Myanmar: భూ ప్రకంపనల వైరల్‌ వీడియోలు | Myanmar Earthquake Latest Video of Buildings Swaying | Sakshi
Sakshi News home page

Myanmar: భూ ప్రకంపనల వైరల్‌ వీడియోలు

Published Sat, Mar 29 2025 1:41 PM | Last Updated on Sat, Mar 29 2025 1:50 PM

Myanmar Earthquake Latest Video of Buildings Swaying

నేపిడా/బ్యాంకాక్: మయన్మార్‌(Myanmar)ను భూకంపం కుదిపేసింది. వందలాది భవనాలు నేల మట్టమయ్యాయి. మరణాల సంఖ్య లెక్కకు అందనంతగా ఉంది. ఇక నిరాశ్రయులైనవారి సంఖ్య చెప్పలేనంతగా ఉంది.  ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
 

మయన్మార్, థాయిలాండ్‌లలో  సంభవించిన భూకంపానికి సంబంధించిన ఈ వీడియోలో ఆకాశహర్మ్యాలు ఊగడాన్ని చూడవచ్చు. రోడ్లపై వాహనాలు  కదలడాన్ని కూడా చూడవచ్చు. ఈ వీడియో వణుకుపుట్టించేదిగా ఉంది.

ఈ వీడియోలో ఆకాశహర్మ్యంలో నిర్మించిన స్విమ్మింగ్‌ ఫూల్‌లో అలలు  ఏర్పడి, అవి ఎగసిపడటాన్ని చూడవచ్చు. దీనిని చూస్తే చాలు.. భూకంప తీవ్రతను అంచనా వేయవచ్చు.

ఈ వీడియోలో ఇంటిలో ఏర్పడిన భూకంప ప్రభావాన్ని చూడవచ్చు. చిన్న చెట్టును ఊపినప్పుడు అది ఎలా ఊగిపోతుందో ఆ విధంగా ఈ ఇల్లు భూకంప తీవ్రతకు ఊగిపోయింది.

స్కై వాక్ చేయడానికి 78వ అంతస్తుకు చేరుకున్న జనం భవనం కంపించడంతో ఎంతగా భయపడ్డారో ఈ వీడియోలో చూడవచ్చు.  అక్కడున్న వస్తువులు జారిపోతుండటాన్ని గమనించవచ్చు.

ఈ వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. భూమి పూర్తిగా చీలిపోయి, చాలా లోతైన పగుళ్లు  ఏర్పడటాన్ని చూడవచ్చు.

ఈ వీడియోలో భూకంపం తర్వాత ఆకాశహర్మ్యం పైకప్పుపై నుంచి నీరు జలపాతంలా పడటం కనిపిస్తుంది. భూకంపం సంభవించిన సమయంలో భవనాన్ని శుభ్రం చేస్తున్న వ్యక్తి ఎంతో భయపడుతూ కనిపిస్తున్నాడు.

ఈ వీడియోలో భూమికి పగుళ్లు ఏర్పడిన దరిమిలా భూమి నుండి పంపు ద్వారా నీరు దానికదే  ఉబికి రావడాన్ని గమనించవచ్చు.

ఈ వీడియో నైరుతి చైనాలోని  ఒక ఆస్పత్రికి సంబంధించినది. భూకంపం సమయంలో నవజాత శిశువులను రక్షించడానికి నర్సులు పడుతున్న పాట్లను గమనించవచ్చు.

ఇది కూడా చదవండి: ‘ప్రయాగ్‌రాజ్‌’కు పోటీగా నాసిక్‌ కుంభమేళా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement