buildings
-
పబ్లిక్ స్థలాల్లో మహిళలు, శిశువులకు వసతులు కల్పించాలి
న్యూఢిల్లీ: పబ్లిక్ స్థలాల్లో నిర్మించిన భవనాలు, నిర్మించబోయే భవనాల్లో శిశువుల సంరక్షణకు, వారికి తల్లులు స్తన్యం ఇచ్చేందుకు ప్రత్యేక వసతులు కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలని సూచించింది. ప్రత్యేక గదుల్లాంటివి నిర్మిస్తే తల్లుల గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉంటుందని, పిల్లలకు సైతం మేలు జరుగుతుందని వెల్లడించింది. పబ్లిక్ స్థలాల్లో ఫీడింగ్ రూమ్‌లు, చైల్డ్‌కేర్ గదులు నిర్మించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ప్రసన్న బి.వరాలీతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తల్లులు, బిడ్డల కోసం భవనాల్లో తగినంత స్థలం కేటాయించి, వసతులు కల్పించాలని పేర్కొంది. సుప్రీంకోర్టు విచారణకు కేంద్ర ప్రభుత్వం తరఫు హాజరైన న్యాయవాది స్పందిస్తూ... పబ్లిక్ స్థలాల్లో తల్లులు, శిశువులకు వసతులు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తూ 2024 ఫిబ్రవరి 27న కేంద్ర మహిళ, శిశు అభివృద్ది శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ ఆదేశాలపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తంచేసింది. ఆదేశాలను రాష్ట్రాలకు మరోసారి గుర్తుచేయాలని పేర్కొంది. -
అలనాటి స్మృతుల్లో.. అలా సాగిపోతూ..
శతాబ్దాల చారిత్రక అస్తిత్వం.. హైదరాబాద్ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతిరూపం. విభిన్న జీవన సంస్కృతుల సమాహారం పాతబస్తీ.. కుతుబ్‌షాహీల నుంచి ఆసఫ్‌జాహీల వరకు 400 ఏళ్ల నాటి చార్మినార్ మొదలుకొని ఎన్నెన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, మరెన్నో అందమైన ప్యాలెస్‌లు, మహళ్లు, దర్వాజాలు, దేవిడీలు, బౌలీలు, నవాబుల సమాధులు, పార్కులు ప్రపంచ చిత్రపటంలో పాతబస్తీ ఉనికిని సమున్నతంగా ఆవిష్కరిస్తాయి. హైదరాబాద్‌కు వచ్చే దేశవిదేశాలకు చెందిన పర్యాటకులు పాతబస్తీని సందర్శిస్తేనే ఆ పర్యటన పరిపూర్ణం అవుతుంది. అలాంటి పాతబస్తీలో ఇప్పుడు మెట్రో నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఏ ఒక్క చారిత్రక కట్టడానికి విఘాతం కలిగించకుండా, వాటి ఔన్నత్యాన్ని చాటే విధంగా మెట్రో మెలికలు తిరగనుంది. చారిత్రక కట్టడాలను చుట్టేస్తూ మహాత్మా గాంధీ బస్‌స్టేషన్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ నిర్మాణానికి కార్యాచరణ మొదలైంది. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ వల్ల చారిత్రక భవనాలకు ఎలాంటి ముప్పు లేకపోయినప్పటికీ కొన్ని చోట్ల వందేళ్లకు పైబడిన ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు, స్కూళ్లు తదితర భవనాలు పాక్షికంగానో, పూర్తిగానో నేలమట్టం కానున్నాయి. సుమారు 1100 నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ గుర్తించింది. ఇప్పటి వరకు 270 మంది తమ ఆస్తులు అప్పగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు హెచ్‌ఏఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ⇒ చదరపు గజానికి రూ.81 వేల చొప్పున ఆస్తులు కోల్పోనున్న వారిలో 170 మందికి సుమారు రూ.80 కోట్లు ఇప్పటి వరకు చెక్కులు పంపిణీ చేశారు. కానీ మెట్రో నిర్మాణంలో భాగంగా ఆస్తులను కోల్పోతున్న ఎంతోమంది పాతబస్తీవాసులుపూర్వీకుల నాటి భవనాలను కోల్పోవడంపై ఆందోళనకు గురవుతున్నారు. మెట్రో వల్ల తరతరాలుగా వారసత్వంగా వచ్చే భవనాలను కోల్పోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో నిర్మాణం నేపథ్యంలో పాతబస్తీలో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఆ వివరాలతో ప్రత్యేక కథనం..చారిత్రక రహదారులపై మెట్రో కారిడార్.. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మీరాలంమండి రోడ్డు మీదుగా దారుల్షిఫా, పురానీహవేలి, ఎతెబార్చౌక్, అలీజాకోట్ల, బీబీబజార్, సుల్తాన్‌షాహీ, హరి»ౌలి, శాలిబండ, అలియాబాద్, శంషీర్‌గంజ్, ఫలక్‌నుమా వంటి చారిత్రక రహదారిపైన మెట్రో కారిడార్ నిర్మించనున్నారు. ⇒ ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మెట్రోనూ మళ్లించారు. చారి్మనార్‌కు 500 మీటర్ల దూరంలో మెట్రో రానుంది. ఇలా చారిత్రకకట్టడాలు ఉన్న చోట ఇంజినీరింగ్ పరిష్కారాలు, మెట్రో పిల్లర్ స్థానాల సర్దుబాటు వంటి చర్యలు చేపట్టారు. కానీ ఇదే రూట్లో ఎంతోమంది పాలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులను విక్రయించే కిరాణా దుకాణాలు, హోటళ్లు, పలు చోట్ల స్కూల్ భవనాలు ప్రభావితం కానున్నాయి. ప్రతి సంవత్సరం మొహర్రం సందర్భంగా బీబీకా ఆలం ఊరేగింపుతో ఎంతో సందడిగా ఉండే దారుల్ఫా స్వరూపం మారనుంది.⇒ ‘ఒకప్పుడు మా ఇల్లు 1200 గజాల్లో ఉండేది. 2002లో రోడ్డు విస్తరణ కోసం 131 గజాలు తీసుకున్నారు. ఇప్పుడు మెట్రో కోసం 700 గజాలు ప్రభావితమవుతోంది. పూరీ్వకుల నుంచి ఉన్న మా ఇంటి ఉనికిని కోల్పోతున్నాం.’ అని దారుల్íÙఫాకు చెందిన ఆబిద్ హుస్సేన్ తెలిపారు. మొహర్రం బీబీకాలం ఆలం సందర్భంగా ఏనుగు మా ఇంటికి వస్తుంది. రేపు మెట్రో వచి్చన తర్వాత అది సాధ్యం కాదు కదా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. హెరిటేజ్ రోడ్లపై నుంచి కాకుండా ఇతర మార్గాల్లో మెట్రో నిర్మించాలన్నారు. ⇒ పాతబస్తీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని.. నిజాం కాలం నాటి భవనాలు కోల్పోవడం బాధగా ఉంది. మాపూర్వీకులు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇంట్లో మా తాత, మా నాన్న, ఇప్పుడు మేము కిరాణ జనరల్ స్టోర్ నడుపుతున్నాం. 280 చదరపు గజాలు ఉన్న మా ఇంటి నుంచి మెట్రో కోసం 65 చదరపు గజాల స్థలాన్ని కోల్పోతున్నాం. పాతబస్తీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సి వచి్చంది. – సయీద్ బిన్ అహ్మద్ మహపూజ్, వ్యాపారిపాతకాలం నాటి ఇల్లు పోతోంది ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మెట్రోరైల్ ఎంతో అవసరం, పాతబస్తీ ప్రజలకు మెట్రో సదుపాయం రావడం ఆహ్వానించదగ్గదే.. కానీ పూరీ్వకుల నాటి ఇంటిని కోల్పోవాల్సి రావడం కష్టంగానే ఉంది. మా కళ్ల ముందే మా ఇంటిని కూల్చివేస్తుంటే చూడలేకపోతున్నాం. ఎంతో బాధగా ఉంది. – మహ్మద్ బీన్ అహ్మద్, ఇంటి యజమానిపరిహారం అవసరం లేదు హెరిటేజ్ రోడ్లపై నుంచి మెట్రో నిర్మించడం సరైంది కాదు.. దీనివల్ల మా ఇల్లు 700 గజాలు కోల్పోవాల్సి వస్తుంది. పరిహారం కోరుకోవడం లేదు. త్వరలో న్యాయం కోసం కోర్టుకు వెళ్తాను. ఎట్టిపరిస్థితుల్లోనూ మెట్రోకు స్థలం ఇవ్వను. – ఆబిద్‌హుస్సేన్, దారుల్ఫా జిగ్‌జాగ్ మెట్రో ఉంటుందా ప్రపంచంలో ఎక్కడైనా మెట్రో ప్రధానమైన మార్గాల్లో కట్టారు. కానీ పాతబస్తీ అందుకు విరుద్దం. ఇలాంటి జిగ్‌జాగ్ మెట్రో ఎక్కడా చూడలేదు. చాలావరకు చారిత్రక భవనాలను కాపాడుతున్నామంటున్నారు. కానీ స్పష్టత లేదు. – అనురాధారెడ్డి, ఇంటాక్ ఆ ఘుమఘుమలు మాయమేనా..? పాతబస్తీ పేరు వింటేనే కమ్మటి ఇరానీచాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సమోసా, బన్‌మస్కా, పసందైన బిర్యానీ రుచులు ఘుమఘుమలాడుతాయి. ప్రతిరోజూ తెల్లవారు జాము నుంచే జనజీవనంతో బీబీబజార్, మొగల్పురా, షాలిబండ తదితర ప్రాంతాలు సందడిగా కనిపిస్తాయి. మెట్రో రాక వల్ల అనేక మార్పులు రానున్నాయి. బీబీబజార్‌లోని విక్టోరియా హోటల్ కనుమరుగవుతోంది. అలాగే ఎతేబార్‌చౌక్‌లోని ఏళ్ల నాటి ముఫీద్–ఉల్–ఆనమ్ స్కూల్, పురానీహవేలీలోని ప్రిన్సెస్ ఎస్సేన్ గరŠల్స్ హైసూ్కల్ తదితర విద్యాసంస్థలు ప్రభావితం కానున్నాయి. కొన్ని స్కూళ్లు పాక్షికంగా దెబ్బతింటాయి. పాతబస్తీ మెట్రోపైన మొదట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలోనే మార్గం సుగమమైంది. ‘అభివృద్ధిని అడ్డుకోవడం లేదు. కానీ పాతబస్తీ రూపురేఖలు, చిహ్నాలు మారిపోతాయనే బాధ మాత్రం తీవ్రంగా ఉంది.’ అని మీర్ యూసుఫ్ అలీ అభిప్రాయపడ్డారు. -
నేను అద్దాల మేడ కట్టుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నేను అద్దాల మేడ(శీష్ మహల్) కట్టుకోలేదు. కానీ, పదేళ్లలో నాలుగు కోట్ల మందిపైగా పేదల సొంతింటి కల నెరవేర్చాను. వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చాను’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తన కోసం విలాసవంతమైనæభవనం కాకుండా పేదలకు శాశ్వత నివాసం ఉండాలన్నదే తన స్వప్నం అని వివరించారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అశోక్ విహార్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం నిర్మించిన 1,675 ఇళ్లను ప్రారంభించారు. లబ్దిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. వారితో ముచ్చటించారు. నౌరోజీ నగర్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, సరోజినీ నగర్లో జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ (జీపీఆర్ఏ)టైప్–2 క్వార్టర్స్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ద్వారకలో రూ.300 కోట్లతో నిర్మించిన సీబీఎస్ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఢిల్లీ యూనివర్సిటీలో రూ.600 కోట్ల విలువైన మూడు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్)పై నిప్పులు చెరిగారు. అది ఆప్ కాదు, ఆపద అంటూ మండిపడ్డారు. ప్రధానమంత్రి ఏం మాట్లాడారంటే... ఢిల్లీని ఆపదలో పడేశారు ‘‘మోదీ ఎప్పుడూ తన కోసం ఇల్లు నిర్మించుకోలేదన్న విషయం దేశానికి తెలుసు. గడచిన పదేళ్లలో నాలుగు కోట్ల కంటే ఎక్కువగా ఇళ్లు నిర్మించి పేదల కలను సాకారం చేశాం. నేను కూడా శీష్ మహల్(అద్దాల మేడ) నిర్మించుకొనేవాడినే. కానీ, అది నాకు ఇష్టం లేదు. నా దేశ ప్రజలకు పక్కా ఇళ్లు ఉండాలన్నదే నా కల. కొందరు వ్యక్తులు(కేజ్రీవాల్) అబద్ధపు ప్రమాణాలు చేసి ప్రజల సొమ్ముతో అద్దాల మేడలు నిర్మించుకున్నారు. గత పదేళ్లలో ఢిల్లీ పెద్ద ఆపదలో పడిపోయింది. అన్నా హజారేను ముందు పెట్టి పోరాటాలు చేసిన కొందరు కరడుగట్టిన అవినీతిపరులు ఢిల్లీని ఆపదలో పడేశారు. మద్యం, పాఠశాలలు, వైద్య చికిత్స, కాలుష్య నియంత్రణ, ఉద్యోగ నియామకాల్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. వీళ్లా ఢిల్లీ అభివృద్ధి గురించి మాట్లాడేది? ముంచుకొచ్చిన ఆపదకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు యుద్ధం చేయాలి. ఆపద నుంచి విముక్తి పొందాలని ఢిల్లీ ప్రజలు సంకల్పించారు. ఆదపను సహించం.. మార్చి చూపిస్తాం అని ఢిల్లీలోని ప్రతి గల్లీలో ప్రతి ఒక్కరూ అంటున్నారు. యమునా నది శుద్ధి చేస్తే ఓట్లు పడవని అంటున్నారు. ఓట్ల కోసం యమునను వదిలేస్తామా? యమునను శుద్ధి చేయకపోతే ఢిల్లీ ప్రజలకు తాగునీరు ఎలా వస్తుంది? అవినీతిపరుల కారణంగా ప్రజలకు కలుషితమైన నీరు అందుతోంది. ఈ ఆపద తెచ్చిపెట్టిన వ్యక్తులు ఢిల్లీ ప్రజల జీవితాలను వాటర్ ట్యాంకర్ల మాఫియాకు వదిలేశారు. ఈ ఆపద ఇలాగే కొనసాగితే మరిన్ని కష్టాలు తప్పవు. ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకుండా వాళ్లు అడ్డుకుంటున్నారు. ఈ ప«థకం కింద ప్రజలకు ప్రయోజనం అందకపోవడానికి కారణం ఆ వ్యక్తులే. ప్రజల జీవితాల కంటే తమ స్వార్థం, విజయం, అహంకారమే ప్రధానంగా భావిస్తున్నారు. జాతీయ పథకాల ప్రయోజనాలు ఢిల్లీ ప్రజలకు చేరేలా చేయడమే మా లక్ష్యం. ఆపద నుంచి తప్పించుకోవాంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
చిలీలో భూకంపం..6.2 తీవ్రత నమోదు
శాంటియాగో:చిలీలో భారీ భూకంపం వచ్చింది. కలమాకు 84 కిలోమీటర్ల దూరంలోని అంటోఫగాస్టాలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైంది. 104 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు యురోపియన్ మెడిటెర్రేనియన్ సెస్మలాజికల్ సెంటర్(ఈఎమ్ఎస్సీ) ఒక ప్రకటనలో తెలిపింది.Another video of the M6.1 earthquake that hit Chile earlier....pic.twitter.com/w4FyDegf4n— Volcaholic 🌋 (@volcaholic1) January 2, 2025భూకంపం కారణంగా జరిగిన ప్రాణ,ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల్లో నమోదైన భూకంపం దృశ్యాలను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భూకంపం ధాటికి భవనాలు కొద్ది సేపు అటు ఇటు ఊగుతుండడం ఆ వీడియోల్లో కనిపించింది. CCTV of the M6.1 earthquake in Chile a short while ago. That was a long one 👀pic.twitter.com/SvyBLoZZhU— Volcaholic 🌋 (@volcaholic1) January 2, 2025 -
నిరుపయోగంగా 50 ఎకరాలు... నెరవేరని ప్రభుత్వ లక్ష్యం
జడ్చర్ల: లక్ష మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం లెదర్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. చర్మ ఉత్పత్తుల పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (లిడ్‌క్యాప్) వీటిని ఏర్పాటు చేయాల్సిన ఉంది. ఇందుకోసం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 50 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. జడ్చర్ల మండలంలోని పోలేపల్లి సెజ్ సమీపంలో 2002 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం మినీ లెదర్ పార్కు నిర్మించాలన్న ఉద్దేశంతో లిడ్ క్యాప్‌కు 25 ఎకరాల అసైన్డ్ భూమిని, బల్మూర్ మండలం జినుకుంటలో 25 ఎకరాలను కేటాయించింది.ఇందులో భాగంగానే 2004లో అప్పటి ప్రభుత్వం చర్మకారుల అభివృద్ధి కోసం జినుకుంటతోపాటు పోలేపల్లి శివారులో లిడ్‌క్యాప్‌కు కేటాయించిన స్థలంలో నిధులు వెచ్చించి భవనాలు కూడా నిర్మించింది.పోలేపల్లి శివారులో గల భూమిలో దాదాపు రూ.10 లక్షల అంచనా వ్యయంతో ఓ భవనాన్ని నిర్మించి మలుపు పేరుతో ఓ పథకాన్ని కూడా ప్రారంభించారు. జినుకుంటలో రూ.25 లక్షలు వెచ్చించి భవనాన్ని నిర్మించి.. దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో చర్మ ఉత్పత్తులకు సంబంధించిన యంత్ర సామగ్రిని కూడా సమకూర్చారు. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో పథక ఉద్దేశం నెరవేరడం లేదు. పోలేపల్లిలో కూడా ఇంత వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో లిడ్‌క్యాప్‌కు కేటాయించిన 25 ఎకరాల భూమి నిరుపయోగంగా మారింది.చెన్నైలో ప్రత్యేక శిక్షణ.. చర్మ ఉత్పత్తుల తయారీకి సంబంధించి అప్పట్లో పలువురు నిరుద్యోగ దళిత యువకులను గుర్తించి వారికి చెన్నైలో శిక్షణ ఇప్పించారు. వారి ద్వారా జడ్చర ఇండ్రస్టియల్ పార్కులో 250 మందికి చర్మ ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ కాలంలో నెలకు రూ.1,500 స్టైఫండ్ చెల్లించి శిక్షణ ధ్రువీకరణ పత్రాలు అందించారు. లెదర్ పార్కులలో ఏర్పాటయ్యే పలు పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అధికారులు అప్పట్లో హామీ ఇచ్చారు. జినుకుంటలో దాదాపు 400 మందికి శిక్షణ ఇచ్చారు. తర్వాత వారికి ఉపాధి అవకాశాలు కల్పించలేదు.శిథిలావస్థకు చేరిన భవనాలు పోలేపల్లిలో చర్మకారుల వృత్తికి సంబంధించి పాదరక్షలు, పర్సులు, బూట్లు తదితర వాటిపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన మలుపు పథకం భవనం కూడా క్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. భవనాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో కిటికీలు, తలుపులు, షట్టర్ తదితర సామగ్రిని సైతం దొంగలు అపహరించుకెళ్లారు. జినుకుంటలో సైతం భవనం శిథిలావస్థకు చేరుకోగా యంత్రాలు తుప్పుబట్టాయి.రూ.కోట్లలో భూముల ధరలు పోలేపల్లి శివారులో లెదర్ పార్కుకు కేటాయించిన భూముల విలువ రూ.కోట్లు పలుకుతోంది. ఒకవైపు సెజ్.. మరోవైపు 44వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకొని ఉండటంతో భూమి విలువ రూ.కోట్లకు చేరింది. ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరా ధర రూ.3 కోట్లకు పైగా పలుకుతోంది. ఇంత విలువైన భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.ఏపీఐఐసీకి అప్పగింత పోలేపల్లి శివారులో జాతీయ రహదారితోపాటు సెజ్‌కు దగ్గరగా ఉన్న ఈ భూమిలో లెదర్ పార్కు ఏర్పాటు చేసేందుకు లిడ్‌క్యాప్ 2008లో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కి అప్పగించింది. అయితే ఏపీఐఐసీ అధికారులు లెదర్ పార్కు ఏర్పాటుకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో 25 ఎకరాల భూమి నిరుపయోగంగానే మారింది. దీంతో 2013లో ప్రభుత్వం ఏపీఐఐసీ నుంచి సదరు భూమిని వెనక్కి తీసుకొని మళ్లీ లిడ్‌క్యాప్‌కి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు భూమిని స్వా«దీనం చేసుకున్న లిడ్‌క్యాప్ ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. దీంతో దళితుల ఉపాధికి సంబంధించి ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లాలోని దళితులకు ఉపయోగపడేలా లెదర్ పార్కులను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.రూ.60 లక్షలు కేటాయింపు తెలంగాణ ప్రభుత్వం 2022లో లిడ్‌క్యాప్ శిక్షణ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించేందుకు రూ.60 లక్షలు కేటాయించింది. తమిళనాడులోని సీఎల్ఆర్ఐ (సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)కు సంబంధించి ఈ నిధులు కేటాయించినట్టు అప్పట్లో అధికారులు తెలిపారు. కానీ, ఇప్పటి వరకు ఆ నిధులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు.ఎంతో మందికి ప్రయోజనం.. పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో లిడ్‌క్యాప్‌కు కేటాయించిన భూమిలో చర్మ ఉత్పత్తుల తయారీ సంబంధిత కార్యక్రమాలు చేపట్టడంపై ప్రభుత్వం దృషిŠాట్సరిస్తే ఎంతోమందికి ప్రయోజనం ఉంటుంది. సంబంధిత రంగాల్లో శిక్షణ పొందిన పలువురికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. లెదర్ ఉత్పత్తులకు మార్కెట్లో లభిస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అనిరు«ద్‌రెడ్డి లెదర్ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అవకాశాలు కల్పించాలి.. చర్మ ఉత్పత్తుల తయారీపై పొందిన శిక్షణ నిరుపయోగంగా మారింది. శిక్షణ అనంతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావించాం. లెదర్ పార్కులలో ఏర్పాటయ్యే పరిశ్రమలు తమ జీవితాలకు బాటలు వేస్తాయనుకున్నాం. కానీ, పాలకులు లెదర్ పార్కులపై దృష్టి సారించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా న్యాయం జరగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళితులకు న్యాయం చేయాలి. – కృష్ణయ్య, చర్మకారుల సంఘం అధ్యక్షుడు, జడ్చర్ల -
రుషికొండపై కట్టినవి ప్రభుత్వ భవనాలే
సాక్షి, అమరావతి: విశాఖలో రుషికొండపై నిర్మించిన భవనాలన్నీ ప్రభుత్వ భవనాలని, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే వాటిని నిర్మించినట్లు మంత్రే స్వయంగా చెప్పారని, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. ఈ భవనాలను రాష్ట్రపతి, ప్రధాని వంటి అతిథులు రాష్ట్రానికి వచ్చినప్పుడు గెస్ట్హౌస్లుగానో లేక వేరే విధంగా వినియోగించుకుంటారా... అన్నది ప్రభుత్వ ఇష్టమన్నారు. మంగళవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రుషికొండ భవనాలపై చర్చ జరిగింది.ఈ చర్చలో బొత్స మాట్లాడుతూ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి నివాసం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రగతి భవన్‌ను నిర్మించారని, ఆ తర్వాత సీఎంలు ఆ భవనాలను వినియోగించుకుంటున్నారని, అదేవిధంగా రుషికొండ భవనాలను కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఒక పక్క అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతూనే, ప్రజల ఆమోదం లేకుండా నిర్మించారని మంత్రి దుర్గేష్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. అసలు ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఉపన్యాసం చేస్తుండటంతో మధ్యలో కల్పించుకొని వివరణ ఇస్తున్నానని తెలిపారు.మరో మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకుని అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం చదరపు అడుగుకు వారు రూ.6,500 ఖర్చు చేస్తే, రుషికొండలో ఏకంగా రూ.25,000 ఖర్చు చేశారంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని బొత్స అన్నారు. 2015లో శాసనసభ నిర్మాణానికి ఫర్నిచర్‌తో కలిపి చదరపు అడుగుకు రూ.14,000 ఖర్చు చేశారన్నారు. ఉప ముఖ్యమంత్రి కూడా ఈ భనాలను చూసి తాజ్‌మహల్ కంటే చాలా బాగున్నాయని పొగిడిన సందర్భాన్ని గుర్తు చేశారు.వాస్తవాలు ఇలా ఉంటే మంత్రులే çసంయమనం పాటించకుండా ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ఆస్తులుగా చిత్రీకరిస్తూ రండి చూసుకుందాం.. దమ్ముంటే రండి... అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదని, ఈ పదాలను తక్షణం రికార్డుల నుంచి తొలగించాలంటూ బొత్స డిమాండ్ చేశారు. అంతకముందు మంత్రులు కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అప్పటి మున్సిపల్ మంత్రి అయిన మిమ్మల్ని కూడా చూడనీయకుండా దాచిపెట్టి కట్టినందుకు క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా.. అంటూ బొత్స సత్యనారాయణను ఉద్దేశించి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సభలో వైఎస్సార్సీపీ సభ్యులు, మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది.అన్నదాత సుఖీభవ నిధులు రైతులకు ఎప్పుడిస్తారు?రబీ అయిపోయి ఖరీప్ వచ్చినా ఇప్పటివరకు రైతులకు అన్నదాత సుఖీభవ కింద కూటమి ప్రభుత్వం ఇస్తామన్న రూ.20వేల నగదు సాయంలో ఒక్కపైసా విడుదల కాలేదని, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని మండలిలో వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు రాజశేఖర్, రామసుబ్బారెడ్డి ఈ అంశంపై మాట్లాడుతూ 52 లక్షల మంది రైతులకు రూ.10,500 కోట్లు అవసరమైతే బడ్జెట్లో కేటాయించిన రూ.4,500 కోట్లు ఎలా సరిపోతాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇందులో కూడా రూ.3,500 కోట్లు పీఎం కిసాన్ కింద ఇచ్చే కేంద్ర నిధులని, కేవలం రూ1,000 కోట్లే రాష్ట్ర నిధులను కేటాయించారన్నారు.కౌలు రైతులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది మరింత పెరుగుతుందన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం విధివిధానాలు తయారు చేస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చే రూ.6,000కు రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000 త్వరలోనే అందిస్తామన్నారు. గత ప్రభుత్వం ఈ–క్రాప్ ఆధారంగా ఉచిత పంటల బీమా అందించి ఏ సీజన్లో నష్టపోయిన రైతులకు ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిందని, ఇప్పుడు జూలై, ఆగస్టు నెలల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం ఇంతవరకు ఇవ్వలేదని వైఎస్సార్సీపీ సభ్యుడు తోట త్రిమూర్తులు విమర్శించారు.ఫైళ్ల దగ్ధం కేసు విచారణ జరుగుతుండగా పేర్లు ఎలా చెబుతారు?: బొత్సమదనపల్లి ఫైళ్ల దగ్ధంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తప్పు జరిగితే విచారణ చేసి దోషులపై కఠిన చర్య తీసుకోవచ్చని, కానీ విచారణ జరుగుతుండగానే కొంతమంది పేర్లను నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా ప్రస్తావిస్తారని నిలదీశారు. ఆ పేర్లను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో చినజీయర్ స్వామి, ఈషా ఫౌండేషన్లకు చంద్రబాబు ఇచ్చిన విధంగానే వేద పాఠశాల నిర్మాణం కోసం ధార్మిక సంస్థలకు భూ కేటాయింపులు చేశారని చెప్పారు. ఇందులో ఏమైనా తప్పులు జరిగి ఉంటే చట్టప్రకారం చర్య తీసుకోవడానికి తాము వ్యతిరేకం కాదన్నారు. -
మీ ఇంటికీ వస్తారు!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని భవనాల జీఐఎస్ మ్యాపింగ్ కోసం డోర్ టు డోర్ సర్వే త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకుగాను జీహెచ్ఎంసీతోపాటు సర్వే చేసేందుకు ఎంపికైన కాంట్రాక్టు ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఓవైపు డ్రోన్ సర్వే ప్రారంభం కాగా.. మరోవైపు త్వరలోనే ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది. ఇంటింటి సర్వే వల్ల జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను ఆదాయం రూ.వెయ్యి కోట్లకు పైగా పెరగవచ్చనే అంచనాలున్నాయి. జీహెచ్ఎంసీలో 20 లక్షలకు పైగా ఆస్తులు (భవనాలు) ఉన్నప్పటికీ, ఆస్తిపన్ను చెల్లింపు జాబితాలో మాత్రం దాదాపు 19 లక్షలున్నాయి. ఇంటింటి సర్వే ద్వారా సరైన లెక్కలతో పాటు భవనాల వాస్తవ విస్తీర్ణాలకనుగుణంగా ఆస్తిపన్ను విధించనున్నారు. ప్రస్తుతం చాలా భవనాల వాస్తవ విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణం నమోదై ఉండటంతో జీహెచ్ఎంసీకి రావాల్సినంత ఆస్తిపన్ను ఆదాయం రావడం లేదు. మరోవైపు అదనంగా పెరిగిన అంతస్తుల నుంచి కూడా ఆస్తిపన్ను రావడం లేదు. శాటిలైట్, డ్రోన్, డోర్ టు డోర్ సర్వేల ద్వారా మ్యాపింగ్‌తో కచి్చతమైన వివరాలతో పాటు ప్రతి ఇంటికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కేటాయించనున్నందున ఓవైపు జీహెచ్ఎంసీ ఆదాయం పెరగడంతో పాటు వివిధ అవసరాలకు ఉపయోగపడనుంది. ఏవైనా ప్రమాదాలు జరిగితే సంబంధిత యంత్రాంగం త్వరితంగా చేరుకునేందుకు కూడా ఉపకరిస్తుంది. రెండు సర్కిళ్లలో పూర్తయిన డ్రోన్ సర్వే ఇప్పటికే డ్రోన్ సర్వే ప్రారంభమైంది. పటాన్చెరు, కూకట్పల్లి సర్కిళ్లలో పూర్తయిందని జీహెచ్ఎంసీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం శేరిలింగంపల్లిలో సర్వే జరుగుతోంది. త్వరలోనే ఇంటింటి సర్వే కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రజలు సర్వేకు సహకరించేందుకు వీలుగా ముందస్తు ప్రచారం నిర్వహించనున్నారు. వివిధ ప్రచార, ప్రసార మాధ్యమాలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటారు. సోషల్‌మీడియా ద్వారానూ ప్రచారం నిర్వహించాలనే యోచనలో అధికారులున్నట్లు సమాచారం. యాప్‌లో నమోదు ఇంటింటి సర్వేలో భాగంగా ఇళ్లకు సంబంధించిన వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. ఇళ్ల యజమానుల ఫోన్ నెంబర్లను కూడా నమోదు చేయనున్నారు. ఇళ్ల నమోదులో భాగంగా నివాస భవనమా.. వాణిజ్య భవనమా.. అపార్ట్‌మెంటా.. ఇండిపెండెంట్ భవన మా? వంటి వివరాలతో పాటు భవనం విస్తీర్ణం, చిరునామా, పోస్టల్ కోడ్ తదితర వివరాలు నమోదు చేస్తారు. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న భవనాల వివరాలను సైతం సర్వే చేస్తారు. భవనం ఎత్తు, అక్కడున్న రోడ్ మెయిన్ రోడ్డా? సబ్ రోడ్డా? వంటి వివరాలు సైతం నమోదు చేస్తారు. భవనం ఫొటోలు తీస్తారు. భవనాల్లో ఇంకుడుగుంతలు, సివరేజి లైన్లు, సోలార్ ప్యానెల్ వంటివి ఉన్నదీ లేనిదీ నమోదు చేస్తారు. జియో ఫెన్సింగ్ వల్ల భవనం ఏ వార్డు పరిధిలో ఉన్నది ఆటోమేటిక్‌గా నమోదవుతుంది. ఎన్ని అంతస్తులు, భవన వినియోగం, వాటర్, విద్యుత్ కనెక్షన్ల వివరాలు తదితరాలను సైతం నమోదు చేస్తారు. వాణిజ్య భవనాలైతే జరుగుతున్న వ్యాపారం, ట్రేడ్‌లైసెన్స్ వంటి వివరాలు కూడా నమోదు చేస్తారు. వీటితో పాటు ఇంకా పలు వివరాలు యాప్‌లో నమోదు చేయనున్నారు. యాప్ పనితీరు పరిశీలన కోసం దాదాపు 15 ఇళ్ల వివరాలు యాప్‌లో నమోదు చేసినట్లు సమాచారం. -
రుషికొండ బిల్డింగ్ తప్పుడు ప్రచారాలపై గుడివాడ అమర్నాథ్ క్లారిటీ..
-
ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ విస్తరణ...
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నేపథ్యంలో జీవో 111 అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జంట జలాశయాల పరిరక్షణ కోసం అమల్లోకి తెచ్చిన ఈ జీవో ఇప్పటికే అన్ని విధాలుగా నిర్వీర్యమైంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మహానగర విస్తరణ చేపట్టనున్న దృష్ట్యా జీవో 111పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. రీజనల్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న అన్ని ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తేనున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకనుగుణంగా మెగా మాస్టర్ ప్లాన్–2050 రూపొందించాలని ఆయన హెచ్ఎండీఏను ఆదేశించారు. దీంతో ట్రిపుల్ వన్ పరిధిలోని 82 గ్రామాలను మెగా మాస్టర్ ప్లాన్‌లో విలీనం చేస్తారా, లేక త్రిబుల్ వన్ జీవోను యధాతథంగా కొనసాగిస్తారా అనే అంశంపైన సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌తోపాటు, సైబరాబాద్, పాత ఎంసీహెచ్, ఎయిర్‌పోర్టు, జీహెచ్ఎంసీ మాస్టర్ప్లాన్లు అమల్లో ఉన్నాయి. ఈ ఐదింటిని కలిపి ఒకే బృహత్తర మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని, ట్రిపుల్ వన్‌లోని ప్రాంతాలను కూడా మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి తేవాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు అప్పట్లో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేశారు. కానీ హైకోర్టు ఆదేశాలతో తిరిగి యదాతథస్థితి కల్పించవలసి వచ్చింది. ఈ క్రమంలో బృహత్తర మాస్టర్ప్లాన్పైన హెచ్ఎండీఏ ఇప్పటికే కసరత్తు చేపట్టింది. కానీ తాజా ప్రతిపాదనల మేరకు మెగా మాస్టర్‌ప్లాన్–2050పైన దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న 7000 చదరపు కిలోమీటర్ల హెచ్ఎండీఏ పరిధిని మరో 3000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తూ భారీ మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తే ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్న ట్రిపుల్ వన్ జీవోలోకి వచ్చే 82 గ్రామాల్లో ఉన్న సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి కూడా ఈ మాస్టర్‌ప్లాన్‌లో భాగం కానుంది. పరిరక్షణపై నీలినీడలు... ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల పరివాహక ప్రాంతాలను కాపాడేందుకు 1996లో ప్రభుత్వం జీవో 111ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ పరిధిలోని 82 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి విస్తరించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక స్థాయిలో ఈ జీవో చర్చనీయాంశమవుతూనే ఉంది. మరోవైపు జీవోను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ పర్యావరణ సంస్థలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. జీవోకు విఘాతం కలిగించే చర్యలపైన కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం మరోసారి ఈ జీవోను కదిలించింది. 82 గ్రామాలకు చెందిన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జీవోను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో జీవో 69ను కూడా తెచ్చారు. కానీ న్యాయస్థానంలో జీవో 111 అమల్లోనే ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టతనివ్వడంతో తీవ్రమైన సందిగ్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. భారీగా అక్రమ నిర్మాణాలు... ఒకవైపు ఇలా వివిధ రకాలుగా ట్రిపుల్ వన్ జీవోను నిర్వీర్యమవుతున్న పరిస్థితుల్లోనే అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వట్టినాగులపల్లి, పుప్పాలగూడ, తదితర ప్రాంతాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే అడ్డగోలుగా చేంజ్ ఆఫ్ లాండ్ యూజ్ సర్టిఫికెట్లను ఇచ్చేశారు. మరోవైపు రియల్ఎస్టేట్ వర్గాలు, నిర్మాణ సంస్థలు భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఈ అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. శంషాబాద్, శంకర్పల్లి, తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. ‘శంషాబాద్ పరిధిలోని శాతంరాయి, పెద్ద తుప్రా, ముచ్చింతల్ వంటి ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ఆ తరువాత అనుమతులు తీసుకుంటున్నారు.’ అని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ఏం చేస్తారు... ఇలా అన్ని విధాలుగా జీవో 111 ప్రమాదంలో పడిన దృష్ట్యా మెగామాస్టర్ ప్లాన్‌పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కన్జర్వేషన్ జోన్లో ఉన్న ప్రాంతాలను అలాగే ఉంచి మిగతా ప్రాంతాలకు మాస్టర్‌ప్లాన్ విస్తరిస్తారా లేక, ఈ జీవోలోని గ్రామాల కోసం ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారా అనే అంశాలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. మరోవైపు మెగా మాస్టర్‌ప్లాన్ ఎప్పటి వరకు రూపొందిస్తారనేది కూడా చర్చనీయాంశమే. ట్రిపుల్ ఆర్ వరకు నిర్మాణ రంగానికి అనుమతులపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఏ ప్రమాణాలను పాటిస్తారనేది కూడా తాజాగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డీటీసీపీ పరిధిలో ఉన్న ప్రాంతాలు భవిష్యత్తులో హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. దీంతో భవన నిర్మాణాలకు హెచ్ఎండీఏ అనుమతులు తప్పనిసరి. అలాంటప్పుడు వివిధ రకాల జోన్ల విభజనపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఎలా ముందుకెళ్తారనేది కూడా రియల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
అమెరికాలో రాష్ట్రాల క్యాపిటల్ భవనాలకు బాంబు బెదిరింపులు
న్యూయార్క్: అమెరికాలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. పలు రాష్ట్రాల క్యాపిటల్ భవనాల్లో పేలుళ్లు జరుపుతామని బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా భవనాలను ఖాలీ చేయించారు. కనెక్టికట్, జార్జియా, కెంటుకీ, మిచిగాన్, మిన్నెసోటా, మిస్సిస్సిప్పి, మిచిగాన్, మోంటానా స్టేట్‌హౌస్ కార్యాలయాలకు బెదిరింపులు వచ్చాయి. దుండగులు ఈ-మెయిల్ ఐడీ ద్వారా ఆయా కార్యాలయాలకు బెదిరింపు సందేశాలు పంపించారు. దీంతో ఆయా క్యాపిటల్ భవనాలను ఖాలీ చేయించి బాంబు స్క్వాడ్ బృందాలు గాలింపు చేపట్టాయి. అయితే.. ప్రస్తుతానికి ఎలాంటి పేలుళ్ల ఆనవాల్లు లభించలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ సంస్మరణ ర్యాలీలో భారీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనక అమెరికా, ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇదే క్రమంలో అమెరికా క్యాపిటల్ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదీ చదవండి: సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్ -
ప్రపంచంలోని గొప్ప మతపరమైన భవనాలు (ఫోటోలు)
-
ఏ రైల్వే స్టేషన్ ఎప్పుడు పుట్టిందో?
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, కాజీపేట్,వరంగల్, ఖమ్మం.... ఇలాంటి ప్రముఖ రైల్వే స్టేషన్లు ఎప్పుడు స్థాపించారు.. ఎలా ఆవిర్భవించాయి ?.. వాటి పుట్టుకలో కీలక భూమిక ఎవరిది..?.. నాటి ఏ పరిస్థితి వల్ల అక్కడ స్టేషన్ ఏర్పాటైంది? –ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఇలాంటి వివరాల సేకరణలో తలమునకలై ఉన్నారు. ప్రత్యేకంగా కొంతమందిని ఇందుకోసం పురమాయించారు. సదరు సిబ్బంది ఆ వివరాల సేకరణకు ఉరుకులు పరుగులు మొదలుపెట్టారు. ఏ స్టేషన్ ఎప్పుడు ఏర్పడిందో వివరాలు తెలిస్తే.. వాటి పుట్టిన రోజు (ఆవిర్భావ దినోత్సవం) వేడుకలు నిర్వహిస్తారట. మోదీ చేసినప్రస్తావనే ఆదేశంగా భావిస్తూ.. ఇటీవల దేశవ్యాప్తంగా తొమ్మిది వందేభారత్ రైళ్లను రైల్వే శాఖ పట్టాలెక్కించింది. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జెండా ఊపి వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయన, ప్రజలను రైల్వేకు మరింత చేరువ చేసే క్రమంలో రైల్వే స్టేషన్లకు పుట్టినరోజు వేడుకలు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. తమిళనాడులోకి కోయంబత్తూరు, ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్ల భవనాలకు ఇటీవల స్థానిక రైల్వే అధికారులు ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. వీటిని ఉదహరించిన మోదీ, మిగతా వాటికి కూడా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కానీ, విధానపరంగా అలాంటి నిర్ణయం ఇప్పటి వరకు లేదని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉన్నట్టుండి ప్రధాని స్వయంగా పేర్కొనేసరికి, వెంటనే కొన్ని స్టేషన్ భవనాలకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని, ఆయా స్టేషన్లతో అనుబంధం ఉన్న ప్రముఖులు, సాధారణ ప్రయాణికులను పెద్ద సంఖ్యలో పిలిపించి అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో, సమీపంలో ఏయే స్టేషన్ల ఆవిర్భావ రోజులున్నాయో గుర్తించే పనిలో పడ్డారు. వివరాలు సేకరిస్తున్నాం ‘‘రెండు స్టేషన్ల పుట్టినరోజు వేడుకలను ప్రధాని స్వయంగా ప్రస్తావించారు. కానీ, ఇప్పటి వరకు మాకు అలాంటి నిర్ణయంపై సమాచారం లేదు. ప్రధాని స్వయంగా చెప్పారంటే, ఆదేశాలతో సంబంధం లేకుండా మేం నిర్వహించాల్సిందే. అందుకే వివరాలు సేకరిస్తున్నాం’ అని ఓ ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు. -
‘వైఎస్సార్ పర్యావరణ’ భవనాలు సిద్ధం
ఆటోనగర్(విజయవాడతూర్పు): ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అన్ని వసతులతో సొంత కార్యాలయాలను నిర్మించింది. ‘డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనాలు’ పేరిట రూ.54.43 కోట్లతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్మించిన భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. రూ.22.57 కోట్లతో విజయవాడ ఏపీఐఐసీ కాలనీలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని నిర్మించారు. కర్నూలులో రూ.15.93 కోట్లతో జోనల్ కార్యాలయం, తిరుపతిలో మరో రూ.15.93 కోట్లతో రీజనల్ కార్యాలయం నిర్మించారు. ఐదు అంతస్తుల్లో అత్యాధునిక రీతిలో ఈ భవనాల నిర్మాణం పూర్తిచేశారు. ఈ భవనాల్లో విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు సోలార్ సిస్టం, రక్షణ కోసం అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయడంతోపాటు అన్ని అంతస్తుల్లోనూ సెంట్రల్ ఏసీ, ఇతర అన్ని సదుపాయాలను కల్పించారు. త్వరలోనే ఈ భవనాలను ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పేర్లు తొలగిస్తే చరిత్ర మారదు
శ్రీనగర్: ప్రముఖ ప్రాంతాలు, కట్టడాలకున్న నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి పేర్లను తొలగించినంత మాత్రాన చరిత్ర దాగదు, మారదని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీకి చెందని ప్రతి నేత పేరును కనిపించకుండా చేస్తోందని ఆయన విమర్శించారు. అయితే, చరిత్ర ఎన్నటికీ మారదు, శాశ్వతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి, ఎన్సీ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ అబ్దుల్లాను అందరూ పిలుచుకునే షేర్ అనే పేరును ‘షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’నుంచి అధికారులు తొలగించడంపై ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం మొఘలుల 800 ఏళ్ల పాలనను చరిత్ర పుస్తకాల నుంచి తొలగించింది. దానర్థం వారు లేనట్లేనా? తాజ్ మహల్, ఎర్రకోట, జామా మసీదు, కుతుబ్‌మినార్.. తదితర చారిత్రక నిర్మాణాలకు కారకులెవరని చెబుతారు?, మనం, వాళ్లు శాశ్వతం కాదు. చరిత్ర శాశ్వతం, అది మారదు. ఎప్పటికీ అలాగే ఉంటుంది’అని అబ్దుల్లా పేర్కొన్నారు. -
గురుకుల పాఠశాల, కళాశాల భవనాలు ప్రారంభం
తాడేపల్లిగూడెం రూరల్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో రూ.22.17 కోట్లతో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల భవనాలను రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖమంత్రి మేరుగు నాగార్జున, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను వాడుకుని వదిలేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ చొరవతో విజయవాడ నడిబొడ్డున 19 ఎకరాల్లో రూ.400 కోట్ల వ్యయంతో బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రానికి దిక్సూచిగా అంబేడ్కర్ విగ్రహం నిలవనుందన్నారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పాల్గొన్నారు. -
60 కొత్త వంతెనలు
సాక్షి, హైదరాబాద్: రికార్డు స్థాయి వర్షాలతో రోడ్లు మునిగి వాహనరాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో 60 కొత్త వంతెనలను రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదించింది. తక్కు వ ఎత్తుతో ఉన్న కాజ్‌వేలు, కల్వర్టులను తొలగించి వాటి స్థానంలో వంతెనలు కట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వీటి నిర్మాణానికి రూ.1150 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో దాదాపు రూ.50 కోట్ల వ్యయం అయ్యే వంతెన జాతీయ రహదారుల మీద ఉండగా, మిగతావి రాష్ట్ర రహ దారులపై ఉన్నవి కావటం విశేషం. ఈ వంతెనలు కాకుండా, మరో 635 కల్వర్టులను కూడా ప్రతిపాదించారు. ఇక తాజా వాన లతో ములుగు జిల్లా జంపన్న వాగు మీద దొడ్ల గ్రామం వద్ద ఉన్న వంతెన, ములుగు–బుద్ధారం మధ్య రాళ్లవాగు మీద ఉన్న వంతెన, భూపాలపల్లి జిల్లా టేకుమట్ల వంతెన కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. మహబూబాబాద్‌లో మున్నేరు వాగు మీద ఉన్న వంతెన అప్రోచ్ రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. ఆ వంతెన వద్ద వరద పోటెత్తినందున దాని పటుత్వాన్ని పరిశీలించాల్సి ఉంది. రాష్ట్ర రహదారుల పునరుద్ధరణకు రూ.600 కోట్లు.. కొత్త వంతెనలతో కూడిన ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి అను మతి రావాల్సి ఉంది. రాని పక్షంలో, ప్రస్తుత వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించటంతో సరిపెట్టనున్నారు. ఈ పునరుద్ధరణ పనులకు రూ.600 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. రోడ్లు దెబ్బతిని ప్రస్తుతం వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిన చోట్ల తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర రహదారులపై తాత్కాలిక మరమ్మతులకు రూ.46 కోట్లు అవసరమని నివేదికలో పేర్కొన్నారు. జాతీయ రహదారులపై తాత్కాలిక మరమ్మతులకు రూ.36 కోట్లు విడుదల చేయాలని, దెబ్బతిన్న రోడ్ల పునురుద్ధరణ, ప్రతిపాదించిన కొత్త వంతెన, కల్వర్టుల కోసం రూ.148 కోట్లు అవసరమని జాతీయ రహదారుల విభాగం ప్రతిపాదించింది. భూపాలపట్నం జాతీయ రహదారిపై టేకులగూడెం వద్ద రూ.50 కోట్లతో వంతెన నిర్మాణానికి జాతీయ రహదారుల విభాగం ప్రతిపాదించింది. దీనికి కేంద్రప్రభుత్వం అనుమతి మంజూరు చేయాల్సి ఉంది. -
ప్రపంచంలోని టాప్ 10 ఎత్తైన భవనాలు
-
భూమిపై అసాధారణ నిర్మాణాలు
-
ప్రపంచంలోని టాప్ 10 ఆర్కిటెక్చర్ రైల్వే స్టేషన్లు
-
ప్రపంచంలోని టాప్ 10 ప్రత్యేక భవనాలు
-
కనుల విందైన స్కై విల్లాలు.. ఆకాశంలో నడక, రోడ్డు మీద పడవ!
సాక్షి, హైదరాబాద్: ‘శిలలపై శిల్పాలు చెక్కినారు..మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు..’ అన్నాడు.. ఎప్పుడో ఓ సినీకవి. ఇప్పుడు కూడా మన యువ బిల్డర్లు వినూత్న ఆలోచనలతో, అబ్బుర పరిచే కట్టడాలను నిర్మిస్తూ కనులకు విందు చేస్తున్నారు. ►హైదరాబాద్ మెహదీపట్నం నుంచి రాయదుర్గం వెళ్తుంటే.. ఆకాశంలో అటు ఇటూ నడిచేందుకు వీలుగా నిర్మించిన ఓ ఆకాశ హర్మ్యం కనిపిస్తుంది. అంటే మూడు టవర్లను కలుపుతూ స్కై ఐల్యాండ్‌ను నిర్మిస్తోంది ఓ నిర్మాణ సంస్థ. చుట్టూ పచ్చదనం మధ్య ఆకాశంలో కూర్చుని నగరాన్ని చూసేయొచ్చన్న మాట. ►అప్పా జంక్షన్ నుంచి కిస్మత్పూర్ వెళుతుంటే అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఓ భారీ పడవ దర్శనమిస్తుంది. ఇదేంటబ్బా అని ఒక్క క్షణం ఆగిచూస్తే..అదో భారీ నివాస సముదాయం. ఇవే కాదు మరెన్నో స్కై విల్లాలు, విల్లామెంట్‌లు రకరకాల పేర్లతో వినూత్న శైలిలో కొలువుదీరుతున్నాయి. నాలుగు గోడలు, పైకప్పు వంటి సాధారణ గృహాలకు కాలం చెల్లింది. ఐకానిక్ టవర్లు ఆకట్టుకునే ఎలివేషన్లతో నగరవాసుల్ని కట్టిపడేస్తున్నాయి. వినూత్న శైలి భవనాలను నగరవాసులు కోరుకుంటుండటంతో.. వారి అభిరుచికి తగ్గటుగానే యువ డెవలపర్లు నిర్మాణాలను చేపడుతున్నారు. ఆయా ప్రాంతాలకు ల్యాండ్ మార్క్ల్లా నిలిచిపోయేలా ప్రాజెక్టులకు రూపుదిద్దుతున్నారు. విదేశీ ఆర్కిటెక్ట్‌లతో.. భారీ భవన నిర్మాణాలను కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు యువ బిల్డర్లు పెద్ద కసరత్తే చేస్తున్నారు. స్థానిక బిల్డర్లతో పాటు ఇతర రాష్ట్రాల బిల్డర్లు కూడా నగరంలో ప్రాజెక్ట్‌లను చేపడుతుండటంతో ఎలివేషన్ల ఎంపికలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. ప్రపంచ స్థాయి డిజైన్ల కోసం సింగపూర్, చైనా, జపాన్, దుబాయ్ వంటి దేశాలలో పర్యటించి, క్షేత్ర స్థాయిలో అక్కడి భవన నిర్మాణాలు పరిశీలించడంతో పాటు వాటిని తీర్చిదిద్దిన ఆర్కిటెక్ట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారితో హైదరాబాద్‌లోని భవనాలకు డిజైన్లు చేయిస్తున్నారు. ఏ ప్రాంతాల్లో వస్తున్నాయంటే.. వినూత్న డిజైన్లతో కూడిన భవన నిర్మాణలు ఎక్కువగా పశ్చిమ హైదరాబాద్‌లో వస్తున్నాయి. కోకాపేట, మంచిరేవుల, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, నల్లగండ్ల, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, తెల్లాపూర్, పుప్పాలగూడ, రాయదుర్గంతో పాటు కొంపల్లి, ఆదిభట్ల వంటి ప్రాంతాలలో ఈ తరహా ప్రాజెక్ట్‌లు ఎక్కువగా వస్తున్నాయి. నగరంలోని పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ ఐకానిక్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. ధర 5–10 శాతం ఎక్కువ.. గత 3–4 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఆకాశ హరŠామ్యల నిర్మాణం జోరందుకుంది. 40 కంటే ఎత్తయిన హైరైజ్ భవనాలు చేపట్టేందుకు బిల్డర్లు పోటీ పడుతున్నారు. నేటి అవసరాలకు, కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా గ్రీనరీ, వాస్తుకు ప్రాధాన్యం ఇస్తూ ఎలివేషన్లను ఎంపిక చేస్తున్నారు. సాధారణ అపార్ట్మెంట్లతో పోలిస్తే ఐకానిక్ ప్రాజెక్ట్‌లలో ధర కొంచం ఎక్కువగా ఉంటుంది. ఆయా నిర్మాణాలకు నైపుణ్యం ఉన్న కూలీలు, భారీ యంత్రాలు, సాంకేతికత అవసరం. ఇందుకోసం బిల్డర్లు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తారు. అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ చార్జీలు ఉంటాయి. అందుకే ఈ తరహా ప్రాజెక్ట్‌ల్లో ధర 5–10 శాతం ఎక్కువగా ఉంటుంది. ఆఫీసు భవనాలు కూడా.. వాస్తవానికి నివాస సముదాయాల కంటే ఆఫీసు భవనాలను వినూత్న శైలిలో నిర్మించేందుకు బిల్డర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే నివాసాలకు వాస్తు పక్కాగా పాటించాల్సిందే. అదే ఆఫీసు బిల్డింగ్‌లకు కొంత వెసులుబాటు ఉంటుంది. టాటా, మైక్రోసాఫ్ట్, డెలాయిట్ వంటి ఇతర దేశీ, విదేశీ సంస్థలు వినూత్న శైలి నిర్మాణాలనే కోరుకుంటాయి. ఐకియా, టీ–హబ్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ భవనాలు ఆఫీసు విభాగంలో యూనిక్ బిల్డింగ్స్ కోవలోకే వస్తాయి. త్వరలోనే పశ్చిమ హైదరాబాద్‌లో ఓ నిర్మాణ సంస్థ వృత్తం, పెంటాగాన్ ఆకారంలో కార్యాలయ నిర్మాణాలు చేపట్టనుంది. కొత్తదనం కోరుకుంటున్నారు ఆభరణాలు, దుస్తులు, సంగీతం ప్రతి దాంట్లో కొత్తదనాన్ని కోరుకున్నట్లే ఇప్పుడు చాలామంది ఇంటి నిర్మాణ శైలిలోనూ కొత్తదనం కోరుకుంటున్నారు. డబ్బా ఆకారంలో ఇళ్లను ఇష్టపడటం లేదు. చూడటానికి వినూత్నంగా ఆ ప్రాంతానికే ల్యాండ్‌మార్క్‌లా నిలిచే ప్రాజెక్ట్‌లను కోరుకుంటున్నారు. – జి.రామ్మోహన్, చీఫ్ ఆర్కిటెక్ట్, మోహన్ కన్సల్టెంట్స్ -
ప్లాస్టిక్ భవంతి
ప్లాస్టిక్ చెత్త ప్రపంచవ్యాప్త సమస్య. పేరుకుపోతున్న ప్లాస్టిక్ చెత్తలో రీసైక్లింగ్ జరుగుతున్నది చాలా తక్కువే! రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్‌ను అర్థవంతంగా వినియోగించు కుంటున్న సందర్భాలు మరింత అరుదు.రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్‌ను అర్థవంతంగా వినియోగించుకున్న తీరుకు ఈ ఫొటోలో కనిపిస్తున్న భవనమే ఉదాహరణ. ఇది తైవాన్ రాజధాని తైపీ నగరంలో ఉంది. ‘ఎకో ఆర్క్’ పేరిట నిర్మించిన ఈ భవంతి ముందు భాగంలోని నిర్మాణమంతా రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో చేపట్టడం విశేషం. ఏకంగా పదిహేను లక్షల ప్లాస్టిక్ బాటిళ్లతో ఈ నిర్మాణం చేపట్టారు. వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను నేరుగా వాడకుండా, వాటిని కరిగించి, మళ్లీ బాటిల్స్‌గా తయారు చేసి ముందుభాగం నిర్మాణానికి ఉపయోగించారు. వీటిని ఒకేరకమైన ఆకృతిలో, ఒకే పరిమాణంలో తయారు చేశారు. దీనివల్ల వీటిని సులువుగా ఉక్కుఫ్రేమ్లో ఒకదానినొకటి జోడించి, చతురస్రాకారపు ప్యానెళ్లుగా అసెంబుల్ చేసి, పటిష్ఠంగా భవంతిని నిర్మించారు. భవనంలోని మిగిలిన భాగాలను రీసైకిల్డ్ ప్లాస్టిక్ ఇటుకలతో నిర్మించారు.ఈ భవంతికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఇందులో రాత్రివేళ వెలిగే 40వేల ఎల్ఈడీ బల్బులకు కావలసిన మొత్తం విద్యుత్తును సోలార్ ప్యానెల్స్, విండ్ మిల్స్ ద్వారా అక్కడికక్కడే ఉత్పత్తి చేస్తారు. ప్లాస్టిక్ బాటిళ్లు పారదర్శకంగా ఉండటం వల్ల పగటివేళలో వెలుతురు కోసం విద్యుత్ బల్బులు వాడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. కాబట్టి దీనివల్ల వాతావరణంలోని కర్బన ఉద్గారాల సమస్య కూడా పెద్దగా ఉండదు.కాంక్రీట్ భవంతితో పోల్చుకుంటే, దీని బరువు సగాని కంటే తక్కువగానే ఉంటుంది. అలాగని దీని దారుఢ్యాన్నేమీ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటారా? తుపానులు చెలరేగినప్పుడు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వీచే పెనుగాలులనైనా ఈ భవంతి ఇట్టే తట్టుకోగలదు. అగ్నిప్రమాదాల నుంచి రక్షణ కోసం, నిప్పు తగులుకోకుండా దీనికి ప్రత్యేకమైన రసాయన కోటింగ్ కూడా పూశారు. కాబట్టి, తుపానులు, అగ్నిప్రమాదాల వల్ల ఈ భవంతికి వచ్చే ముప్పేమీ ఉండదు.తైపీలో ఏడేళ్ల కిందట జరిగిన అంతర్జాతీయ ప్రదర్శన కోసం అర్థర్ హువాంగ్ అనే డిజైనర్ ఈ భవంతిని ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. తైవాన్‌లో ఏటా చెత్తలోకి చేరుకుంటున్న 45 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లను పునర్వినియోగంలోకి తెచ్చే ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమతో, పట్టుదలతో ఈ భవంతికి రూపకల్పన చేశాడు. దీని నిర్మాణం కోసం 3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.25 కోట్లు) ఖర్చయింది. ఇస్మాయిల్ -
ఈఎస్ఐ డిస్పెన్సరీలకు శాశ్వత భవనాలు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ చందాదారులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర కార్మిక శాఖ కార్యాచరణ చేపట్టింది. క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేస్తున్న ఈఎస్ఐ డిస్పెన్సరీలకు అన్ని రకాల వసతులతో శాశ్వత భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 71 డిస్పెన్సరీలున్నాయి. ఇవిగాకుండా కొత్తగా 14 డిస్పెన్సరీలను ఈఎస్ఐ కార్పొరేషన్ మంజూరు చేసింది. ప్రస్తుతమున్న డిస్పెన్సరీల్లో 65 డిస్పెన్సరీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె కాంట్రాక్టు గడువు ముగియడంతో కొన్నింటిని పలుమార్లు మార్పు చేసిన సందర్భాలున్నాయి. డిస్పెన్సరీల మార్పులతో అటు రోగులకు, ఇటు వైద్యులు, సిబ్బందికి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు శాశ్వత భవనాల నిర్మాణానికి కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి డిస్పెన్సరీకి శాశ్వత భవనంకోసం అనువైన స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు అనువైన స్థలాల గుర్తింపు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని కోరింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. స్థలాలు గుర్తిస్తే వెంటనే భవన నిర్మాణం.. ప్రస్తుతం స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని కార్మిక శాఖ భావిస్తోంది. ఈ దిశగా చర్యలు వేగవంతం చేసింది. స్థలాలను గుర్తిస్తే వెంటనే భవన నిర్మాణాలను చేపట్టేందుకు కార్మిక శాఖ సిద్ధంగా ఉంది. గతవారం ఈఎస్ఐసీ ప్రాంతీయ బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిస్పెన్సరీలకు శాశ్వత నిర్మాణాలపైనా చర్చించారు. ఈ క్రమంలో ఈఐఎస్‌ఐసీ ఉన్నతాధికారులు స్పందిస్తూ శాశ్వత భవనాలను నిర్మించేందుకు అవసరమైన నిధులను ఇచ్చేందుకు కార్పొరేషన్ సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు ఒక్కో భవనానికి రూ.50 లక్షలు వెచ్చించేందుకు ముందుకు వచ్చారు. ఈ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిసహాయ సహకారాలను తీసుకుంటామని వివరించారు. చందాదారుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. -
ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్ డిమాండ్, అవే కావాలంటున్న ప్రజలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు 6–10 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ వెల్లడించింది. 2023–24లో 3–5 శాతం ధరలు దూసుకెళ్లవచ్చని అంచనా వేస్తోంది. ముడి సరుకు వ్యయాలు, కూలీ, స్థలాల ధరలు అధికం కావడమే ఇందుకు కారణమని వివరించింది. హైదరాబాద్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, నేషనల్ క్యాపిటల్ రీజియన్, బెంగళూరు, పుణే, కోల్‌కత నగరాల ఆధారంగా క్రిసిల్ రూపొందించిన నివేదిక ప్రకారం.. రెసిడెన్షియల్ విభాగంలో పెద్ద రియల్టర్లు 2022–23లో 25 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10–15 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేయబోతున్నారు. అమ్మకం కాని ఇళ్ల స్థాయి 4 నుండి 2.5 సంవత్సరాలకు వచ్చి చేరింది. ఇది పెద్ద రియల్టర్ల క్రెడిట్ ప్రొఫైల్‌ను బలపరుస్తుంది. ఖరీదైన ఇళ్లకు డిమాండ్.. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల్లో మహమ్మారి ముందు పెద్ద రియల్టర్ల వాటా 30 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 40–45 శాతం ఉండే అవకాశం ఉంది. పరిశ్రమలో పెద్ద రియల్టర్ల వాటా 2022–23లో 24 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25 శాతానికి చేరనుంది. మహమ్మారి ముందు కాలంలో ఇది 14 శాతం నమోదైంది. 2020కి ముందు రూ.1.5 కోట్లు ఆపైన ఖరీదు చేసే ఇళ్ల వాటా 25–30 శాతం. ఇప్పుడు ఇది ఏకంగా 40–45 శాతానికి ఎగసింది. రూ.40 లక్షల లోపు ఉండే అందుబాటు ధరల గృహాల వాటా 30 నుంచి 10 శాతానికి పరిమితం అయింది. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో పెద్ద రియల్టర్లు వాటాల విక్రయం,ఆస్తుల అమ్మకం ద్వారా రూ.18,000 కోట్లు అందుకున్నారు. ఈ సంస్థల ఆస్తుల్లో అప్పుల నిష్పత్తి 2023 మార్చి నాటికి 23 శాతం, 2024 మార్చికల్లా 21 శాతంగా ఉండనుంది. చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
టిక్ టిక్ టిక్.. నోయిడా జంట భవనాల కూల్చివేత
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాల కూల్చివేతకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల్లో దడ మొదలైంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ జంట భవనాలను ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకి కూల్చివేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్క బటన్ నొక్కడంతో 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు కేవలం 10 సెకండ్లలోపే పేకమేడల్లా నేలమట్టం కానున్నాయి. భవనాల కూల్చివేతను చేపట్టిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ సీఈఓ ఉత్కర్ మెహతా శనివారం పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూల్చివేతపై ఎలాంటి భయాలు వద్దని తాము చేపట్టిన ప్రక్రియ 150 శాతం సురక్షితమైనదని హామీ ఇచ్చారు. వాటర్‌ఫాల్ ఇంప్లోజన్ టెక్నిక్ ఈ తరహా భవనాలు కూల్చివేయడానికి మూడు మార్గాలున్నాయి. డైమండ్ కటర్, రోబోటిక్ టెక్నిక్, పేలుడు పదార్థాలు.. ఇలా మూడు రకాలుగా భవనాల్ని కూల్చేయవచ్చు. అయితే కూల్చడానికయ్యే ఖర్చు, సమయం, భద్రత అంశాలను దృష్టిలో ఉంచుకొని పేలుడు పదార్థాల ద్వారా ‘‘కంట్రోల్డ్ ఇంప్లోజన్ ’’ (వాటర్‌ఫాల్ ఇంప్లోజిన్) విధానంతో కొన్ని సెకండ్లలో కూల్చేయనున్నారు. ఈ టెక్నిక్‌ను 1773లో ఐర్లాండ్‌లోని వాటర్‌ఫోర్డ్‌లో హోలీ ట్రినిటీ కేథడ్రాల్ భవనం కూల్చివేతకు తొలిసారిగా ఉపయోగించారు. 2020లో కేరళలోని కొచికి సమీపంలో మారాడు పట్టణంలో కోస్తా తీర ప్రాంత నిబంధనలను అతిక్రమించి నిర్మించిన నాలుగు లగ్జరీ అపార్ట్మెంట్లను కూడా పేలుడు పదార్థాలను వినియోగించి కూల్చివేశారు. వంతెనలు, సొరంగాలు, భవనాలు, ఇతర నిర్మాణాలను కూల్చివేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ విధానమే అత్యంత భద్రమైనదని తేలింది. వాయు కాలుష్యంతో అనారోగ్య సమస్యలు జంట భవనాల కూల్చివేత సమయంలో తమ ఇళ్లకి ఏం జరుగుతుందోనని, దుమ్ము ధూళి కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయేమోనని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనాల కూల్చివేత సమయంలో వచ్చే ధూళి కొన్ని వారాల పాటు గాల్లోనే ఉండడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు రావచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశంలో అత్యంత కాలుష్య నగరాల్లో నోయిడా ముందు వరసలోనే ఉంది. ఇప్పుడు వాయుకాలుష్యం మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఆ భవనాల పక్కనే ఉన్న ఎమరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్‌లో ఉంటున్న 5 వేల మందికిపైగా ఆదివారం ఉదయం ఇళ్లు ఖాళీ చేసి వెళ్లనున్నారు. ‘‘మేము చాలా ప్రమాదంలో ఉన్నాం. భవనాల కూల్చివేత సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా మా ఇళ్లు ఏమయిపోతాయోనన్న భయాన్ని మాటల్లో చెప్పలేను’’ అని సీనియర్ రెసిడెంట్ ఆర్కె రస్తోగి ఆందోళన వ్యక్తం చేశారు. ఏటీఎస్ విలేజ్‌లో నివాసం ఉండే మౌసమి భవనాల కూల్చివేసిన తర్వాత ఏర్పడే దుమ్ము, ధూళికి ఎలాంటి శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. నోయిడా జంట భవనాల నిర్మాణం : 2012 రెండు జంట భవనాలు : అపెక్స్ (32 అంతస్తులు), సియాన్ (29 అంతస్తులు) భవనాలకు చేసిన రంధ్రాలు : 9,600 నింపిన పేలుడు పదార్థాలు : 3,700 కేజీలకు పైగా టవర్స్ నిర్మాణ వ్యయం : రూ.70 కోట్లు కూల్చివేతకు ఖర్చు : రూ.20 కోట్లు శిథిలాలు : 55,000 నుంచి 80 వేల టన్నులు శిథిలాల తరలింపునకు పట్టే సమయం: 3 నెలలు -
ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాలు కలిగిన నగరం ఏమిటో తెలుసా?
మహానగరాలంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఆకాశహర్మ్యాలే.. నింగిని తాకేలా ఉండే ఈ భవనాలను చూసి అచ్చెరువొందని వారు ఉండరు. ఇంతకూ మీకీ విషయం తెలుసా? ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాలు కలిగిన నగరం ఏమిటో? ఏ అమెరికాదో అయి ఉంటుందని అనుకుంటున్నారు కదూ.. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యాలు కలిగిన నగరం చైనాలోని షెంజెన్. 200 మీటర్లు(దాదాపుగా 60 అంతస్తులు) అంతకన్నా ఎక్కువ ఎత్తున్న భవనాలు ఇక్కడ 120 ఉన్నాయట. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా(828 మీటర్లు) ఉన్న దుబాయ్ తర్వాతి స్థానంలో నిలిచింది. టాల్ బిల్డింగ్స్ అండ్ అర్బన్ హ్యాబిటాట్ కౌన్సిల్ విడుదల చేసిన జాబితాలో అత్యధికంగా చైనాలోని నగరాలే ఉన్నాయి. 27వ స్థానంలో ముంబై ఉంది. కోల్‌కతా 199వ స్థానంలో(ఒకే భవనం) ఉంది. షెంజెన్‌కి సంబంధించి మరో విశేషం ఏమిటంటే.. ఇక్కడ 159 మీటర్లు అంతకన్నా ఎక్కువ ఎత్తున్న 162 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందులో ఓ 40 భవనాలను ఈ ఏడాదే ప్రారంభించనున్నారు. అంటే.. భవిష్యత్తులో ఈ కేటగిరీలో షెంజెన్‌ను కొట్టేవాడు లేడన్నమాట. చదవండి: ఇదీ ఆకాశహర్మ్యమే..కానీ మనుషుల కోసం కాదు.. 200 మీటర్లు అంతకన్నా ఎక్కువ ఎత్తున్న భవనాలు కలిగిన నగరాలు(టాప్–10) -
బహుళ అంతస్తుల భవనం... ఏకంగా 127 ఫ్లాట్లు...ఉండేది ఒకే ఒక్కడు!
కాల పరిమితి దాటిని బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చడం సహజం. నివాసితులను అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పి సదరు బిల్డర్లు ఎంతో కొంత డబ్బులు చెల్లించడం వంటివి జరుగుతుంది. అలానే ఇక్కడొక భవనాన్ని కూల్చేయలనుకున్నారు. అందుకోసం నివాసితులను ఖాళీ చేయించారు కూడా. కానీ ఒకే ఒక్కడు మాత్రం ఆ భవనాన్ని ఖాళీ చేసి వెళ్లటం లేదు. ఒంటరిగా అక్కడే ఉంటున్నాడు. వివారల్లోకెళ్తే....బ్రిటన్‌లోని స్కాట్లాండ్లో నార్త్ లానార్క్‌షైర్ కౌన్సిల్లో ఒక బహుళ అంతస్తుల భవనం ఉంది. అందులో ఏకంగా 127 ఫ్లాట్లు ఉన్నాయి. అయితే నగరానికి దూరంగా ఉండటం పెద్ద పెద్ద గాలులకు అద్దలు పగిలిపోవడం, దొంగలు పడటం తరుచుగా జరుగుతోందని ఫిర్యాదలు రావడంతో ఆ భవనాన్ని కూల్చివేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో ఆ భవనంలోని నివాసితులందర్నీ ఖాళీ చేయించారు. ఐతే ఒకే ఒక్క వ్యక్తి నిక్ విస్నీవ్సీక్ అనే వ్యక్తి మాత్రం ససేమిరా ఖాళీ చేయనని చెప్పేశాడు. పైగా అతనోక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. ఆఖరికి కౌన్సిల్ అతనకి సుమారు రూ. 34 లక్షలు తోపాటు మరోచోట అద్దెకున్నందుకు అక్కడ అద్దెను కూడా రెండేళ్ల వరకు చెల్లిస్తామని మంచి ఆఫర్ కూడా ఇచ్చింది. అయినా కుదరదని నిక్ తెగేసి చెప్పేశాడు. దీంతో కౌన్సిల్ అతను వెళ్లిపోవాలని ఆ భవనం శుభ్రం చేయకుండా, సెక్యూరిటీని తీసేసి, పట్టించుకోకుండా వదిలేసింది. అయినా అతను తన ప్లాట్‌ని వదిలి వెళ్లనని, వాళ్లు ఇచ్చే డబ్బులుతో మరో ఫ్లాట్ కొనేందుకు సరిపోవని అన్నాడు. నిక్ రైట్ టు బై స్కీమ్ కింద ఆ ఫ్లాట్‌ని 2017లో కొనుక్కున్నాడు. తాను ఒంటరిగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉంటాననే చెబుతున్నాడు. కౌన్సిల్ మాత్రం ఇది సున్నితమైన సమస్య అతన్ని ఎలాగైన ఖాళీ చేయిస్తానని చెబుతోంది. (చదవండి: Viral Video: ఎంత పెద్ద మనసు ఆ చిన్నారులది!) -
ఆకాశానికి భవంతులు
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా పుట్టపర్తి పట్టణంలో భవనాలు ఆకాశానికి లేచాయి. నిబంధనలకు విరుద్ధంగా గత టీడీపీ హయాంలో పది అంతస్తుల వరకు ఆ పార్టీ నేతలు నిర్మించారు. అందులో కొన్ని పూర్తి కాగా.. ఇంకొన్ని ఇప్పటికీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అత్యంత ఎత్తైన భవనాల్లో ఏ ఒక్కదానికీ అనుమతులు లేవు. అయినా మున్సిపల్ అధికారులు, పుడా (పుట్టపర్తి అర్బన్ డెవపల్‌మెంట్ అథారిటీ) అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సాక్షి, పుట్టపర్తి: జిల్లా కేంద్రం పుట్టపర్తిలో అపార్ట్మెంట్ కల్చర్ అధికంగా ఉంది. అయితే తీసుకున్న అనుమతులుకు.. నిర్మిస్తున్న భవనాలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. అడిగేవారు లేరని అత్యంత ఎత్తయిన భవనాలు నిర్మించేస్తున్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం ‘జీ ప్లస్ టూ’ అంటే మొదటిది కాకుండా మరో రెండు అంతస్తులు నిర్మించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ అంతస్తులు నిర్మించాలంటే పుడా (పుట్టపర్తి అర్బన్ డెవపల్‌మెంట్ అథారిటీ) నుంచి అనుమతులు తీసుకోవాలి. ముందుగా దరఖాస్తు చేసుకుని అనుమతులు జారీ అయిన తర్వాతనే భవనాలు నిర్మించాలి. అయితే పుట్టపర్తిలో వందకు పైగా భవనాలు 10 అంతస్తుల వరకు ఉన్నాయి. వాటికి మున్సిపాలిటీ అనుమతులు మాత్రమే ఉన్నాయి. రెండు అంతస్తులకు అనుమతులు తీసుకుని.. మూడు నాలుగు రెట్లు ఎక్కువ అంతస్తులు నిర్మించారు. అయినా ఇంతవరకు యజమానులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. నిబంధనలు ఇవే.. పుట్టపర్తి పట్టణ అభివృద్ధి సంస్థ (పుడా) నిబంధనల ప్రకారం రెండంతస్తుల కంటే ఎక్కువ ఎత్తు నిర్మించాలంటే ముందుగా అనుమతులు తీసుకోవాలి. లే అవుట్ అయితే 10 శాతం స్థలాన్ని ముందుగా పుడాకు అప్పజెప్పాలి. ఆ తర్వాతే నిర్మాణాలు మొదలుపెట్టాలి. భవనాల చుట్టూ ఎత్తు ఆధారంగా పుడా నిర్ణయించిన మేరకు స్థలం వదలాల్సి ఉంటుంది. కనీసం 7.5 సెంట్ల కంటే ఎక్కువ స్థలం అయితేనే పుడా పరిధిలోకి వస్తుంది. లేదంటే రెండు కంటే ఎక్కువ అంతస్తులు అయి ఉండాలి. అంతకంటే తక్కువ అయితే మున్సిపాలిటీ అనుమతి తప్పనిసరి. అయితే ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కి భారీ భవనాలు వెలిశాయి. టీడీపీ హయాంలో చేపట్టిన నిర్మాణాల్లో కొన్ని... కమ్మవారిపల్లికి చెందిన నారాయణప్ప మున్సిపల్ కార్యాలయం ఎదురుగా తొమ్మిది అంతస్తుల భవనం నిర్మించారు. దీనికి ఎలాంటి అనుమతులూ తీసుకోలేదు. కమ్మవారిపల్లికి చెందిన మోర్ ఆదెప్ప గ్రౌండ్ ఏరియాలో 10 అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. కొన్ని అంతస్తులు పూర్తయి నివాసం ఉంటున్నారు. పైన ఇంకొన్ని నిర్మాణంలో ఉన్నాయి. డ్వాక్రా బజారు వెనుక రోడ్డులో కొందరు ఉపాధ్యాయులు సంయుక్తంగా 8 అంతస్తుల భవనం నిర్మించారు. గోకులంలో టీచర్ వెంకటేశ్.. 9 అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. అందులో మొత్తం 80 ఫ్లాట్లు ఉన్నాయి. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. నోటీసులు ఇచ్చాం నిబంధనలను ఉల్లంఘించి భవనాలు నిర్మించిన వారికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశాం. మరోసారి సర్వే నిర్వహించి.. ఇంకెంత మంది ఉన్నారో అందరికీ నోటీసులు ఇస్తాం. మున్సిపాలిటీ పరిధి జీ ప్లస్ టూ వరకు మాత్రమే. ఆ పై అంతస్తులకు పుడా ముందస్తు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా చట్టరీత్యా చర్యలకు ఆదేశిస్తాం. అనుమతులు లేకుండా ఇప్పటికే పూర్తి చేసిన భవనాలకు దాని విలువలో 20 శాతం మేర జరిమానా విధిస్తాం.. లేదంటే మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. – కేఎన్ నరేశ్ కృష్ణ, పుడా వైస్ చైర్మన్ -
కొత్త మెడికల్ కాలేజీలపై టెన్షన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాబోయే వైద్య విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తీసుకురావాలనుకున్న 8 కొత్త మెడికల్ కాలేజీలపై టెన్షన్ నెలకొంది. ఈ కాలేజీలకు సంబంధించి తాత్కాలిక భవనాలు ఇంకా పూర్తికాకపోవడం కలవరపెడుతోంది. కొత్తగా కడుతున్న కాలేజీ భవనాలను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సభ్యుల బృందం ఈమధ్య ఓసారి వచ్చి చూసి లోపాలు తెలియజేసినా వైద్యారోగ్య యంత్రాంగం ఇంకా సరిదిద్దలేదు. త్వరలో మరోసారి ఎన్ఎంసీ బృందం పరిశీలనకు రానుండటంతో అప్పటికీ లోపాలు సరిదిద్దకపోతే, భవనాలు పూర్తికాకపోతే అనుమతులపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే అనుమతుల కోసం కేంద్రం వద్దకు వెళ్లి వేడుకోవాల్సిన పరిస్థితి రానుంది. 8 కాలేజీలకు రూ.4,080 కోట్లు రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 9 మెడికల్ కాలేజీలున్నాయి. 2022–23 వైద్య విద్యా సంవత్సరం నుంచి మరో 8 కాలేజీలు ఒకేసారి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కాలేజీ స్థాపనకు ప్రభుత్వం రూ. 510 కోట్లు కేటాయించింది.8 కాలేజీలకు రూ. 4,080 కోట్లు ఖర్చు కానుంది. ప్రతి కాలేజీకి కనీసం 20 ఎకరాల భూమి ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో భవనాల నిర్మాణం ఆర్‌అండ్‌బీకి అప్పగించారు. 4 కాలేజీలు సిద్ధం కావొచ్చేమో.. కాలేజీ భవనాలను శాశ్వత పద్ధతిలో నిర్మించాలంటే కనీసం 18 నెలలు పడుతుంది. కాబట్టి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో మొదటి ఏడాది తరగతుల కోసం కాలేజీ భవనం, పరిపాలనా భవనం, హాస్టల్ తాత్కాలికంగా నిర్మించాలని నిర్ణయించారు. అలాగే పరికరాలు, మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. హాళ్లు, ల్యాబ్‌లు, లైబ్రరీ, డెమో గదులు నిర్మించాలి. అయితే ఎక్కడా కూడా పూర్తిస్థాయిలో భవన నిర్మాణాలు పూర్తవలేదని అధికారులు చెబుతున్నారు. మరోసారి ఎన్ఎంసీ వచ్చే నాటికి 4 కాలేజీల నిర్మాణం పూర్తి కావొచ్చని భావిస్తున్నారు. మిగిలిన వాటికి అనుమతులు తీసుకురావడం కష్టమైన వ్యవహారంగా మారనుంది. కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎంత కృషి చేస్తున్నా వైద్యారోగ్య శాఖ యంత్రాంగం కొంత నిర్లక్ష్యం వహిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సక్రమంగా ఉంటే అనుమతి.. ఎన్ఎంసీ బృందం మళ్లీ వచ్చే నాటికి నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉంటే వాటికి అనుమతులు మంజూరు చేస్తారు. ఆ మేరకు వచ్చే వైద్య విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్ తరగతులు నిర్వహించుకోవచ్చు. పైగా వచ్చే నీట్ పరీక్ష తర్వాత కాలేజీల పేర్లు నోటిఫై చేసే నాటికి వీటి జాబితా ఖరారు కావాలి. లేకుంటే చిక్కులే. సగం కాలేజీలు పూర్తయితే మిగతా కాలేజీలకు అనుమతుల కోసం కేంద్రం వద్దకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) సహా సంబంధిత అధికారులు వెళ్లి ప్రత్యేక హామీ పత్రం ఇచ్చి రావాల్సి ఉంటుంది. తరగతులు ప్రారంభమయ్యే నాటికి వాటిని కూడా నిబంధనల ప్రకారం పూర్తి చేస్తామన్న గ్యారంటీ ఇవ్వా లి. అందుకు ఒప్పుకుంటే అనుమతులిస్తాయి. ఈ పరిస్థితి వచ్చిందంటే కాంట్రాక్టర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. తరగతులు ప్రారంభించేందుకు కీలకమైన తాత్కాలిక భవనాలను గత నవంబర్, డిసెంబర్ నాటికే పూర్తి చేయాలకున్నా ఆలస్యమైంది. -
నిర్మాణాల ఆయుష్షు పెంచుతుంది!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: భవనాలు, వంతెనలు, ఇతర నిర్మాణాలు మరింత కాలం దృఢంగా ఉండేందుకు తోడ్పడే ప్రత్యేక మెటీరియల్‌ను హైదరాబాద్ ఐఐటీ పరిశోధన విభాగం అభివృద్ధి చేసింది. పాత నిర్మాణాలను బలోపేతం చేయడం కోసం స్టీలు, కాంక్రీట్‌కు బదులుగా.. తాము రూపొందించిన ‘హైబ్రిడ్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్ (ఎఫ్ఆర్పీ)’ను వినియోగించవచ్చని ఐఐటీహెచ్ ప్రొఫెసర్ సూర్యప్రకాశ్ తెలిపారు. స్టీల్‌ప్లేట్లు, కాంక్రీట్ కంటే ఎఫ్ఆర్పీ దృఢత్వం, సామర్థ్యం ఎక్కువ అని ఐఐటీలోని క్యాస్ట్‌కాన్ ల్యాబ్‌లో నిర్వహించిన పరిశోధనలో తేలిందని చెప్పారు. ‘పెద్ద పెద్ద భవనాలు, బ్రిడ్జిలు, ఇతర నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్న కొద్దీ దృఢత్వాన్ని కోల్పోతుంటాయి. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, పేలుళ్లు వంటివాటితో నిర్మాణాలు దెబ్బతింటాయి. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన రైల్వే, రోడ్డు వంతెనలు బలహీనమవుతుంటాయి. వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలంటే వ్యయప్రయాసలతో కూడిన విషయం. కానీ ఎఫ్ఆర్పీని వినియోగించి మరమ్మతులు, మార్పులు, చేర్పులు చేయడంతో ఆ నిర్మాణాల దృఢత్వాన్ని పెంచవచ్చు. వాటి ఆయుష్షును కూడా మరో 20 ఏళ్లవరకు పొడిగించవచ్చు. ఎఫ్ఆర్పీని వినియోగించడం వల్ల ఆయా నిర్మాణాల పరిమాణంలో మార్పులు ఉండవు. బరువు కూడా తక్కువగా ఉంటుంది’’అని సూర్యప్రకాశ్ వెల్లడించారు. దేశ అభివృద్ధికి ఊతం ఎఫ్ఆర్పీని అభివృద్ధి చేసిన ప్రొఫెసర్ సూర్యప్రకాశ్ నేతృత్వంలోని పరిశోధన బృందాన్ని ఐఐటీ హెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అభినందించారు. ఈ పరిశోధన దేశంలో మౌలిక సదుపాయాలకు దీర్ఘాయువును ఇస్తుందన్నారు. మౌలిక సదుపాయాల పరిరక్షణ, వాటి జీవితకాలాన్ని పెంచడం దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. -
పెద్ద ఇళ్లు కావాలి
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి తర్వాతి నుంచి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులొచ్చాయి. ఎక్కువ విస్తీ ర్ణం ఉన్న గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌లు కొనసాగుతుండటంతో ఇంట్లో ప్రత్యేకంగా ఒక గది ఉండాలని కస్టమర్లు భావిస్తున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టుగానే డెవలపర్లు కూడా పెద్ద సైజు గృహ ప్రాజెక్ట్‌లనే నిర్మిస్తున్నారు. 1,100 చ.అ. నుంచి 1,300 చ.అ.ల్లోని 2 బీహెచ్‌కే, 1,500 చ.అ. నుంచి 2,500 చ.అ.ల్లోని 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్లకు డిమాండ్ ఏర్పడిం దని 99ఎకర్స్.కామ్ వెబ్‌పోర్టల్ సర్వేలో తేలింది. నానక్‌రాంగూడ, కోకాపేట, నార్సింగి, కొం డాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. మణికొండ, కూకట్పల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతా ల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. చందానగర్‌లో అద్దెల వృద్ధి 3.54 శాతం, టోలిచౌకీలో 3.42 శాతం, మియాపూర్‌లో 3.10 శాతం, మణికొండలో 3.34 శాతం, కూకట్‌పల్లిలో 3.04 శాతం, గచ్చిబౌలిలో 2.98 శాతం, కొండాపూర్‌లో 3.11 శాతం, హైటెక్‌సిటీలో 3.15 శా తంగా ఉంది. హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దాదాపు 12 వేల ఇన్వెంటరీ ఉంది. భూముల ధరలు, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో గృహాల ధరలు పెరిగాయి. రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షలకు పెరిగాయి. -
భలే ఉన్నాయ్.. తాబేళ్లు కావు, హోటల్ భవనాలు
ఏరియల్ వ్యూలో తీసిన ఫొటో ఇది. ఇందులో తాబేళ్లు వరుసగా కొలువుదీరినట్లు కనిపిస్తోంది కదూ! ఇవి తాబేళ్లు కావు, హోటల్ భవనాలు. థాయ్‌లాండ్‌లోని హువాహిన్ ప్రాంతంలో ఉన్న ఖావో తావో రిజర్వాయర్‌లో ఇలా తాబేలు ఆకారంలో నీటిలో తేలియాడే హోటల్ భవంతులను నిర్మించారు. (క్లిక్: సగం కొట్టేసిన బిల్డింగ్‌లా కనిపిస్తోందా.. అలా అనుకుంటే పొరపాటే!) పూర్తిగా వెదురుతోను, స్థానికంగా దొరికే ప్రకృతిసిద్ధమైన నిర్మాణ పదార్థాలతో వీటిని నిర్మించారు. ఈ హోటల్ భవంతుల్లో బస చేయడానికి పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుంటున్నారు. డెర్సిన్ స్టూడియో కంపెనీకి చెందిన ఆర్కిటెక్ట్ సారావుత్ జాన్సెంగ్ ఆరామ్ ఎంతో శ్రమించి, ఈ కూర్మహర్మ్యాలకు రూపకల్పన చేశారు. (చదవండి: ప్రపంచంలోనే పొడవైన మెట్రో లైన్.. ప్రత్యేకతలు ఇవే!) -
పండుగ వేళ.. గృహ కళ!
సాక్షి, హైదరాబాద్: పండుగ వేళ మీ ఇంటి శోభను రెట్టింపు చేయాలంటే ఇల్లును, ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయడమే కాదు.. చిన్న చిన్న మెళకువలతో ట్రెండీ లుక్ తీసుకురావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ అలంకరణ స్థానంలో ట్రెండీ లుక్ రావాలంటే ఎక్స్టీరియర్, ఇంటీరియర్ రెండు చోట్లా డెకరేటివ్ చేస్తే ఎకో–ఫ్రెండ్లీగా మారుతుందంటున్నారు. ► సంప్రదాయమైన దీపాంతులు, కొవ్వొత్తులకు కాలం చెల్లింది. వీటి స్థానంలో సిరామిక్ లేదా మార్బుల్ పల్లెంలో మట్టి దీపాంతలను వెలిగించండి. వీటిని హాల్, పూజ గదిలో పెట్టండి. డిస్కౌంట్ ధరల్లో వినూత్న డిజైన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరింత సృజనాత్మకత కావాలంటే బంగారపు వర్ణం ఉండే ఎలక్ట్రిక్ దీపాంతలు కూడా లభ్యమవుతాయి. ► ప్రముఖ ఎల్రక్టానిక్ కంపెనీలు బహుళ రంగుల లైట్లు, పోర్టబుల్ లైట్లు, లాంతర్లు వంటి వినూత్న లైటింగ్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వీటిని స్మార్ట్‌ఫోన్‌తో ఆపరేట్ చేసుకోవచ్చు కూడా. వైర్లెస్ ఉత్పత్తులు కావటంతో మొబైల్‌తో మనకు ఎంత కావాలంటే అంత కాంతి స్థాయి, రంగులను ఎంపిక చేసుకోవచ్చు. ► రంగు రంగుల బాటిల్స్‌లో కొవ్వొత్తులను పెట్టి గోడల మూలల్లో లేదా ప్రధాన ద్వారానికి ఇరు వైపులా, ఇంటి చుట్టూ వేలాడదీయవచ్చు. దీంతో ఇల్లు రకరకాల వర్ణాల్లో అందంగా దర్శనమిస్తుంటుంది. ► చేతితో తయారు చేసిన మట్టి దీపాంతలు, లాంతర్లు చాలా కామన్. వీటికి బదులుగా అకార్డియన్ పేపర్ లాంతర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి పగటి పూట సూర్య రశి్మని సేకరించి.. రాత్రి సమయాల్లో ప్రకాశిస్తాయి. వీటిని హెవీ డ్యూటీ నైలాన్‌తో తయారు చేస్తారు. ఈ లాంతర్ సెట్లు వివిధ డిజైన్స్, రంగుల్లో దొరుకుతాయి. ► ఈ మధ్య కాలంలో నీళ్లల్లో తేలియాడే కొవ్వొత్తులు బాగా ప్రాచుర్యం పొందాయి. అలంకరణ ప్రాయంగా వీటిని పూల కుండీల్లో, మొక్కలున్న ప్రాంతాల్లో, స్విమ్మింగ్‌పూల్, ఫౌంటేన్ వంటి మీద అమర్చుకోవచ్చు. -
మెక్సికోలో భారీ భూకంపం, వణికిపోయిన జనం
మెక్సికోలో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. భూకంప కేంద్రం గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్ట్‌కి ఆగ్నేయంగా 11 కిలోమీటర్లు (ఏడు మైళ్లు) దూరంలో కేందద్రీకృతమై ఉన్నట్టు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా రాజధాని నగరంలో భారీ భూకంపంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు. వరుస ప్రకంపనలతో పర్యాటకులు హోటళ్లను ఖాళీ చేశారు. కంపన తీవ్రతకు వందలాది కిలోమీటర్ల దూరంలో పలు భవనాలు కొన్ని సెకన్ల పాటు కదిలిపోయాయి. ముందుగా నైరుతి మెక్సికోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై జరిగినట్లు ఎలాంటి నివేదికలు లేవని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్బామ్ తెలిపారు. ఒక వ్యక్తి మరణించినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఒక వీడియో సందేశంలో తెలిపారు. కొయుకా డి బెనిటెజ్ నగరంలో యుటిలిటీ పోల్ పడి ఒక వ్యక్తి మరణించాడని, గెరెరో రాష్ట్ర గవర్నర్ హెక్టర్ అస్తుడిల్లో మిలెనియో టీవీకి చెప్పారు. అకాపుల్క్ మేయర్ అదెలా రోమన్ మాట్లాడుతూ ప్రజలు ఆందోళన చెందుతున్నారనీ, చాలా ప్రాంతాలలో గ్యాస్ లీకేజీలు వార్తలు వచ్చినట్టు తెలిపారు. భూకంపం మెక్సికో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపింది. స్నానం చేస్తుండగా, చాలా బలమైన కంపనలు రావడంతో చాలా భయపడిపోయా.. గట్టిగా అరిచాను.. చివరికి బాత్ టవల్‌తో మాత్రమే బయటపడ్డానంటూ ఒక పర్యాటకుడు తన అనుభవాన్ని పంచుకున్నారు. "నేను మా అమ్మతో వచ్చాను. హోటల్ 11 వ అంతస్తులో మేముండగా ఒక్కసారిగా కంపించింది. అమ్మ భయపడిపోయింది అంటూ ఏడుస్తున్న తన 86 ఏళ్ల తల్లిని అక్కున చేర్చుకున్నారు. కాగా ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల సరిహద్దులో ఉన్న మెక్సికో ఒకటి. 1985, సెప్టెంబర్ 19 న మెక్సికో నగరంలో 8.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 10వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది భవనాలను ధ్వంసమయ్యాయి. మళ్లీ 2017, సెప్టెంబర్‌లో వచ్చిన 7.1 భూకంపం కారణంగా 370 మంది మరణించారు. Power flashes from the earthquake in #Mexico. 🎥 @franz_gomez pic.twitter.com/ESXPpIgmSE — Michael Armstrong (@KOCOMichael) September 8, 2021 This is how #earthquakes look in the sky from an 11th floor ⚡ What you hear is the building crashing against the one next to it 🤯#earthquakeinthesky #Mexico #surreal pic.twitter.com/XNJESUdOew — elian huesca 🌋⚡ (@elianhuesca) September 8, 2021 A powerful earthquake struck southwestern Mexico near the beach resort of #Acapulco on Tuesday night, causing rock falls and damaging buildings, though there were no immediate reports of casualties. M7.0 #earthquake (#Sismo) strikes 18 km NE of Acapulco de Juárez (#Mexico) pic.twitter.com/f8LisWFmfx — DailyNews/BreakingNews (@DailyNe25683877) September 8, 2021 -
చిత్తూరు : ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలు కూల్చివేత
-
ఆస్తి పన్ను స్వీయ మదింపు అక్రమాలకు చెక్ ?
సాక్షి, హైదరాబాద్: అనధికార/అనుమతి లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం కొందరు అక్రమార్కులు ఆస్తి పన్నుల స్వీయ మదింపు (సెల్ఫ్ అసెస్మెంట్) ప్రక్రియను దుర్వినియోగపరుస్తుండడాన్ని రాష్ట్ర పురపాలక శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ అక్రమాలను అడ్డుకునే దిశగా చర్యలు చేపట్టింది. ఆస్తిపన్ను పేరు చెప్పి అక్రమ లేఅవుట్లు/ ప్లాట్లకు చెక్ పెట్టేందుకు కనీసం ఒకసారి రిజిస్టర్ అయిన ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అనుమతి లేని ప్లాట్లను కొందరు అక్రమార్కులు గృహాలు/భవనాలుగా పేర్కొంటూ, వాటికి ఆస్తి పన్నుల స్వీయ మదింపు నిర్వహిస్తున్నారు. తద్వారా వచ్చిన ఆస్తి పన్ను నంబర్ ఆధారంగా వాటికి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. దీనిపై పురపాలక శాఖకు ఫిర్యాదులు కూడా అందాయి. వాస్తవానికి ఆన్లైన్లో ఆస్తి పన్ను స్వీయ మదింపు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఆటోమెటిక్‌గా ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్‌తో కూడిన ఆస్తి పన్ను డిమాండ్ నోటీసును ప్రింట్ చేసుకోవడానికి పురపాలక శాఖే అవకాశం కల్పించింది. అయితే ఈ డిమాండ్ నోటీసులోని ఆస్తి పన్ను నంబర్ ఆధారంగా అక్రమ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఫిర్యాదుల నేపథ్యంలో పురపాలక శాఖ గుర్తించింది. 15 రోజుల తర్వాతే ప్రింట్ అక్రమాలకు చెక్ పెట్టేలా ఇకపై ఆస్తి పన్నుల స్వీయ మదింపు పూర్తి చేసిన 15 రోజుల తర్వాతే డిమాండ్ నోటీస్ ప్రింట్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆ 15 రోజుల్లోగా సంబంధిత పురపాలికల అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవ స్థితిని నిర్థారించుకోనున్నారు. అలా నిర్ధారించుకున్న తర్వాతే ఆస్తి పన్ను డిమాండ్ నోటీస్‌ను ప్రింట్ చేసుకునేలా అవకాశం కల్పించనున్నామని పురపాలకశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు మార్గదర్శకాలను త్వరలోనే అన్ని పురపాలికలకు జారీ చేయనున్నామని చెప్పారు. -
ఇంధన ఆదా బిల్డింగ్‌లకు ‘నీర్మాణ్’ అవార్డులు
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపు నిబంధనలను పాటిస్తూ నిర్మించిన కట్టడాలకు కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ రోడ్ మ్యాప్ ఫర్ మూమెంట్ టువర్డ్స్ అఫర్డబుల్ అండ్ నేచురల్ హేబిటేట్ (ఎన్‌ఈఈఆర్‌ఎంఏఎన్–నీర్మాణ్)’ పేరిట అవార్డులతో ప్రోత్సహించనుంది. మొత్తం ఎనిమిది విభాగాల్లో అందిస్తున్న అవార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 31 చివరి తేదీ అని ఇంధన శాఖ ఆదివారం ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రం నుంచి అత్యధిక మంది అవార్డులకు దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మికి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి లేఖ రాశారు. రాష్ట్రంలో వాణిజ్య భవనాల్లో 5,130 మిలియన్ యూనిట్లకు డిమాండ్ ఉండగా ఈసీబీసీ–2017 నిబంధనలను అమలు చేయడం ద్వారా 1,542 యూనిట్ల విద్యుత్ అంటే 25 శాతం పొదుపు చేయవచ్చని అంచనా వేశారు. దీనివల్ల రూ.881 కోట్ల విలువైన విద్యుత్‌ను ఆదా చేయగలుగుతారు. గృహ వినియోగంలో ఈ నిబంధనలు పాటించడం ద్వారా 3,410 మిలియన్ యూనిట్ల వరకు ఆదా చేయవచ్చని ఇంధన శాఖ అధికారులు అంచనా వేశారు. -
ఆసిఫాబాద్: పురాతన నిర్మాణాల కుల్చివేత పనుల్లో అపశ్రుతి
-
శరవేగంగా రైతు వేదికల నిర్మాణం
కష్టాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న పుడమి బిడ్డల సేవ కోసం రైతువేదికలు సిద్ధమవుతున్నాయి. ఈపాటికే మహబూబ్‌నగర్ మండలంలోని వెంకటాపూర్‌లో పూర్తయింది. రాష్ట్ర మంత్రి శ్రీనివాసగౌడ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయించారు. కలెక్టర్ వెంకట్రావ్ సైతం నిరంతరం పర్యవేక్షిం చారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో మిగిలిన రైతువేదికల్లోనూ వేగం పెంచారు. సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లావ్యాప్తంగా 88 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో దాని పరిధిలో ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మిస్తున్నారు. వీటన్నింటిని దసరా పండుగ నాటికి పూర్తిచేసి వినియోగంలోకి తేవాలన్న లక్ష్యంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. ప్రతి ఐదు వేల ఎకరాల సాగు విస్తీర్ణాని వ్యవసాయ క్లస్టర్‌గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారు (ఏఈఓ) లను సైతం నియమించిన విషయం విదితమే. ఈ క్లస్టర్లలో రైతువేదికలను నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ వెంకట్రావ్ నేతృత్వంలో అధికారులు యుద్ధప్రాతిపదికన అనువైన స్థలాలను గుర్తించి పనులు మొదలుపెట్టారు. పంటల సాగు, వ్యవసాయంలో పాటించాల్సిన మెళకువలను రైతులకు వివరించడం, సమావేశాల నిర్వహణ, చైతన్య కార్యక్రమాలు జరపడానికి వీలుగా ఈ వేదికలు ఉంటాయి. ఒక్కో క్లస్టర్ పరిధిలో సుమారు 2,500మంది రైతులకు మేలు చేకూరనుంది. జిల్లాలోని 15 మండలాల్లో.. మహబూబ్‌నగర్ అర్బన్ మండలం పట్టణ ప్రాంతం కావడంతో ఎదిర రెవెన్యూ గ్రామంలో ఒకే రైతువేదికను నిర్మిస్తున్నారు. పంటల సాగులో ఉన్న మండలాల్లో మాత్రం నాలుగు నుంచి తొమ్మిది వరకు నిర్మిస్తున్నారు. ఒక్కో దాని కోసం రూ.22 లక్షలు వెచ్చిస్తున్నారు. మొత్తం 88 వేదికలను రూ.19.36 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రతి వేదికలో ఏఈఓ, రైతువేదిక కో–ఆర్డినేటర్లకు ఒకటి చొప్పున చాంబర్, 200మంది రైతులు కూర్చునేందుకు వీలుగా సమావేశ మందిరం, రిసెప్షన్, రెండు మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని నిధులు కేటాయిస్తే చుట్టూ ప్రహరీ నిర్మించాలని యంత్రాంగం యోచిస్తోంది. ఒక్కోవేదిక కోసం కనీసం అర ఎకరం సేకరించారు. భూమి లభ్యత ఉన్న చోట ఎకరం కేటాయించారు. నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖ అధికారులకు అప్పగించారు. భూసార పరీక్షలు సైతం.. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 55క్లస్టర్లలో భూసార పరీక్ష కేంద్రాలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. నియంత్రిత సాగు విధానంలో భాగంగా పంట మార్పిడి కోసం భూసార పరీక్షలు కీలకం అవుతున్నాయి. దీంతో పరీక్షలను విస్తృతం చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలోని రైతు వేదికలో ఒకటి చొప్పున భూసార కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. దసరాకు పూర్తవుతాయి జిల్లాలో రైతువేదికల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దసరా నాటికి అన్ని వేదికలు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాం. రైతులకు అన్నివిధాలా ఉపయోగపడే రీతిలో వీటిని నిర్మిస్తున్నాం. – సుచరిత, డీఏఓ -
వైవీయూ గూటికే ‘గురుకులం’
సాక్షి, వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం గూటికి 21వ శతాబ్ధపు గురుకులం భవనాలు వచ్చి చేరనున్నాయి. ఈ మేరకు ఉన్నతవిద్యాశాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 8 బ్లాక్‌లతో వైవీయూలో 21వ శతాబ్ధపు గురుకులం భవనాలు ఏర్పాటు చేశారు. ఈ భవనాల నుంచి ఇడుపులపాయ ట్రిపుల్ వరకు నాలెడ్జ్‌హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు. అయితే కాలక్రమంలో ఇడుపులపాయలో ప్రత్యేకంగా భవనాలు నిర్మించడంతో వీటి అవసరం లేకుండా పోయింది. దీంతో వీటిని వైవీయూ నుంచి వేరుచేసి స్కిల్‌డెవలప్‌మెంట్ వారికి అప్పజెప్పారు. దీంతో ఈ భవనాలను ఎన్జీఓల ఆధ్వర్యంలో నడుస్తున్న నైపుణ్యాభివృద్ధి సంస్థ వారు ఈ భవనాలను వినియోగించుకుంటున్నారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఈ భవనాల్లోని రెండు బ్లాక్‌లను మాత్రం వైవీయూ అధికారులు కామర్స్, మేనేజ్మెంట్ బ్లాక్‌లుగా, పరిశోధన అవసరాల కోసం వినియోగించుకుంటూ వచ్చారు. -
విపత్తు సమయంలోనూ సంక్షేమం: సుచరిత
సాక్షి, కాకినాడ: విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆమె శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 29 అగ్నిమాపక కేంద్ర భవనాల అభివృద్ధికి రూ.28 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. అగ్నిమాపక శాఖ భవనాలకు శాశ్వత నిర్మాణాలు చేపడతామని చెప్పారు. (చేతులేత్తి మొక్కుతా.. వదిలేయండి: ఎంపీ మాధవ్) కష్టకాలంలో కూడా నవరత్న పథకాలు అమలు.. నవరత్న పథకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని కరోనా కష్టకాలంలో కూడా నెరవేరుస్తున్నారని సుచరిత తెలిపారు. ఈ విపత్తు సమయంలో సున్నా వడ్డీ కింద మహిళా సంఘాలకు రూ.1400 కోట్లు ఇచ్చారన్నారు. ప్రతి ఏడాది మే నెలలోనే రైతు భరోసా సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు అధికంగా జరుగుతున్నాయని మంత్రి సుచరిత వివరించారు. (దశలవారీ మద్యనిషేధంపై కసరత్తు షురూ..) -
అక్రమ నిర్మాణాలకు అడ్డా
సాక్షి, పటాన్చెరు: కిష్టారెడ్డిపేట అక్రమ నిర్మాణాలకు కేరాఆఫ్ అడ్రస్‌గా మారింది. పంచాయతీ కార్యదర్శి ఎవరికీ అందుబాటులో ఉండటం లేదు. హెచ్ఎండీఏ అనుమతులు లేనిది నిర్మాణాలు చేపట్టే ఆస్కారం అవకాశం లేదు. అయితే ఈ గ్రామ పంచాయతీలో మాత్రం కొందరు రాజకీయ నాయకులు తమ పలుకుబడి ఉపయోగించి అక్రమ పద్ధతుల్లో నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. బీరంగూడ–కిష్టారెడ్డిపేట రోడ్డుపై గత కార్యదర్శుల సంతకాలతో కూడిన అనుమతులతో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. హెచ్ఎండీఏ అనుమతులు ఉంటే ఆ రోడ్డు కావాల్సిన సెట్ బ్యాక్‌లు ఉండే అవకాశం ఉంది. కానీ పంచాయతీ అనుమతులతో సెట్ బ్యాక్‌లు లేకుండా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బీరంగూడ కమాన్ నుంచి సుల్తాపూర్ ఔటర్ రింగ్‌రోడ్డు జంక్షన్‌కు వెళ్లే దారిలో కిష్టారెడ్డిపేటలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సుల్తాన్ పూర్ జంక్షన్ నుంచి వచ్చే భారీ వాహనాలతో పాటు వేలాది కార్లు ఈ దారిలోనే వెళ్లాల్సి వస్తుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న రోడ్డు ఇప్పుడు గోతులమయంగా ఉంది. వాస్తవానికి ఆర్అండ్బీ అధికారులు ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా చేయాలనేది లక్ష్యంగా ఉంది. ఔటర్ జంక్షన్‌కు వెళ్లే రోడ్డు ఇదే కావడంతో ఆ రోడ్డుకు ఇరుపక్కల సెట్ బ్యాక్‌లు, పార్కింగ్ సౌకర్యాలు లేకుండా చేపడుతున్న నిర్మాణాలను ఆపాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామ పంచాయతీకి చెందిన పాలకవర్గం సభ్యులు కొందరు ఈ నిర్మాణాలను ఆపాలంటున్నారు. పంచాయతీ సర్పంచ్ ఏ.కృష్ణ కూడ గతంలో ఆ నిర్మాణాలు అడ్డుకోవాలని సూచించారు. ఇటు రారు.. వచ్చినా పట్టించుకోరు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన హెచ్ఎండీఏ అధికారులు కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. తార్నకలోని హెచ్ఎండీఏ కార్యాలయం వీడి బయటకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక సమస్యలపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే మాత్రం అక్రమార్కులతో చర్చలు జరిపి వారి నుంచి అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు దార్లను తార్నకకే రమ్మని చెప్తున్నారే.. తప్ప క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఆపడం లేదు. గతంలో పంచాయతీ కార్యదర్శి ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై నివేదికను హెచ్ఎండీఏ అధికార్లకు సమర్పించారు. మూడు నెల్లల క్రితం ఆ నివేదికలు ఇచ్చి అక్రమ నిర్మాణాలను కూల్చాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. ఇదే విషయమై హెచ్ఎండీఏ అధికారి రమేశ్చరణ్ను వివరణ కోరగా తనకు అధికారికంగా ఎలాంటి నివేదిక అందలేదన్నారు. వెంటనే అక్రమ నిర్మాణాలు ఆపాలని స్థానికులు కోరుతున్నారు. తప్పకుండాచర్యలు తీసుకుంటాం అక్రమ నిర్మాణాలను కచ్చితంగా నిరోధిస్తాం, అందుకు తగిన చర్యలు తీసుకుంటాం. మండల ఈఓపీఆర్నకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తాం. అక్రమ నిర్మాణాలను కూల్చివేయిస్తాం. – వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి -
జెడ్పీలకు భవనాలెట్ల!
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో స్థానిక పరిపాలన కొత్త రూపు సంతరించుకోనుంది. జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై 4తో ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి కొత్తగా ఎన్నికైన వారి పదవీకాలం మొదలవుతుంది. కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు మొదటి సమావేశంలోనే పదవీ బాధ్యతలు చేపడతారు. పాలకవర్గం సైతం అదే రోజు కొలువుదీరుతుంది. జిల్లాల పునర్విభజనతో ప్రస్తుతం ఉన్న తొమ్మిది జిల్లా పరిషత్‌లు 32కు పెరగనున్నాయి. అన్ని జిల్లాల్లో జెడ్పీ భవనాల కోసం పంచాయతీరాజ్ శాఖ వెతుకులాట మొదలుపెట్టింది.ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని జెడ్పీ భవనాలు అన్ని రకాలుగా గొప్పగానే ఉన్నాయి. కొత్త జిల్లా కేంద్రాల్లో ఆ స్థాయి భవనాలు ఎక్కడా లేవు. ఒకటిరెండు కొత్త జిల్లాల్లో తప్పితే జెడ్పీలకు ప్రభుత్వ భవనాలు ఉన్న పరిస్థితి లేదు. దీంతో పరిపాలన భవనం, సమావేశ మందిరం వంటి హంగులతో ఉండే భవనాల కోసం అధికారులు వెతుకుతున్నారు. ఎక్కువ జిల్లాల్లో ఆ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని జెడ్పీ కార్యాలయాలుగా మార్చాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో మండల పరిషత్‌లకు కొత్తగా కార్యాలయాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు సొంత భవనాలలో ఉన్న మండల పరిషత్ కార్యాలయాలను ఇప్పుడు ఇతర భవనాల్లోకి మార్చాల్సిన పరిస్థితి నెలకొంది. జెడ్పీ కార్యాలయాల కోసం భవనాల ఎంపిక ప్రక్రియను రెండుమూడు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రెండు జెడ్పీలు ఆలస్యం... ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే విషయంలో జాప్యం వల్ల ఆ జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ఆలస్యంగా మొదలైంది. 2019 ఆగస్టు 6తో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ పదవీకాలం మొదలుకానుంది. -
అద్దె భవనాలు కావాలి ‘గురు’!
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ అద్దె భవనాల వెతు కులాటలో పడింది. 2019–20 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో మరో 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వీటికి శాశ్వత భవనాలు లేనందున అద్దె భవనాల్లో ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వాటిని వెతికేందుకు అధికార యంత్రాంగం ఉపక్రమించింది. ఏప్రిల్ నెలాఖరులోగా అద్దె భవనాలను గుర్తించి లొకేషన్లు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులు బీసీ గురుకుల సొసైటీ అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గురుకుల పాఠశాలలను నెలకొల్పే విస్తీర్ణంలో భవనాలు లభించకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. 20 వేల చదరపు అడుగుల భవనం... ఒక గురుకుల పాఠశాల ఏర్పాటుకు 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనం ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. ఐదు నుంచి పదో తరగతి వరకు రెండేసి సెక్షన్లు... ఒక్కో సెక్షన్లో నలభై మంది విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, వసతిగృహాలు, డైనింగ్ హాలు, కిచెన్, మూత్రశాల, స్టాఫ్ రూమ్, ప్రిన్సిపాల్ రూమ్, స్టోర్ రూమ్ తదితరాలకు కచ్చితంగా 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంగల భవనం కావాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే, క్షేత్రస్థాయిలో అంత విస్తీర్ణమున్న భవనాల లభ్యత కష్టంగా మారింది. రెండేళ్ల క్రితం మంజూరు చేసిన గురుకుల పాఠశాలల ఏర్పాటును అతి కష్టంగా పూర్తి చేసిన అధికారులకు ప్రస్తుత లక్ష్యం సాధించడం ‘కత్తి మీద సాము’లా మారింది. పాత వాటిలో ప్రారంభిస్తే... రెండేళ్ల క్రితం బీసీ గురుకుల సొసైటీ 119 గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న భవనాలను అద్దెకు తీసుకుంది. ప్రస్తుతం ఆయా గురుకులాల్లో ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు క్లాసులు నడుస్తున్నాయి. వచ్చే ఏడాది తొమ్మిదో తరగతి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కొత్త గురుకులాలకు భవనాలు లభించకుంటే ఇప్పుడు నడుస్తున్న భవనాల్లో ఒక భాగంలో కొత్త గురుకులాలను ప్రాథమికంగా ప్రారంభించే అంశంపై అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో భవనాల లభ్యత ఆశాజనకంగా లేదు. మరోవైపు పట్టణీకరణ నేపథ్యంలో అద్దె సైతం ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే రెట్టింపు ఉంది. ఈ క్రమంలో కొత్త గురుకులాల ఏర్పాటు ఎలా ఖరారు చేయాలనేదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వచ్చే నెల రెండోవారం వరకు ప్రయత్నాలు జరిపి తర్వాత ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. -
నాసి..అంతా మసి!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఇటీవల వెలుగు చూస్తున్న విద్యుత్ షార్ట్సర్క్యూట్లపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఎండ తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉన్న సమయంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. తరచూ కరెంట్ వస్తూ పోతుండటం, కేబుల్ సామర్థ్యానికి మించి విద్యుత్ వినియోగించడం వల్ల ఓవర్‌లోడుతో షార్ట్సర్క్యూటవుతుంది. ఈ సయంలో కేబుల్ కాలిపోయి నిప్పురవ్వలు ఎగిసిపడటం సహజం. కానీ నిజానికి ఇటీవల విద్యుత్ సరఫరాలో ఎలాంటి హెచ్చుతగ్గులు కానీ, కోతలు కానీ లేవు. నిరంతరాయ విద్యుత్ సరఫరా జరుగుతోంది. అంతేకాదు ఇటీవల చలి తీవ్రత పెరిగింది. ఈ సమయంలో గృహ, వాణిజ్య సంస్థల్లో కరెంట్ వినియోగం కూడా భారీగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పలు వాణిజ్య సముదాయల్లో వరుసగా అగ్నిప్రమాదాలు వెలుగు చూస్తుంటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు ఈ అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమా..? లేక ఇన్సూరెన్స్ డబ్బుల కోసం యజమానులే తమ ఆస్తులను బుగ్గిపాలు చేసుకుంటున్నారా..? అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. నాసిరకమే కారణం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని హైదరాబాద్ సర్కిల్లో 450పైగా ప్రమాదాలు చోటు చేసుకోగా వీటిలో 170 ప్రమాదాలకు షార్ట్‌సర్క్యూట్‌లే కారణంగా అధికారులు నిర్ధారించారు. రూ.11.6 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రకటించారు. సెంట్రల్ సర్కిల్ పరిధిలో 340కిపైగా ప్రమాదాలు చోటు చేసుకోగా, వీటిలో 170పైగా ప్రమాదాలకు షార్ట్‌సర్క్యూట్‌లే కారణమని, ఈ ప్రమాదాల్లో రూ.13.84 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు గుర్తించారు. అదే విధంగా ఈస్ట్ సర్కిల్ పరిధిలో 277పైగా ప్రమాదాలు చోటు చేసుకోగా, 96 ప్రమాదాలకుషార్ట్సర్యూట్లే కారణం కాగా రూ. కోట్లలో ఆస్తినష్టం వాటిల్లింది. ఇక నార్త్ సర్కిల్ పరిధిలో 404 ప్రమాదాలు చోటు చేసుకోగా, వీటిలో 169 ప్రమాదాలకు షార్ట్‌సర్క్యూట్‌లే కారణమని, రూ.0.28 కోట్ల ఆస్తినష్టం వాటి ల్లినట్లు గుర్తించారు. నిజానికి ఇప్పటి వరకు గ్రేటర్లో వెలుగు చూసిన విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌లకు నాసిరకం వైరింగే కారణంగా విద్యుత్ తనిఖీ శాఖ గుర్తించింది. అయితే కొంతమంది ఇన్సూరెన్స్ డబ్బులతో నష్టాల నుంచి గట్టేక్కేందుకు కావాలనే ఆస్తులను కాల్చేసి, వాటికి షార్ట్సర్క్యూట్లను కారణంగా చూపుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. నాణ్యమైన వైరింగ్తోనే రక్షణ నిర్మాణ సమయంలోనే భవిష్యత్తు అవసరాలను గుర్తించి, ఆ సామర్థ్యం మేర వైరింగ్‌ను ఎంచుకోవాలి. స్విచ్‌లు, బోర్డులు, ఫ్యూజ్‌లు, వైరింగ్ వంటి విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడొద్దు. మార్కెట్లో రకరకాల వైర్లు, స్విచ్‌లు, ప్లగ్‌లు దొరుకుతున్నాయి. ఐఎస్ఐ గుర్తింపు పొందిన వస్తువులనే ఎంచుకోవాలి. తక్కువ ధరకే వస్తున్నాయి కదా? అని నాసిరకం వైరింగ్‌ను ఎంచుకోవద్దు. ఇంటి వైరింగ్‌కు ఎర్తింగ్ తప్పనిసరి. స్విచ్ ఆఫ్ చేయకుండా ప్లగ్‌లను బయటకు తీయొద్దు. – నక్క యాదగిరి, విద్యుత్‌రంగ నిపుణుడు -
ఓట్ల పథకమే
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములు, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వాలు తెస్తున్న పథకాన్ని ఓటు బ్యాంకు పథకంగా హైకోర్టు అభివర్ణించింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వారికి ఇలాంటి పథకాలను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బహుమానంగా ఇస్తున్నాయని ఆక్షేపించింది. తద్వారా చట్టాలను తూచా తప్పకుండా పాటించే వ్యక్తులకు తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని పేర్కొంది. ఇలాంటి పథకాలు రాజ్యాంగ సూత్రాలు, ఆదేశిక సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఈమేరకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు మనుగడలో ఉండగా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగాన్ని మోసగించడమే... ‘ప్రభుత్వం తొలుత దారిద్య్ర రేఖకు దిగువన ఉంటూ ఎలాంటి నివాసం లేని కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు క్రమబద్ధీకరణ పథకాన్ని తెచ్చింది. ఆ తరువాత పేద, ధనిక, పల్లె, పట్టణం అనే తేడాలు లేకుండా 500 చదరపు గజాల వరకు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారి పేరుతో క్రమబద్ధీకరిస్తోంది. ఇందుకు ఉచితంగా లేదా నామమాత్రంగా రుసుము వసూలు చేస్తోంది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుంది’ అని స్పష్టం చేసింది. విశాఖ, హైదరాబాద్‌లో ఇదే పరిస్థితి... విశాఖపట్నం, హైదరాబాద్‌లో పేద, ధనిక అనే తేడా లేకుండా ఉచితంగా 100 చదరపు గజాల వరకు సర్కారు భూమిని ఆక్రమించుకునేందుకు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయని హైకోర్టు పేర్కొంది. ఆక్రమణదారుడికి అప్పటికే ఇల్లు ఉందా? లేదా? అనే విషయాన్ని పట్టించుకోకుండా ఉచితంగా భూమిని క్రమబద్ధీకరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజాయితీ కలిగిన పౌరులు, ఖజానాకు చేటు చేసే దిశగా రాజకీయ యంత్రాంగం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా శాశ్వతంగా ఉండేæ అధికార యంత్రాంగం నడుచుకోవడం దురదృష్టకరమని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎమ్మార్వో సలహాతోనే.. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజకీయ పునాదిని నిర్మించుకునేందుకు అక్రమార్కులకు క్రమబద్ధీకరణ లాంటి తాయిలాలు ఇస్తూ చట్టాన్ని గౌరవించే పౌరులను బాధితులుగా మారుస్తున్నారని, ఇందుకు తాము ఎంత మాత్రం అంగీకరించేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రస్తుత కేసులో విశాఖ జిల్లా భీమునిపట్నం మండల తహసీల్దార్ ఇచ్చిన సలహాతోనే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న పిటిషనర్ బైరెడ్ల చిన్నా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారని, వాస్తవానికి ఆమెకు ఈ ఐడియా లేదని వ్యాఖ్యానించింది. ఆమె ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వ్యక్తే కాకుండా రాజకీయ నాయకురాలు (విజయనగరం జిల్లా చెరుకుపల్లి గ్రామ సర్పంచ్) కూడా అని గుర్తు చేసింది. రాజకీయ వర్గాలకు సైతం క్రమబద్ధీకరణ పథకం వర్తిస్తుందా? లేదా? అన్నది ప్రభుత్వానికి పట్టడం లేదంది. హైకోర్టులో పలు వ్యాజ్యాలు... బైరెడ్ల చిన్నా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ జి.రాము 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని భీమునిపట్నం మండల తహసీల్దార్‌ను ఆదేశించింది. అయితే తహసీల్దార్ ఇచ్చిన సలహా మేరకు.. తాను అక్రమించుకున్న ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించాలంటూ బైరెడ్ల చిన్నా దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగానే భీమునిపట్నం మండలం తగరపువలస గ్రామం బంగ్లామెట్ట వద్ద సర్వే నెంబర్ 1–49–182/1లో చిన్నా చేపట్టిన నిర్మాణాన్ని కూల్చేందుకు జీవీఎంసీ అధికారులు ప్రయత్నించారు. దీనిపై చిన్నా 2017లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని జీవీఎంసీ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ 2018లో ఆమె మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. చనిపోయిన కుమారుడికి చిన్నా అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉన్నందున రెండు వారాల పాటు నిర్మాణాల కూల్చివేతపై స్టే విధిస్తున్నట్లు గత ఏడాది ఫిబ్రవరి 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధిక్కార పిటిషన్ దాఖలు... అయితే ఆ తరువాత ఈ ఉత్తర్వులను హైకోర్టు పొడిగించలేదు. చిన్నా చేపట్టిన అక్రమ నిర్మాణం విషయంలో అధికారులు చర్యలు తీసుకోలేదంటూ రాము కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు 2016లో జారీ చేసిన జీవో 118 ప్రకారం ఆక్రమిత భూమి క్రమబద్ధీకరణకు 2016 ఆగస్టులో చిన్నా దరఖాస్తు చేసుకున్నారు. ఇది పెండింగ్‌లో ఉండగానే ఆక్రమణల క్రమబద్ధీకరణ కోసం 2017 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం జీవో 388 తెచ్చింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఇటీవల తుది తీర్పు వెలువరించారు. వన్‌టైం అంటూ మళ్లీ మళ్లీ.. ‘సి.కుల్సుంరెడ్డి కేసులో రాష్ట్రప్రభుత్వం తదుపరి ఎటువంటి క్రమబద్ధీకరణ పథకాలను తీసుకురాబోమంటూ వాగ్దానం చేసేం దుకు సిద్ధమైంది. అయితే ఈ హైకోర్టు అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వ వ్యవహార శైలే ఇందుకు కారణం. ప్రతిసారీ వన్‌టైం పథకం కింద తీసుకొస్తున్నామని చెప్పడం తరువాత మళ్లీ మరో కొత్త పథకం తీసుకురావడం చేస్తూ వచ్చింది. దురదృష్టవశాత్తూ ఇప్పటికీ అదే కొనసాగిస్తోంది. ప్రస్తుత కేసు విషయాని కొస్తే చిన్నా అమాయకంగా ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా భావించి కొన్నా రు. ఇందులో ఎటువంటి అనుమతుల్లేకుండా జీ ప్లస్ టూ నిర్మాణం చేపట్టారు. 500 చదరపు గజాల వరకు ప్రభుత్వ భూమిని క్రమ బద్ధీకరిస్తామని సర్కారు పేర్కొంది. అందులో చేపట్టే నిర్మాణాల గురించి చెప్పలేదు. నిబంధనల ప్రకారం రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను సమర్పించకుంటే నిర్మాణాలకు మునిసిపల్ అధికారులు అనుమ తులివ్వడానికి వీల్లేదు. దీనిప్రకారం సర్కారు తెచ్చిన క్రమబద్ధీకరణ పథకాన్ని చూస్తుంటే ప్రభుత్వ భూముల్ని దర్జాగా అక్రమించుకుని అందులో నిర్మాణాలు చేపట్టిన వారికి బహుమానంగా ఇచ్చేందుకు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్న పిటిషనర్ రాము వ్యాజ్యాన్ని కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. ఎలా చూసినా రాజ్యాంగ విరుద్ధమే.. ఏ రకంగా చూసినా కూడా ఈ క్రమబద్ధీకరణ పథకం రాజ్యాంగ విరుద్ధమని, అయితే ఈ పథకాన్ని తమ ముందు సవాలు చేయనందున తాము ఆ మేరకు ప్రకటన చేయడం లేదని హైకోర్టు తెలిపింది. తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వీలైనంత త్వరగా దిద్దుబాటు చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఇటువంటి పథకాల గురించి ఒకవైపు ప్రచారం చేస్తూ, మరోవైపు కొత్త పథకం వచ్చేంత వరకు క్రమబద్ధీకరణ దరఖాస్తులపై నిద్రపోవడం ప్రభుత్వానికి ఎంత మాత్రం సరికాదంది. బైరెడ్ల చిన్నా క్రమబద్ధీకరణ దరఖాస్తు విషయంలో తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నాలుగు వారాల్లోపు తగిన నిర్ణయం వెలువరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్రమబద్ధీకరణ దరఖాస్తును పరిష్కరించే వరకు ఆమె చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేయరాదని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఇటీవల తీర్పు వెలువరించారు. -
భవనాలపై ‘విద్యుత్’ నిఘా
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ముప్పై ఏళ్ల క్రితమే అపార్ట్మెంట్ కల్చర్ మొదలైంది. ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా బహుళ అంతస్తుల భవన నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి . విద్యుత్ భద్రతకు సంబంధించి ఇప్పటి వరకు ఓ స్పష్టమైన విధివిధానాలు అంటూ ఏమీ లేకపోవడం, నాసిరకం వైరింగ్ పనులతో కొనుగోలు దారులు నష్ట పోవాల్సి వస్తుంది. తరచూ షార్ట్సర్క్యూట్లు వెలుగు చూడటమే కాకుండా ఇంట్లో విలువైన గృహోపకరణాలు, వాణిజ్య సముదాయాల్లోని విలువైన వస్తువులు దగ్ధం అవుతుండటంతో పాటు ఒక్కోసారి మనుషుల ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి నష్టాలకు చెక్ పెట్టాలని తెలంగాణ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టరేట్ భావించింది. ఆ మేరకు విద్యుత్ భద్రత కోసం పలు విధివిధానాలు కూడా రూపొందించింది. 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తు, 650 ఓల్టేజ్‌ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న బహుళ అంతస్తుల భవనాలకు విద్యుత్ కనెక్షన్ మంజూరు విషయంలో ఈ విధివిధానాలు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఈ తరహా సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తనిఖీల బాధ్యత చార్టెడ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇంజనీర్స్కు ప్రస్తుతం 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న గృహ, వాణిజ్య సముదాయాలు...650 వోల్టేజ్ కన్న ఎక్కువ విద్యుత్ వినియోగం ఉన్న భవనాల్లో విద్యుత్ భద్రతను తెలంగాణ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ పరిశీలిస్తుంది. విద్యుత్ డిమాండ్, ఎంపిక చేసుకున్న లోడు, విద్యుత్ లైనింగ్, వైరింగ్ కోసం ఉపయోగించిన కేబుల్స్, స్విచ్ బోర్డుల ఎంపిక, ఫీజు బాక్స్‌లు, ఎర్తింగ్ వంటి అంశాలను పరిశీలించి...పూర్తి భద్రత ఉందని నిర్ధారించుకున్న తర్వాతే ఆయా భవనాలకు నో అ బ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ జారీ చేసిన ధృవీకరణ పత్రం ఆధారంగానే డిస్కం ఆయా భవనాలకు విద్యుత్ మీటరు జారీ చే స్తుంది. 650 కంటే తక్కువ ఓల్టేజ్ వాడే మధ్య తరహా భవనాలను తనిఖీ చేయకపోవడంతో బిల్డర్లు నిర్మాణ ఖర్చులను తగ్గించుకునేందుకు నాసిరకం కేబుళ్లను వాడుతున్నారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోకపోవడం....సామర్థ్యానికి మించిన విద్యుత్ వాడుతుండటం వల్ల విద్యుత్ వేడికి కేబుళ్లు దగ్ధమవుతున్నాయి. షార్ట్‌సర్క్యూట్‌లకు కారణమవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇంట్లో, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని భారీ నష్టాలు వాటిళ్లుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అమాయకులు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇకపై ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఇ వ్వకూడదని తెలంగాణ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ భావించింది. ఆ మేరకు తక్కువ ఎత్తులో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాల్లో తనిఖీ బాధ్యతను చార్టె డ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇంజనీర్స్కు అప్పగించడం ద్వారా విద్యుత్ భద్రతను మెరుగుపర్చవచ్చని యోచిస్తుంది. షార్ట్సర్క్యూట్లు నివారించేందుకే నగరంలో లక్షల సంఖ్యలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలను తనిఖీ చేయడం కేవలం ఒక చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్తో కావడం లేదు. ఇక్కడ అవసర మైన సిబ్బంది లేకపోవడం కారణం. ఉన్నవాళ్లపై కూడా పని భారం పెరుగుతోంది. తక్కువ ఎత్తులో నిర్మించే బహుళ అంతస్తుల భవనాల తనిఖీ బాధ్యతను చార్టెడ్ సేఫ్టీ ఇంజనీర్ ఏజెన్సీకి అప్పగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. వైరింగ్ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పెంచడం ద్వారా విద్యుత్ షార్ట్ స ర్క్యూట్‌ల జరిగే అగ్నిప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు అవకాశం ఉంది. ఒక వేళ ఈ పత్రాలు జారీ చేసే విషయంలో ఎవరైనా చార్టెడ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇంజనీర్ అక్రమాలకు పాల్పడినట్లు తేలితే..అట్టి ఇంజనీరు లైసెన్సును రద్దు చేసే అధికారం చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ కు ఉంటుంది. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి చెల్లింపులు ఉండవు. ఇది ఒక ప్రైవేటు ఏజెన్సీ మాత్రమే. వీరు ఇచ్చిన సర్టిఫికెట్‌పై విద్యుత్ అధికారులు సంతృప్తి చెందిన తర్వాతే కనెక్షన్ జారీచేస్తా రు. – ఏజీ రమణప్రసాద్,చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ -
మేలు చేసిన తేనెటీగ
సారంగపురంలో జనాభా పెరిగిపోయింది. నగరంలో పెద్ద భవనాలు, విద్యాసంస్థలు వెలిశాయి. రాజుగారి రథాలు, మంత్రిగారు సహా రాజ పరివారానికి చెందినవారి రథాలు, ఇతర సంపన్నుల రథాలు పోవాలంటే నగరంలోని వీధులు ఇరుకు కాసాగాయి. రహదారులను విశాలంగా తయారు చేయడానికి అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద చెట్లను కొట్టించేయాలని రాజుగారి మంత్రిమండలి నిర్ణయించింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా! శరవేగంగా చెట్లు కొట్టే కార్యక్రమాన్ని అమలు చేయసాగారు. చిరకాలంగా నగర పౌరులకు నీడనిచ్చిన భారీ వృక్షాలు నేలకొరిగాయి. పచ్చని చెట్లతో కళకళలాడుతూ కనిపించే రహదారులు బోసిపోయాయి. నగరంలోనే నివాసం ఉంటున్న పుష్పరాజుకు చెట్లంటే వల్లమాలిన ప్రేమ. పుష్పరాజు నగరంలోని అనేక రహదారుల వెంబడి ఎన్నో చెట్లు నాటించాడు. పుష్పరాజు ఇంటి దగ్గర్లోనే ఉన్న మూడు పెద్ద వృక్షాలను కూడా రాజుగారి సిబ్బంది కొట్టివేశారు. చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ పెరిగిన పుష్పరాజు, నేలకొరిగిన ఆ వృక్షాలను చూసి చాలా బాధపడ్డాడు. ఇదివరకు పచ్చగా కళకళలాడే ప్రదేశం బోసిపోయి కనిపించడాన్ని తట్టుకోలేకపోయాడు. అందుకే, నగరానికి దూరంగా వెళ్లి ఒక పెద్దస్థలంలో చిన్న ఇల్లు కట్టుకుని, చక్కని తోట వేసుకోవాలనుకున్నాడు. నగరానికి దూరంగా ఒక తటాకం పక్కన కనిపించిన స్థలం అనువైనదిగా అనిపించడంతో అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. చుట్టూ బోలెడన్ని పండ్లు, కూరగాయల మొక్కలు వేశాడు. పూల మొక్కలు వేశాడు. తటాకానికి కొద్ది దూరంలోనే ఒక పెద్ద వృక్షం కూడా ఉంది. రోజూ తటాకం నుంచి నీళ్లు తెచ్చి శ్రద్ధగా తోటలోని మొక్కలకు పోయసాగాడు. మొక్కలు ఏపుగా పెరిగాయి. కొన్ని వృక్షాలుగా ఎదిగాయి. అవి పూలు, పండ్లు, కూరగాయలు ఇవ్వసాగాయి. ఆ అందమైన పూల సువాసన అల్లంత దూరంలో ఎగురుతున్న తేనెటీగను ఆకర్షించింది. అది ఎంతో సంతోషంతో తోటను గమనించింది. ఇంతకుముందు తేనె సేకరించాలంటే ఎంతో దూరం పోవాల్సి వచ్చేది. ఇంత అందమైన దృశ్యాన్ని ఆ తేనెటీగ ఇంతకు ముందు చూసి ఎరుగదు. అక్కడ దూరంగా ఉన్న తేనెటీగలు కూడా పూల సువాసనను గ్రహించాయి. కొద్ది దూరంలోనే ఉన్న పెద్ద చెట్టు మీద తేనెటీగలు తేనెపట్టు పెట్టాయి. అవి రోజూ పుష్పరాజు తోటలోని పూల నుంచి మకరందాన్ని సేకరించి తమ తేనెపట్టును నింపసాగాయి. పుష్పరాజు తోటలోని మకరందాన్ని సేకరిస్తున్నాయి కనుక అవి పుష్పరాజుకు ఏదైనా మేలు చేయాలని తలచాయి. అదలా ఉండగా, దూరంగా ఉన్న అడవి నుంచి ఒక తోడేలు పుష్పరాజు ఇంటి వైపు రాసాగింది. అప్పుడే పుష్పరాజు కొడుకు చెక్కతో చేసిన చిన్న బొమ్మతో ఆడుకుంటూ తోటలోకి వచ్చాడు. తోడేలు పుష్పరాజు కొడుకు వైపు రాసాగింది. తోడేలు వల్ల ఆ బాలుడికి ఎదురవబోయే ప్రమాదాన్ని గ్రహించిన పెద్ద తేనెటీగ మిగిలిన తేనెటీగలను వెంటనే అప్రమత్తం చేసింది. అంతే! అవి గుంపుగా బయలుదేరి పుష్పరాజు కొడుకు వైపు వస్తున్న తోడేలుపై మూకుమ్మడిగా దాడి చేశాయి. తేనెటీగల కాటుకు తోడేలుకు ఒళ్లంతా బాగా వాచిపోయింది. తేనెటీగల కాట్ల ధాటికి ఒళ్లంతా మంటలు పుట్టడంతో ఆ బాధ భరించలేక కుయ్యో మొర్రో అంటూ ఆ తోడేలు దూరంగా ఉన్న అడవిలోకి పారిపోయింది. ఇక ఆ రోజు నుంచి తోడేలు పుష్పరాజు తోట దరిదాపులకు వచ్చేందుకైనా సాహసించలేదు. పుష్పరాజు తోటలోని మకరందాన్ని గ్రహిస్తున్నందుకు కృతజ్ఞతగా తేనెటీగలు అతడి కొడుకును తోడేలు బారి నుంచి కాపాడాయి. తోడేలు పాదాల గుర్తులు గమనించి పుష్పరాజు ఇంటి చుట్టూ పెద్ద దడి కట్టించి, తన ఇంటికీ, కుటుంబానికి తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకున్నాడు. మరిన్ని పూల మొక్కలు, పండ్ల మొక్కలను తీసుకొచ్చి తన తోటను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుకున్నాడు. -
అద్దె మోత
మహిళా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ జిల్లాలో వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. నిధుల విడుదల ఎలా ఉన్నప్పటికీ పాలకులకు, ఆ శాఖ అధికారులకు చిత్తశుద్ధి లేకపోవడంతో ఐసీడీఎస్‌ను భవనాల కొరత వెంటాడుతోంది. ఏళ్ల తరబడి అంగన్వాడీ కేంద్రాలు, సీడీపీఓల కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నెలకు లక్షలాది రూపాయలు ఆ శాఖ ద్వారా అద్దెలకు కేటాయించడం పరిపాటిగా మారుతోంది. నెల్లూరు(వేదాయపాళెం): ఐసీడీఎస్ భవనాల కోసం స్థలసేకరణ విషయంలో ప్రతిపాదనలకు, హామీలకు మాత్రమే పరిమితమవుతున్నారు. మంజూరైన అరకొర భవనాల నిర్మాణాల్లో అలసత్వం ప్రదర్శిస్తుండడంతో అవి అసంపూర్తిగా ఉంటున్నాయి. జిల్లాలోని 17 ప్రాజెక్టుల్లో 3454 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు, 320 మినీ అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అందులో 3 ఏళ్ల లోపు చిన్నారులు 89,856 మంది, 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలు 82,736 మంది ఉన్నారు. వీరికి పూర్వ ప్రాథమిక విద్యతోపాటు పౌష్టికాహారం అందించాల్సిఉంది. వీరితోపాటు గర్భిణులు 18,943 మంది, బాలింతలు 17,786 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు 1311 సొంత భవనాలు ఉండగా 1272 కేంద్రాలను అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అర్బన్ ప్రాంతాల్లో అధికంగా అద్దె భవనాల్లోనే కేంద్రాల నిర్వహణ జరుగుతోంది. నెల్లూరు అర్బన్ ప్రాజెక్టులో పూర్తిగా అద్దె భవనాల్లోనే కేంద్రాలు కొనసాగుతున్నాయి. అర్బన్ ప్రాంతాల్లో ఒక్కో కేంద్రానికి రూ.3 వేలు, రూరల్ ప్రాంతాల్లో రూ.700 అద్దె చెల్లిస్తున్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న సీడీపీఓ కార్యాలయాలకు రూ.6600 చొప్పున చిల్లిస్తున్నారు. నెలల తరబడి అద్దె బకాయిలు జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు నెలల తరబడి అద్దె బకాయిలు పెరిగిపోతుండటంతో అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బందులు పడాల్సివస్తోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో భవనాల యాజమానులు అద్దె చెల్లింపుల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తుండడంతో కార్యకర్తలు అప్పులు చేసి మరీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల కేంద్రాలను ఖాళీ చేయాల్సిందిగా యాజమానుల నుంచి కార్యకర్తలకు ఒత్తిళ్లు కూడా ఎదురవుతున్నాయి. అసంపూర్తి పరంపర 2017వ సంవత్సరానికి ముందు నాబార్డు నిధులతో 102 భవనాలు మంజూరు కాగా అందులో 31 భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. 2017–18కి గాను జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో అంగన్వాడీ కేంద్రం భవనానికి రూ.7.50 లక్షల అంచనా వ్యయంతో 371 భవనాలు మంజూరయ్యాయి. 188 భవనాలు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నాయి. ఈ భవనాల నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్, హౌసింగ్ శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే 2016–17 ఏడాదికి గానూ సీడీపీఓల కార్యాలయాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మహిళా శిశు సంక్షేమశాఖ నిధులతో ఒక్కో భవనానికి రూ.53 లక్షల అంచనా వ్యయంతో పనులను చేపట్టారు. రెండేళ్ల నుంచి కొన్ని భవనాలు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. నెల్లూరుఅర్బన్, నాయుడుపేట, పొదలకూరు, బుచ్చి, ఆత్మకూరు, వింజమూరు, సీడీపీఓల కార్యాలయాల భవనాలు పూర్తి దశకు చేరుకోలేకున్నాయి. నెరవేరని మంత్రి హమీ అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు దీటుగా చేస్తామని చెబుతున్న మంత్రి నారాయణ హామీ నెరవేరలేదు. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనాలు నిర్మించేందుకు యుద్ధప్రతిపాదికన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం ముందుకు సాగడం లేదు. కనీసం స్థల సేకరణ జరిపిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. కార్యకర్తలకు ఆర్థిక ఇబ్బందులు అద్దెల చెల్లింపు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో అంగన్వాడీ కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోంది. గృహాల యాజమానుల ఒత్తిళ్లను భరించాల్సివస్తోంది. శాశ్వత భవనాల నిర్మాణాల విషయంలో ప్రతిపాదనలకే పరిమితమవుతున్నారు. పాలకులు అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. – షేక్ మస్తాన్‌బీ, నెల్లూరు అర్బన్ ప్రాజెక్ట్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కార్యదర్శి -
ఆక్రమణలపై కొరడా
-
మాసబ్‌ట్యాంక్‌లో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదాయపన్ను శాఖ బిల్డింగ్ ఎనిమిదవ అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు, సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆరు జిల్లాల్లో 155 మహిళా భవనాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 155 మహిళా భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో భవన నిర్మాణం కోసం రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.15.50 కోట్లు కేటాయించారు. కరీంనగర్, వరంగల్ అర్బన్, జగిత్యాల, పెద్దపల్లి, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల్లో ఈ మహిళా భవనాలను నిర్మించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. -
కాతేరులో.. ‘కట్టు’కథలు..
- యథేచ్ఛగా అపార్ట్మెంట్ల నిర్మాణం – అనుమతులు లేకుండానే బహుళ అంతస్తులు – సెట్‌బ్యాక్స్ రెండు అడుగులు కూడా లేని వైనం – నిర్మించి అమ్మేస్తున్న వ్యాపారులు – చూసీచూడనట్టుగా అధికారులు అక్రమ కట్టడాలకు కాతేరు పంచాయతీ అడ్డాగా నిలుస్తోంది. పంచాయతీ అనుమతులు తీసుకుని బహుళ అంతస్తుల నిర్మాణాలు కడుతున్నారు. బిల్డర్ల ‘కట్టు’కథలు వింటున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. కళ్లెదుటే అక్రమ నిర్మాణాలు సాగుతున్నా.. తమకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. - సాక్షి, రాజమహేంద్రవరం దాదాపు 9వేల గడప ఉన్న కాతేరు పంచాయతీ రాజమహేంద్రవరంలో కలిసినట్టుగానే ఉంటుంది. నగరం నుంచి కాతేరు వరకు మధ్యలో నిర్మాణాలు ఉండడంతో పంచాయతీలో అపార్ట్మెంట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నగరంలో స్థలాలు లేకపోవడంతో వ్యాపారులు నగరాన్ని ఆనుకుని ఉన్న హుకుంపేట, పిండిగొయ్యి, కాతేరు, ధవళేశ్వర్యం తదితర పంచాయతీల్లో అపార్ట్మెంట్లు నిర్మించి విక్రయిస్తున్నారు. ఐదేళ్లుగా రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల అక్కడ జన్మభూమి కమిటీలు, పంచాయతీ అధికారులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఈ క్రమంలోనే పంచాయతీ అధికారులు అడిగిందే తడవుగా అనుమతులు ఇస్తున్నారు. సాధారణంగా పంచాయతీ స్థాయిలో జీ ప్లస్ 2 వరకు అనుమతులు ఇస్తారు. అయితే వ్యాపారులు మూడు, నాలుగు అంతస్తుల వరకు నిర్మాణాలు చేపడుతున్నారు. కాతేరు గ్రామం, పంచాయతీ పరిధిలోని మల్లయ్యపేటలో ఈ విధంగా అనధికారిక కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మల్లయ్యపేట కాతేరు మధ్యలో చెరువు వద్ద శివాని బిల్డర్స్, డెవలెపర్స్ సంస్థ పంచాయతీ అనుమతులతో జీ ప్లస్ 4 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తోంది. నిబంధనల ప్రకారం పంచాయతీ అనుమతితో గరిష్టంగా జీ ప్లస్ 2 వరకే నిర్మించాలి. కానీ జీ ప్లస్ 4 అంతస్తుల భవనం నిర్మిస్తున్న శివాని బిల్డర్స్, డెవలపర్స్ సంస్థ కనీసం సెట్‌బ్యాక్స్ కూడా నిబంధనలకు అనుగుణంగా వదలలేదు. భవనం నాలుగు వైపులు కనీసం రెండు అడుగుల ఖాళీ ప్రదేశం కూడా వదల్లేదు. మల్లయ్యపేటలోని నిర్మించిన లక్ష్మీ టవర్స్ కూడా ఇలాగే నిబంధలకు విరుద్ధంగా నిర్మించారు. పంచాయతీ అనుమతితో జీ ప్లస్ 4 అంతస్తులు నిర్మించిన బిల్డర్, సెట్‌బ్యాక్స్ రెండు అడుగులు కూడా వదల్లేదు. ఇలా పంచాయతీలో అనేక ఇళ్లు కూడా ఉన్నాయి. గతంలో కాతేరు పంచాయతీ కార్యదర్శి ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. నిధుల గోల్మాల్, పక్కదారి పట్టించడం వంటి ఆరోపణలపై ఆ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. పట్టించుకోని అధికారులు, సిబ్బంది.. కాతేరు పంచాయతీలో నిబంధలకు విరుద్ధంగా అపార్ట్మెంట్లు, భవనాలు నిర్మిస్తున్నా పంచాయతీ అధికారులు, సిబ్బంది, ఉన్నతాధికారులు చూసీచూడనట్టుగా ఉంటున్నారు. రాజకీయ పార్టీ నేతల ఒత్తిడులు, ఇతర వ్యవహారాల నేపథ్యంలో కింది స్థాయి అధికారులు మిన్నుకుండిపోతున్నారన్న ప్రచారం సాగుతోంది. నష్టపోనున్న కొనుగోలుదారులు... నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ అనుమతులకు మించి మూడు, నాలుగు అంతస్తుల మేర అపార్ట్మెంట్లు నిర్మించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. చివరికి కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పట్టణాలు, నగరాలలో నిర్మించిన పాత భవనాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం బీఆర్ఎస్ అనే పథకం ప్రవేశపెట్టి అమలు చేసింది. కానీ పంచాయతీలలోని అనధికారిక, అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించేలా ఇంకా ప్రభుత్వం ఎలాంటి పథకం ప్రవేశ పెట్టలేదు. దీనిపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. అనధికారికి కట్టడాలను కూల్చివేడం, లేదా భారీ స్థాయిలో జరిమానా విధించడం వంటి ప్రతిపాదనలు ఉన్నట్టు గత కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. అయితే వీటిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇది జరిగితే అప్పటికే కొనుగోలు చేసిన వారు నష్టపోనున్నారు. నోటీసులు ఇస్తాం.. చట్టప్రకారం చర్యలు అనధికారిక, అక్రమ కట్టడాలు నిర్మించే వారికి నోటీసులు ఇస్తాం. చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయాలని నగరపాలక సంస్థ కమిషనర్, సబ్‌కలెక్టర్ తరచూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ నిర్మాణదారులు లెక్కచేయడం లేదు. అక్రమ, అనధికారిక అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొన్నవారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – వరప్రసాద్, డీఎల్పీవో, రాజమహేంద్రవరం డివిజన్ -
అద్దె భవనం కావాలి
►మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లకు దొరకని అనువైన భవనాలు ►నెలల తరబడి జల్లెడ పడుతున్న అధికారులు ►స్కూళ్ల ప్రారంభానికి దగ్గర పడుతున్న సమయం ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : జిల్లాకు 12 నూతన మైనారిటీ రెసిడెన్షియల్ సూళ్లు మంజూరు కాగా వాటికి భవనాలను సమకూర్చడం అధికారులకు పెద్ద సమస్యగా మారింది. భవనాలు అద్దెకు కావాలెను అని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. రెండు, మూడు నెలలుగా అనువైన అద్దె భవనాల కోసం మైనారిటీ సంక్షేమ అధికారులు జిల్లా మొత్తం చక్కర్లు కొట్టి జల్లెడ పడుతున్నారు. కేవలం నాలుగైదు స్కూ ళ్లకు మాత్రమే అనువైన అద్దె భవనాలు దొరికాయి. అగ్రీమెంట్ కూడా చేసుకున్నారు. మిగిలిన వాటికి అద్దె భవనాలు దొరక్క అధికారులు నానా తంటాలు పడుతుంటే.. మరికొన్నింటికి దొరికినట్లే దొరికి చేజారుతున్నాయి. అద్దె భవనాల యజమానులు మళ్లీ వెనక్కి తీసుకుం టున్నారు. జిల్లాకు నూతనంగా 12 మై నారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను 2017 జనవరి 27న జీఓ. నెంబర్ 4 ద్వారా ప్రభుత్వం మంజూరు చేసింది. నిజామాబాద్ ప్రాంతానికి మూడు బాలికల స్కూళ్లు, మూడు బా లుర స్కూళ్లు ఉం డగా డిచ్పల్లి బాలుర 1, బోధన్ బాలి కల 1, ఆర్మూర్ బాలి కల 1, రెంజల్ బాలికల 1, బాల్కొండ కు బాలుర 1, బాలికల 1 చొప్పున రెసిడెన్షియల్ స్కూ ళ్లు ఉన్నాయి. వీటికి సొంత భవనాలను నిర్మించే వరకు తా త్కాలికంగా అద్దె భవనాలను చూసి అందులో 2017–18 విద్యా సంవత్సరానికి తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం మైనారిటీ సంక్షేమాధికారులను ఆదేశించింది. అధికారులు ముం దుగా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల పక్రియను పూర్తి చేశారు. ప్రస్తు తం జూన్ 12న స్కూళ్లు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాకు మం జూరు చేసిన 12 స్కూళ్లను కూడా అప్పు డే ప్రారంభించాల్సి ఉంది. బాల, బాలి కలకు స్కూళ్లలోనే విద్యతో పాటు వస తి, భోజనం కల్పించాలి. తరగతుల బోధన, విద్యార్థులకు వసతిని కల్పించాలంటే ఇందుకు పెద్ద భవనాలు అవసరం ఉంటుంది. కనిపించిన వారికల్లా అద్దె భవనాలు ఉంటే చూడండి అని అధికారులు చెబుతూనే ఉన్నారు. చివరికి పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. ప్రస్తుతం నాలుగైదు స్కూళ్లకు మాత్రమే అద్దె భవనాలు దొరికాయి. ఒక్కో భవనానికి ప్రభుత్వం నుంచి నెలకు రూ.1 లక్ష నుంచి రూ.1 లక్ష 50 వేలకు పైగా చెల్లించడానికి అధికారులు ముందుకు వస్తున్నారు.అయితే సౌకర్యాలున్న పెద్ద పెద్ద భవనాలు దొరకడం కష్టంగా మారింది. వెతుకుతున్నాం : కిషన్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జిల్లాకు మంజూరైన నూతన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లకు అనువైన అద్దె భవనాల కోసం వెతుకుతున్నాం. ప్రస్తు తం కొన్ని స్కూళ్లకు భవనాలు దొరికా యి. మరికొన్నింటికి భవనాలు దొరకడం కష్టంగా మారింది. అద్దె భవనాల కోసం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాం. -
బీపీఎస్ గడువు పెంపు
కర్నూలు (టౌన్): బీపీఎస్ (భవనాల క్రమబద్ధీకరణ పథకం)కు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. ఈ పథకం గడువు మార్చి నెలాఖరుకు ముగియనుంది. అయితే అనేక మున్సిపాల్టీల నుంచి అభ్యర్థనలు రావడంతో ఏప్రిల్ 30 వరకు గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా భవనాలు నిర్మించుకున్న భవన యజమానులు బీపీఎస్ కింద తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. -
ప్రజా సంక్షేమం పట్టదా..?
గరుగుబిల్లి : దేశంలో లెక్కకు మిక్కిలి చట్టాలు వస్తుంటాయి. కానీ వాటిలో ఎన్ని సక్రమంగా అమలవుతున్నాయంటే వేళ్ల మీద లెక్కపెట్టి చెప్పొచ్చు. చట్టాలను చేయడంలో పాలకులు ఎంత ముందుంటారో, అవే చట్టాలను అమలు చేయడంలో అధికారులు అంత వెనక ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీన్నే అలుసుగా తీసుకుని అక్రమార్కులు కోట్లకు పడగలెత్తుతున్నారు. నిబంధనలను తుంగలోకి తొక్కి అక్రమ వ్యాపారాలను వ్యాప్తి చేస్తున్నారు. వీటికి చక్కని ఉదాహరణ గరుగుబిల్లి మండలంలోని కొంకడివరం గ్రామ పరిధిలో ఏర్పాటైన క్వారీలు. నిబంధనలను గాలికొదిలి.. కొంకడివరంలో ఏర్పాటు చేసిన క్వారీలు అన్ని అక్రమంగా ఏర్పాటు చేసుకున్నవేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో పడి అడ్డగోలు అనుమతులిచ్చి తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు విమర్శిస్తున్నారు. అనుమతులు మంజూరు చేసిన అధికారులు ప్రజా సమస్యలు ఏంటో తెలుసుకోవాలన్న సత్యాన్ని పక్కన పెట్టేశారు. దీనికి కారణం జిల్లా అధికార పార్టీ పెద్దల ఒత్తిడే అన్నది బహిరంగ రహస్యం. దీంతో క్వారీ యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమీ చేయలేక మిన్నకుండిపోతున్నారు. ఇష్టా రీతిన పనులు చేయిస్తున్న క్వారీల యజమానులు.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో, మామూళ్లు ఇచ్చి క్వారీ అనుమతులు తెచ్చుకున్న వ్యాపారులు లాభాల కోసం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలకు చేటు తెస్తున్నారు. జనం వీటిపై కలెక్టర్, మైనింగ్, కాలుష్య నివారణ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసి వ్యాపారులను బ్లాస్టింగ్, క్వారీయింగ్ పనులు చేయనీయకుండా చేయగలిగారు. రెండు నెలల నుంచి పనులు నిలిచిపోయాయి. కానీ వ్యాపారులు మాత్రం స్థానికులపై మానసికంగా, శారీరకంగా భయపెడుతున్నట్లు సమాచారం. ఇబ్బందుల్లో ప్రజలు, విద్యార్థులు.. కొంకడివరం సమీపంలో రెండు క్వారీలకు రెండు స్టోన్ క్రషర్లకే అనుమతులున్నాయి. కానీ వారు బాస్టింగ్స్ నిర్వహిస్తుండడంతో అంగన్వాడీ, పాఠశాల, ఇళ్ల భవనాలు బీటలు వారుతున్నాయి. ప్రజలు, విద్యార్థులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మూగ జీవాల ప్రాణనష్టం కూడా ఎక్కువే. దీనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సర్వే చేసిన తహసీల్దార్ క్వారీలు నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నట్లు నివేదికలో తేల్చిచెప్పారు. శ్రీ సత్యదుర్గా స్టోన్ క్రషర్ యాజమాన్యం సర్వే నంబర్ 4–3లో అనుమతులకు మించి 74 సెంట్లు, సర్వే నంబర్ 4 – 14లో 48 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అలాగే సర్వే నంబర్ 86–1లో ఉన్న కొమ్ముదువాని చెరువులో 20 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి రోడ్డు వేసినట్లు పేర్కొన్నారు. దీంతో సర్పంచ్ కొద్ది రోజులుగా ఆ రోడ్డును మూసివేసి రాకపోకలు నిలిపేశారు. ఇష్టానుసారంగా బ్లాస్టింగ్స్.. క్వారీ యజమానులు ఎక్స్‌ప్లోజివ్స్ శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉండగా అవేమి చేయకుండా బ్లాస్టింగ్స్ చేస్తున్నారు. వీరు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని విఘ్నేశ్వర ఎంటర్ప్రైజెస్ వారితో బ్లాస్టింగ్స్‌కు ఒప్పందం కుదుర్చుకున్నారు. వాస్తవానికి విఘ్నేశ్వర సంస్థవారు లావేరు మండల పరిధిలో మాత్రమే బ్లాస్టింగ్స్ చేసుకునేందుకు అనుమతులున్నాయి. వ్యాపారుల కొమ్ముకాస్తున్న అధికారులు.. క్వారీల నుంచి రక్షించాలని అధికారుల వద్దకు వెళ్తే ఆ యజమానుల దగ్గర మామూళ్లు తీసుకుని ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న వారిపైనే తిరిగి కేసులు పెడుతున్నారు. ఇప్పటికే 15 మంది వరకు కేసులు పెట్టారు. జిలెటిన్ స్టిక్స్ దొరికినా కూడా చర్యలు శూన్యం . బ్లాస్టింగ్స్‌తో నష్టాలు.. పేలుళ్ల సమయంలో రాళ్లు తగిలి ప్రాణాలు పోయే అవకాశం, బీటలు వారుతున్న ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పశువులకు మేత కరువు, ప్రాణ నష్టం కూడా, జనం రాకపోకలకు ఇబ్బందులు, క్రషింగ్ సమయంలో రాతి ధూళి, దమ్ము వలన వ్యాధులు వచ్చే అవకాశం, పనుల నిమిత్తం తిరిగే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం, ప్రజల కోసం నిర్మించిన రోడ్లు పాడవుతుండడం, పంట పొలాలు, తోటలు నాశనం అవుతుండడం. -
పైసా ఇచ్చేది లేదు..
తేల్చిచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం జేఎ¯ŒSటీయూకేలో ఆర్థిక సంక్షోభం నిధులు లేక నిలిచిన పనులు పూర్తయిన భవనాలు ప్రారంభం కాని దుస్థితి బాలాజీచెరువు (కాకినాడ సిటీ) : ఎనిమిది జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్, ఫార్మసీ మేనేజ్మెంట్ కళాశాలలకు వేదికగా ఉన్న జేఎ¯ŒSటీయూకేలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. వర్సిటీగా ఆవిర్భవించి దాదాపు పదేళ్లు కావస్తున్నా ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి కావడం లేదు. వర్సిటీగా ప్రకటించిన మూడో సంవత్సరంలో విడుదలైన నిధులతో కొన్ని ఆధునిక భవనాలను నిర్మించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక లోటు పేరుతో వర్సిటీకి నిధులు ఇవ్వలేమని, ఉన్న వనరులతో అభివృద్ధి చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిíస్థితి ఏర్పడింది. దాదాపు మూడేళ్ల క్రితం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భవనాలను వినియోగంలోకి తీసుకురాగలిగితే గొప్ప విషయంగా వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థులు వ్యాపారవేత్తలుగా రాణించేలా వారిని తీర్చిదిద్దడానికి జేఎ¯ŒSటీయూకేలో ఏర్పాటు చేసిన డిజై¯ŒS ఇన్నోవేష¯ŒS రీసెర్చ్ కేంద్రం నేటికీ ప్రారంభం కాలేదు. విద్యార్థులు ఉత్తమ వ్యాపార వేత్తలుగా ఎదిగేందుకు అవసరమయ్యే సలహాలను ఇవ్వడానికి ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో సుమారు రూ.3.50 కోట్ల విలువైన పరికరాలు సమకూర్చారు. ఆంధ్రా ఎలక్ట్రానిక్స్, టీసీఎస్ తదితర సంస్థలు శిక్షణకు ముందుకు వచ్చాయి. ఈ భవన నిర్మాణం పూర్తయి ఎనిమిది నెలలైనా ప్రారంభించలేదు. దీంతో కొనుగోలు చేసిన పరికరాలు నిరుపయోగంగా మారాయి. విద్యార్థుల సౌకర్యార్థం స్టూడెంట్ ఎమినిటీ భవనం నిర్మించారు. బ్యాంకు, క్యాంటీన్, రీడింగ్‌రూమ్, బుక్‌స్టాల్ తదితర సదుపాయాలన్నీ ఒకేచోట ఉండేలా ఈ భవనాన్ని నిర్మించారు. అయితే ఈ భవనంలో కేవలం బ్యాంకు మాత్రమే ఏర్పాటు చేశారు. మరే సదుపాయాలు కల్పించకపోవడంతో ఆ భవనం నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం క్యాంటిన్, బుక్‌స్టాల్ పాత భవనంలో ఇరుకుగదిలోనే నిర్వహిస్తున్నారు. వర్సిటీ అధికారులు ఇప్పటికైనా స్పందించి నిర్మించిన భవనాలనైనా వినియోగంలోకి తేవాలని విద్యార్థులు కోరుతున్నారు. అందుబాటులోకి తెస్తాం.. డిజై¯ŒS ఇన్నోవేష¯ŒS సెంటర్‌ను ముఖ్యమంత్రితో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. నిర్మించిన స్టూడెంట్ ఎమినిటీ భవనంలో ప్రస్తుతానికి బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తునాం. మిగతావన్నీ ఇక్కడికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తాం. – వీఎస్ఎస్ కుమార్, జేఎ¯ŒSటీయూకే ఉపకులపతి -
చిన్న పరిశ్రమకు ‘పెద్ద’ దెబ్బ
- పెద్ద నోట్ల రద్దుతో కుదేలు - భారీగా తగ్గిపోరుున ఉత్పత్తి - రోడ్డున పడుతున్న దిన కూలీలు - స్తబ్దుగా రాజధాని పారిశ్రామికవాడలు సాక్షి, హైదరాబాద్: క్లాసిక్ టైల్స్. నాచారం పారిశ్రామిక ప్రాంతంలో ఒక చిన్న పరిశ్రమ. కొత్తగా నిర్మించే భవనాలు, అపార్ట్మెంట్ల నుంచి ఆర్డర్లపై టైల్స్ ఉత్పత్తి చేస్తుంది. రోజుకు 200 నుంచి 300 మంది కార్మికులు పని చేస్తారు. బ్యాంకు రుణాలందక, ప్రభుత్వ ప్రోత్సాహకాల్లేక అసలే ఆర్థిక ఇబ్బందులుంటే... పెద్ద నోట్ల రద్దు మూలిగే నక్కపై తాటిపండులా మారింది. ఆర్డర్లు సగానికి సగం తగ్గడంతో ఉత్పత్తినీ తగ్గించారు. సంస్థనే నమ్ముకున్న దిన కూలీలు రోడ్డున పడ్డారు. ‘పరిశ్రమను నడపడం చాలా కష్టంగా ఉంది. కూలీలకు డబ్బులివ్వలేకపోతున్నాం’ అన్నది యజమాని వెంకన్న ఆవేదన. హైదరాబాద్ చుట్టూ వేలాదిగా విస్తరించిన కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలదీ ఇదే దుస్థితి. వాటినే నమ్ముకున్న కార్మికులేమో కష్టాల కొలిమిలో మగ్గుతున్నారు!! అన్ని రంగాలదీ ఇదే దుస్థితి హైదరాబాద్ చుట్టుపక్కల జీడిమెట్ల, బాలానగర్, కాటేదాన్, బొల్లారం, సనత్‌నగర్, పటాన్చెరు, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో 45 వేల దాకా మధ్య తరహా, చిన్న, కుటీర పరిశ్రమలున్నారుు. వీటిలో సుమారు 10 వేల గృహ అనుబంధ వస్తూత్పత్తి పరిశ్రమలున్నారుు. తెలుగు రాష్ట్రాల నుంచేగాక మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది కార్మికులు వీటిలో సంఘటిత, అసంఘటిత విభాగాల్లో పని చేస్తున్నారు. నగరం చుట్టూ విస్తరించిన రియల్ ఎస్టేట్ రంగం డిమాండ్లకు అనుగుణంగా ఐరన్, స్టీల్, ఫర్నిచర్, టైల్స్, సిమెంట్, పెరుుంట్స్, వెల్డింగ్, కెమికల్స్, ప్లాస్టిక్, టెక్స్టైల్స్, ఆహార తదితర పరిశ్రమలన్నీ నోట్ల రద్దు దెబ్బకు కుదేలయ్యారుు. బ్యాంకు రుణాలు, వడ్డీ రేట్లతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఈ పరిశ్రమలను నోట్ల రద్దు గట్టి దెబ్బే కొట్టింది. ‘‘రుణాలపై 12 నుంచి 14 శాతం వడ్డీ, రూ.50 వేల నుంచి లక్ష దాకా కరెంటు చార్జీలు, మౌలిక సదుపాయాలు, ముడి సరుకు, జీతభత్యాలు, రవాణా ఖర్చుల వంటివన్నీ కలిపి ప్రతి చిన్న పరిశ్రమపైనా కోట్లలో భారం పడుతోంది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాల్లేవు. సబ్సిడీలూ ఆగిపోయారుు. నోట్ల రద్దు దెబ్బకు ఇప్పుడు ఆర్డర్లూ బాగా తగ్గారుు’ అని నాచారానికి చెందిన పలు పరిశ్రమల యజమానులు వాపోతున్నారు. ఉత్పత్తి తగ్గడంతో, పరిశ్రమల మనుగడకు ప్రాణాధారమైన విద్యుత్ వినియోగమూ తగ్గింది. రాజధానిలోని అన్ని పరిశ్రమలకు రోజుకు సగటున 1,500 మెగావాట్ల హై టెన్షన్ విద్యుత్ వినియోగమయ్యేది 1,200 మెగావాట్లకు పడిపోరుుందని అంచనా. కాటేదాన్‌లో విస్తరాకులు, వెల్డింగ్, ఫర్నిచర్ వంటి 1,000కి కుటీర పరిశ్రమలు ఆర్డర్లు లేక కుదేలయ్యారుు. వీటిలో పని చేసే బిహార్, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి తదితర ప్రాంతాల కార్మికులకూ ఉపాధి కరువైంది. సగానికి తగ్గింది ‘‘అన్ని చిన్న తరహా పరిశ్రమల్లోనూ ఉత్పత్తి సగానికి సగం తగ్గింది. వైఎస్ హయాంలో మావంటి పరిశ్రమలకు పావలా వడ్డీ రుణాలు లభించేవి. పెద్ద నోట్ల రద్దుతో ఆర్డర్లు పడిపోరుు పరిస్థితి దారుణంగా మారింది’’ - వెంకన్న, తెలంగాణ చిన్న తరహా పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు కూలీలూ నష్టపోతున్నారు.. మాది ప్లాస్టిక్ పరిశ్రమ. రోజూ 10 మంది పని చేస్తారు. ఏ రోజు కూలీ ఆ రోజే ఇవ్వాలి. పెద్ద నోట్లు చెల్లక పని మాన్పించాను. మావంటి కుటీర పరిశ్రమలే గాక వాటిపై బతుకున్న కూలీలూ తీవ్రంగా నష్టపోతున్నారు. - పి.సురేశ్, ఓ కుటీర పరిశ్రమ -
గ్రంథాలయాలకు సొంత భవనాలు
- రూ. 1. 40 కోట్లతో నిర్మాణ పనులు – 20 గ్రంథాలయ శాఖల్లో వచ్చే నెల నుంచి బయోమెట్రిక్ విధానం -జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి కోవెలకుంట్ల: జిల్లాలో మొదటి విడత కింద ఏడు గ్రంథాలయ శాఖలకు రూ. 1.40 కోట్లతో సొంత భవనాలు నిర్మిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మంగళవారం కోవెలకుంట్ల శాఖ గ్రంథాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించారు. లైబ్రరీలో వివిధ రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 59 గ్రంథాలయ శాఖలు ఉండగా 12కు సొంత భవనాలు ఉన్నాయని, 27 శాఖలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయని 25 శాఖలను పంచాయతీ భవనాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సొంత భవనాలు నిర్మించేందుకు 20 మండలాల్లో స్థలాలు సేకరించామని, బనగానపల్లె, పత్తికొండ, వెలుగోడు, దేవనకొండ, ప్యాపిలి, అవుకు, ఆత్మకూరు పట్టణాల్లో సొంత భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండవ విడతలో మరో 9 భవనాలు నిర్మించేందుకు డైరెక్టరేట్‌కు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఆయా గ్రంథాలయాల్లో పర్మీచర్కు రూ. 10లక్షలు నిధులు కేటాయించామన్నారు. సొంత భవనాలు ఉన్న గ్రంథాలయాల్లో కంప్యూటర్, ఇంటెర్నెట్ సౌకర్యం కల్పించేందుకు రూ. 5 లక్షలు నిధులు విడుదలయ్యాయన్నారు. వచ్చే నెల నుంచి కోవెలకుంట్లతోపాటు జిల్లాలోని 20 గ్రంథాలయ శాఖల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, బయోమెట్రిక్ విధానం అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని ఆయాగ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీల నుంచి గ్రంథాలయ శాఖలకు రూ. 4 కోట్ల సెస్ బకాయి ఉందని, త్వరగా ఆయా విభాగాల అధికారులు బకాయి చెల్లించి గ్రంథాలయాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
వెలగపూడిలో 3 నుంచి పూర్తి స్థాయి విధులు
* భవనాలు, అంతస్తులు, గదుల వారీగా శాఖలకు కేటాయింపు * ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్/అమరావతి: ఏళ్ల తరబడి హైదరాబాద్ సచివాలయంతో పెనవేసుకున్న అనుబంధం వచ్చే నెల 3వ తేదీ నుంచి తెగిపోతోంది. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. ఇన్నేళ్ల నుంచి హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తూ వెలగపూడి సచివాలయంలో పనిచేసేందుకు వెళ్లిపోతున్న ఉద్యోగులు.. ఇందులో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. అక్టోబర్ 3 నుంచి వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో పూర్తి స్థాయి విధులు నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ జీవో జారీ చేశారు. ఈ జీవోతోపాటు వెలగపూడి సచివాలయ భవనాల్లో శాఖల వారీగా గదులను అధికారులకు కేటాయించారు. వివరాలివీ.. ఒకటో భవనం గ్రౌండ్ ఫ్లోర్: సాధారణ పరిపాలన శాఖ, న్యాయశాఖ అధికారులు, ఉద్యోగులు రెండో భవనం గ్రౌండ్ ఫ్లోర్: మున్సిపల్, హోం, ఇంధన-మౌలిక వసతులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమల శాఖ అధికారులు, ఉద్యోగులు రెండో భవనం తొలి అంతస్తు: ఆర్థిక, ప్రణాళికా శాఖల అధికారులు, ఉద్యోగులు మూడో భవనం గ్రౌండ్ ఫ్లోర్: టెలికం, ప్లే స్కూలు, మీ-సేవ, పోస్టాఫీస్, బ్యాంకు, డిస్పెన్సరీ, అసోసియేషన్స్, ఐటీ డేటా సెంటర్, ఎన్ఐసీ, సెంట్రల్ రికార్డు బ్రాంచ్, ఏపీటీఎస్, లైబ్రరీలు మూడో భవనం తొలి అంతస్తు: బీసీ, మైనార్టీ, సాంఘిక, గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ, యువజన సర్వీసు శాఖల అధికారులు, ఉద్యోగులు నాల్గో భవనం గ్రౌండ్ ఫ్లోర్: వ్యవసాయ, పశుసంవర్థక, అటవీ పర్యావరణ, రెవెన్యూ శాఖల అధికారులు, ఉద్యోగులు నాల్గో భవనం తొలి అంతస్తు: ఉన్నత విద్య, ఐటీ, మాధ్యమిక విద్య, జలవనరులు, ఆర్ఎస్ఏడీ శాఖల అధికారులు, ఉద్యోగులు ఐదో భవనం గ్రౌండ్ ఫ్లోర్: వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, కార్మిక, స్కిల్ డెవలప్మెంట్ శాఖల అధికారులు, ఉద్యోగులు ఐదో భవనం తొలి అంతస్తు: రహదారులు-భవనాలు, విజిలెన్స్ కమిషన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, డిప్యూటీ పే అండ్ అకౌంట్ ఆఫీస్ అధికారులు, ఉద్యోగులు -
క్రమ‘బద్ధ’కంగా
నెలాఖరవుతో ముగుస్తున్న గడువు జిల్లాలో అనధికార కట్టడాలు సుమారు 10,000 వచ్చిన దరఖాస్తులు 6,690 రెగ్యులైజేషన్‌లో తాత్సారం క్రమబద్దీకరణ జరిగినవి కేవలం 929 మాత్రమే పరిశీలనలో 5,757 మండపేట : బీపీఎస్ రెగ్యులైజేషన్‌లో ఎడతెగని జాప్యం చోటుచేసుకుంటోంది. వచ్చిన అరకొర దరఖాస్తుల క్రమబద్దీకరణ నత్తనడన సాగుతోంది. తొమ్మిది నెలల వ్యవధిలో పూర్తయినవి కేవలం 13 శాతం మాత్రమే. నెలాఖరుతో భవనాల క్రమబద్ధీకరణ గడువు ముగియనుండగా నిర్ణీత లక్ష్యం చేరుకోవడం ప్రశ్నార్ధకంగా మారింది. బీపీఎస్‌కు జిల్లాలోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల నుంచి 6,690 దరఖాస్తులు రాగా కేవలం 929 మాత్రమే క్రమబద్ధీకరించారు. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్) ద్వారా పట్టణ ప్రాంతాల్లో 1985 జనవరి 1వ తేదీ నుంచి 2014 డిసెంబరు 31 మధ్యకాలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు గత ఏడాది మే నెల నుంచి డిసెంబరు నెలాఖరవు వరకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో దాదాపు 10 వేలు వరకు అనధికార కట్టడాలుండగా వీటి ద్వారా ఆయా స్థానిక సంస్థలకు సుమారు రూ.25 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా. నిర్ణీత గడువు ముగిసేనాటికి 6,690 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వీటి ద్వారా సుమారు రూ.8 కోట్లు ఆదాయం మాత్రమే సమకూరనుంది. జాప్యం ఇలా... మొదటి నుంచీ భవనాల క్రమబద్ధీకరణలో ఎడతెగని జాప్యం చోటుచేసుకుంటోంది. జనవరి నుంచి రెగ్యులైజేషన్ చేపట్టారు. జూలై నెలాఖరు నాటికి భవనాల క్రమబద్ధీకరణకు గడువు ముగియగా పదిశాతం కూడా పూర్తికాకపోవడంతో మరో రెండు నెలలపాటు ప్రభుత్వం గడువు పెంచింది. మరో రెండు రోజుల్లో గడువు ముగియనుండగా 77 శాతం దరఖాస్తులు ఇంకా ప్రోసెసింగ్లోనే ఉన్నాయి. మొత్తం 6,690 దరఖాస్తులు రాగా మంగళవారం నాటికి ఆన్లైన్ వివరాలు మేరకు రాజమండ్రి కార్పొరేషన్లో రెండు, అమలాపురంలో రెండు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన వాటిలో 929 దరఖాస్తులు పరిష్కరించగా మిగిలిన 5,757 దరఖాస్తులు ప్రోసెసింగ్‌లో ఉన్నాయి. క్రమబద్ధీకరణలో పెద్దాపురం మున్సిపాల్టీ ముందంజలో ఉండగా కాకినాడ, రాజమండ్రి నగర పాలక సంస్థలతోపాటు అమలాపురం, మండపేట తదితర పలు మున్సిపాల్టీల్లో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్లాన్‌కు సంబంధించిన వివరాలు, యజమాని ఆధార్‌కార్డు, అటెస్టెడ్ దస్తావేజు కాపీలు తదితర వివరాలను ఆన్‌లైన్‌కు అప్లోడ్ చేయడంలో జాప్యం, దరఖాస్తుదారుల నుంచి పెనాల్టీ సొమ్ములు సకాలంలో వసూలు కాకపోవడం తదితర కారణాలతో క్రమబద్దీకరణ ఆశించిన స్థాయిలో జరగడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలాఖరవుతో గడువు ముగుస్తుండటంతో మిగిలిన దరఖాస్తులు ఏ మేరకు పరిష్కారమవుతాయనేది అనుమానాలకు తావిస్తోంది. గడువు ముగిసేనాటికి క్రమబద్ధీకరణ జరగకుంటే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధమమవుతోంది. ప్రోసెసింగ్‌లో ఉన్నందున చాలా వరకు క్రమబద్ధీకరణవుతాయని పట్టణ ప్రణాళికా విభాగం అధికారవర్గాలంటున్నాయి. జిల్లాలోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో వచ్చిన దరఖాస్తులు, ఇప్పటి వరకు వాటి ప్రగతి వివరాలు కింది విధంగా ఉన్నాయి. పట్టణం వచ్చిన దరఖాస్తులు పరిష్కారమైనవి ప్రోసెసింగ్‌లో ఉన్నవి కాకినాడ 2,077 157 1,920 రాజమండ్రి 2,923 507 2,414 అమలాపురం 392 13 377 మండపేట 302 12 290 పెద్దాపురం 203 99 104 పిఠాపురం 119 17 102 రామచంద్రపురం 37 1 39 సామర్లకోట 51 19 32 తుని 421 71 350 గొల్లప్రోలు 38 4 34 ముమ్మిడివరం 79 11 68 ఏలేశ్వరం 45 18 27 -
శిథిల భవనాలు ఖాళీ చేయాలి
సాక్షి,సిటీబ్యూరో: ఏక్షణాన్నయినా కూలే ప్రమాదం ఉన్న పురాతన, శిథిల భవనాల యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు వర్షం తీవ్రత ఎక్కువ కావడంతో తమ చర్యలను మరింత వేగవంతం చేశారు. ఇందులో భాగంగా శిథిల భవనాలతోపాటు, బీఆర్ఎస్కు నిర్ణీత గడువు ముగిశాక నిర్మించిన అక్రమ భవనాలను కూల్చి వేస్తున్నారు. శిథిల భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు, నివాసితులకు నోటీసులు జారీ చేశారు. పురాతన భవనాల్లో కొనసాగుతున్న రామ్‌గోపాల్‌పేట పోలీస్‌స్టేషన్, యూసుఫ్‌గూడ పోలీస్క్వార్టర్స్లకు కూడా నోటీసులు అందజేశారు. గత రెండు వారాల్లో 132 భవనాలను కూల్చివేసిన అధికారులు 23 భవనాల్లోని వారిని ఖాళీ చేయించారు. మరో 31 భవనాల యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శుక్రవారం ఒక్కరోజే 48 శిథిల భవనాలను కూల్చివేశారు. 12 భవనాలను స్వచ్ఛందంగా ఖాళీచేసి సహకరించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఒక భవనాన్ని సీజ్ చేశామన్నారు. -
ఒకే గూటికి పోలీస్
అర్బన్ జిల్లా పరిధిలో చురుగ్గా భవనాల నిర్మాణం త్వరలోనే ప్రారంభోత్సవాలు రాజమహేంద్రవరం క్రైం : రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని పోలీస్ కార్యాలయాలన్నీ ఒకే గొడుగు కిందకు రానున్నాయి. సుమారు 17. 47 కోట్లతో అర్బన్ కార్యాలయం, డిస్ట్రిక్ ఆర్్మడ్ ఫోర్స్ కార్యాలయం, బెల్ ఆఫ్ ఆర్్మ్స(ఆయుధ గారం), డీఐజీ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం తదితర భవనాలన్నింటినీ రాజమహేంద్రవరం లాలా చెరువు వద్దగల ఓఎన్జీసీ కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ పోలీస్ కార్యాలయాలకు సరైన భవనాలు లేక శి«థిలావస్థకు చేరిన భవనాల్లోనే కొనసాగాయి. జాంపేట వద్ద ఆర్్మడ్ రిజర్వు కార్యాలయం పూర్తిగా పాడైపోయింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా శిథిలావస్థకు చేరడంతో తాత్కాలికంగా నిర్మించిన భవనంలో పరిపాలన సాగిస్తున్నారు. అన్ని డీఎస్పీ కార్యాలయాలు అద్దె భవనాలలోనే పరిపాలన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నింటినీ ఓకేచోట నిర్మిస్తున్నారు. రూ.14 కోట్లతో.. అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయం రూ. 14 కోట్లతో రూపుదిద్దుకుంటోంది. ఈ భవనంలో పరిపాలన, మినిస్ట్రీయల్, వేలిముద్రల టీమ్, ఐటీ టీమ్, క్రైం తదితర శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి. అలాగే క్రైం సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు పెద్ద కాన్ఫెరెన్స్ హాల్ కూడా నిర్మిస్తున్నారు. ప్రత్యేక ఆయుధ గారం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాకు సంబంధించిన ఆయుధ గారం బెల్ ఆఫ్ ఆర్మ్స్ (ఆయుధ గారం) ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ అధునాతన ఆయుధాలు దాచేందుకు వీలుగా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. చుట్టూ రక్షణ కంచెతో నిర్మించిన ఈ భవనంలో ఆయుధాలు దాచేందుకు వీలుగా నిర్మాణం జరిగింది. ఆర్్మడ్ రిజర్వు ఫోర్స్ ఇక్కడ నుంచే కార్యాకలాపాలు సాగిస్తుంది. సీఐడీ భవనం సీఐడీ భవనం ప్రస్తుతం ఏవీ అప్పారావు రోడ్డులో అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ విభాగపు నూతన భవనాన్ని రూ 3.47 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పనులు వేగవంతగా జరుగుతున్నాయి. ఈ భవనం 2017 జనవరి కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. కాగా..అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండడం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. త్వరలో నూతన భవనాల్లోకి.. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయం మరో నెల రోజుల్లో పూర్తికానుంది. త్వరలోనే ప్రారంభోత్సవం జరుగుతుంది. ప్రస్తుతం అద్దె భవనాల్లో పోలీస్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. –బి.రాజకుమారి, అర్బన్ ఎస్పీ -
పోలీస్ కార్యాలయ భవనాలను పరిశీలించిన డీఎస్పీ
కోదాడఅర్బన్: త్వరలో కోదాడ పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు కానున్నందున నూతనంగా మండల పరిధిలోని కొమరబండలో ఏర్పాటు చేసే డీఎస్పీ కార్యాలయంతో పాటు అనంతగిరిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న పోలీస్‌స్టేషన్ భవనాలను శుక్రవారం సూర్యాపేట డీఎస్పీ సునితామోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా భవనాల్లోని వసతులు, కార్యాలయం చేపట్టాల్సిన అంశాలను ఆమె పరిశీలించారు. అయితే అనంతగిరి పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు ఎంపిక చేసిన పాత గ్రామపంచాయతీ కార్యాలయం చిన్నదిగా ఉండడంతో అక్కడ ఉన్న మరో ఇంటిని పరిశీలించారు. ఈ కార్యకక్రమంలో ఆమె వెంట కోదాడ పట్టణ సీఐ రజితారెడ్డి, రూరల్ ఎస్ఐ విజయప్రకాశ్లున్నారు. -
భవనాల పరిశీలన
మరికల్ (ధన్వాడ) : కొత్త మండలంగా ఏర్పడిన మరికల్లో తాత్కాలిక తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు బుధవారం ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ శంకరయ్య ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు పంచాయతీ కార్యాలయం అణువుగా ఉంటుందని, ఆర్డీఓ ప్రజాప్రతినిధులకు సూచించారు. పాత ఆస్పత్రిలో తహసీల్దార్ కార్యాలయం కొనసాగిస్తే బాగుటుందని సర్పంచ్ జోగులక్ష్మీరామస్వామి అధికారులకు వివరిం చారు. ఇందుకు గాను అధికారులు మరికల్‌లోని పాత పీహెచ్సీ ఆస్పత్రి, సింగిల్‌విండో కార్యాలయం, వ్యవసాయగోదాం, గ్రంథాలయం, ఆయుర్వేద ఆస్పత్రి, పశుఆస్పత్రి భవనలను పరిశీలించారు. వీటిలో ఏదో ఒక భవనం ఎంపిక చే సి తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుం టామని తహసీల్దార్ శంకరయ్య తెలిపారు. పరిశీలించిన ప్రభుత్వ భవనాల వివరాలను ఉన్నత అధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు రామస్వామి, బుచ్చప్ప, రవి, వెంకట్రామారెడ్డి, తిరుపతయ్య, హన్మిరెడ్డి, కృష్ణయ్య, రాములు, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేస్తూ ఇరుక్కుపోయాడు
ఓక్లాండ్: అమ్మాయి పక్కన ఉన్నా.. కనుచూపు మేరలో ఉన్నా ఆ అబ్బాయిని అప్పటికప్పుడు ఓ వింత ప్రవర్తన ఆవహిస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. గర్ల్ ప్రెండ్ అయినా లేక మరో అమ్మాయి అయినా.. ఆమెను ఆకర్షించేందుకు ఓ అబ్బాయి చేసే ప్రయత్నం అంతా ఇంతా ఉండదు. ఆ క్రమంలో సక్సెస్ అయ్యే వాళ్లేమోగానీ.. ఫేలై నవ్వులపాలయ్యేవారే అధికం. సరిగ్గా ఓక్లాండ్కు చెందిన ఓ అబ్బాయికి ఇదే పరిస్థితి ఎదురైంది. తన గర్ల్ ప్రెండ్ తో కలిసి భవనం పై అంతస్థుకు వెళ్లిన యువకుడు ఆమెను ఇంప్రెస్ చేసేందుకు పక్క భవనంపైకి దూకే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పట్టుదప్పి కాలు జారి రెండు భవనాల సందులో పడ్డాడు. దాదాపు నాలుగుగంటలపాటు అందులో ఇరుక్కుపోయి నరకం చూశాడు. పీటర్స్ బర్గ్ కు చెందిన అత్యవసర సేవల విభాగ అధికారులు గోడలకు రంధ్రం చేసి అతడిని బయటకు తీశారు. -
శిథిలాసవ్థలో గ్రామ పంచాయతీ భవనాలు
మునుగోడు: దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు. అలాంటి గ్రామాల అభివృద్ధి జరిగితేనే దేశాభివృద్ధి జరుగుతుందనేది సత్యం. వాటిని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక పాలక వర్గం ఉన్నా, వారు సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాలకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో అవి నేడు పనికిరాకుండా పోయాయి. దీంతో గ్రామ పాలకవర్గం, సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉండలేక పోతున్నారు. శి«థిలమైన భవనంలో ఉంటే ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆదోళన చెందుతున్నారు. ఈ విషయం సంబంధిత ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులకు తెలిసినా వారు పట్టించుకోక పోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది. మండల వ్యాప్తంగా 11 భవనాలు శిథిలం.. మండల వ్యాప్తంగా 21 గ్రామ పంచాయతీలుండగా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాలు ఉన్నాయి. కానీ అందులో 11 భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇవి ఈ స్థితికి చేరి దాదాపు 8 ఏళ్లు కావస్తున్నా వాటి విషయాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రధానంగా చీకటిమామిడి, ఇప్పర్తి, కల్వలపల్లి, సింగారం, వెల్మకన్నె గ్రామాల్లోని కార్యాలయాలు వర్షాకాలంలో కురుస్తూ స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయి. దీంతో అవి ఎప్పుడు కూలిపోతాయోన నే భయంతో ఆ భవనాల్లో ఉండేందుకు సర్పంచ్, ప్రభుత్వ ఉద్యోగులు సుముఖత చూపడంలేదు. దీంతో ఆ కార్యాలయాలు ఎప్పుడూ తాళం వేసి ఉంటున్నాయి. ఏదైనా ప్రభుత్వ కార్యకలపాలు చేపట్టాల్సి వచ్చినప్పుడు దాని ఎదురుగా టెంట్‌ను ఏర్పాటు చేసి నిర్వహించాల్సి వస్తుంది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శిథిలమైన భవనాల స్థానంలో నూతన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి నిర్మాణాలు చేయించాలని పలువురు సర్పంచ్‌లు, వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు. కప్పు పై పెచ్చులు ఊడిపడుతున్నాయి.. – బూడిద మల్లేశ్వరి ( ఇప్పర్తి సర్పంచ్ ) గ్రామ పంచాయతీ కార్యాలయం పూర్తిగా శిథిలమవడంతో వర్షాకాలంలో పైకప్పు పెచ్చులు ఊడిపడిపోతున్నాయి. దీంతో అందులో ఉంటే ఏ ప్రమాదం జరుగుతుందోన నే భయమేస్తుంది. దానిని పూర్తిగా తొలగించి నూతన భవనం నిర్మిస్తే బాగుండు. టెంట్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది దైంద అలివేలు( వెల్మకన్నె సర్పంచ్) గ్రామ పంచాయతీ భవనం పూర్తిగా శిథిలం కావడంతో అందులో సభలు, సమావేశాలు నిర్వహించలేక పోతున్నాం. ఏదైనా ప్రత్యేకంగా నిర్వహించాల్సి వచ్చినప్పుడు బయట టెంట్ ఏర్పాటు చేసుకుంటున్నాం. మా పరిస్థితి ఎవరికి చెప్పినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. -
10వ తేదీ కల్లా భవనాలు సిద్ధం:నారాయణ
►ఏపీ మంత్రి నారాయణ వెల్లడి ►తాత్కాలిక సచివాలయంలో పలు కార్యాలయాలు ప్రారంభం అమరావతి : ఏపీలోని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ సముదాయ భవనాలన్నీ 10వ తేదీ నాటికి పూర్తవుతాయని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. గురువారం ఉదయం 9.45 గంటల కు పురపాలక శాఖ కార్యాలయాన్ని నారాయణ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఇకపై తాత్కాలిక సచివాలయం నుంచే పాలన కొనసాగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హోంశాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. కృష్ణా పుష్కరాలను డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఏపీ మంత్రి శిద్దా రాఘవరావు ఐదో భవనంలోని రవాణాశాఖ కార్యాలయంలో తన చాంబర్‌ను ప్రారంభించారు. పుష్కరాల సందర్భంగా మూడు జిల్లాల్లో రూ.400 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామని శిద్దా తెలిపారు. ప్రతి బస్టాండ్‌లో పుష్కర కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల, సీడీఎంఏ డెరైక్టర్ కె.కన్నబాబు, పల్లోంజి షాపోర్జి సంస్థ ప్రతినిధులుపాల్గొన్నారు. పూర్తి కాకున్నా ప్రారంభం... గురువారం ప్రారంభించిన రెండో భవనం ముఖద్వారం పూర్తి కాలేదు. నారాయణ ఉదయమే పురపాలక శాఖ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉండటంతో ద్వారం ముందు హడావుడిగా ఇసుక నింపి దానిపై గ్రీన్ కార్పెట్‌ను పరిచారు. రెండో భవనం ముందు భాగంలో ఓ వైపు టైల్స్ వేస్తుంటే.. మరోవైపు కార్యాలయాల ప్రారంభాల కోసం మంత్రులు, అధికారులు వెళ్లడం కనిపించింది. -
భవనాల ననూనాను ఇచ్చిన మలేషియా సంస్థ
-
భవనాలు, లే ఔట్లకు ఆన్లైన్ అనుమతులు
- 10 నుంచి రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో అమలు - 48 గంటల్లోపు తనిఖీ నివేదిక..30 రోజుల్లో అనుమతులు సాక్షి, హైదరాబాద్: భవనాలు, లే ఔట్ల నిర్మాణ అనుమతుల కోసం ఇకపై మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే చాలు.. 30 రోజుల్లో అనుమతులు అందనున్నాయి. భవనాలు, లే ఔట్లకు ఆన్లైన్ అనుమతుల కోసం ఇప్పటికే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల్లో అమలు చేస్తున్న ‘డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం (డీపీఎంఎస్)’ను ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రంలోని మిగతా 73 పురపాలికల్లోనూ అమల్లోకి తీసుకువస్తున్నారు. దీంతో దరఖాస్తు దశ నుంచి అనుమతి జారీ వరకు ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే జరుగనుంది. అనుమతి కోసం కావాల్సిన అన్ని పత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో దరఖాస్తుతోపాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. శరవేగంగా ప్రక్రియ దరఖాస్తు చేశాక 24 గంటల్లో స్థానిక పురపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతారు. తనిఖీ నివేదికను ఆన్లైన్లో నమోదు చేస్తారు. 48 గం టల తర్వాత దరఖాస్తుదారులు ఆ తనిఖీ నివేదికను డౌన్లోడ్ చేసుకుని అందులోని వివరాలను తెలుసుకోవచ్చు. ఇక లే ఔట్లు, భవనాల అనుమతి కోసం ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకోగానే టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పిన ఫీజును దరఖాస్తుదారులు చెల్లిస్తున్నారు. ఇకపై అనుమతుల కోసం ము న్సిపాలిటీలకు చెల్లించాల్సిన ఫీజుల వివరాలు ఆన్లైన్ ద్వారా తెలిసిపోతుంది. ఇక ప్రక్రియ మొత్తం పూర్తికాగానే అనుమతి జారీ చేసినట్లు స్థానిక మున్సిపల్ కమిషనర్ వెబ్సైట్లో నమోదు చేస్తారు. అధికారుల డిజిటల్ సంతకాలతో అనుమతి పత్రం సాఫ్ట్‌కాపీ రూపంలో దరఖాస్తుదారు ఈ-మెయిల్‌కు వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో దరఖాస్తు చేసుకునేవారు మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అవసరమే ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. డ్యాష్ బోర్డులతో అవినీతికి తెర భవనాలు, లే ఔట్లకు అనుమతుల కోసం ఆన్లైన్లో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి 30 రోజుల గడువు విధించారు. దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం కోసం మున్సిపాలిటీలు తీసుకుంటున్న చర్యలను నిరంతరం సమీక్షించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి, డెరైక్టరేట్‌తో పాటు డీటీసీపీ కార్యాలయాల్లో డ్యాష్ బోర్డు తెరలను ఏర్పాటు చేస్తారు. దరఖాస్తుల పరిష్కారం స్థితిగతులకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం డ్యాష్ బోర్డులపై కనిపిస్తుంది. దీంతో ఎక్కడెక్కడ జాప్యం జరుగుతుందో ఉన్నతాధికారులకు తెలిసిపోతుంది. అందువల్ల కింది స్థాయి అధికారులు గడువులోగా దరఖాస్తులను పరిష్కరించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని... అనుమతుల జారీలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రపంచ బ్యాంకు ర్యాంకుపై గురి పెట్టుబడులు, వ్యాపారానికి అనుకూల పరిస్థితుల (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పరంగా గతేడాది ప్రపంచ బ్యాంకు రాష్ట్రానికి 13వ ర్యాంకు కేటాయించగా... ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం 2వ ర్యాంకు ఇచ్చింది. తెలంగాణలో భవనాలు, లే ఔట్లకు ఆన్లైన్ అనుమతుల విధానం అమల్లో లేకపోవడమే ర్యాంకు తగ్గడానికి కారణం. ఏపీలోని 110 మున్సిపాలిటీల్లో ఆన్లైన్ అనుమతుల విధానాన్ని అమలు చేస్తుండడంతో ర్యాంకింగ్‌లో కలసి వచ్చింది. ఇక ఈ ఏడాదికి సంబంధించిన ర్యాంకులను త్వరలో ప్రపంచ బ్యాంకు వెల్లడించబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ అనుమతుల విధానాన్ని ప్రవేశపెట్టి ర్యాంకు మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
నివాసాలపై కూలిన విమానం
బీజింగ్: చైనా నౌకా దళానికి చెందిన విమానం ఒకటి నివాస సముదాయాలపై కూలింది. అదృష్టవశాత్తు పైలెట్ బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే, ఇతర నష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. బుధవారం సాయంత్రం 7.30గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు చైనా రక్షణ శాఖ తెలిపింది. జిజియాంగ్ ప్రావిన్స్ లోని తైజో అనే ప్రాంతంలో గల భారీ నివాస సముదాయాలపై ఇది కూలినట్లు వివరించారు. అయితే కూలింది ఏరకమైన విమానమో ఇంకా గుర్తించలేదు. సాధారణంగా చైనా నేవీ పాతకాలం నాటి జే-7, జే-8 విమానాలు ఉపయోగిస్తోంది. రష్యాకు చెందిన సుఖోయ్-27 విమానాలు కూడా తన ఆపరేషన్లకు ఉపయోగిస్తోంది. కాగా, ఈ విమానం శిక్షణలో ఉన్నప్పుడు కూలిపోయిందని, ఇటీవల ఇలాంటి ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని చైనా డిఫెన్స్ అధికారులు తెలిపారు. -
ఎమ్మెల్యేలు, ఎంపీలకు బంగ్లాలు
నియోజకవర్గ కేంద్రాల్లో అధునాతన సదుపాయాలతో నిర్మాణం సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం.. కొత్త అసెంబ్లీ.. కొత్త శాసన మండలి భవనం.. అధునాతనంగా సీఎం క్యాంపు కార్యాలయం... ఇదే వరుసలో ఇప్పుడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల అధికార నివాసాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2016-17 బడ్జెట్లోనే వీటికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చేనెలలోనే వీటికి శంకుస్థాపన చేయాలని, ఏడాది వ్యవధిలో నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్దేశించారు. సీఎం ఆదేశాలతో ఆర్అండ్బీ విభాగం సంబంధిత పనులను వేగవంతం చేసింది. వెంటనే నిర్మాణాలకు సరిపడే స్థలాలను గుర్తించి, సైట్ వివరాలతో పాటు సమగ్ర అంచనాలను పంపించాలని అన్ని జిల్లాల ఆర్అండ్బీ ఎస్ఈలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీ నియోజకవర్గాలన్నింటా భవనాలను నిర్మిస్తారు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులకు ప్రత్యేకంగా నియోజకవర్గాలు లేనందున ఈ సదుపాయాన్ని వర్తింపజేయటం లేదు. ఒక్కో బంగ్లా నిర్మాణానికి దాదాపు రూ.కోటి ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రానున్న బడ్జెట్లో వీటి నిర్మాణానికి రూ.120 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం సూచనప్రాయంగా అధికారులకు వెల్లడించారు. మిగిలిన నిధులు పనుల పురోగతికి అనుగుణంగా విడతల వారీగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాదిలోనే ఆలోచన పార్టీలకు అతీతంగా ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి ఒక అధికార నివాసం నిర్మించాలని సీఎం గత ఏడాదే తన ఆలోచనను వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కుటుంబంతో సహా నివాసం ఉండటంతో పాటు తమ వద్దకు వచ్చే ప్రజలను కలిసేందుకు వీలుగా కార్యాలయం కూడా అందులోనే ఉండాలని సూచించారు. సీఎం సూచనల ప్రకారం ఆర్ అండ్‌బీ ఇంజనీరింగ్ విభాగం డిజైన్లను సిద్ధం చేసింది. ఇటీవలే వీటిని పరిశీలించిన సీఎం రెండతస్తులుండే బంగ్లా నమూనాకు ఓకే చేశారు. ఇటీవల ఆర్అండ్బీ శాఖతో నిర్వహించిన బడ్జెట్ ప్రతిపాదనల సమీక్షలో భవనాల నిర్మాణాలకు ఎంత ఖర్చవుతుందని ఆరా తీసిన సీఎం.. పక్కాగా లెక్కలను అడిగి తెలుసుకున్నారు. మూడు నాలుగు భవనాలకు కలిపి టెండర్! ఒక్కో భవనాన్ని టెండర్ ద్వారా ఒక్కో కాంట్రాక్టరుకు అప్పగించాలా లేదా మూడు నాలుగు భవనాలకు కలిపి ఒకే టెండర్ పిలిచి కాంట్రాక్టర్లకు ఇవ్వాలా అనే అంశంపై కూడా సీఎం సమక్షంలో చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో పద్ధతికే మొగ్గు చూపారని, దీంతో కాంట్రాక్టర్ల సంఖ్య తగ్గడంతో పాటు పనుల్లో వేగం పెరుగుతుందని, ప్రభుత్వానికి పని భారం తగ్గుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేసినట్టు సమాచారం. వాస్తు ప్రకారం నిర్మాణాలు ఆర్అండ్బీ విభాగం రూపొందించిన రెండంతస్తుల నమూనాలో నిర్మాణాలకు సీఎం ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం బంగ్లాలోని గ్రౌండ్ ఫ్లోర్లో కార్యాలయం, మొదటి అంతస్తులో కుటుంబంతో పాటు ఎమ్మెల్యే నివాసం ఉంటుంది. వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తరం దిశలకు అభిముఖంగా వీటిని నిర్మిస్తారు. 2,070 చదరపు అడుగుల విస్తీర్ణంలో కింది ఫ్లోర్, అంతే విస్తీర్ణంలో రెండో ఫ్లోర్.. మొత్తంగా 4,140 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం ఉంటుంది. ఒక్కో చదరపు అడుగుకు రూ.2,415 చొప్పున ఖర్చు అవుతుందని ఆర్అండ్బీ విభాగం అంచనా వేసింది. బంగ్లా నిర్మాణానికి రూ.70.85 లక్షలు, సదుపాయాల కల్పనకు రూ.21.21 లక్షలు ఖర్చు కానున్నాయి. భవన నిర్మాణ అనుమతులు, నీటి సౌకర్యం, పారిశుధ్యం, విద్యుత్ సదుపాయం, కార్ షెడ్, కాంపౌండ్ వాల్లకు అయ్యే ఖర్చులు ఇందులో చేర్చారు. వీటికి తోడుగా వ్యాట్, సీనరేజ్ చార్జీలు, ఎన్ఏసీ, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపితే రూ. కోటి అవుతుందని అంచనా వేశారు. -
ఏకలవ్య భవనాలకు రీ-టెండర్లు!
గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఎస్ఈ సుబ్బారావు పార్వతీపురం: రాష్ట్రంలో ఐటీడీఏకి చెందిన 8 ఏకలవ్య పాఠశాలల భవనాల నిర్మాణాలకు రీ-టెండర్లు పిలవనున్నామని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఎస్ఈ ఎ.వి.సుబ్బారావు తెలిపారు. సోమవారం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.12 కోట్లు చొప్పున 8 పాఠశాలలకు రూ.84 కోట్లు కేటాయించారని చెప్పారు. ఈ పనులకు పిలిచిన టెండర్లను క్యాన్సిల్ చేయడంతో సంబంధిత కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారన్నారు. త్వరలో అది పరిష్కరించబడుతుందన్నారు. అనంతరం రీ-టెండర్లు పిలవాలని ప్రభుత్వం ఆదేశించింద ని తెలిపారు. అలాగే ఆశ్రమ పాఠశాలలకు కొత్తభవనాలు, మరమ్మత్తులు చేపడతామన్నారు. ఇటీవల బాసంగి పనుల రాద్ధాంతంపై విలేకరులు ప్రశ్నించగా.. నిర్వాసిత బాసంగిలో 36 పనులకు గాను ఇప్పటికీ ఓ మహిళా సంఘానికి 3 పనులు కేటాయించామన్నారు. మిగతా 33 పనులు వీటీడీఏలు, అక్కడ ఇంకా ఏమైనా మహిళా సంఘాలుంటే వాటికి ఆ పనులు అప్పగిస్తామన్నారు. అలాగే ఎస్డీఎఫ్లో భాగంగా రూ.18 కోట్లతో ఐటీడీఏ పరిధిలో రోడ్లు నిర్మాణానికి అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు పొందామని, వాటికితోడు ఉపాధిలో రూ.85కోట్లు మ్యాచింగ్ గ్రాంట్‌కు అనుమతులు కోరామన్నారు. -
ఇంధనం ఆదా...దేశానికే సేవ
♦ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ♦ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ ♦ ఇంధన పొదుపు పక్షోత్సవాల్లో ♦ ఉత్తమ డ్రైవర్లకు అవార్డులు సాక్షి, హైదరాబాద్: ముడి చమురులైన పెట్రో ల్, డీజిల్ పొదుపు చేసిన వారు యావత్ దేశానికి సేవ చేసిన వారవుతారని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ అన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) ఇంధన పొదుపు పక్షోత్సవాల సందర్భంగా శుక్రవారమిక్కడ ఉత్తమ డ్రైవర్లకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి ఉత్తమ కె.ఎం.పి.ఎల్ సాధించిన 11 మంది డ్రైవర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సునీల్‌శర్మ మాట్లాడుతూ.. దేశ అవసరాల కోసం దాదాపు 70శాతానికి పైగా విదేశాల నుంచే ముడి చమురు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, తద్వారా దేశ సంపద అధికశాతం వీటికే వెచ్చించాల్సి వస్తోందన్నారు. చమురు ఆదా చేయడం ద్వారా డబ్బులు మిగల్చుకోవడంతో పాటు కాలుష్యం తగ్గించవచ్చన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లు 0.1 కేఎంపీఎల్ పెంచితే ఏడాదికి సంస్థకు రూ.20 కోట్లు ఆదా చేసినవారవుతారన్నారు. సంస్థలో ఇప్పటికే 80శాతం డ్రైవర్లు 5.0 కేఎంపీఎల్‌ను అధిగమించారని, మిగతా 20శాతం సిబ్బంది కూడా ఇదే దారిలో నడిచి ఆర్టీసీ ఉన్నతికి పాటుపడాలన్నారు. అలాగే ఆర్టీసీలో కొత్తగా వస్తున్న సాంకేతికతను వినియోగించుకొని మరింత ముందడుగు వేయాలన్నారు. ఆర్టీసీ జేఎండీ జి.వి.రమణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎం.రవీందర్, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ ప్రతినిధి సువేందుగుప్త తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ డ్రైవర్లు వీరే... ఎం.వెంకన్న (వరంగల్-1), ఎస్.హనుమయ్య (ఖమ్మం), కె.బుచ్చయ్య (పరిగి), ఎం.డి.గౌస్ (మహబూబ్‌నగర్), పి.ఎమ్.ఎమ్.రావ్ (సంగారెడ్డి), ఎం.డి. హబీబ్(యాదగిరిగుట్ట), వి.ఎస్.కుమార్ (నిజామాబాద్-1), పి.విరేశం (కరీంనగర్-1), కె.గోపాల్‌రెడ్డి (హయత్‌నగర్-2), జి.కిష్టారెడ్డి (రాణిగంజ్-2), ఎస్.ఆర్.రావు (మంచిర్యాల) -
'విపత్తు తట్టుకునేలా నిర్మించాలి'
విశాఖపట్నం: ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించుకోవాలని, ప్రభావిత ప్రజల్లో అవగాహన పెంపొందించాలని రెండో ప్రపంచ విపత్తుల నివారణ సదస్సు సూచించింది. నాలుగు రోజుల పాటు విశాఖలో నిర్వహించిన ఈ సదస్సు ఆదివారం ముగిసింది. ప్రపంచంలోని 46 దేశాల నుంచి సుమారు 100 మంది నిపుణులు, వెయ్యి మంది ప్రతినిధులు హాజరయ్యారు. ముగింపు సభలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ప్రసంగించారు. ఆఖరి రోజున విశాఖపట్నం డిక్లరేషన్ పేరిట సదస్సులో చర్చించిన అంశాలు, చేసిన తీర్మానాలను నిపుణుల కమిటీ చైర్మన్, బిహార్ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఏకే సిన్హా వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంతోపాటు, వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలతో వచ్చే విపత్తుల నివారణపై మరింత దృష్టి సారించాలి. ఇంకా ఏం చెప్పారంటే.. విపత్తుల నిర్వహణకు పూర్తి స్థాయి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను ఏర్పాటు చేయాలి. ప్రకృతి వైపరీత్యాలకు నిధులు సమకూర్చే సమగ్ర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. విపత్తులకు ఎక్కువగా బాధితులయ్యే మహిళలు, పిల్లలు, యువత, వికలాంగులు, వృద్ధులపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. కింది స్థాయిలో నాలెడ్జ్ మేనేజిమెంట్, అన్వేషణలను ప్రోత్సహించేందుకు ఒక వేదికను రూపొందించాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం, ఇతర సంస్థలు విజయవంతంగా అమలు చేసిన చర్యలను, వాటి ఫలితాలను ఆయా దేశాలు పరస్పరం తెలియజేసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలపై చేపట్టే అవగాహన కార్యక్రమాల్లో పాఠశాల పిల్లలనూ భాగస్వాములను చేయాలి. వాతావరణ మార్పులు, వాటి పర్యవసనాలపై అవగాహన కల్పించాలి. గత వైపరీత్యాల తీవ్రత, నష్టాలు ప్రజలకు తెలిసేలా డిజాస్టర్ మ్యూజియం’లను ఏర్పాటు చేయాలి. సాయం అందించడంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే చర్యలు చేపట్టాలి. విపత్తుల నివారణకు అంతరిక్షం, టెలికాం, భూ విజ్ఞానశాస్త్రం, సైబర్, జియో మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. ఇకపై రెండేళ్లకోసారి ప్రపంచ స్థాయి డిజాస్టర్ మేనేజిమెంట్ సదస్సులు నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రకృతి విపత్తులను తట్టుకునేలా నిర్మించాలి. స్కూళ్లు, ఆస్పత్రులు, కాన్ఫరెన్స్ హాళ్లు వంటి భవనాల నిర్మాణాల్లో నాణ్యతపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. -
మహానగరాభివృద్ధిని ‘పాత’రేశారు!
పాత తేదీలతో లే అవుట్లు, భవనాలకు అనుమతులు * బిల్డర్లతో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ల కుమ్మక్కు * రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని 5 గ్రామాల్లో అక్రమాలు * హెచ్ఎండీఏ ప్రత్యేక విచారణలో వెల్లడి.. క్రిమినల్ కేసులకు సిఫారసు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలోని గ్రామాల్లో లే అవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు జారీలో భారీ అవకతవకలు జరుగుతున్నాయి. బిల్డర్లు, రియల్టర్లతో గ్రామ పంచాయతీల కార్యనిర్వహణాధికారులు(ఈఓలు), కార్యదర్శులు, సర్పం చ్‌లు కుమ్మక్కై ఏకంగా దశాబ్ద కాలం కింది నాటి పాత తేదీలతో దొడ్డిదారిలో అనుమతులు జారీ చేసేస్తున్నారు. అక్రమ మార్గంలో లభించిన అనుమతులతో బిల్డర్లు వందల సంఖ్యలో నివాస, వ్యాపార సముదాయాలతో పాటు గేటెడ్ కమ్యూనిటీలను ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఈఓలు, సర్పంచ్‌లకు లక్షల రూపాయల్లో మామూళ్లు అందుతున్నాయి. నేరుగా హెచ్ఎండీఏ కమిషనర్లు ఇవ్వాల్సిన అనుమతులను ఈవోలే ఇచ్చేస్తుండటంతో సంస్థకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని నిజాంపేట, గండి మైసమ్మ, ప్రగతినగర్, బౌరంపేట, దూలపల్లి గ్రామాల పరిధిలో అక్రమ అనుమతుల ఆరోపణలపై హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తాజాగా చేపట్టిన విచారణలో ఈ బాగోతం వెలుగు చూసింది. అధికార పరిధి దాటిన ఈఓలు... గ్రామ పంచాయతీ ఈఓల అధికారాలను కేవలం రెండంతస్తుల భవన నిర్మాణాల అనుమతుల వరకే పరిమితం చేస్తూ 2008 ఏప్రిల్ 17న హెచ్ఎండీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇంకా పాత తేదీలతో దొడ్డిదారిలో ఈఓలు మూడంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఈ ఐదు గ్రామాల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 36 భవన సముదాయాలతోపాటు ఆరు గేటెడ్ కమ్యూనిటీలను హెచ్ఎండీఏ బృందం పరిశీలించగా, అందులో 30 భవనాలకు స్థానిక గ్రామ పంచాయతీల ఈఓలు పాత తేదీలతో అనుమతులు జారీ చేసినట్లు బయటపడింది. అధికారులను ఈఓలు దుర్వినియోగం చేయడంతోపాటు బిల్డర్లతో కుమ్మక్కై భారీగా లంచాలు స్వీకరించినట్లు ఈ విచారణలో తేలింది. ఇక ఎల్ఆర్ఎస్ పథకం గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఈ గ్రామాల్లో పాత తేదీలతో అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరిస్తున్నట్లు హెచ్ఎండీఏ గుర్తించింది. ఈఓలు, సర్పంచ్‌లతో కుమ్మక్కైన బిల్డర్లు బౌరంపేట, మల్లంపల్లి గ్రామాల్లో సుమారు 45 ఎకరాల్లో పెద్ద మొత్తంలో గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్నట్లు బయటపడింది. ప్రభుత్వానికి హెచ్ఎండీఏ లేఖ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం బీపీఎస్ పథకాన్ని మళ్లీ ప్రవేశపెట్టనుందని, అప్పుడు అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవచ్చని ఈఓలు సలహా ఇవ్వడంతోనే బిల్డర్లు అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారని హెచ్ఎండీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఐదు గ్రామాల్లో అక్రమ మార్గంలో అనుమతులు జారీ చేసిన ఈఓలు, సర్పంచ్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా ప్రభుత్వానికి లేఖ రాశారు. అక్రమ లే అవుట్లు, కట్టడాల ఫొటోలు, ఇతర వివరాలతో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. -
హైదరాబాద్ లేకుండానైతే తెలంగాణ ఎప్పుడో వచ్చేది
హైదరాబాద్: నగర పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని, ఆ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని భూముల క్రమబద్ధీకరణ, అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణపై ముఖ్యమంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ప్రధానంగా హైదరాబాద్‌పైనే చర్చజరిగిందని, తెలంగాణకు హైదరాబాద్ నగరాన్ని దక్కించుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. హైదరాబాద్ లేని తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర నాయకులు అంగీకరించినా తాను అస్సలే ఒప్పుకోలేదని, హైదరాబాద్ లేని తెలంగాణ పన్నెండేళ్లకిందటే వచ్చేదని అన్నారు. చావు మీదకు తెచ్చుకొని హైదరాబాద్ దక్కించుకున్నామని సీఎం చెప్పారు. ఇలాంటి హైదరాబాద్ లో భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ఉండాలని, అందుకోసం స్పష్టమైన విధానాలు రూపొందించుకోవాలని తెలిపారు. మరోపక్క, జీహెచ్ఎంసీ పరిధిలో చెత్తసేకరణకు ఉపయోగించే ఆటో ట్రాలీ డిజైన్లకు కేసీఆర్ ఆమోదం చెప్పారు. ఇంటింటికీ సరఫరా చేసే బ్లూ, గ్రీన్ ప్లాస్టిక్ చెత్తబుట్టలను పరిశీలించారు. -
మూసేందుకు.. ముస్తాబెందుకో..!
పాలకులు, అధికారులకు ముందుచూపు కొరవవడంతో జిల్లాలో వివిధ పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేసిన రూ.7 కోట్లు వృథా కానున్నాయి. ఆదర్శ పాఠశాలల ఏర్పాటులో భాగంగా పలు ప్రాథమిక పాఠశాలలను మూసివేయనున్నారు. అయితే మూసివేయనున్న పాఠశాలల అభివృద్ధికి రూ.కోట్లు వ్యయం చేశారు. ఆ పాఠశాలలను త్వరలో మూసివేయనుండడంతో ఆ సొమ్మంతా బూడిదిలో పోసిన పన్నీరు చందంగా మారింది. విజయనగరం అర్బన్: ఆదర్శపాఠశాలల ఏర్పాటులో భాగంగా త్వరలో జిల్లాలో 194 ప్రాథమిక పాఠశాలలను మూసివేయనున్న సంగతి తెలిసిందే. అయితే పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఇటీవల సుమారు రూ.7 కోట్ల వరకు వెచ్చించారు. 194 పాఠశాలల్లో 70 పాఠశాలలకు తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం కల్పించేందుకు, మిగిలిన పాఠశాలలకు కేవలం మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాగునీటి బోరు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఒక్కొక్క పాఠశాలకు రూ.5 లక్షల చొప్పున ఖర్చుచేశారు. కేవలం మరుగుదొడ్లు, నీళ్ల ట్యాంకుల ఏర్పాటు వరకు రూ.లక్ష చొప్పున ఒక్కొక్క బడికి వెచ్చించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు నిధులు విరాళంగా అందజేసి, ఈ అభివృద్ధి పనులు చేపట్టాయి. ఈ పనులు ప్రారంభించే సమయానికి ఆదర్శపాఠశాల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఆదర్శపాఠశాలల వల్ల జిల్లాలో పలు పాఠశాలను విలీనం చేయాల్సి ఉంటుందని అప్పటికే స్పష్టత ఉంది. అయినా దాన్ని పట్టించుకోకుండా వచ్చిన నిధులు ఖర్చుపెట్టారు. ఇప్పుడీ తాగునీటి బోర్లు, మరుగుదొడ్లు వృథా కానున్నాయి. రూ.కోట్లలో స్థిరాస్తులు: జిల్లాలో మూతపడుతున్న 194 ప్రాథమిక పాఠశాలల్లో స్థిరాస్తులు రూ.కోట్లలోనే ఉంటాయి. ఈ భవనాలను ఏం చేయబోతున్నారన్న విషయమై ఎలాంటి స్పష్టత లేదు. దీంతో వీటి సంరక్షణపై పాఠశాలను ఖాళీచేసే ఉపాధ్యాయుల నుంచి స్థానికల వరకూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గజపతినగరం, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో ఒక్కో మండలంలో 5 నుంచి 10 పాఠశాలల వరకూ రద్దుకానున్నాయి. జాతీయ రహదారి కావడం వల్ల అక్కడ స్థలం విలువ రూ.కోట్లలో ఉంటుంది. అదేవిధంగా మిగిలిన మండలాలలో కూడా మండల కేంద్రం, పట్టణాలను ఆనుకుని ఖరీదైన స్థలాలలో ఉన్న పాఠశాలలే ఎక్కువగా ఉన్నాయి. మూతపడిన పాఠశాల భవనాలు, ఖాళీస్థలాలపై స్త్రీశిశుసంక్షేమ శాఖ, పంచాయతీశాఖ, వశుసంవర్థక శాఖ వంటి ప్రభుత్వ ఇతరశాఖలు దృష్టి సారించాయి. గ్రామ స్థాయిలో శాఖాపరమైన సేవలను అందించడానికి అవసరమని సేవల నిర్వహణకు కావాలంటూ కారణాలు చెబుతున్నాయి. జిల్లా యంత్రాంగం ఈ మేరకు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రామస్థాయిలో రాజకీయనాయకుల దృష్టి కూడా పడింది. ఆయా పాఠశాలలకు ఆనుకుని ఉన్న తమ ఖాళీస్థలాలలో వాటిని కలుపుకోవడానికి యత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. స్పష్టమైన నిర్దేశాలు రాలేదు: డీఈఓ విలీనం కానున్న పాఠశాల స్థిరాస్తుల సంరక్షణపై స్పష్టమైన నిర్దేశాలు రావాల్సి ఉందని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. ఆదర్శపాఠశాల ఏర్పాటు నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై త్వరలో మార్గదర్శకాలు వస్తాయని వాటిని అనుసరించి చర్యలు చేపడతామన్నారు. -
కృష్ణా పుష్కరాలకు ఫ్లైఓవర్ సిద్ధం
ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యాంబాబు విజయవాడ : దుర్గగుడి వద్ద రూ.350 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయడానికి సమన్వయ శాఖల అధికారులు కృషి చేయాలని రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి. శ్యాంబాబు ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన ఫ్లై ఓవర్ నిర్మాణంపై సంబంధిత శాఖల అధికారులు సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాలనాటికి ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. మూడు దశల్లో ఫ్లై ఓవర్ పూర్తి చేసే విధంగా అధికారులు సమాయత్తం కావాలన్నారు. పోలీసు, రోడ్లు, భవనాలు, మున్సిపల్, విద్యుత్, ఇరిగేషన్, సంబంధిత శాఖల అధికారులు పూర్తిస్థాయిలో సరళీకృత విధానంలో చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ బాబు.ఏ మాట్లాడుతూ ఇప్పటికే క్షేత్ర స్థాయి సర్వే పరిశీలన పూర్తి చేశామన్నారు. 2,350 మీటర్ల ప్లైఓవర్ నిర్మాణం వస్తుందని ఇందుకు సంబంధించి కన్సల్టెంట్ నివేదికను సమర్పించామన్నారు. కృష్ణాపుష్కరాల నాటికి ప్లైఓవర్‌ను ప్రజలకు అందుబాటులోకితీసుకురావాల్సి ఉందన్నారు. ఫ్లై ఓవర్ పనులు జరిగే సమయంలో నగరానికి వచ్చే ట్రాఫిక్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించాల్సి ఉందన్నారు. దీనిపై పోలీసు అధికారులు హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, హనుమాన్‌జంక్షన్ మీదుగా విశాఖపట్నం తరలించాల్సి ఉందన్నారు. హైదరాబాద్ నుంచి నగరానికి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర సర్వీసులు విద్యాధరపురం వద్ద తాత్కాలిక బస్సు స్టేషన్ ఏర్పాటు చేయాలని, అక్కడి నుంచి మినీ బస్సుద్వారా రవాణా సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. చెన్నై-హైదరాబాద్ ట్రాఫిక్‌ను అద్దంకి-నార్కట్ పల్లి రోడ్డుకు మళ్లించాలని కలెక్టర్ సూచించారు. జేసీ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ సలోని, ఎన్‌హెచ్. ఇంజినీర్, ఆర్.గోపాలకృష్ణ, ఆర్.అండ్.బి. ఇ.ఎన్.సి. గంగాధర్, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ సుధాకర్ పాల్గొన్నారు. -
క్రమబద్ధీకరణపై నిర్లక్ష్యం
అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. గతంలో ఇదే పథకం జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.20 కోట్ల వరకు కురిపించింది. ఈ సారి బీపీఎస్‌లో పెట్టిన షరతులు, సాంకేతిక నిబంధనల కారణంగా రూ.కోటి కూడా దాటలేదు. ఈ పథకానికి సోమవారంతో గడువు ముగియనుండడంతో స్థానిక సంస్థల ఖజానాలు కాస్త నిండుతాయనుకున్న అధికారుల ఆశలు ఆవిరికానున్నాయి. - జిల్లాలో వెయ్యి దాటని దరఖాస్తులు - బీపీఎస్‌కు నేటితో ముగియనున్న గడువు చిత్తూరు (అర్బన్): అనుమతుల్లేని భవనాలు, అక్రమకట్టడాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఈ ఏడాది మే 22న ప్రత్యేక ఉత్తర్వులు (జీవో 128)ను జారీ చేసింది. 1985 తరువాత 2014 డిసెంబర్ 31 వరకు నిర్మించిన కట్టడాలకు బీపీఎస్ పథకం అమలు చేస్తూనే పలు నిబంధనల్ని పెట్టింది. బీపీఎస్ దరఖాస్తుల ప్రక్రియ మొత్తం గతంలో ప్రజలు నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లి అందచేసేవారు. ఇప్పుడు దరఖాస్తులను ఆన్లైన్లోనే అందజేయాల్సి రావడం, అన్ని పత్రాలను స్కానింగ్ చేసుకున్న తరువాతే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలనడం, దీంతో పాటు ఇంటర్నెట్ బ్యాకింగ్ నుంచి రూ.10 వేలు ప్రాథమికంగా చెల్లించాలని చెప్పడం బీపీఎస్ వనరుల్ని దెబ్బతీసింది. ఇప్పటికే జిల్లాలోని ఆరు మున్సిపాల్టీలు, రెండు కార్పొరేషన్లలో పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు కార్యాలయాల్లో సరైన కంప్యూటర్లు లేకపోవడం, ఆన్లైన్లో సమస్యలు రావడంతో ప్రజలు మధ్యవర్తుల ద్వారా దరఖాస్తులను అందిస్తూ వచ్చారు. దీనికితోడు అధికారులు సైతం బీపీఎస్‌పై పెద్దగా ప్రచారం నిర్వహించకపోవడం కూడా ప్రధాన కారణం. ఫలితంగా జిల్లాలో శనివారానికి కేవలం 997 దరఖాస్తులు మాత్రమే బీపీఎస్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ అయ్యాయి. గడుపు పొడిగిస్తారా...? క్రమబద్ధీకరణకు అడ్డుగా ఉన్న కొన్ని నిబంధనల వల్ల దరఖాస్తులు చేసుకోవడం ఆలస్యంగా మారుతున్నట్లు ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంలో పలు సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయి. వీటిన్నింటికీ తోడు జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేసే అధికారులను, సిబ్బందిని గోదావరి పుష్కరాల్లో విధులకు పంపడం బీపీఎస్‌పై ప్రచారానికి అడ్డుగా నిలిచింది. బీపీఎస్ గడువు పెంచాలనే వాదన ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో వేచి చూడాలి. ఇదీ పురో‘గతి’ - చిత్తూరు నగర పాలక సంస్థలో గతంలో బీపీఎస్‌కు 1,600 దరఖాస్తులు రాగా.. రూ.5 కోట్ల వరకు ఆదాయం లభించింది. ఈ సారి కేవలం 84 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. - తిరుపతి కార్పొరేషన్లో క్రబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులు 532. గతంతో పోలిస్తే ఈ సంఖ్య ఆరో వంతు. - మదనపల్లెలో ఇప్పటి వరకు 101 దరఖాస్తులు వచ్చాయి. కానీ పట్టణంలో ఉన్న అక్రమ కట్టడాల సంఖ్య మాత్రం వెయ్యికిపైనే ఉండడం గమనార్హం. - పుంగనూరులో 63, శ్రీకాళహస్తిలో 134, పలమనేరులో 31, నగరిలో 13, పుత్తూరులో 34 దరఖాస్తులు మాత్రమే బీపీఎస్ కింద అందాయి. - జిల్లా మొత్తంలో ఇప్పటి వరకు బీపీఎస్ కింద అందిన - దరఖాస్తులు 992. -
వాన చుక్క.. ఇంకేదెట్టా!
మహానగరంలో జోరు వానలు కురుస్తున్నా భూగర్భంలోకి చుక్కనీరు చేరడం లేదు. నీరింకే దారిలేక వర్షం నీటిలో దాదాపు 60 శాతం వృథా అవుతోంది. వర్షాకాలంలోనూ భూగర్భ జలాలు పెరగకపోవడంతో బోరుబావులు బావురుమంటున్నాయి. నగరవాసికి నీటి కొరత ఏమాత్రం తీరడం లేదు. ప్రతి భవంతి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్న నిబంధనలు ఎవ్వరూ పాటించకపోవడంతో నీరింకే దారి కన్పించడం లేదు. గ్రేటర్లో 22 లక్షల భవంతులుంటే, ఇంకుడు గుంతలు లక్షలోపే ఉన్నాయి. జీహెచ్ఎంసీ, జలమండలి నిర్లిప్తత వల్లే ఈ దుస్థితి తలెత్తుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. - గ్రేటర్లో 22 లక్షల భవంతులకు..ఇంకుడు గుంతలు లక్ష లోపే? - వర్షపు నీటిలో సుమారు 60 శాతం మేర వృథా - చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ, జలమండలి సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో జూన్ తొలి మూడు వారాల్లో సుమారు 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం (82 మి.మీ)కంటే ఇది సుమారు 75 మిల్లీమీటర్లు అధికమే. కానీ ఈనీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు లేకపోవడంతో వర్షపునీరు రహదారులను ముంచెత్తి వృథాగా పోయింది. ఈ దుస్థితితో నగరంలో పలు బోరుబావులు వర్షపు నీటి రీచార్జి లేక బావురుమంటున్నాయి. మహానగరంలో సుమారు 22 లక్షల భవంతులుండగా ..ఇందులో ఇంకుడు గుంతలున్న భవనాలు లక్షకు మించి లేవంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. గడిచిన వేసవిలో జలమండలి సుమారు పదివేల ఇంకుడు గుంతలు తవ్వించాలని లక్ష్యం నిర్దేశించుకోగా అందులో నాలుగు వేలకు మించి తవ్వలేదు. మరోవైపు భవన నిర్మాణ అనుమతులు మంజూరు సమయంలో ఇంకుడు గుంత తవ్వితేనే అనుమతి మంజూరు చేయాల్సిన జీహెచ్ఎంసీ ఈ విషయంలో ప్రేక్షకపాత్రకే పరిమితమౌతుండడంతో భూగర్భ జలసిరులు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. ఇంకుడు గుంతలు లేకనే ఈ దుస్థితి.. కాంక్రీట్ మహారణ్యంలా మారిన గ్రేటర్లో ప్రతి ఇళ్లు, అపార్ట్మెంట్, కార్యాలయాల వద్ద ఇంకుడు గుంతలు(రీచార్జింగ్ పిట్స్)లేకపోవడంతో ఏటా వర్షాకాలంలో 60 శాతం మేర వర్షపునీరు వృథాగా పోతోందని నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వర్షపు నీరు వరద రూపంలో 40 శాతం మేర వృథా అవడం సర్వసాధారణమే. కానీ నగరంలో దీనికి అదనంగా మరో 20 శాతం నీరు వృథాగా పోవడం సిటీజనులు పాలిట శాపంగా మారుతోంది. ఈ నీటిలో సిం హభాగం భూగర్భంలోకి మళ్లిస్తే జలమట్టాలు మరో రెండు మీటర్ల మేర పెరిగే అవకాశం ఉంది. మూడేళ్ల క్రితం జీహెచ్ఎంసీ 10 వేలు, జలమండలి 22 వేల ఇంకుడు గుంతల ఏర్పాటు చేసేందుకు వినియోగదారుల నుంచి రూ.64 కోట్ల మేర రాబట్టాయి. కానీ తవ్వింది ఐదు వేల ఇంకుడు గుంతలే కావడం ఆయా శాఖల నిర్లక్ష్యానికి పరాకాష్ట. వర్షపు నీటిని ఇలా ఒడిసిపట్టొచ్చు - నగరంలో కురుస్తున్న వర్షపునీటిలో 80 శాతం వర్షపు నీటిని ఒడిసిపట్టే అవకాశం ఉంది. - ఫిలడెల్ఫియా(అమెరికా), బార్సిలోనా మహానగరాల్లో ఇంకుడు గుంతలను విస్తృతంగా తవ్వడంతో వర్షపునీటిలో 80 శాతం భూగర్భంలోకి చేరుతోంది. - ఉదాహరణకు 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటికి బోరుబావికి ఆనుకొని రెండు మీటర్ల వెడెల్పు, రెండు మీటర్ల లోతున ఇంకుడు గుంత తవ్వాలి. గుంత పూడుకుపోకుండా చుట్టూ లోపలి వైపు నుంచి బండ రాళ్లు లేదా, ఇటుకలతో మధ్యలో సన్నటి ఖాళీలుంచి పేర్చాలి. గుంతపై ఆర్సీసీ సిమెంటుతో తయారు చేసిన జాలిని ఏర్పాటు చేయాలి. జాలికి ఉన్న పెద్ద రంధ్రాల గుండా వర్షపునీరు గుంతలోకి మళ్లేలా ఏర్పాటు చేయాలి. - ఇంటి పైకప్పుపై చేరిన వర్షపునీరు నేరుగా ఈ గుంతలోకి చేరేలా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే రోజుకు సుమారు 50 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని బోరుబావికి సమీపంలో ఇంకించవచ్చు. సీజన్లో నిల్వ చేసిన ఈ నీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి మూడు నెలల అవసరాలకు సరిపోతాయి. - లోతట్టుప్రాంతాలు, పార్కులో పెద్ద విస్తీర్ణంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే వాటికి సమీప ప్రాంతాల్లో బోరుబావులు రీచార్జి అవుతాయి. వర్షపునీటిని ఎక్కడికక్కడే ఇంకింప జేస్తే రహదారులను మంచెత్తే వర్షపునీరు సైతం తగ్గుముఖం పడుతుంది. -
ముక్కంటిచెంత మాస్టర్ ప్లాన్
- దేవస్థానంలో భారీ మార్పులు - ఆలయం వద్ద భవనాల తొలగింపు - భవనాలన్నీ భరద్వాజతీర్థం వద్దకు తరలింపు శ్రీకాళహస్తి : మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో భారీ మార్పులు చేయనున్నట్లు ఈవో బి.రామిరెడ్డి తెలిపారు. శనివారం దేవస్థానంలోని పరిపాలన భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేవస్థానంలో భారీ మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఆల యాన్ని పరిశీలించడానికి సోమవారం(22వ తేదీ) ఆర్కియాలజీ శాఖకు చెందిన బృం దం వస్తోందని చెప్పారు. వారి సలహాల మేరకు భవనాల తొలగింపు, నిర్మాణాలు ఉంటాయన్నారు. అన్ని రకాల రాహుకేతు పూజలు ఇకపై ఆలయంలోపల కాకుండా ఆలయ ప్రాంగణంలోనే పెద్దఎత్తున భక్తులు విచ్చేసినా ఇబ్బం దులు లేకుండా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని అన్నదాన మండపం, పరిపాలన భవనం, జ్ఞానప్రసూనాంబ, త్రినేత్ర అతిథి భవనాలను తొలగించి భరద్వాజతీర్థం(ఆలయానికి 500 మీటర్ల దూరంలో) వద్ద నిర్మించనున్నట్లు చెప్పారు. సన్నిధివీధిలోని పలు ప్రైవేటు భవనాలు తొలగిస్తారని తెలిపా రు. ఆలయ ఈఈ కె.రామిరెడ్డి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్‌లో చేపట్టాల్సిన అంశాలపై ఇటీవల తమకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగుమాడ వీధుల్లో రథోత్సవం నిర్వహించడం ఇబ్బందిగా ఉందన్నారు. ట్రాఫిక్, భక్తులకు సౌకర్యాల దృష్ట్యా నాలుగు మాడ వీధుల్లోనూ మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా పెద్ద ఎత్తున భవనాలు తొలగిస్తారని తెలిపారు. భరద్వాజతీర్థంలోనే గోశాలకు అవసరమైన షెడ్లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. స్వర్ణముఖినదిలో మురుగునీరు తొలగించి భక్తులు స్నానాలు చేసే విధంగా మం చినీరు నిలువ ఉండడం కోసం చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. -
భూకంపాలు తట్టుకోగల భవనాలు
బీఐఎస్ నిబంధనలు పాటిస్తే సాధారణ వ్యయానికే నిర్మాణం సాధ్యమే నిర్మాణ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం వల్లే నాణ్యతలేమి ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీపీడబ్ల్యూ ఏడీజీ శ్రీనివాసన్ సాక్షి, హైదరాబాద్: భూకంపాలు, తుపానుల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగల భవనాల నిర్మాణానికి అధికంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రజా పనుల విభాగం అదనపు డెరైక్టర్ జనరల్ పి.పి శ్రీనివాస్ తెలిపారు. భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) రూపొందించిన భవన నిర్మాణ నియామవళిని అనుసరించి సాధారణ వ్యయానికే భవనాలు నిర్మించవచ్చన్నారు. అయితే సామాన్య ప్రజలు నిర్మాణ ఖర్చులను స్వల్పంగా తగ్గించుకుని డబ్బులు ఆదా చేసేందుకు ప్రయత్నిస్తుండటం వల్లే భవనాలు నాణ్యత కోల్పోతున్నాయన్నారు. ఉదాహరణకు రూ. 100 వ్యయం చేసే భవనానికి రూ. 110 ఖర్చు చేస్తే అధిక వ్యయమని, అదే రూ. 90 ఖర్చు చేసి పొదుపు చేసినట్లు భావించడం మాత్రం త్యాగానికి సిద్ధపడినట్లేనని వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్ర: భూకంపాలను తట్టుకోవడానికి భవన నిర్మాణాల్లో ఏయే జాగ్రత్తలు పాటించాలి? జ: భూ పరీక్షలు జరిపాకే భవనాలకు పునాదులు వేయాలి. నేలపై ఒత్తిడి ప్రదర్శించి దృఢత్వాన్ని పరీక్షించాలి. భూకంపం సంభవించినప్పుడు భవనం నిలబడుతుండా? కుంగిపోతుందా? అని పరీక్షించాలి. కనీసం 300 మి.మీల సైజులో పిల్లర్లను నిర్మించాలి. భారీ భవంతుల బ్లాక్‌ల మధ్య ఖాళీ ప్రదేశం వుంటే భూకంపం సమయంలో ఒత్తిడి సర్దుబాటుకు అవకాశం వుంటుంది. లేకుంటే ఒక బ్లాక్ ఒత్తిడి మరో బ్లాక్ మీద పడి కుప్పకూలే ప్రమాదముంది. ఇటీవల వచ్చిన భూకంపం వల్ల కోల్‌కతాలో కూలిన ఓ భారీ భవనం వెనక కారణం ఇదే. ప్ర: భవన నిర్మాణంలో, నిర్మాణం తర్వాత ఎలాంటి నాణ్యత పరీక్షలు జరపాలి? జ: కాంక్రీట్‌ను సైతం చిన్న గొట్టంలో వేసి ఒత్తిడి ద్వారా విచ్ఛిన్నం చేస్తారు. తేలికపాటి ఒత్తిడికి ధ్వంసమైతే నాణ్యత లేదని నిర్ధరిస్తారు. నిర్మాణం పూర్తయ్యాక కట్టడానికి నష్టం జరగకుండా ‘నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్’లను జరుపుతారు. అల్ట్రా సోనిక్ కిరణాలను కాంక్రీట్‌పై పంపుతారు. తేలికగా లోపలికి చొరబడితే నాణ్యత లేదని భావిస్తారు. ప్రతి వెయ్యి ఇటుకలకు ఒక ఇటుకను పరీక్షించాల్సిందే. ప్ర: భవనాల నిర్మాణంలో బీఐఎస్ నిబంధనలు అమలు కావడం లేదెందుకు? జ: భూకంపాల సంభావ్యత తీవ్రతను బట్టి దేశాన్ని ఐదు జోన్లుగా విభజించారు. ఏ జోన్లో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలో బీఐఎస్ నియామవళిలో స్పష్టంగా ఉంది. సామాన్య ప్రజల్లో అవగాహన లేకే దీన్ని అమలు చేయడం లేదు. అనుమతులు ఇచ్చే పురపాలక సంఘాలే నిబంధనల అమలును కఠినం చేయాలి. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు సైతం చొరవ తీసుకోవాలి. -
’భూకంపాలు ’వచ్చినా కూలని బిల్డింగ్స్
-
ఢిల్లీలో వస్తే పరిస్థితేమిటి?
న్యూఢిల్లీ: నేపాల్‌లో భూకంపం వస్తేనే ఉత్తర భారతమంతా వణికిపోయి కొంత ప్రాణనష్టం, ఆస్తినష్టం చోటుచేసుకుంది. అలాంటిది భూకంప చోటుచేసుకునేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో ఉన్న ఢిల్లీలో భూకంపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడి నిర్మాణాలు తట్టుకోగలవా? వెంటనే తేరుకుని సహాయక చర్యలతో బయటపడగలమా? ప్రాణ నష్టాన్ని నివారించగలమా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు అందరిముందు. అయితే, దీనిపై భవన నిర్మాణ ఇంజినీరింగ్‌లు మాత్రం భూకంపాన్ని ఢిల్లీ ఏమాత్రం తట్టుకోలేదని కుండబద్దలు కొడుతున్నారు. అక్కడ 80శాతం భవనాలు భూకంపాన్ని తట్టుకోలేని విధంగా ఉన్నాయని, ఈవిషయంలో గత పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజినీర్స్ అధ్యక్షుడు మహేశ్ టాండన్ అన్నారు. ఒక్కసారి ఢిల్లీలో భూకంపం వస్తే భవనాలు పూర్తిగా నేలమట్టమవుతాయని ఆయన హెచ్చరించారు. ఇది ఆందోళనకర పరిస్థితి అని ఆయన అన్నారు. ఇప్పటికే పరోక్షంగా అనుభవాన్ని పొందిన ఢిల్లీ ఇప్పటికే భవనాల పటిష్టతపై దృష్టిని సారించాలని సూచించారు. -
బహుళ అంతస్తులతో భవిష్యత్ ప్రమాదకరం
- నిర్మాణానికి అనుమతులిస్తే భారీ నష్టం జరిగే అవకాశం - ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న నిపుణులు - భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ముంబై కూడా ఉందని వెల్లడి సాక్షి, ముంబై: బహుళ అంతస్తుల భవనాలకు విచ్చలవిడిగా అనుమతులిస్తే భవిష్యత్ ప్రమాదకర స్థితికి చేరుకుంటుందని ప్రభుత్వ సలహాదారుల కమిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంపం వచ్చే ప్రాంతాల జాబితాలో ముంబై నగరం ఉందని, బహుళ అంతస్తుల భవనాలకు అనుమతి ఇవ్వకూడదని గతంలోనే హెచ్చరించినా పరిపాలనా విభాగ ం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సలహాదారుల కమిటీ నిపుణుడు, ఐఐటీ ముంబై విశ్రాంత అధ్యాపకుడు వి. సుబ్రమణ్యం తెలిపారు. ‘నేపాల్‌లో శనివారం సంభవించిన భూకంపానికి ఆ దేశ రాజధాని ఖాఠ్మాండు నగరంలోని ఆకాశహర్మ్యాలు నేల కూలాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దక్షిణ ముంబై ప్రాంతంలో ఎక్కడ చూసిన 30 అంతస్తులకుపైగా నిర్మించిన భవనాలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ 60 అంతస్తులకు పైగా ఉన్న 10-15 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ముంబైలో స్థలాలు లేవని భవనాలను వెడల్పుగా నిర్మించేందుకు వీలు లేదు. దీంతో ఎత్తుగా నిర్మించేందుకు అనుమతినిస్తున్నారు. ముంబై భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మూడో స్థానంలో ఉంది. ఇంతకు ముందెన్నడూ ముంబైపై భూకంప ప్రభావం పడకపోయినా.. భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉంది’ అని సుబ్రమణ్యం హెచ్చరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆకాశహర్మ్యాలకు అనుమతివ్వకూడదని ఆయన అన్నారు. తాజా భూకంపం తీవ్రత ఠాణే సముద్ర తీరం అవతల రిక్టర్‌స్కేల్‌పై నాలుగుగా నమోదైంది. అదే ముంబైలో భూకంపం వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గత ఎనిమిదేళ్ల నుంచి అప్పుడప్పుడు ఠాణే, కల్యాణ్ పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వస్తున్నాయని, అవి ముంబైకి అతి దగ్గరలో ఉండటం వల్ల భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో బహుళ అంతస్తుల భవనాలకు అనుమతివ్వకూడదని సుబ్రమణ్యం సలహా ఇచ్చారు. నగరంలో లోయర్‌పరేల్, పరేల్, మహాలక్ష్మి తదితర ప్రాంతాల్లో మూతపడిన మిల్లు స్థలాల్లో వరల్డ్ టవర్, బహుళ అంతస్తుల భవనాలు అడ్డగోలుగా వెలుస్తున్నాయి. అవి ఎప్పుడైనా ప్రమాదమేనని ఆయన తెలిపారు. -
మంత్రుల క్వార్టర్స్ మరమ్మతు నిధులకు ‘టెండర్’
ముందు టెండర్... ఆ తర్వాత నామినేషన్‌కు బదలాయింపు లెస్‌కు టెండర్లు దాఖలైనావింత ధోరణి అన్ని క్వార్టర్లకూ ఒకే మొత్తానికి ప్రతిపాదనలు రోడ్లు, భవనాల శాఖలో ఇష్టారాజ్యం హైదరాబాద్: రోడ్లు భవనాల శాఖ అంటేనే ఇష్టారాజ్యానికి చిరునామా. నిబంధనలు, పొదుపు చర్యలు, నాణ్యతకు అక్కడ అంత ప్రాధాన్యం ఉండదు. సొంత కార్యాలయం కోసం నిర్మిస్తున్న భారీ భవనం విషయంలో అడ్డగోలుగా అంచనాలు పెంచేసి రూ.20 కోట్ల పనిని రూ.67 కోట్లకు చేర్చిన అధికారులు.. తాజాగా మంత్రుల నివాసాల్లో మరమ్మతుల విషయంలో వింతగా వ్యవహరించారు. అడ్డగోలు విధానాల్లో తమకు హద్దే లేదని నిరూపించారు. ఇదీ సంగతి... మంత్రులకు కేటాయించిన కొన్ని క్వార్టర్లలో మరమ్మతులు జరపాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 16, 17 తేదీల్లో రోడ్లు, భవనాల శాఖ సెంట్రల్ బిల్డింగ్ డివిజన్ ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో ఆన్లైన్ టెండర్లు పిలిచింది. మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి, నాటి డిప్యూటీ సీఎం రాజయ్య, శాసనసభ ఉప సభాపతి పద్మా దేవేందర్, సీఎల్పీ నేత జానారెడ్డిల క్వార్టర్లకు మరమ్మతు జరుపుతున్నట్టు టెండర్లో పేర్కొం ది. సాధారణంగా ఆయా క్వార్టర్లలో ఉండే సమస్యల ఆధారంగా పనులు జరుపుతారు. వెరసి పనులు వేరువేరుగా ఉంటాయి. కానీ విచిత్రమేంటంటే... ఈ అన్ని పనులకు రూ.7,10,720 చొప్పున ప్రతిపాదించారు. అన్నింటికి పైసల్లో కూడా తేడా లేకుండా ఒకేమొత్తం ఎలా అవసరమవుతుందో అధికారులకే తెలియాలి. వీటిల్లో దాదాపు అన్ని పనులకు కొందరు కాంట్రాక్టర్లు లెస్‌కు కొటేషన్లు దాఖలు చేశారు. ఆ ప్రకారం తక్కువ మొత్తం కోట్ చేసిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. ఆ తర్వాత పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. విచిత్రమేంటంటే... ఇందులో కొన్ని క్వార్టర్ల టెండర్లను ‘అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్’ పేరు చెబుతూ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ పనులను తోచిన వ్యక్తులకు నామినేషన్‌పై ఇచ్చేసుకున్నారు. అత్యవసర పనులైనందున, నామినేషన్ కింద కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. విచిత్రమేంటంటే కొన్ని పనుల నామినేషన్ ఉత్తర్వు గత ఫిబ్రవరి 2న వెలువడితే, కొన్నిం టిది నిరుడు నవ ంబరులో విడుదలైంది. వీటన్నిటికీ టెండర్లు ఒకేసారి పిలిచారు అయినా.. కొన్ని అత్యవసరమెలా అవుతాయి, వాటికి గడువు లేని పరిస్థితి ఎలా ఉత్పన్నమవుతుందో అధికారులే చెప్పాలి. టెండర్ల సమయంలోనే ఆరోపణలు ఎక్కువ మొత్తం లెస్‌కు కోట్ చేసి కాంట్రాక్టర్లు రింగుగా మారి టెండర్లు దక్కించుకున్నారని ఆదిలోనే ఆరోపణలు వచ్చాయి. వాటిని రద్దు చేసి మళ్లీ పిలవాలంటూ కొందరు కాంట్రాక్టర్లు చీఫ్ఇంజనీర్కు ఫిర్యాదు చేశారు. విచిత్రమేంటంటే 30 శాతం, 28 శాతం లెస్‌కు టెండర్లు దాఖలైన వాటిని కొనసాగిస్తూ 16 శాతం లెస్‌కు దాఖలైన వాటిని రద్దు చేసి నామినేషన్ పేర అప్పగించారు. అయితే ఈ పనుల్లో కొన్ని పూర్తయిన తర్వాత నామినేషన్ డ్రామాకు తెర తీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
టెండర్ల విధానం బలోపేతం: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టెండర్ల విధానాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పనుల్లో జాప్యం జరగకుండా, నాణ్యతను పెంచేందుకు, టెండర్లలో అవకతవకలు జరగకుండా కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ)ని మరింత ధృఢం గా రూపొందించనున్నట్లు చెప్పారు. శనివారం సచివాలయంలో రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖల ఈఎన్సీలతో మంత్రులు హరీశ్‌రావు, కె.తారక రామారావు, రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమై ఆయా అంశాలపై చర్చించారు. అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిధులకు లాభం జరిగేలా ప్రతిపాదనలు సిద్ధంచేసి సీఎం కేసీఆర్‌కు సమర్పిస్తామన్నారు. ఈ నాలుగు శాఖలకు సంబంధించి ఇప్పటికే రూ.25 వేల కోట్ల మేర టెండర్లు పిలిచామని, ఇంకా రూ.లక్ష కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు సీఓటీకి నిర్దిష్టమైన ప్రమాణాలు, విధివిధానాలను ఖరారు చేస్తున్నామన్నారు. -
‘సోలార్’ సబ్సిడీకి కత్తెర
బడ్జెట్ లేదని చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం రూఫ్ టాప్ ప్లాంట్లకు రాయితీలో సగానికి కోత 30 శాతాన్ని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు రాష్ట్రాలకు లేఖ సాక్షి, హైదరాబాద్: భవనాలపై ఏర్పాటు చేసే రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లకు ప్రస్తుతమిస్తున్న సబ్సిడీని కొనసాగించలేమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రాయితీని సగానికి సగం తగ్గించాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతమున్న 30 శాతం సబ్సిడీ ఇకపై 15 శాతానికి తగ్గిపోనుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగం తాజాగా సమాచారమిచ్చింది. తగినంత బడ్జెట్ లేనందున ప్రస్తుత సబ్సిడీని కొనసాగించడం సాధ్యం కాదని తన లేఖలో పేర్కొంది. ‘గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్ టాప్ అండ్ స్మాల్ సోలార్ పవర్ ప్లాంట్స్ ప్రోగ్రాం’ పేరుతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికింద కిలోవాట్ నుంచి 500 కిలోవాట్ వరకు సామర్థ్యమున్న ప్లాంట్లకు రాయితీ ఇస్తోంది. అయితే ఇకపై అన్ని కేటగిరీల వారికి సబ్సిడీని కొనసాగించే అవకాశం లేదని కూడా తాజాగా కేంద్రం స్పష్టంచేసింది. ఎక్కువ విద్యుత్ చార్జీలు చెల్లిస్తున్న వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు రాయితీ ఇవ్వాల్సిన అవసరం లేదని, సబ్సిడీతో నిమిత్తం లేకుండానే సోలార్ ప్లాంట్లను కొనుగోలు చేసే స్థోమత వారికి ఉంటుందని కేంద్రం అభిప్రాయపడింది. అల్పాదాయ కేటగిరీలు, గృహ వినియోగదారులకు మాత్రం 15 శాతం రాయితీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. అలాగే లబ్ధిదారులకు నేరుగా పెట్టుబడి రాయితీ ఇవ్వడమో, ఆధార్ ఖాతాలతో అనుసంధానం చేయడమో లేక బ్యాంకు రుణం తిరిగి చెల్లించే పద్ధతిలో చేయూతనివ్వడం వంటి ప్రతిపాదనలున్నట్లు కూడా కేంద్రం స్పష్టం చేసింది. కేటగిరీలవారీగా ప్రాధాన్యత క్రమంలో సబ్సిడీ కేటాయింపు ఉంటుందంటూ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలను మొదటి కేటగిరీలో చేర్చింది. అలాగే ప్రభుత్వ, సామాజిక సంఘ భవనాలు, పంచాయతీ భవనాలు, వృత్తి కార్మికులు, కళాకారుల వర్క్‌షాపులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భవనాలు, ప్రజోపయోగ సంస్థలు, నివాస గృహాలు, భవనాలను కూడా వరుస క్రమంలో ఈ జాబితాలో పొందుపరిచింది. ముందుగా వీటికి సబ్సిడీ అందించిన తర్వాతే ప్రభుత్వ, ప్రైవేటు ఇండస్ట్రియల్, కమర్షియల్ భవనాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 356 మెగావాట్ల రూఫ్ టాప్ ప్లాంట్లను మంజూరు చేసినట్లు వెల్లడించింది. హైదరాబాద్ పరిధిలోనే రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి ఇటీవల ఒక మెగావాట్‌కు చేరినట్లు ఎన్‌ఆర్‌ఈడీసీ అధికారులు తెలిపారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం సోలార్ విద్యుత్‌పై దృష్టి కేంద్రీకరించిన సంగతి తెలిసిందే. సౌర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం ఇచ్చే 30 శాతం సబ్సిడీతో పాటు రాష్ర్టం 20 శాతం అదనపు సబ్సిడీని ప్రకటించింది. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను నెట్ మీటరింగ్ ద్వారా డిస్కంలు కొనుగోలు చేసే విధానాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సబ్సిడీలో కోత వల్ల సోలార్ ప్లాంట్లకు ఆదరణ తగ్గే ప్రమాదముందని అధికారులు అంటున్నారు. -
‘పర్యవేక్షణ’ కోసం ప్రయత్నాలు
* ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న ఆర్అండ్బీ ఎస్ఈ పోస్టు * త్వరలో భర్తీ అయ్యే అవకాశాలు.. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రోడ్లు భవనాల శాఖలో ఖాళీగా ఉన్న ఆర్అండ్బీ ఎస్ఈ (పర్యవేక్షక ఇంజినీర్) పోస్టు కోసం ఆ శాఖలోని కొందరు అధికారులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో రహదారుల అభివ ృద్ధిపై ప్రభుత్వం ద ృష్టి సారించి.. జిల్లాకు రూ.వెయ్యి కోట్లు కేటాయించి రోడ్లను అద్దంలా నిర్మిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కీలకమైన ఈ పోస్టు కోసం అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ ఉన్నతాధికారి జిల్లాకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న ఓ అధికారి ఈ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో అధికారి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక్కడ గతంలో ఎస్ఈగా పనిచేసిన జి.హంసారెడ్డి ఆరు నెలల క్రితం ఏసీబీకి చిక్కారు. పనుల అనుభవం (ఎక్సిపీరియెన్స్ సర్టిఫికేట్) మంజూరు కోసం ఓ కాంట్రాక్టరు వద్ద రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏప్రిల్ 4న అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఆదాయానికి మించి రూ.కోట్లలో ఆస్తులు కూడగట్టారనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేశారు. ఈ కేసులో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అప్పటి నుంచి ఈ పోస్టులో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. కరీంనగర్ జిల్లా ఎస్ఈగా పనిచేస్తున్న చందూలాల్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో కీలకమైన ఈ పోస్టును భర్తీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇన్‌చార్జీగా ఉన్న చందూలాల్‌కే ఇక్కడికి బదిలీ చేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. కరీంనగర్ జిల్లాలో తీవ్ర రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఇక్కడ పనిచేసేందుకు చందూలాల్ ఆసక్తి చూపుతున్నారని ఆ శాఖలో చర్చ జరుగుతోంది. రహదారుల అభివృద్ధిలో భాగంగా జిల్లాకు భారీగా నిధులు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో జిల్లాలోని పలు రోడ్ల నిర్మాణం, మరమ్మతుకు మోక్షం కలగనుంది. ఇప్పటికే ఆర్అండ్బీ అధికారులు జిల్లాలోని పలు రహదారుల అభివ ృద్ధి పనులకు అంచనాలు రూపొందించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లైన్ రోడ్ల నిర్మాణం వంటి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అలాగే మన ఊరు.. మన ప్రణాళికలో భాగంగా జిల్లా ప్రణాళికలో పలు రోడ్ల అభివ ృద్ధికి నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు. -
కంపు.. కంపు
అనంతపురం ఎడ్యుకేషన్ : కొత్తగా నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) భవనాలు ‘పైన పటారం లోన లొటారం’ అన్న చందంగా ఉన్నాయి. ఇంజినీరింగ్ విభాగం అధికారుల నిర్వాకంతో మరుగుదొడ్లకు సంబంధించిన ఇంకుడు గుంతల నిర్మాణాలు అస్తవ్యస్తంగా జరిగాయి. ఫలితంగా మరుగుదొడ్ల నుంచి నీరు బయటకు వస్తూ దుర్వాసన వెదజల్లుతోంది. కనీసం పరిసర ప్రాంతంలో నిలబడాలంటే కూడా సాధ్యం కాని పరిస్థితి. ఈ వాసనతో విద్యార్థినులు కడుపునిండా భోజనం కూడా తినలేకుండా ఉండారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు కనీసం ఆవైపు కన్నెత్తి చూడడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో విద్యార్థినులకు అనుగుణంగా మరుగుదొడ్లు, స్నానాల గదుల్లోంచి వచ్చేమురుగు నీరు నిల్వ ఉంచేందుకు సరిపడా ఇంకుడు గుంతలు ప్రణాళిక మేరకు తీయలేదు. ఫలితంగా రోజూ విద్యార్థినులు ఉపయోగించే మరుగుదొడ్ల నుంచి నీరు ఇంకుడు గుంతల్లో ఇంకిపోకుండా బయటకు వస్తోంది. నీరు ఇంకేందుకు తగినట్టుగా ఇంకుడు గుంతలను నిర్మించకపోవడమే ఇందుకు కారణం. వీటికి నీటి తొట్టెల్లాగా సిమెంటు గోడలు కట్టేశారు. దీంతో తొట్టెలు నిండిపోయి బయటకు వస్తోంది. మురుగునీరంతా చేరుకుని కంపు వాసన వస్తోంది. దుర్వాసన భరించలేక కనీసం అన్నం కూడా తినలేని ఇబ్బందులు పడుతున్నారు. పోనీ ఇక్కడి నుంచి బయటకు పంపేందుకు ఎలాంటి పైపులైనూ ఏర్పాటు చేయలేదు. వాస్తవానికి అండర్ గ్రౌండ్ డ్రె యినేజీ వ్యవస్థకు అనుగుణంగా వీటిని డిజైన్ చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ లేదు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నిర్మించాల్సిన ఇంజినీరింగ్ అధికారులు ఏదో నిర్మాణాలు పూర్తి చేయించామనే విధంగా వ్యవహరించడంతోనే ఈ రోజు సమస్య ఉత్పన్నమవుతోంది. కొత్త కేజీబీవీలన్నింటిలోనూ ఇదే దుస్థితి రాప్తాడు, గార్లదిన్నె, కళ్యాణదుర్గంతో పాటు కొత్తగా నిర్మించిన సుమారు 20 కేజీబీవీల్లో ఇదే దుస్థితి నెలకొంది. వీటన్నింటిలోనూ మరుగుదొడ్లు ఒకేరకంగా నిర్మించడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా రాప్తాడు కేజీబీవీలో పరిస్థితి మరింత దారుణం. మరుగుదొడ్ల నుంచి బయటకు వస్తున్న నీరంతా తాగునీటి బోరు వద్దకు చేరుతోంది. ఈ బోరు నీటినే విద్యార్థినులు తాగాల్సి వస్తోంది. మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించినా ఇప్పటిదాకా కనీస ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. పట్టించుకోవాల్సిన ఎస్ఎస్ఏ అధికారులు మిన్నకుండిపోయారు. వాసనతో అక్కడ రెండు నిముషాలు కూడా నిలబడం లేము. అలాంటిది వందలాది మంది ఆడ పిల్లలు ఈ వాసన భరిస్తూ అక్కడే జీవిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దుర్వాసన నుంచి తమ పిల్లలను రక్షించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కబ్జాలు..పట్టవా?
అధికారం అండగా నగరంలో కాలువల కబ్జా యథేచ్ఛగా అపార్ట్మెంట్లు, భవనాల నిర్మాణం ఆయకట్టుకు నీళ్లొదిలినా చేరని వైనంప్రశ్నార్థకంగా ఆక్రమణల తొలగింపు మంత్రి హామీలు నెరవేరేనా? సాక్షి, నెల్లూరు : వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే నెల్లూరు చెరువు కాలువలతో పాటు నగరం మీదుగా వెళ్లే జాఫర్‌సాహెబ్ కాలువ, సర్వేపల్లి కాలువ, సదరన్, ఈస్ట్రన్, పెన్నాడెల్టా కాలువలపై ఆక్రమణలు ఆగేట్లులేదు. ఇప్పటికే జరిగిన ఆక్రమణలతో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సక్రమంగా నీరందే పరిస్థితి లేదు. ఆక్రమించిన కాలువలపై ఇళ్లే కాదు.. ఏకంగా అపార్ట్మెంట్లే నిర్మిం చారు. మరికొందరు ఘనులు ఆ స్థలాలతో రియల్ఎస్టేట్ వ్యాపారాలు సైతం చేస్తుండటం విశేషం. కాలువలను కబ్జాచేసి నేతలు రూ. కోట్లు జేబులు నింపుకుంటున్నా.. సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోవడం విశేషం. మంగళవారం జరిగిన నీటి పారుదల సలహా మండలి సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు నగరంలో జరిగిన ఆక్రమణలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో నీటిపారుదల కాలువల కబ్జా మరో మారు తెరపైకి వచ్చింది. ఇందుకు స్పందించిన మంత్రి నారాయణ కాలువల ఆక్రమణలను పరిశీలించి తక్షణం నివేదిక సమర్పించాలంటూ అధికారులను ఆదేశించారు. అయితే ఇది సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే కాలువలపై భారీ నిర్మాణాలే చేపట్టారు. ఆ సమయంలో ఆక్రమణదారుల జోలికి వెళ్లని అధికారులు ఇప్పుడు కబ్జాల వివరాలూ అందించడం ప్రశ్నార్థకమే. మరోవైపు అధికార పార్టీ వత్తిళ్లు తెలిసిందే. అప్పుడు అధికార పార్టీలో ఉండి కబ్జాలు చేసిన నేతలు ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ నేతల ప్రాపకంతో తమ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక వేళ సాహ సించి వాస్తవ నివేదిక తయారు చేసినా చర్యలుంటాయన్న గ్యారెంటీ కూడా లేని పరిస్థితి. దీంతో నీటిపారుదల కాలువలపై ఆక్రమణల తొలగింపు ప్రశ్నార్థకంగా మారనుంది. కాలువల కబ్జాలను పరిశీలిస్తే... నెల్లూరు చెరువు కింద ఉయ్యాలకాలువ, మల్లప్పకాలువ, గుండ్లపాళెం కాలువ, రామిరెడ్డి డ్రైన్, చింతారెడ్డిపాళెం కాలువ, గచ్చకాలువ తదితర కాలువలు ఉన్నాయి. 12 వేల ఎకరాలకు సాగునీరందించే ఈ కాలువలు అత్యధిక భాగం కబ్జాకు గురయ్యాయి. ఇప్పటికే వీటిలో 80 శాతం కాలువలు అధికార పార్టీ నేతల కబ్జాతో కనుమరుగు కాగా మిగిలినవి సైతం కుంచించుకపోయి నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం 12 వేల ఎకరాలు కాదు కదా 1200 ఎకరాలకు కూడా నీరందే పరిస్థితి లేదు. నగరంలో పెన్నాడెల్టా, ఈస్ట్రన్, సదరన్, జాఫర్‌సాహెబ్ కాలువ, సర్వేపల్లి తదితర నీటిపారుదల శాఖకు సంబంధించి కాలువలు ఉన్నాయి. పెన్నాడెల్టాకు సంబంధించి 22 మీడియం కెనాల్స్, నాలుగు ప్రధాన కాలువలు ఉన్నాయి. సదరన్ చానల్‌కు సంబంధించి 26 కాలువలు ఉండగా జాఫర్ సాహెబ్ కెనాల్‌కు 38 కాలువలు, సర్వేపల్లి కెనాల్‌కు సంబంధించి 34 కాలువలు ఉన్నాయి. వేలాది ఎకరాలకు నీరందించే ఈ ప్రధాన కాలువలు సైతం 70 శాతానికి పైగా కబ్జాకు గురయ్యాయి. నగరంలో కాలువలు, ఆక్రమణలు : ఉయ్యాలకాలువ : 3 కిలో మీటర్లు పొడవు, 10 అడుగుల వెడల్పన ఉన్న ఈ కాలువ నగరంలోని ఆనం సెంటర్, వినాయకుడిగుడి, కనకమహల్, ఆత్మకూరు బస్టాండ్ మీదుగా సాగుతుంది. కాలువ పరిధిలో దాదాపు 3 వేల ఎకరాలు ఆయకట్టు ఉండేది. ప్రస్తుతం ఈ కాలువ పరిధిలో 200 ఎకరాలు కూడా ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదు. పూర్తిగా కబ్జాకు గురైంది. రామిరెడ్డి డ్రైన్ : నగరంలో 7.5 మీటర్ల మేర వెడల్పు ఉన్నకాలువ ఇది. ఆర్టీసీ బస్టాండ్ మీదుగా రైల్వేబ్రిడ్జి, మాగుంట లేఅవుట్, మార్బుల్ ఎస్టేట్ మీదుగా 2.7 కిలో మీటర్లు సాగుతుంది. 2,500 ఎకరాలు ఆయకట్టు ఉండేది. నేడు ఇది కూడా దాదాపు కనుమరుగైంది. చింతారెడ్డిపాళెం కాలువ: 10 మీటర్ల వెడల్పున 2.5 కిలో మీటర్లు పొడవున ఉండేది. 1,200 ఎకరాల ఆయకట్టుకు నీరందేది. ఇపుడు నామమాత్రంగా మిగి లింది. కొన్ని చోట్ల 5 అడుగులకు మించి వెడల్పు లేదు. నగరంలో పలుచోట్ల చిన్న డ్రైనేజీలా మారింది. ప్రస్తుతం 500 ఎకరాలకు నామమాత్రంగా నీరందిస్తోంది. మల్లప్పకాలువ : 3 మీటర్లు వెడల్పున 2.7 కిలో మీటర్ల పొడవున ఉండేది. నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం మీదుగా సాగేది. గతంలో వెయ్యి ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగు నీరందించేది. ప్రస్తుతం కుంచించుకుపోయి 400 ఎకరాలకు మాత్రమే నీరందిస్తోంది. గుండ్లపాళెం కాలువ: 3 మీటర్లు వెడల్పు, 2.5 కిలో మీటర్ల పొడవున ఉన్న ఈ కాలువ నగరంలో మాగుంట లేఅవుట్, ధనలక్ష్మీపురం మీదుగా సాగుతుంది. గతంలో 1,500 ఎకరాల ఆయకట్టుకు నీరందించేది. ప్రస్తుతం 200 ఎకరాలకు నామమాత్రంగా నీరందిస్తోంది. గచ్చకాలువ : 3.5 మీటర్లు వెడలున, 2.5 కిలో మీటర్లు పొడవున ఉన్న ఈ కాలువ 1,200 ఎకరాల ఆయకట్టుకు నీరందించేది. ప్రస్తుతం దాదాపు కనుమరుగైన ఈ కాలువ 200 ఎకరాలకు నామమాత్రంగా నీరందిస్తోంది. మొత్తంగా ఈ కాలువల కింద డెరైక్ట్ తూములతో కలిపితే 12 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా నేడు 1200 ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీరు చేరుతోంది. మినీబైపాస్ సమీపంలోని ఓవెల్ స్కూల్ ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన పంట కాలువలను ఆక్రమించి అపార్ట్మెంట్లే నిర్మించారు. మార్బుల్ ఎస్టేట్ ఎదురుగా ఉన్న కాలువ ఆక్రమణకు గురైంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధి అతి దగ్గరగా ఉండే ఓ మాజీ కార్పొరేటర్ కబ్జా చేశాడు. జీపీఆర్ కల్యాణ మండపం ముందు ఉన్న కాలువను అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కబ్జా చేసినట్లు తెలుస్తోంది. జేమ్స్‌గార్డెన్ ప్రాంతంలో ఉన్న సర్వేపల్లి కాలువలో కలిసే పెద్ద పంట కాలువలను ఆక్రమించి కాంప్లెక్స్ నిర్మించారు. బాలాజీనగర్, ఏసీనగర్ ప్రాంతంలో ఉన్న సర్వేపల్లి కాలువలు పూర్తిగా ఆక్రమణకు గురై దాదాపు కనుమరుగయ్యాయి. నగరంలోని ఉయ్యాల కాలువ, నాగిరెడ్డి కాలువలు ఎప్పుడో కనిపించకుండా పోయాయి. పాత పెద్దాసుపత్రి వద్ద ఉయ్యాల కాలువ, రామలింగాపురం బ్రిడ్జివద్ద రా మిరెడ్డి కాలువలు కబ్జాకు గురయ్యాయి. మద్రాసు బస్టాండ్ (నెహ్రూ విగ్రహం) వద్ద రామిరెడ్డి కాలువ ఆక్రమించి ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో కాలువ ఆక్రమించి మరో భారీ భవనం నిర్మిస్తున్నారు. ఇదే ప్రాంతంలో రోడ్డు అవతలి వైపు కోర్టు ఎదురుగ్గా గతంలో ఆక్రమిత స్థలంపై భవనం నిర్మించడం వివాదాస్పదమైంది. టెక్కేమిట్ట వద్ద పంట కాలువ అక్రమ నిర్మాణాలతో పూర్తిగా కుంచించుకుపోయింది. కబ్జాల పర్వంతో నగరంలోని పంట కాలువలు కనుమరుగయ్యాయి. నె ల్లూరు కార్పొరేషన్ అధికారులు అందిన కాడికి డబ్బులు దండుకుని అక్రమ నిర్మాణాలకు అనుమతులిస్తున్నారు. -
ఆసక్తి రేకెత్తిస్తున్న సర్వే వివరాలు!
హైదరాబాద్: నగరంలో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరిస్తున్న వివరాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. కుటుంబాల కంటే రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయని ఒక పక్కన చెబుతుంటే, సర్వేలో కుటుంబాలు, జనాభా, భవనాలు అన్నీ ఎక్కువగా ఉన్నట్లు తేలుతోంది. ఈ కారణంగా జిహెచ్ఎంసి పరిధిలో ఈరోజు సర్వే పూర్తి అయ్యే అవకాశం లేదు. మరో రెండు రోజులపాటు సర్వే చేయవలసి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల సర్వేను పొడిగించే అవకాశం ఉంది. ఈ విషయం కాసపేట్లో అధికారికంగా ప్రకటిస్తారు. హైదరాబాద్‌లో జనాభాలెక్క, కుటుంబాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. అనుకున్న దానికన్నా 5 లక్షల మేర కుటుంబాల సంఖ్య పెరిగింది. భవనాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అందులోని కుటుంబాల సంఖ్యను లెక్కించడానికి సర్వే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అర్థరాత్రి వరకూ సర్వే కొనసాగిస్తారు. అప్పటికీ పూర్తి కాకపోతే రేపు కూడా కొనసాగించే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో సర్వే ఇంకా మొదలుకాలేదు. ఇప్పుడిప్పుడే ఊపందుకుంది. కొన్నిచోట్ల చిరునామాలతో సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటి నంబర్లు సరిగాలేవు. ఎన్యూమరేటర్లు అవస్తలు పడుతున్నారు. ఎన్యూమరేటర్లు రాపోతే ప్రజలు అధికారులకు స్వయంగా ఫోన్లుచేస్తున్నారు. -
విద్యుత్ సరఫరాలో సవాళ్లున్నాయ్...
నష్టాలు తగ్గించేందుకు కార్యాచరణ ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ హన్మకొండ సిటీ : రాష్ట్రంలో విద్యుత్ సర ఫరా విషయంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్(సీఎండీ) కొంటె వెంకటనారాయణ అన్నారు. హన్మకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో విద్యుత్ పంపిణీలో వివాదాలు చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ మేరకు విద్యుత్ లోటు ఏర్పడగా, వర్షాభావ పరిస్థితులు తోడు కావడంతో సరఫరా విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, లోటును త గ్గించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని తెలిపారు. పంపిణీకి పటిష్టమైన వ్యవస్థ అవసరం అందుబాటులో ఉన్న విద్యుత్‌ను వినియోగదారులకు సక్రమంగా అందజేసేందుకు పటిష్టమైన పంపిణీ వ్యవస్థ అవసరమని సీఎండీ వెంకటనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు విద్యుత్ సరఫరాలో సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. కాగా, విద్యుత్ పంపిణీలో 2012-2013లో 13.37 శాతం ఉన్న నష్టాన్ని 2014-2015నాటికి 12.59కి తగ్గించగలిగామని వివరించారు. అంతేకాకుండా పట్టణాల్లో విద్యుత్ సరఫరా మెరుగు పరిచేందుకు 23 సబ్స్టేషన్లు నిర్మించామని, మండల కేంద్రాలు, గ్రామాల్లో కొత్తగా 86 సబ్స్టేషన్లు నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. 1,23,335 వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు సరఫరా మెరుగు పర్చడం, నష్టాలు తగ్గించాలనే లక్ష్యంతో హెచ్‌వీడీఎస్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రూ.8.54 కోట్లతో 322 ఎస్సీ కాలనీలకు, రూ.4.17 కోట్లతో గిరిజన ఆవాస ప్రాంతాలు, నీటివనరులకు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు సీఎండీ తెలిపారు. అలాగే, నక్కలగుట్టలోని విద్యుత్ భవన్‌పై సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేసి 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. నూతనంగా భవనాలు నిర్మించుకునే వారు సోలార్ ప్యానల్స్ ఏర్పాటుచేసేలా ప్రోత్సహించనున్నట్లు సీఎండీ పేర్కొన్నారు. ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎన్పీడీసీఎల్ నుంచి మానసిక వికలాంగులకు, కుష్టువ్యాధిగ్రస్తులకు రూ.83 వేల సహాయాన్ని అందించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన ఉద్యోగులకు బహుమతులు అందజేసిన సీఎండీ.. శుక్రవారం కార్యాలయంలో నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ తదితర పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ డెరైక్టర్లు బి.వెంకటేశ్వర్రావు, టి.చంద్రశేఖర్, ఆర్.జాన్‌ప్రకాశ్‌రావు, జి.సుదర్శన్, సీజీఎంలు ఎండీ.యూనస్, ఎం.వెంకటనారాయణ, కె.ఈశ్వరయ్య, వి.సుధాకర్, జి.రాజారావు, పి.సంధ్యారాణి, టి.సదర్లాల్, బి.అశోక్‌కుమార్, జి.రవీంద్రనాథ్, జీఎంలు మధుసూదన్, వి.తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, శివరామకృష్ణ, సాంబయ్య, కె.రమేష్, రాధాకృష్ణంరాజు, ఎస్.రంగారావు, సత్యనారాయణ, వేణుగోపాలాచారి, అచ్చేశ్వర్రావు, శివరాం, రవీందర్, కె.కిరణ్, కంపెనీ కార్యదర్శి కె.వెంకటేశం, ఈఈలు రవీందర్, ఎస్.అమర్నాథ్, ఎస్ఈ మోహన్‌రావు, ఛీఫ్ విజిలెన్స్ అధికారి యువీఎస్.రాజు పాల్గొన్నారు. -
స్కైడెక్ విహారం...
అమెరికా! అమెరికాలోని షికాగో నగరంలో విల్లీస్ టవర్ ప్రముఖ వాణిజ్య సముదాయం. దీంట్లో వందకు పైగా కార్పొరేట్ కార్యాలయాలున్నాయి. 110 అంతస్తులు గల ఈ భవనం విస్తీర్ణం 4.5 మిలియన్ అడుగులు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తై భవనం. ఈ భవనంలోనే 103వ అంతస్తులో ‘స్కైడెక్’ ఉంది. షికాగో నగరాన్ని సందర్శించే ప్రతి వ్యక్తి స్కైడెక్‌ను తప్పనిసరిగా సందర్శిస్తాడు. 1,353 అడుగుల ఎత్తులో గ్లాస్ బాక్స్ నుంచి కిందికి వీక్షిస్తే నగరంలోని భవనాలు చీమల సమూ హాలుగా కనిపిస్తాయి. కానీ కిందికి పడిపోతామేమోననే భయం అక్కడ మనలను నిలువ నీయదు. 103వ అంతస్తుకు లిఫ్ట్‌లో వెళ్లేటపుడు విమానంలో పైకి లేస్తున్న అనుభూతి కలుగుతుంది. 103వ అంతస్తులో 4.3 అడుగులు వెలుపలికి గ్లాసులు ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బైనాక్యులర్స్ ద్వారా మైళ్ల దూరంలోని దృశ్యాలను కూడా చూడవచ్చు. ఈ గాజు గ్లాస్ ఒక పెద్ద ఏనుగు బరువును ఆపగలదు. స్కైడెక్ నిర్మాణం ఇప్పటి వరకు ఉత్తమ నిర్మాణంగా అనేక అవార్డులను గెలుచుకుంది. స్కైడెక్ సందర్శనకు ముందు స్వల్ప నిడివి గల చిత్రంలో ఆ భవన నిర్మాణం చిత్రాలను, ప్రాముఖ్యతను వివరిస్తారు. 1969లో ‘సియర్స్ రోబక్ అండ్ కంపెనీ’కి చెందిన 3 లక్షల 50 వేల మంది ఉద్యో గులు, 12వేల మంది కార్మికులు మూడు సంవత్సరాల పాటు శ్రమించి ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. స్కైడెక్లో వీక్షణకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ 19 డాలర్లు చార్జీగా చెల్లించాలి. -జి.గంగాధర్,‘సాక్షి’(షికాగో నుంచి) -
కూల్చివేతలపై గ్రేటర్ స్టాండింగ్ కమిటీ వ్యతిరేకత
-
మూడో రోజు కొనసాగుతున్న కూల్చివేతలు.
-
అక్రమాల మేడలు
అనంతపురం కార్పొరేషన్ :అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ కట్టడాలు అడ్డగోలుగా జరుగుతున్నాయి. ప్లాన్ అనుమతులకు విరుద్ధంగా భవన నిర్మాణాలు సాగుతున్నాయి. సెట్ బ్యాక్ అనేది మచ్చుకు కూడా కనిపించడం లేదు. దీని సంగతి అటుంచి ఏకంగా రోడ్డు, కాలువ స్థలాలను ఆక్రమిస్తూ ర్యాంప్‌ల నిర్మాణం వంటివి చేపడుతున్నారు. కొన్ని చోట్ల పార్కింగ్ కోసం కేటాయించిన స్థలం (సెల్లార్)లో కూడా వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. సెంటు లేదా ఒకటిన్నర సెంటు స్థలంలో ఇల్లు నిర్మించుకునేవారిపై తమ అధికార పెత్తనాన్ని చూపించే టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది అనుమతులకు విరుద్ధంగా బడాబాబులు నిర్మిస్తున్న భవనాలు, అపార్టుమెంట్ల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వారి నుంచి అన్ని స్థాయిల్లో ముడుపులు ముడుతుండడంతోనే ఆ వైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల సెట్ బ్యాక్ స్థలాన్ని వదలకుండా రోడ్డు మీదకు వచ్చేలా భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదు. అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు వచ్చినా, విజిలెన్స్ అధికారులు ప్రశ్నించినా ఆ తక్షణమే స్పందించినట్లు వ్యవహరించి మొక్కుబడిగా కేసుల నమోదుతో సరిపెడుతున్నారు తప్ప కఠిన చర్యల జోలికి వెళ్లడం లేదు. తప్పించుకునే మార్గాలూ వీరే చూపుతారు అక్రమ నిర్మాణాల గురించి అధికారులు ప్రశ్నిస్తే టౌన్‌ప్లానింగ్ సిబ్బంది హుటాహుటిన వెళ్లి మొక్కుబడిగా చర్యలు తీసుకుంటున్నారు. ఆ గండం నుంచి తప్పించుకునే మార్గాలను అక్రమ నిర్మాణానికి పాల్పడిన భవన యజమానికి తెలియజే స్తున్నారు. కొద్ది రోజుల క్రితం కమలానగర్లో ఇదే చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో అనుమతులకు విరుద్ధంగా ఒక భవన నిర్మాణం జుగుతున్నట్లు ఆర్డీఎంఏకి ఫిర్యాదు వెళ్లింది. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులను ఆయన ప్రశ్నించారు. దీంతో వారు అక్రమ కట్టడం వద్దకు వెళ్లి తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. కోర్టుకు వెళ్లాలని సదరు యజమానికి ఉచిత సలహా ఇచ్చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన కోర్టు వెళ్లారు. ఏంటి ప్రస్తుత పరిస్థితని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే కోర్టులో ఉందని చల్లగా చెప్పి జారుకుంటున్నారు. అక్రమార్జన అపార్టుమెంట్లు, భారీ భవనాల నిర్మాణం ఇక్కడి అధికారులకు కాసులు కురిపిస్తున్నాయనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. ప్లాన్ అప్రూవల్ కావాలంటే అన్ని స్థాయిల్లోనూ ముడుపులు ఇచ్చుకుంటే తప్ప చేతికంద దని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అక్రమ కట్టడాల నిర్మాణానికి చెక్ పెట్టాలంటే ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి తనిఖీలు చేస్తుండాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
తెలంగాణకు భవనాల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు సచివాలయం, చట్టసభలు, మంత్రుల నివాసాలు, ఎమ్మెల్యేల క్వార్టర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ కేటాయింపులన్నీ తాత్కాలిక ప్రాతిపదికన చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా ప్రస్తుత సీఎం క్యాంపు కార్యాలయం కేటాయించారు. ఆ క్యాంపు కార్యాలయాలు తమకు అవసరం లేదని, కుందన్‌బాగ్‌లోని రెండు క్వార్టర్లను విలీనం చేసి అక్కడ కార్యాలయం ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరడం... అందుకు అనుగుణంగా గతంలో ఉత్తర్వులు జారీ కావడం తెలిసిందే. అయినా మళ్లీ ఇప్పుడు ప్రస్తుత సీఎం క్యాంపు కార్యాలయాన్ని తెలంగాణ సీఎంకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. సచివాలయంలోని ఏ,బీ,సీ,డీ బ్లాకులను పూర్తిగా తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి కేటాయించారు. ‘సీ’ (సమత) బ్లాకులోని ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి చాంబర్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మూడో అంతస్తులో ప్రస్తుత సీఎస్ కార్యాలయాన్ని, మంత్రివర్గ సమావేశ మందిరాన్ని కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన నాలుగు బ్లాకుల్లో ఏ అంతస్తులో ఈ కార్యాలయం ఉండాలన్న వివరాలను కూడా ఉత్తర్వుల్లో పొందుపరిచారు. అలాగే కొత్త అసెంబ్లీని తెలంగాణకు, దానిని అనుకుని ఉన్న మంత్రుల చాంబర్లను తెలంగాణ మంత్రుల కోసం కేటాయించారు. ఇక జూబ్లీహాల్‌ను తెలంగాణ శాసనమండలిగా నిర్ణయించారు. దీనికి అవసరమైన మరమ్మతులు చేపట్టనున్నారు. ఇక మంత్రుల నివాసాలకు సంబంధించి బంజారాిహ ల్స్లోని మంత్రుల నివాస సముదాయంలోని 1 నుంచి 15వ భవనం వరకు తెలంగాణ మంత్రులకు కేటాయించారు. ఆదర్శ్‌నగర్‌లోని 1 నుంచి 10 బ్లాక్‌లు, 24వ బ్లాకు, డాక్టర్స్ క్వార్టర్లను తెలంగాణ శాసన సభ్యుల నివాస ప్రాంతాలుగా నిర్ణయించారు. సచివాలయంలో ఏ బ్లాకులో ఏ శాఖలు? సీ బ్లాకు.. ఆరో అంతస్తు: సీఎం కార్యాలయం ఐదో అంతస్తు: సీఎం కార్యదర్శులు, సాధారణ పరిపాలన శాఖ నాల్గవ అంతస్తు: సీఎం ముఖ్య కార్యదర్శి కార్యాలయం, సాధారణ పరిపాలన శాఖ, కాన్ఫరెన్స్ హాలు మూడో అంతస్తు: సీఎస్ కార్యాలయం, కేబినెట్ సమావేశ మందిరం రెండో అంతస్తు: సాధారణ పరిపాలన శాఖ మొదటి అంతస్తు: సాధారణ పరిపాలన శాఖ, సీఎం ప్రెస్ సెక్రటరీ కార్యాలయం డీ బ్లాకు.. మొదటి అంతస్తు: గిరిజన, వెనుకబడిన తరగతులు, సాంఘిక, మైనారిటీ సంక్షేమ శాఖలు, మహిళా శిశు అభివృద్ది, పాఠశాల, ఉన్నత విద్య శాఖలు రెండో అంతస్తు: వ్యవసాయం, సహకారం, పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ, పశు సంవర్ధక, మత్స్య, పరిశ్రమలు, వాణిజ్య, మౌలిక సదుపాయాలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, కార్మిక ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖలు, ఇంధన, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ శాఖలు మూడో అంతస్తు: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు నాల్గవ అంతస్తు: ఆర్థిక, రెవెన్యూ, ప్రణాళిక శాఖలు బీ బ్లాకు.. మొదటి అంతస్తు: సాధారణ పరిపాలన శాఖ(ఎన్నికలు) రెండో అంతస్తు: సాధారణ పరిపాలన శాఖ మూడో అంతస్తు: యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కతిక శాఖ నాలుగు, ఐదు, ఆరో అంతస్తులు: సాగునీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖలు ఏ బ్లాకు.. మొదటి అంతస్తు: పర్యావరణ,అటవీ, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ రెండో అంతస్తు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ శాఖలు మూడో అంతస్తు: న్యాయశాఖ నాల్గవ అంతస్తు: హోం శాఖ ఐదో అంతస్తు: రవాణ, రహదారులు, భవనాల శాఖ -
అంగన్వాడీలకు సొంత భవనాలేవి?
మునుగోడు, న్యూస్‌లైన్ :మాతాశిశు సంరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాలకు నోచుకోవడం లేదు. వందలాది కేంద్రాలు అద్దె భవనాల్లో అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 3,801 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇం దులో 925 కేంద్రాలకు సొంత భవనా లు ఉన్నాయి. మరో 880 కేంద్రాలు కమి టీ హాళ్లు, అదనపు తరగతి గదుల్లో కొనసాగుతున్నాయి. మిగతా 1996 కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రా ల్లో ఆట వస్తువులు ఉన్నా ఆడుకోవడానికి ఆట స్థలాలు లేక అవి నిరుపయోగంగా ఉంటున్నాయి. గ్రామాల్లో అద్దె భవనాల కోసం ప్రభుత్వం నెలకు రూ. 200 చొప్పున కిరాయి చెల్లిస్తోంది. కానీ, ఈ అద్దెకు భవనాలు దొరకడం లేదు. అద్దె ఆరు నెలలకోసారి ప్రభుత్వం చెల్లిస్తుండడంతో అంగన్వాడీ కేంద్రాలకు భవనాలను అద్దెకు ఇవ్వాలంటే ఇంటి యజమానులు జంకుతున్నారు. గ్రామం లో ఎక్కడో మూలకు పాడుపడ్డ గదుల్లో కేంద్రాలు అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. ఇరుకైన భవనాల్లో వెలుతు రు లేక చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న చిన్నగదుల్లో పౌష్ఠి కాహారం నిల్వ చేయడం, వంట చెరకు, ఆట వస్తువులు భద్రదపరుచుకోవడానికే స్థలం సరిపోతుంది. గర్భిణులు, బాలింతలకు టీకాలు వేయడానికి, పౌష్టికాహారం పంపిణీ చేయడానికి అంగన్వాడీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు అనువైన స్థలం లేక సక్రమంగా చేయలేక పోతున్నామని పలువురు కార్యకర్తలు చెబుతున్నారు. -
రాజభవనమేంటీ, ఇదీ సత్రమే
జెన్ పథం ఆ రాజుకి భవనాలు కట్టించడంలో మక్కువెక్కువ. ఆయన ఎన్నో భవనాలు కట్టించాడు. అవన్నీ విలాసవంతమైనవీ, విశాలమైనవీనూ. కానీ మరోవైపు ఈ కట్టడాల వల్లఖజానా ఖాళీ అవుతూ వచ్చింది. దాంతో ఆయన ఖజానా నింపడం కోసం ప్రజలపై కొత్త కొత్త పన్నులు వేయడం మొదలుపెట్టాడు. జనం వాటిని కట్టలేక అవస్థలు పడుతూ వచ్చారు. ఆకలి బాధలు ఎక్కువయ్యాయి. కడుపునిండా తిండి లేక ప్రజలు మాడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ తరుణంలో రాజ్యంలోని ఒక వీధి గుండా ఒక సాధువు నడుచుకుంటూ పోతున్నాడు. అక్కడక్కడ ప్రజలు తమ ఇక్కట్ల గురించి మాట్లాడుకోవడం ఆయన చెవిన పడింది. ఆయన మనసులో ఏ ఆలోచన వచ్చిందో గానీ ఆయన ప్రయాణ దిశ మారింది. పొరుగూరుకు వెళ్లాలనుకున్న ఆయన తిన్నగా రాజుగారి ఆస్థానానికి అడుగులు వేశారు. సాధువు రూపం చూసీచూడగానే గౌరవించేటట్టు ఉంది. ఆయన రాజుగారి భవంతికి చేరుకున్నారు. ప్రవేశద్వారం వద్ద ఉన్న భటులు ఆయనను లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుపడలేదు. ఆయన ఎవరని కూడా అడగలేదు. సాధువు సరాసరి రాజుగారి భవనంలోకి అడుగుపెట్టారు. ఆయన వెళ్లేసరికి అక్కడ సభ జరుగుతోంది. ఇరవై మెట్లు పైన ఉన్న సింహాసనంలో రాజుగారు కూర్చుని ఉన్నారు. ఈ మెట్లకు అటూ ఇటూ ఉన్న ఆసనాలలో మంత్రులు, పండితులు కూర్చున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా నేరుగా సభలోకి వచ్చి నిల్చున్న సాధువును చూసి రాజు సహా అందరూ ఆశ్చర్యపోయారు. సాధువును చూసిన రాజు ‘‘మీరెవరు? మీకు ఏం కావాలి? మిమ్మల్ని లోపలకు పంపింది ఎవరు?’’ అని ప్రశ్నలవర్షం కురిపించాడు. కానీ సాధువు రాజుగారి మాటలేవీ పట్టించుకోకుండా ‘‘ఈ రోజు రాత్రి నిద్రపోవడానికి నాకు కాస్తంత చోటు కావాలి’’ అని అన్నారు. రాజుకుగానీ మరెవ్వరికీ గానీ ఆయన మాట అర్థం కాలేదు. ‘‘ఏంటీ? నిద్రపోవడానికా’’ అని రాజు అడిగాడు. ‘‘ఈ రోజు రాత్రి ఈ సత్రంలో నిద్రపోవాలనుకుంటున్నాను. రేపు ఉదయం లేచీలేవగానే నా పనులు కానిచ్చుకుని వెళ్లిపోతాను’’ అని సాధువు తాపీగా జవాబిచ్చారు. ‘‘చూడ్డానికి పెద్దవారిలా ఉన్నారు. మీ మాట విచిత్రంగా ఉంది. ఇది మీరనుకుంటున్నట్లు సత్రం కాదు. ఇది నా రాజభవనం’’ అని రాజు మీసాలు దువ్వాడు. ‘‘అలాగా?’’ అంటూ ‘‘మీ ముందు ఇక్కడ ఎవరున్నారు?’’ అని అడిగారు సాధువు. ‘‘మా నాన్నగారు’’ ‘‘ఆయన ఎక్కడున్నారు?’’ ‘‘ఆయన ఇప్పుడు లేరు. గతించారు’’ ‘‘ఆయనకన్నా ముందు...’’ ‘‘మా తాతగారు’’ ‘‘ఆయన ఏమయ్యారు?’’ ‘‘ఆయనా చనిపోయారు’’ - ఇలా మరో రెండు తరాల వారి గురించి వారి మధ్య మాటలు సాగాయి. ఆ తర్వాత సాధువు ‘‘బాటసారులు కొంతకాలం బసచేసి వెళ్లిపోయే చోటును సత్రమనేగా అంటారు. మీరంటున్న ఈ రాజభవనంలో ఇప్పుడు మీరున్నారు. మీ కన్నా ముందు మీ నాన్నగారు. అంతకన్నా ముందు మీ తాతగారు, ఆయన కన్నా ముందు మీ ముత్తాత ఇలా ఎవరో ఒకరు ఉండిపోయే ఈ చోటుని కూడా సత్రమనే నేనంటాను. ఏమీ అనుకోకపోతే ఒక మాటంటాను. ఇప్పుడు మీరున్నారు. మీ తర్వాత మీ కుమారుడు ఉంటాడిక్కడ. అతని తర్వాత అతని కుమారుడు... ఇలా ఉండిపోతుంటారు. ఎవరూ శాశ్వతంగా ఉండడం లేదు. అటువంటప్పుడు ఇది ఎలా రాజప్రాసాదం అవుతుంది. ఇదీ ఒక సత్రమే అనుకోవడంలో తప్పేముంది?’’ అని ప్రశ్నించడంతో రాజు ఆ సాధువు సామాన్యులు కాదని, ఓ జ్ఞాని అని గ్రహించాడు. ఆయన ఏం చెప్పదలచుకున్నారో అర్థమైంది. ఆయన తన కళ్లు తెరిపించారని తెలుసుకుని అప్పటి నుంచి విలాసవంతమైన భవనాలు కట్టించడం మానేశాడు. ఖజానాలో డబ్బులు మిగుల్తూ వచ్చాయి. దాంతో ప్రజలపై పన్నులు విధించే అవసరమూ కలగలేదు. అప్పటి దాకా ఉన్న పన్నులే కాకుండా పన్ను బకాయిలను సైతం కట్టక్కర్లేదని దండోరా వేయించాడు. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజల ప్రశంసలు పొందుతూ రాజు మిగిలిన శేషజీవితం ఆనందంగా గడిపాడు. - యామిజాల జగదీశ్ -
తాగేందుకు నీళ్లు కరువే
తాగేందుకు నీళ్లు కరువే నిరుపయోగంగా మరుగుదొడ్లు మెనూలో మాయమవుతున్న గుడ్డు చలిని ఆపలేని పలుచటి దుప్పట్లు జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు తిష్ట వేశాయి. వీటిపై సాక్షి దినపత్రికలో రెండు నెలల క్రితం సమరసాక్షి శీర్షికన వరుస కథనాలు ప్రచురించినా అధికారుల్లో చలనం లేదు. ఇప్పటికీ అనేక హాస్టళ్లలో కనీస సదుపాయాలు లేవు. చిన్నారులకు గుక్కెడు నీరు కరువవుతోంది. సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఎస్సీ 124, ఎస్టీ, 16, బీసీ 66, మైనారిటీలకు 2 హాస్టళ్లను సంక్షేమశాఖ ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక్కడి సమస్యలు విద్యార్థులకు నరకం చూపుతున్నాయి. బాలికల హాస్టళ్ల వద్ద రా త్రిపూట రక్షణ ఉండడం లేదు. మం గళ, గురువారాల్లో గుడ్డు ఇవ్వాల్సి ఉంది. అయితే పలు హాస్టళ్లలో గుడ్డు మాయమవుతోంది. ప్రభుత్వం అం దజేసిన పల్చటి దుప్పట్లు చలిని ఆపలేకపోతున్నాయి. గదులకు కిటికీలు, తలుపులు బిగించకపోవడంతో చలితీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. దోమల దెబ్బతో చిన్నారులు జ్వరాల బారినపడుతున్నారు. -మదనపల్లె నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికల హాస్టళ్లలో బిందెలు, గ్లాసులు లేవు. అన్నం తినేటప్పుడు గొంతు పట్టుకుంటే విద్యార్థులు పరుగున కొళాయి వద్దకు చేరుకుంటున్నారు. విద్యుత్ పోతే కనీసం కొవ్వొత్తులు వెలిగించే దిక్కులేదు. వార్డెన్లు హాస్టళ్ల ముఖం చూడడం లేదు. వాచ్మెన్, వంటోళ్లతో నడిపిస్తున్నారు. మదనపల్లెలోని ఎస్సీ హాస్టల్‌కు ములకలచెరువు వార్డెన్‌ను ఇన్చార్జిగా నియమించారు. ఇక్కడ పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. వృద్ధ మహిళలను వాచ్మెన్లుగా పెట్టారు. బాలికలకు రక్షణ లేదు. దుప్పట్లు లేవు. పాచినీళ్లే తాగుతున్నారు. - చిత్తూరు ఎస్సీ బాలురు-1 హాస్టల్‌కు రెండు నెలల నుంచి ప్రహరీగోడ లేదు. పందులు, కుక్కలు లోపలకు వచ్చేస్తున్నాయి. బయటి వ్యక్తులు హాస్టల్ స్థలంలో గుడిసెలు వేసేందుకు యత్నిస్తున్నారు. ఎస్సీ హాస్టల్-2 వద్ద మరుగుదొడ్ల నిర్వహణ మెరుగుపడలేదు. విద్యార్థులు మల, మూత్రవిసర్జనకు ఆరుబయటకు వెళ్లాల్సిందే. గతంలో 300 మంది బాలురు ఉండేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య 30 మందికి పడిపోయింది. -జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు భవనాలు లేవు. పెనుమూరు మండలం ఉగ్రాణంపల్లె, పెనుమూరు ఎస్సీ బాలుర హాస్టల్ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. విద్యార్థులకు సరిపోయే సంఖ్యలో మరుగుదొడ్లు లేవు. - సత్యవేడులో బీసీ హాస్టల్ భవనం పరిస్థితి మెరుగుపడలేదు. అద్దెభవనంలో కిటికీలు, తలుపులు లేకుండానే కొనసాగుతోంది. ఇక్కడ ఆరుబయటే భోజనాలు తినాల్సి వస్తోంది. - పలమనేరు హాస్టళ్లలో పల్చటి దుప్పట్లు చలిని ఆపలేకపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఇదే పరిస్థితి. పారిశుద్ధ్య లోపంతో దోమలు విజృంభిస్తున్నాయి. కిటికీలు లేకపోవడంతో పిల్లలు వణికిపోతున్నారు. - తిరుపతిలోని బీసీ హాస్టల్లో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. గదుల్లో లైట్లు లేవు. కొందరు పిల్లలు వంటగదుల్లో పడుకుంటున్నారు. మెనులో గుడ్డు ఇవ్వడం లేదు. ఎస్సీ హాస్టల్లో గదుల, మరుగుదొడ్ల తలుపులు పూర్తిగా విరిగిపోయాయి. సాయంత్రం 5 గంటలు దాటితే వార్డెన్ అందుబాటులో ఉండడం లేదు. ఎస్టీ బాలుర హాస్టల్లో మెనూ పూర్తిగా అమలు కావడం లేదు. - చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో ఎస్సీ హాస్టల్లో మరుగుదొడ్లకు నీటి సదుపాయం లేదు. దోమల కారణంగా విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు. రామచంద్రాపురంలోని హాస్టల్లో రీడింగ్ రూం లేదు. దోమల బెడద అధికంగా ఉంది. చంద్రగిరి ఎస్సీ, బీసీ హాస్టళ్లలో మరుగుదొడ్లలో నీటి కొరతతో పారిశుద్ధ్యం లోపించింది. - ముఖ్యమంత్రి నియోజకవర్గం పీలేరులోని హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. పీలేరు ఎస్సీ బాలుర హాస్టల్లో నీటి సమస్య వేధిస్తోంది. చలికి పల్చటి దుప్పట్లే విద్యార్థులకు దిక్కవుతున్నాయి. -
అంగన్వాడీలకు అద్దె బెంగ
ఖమ్మం, న్యూస్‌లైన్: అంగన్వాడీ కేంద్రాలకు అద్దెల బెంగ పట్టుకుంది. జిల్లాలో 15 ప్రాజెక్టుల పరిధిలో 3,670 అంగన్వాడీ కేంద్రాలు, 1218 మినీ అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. అయితే ఇందులో 1634 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మరో 2,036 సెంటర్లు అవస్థల మధ్య అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసే అద్దె డబ్బుతో సరైన ఇళ్లు దొరకడం లేదు. ఒకవేళ ఎవరైనా ఇచ్చినా.. పిల్లల చిలిపి చేష్టలు, మల, మూత్ర విసర్జన ల మూలంగా ఒకటి రెండు నెలలకే కేంద్రాలను ఖాళీ చేయిస్తున్నారు. దీంతో పెట్టే బేడా సర్దుకొని నెలకో సెంటర్‌కు మారాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సొంత భవనాలు ఉన్నా.. అవి శిథిలావ స్థకు చేరుకున్నాయి. కిటికీలు ఊడి, తలుపులు విరిగి పోవడంతో ఆయా కేంద్రాలో నిల్వ ఉంచే పోషకాహారం, గుడ్లు కుక్కల పాలవుతున్నాయి. నాబార్డు, ఎల్‌డబ్ల్యూఈఏ, ఇతర నిధుల ద్వారా మంజూరైన భవనాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నా యి. ఏళ్లు గడిచినా సగానికి పైగా పూర్తి కాలేదు. అయితే కొత్త వాటి నిర్మాణం పూర్తయ్యే లోపు ఇంతకు ముందున్న భవనాలు కూలి పోయే ప్ర మాదం ఉందని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. నాసిరకంగా నిర్మిస్తున్నా పట్టించుకునే వారే లేరని ఆరోపిస్తున్నారు. చాలీచాలని అద్దెలతో ఇక్కట్లు... చిన్న పిల్లలను పాఠశాలకు సన్నద్ధం చేయడం, కిశోర బాలికలు, బాలింతలకు ఆహారపు అలవాట్లు, పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు వారికి పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుతో అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. అయితే ఈ సెంటర్ల నిర్వహణకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. పలు కేంద్రాలకు సొంత భవనాలు లేక అద్దె ఇళ్లలోనే నిర్వహిస్తున్నారు. అయితే సరిపడా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు చీటికి మాటికి ఖాళీ చేయిస్తున్నారు. గతంలో అర్బన్ పరిధిలో నెలకు రూ.750, రూరల్ పరిధిలో రూ. 200 చెల్లించేవారు. ప్రస్తుతం ఆర్బన్‌లో రూ. 3 వేలు, రూరల్‌లో రూ. 750 ఇస్తున్నారు. అయితే పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా అద్దె చెల్లించకోపవడంతో ఇబ్బందులు తప్పడం లేదని అంగన్వాడీ టీచర్లు వాపోతున్నారు. మధిర మండలం మాటూరు ఎస్సీ కాలనీ, నిధానపురం బీసీ కాలనీ, మధిర పట్టణంలోని యాదవ బజార్ తదితర కేంద్రాలకు తక్కువ అద్దె చెల్లిస్తుండటంతో ఇరుకుగదులు, రేకుల షెడ్లలోనే నిర్వహిస్తున్నారు. దీంతో పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మాటూరు ఎస్సీ కాలనీలోని కేంద్రానికి కిటికీలు కూడా సక్రమంగా లేక ఉక్కపోతతో నానా ఇబ్బందులు పడుతున్నారు. పినపాక నియోజకవర్గంలోని పలు అంగన్వాడీ భవనాల నిర్మాణంలో నాణ్యత లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని భవనాలు... అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి నిధులు మంజూరై ఐదేళ్లు గడుస్తున్నా.. నేటికీ పూర్తి కాలేదు. గడిచిన నాలుగైదు సంవత్సరాలుగా వివిధ పథకాల కింద 1047 కొత్త భవనాలు మంజూరు కాగా, ఇప్పటి వరకు 583 భవనాలు మాత్రమే పూర్తయ్యాయని అధికారులు చెపుతున్నారు. వీటిలో బీఆర్జీఎఫ్ నిధుల ద్వారా 632 భవనాలు మంజూరు కాగా, 440 పూర్తయ్యాయి. 4 మోడల్ అంగన్వాడీ కేంద్రాల్లో రెండు మాత్రమే పూర్తయ్యాయి. నాబార్డు నిధుల కింద 146 భవనాలు మంజూరు కాగా, అందులో 51 మాత్రమే పూర్తయ్యాయి. 15 శాతం జనరల్ రెవెన్యూ ఫండ్‌లో భాగంగా మంజూరైన 90 కేంద్రాల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధుల ద్వారా 90 కేంద్రాలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణం పూర్తయిందని అధికారులు చెపుతున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో నిర్మించినవి సగం కూడా లేవని అంగన్వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఐఏపీ మొదటి రెండు విడుతలలో మంజూరైన 157 కేంద్రాలు ఇంకా టెండర్ దశలోనే ఉన్నాయి. -
దయనీయస్థితిలో ఆరోగ్య ఉపకేంద్రాలు
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ :జిల్లాలోని ఆరోగ్య ఉపకేంద్రాల పరిస్థితి దయనీయంగా మారింది. సొంత భవనాలు లేకపోవడంతో ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో 431 కేంద్రాలుండగా 108 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. వీటిలో 30 కేంద్రాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. 323 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అధికారుల అలసత్వం వల్లే ఆరోగ్య ఉపకేంద్రాలు సొంత భవనాలకు నోచుకోలేదనే ఆరోపణలున్నాయి. అద్దె కేంద్రాల్లో కానరాని నేమ్ బోర్డులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సబ్ సెంటర్లు ఎక్కడ ఉన్నయో కూడా తెలియని పరిస్థితి. ప్రతీ సబ్సెంటర్కూ తప్పనిసరిగా నేమ్ బోర్డు ఉండాలి. అయితే అద్దె భవనాల్లో నడుస్తున్న కేంద్రాల్లో 70 శాతం కేంద్రాలకు బోర్డుల్లేవు. దీంతో సబ్ సెంటర్ ఎక్కడ ఉందో, ఎవరు విధులు నిర్వహిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇరుకు కేంద్రాలతో అవస్థలు ఉప కేంద్రాలు నిర్వహిస్తున్న భవనాలు ఇరుకుగా ఉండడంతో వైద్య పరీక్షలకు వస్తున్న గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. సబ్ సెంటర్లో ఉన్న వైద్య పరికరాలు పెట్టడానికి కూడా సిబ్బందికి అవస్థలు తప్పడం లేదు. ఎగ్జామినేషన్ టేబుల్, బరువు తూచే యంత్రం, ఎత్తు కొలిచే పరికరం, మందులు, ఫ్లూయిడ్స్, బీపీ, హెచ్‌బీ పరికరాలు పెట్టడానికే స్థలం చాలడం లేదని పలు కేంద్రాల్లోని సిబ్బంది చెబుతున్నారు. సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేంద్రాలు మరింత అధ్వానంగా తయారవుతున్నాయి. ఎంతో విలువైన మందులు, కాటన్, వాడిన సూదులు ఎక్కడబడితే అక్కడే పడేస్తున్నారు. కలగా మిగిలిన సొంతభవనాలు ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాల ఏర్పాటు కలగానే మిగిలిపోయేలా ఉంది. భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని పలుమార్లు అధికారులు, నాయకులను కోరినా ఫలితం లేకపోతోందని అటు ప్రజలు, ఇటు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరుతున్నారు. -
రియల్ ఢమాల్
=స్థిరాస్తికి విభజన సెగ! =గ్రేటర్లో భారీగా తగ్గిన ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు =సగానికిపైగా పడిపోయిన రాబడి =భారీగా తగ్గిన ఒప్పంద పత్రాల రిజిస్ట్రేషన్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన కసరత్తు నేపథ్యంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థిరాస్తుల లావాదేవీలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. గత నాలుగు నెలల నుంచి ఆస్తుల లావాదేవీలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి.. లక్ష్యానికి చాలా దూరంలో నిలిచింది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్నట్లు జూలై చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో అప్పటివరకూ జోరుగా సాగిన భూములు, ఫ్లాట్ల లావాదేవీలు, ఒప్పందాలకు బ్రేకులు పడ్డాయి. సాధారణంగా హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో అపార్టుమెంట్లు, భవనాల నిర్మాణాలకు స్థలాలను తీసుకుని... వాటికి సంబంధించిన అభివద్ధి ఒప్పందాలు, ఇతర దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉంటారు. ఈ ఒప్పందాల దస్తావేజుల నమోదుతో పాటు ఆస్తుల కొనుగోళ్లు కూడా అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా బహుళ జాతి సంస్థలు, ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఎక్కువగా ఇండిపెండెంట్ గృహాలు, ఫ్లాట్లను కొనుగోలు చేస్తారు. కానీ, విభజన ప్రకటనతో నగరంలో స్థిర నివాసాలపై స్థానికేతరులకు ఆసక్తి తగ్గడంతో.. డిమాండ్ తగ్గిపోయింది. దీనివల్ల భూములు, ఫ్లాట్ల విలువ పడిపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. డిమాండ్ తగ్గడాన్ని ఆసరాగా తీసుకుని కొందరు పెట్టుబడిదారులు ఆస్తులకు చాలా తక్కువ ధర కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చౌకగా అమ్మేందుకు విక్రయదారులు ముందుకు రాకపోవడంతో.. లావాదేవీలు బాగా తగ్గిపోయాయి. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో ఏడాది కింద ఇలాగే లావాదేవీలు పడిపోయినా.. కొద్దిరోజుల్లోనే ఊపందుకోవడం గమనార్హం. రిజిస్ట్రేషన్ శాఖకు తగ్గిన ఆదాయం.. స్థిరాస్తుల క్రయవిక్రయాలు తగ్గడం, ఇతర ఒప్పంద పత్రాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో.. హైద రాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ శాఖ రాబడి సగానికి పైగా తగ్గింది. గత నాలుగు నెలల్లో హైదరాబాద్ పరిధిలో 12,060 దస్తావేజులు మాత్రమే నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 52,424 దస్తావేజులు రిజిస్టరయ్యాయి. అవి కూడా తక్కువ విలువైన కావడంతో లక్ష్యానికి రాబడి దూరంగా ఉండిపోయింది. విభజన ప్రకటన అనంతరం హైదరాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని పరిశీలిస్తే... గత నాలుగు మాసాల్లో రూ. 253.66 కోట్ల లక్ష్యానికిగాను.. రూ. 135.14 కోట్లు మాత్రమే సమకూరింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో రూ. 623.59 కోట్ల లక్ష్యానికి గాను రూ. 376.70 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. అదే గతేడాది రంగారెడ్డి జిల్లా పరిధిలో రూ. 1529.92 కోట్ల లక్ష్యానికి.. రూ. 1809.76 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మొదట్లో విభజన ప్రకటన వరకు కూడా.. శివారు సబ్ రిజిస్ట్రార్లలో నెల నెలా రాబడి సగటున 87.3 శాతం వరకు ఉండగా.. తర్వాత క్రమంగా తగ్గుతూ 55.52 శాతానికి పడిపోయింది. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూలైలో 109.26 శాతం ఉన్న రాబడి, అక్టోబర్‌కు వచ్చేసరికి 50.66 శాతానికి తగ్గింది. చంపాపేటలోనూ అక్టోబర్‌లో 21.77 శాతం మాత్రమే వచ్చింది. ఇలా హైదరాబాద్ శివార్లలోని మహేశ్వరంలో 41.76 శాతం, పెద్దఅంబర్‌పేటలో 41.43 శాతం, సరూర్‌నగర్‌లో 27.53 శాతం, ఉప్పల్‌లో 54.72 శాతం, వనస్థలిపురంలో 42.20 శాతం రాబడి తగ్గింది. -
స.హ.కు సంకెళ్లు?
ముంబై: సామాన్యుడి ఆయుధమైన సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)పై రాష్ట్ర సర్కార్ ఉక్కుపాదం మోపిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో వరుసగా భవనాలు కుప్పకూలి అనేక మంది ప్రాణాలు కోల్పోయినసంగతి తెల్సిందే. దీంతో అప్రమత్తమైన సర్కార్ అక్రమ, శిథిలావస్థకు చేరుకున్న భవనాలపై చర్యలకు ఉపక్రమించింది. కానీ ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ భవనాల వివరాలు ఆర్టీఐ కింద వెల్లడించొద్దని ఆదేశిస్తూ ఆయా ప్రభుత్వ సంస్థలకు జారీ చేసిన జీవో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీనిపై ఆర్టీఐ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ చట్టం కింద ప్రభుత్వ భవనాల నిర్మాణ ప్రణాళికలకు సంబంధించిన వివరాలు బయటపడితే, వాటిలోని లొసుగులు బట్టబయలవుతాయని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లోపాలు బయటపడితే దాని వెనుకున్న బిల్డర్లు, అవినీతి రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తాయన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు. గతంలో బిల్డర్లు నిర్మించిన భవనాల్లో నాణ్యత లోపించడం, భవన ప్రణాళిక సరిగా లేకపోవడం తదితర కారణాల వల్ల సర్కార్ ఈ చర్యకు ఉపక్రమించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సామాన్యుడి ఆయుధంగా చెప్పుకునే ఆర్టీఐపై సర్కార్ ఈ విధంగా వ్యవహరించడం అక్రమార్కులకు అండగా నిలుస్తుందనే సంకేతాలె ప్రజల్లోకి వెళ్లే అవకాశముందని మేధావులు అంటున్నారు. సెప్టెంబర్ 26న ఆదేశాలు ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థల భవనాల ప్రణాళిక, ఇతర వివరాలను ఆర్టీఐ కింద వెల్లడించవద్దని పేర్కొంటూ మహారాష్ట్ర రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ రత్నాకర్ గైక్వాడ్ అన్ని స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. భద్రతా కారణాల వల్ల ఈ వివరాలు గోప్యంగా ఉంచాలని సదరు జీవోలో పేర్కొన్నారు. సెక్షన్ 19 (8) (సీ), 25 (5) ఆర్టీఐ చట్టం కింద ఉన్న నిబంధనలను వృథా చేస్తున్నారని, ఈ ఏడాది సెప్టెంబర్ 26న జారీ చేసిన జీఓలో గైక్వాడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ కార్యాలయాలు, హోటల్లు, ఆస్పత్రులు, మాల్‌లు, ఐటీ, వాణిజ్య భవనాలకు సంబంధించి సమాచారం ఇవ్వొద్దని సూచించారు. ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి ప్రజలకు సమాచారం అంతా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో అమల్లోకి తీసుకొచ్చిన ఆర్టీఐపై రాష్ట్ర సర్కార్ ఉక్కుపాదం మోపడం సరికాదని కేంద్ర సమాచార కమిషనర్‌గా పనిచేసిన శైలేష్ గాంధీ అన్నారు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవనాల పూర్తి సమాచారం వెబ్సైట్లో పొందుపరచడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, బిల్డర్ల మోసాల నుంచి బయటపడే అవకాశముంటుందని అన్నారు. అనాలోచిత నిర్ణయం గైక్వాడ్ జారీ చేసిన జీవో ప్రజల హక్కులను హరించేలా ఉందని తెలుపుతూ గవర్నర్ శంకర్ నారాయణన్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ప్రధాన కార్యదర్శి జయంత్ బంటియాకు ఆర్టీఐ కార్యకర్త అనిల్ గల్గలీ లేఖలు రాశారు. ఎటువంటి కసరత్తు చేయకుండా చట్ట విరుద్ధంగా ఆనాలోచిత నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ముంబై లాంటి నగరంలో 52 శాతం భవనాలకు అక్యుపేషన్ సర్టిఫికెట్లు లేవన్నారు. ప్రస్తుతం రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం అక్రమ బిల్డర్లు, అవినీతి రాజకీయ నాయకులకు లబ్ధి చేకూరేలా ఉందని సదరు లేఖలో పేర్కొన్నారు. అప్రమత్తమైన టీఎంసీ అధికారులు ఠాణే: జిల్లాలోని దావా పట్టణంలో పగుళ్లు ఏర్పడిన భవనాన్ని గుర్తించిన ఠాణే మున్సిపల్ కార్పొరేషన్(టీఎంసీ) సిబ్బంది రంగంలోకి దిగి అందులో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆరేళ్ల క్రితం నిర్మించిన ఐదు అంతస్తుల విష్ణు కళ భవనానికి పగుళ్లు ఏర్పడి ఎప్పుడైనా కూలిపోవచ్చని అనుమానించిన స్థానికులు కార్పొరేషన్ అధికారులకు సమాచారమందించారు. వెంటనే వారు రంగంలోకి దిగి అందులో ఉంటున్న 11 దుకాణాలను మూసివేసి, 66 మంది కిరాయిదారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు దివాలోని గణేశ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఈ భవనాన్ని ఏ సమయంలోనైనా కూల్చివేయవచ్చని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను సరైన సమయంలో ట్రాన్సిట్ క్యాంపుకు తరలించామన్నారు. ఠాణేలోని కల్వా పట్టణంలో సోమవారం ఓ భవనం కూలిన నేపథ్యంలో టీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అందులో ఉంటున్న నివాసులు ఖాళీ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆ భవనం కూలడంతో భారీ ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. -
కూలుతున్న ‘పంచాయతీ’
ఇందూరు, న్యూస్‌లైన్ :మారుమూల గ్రామ పంచాయతీలు సైతం చాలా వరకు నూతన భవనాలు నిర్మించుకున్నాయి. కానీ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం రేపోమాపో కూలుతుందేమోనన్నట్లు తయారైంది. పెచ్చులూడిన పైకప్పుతో, చెట్ల వేర్లు పాకిన, తేమతో నిండిన గోడలతో ఉద్యోగులను భయపెడుతోంది. అందులో కూర్చుండి పనిచేయడానికి శాఖ ఉద్యోగులు జంకుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని భయం భయంగా పనిచేస్తున్నారు. ఇందులోని డీపీఓ, డీఎల్పీఓ చాంబర్లతో పాటు ఇతర గదులు ప్రమాదకరంగా మారాయి. ఇటీవల పలు భవనాలు కూలిన సంఘటనల నేపథ్యంలో ఉన్నతాధికారులు శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీచేయాలని నోటీసులు జారీ చేశారు. కానీ పంచాయతీ అధికారి కార్యాలయానికి మాత్రం నోటీసులు పంపలేదు. గోడలపై చెట్లు మొలిచి, పెద్దపగుళ్లు వచ్చాయి. స్లాబు పూర్తిగా చెడిపోయి పెచ్చులూడుతోంది. వర్షకాలం సీలింగ్ నుంచి ధారగా ఊరుస్తూనే ఉంది. గోడలన్నీ తేమగా మారిపోయాయి. ఇప్పటికే కంప్యూటర్ విభాగంలో రెండు కొత్త కంప్యూటర్లు వర్షానికి తడిసి చెడిపోయాయి. ఉన్నవాటిని కాపాడుకునేందుకు సిబ్బంది కవర్లు కప్పి ఉంచుతున్నారు. పాతకాలం నాటి విలువైన దస్త్రాలు సైతం తడిసి ముద్దయ్యాయి. మొన్నటికి మొన్న నిర్వహించిన పంచాయతీ ఎన్నికల సామగ్రి సైతం వర్షంనీళ్లకు తడిసింది. ఇప్పటికీ అద్దె భవనంలోనే.. అసలు జిల్లా పంచాయతీ అధికారికి సొంత భవనమే లేదు. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో కొనసాగుతున్న కార్యాలయ భవనం మునిసిపాల్టీకి చెందింది. దీనికి శాఖ అద్దె చెల్లిస్తోంది. ఇందులో 1991 నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో డీపీఓ కార్యాలయానికి స్థలం ఉంది. దీంట్లో నూతన భవన నిర్మాణం కోసం 2000లో ప్రణాళికలు వేశారు. తీరా నిధులు లేక నిర్మాణం అటకెక్కింది. నిధుల కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా మంజూరు మాటేలేదు. నూతన భవనం కోసం.. -సురేశ్‌బాబు, డీపీఓ ప్రస్తుతం ఉన్న జిల్లా కార్యాలయంలో శిథిలావస్థకు చేరుకుంది. జడ్పీలో ఖాళీస్థలం ఉన్నా నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. వీటికోసం మళ్లీ ప్రతిపాదనలు పంపుతున్నాం. అప్పటి వరకు మరో అద్దెభవనం కోసం గాలిస్తున్నాం.