
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఢిల్లీ మెట్రో(Delhi Metro)కు చెందిన మరో వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోలో మెట్రోలో కూర్చున్న ఒక ప్రయాణికులు ఒక చేతితో మద్యం గ్లాసు పట్టుకుని తాగుతూ, మరో చేతితో ఉడికించిన గుడ్డును తింటున్నాడు. తనను ఎవరైనా గమనిస్తున్నారా అని అటునిటు చూస్తూ మద్యం సిప్ చేస్తున్నాడు. దీనిని గమించిన ఒక ప్రయాణికుడు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై ఢిల్లీ పోలీసులు వెంటనే స్పందించారు.
Eggs & "Alcohol" in the Metro? That’s not breakfast - that’s a Breach !!
Break the rules, Face the consequences, Rules aren’t suggestions: They’re the law.#DPUpdates pic.twitter.com/CP2P5fDFiW— Delhi Police (@DelhiPolice) April 9, 2025
ఢిల్లీ పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియా(Social media) ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో షేర్ చేస్తూ ‘మెట్రోలో గుడ్లు, మద్యం తీసుకోవడం అనేది అల్పాహారమేమీ కాదు. ఇది నియమాల ఉల్లంఘన. ఇలా చేసినందుకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. అయితే మెట్రోలో కనిపించిన ఆ వ్యక్తి పోలీసులకు క్షమాపణలు చెబుతూ ‘ఆ వీడియోలో నేను గుడ్డు తింటూ, మద్యం తాగుతున్నట్లు కనిపించాను. కానీ అది మద్యం కాదు, అప్పీ ఫిజ్ (Appy Fizz)’ అని వివరణ ఇచ్చాడు.
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)ఈ ఘటనపై స్పందిస్తూ మెట్రోలో మద్యం సేవించడం నిబంధనలకు విరుద్ధమని, ప్రయాణికులు బాధ్యతాయుతంగా మెలగాలని సూచించింది. డీఎంఆర్‌సీ(DMRC) ఒక అధికారిక ప్రకటనలో ‘ఈ వీడియో ఉద్దేశపూర్వకంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. మద్యం సేవించడం లాంటి వ్యవహారాలు మెట్రో నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది’ అని పేర్కొంది. అలాంటి ఘటనలను ఎవరైనా చూస్తే, వెంటనే మెట్రో సిబ్బందికి లేదా సీఐఎస్‌ఎఫ్ అధికారులకు తెలియజేయాలని కోరింది. కాగా ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. కొందరు ఆ వ్యక్తి చర్యను తప్పుపట్టగా, మరికొందరు అతని వివరణ హాస్యాస్పదమని కామెంట్ చేశారు.
ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ ఆరోపణలపై చైనా ఆగ్రహం