మా సంకల్పమని తెలిపింది ఆ సంస్థ. ఇది కూడా చదవండి: పెళ్ళిలో ఏనుగులు హల్ చల్.. బైక్ మీద పారిపోయిన కొత్త జంట.. -
ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానంలో ఉద్యోగులందరి హాజరును తప్పనిసరిగా నమోదు చేయాలని కేంద్రం శుక్రవారం అన్ని శాఖలను కోరింది. తమ పరిధిలోని ఉద్యోగులు బయోమెట్రిక్‌లో హాజరు నమోదు చేయనప్పటికీ కొన్ని ప్రభుత్వ శాఖలు అలసత్వంతో వ్యవహరిస్తున్నాయని తేలడంతో సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు తమ ఉద్యోగుల హాజరును తప్పనిసరిగా నమోదు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని అందులో కోరింది. ఉద్యోగుల సమయపాలనపైనా శ్రద్ధ పెట్టాలని సూచించింది. ఉద్యోగులు తరచూ ఆలస్యంగా విధులకు హాజరు కావడం, ముందుగానే వెళ్లిపోవడం వంటి వాటిని ప్రోత్సహించరాదని, నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. -
ఆధార్ అప్డేట్.. గడువు 10 రోజులే!
Aadhaar Update: భారతీయ పౌరులకు ఆధార్ కార్డు ఎంత ప్రధానమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు రావాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నా కూడా ఆధార్ కార్డే ఆధారం. అయితే ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోవడం మంచిది. అంతే కాకుండా ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు గడిచిన వారు తప్పనిసరిగా ఆధార్ కార్డుని ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ గతంలోనే సూచించింది. అయితే ఈ గడువు ఇప్పుడు సమీపిస్తోంది. గతంలో వెల్లడైన సమాచారం ప్రకారం ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆధార్ కార్డు వివరాలను రూపాయి చెల్లించకుండా జూన్ 14 లోపల అప్డేట్ చేసుకోవాలి. ఆ తరువాత ఆన్లైన్లో చేసిన కనీసం రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: మీ పాన్ నెంబర్‌తో ఆధార్ లింక్ అయిందా? ఈ సింపుల్ టెక్నిక్స్‌తో తెలుసుకోండి) నిజానికి ఈ గడువు మే చివరి నాటికి ముగియాల్సి ఉంది. కానీ అందరూ ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని 'యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' ఆధార్ కార్డుని ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేయడానికి అనుమతించింది. కావున ఇప్పటి వరకు ఆధార్ అప్డేట్ చేయని వారు ఈ నెల 14లోపు తప్పకుండా అప్డేట్ చేసుకోవడం మంచిది. -
ఆధార్ కార్డులో సమస్యలా? ఇదిగో టోల్ ఫ్రీ నెంబర్..
Aadhaar Card Toll Free Number: భారతదేశంలో ఉన్న అందరికి తప్పనిసరిగా ఆధార్ కార్డు అవసరం, అయితే కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డులో తప్పులు దొర్లుతూ ఉంటాయి. అలాంటి తప్పులను సవరించుకోవడానికి కొన్ని సార్లు అనేక ఇబ్బదులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని కోసం ఆధార్ సెంటర్ల వద్దకు పదే పదే తిరగాల్సి కూడా వచ్చేది. అలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి కేవలం మీరు ఒక నెంబర్‌కి కాల్ చేస్తే సరిపోతుంది. టోల్ ఫ్రీ నెంబర్ ఆధార్ కార్డులో పేరు, ఇంటి పేరు, అడ్రస్ వంటి తప్పులను మార్చుకోవడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ 1947 అనే నెంబర్ తీసుకువచ్చింది. ఈ నెంబర్‌కి కాల్ చేస్తే మీ సమస్యలు ఇట్టే తీరిపోతాయి. ఈ నెంబర్‌కి కాల్ చేస్తే 12 భాషల్లో సర్వీస్ ప్రతినిధులు అందుబాటులోఉంటారు. మీ సమస్యను వారికి తెలియజేస్తే వారు తగిన పరిష్కారం అందిస్తుంది. (ఇదీ చదవండి: ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ అథెంటికేషన్ - ప్రజలు సమ్మతిస్తారా..?) తెలుగు, హిందీ, తమిళం, పంజాబీ, కన్నడ, గుజరాతీ, బెంగాలీ, ఒరియా, మలయాళం, అస్సామీ, ఉర్దూ, మరాఠీ భాషల ప్రజలు ఈ నెంబర్ ద్వారా సమస్యలకు పరిస్కారం పొందవచ్చు. సంస్థ ఈ నెంబర్ అందించడానికి కూడా ఒక ప్రధాన కారణం ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది ఈ సంవత్సరంలోనే కావున ఈ నెంబర్ అందించడం జరిగింది. అంతే కాకుండా ఇది అందరికి గుర్తుండే నెంబర్ కూడా. (ఇదీ చదవండి: ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ మర్చిపోయారా? డోంట్ వర్రీ.. ఇలా తెలుసుకోండి!) ఇది పూర్తిగా టోల్ ఫ్రీ నెంబర్, కావున ఎలాంటి చార్జీలు వసూలు చేసే అవకాశం ఉండదు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ నెంబర్ కి కాల్ చేయవచ్చు, పరిష్కారం పొందవచ్చు. అయితే ఆదివారం రోజు మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పేరు, అడ్రస్ మాత్రమే కాకుండా, ఆధార్ నమోదు కేంద్రాలు, ఎన్రోల్మెంట్ తర్వాత ఆధార్ కార్డు నంబర్ స్టేటస్ సహా ఆధార్‌కు సంబంధించి సమస్యలన్నింటికీ వారు పరిష్కారం అందిస్తారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ - ప్రజలు సమ్మతిస్తారా..?
ఆధార్ నెంబర్ల వెరిఫికేషన్‌ను ప్రైవేట్ సంస్థలకు అనుమతించాలన్న ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాల కోసం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గడువుని ఇప్పుడు మరో 15 రోజుల పొడిగించింది. గతంలో ఈ గడువు 2023 మే 05 వరకు మాత్రమే ఉండేది, కాగా ఇప్పుడు ఇప్పుడు మే 20 వరకు పొడిగించారు. ఇప్పటికే ఆధార్‌ను ప్రామాణీకరించడానికి ప్రభుత్వేతర రాష్ట్ర సంస్థలను అనుమతించే ప్రతిపాదన కోసం ఒక ముసాయిదా విడుదలైన విషయం తెలిసిందే. దీనిపైన ప్రజల అభిప్రాయాలను తెలపాలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రతిపాదిత సవరణ ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఇతర సంస్థలు కొన్ని సందర్భాల్లో ఆధార్ ప్రామాణీకరణ కోసం అనుమతిని పొందవచ్చు. ఇది వినియోగదారులకు కూడా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆధార్ ప్రామాణీకరణ కోసం కోరుతున్న ప్రతిపాదన ప్రజా ప్రయోజనాలకు సంబంధించినదని సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా ప్రభుత్వ శాఖ ఒప్పించినట్లయితే, అటువంటి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఈ ప్రతిపాదనపై కొంత మంది నిపుణులు, న్యాయవాదులు గతంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇది వినియోగదారులను మోసాలకు గురించి చేసే అవకాశం ఉందని వెల్లడించారు. (ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు) రాష్ట్ర సంక్షేమం, నిజమైన గ్రహీతలను గుర్తించడానికి ఆధార్ నంబర్లను ఉపయోగించగలిగినప్పటికీ, ప్రైవేట్ సంస్థలు అలాంటి ధృవీకరణను నిర్వహించలేవని ఒక తీర్పులో పేర్కొంది. అయితే దీనిపైన ఇప్పుడు ప్రజల తీర్పు ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ మర్చిపోయారా? డోంట్ వర్రీ.. ఇలా తెలుసుకోండి!
న్యూఢిల్లీ: ఆధార్‌కు లింక్ అయిన ఈమెయిల్, మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ధ్రువీకరించే సదుపాయాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ (యూఐడీఏఐ) ప్రకటించింది. ఆధార్ వెబ్సైట్, మొబైల్ యాప్ నుంచే వీటి ధ్రువీకరణకు అవకాశం కల్పించినట్టు పేర్కొంది. కొంత మంది యూజర్లకు తమ మొబైల్ నంబర్లలో ఏది ఆధార్‌తో సీడ్ అయిందనే విషయమై అవగాహన ఉండడం లేదని యూఐడీఏఐ గుర్తించింది. దీంతో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆధార్ ఓటీపీ వేరొక మొబైల్ నంబర్‌కు వెళుతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ప్రకటించిన సదుపాయంతో ఆధార్‌కు ఏ మొబైల్ నంబర్ సీడ్ అయిందో తెలుసుకోవచ్చు. ఆధార్ అధికారిక వెబ్సైట్ లేదా ఎంఆధార్ యాప్‌లో ‘వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్’ను క్లిక్ చేయడం ద్వారా ఈ సదుపాయం పొందొచ్చు’’అని యూఐడీఏఐ పేర్కొంది. ఏదైనా మొబైల్ నంబర్ సీడ్ అవ్వకపోతే అదే విషయాన్ని సూచిస్తుందని, దాంతో మొబైల్ నంబర్ అప్డేషన్కు చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. అప్పటికే మొబైల్ నంబర్ ధ్రువీకరించి ఉంటే, అదే విషయం తెలియజేస్తుందని వెల్లడించింది. ఆధార్ తీసుకునే సమయంలో ఏ నంబర్ ఇచ్చామో గుర్తు లేనివారు, సంబంధిత మొబైల్ నంబర్ చివరి మూడు నంబర్లను నమోదు చేయడం ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది. ఒకవేళ ఈ మెయిల్/ మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలంటే సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించొచ్చని సూచించింది. ఆధార్ ధ్రువీకరణ చేపట్టేందుకు 22 సంస్థలకు అనుమతి కాగా క్లయింట్ల ధ్రువీకరణను ఆధార్ ఆధారితంగా నిర్ధారించుకునేందుకు 22 ఆర్థిక సేవల సంస్థలకు అనుమతి లభించింది. ఈ 22 కంపెనీలు ఇప్పటికే మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద రిపోర్టింగ్ ఎంటెటీలుగా (కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సమాచారం అందించేవి)గా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తన నోటిఫికేషన్లో పేర్కొంది. (ఇదీ చదవండి: ఒక్క హాయ్ మెసేజ్.. రూ. 10 లక్షలు లోన్ - ట్రై చేసుకోండి!) ఇవి తమ క్లయింట్ల గుర్తింపు ధ్రువీకరణను ఆధార్ సాయంతో చేపట్టేందుకు అనుమతించినట్టు ప్రకటించింది. ఇలా అనుమతులు పొందిన వాటిల్లో గోద్రేజ్ ఫైనాన్స్, అమెజాన్ పే (ఇండియా), ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ఫైనాన్స్ సొల్యూషన్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి. బ్యాంకులు తమ కస్టమర్ల గుర్తింపును ఆధార్ సాయంతో ధ్రువీకరించేందుకు ఇప్పటికే అనుమతి ఉంది. -
ప్రైవేట్ కంపెనీలకు ఆధార్ ప్రమాణీకరణ
-
ఆధార్ కార్డులో ఫోటో మార్చాలా? ఇలా చేయండి!
ఆధునిక కాలంలో ఆధార్ కార్డు ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, లైసెన్స్ వంటి వాటికి అప్లై చేసుకోవడానికి ప్రధాన ఆధారం ఆధార్ కార్డే. అయితే ఇంత ముఖ్యమైన ఆధార్ కార్డులో ముఖాలు చాలా వరకు గుర్తు పట్టలేని విధంగా ఉంటాయి. అలాంటి ఫోటోలను మనకు నచ్చిన విధంగా మార్చుకోవడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆధార్ కార్డులో ఫోటో మాత్రమే కాకుండా పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ వంటి వాటిని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. బయోమెట్రిక్ మార్చుకోవడానికి ఆధార్ సెంటర్‌కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇతర వివరాలను ఆన్లైన్లోనే మార్చుకోవచ్చు. ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడం ఎలా? ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి ముందుగా ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రానికి వెళ్ళాలి. https://appointments.uidai.gov.in/ వెబ్ సైట్ ద్వారా కూడా మీకు సమీపంలో ఉన్న ఆధార్ సెంటర్ గురించి తెలుసుకోవచ్చు. ఆధార్ సెంటర్ చేరుకున్న తరువాత అక్కడ దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఫిల్ చేసే అందించాలి. అప్పుడు వారు మీ బయోమెట్రిక్ తీసుకుంటారు. ఆధార్ కార్డులో మీ ఫోటో మార్చాలనుకుంటే ఆపరేటర్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటాడు. కావలసిన అన్నీ తీసుకున్న తరువాత అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అందిస్తారు. ఈ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అప్డేట్ రిక్వెస్ట్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని కోసం రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు అప్డేట్ అయిన తరువాత డిజిటల్ కాఫీని అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: ఒకప్పుడు ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఇప్పుడు ఆస్తులు సున్నా అంటున్నాడు..) నిజానికి ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. ఇందులో 12 అంకెల యూనిక్ నెంబర్ ఉంటుంది. దీనిని యుఐడిఏఐ జారీ చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి పెడా బయోమెట్రిక్ ఐడి సిస్టం అని చెబుతారు. ఇందులో సంబంధిత వ్యక్తి వేలిముద్రలు మొదలైనవి ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఆధార్ తీసుకుని ఎన్ని రోజులవుతోంది? కేంద్రం కొత్త నిబంధన తెలుసా?
సాక్షి, అమరావతి: ‘ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు పూర్తయి.. ఇప్పటికీ అదే అడ్రస్‌లో ఉన్నా మీరు విధిగా మీ ఆధార్ కార్డును అదే అడ్రస్ ప్రూఫ్‌తో అప్డేట్ చేసుకోవాల్సిందే’.. అంటూ ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ స్పష్టంచేస్తోంది. ఈ విషయమై ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు సైతం రాసింది. ఈ మేరకు ఆధార్ కార్డు జారీ చట్టంలోనూ మార్పులు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా ఇచ్చింది. ‘ఆధార్‌ను ఇప్పుడు అనేక ప్రభుత్వ సేవలు పొందేందుకు ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డు బయోమెట్రిక్ ప్రామాణీకంతోనే సంబంధిత వ్యక్తి గుర్తింపు రుజువుగానూ మారింది. ఎలాంటి సేవలను పొందాలన్నా ప్రతి ఒక్కరూ తమ తాజా వివరాలను యూఐడీఏఐకు సమర్పించాల్సి ఉంటుంది. పదేళ్ల క్రితం ఆధార్‌ను పొందిన వారు, ఇప్పటికీ అదే చిరునామాలో నివసిస్తున్నందునో, లేదా వారి కుటుంబ సభ్యుల వివరాల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో దానిని అప్డేట్ చేయకపోవచ్చు. కానీ, సరైన ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయడం ద్వారా వారి చిరునామాను మళ్లీ ధృవీకరించుకోవాలి’.. అంటూ ఆధార్ కార్డు జారీలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అలెక్స్ కుమార్ శర్మ ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో స్పష్టంచేశారు. ఆధార్ అప్డేట్ సమయంలో ప్రతి ఆధార్ కార్డుదారుడు తమ చిరునామా ధృవీకరణ పత్రంతో పాటు ఫొటో ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అప్డేట్ కాని కార్డులు 1.65 కోట్లు.. 2022 డిసెంబరు 31 నాటికి రాష్ట్రంలో మొత్తం 5,19,98,236 మందికి ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. అయితే, వీరిలో 1,65,47,906 మంది ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధన మేరకు ఆధార్‌కార్డు పొందిన పదేళ్లలో కనీసం ఒక్కసారి తమ అడ్రస్ వివరాలను అప్డేట్ చేసుకోని వారుగా యూఏఐడీఏ గుర్తించింది. రాష్ట్రంలో ఈ కొత్త నిబంధన ప్రకారం ఆధార్ అప్డేట్ చేసుకోని వారు అత్యధికంగా కాకినాడ జిల్లాలో 18 లక్షల మందికి పైగా ఉండగా, అత్యల్పంగా బాపట్ల జిల్లాలో 1.78లక్షల మంది ఉన్నట్లు తేల్చారు. ప్రత్యేక క్యాంపులు ఆధార్ కార్డుల జారీలో ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారు సైతం ఆధార్ సేవలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకు లేదా ప్రత్యేక ఆధార్ కార్డు జారీ కేంద్రాలు ఉండే పట్టణాలతో పాటు ఎంపిక చేసుకున్న 2,377 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ ఆ ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరోవైపు.. ఇప్పటి 15 ఏళ్లలోపు, 15–17 ఏళ్ల మధ్య వయస్సున్న వారి బయోమెట్రిక్ వివరాల అప్డేట్ కోసం పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రతినెలా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. అయితే, కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధన ప్రకారం అన్ని వయస్సుల వారు తమ ఆధార్‌ను అప్డేట్ చేసుకోవడానికి వీలుగా ఆయా సచివాలయాల్లో ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో గ్రామాల వారీగా పదేళ్ల పూర్తయినా ఆధార్ అప్డేట్ చేసుకోని వారి వివరాలను కూడా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు ఇప్పటికే యూఐడీఏఐ నుంచి సేకరించి, ఆ వివరాలను కూడా జిల్లాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. -
బిగ్ అలర్ట్: అమలులోకి ఆధార్ కొత్త రూల్..వారికి మాత్రం మినహాయింపు!
దేశంలో ఆధార్ అనేది సామాన్యుని గుర్తింపుగా ప్రాచుర్యం పొందింది. గత 8 సంవత్సరాలుగా ఆధార్ భారతీయులకు గుర్తింపు పరంగా ముఖ్యంగా మారిందనే చెప్పాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 13 సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించగా తాజాగా ఈ గుర్తింపు కార్డ్ నిబంధనల్లో మార్పులు చేసేందుకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రజలు.. ఆధార్‌లో వారి బయోమెట్రిక్ డేటాను స్వచ్ఛందంగా అప్డేట్ చేసుకోవాలనే రూల్స్ రావొచ్చని నివేదికలు చెప్తున్నాయి. సమాచారం ప్రకారం.. ఆధార్ కార్డు దారులు వారి ఫేస్, ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ డేటాను ప్రతీ 10 ఏళ్లకు అప్డేట్ చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించనుందట. అయితే ఇందులో 70 ఏళ్లకు పైన వయసు కలిగిన వారికి దీని నుంచి మినహాయింపు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం, ఐదు నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటే.. వాళ్లు ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్‌లను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్లకు లోపు ఉన్న పిల్లలకు వారి ఫోటో ఆధారంగా, అలాగే వారి తల్లిదండ్రుల బయోమెట్రిక్స్ ద్వారా ఆధార్ కార్డును జారీ చేస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు లేనిపక్షంలో వారి సంరక్షుల బయోమెట్రిక్స్ ద్వారా ఆ పిల్లలకు ఆధార్ జారీ చేస్తున్నారు. UIDAI తాజాగా గ్రూప్-ఆధారిత సంక్షేమ పథకాలను తన ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకురావడానికి రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది. ఎందుకంటే ఇది నకిలీ లబ్ధిదారులను తొలగించడంతో పాటు, నిధుల దుర్వినియోగం కాకుండా చూస్తుంది. దీంతో ప్రజల డబ్బును ఆదా చేయడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. చదవండి: మహిళా ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లలో వారికోసం.. -
Aadhaar FaceRD App: ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త!
బ్యాంకు అకౌంట్ నుంచి..సెల్‌ఫోన్ సిమ్ కొనుగోలు మొదలు..చివరకు హోటళ్ళు,సినిమా హాళ్ళలో ఆధార్ కార్డ్ తప్పని సరిగా మారింది. దేనికీ ఆధార్ తప్పనిసరి కాకపోయినా, ఇతర గుర్తింపుకార్డులు అనేకమున్నా, అన్నిటికీ ఆధార్ కావాలని పట్టుబట్టడమూ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆధార్‌తో పెరిగిపోతున్న సైబర్ నేరాల్ని అడ్డుకట్ట వేసేందుకు ఆధార్ సంస్థ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా ఆధార్ ఫేస్ అథంటికేషన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఇటీవల దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందన్న కారణంతో ఆధార్ వివరాల్ని ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వకూడదంటూ ఆదార్ ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (యూఐడీఎఐ) అప్రమత్తం చేసింది. కొన్ని సంస్థలకే ఆధార్ వివరాలు సేకరించే లైసెన్స్ ఇచ్చామనీ, లైసెన్స్ లేని సంస్థలు ఆధార్ అడిగితే (ఆధార్ నంబర్లో చివరి నాలుగంకెలు మాత్రమే కనిపించే) ‘మాస్క్డ్ ఆధార్’ను ఇవ్వాలనీ చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో యూఐడీఏఐ ఆధార్‌లో ఫేస్ అథంటికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు ఆధార్ సంస్థ ట్వీట్ చేసింది. #FaceAuthentication Residents are now using the #Aadhaar Face Authentication feature by downloading the #UIDAI #RDApp, which can be used for various #Aadhaar Authentication Apps like #JeevanPraman, #PDS, #Scholarship schemes, #COWIN, #FarmerWelfare schemes.@GoI_MeitY @ceo_uidai pic.twitter.com/c5cZNXEGOz — Aadhaar (@UIDAI) July 12, 2022 ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ వినియోగం ♦స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ముందుగా గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి అందులో ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ అని సెర్చ్ చేయాలి. . ♦గూగుల్ ప్లేస్టోర్‌లో సెర్చ్ చేస్తే మీకు ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేసి ఇన్స్టాల్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి ♦మీరు ఫేస్ అథంటికేషన్ పూర్తి చేసుకోవడానికి స్క్రీన్‌పై కొన్ని నిబంధనల్ని తప్పని సరిగ్గా పాటించాల్సి ఉంటుంది. అనంతరం ప్రోసీడ్‌పై క్లిక్ చేయండి. ♦ఫేస్ అథంటికేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ముందుగా మీ కెమెరా లెన్స్‌లు క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు లైటింగ్ ఉన్న చోట నిలుచోండి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ కూడా క్లియర్‌గా ఉండేలా చేసుకోండి. ఆధార్ అథంటికేషన్ ఉపయోగం ఏంటీ! కేంద్ర ప్రభుత్వ పథకాలైన జీవన్ ప్రమాణ్, పీడీఎస్, స్కాలర్షిప్ స్కీమ్స్, కోవిన్, ఫార్మర్ వెల్ఫేర్ స్కీమ్స్ వంటి వాటిల్లో అప్లయ్ చేయాలంటే కొన్ని సార్లు ఫిజికల్ ఆధార్ కార్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇకపై అలా కాకుండా కేవలం మొబైల్లోని యాప్‌తో ఆధార్ ఫేస్ అథంటికేషన్‌తో పూర్తి చేసుకోవచ్చు.అంతేకాదు ఆధార కార్డు దారులు వారి వ్యక్తిగత డేటాను ఫేస్ అథంటికేషన్ కోసం సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోజిటరీలో స్టోర్ చేసుకోవచని యూఐడీఏఐ ట్వీట్ చేసింది. -
ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త!
ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త. ఐడీఏఐ సంస్థ ఆధార్ ఆధారిత సేవల్ని వినియోగదారులకు ఇంటి వద్ద నుంచి అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆధార్ కార్డ్‌లో కాంటాక్ట్ నెంబర్‌ను యాడ్ చేయాలన్నా, లేదంటే పిల్లల పేర్లు జత చేయాలన్నా, ఇతర వ్యక్తిగత వివరాల్ని పొందుపరచలన్నా ఆధార్ సెంటర్‌కు ఉరుకులు పరుగులు తీయాల్సి వచ్చేది. ఒక్కోసారి వ్యయప్రాయాసలు గూర్చి ఆధార్ సెంటర్‌కు వెళ్లినా భారీ క్యూలు, సర్వర్ సమస్యలతో వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి నెలకొనేది. ఈ సమస్యలకు పరిష్కార మార్గంగా యూఐడీఏఐ డోర్-టూ- డోర్ ఆధార్ సర్వీస్ సేవల్ని అందించాలని భావిస్తుంది. అదే జరిగితే ఆధార్ సెంటర్‌కు వెళ్లే అవసరం తీరిపోనుంది. 48000 పోస్ట్ మెన్లు వినియోగదారులకు ఇంటి వద్ద నుంచే, ప్రత్యేకంగా రిమోట్ ఏరియాల్లో ఆధార్ సేవల్ని అందించేందుకు యూఐడీఏఐ ప్రస్తుతం పోస్టాఫీస్‌కు సంబంధించిన 48వేల మంది పోస్ట్ మెన్లకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 1.5లక్షల మందికి పైగా అదే సమయంలో 2 దశల్లో 1.5లక్షల మందికి పైగా ఆధార్ డిజిటల్ ఎక్విప్మెంట్ ల్యాప్ ట్యాప్ బేస్డ్ ఆధార్ కిట్లపై ట్రైనింగ్ ఇవ్వనుంది. 13వేల మంది ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి చెందిన 13వేల మంది ఉద్యోగులు సైతం ఆధార్ సేవల్ని అందించనున్నారు. 773జిల్లాల్లో ఏప్రిల్ 4,2022 వీకీపిడియా లెక్కల ప్రకారం..మనదేశంలో ఉన్న మొత్తం 773జిల్లాల్లో ఆధార్ సేవా కేంద్రాల్ని ఏర్పాడు చేయాలని యూఐడీఏఐ భావిస్తోంది. తద్వారా వినియోగదారులు తమ సేవల్ని సత్వరమే ఉపయోగించుకోవచ్చని అంచనా వేస్తోంది.