గర్ల్ఫ్రెండ్ను ఇంప్రెస్ చేస్తూ ఇరుక్కుపోయాడు
ఓక్లాండ్: అమ్మాయి పక్కన ఉన్నా.. కనుచూపు మేరలో ఉన్నా ఆ అబ్బాయిని అప్పటికప్పుడు ఓ వింత ప్రవర్తన ఆవహిస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. గర్ల్ ప్రెండ్ అయినా లేక మరో అమ్మాయి అయినా.. ఆమెను ఆకర్షించేందుకు ఓ అబ్బాయి చేసే ప్రయత్నం అంతా ఇంతా ఉండదు. ఆ క్రమంలో సక్సెస్ అయ్యే వాళ్లేమోగానీ.. ఫేలై నవ్వులపాలయ్యేవారే అధికం.
సరిగ్గా ఓక్లాండ్కు చెందిన ఓ అబ్బాయికి ఇదే పరిస్థితి ఎదురైంది. తన గర్ల్ ప్రెండ్ తో కలిసి భవనం పై అంతస్థుకు వెళ్లిన యువకుడు ఆమెను ఇంప్రెస్ చేసేందుకు పక్క భవనంపైకి దూకే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పట్టుదప్పి కాలు జారి రెండు భవనాల సందులో పడ్డాడు. దాదాపు నాలుగుగంటలపాటు అందులో ఇరుక్కుపోయి నరకం చూశాడు. పీటర్స్ బర్గ్ కు చెందిన అత్యవసర సేవల విభాగ అధికారులు గోడలకు రంధ్రం చేసి అతడిని బయటకు తీశారు.