
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానంలో ఉద్యోగులందరి హాజరును తప్పనిసరిగా నమోదు చేయాలని కేంద్రం శుక్రవారం అన్ని శాఖలను కోరింది. తమ పరిధిలోని ఉద్యోగులు బయోమెట్రిక్‌లో హాజరు నమోదు చేయనప్పటికీ కొన్ని ప్రభుత్వ శాఖలు అలసత్వంతో వ్యవహరిస్తున్నాయని తేలడంతో సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు తమ ఉద్యోగుల హాజరును తప్పనిసరిగా నమోదు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని అందులో కోరింది. ఉద్యోగుల సమయపాలనపైనా శ్రద్ధ పెట్టాలని సూచించింది. ఉద్యోగులు తరచూ ఆలస్యంగా విధులకు హాజరు కావడం, ముందుగానే వెళ్లిపోవడం వంటి వాటిని ప్రోత్సహించరాదని, నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.