Stuck
-
లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన లిఫ్ట్ టెక్నీషియన్
-
21 ఏళ్లుగా ఊపిరితిత్తుల్లోనే ఇరుక్కుపోయిన పెన్ క్యాప్
హైదరాబాద్: కరీంనగర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల యువకుడు.. తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆడుకుంటూ పెన్ క్యాప్ మింగేశాడు. గత నెల రోజుల నుంచి దగ్గు రావడం, బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలతో బాధపడుతున్నాడు. పది రోజులుగా దగ్గు విపరీతంగా పెరిగిపోయి, నిద్రపోవడానికి కూడా ఏమాత్రం వీలు కాకపోవడంతో వైద్యులకు చూపించగా.. సీటీ స్కాన్ తీయించారు. అప్పుడు ఎడమవైపు కిందిభాగంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలిసింది. దాంతో వాళ్లు హైదరాబాద్ పంపారు. ఇక్కడ కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో ఆ యువకుడికి సీటీ స్కాన్ చేసి, విషయం తెలుసుకుని దానికి చికిత్స చేసిన కన్సల్టెంట్ క్లినికల్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శుభకర్ నాదెళ్ల ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.“ఆ యువకుడు ఇక్కడకు వచ్చినప్పుడు ముందుగా సీటీ స్కాన్ చేశాం. అప్పుడు లోపల ఏదో ఒక గడ్డలా కనిపించింది. ఆ గడ్డ వల్లే ఊపిరితిత్తుల వద్ద ఆటంకం ఏర్పడి.. దగ్గు వస్తోందని భావించాం. దాన్ని తీసేందుకు ప్రయత్నిస్తూ లోపల చూసేసరికి.. పెన్ క్యాప్ కనిపించింది. దాంతో ప్రొసీజర్ మధ్యలోనే ఆ యువకుడి అన్నను లోపలకు పిలిచి, గతంలో ఏమైనా మింగాడా అని అడిగాం. అప్పుడు.. ఐదేళ్ల వయసులో ఉండగా పెన్ క్యాప్ మింగేశాడని, అప్పట్లో తానే వైద్యుడి వద్దకు తీసుకెళ్తే అక్కడ పరీక్షించి లోపల ఏమీ లేదని.. బహుశా మలంతో పాటు వెళ్లిపోయి ఉండొచ్చని చెప్పారన్నాడు.దాంతో దాదాపు మూడు గంటల పాటు కష్టపడి, ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కొపీ సాయంతో ముందుగా దాని చుట్టూ పేరుకుపోయిన కణజాలాలు, లింఫ్‌నోడ్, కండలను కొద్దికొద్దిగా తొలగించాం. క్రమంగా అదంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు ఆ పెన్ క్యాప్‌ను కూడా బయటకు తీసేశాం. ఇన్ని సంవత్సరాల పాటు అలా ఒక ఫారిన్ బాడీ లోపల ఉండిపోవడం వల్ల ఊపిరితిత్తులు కూడా కొంత దెబ్బతిన్నాయి. అయితే, అక్కడ దెబ్బతిన్న ఇతర భాగాలను సరిచేసేందుకు యాంటీబయాటిక్స్ వాడాం. దాంతో అతను కోలుకున్నాడు.ఇలాంటివి అలా ఎక్కువ కాలం ఉండిపోవడం మంచిది కాదు. ఇతను ఇప్పుడు కూడా రాకపోయి ఉండి, అలాగే వదిలేస్తే దాని చుట్టూ కణజాలం పేరుకుపోతుంది. ఊపిరితిత్తి మొత్తం పాడైపోతుంది. అప్పుడు దాన్ని శస్త్రచికిత్సతో పాడైన భాగాన్ని కోసేయాల్సి ఉంటుంది. అదృష్టవశాత్తు ముందే గుర్తించడంతో మందులతోనే దాన్ని సరిచేయగలిగాం. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారో, నోట్లో ఏం పెట్టుకుంటున్నారో గమనించుకోవాలి. అలాంటివి ఏవైనా ఉంటే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లి, దాన్ని తీయించాలి. లేకపోతే ఇలాంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి” అని డాక్టర్ శుభకర్ నాదెళ్ల తెలిపారు. -
బురద గోతిలో దిగబడిన శివరాజ్‌సింగ్ కారు
బహరగోరా: జార్ఖండ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బీజేపీ జార్ఖండ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఈ నేపధ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ తరచూ జార్ఖండ్‌లో పర్యటనలు సాగిస్తున్నారు. తాజాగా ఆయన జార్ఖండ్‌లోని బహరగోరా చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు బురద గుంతలో కూరుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఆయన భద్రతా సిబ్బంది కారు చుట్టూ నిలబడి, కారును గొయ్యి నుంచి బయటకు తీయడాన్ని చూడవచ్చు. #WATCH | Jharkhand | Union Minister Shivraj Singh Chouhan's car today got stuck in a muddy pothole amid rains today in Baharagora where he was for a public rally pic.twitter.com/ZYrZanee9K— ANI (@ANI) September 23, 2024ఇంతటి వర్షం మధ్యనే బహారగోరాలో జరిగిన బహిరంగ సభలో శివరాజ్ సింగ్ మాట్లాడుతూ ‘మేఘాలు గర్జిస్తున్నాయి. మెరుపులు మెరుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాతావరణాన్ని చూస్తుంటే జార్ఖండ్‌లో చీకటి పోతుందని, సూర్యుడు ఉదయిస్తాడని, కమలం వికసిస్తుందని, మార్పు వస్తుందని నేను చెప్పగలను. జార్ఖండ్‌లోని మట్టిని, ఆడబిడ్డలను కాపాడుకుంటామని భారతీయ జనతా పార్టీ తరపున నేను హామీ ఇస్తున్నాను’ అని అన్నారు. ఇది కూడా చదవండి: యూపీలో ఎన్కౌంటర్.. రూ. లక్ష రివార్డు నిందితుని హతం -
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు
సాక్షి, ఢిల్లీ: ఉత్తరాఖండ్ కేదార్‌నాథ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేదార్నాథ్ వరదలలో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. క్లౌడ్ బరస్ట్, భారీ వర్షాల కారణంగా నడక మార్గం దెబ్బతింది. దాదాపు 1,300 మంది యాత్రికులు కేదార్నాథ్, భీంబాలి, గౌరీకుండ్‌లలో చిక్కుకుపోయారని, వారు సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. గౌరీకుండ్ - కేదార్నాథ్ మధ్య 13 చోట్ల మార్గం ధ్వంసమైంది. దీంతో ఎక్కడికక్కడ పలువురు యాత్రికులు చిక్కుకుపోయారు.యాత్రికులను హెలీకాప్టర్లతో సహాయ బృందాలు తరలిస్తున్నాయి. సహాయ చర్యలకు ప్రతికూల వాతావరణం విఘాతం కలిగిస్తోంది. స్థానికులకే ప్రాధాన్యతనివ్వడంతో దూరప్రాంత యాత్రికులు అక్కడే నిలిచిపోయారు. ఆహారం, నీరు అందక యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. కేదార్నాథ్ స్వర్గ రోహిణి కాటేజిలో పలువురు తెలుగు యాత్రికులు ఉన్నారు. సహాయం కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు మెసేజ్ చేశారు. ఆయన ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగంతో మాట్లాడారు. వారిని సురక్షితంగా బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.#WATCH | Uttarakhand | Joint search and rescue operations of NDRF & SDRF are underway in Rudraprayag to rescue the pilgrims stranded in Kedarnath and adjoining areas." pic.twitter.com/BOTfOEyaBP— ANI (@ANI) August 3, 2024 -
వంతెన మధ్యలో మొరాయించిన రైలు.. ప్రమాదాన్ని నివారించిన లోకో పైలట్లు
ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు అందరినీ బెంబెలెత్తిస్తున్నాయి. అయితే ఇటువంటి సందర్భాల్లో ఒక్కసారి ఆ రైలు నడుపుతున్న పైలట్లు తెగువ చూపి, ప్రమాదాన్ని నివారిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఉదంతం బీహార్‌లో చోటుచేసుకుంది.బీహార్‌లోని సమస్తీపూర్‌లో రైలు ప్రమాదాన్ని నివారించిన లోకో పైలట్లను అందరూ మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే సమస్తీపూర్ రైల్వే సెక్షన్‌లోని వాల్మీకినగర్-పనియవా స్టేషన్ల మధ్యగల వంతెనపై రైలు ఉన్నట్టుండి ఆగిపోయింది. వంతెనపై రైలు అలా ఆగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే రైలులోని ఏదో వాల్వ్ నుంచి ఎయిర్ ప్రజర్ లీక్ అవడాన్ని లోకో పైలట్లు గమనించారు. అందుకే రైలు అలా ఆగిపోయిందని గుర్తించారు.బయటి నుంచి సాంకేతిక సాయం అందించడానికి వీలులేని చోట రైలు ఆగింది. దీంతో రైలును నడుపుతున్న ఇద్దరు లోకో పైలట్లూ ఇంజిన్‌లోని లీకేజీని సరిచేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. వారు రైలు కిందుగా పాకుకుంటూ లీకేజీ అవుతున్న చోటుకువెళ్లి మరమ్మతులు చేశారు.ఈ ఘటన గురించి రైల్వే అధికారులు మాట్లాడుతూ నార్కతియాగంజ్ - గోరఖ్‌పూర్ ప్యాసింజర్ రైలు వాల్మీకినగర్- పనియావాన్ మధ్య గల వంతెనపైకి చేరుకోగానే ఇంజిన్ (లోకో)కు చెందిన అన్‌లోడర్ వాల్వ్ నుండి అకస్మాత్తుగా ఎయిర్ ప్రజర్ రావడం మొదలైంది. ఫలితంగా ఎంఆర్ ఒత్తిడి తగ్గింది. దీంతోట్రాక్షన్ ఆగిపోయి, రైలు వంతెనపై నిలిచిపోయింది. రైలు బ్రిడ్జి మధ్యలో ఆగడంతో దాన్ని సరిచేసే మార్గం కనిపించలేదు. అయితే రైలు నడుపుతున్న పైలట్లు ఎంతో తెగువ చూపి, దానికి మరమ్మతులు చేసి, రైలు ముందుకు కదిలేలా చేశారు.ఈ సందర్భంగా సమస్తీపూర్ డీఆర్ఎం మాట్లాడుతూ లోకో పైలట్లు అజయ్ కుమార్ యాదవ్, జీత్ కుమార్ ఎంతో తెగువచూపి వంతెనపై ఆగిపోయిన రైలు ముందుకు కదిలేలా చేశారని, వీరికి రైల్వేశాఖ రూ.10 వేల నగదు అందించడంతోపాటు ప్రశంసా పత్రం ఇవ్వనున్నదని తెలిపారు. -
స్పైస్‌జెట్ విమానం టాయిలెట్లో చిక్కుకున్న ప్రయాణికుడు
ముంబయి: స్పైస్‌జెట్ విమానం టాయిలెట్స్‌లో చిక్కుకుని ఓ ప్రయాణికుడు నరకయాతన అనుభవించాడు. ముంబయి నుంచి బెంగళూరు వరకు వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో ఈ ఘటన జరిగింది. టేకాఫ్ అయిన దగ్గర నుంచి బెంగళూరులో ల్యాండ్ అయ్యేవరకు గంటకుపైగా టాయిలెట్లోనే ఉండిపోయాడు. విమానం ముంబయిలో టేకాఫ్ అయ్యాక ఓ వ్యక్తి టాయిలెట్స్‌కి వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో టాయిలెట్స్ డోర్ లాక్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా రాలేదు. క్రూ సిబ్బంది అతనికి సహాయం చేసే ప్రయత్నం చేశారు. తీరా బెంగళూరులో ల్యాండ్ అయ్యాక.. ఇంజినీర్ వచ్చి డోర్ ఓపెన్ చేసేవరకు బాధిత వ్యక్తి టాయిలెట్స్‌లోనే ఉండిపోయాడు. The note from the crew to the passenger locked on #Spicejet flight. #Avgeek #Aviation pic.twitter.com/pPrvXq8mJm — Aman Gulati 🇮🇳 (@iam_amangulati) January 17, 2024 "జనవరి 16న ముంబయి నుంచి బెంగళూరుకు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో దురదృష్టవశాత్తూ ఒక ప్రయాణికుడు సుమారు గంటసేపు టాయిలెట్స్‌లో చిక్కుకుపోయాడు. డోర్ లాక్ లోపం కారణంగా విమానం గాలిలో ప్రయాణించింది. ప్రయాణమంతా మా సిబ్బంది ఆ ప్రయాణికునికి మార్గనిర్దేశం చేశారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం." అని స్పైస్‌జెట్ తెలిపింది. ఇదీ చదవండి: రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో గోడలపై ఖలిస్థానీ రాతల కలకలం -
కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం..
భువనేశ్వర్: కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రయాణించిన పడవ చిలుకా సరస్సులో సుమారు రెండు గంటల పాటు చిక్కుకుపోయింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన అక్కడి సబ్బంది సరస్సులోకి మరో పడవను పంపి మంత్రిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మంత్రితో పాటు ఆ పడవలో బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా మరో ఇద్దరు నేతలు ఉన్నారు. మంత్రి రూపాల ఖుర్దా జిల్లాలోని బార్కుల్ నుంచి పూరీ జిల్లాలోని సతపదాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘సాయంత్రం కావటంతో చికటిపడింది. పడవ నడిపే వ్యక్తి కొత్త దారిలో పడవను తీసుకెళ్లాడు. దీంతో అసలు వెళ్లాల్సిన దారి తప్పిపోయాం. సతపద చేరుకోవడానికి మరో రెండు గంటలు పట్టింది’ అని మంత్రి రూపాలా తెలిపారు. ଚିଲିକା ମଝିରେ ୨ ଘଣ୍ଟା ଫସିଲେ କେନ୍ଦ୍ରମନ୍ତ୍ରୀ । କେନ୍ଦ୍ର ମତ୍ସ୍ୟମନ୍ତ୍ରୀ ପୁରୁଷୋତ୍ତମ ରୁପାଲା ଚିଲିକାରେ ୨ ଘଣ୍ଟା ଧରି ଫସିରହିଥିଲେ ବୋଲି ସୂଚନା ମିଳିଛି। #Chilika #UnionMinister #ParshottamRupala #OTV pic.twitter.com/9stpN2Yfvm — ଓଟିଭି (@otvkhabar) January 7, 2024 సరస్సులో పడవ చిక్కుకోవడానికి మత్స్య కారులు వేసిన చేపలు పట్టే వల అని అనుమానించామని తెలిపారు. కానీ, పడవ దారి తప్పిపోవడమే.. కారణమని మంత్రి మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనతో కృష్ణా ప్రసాద్ ప్రాంతంలో మంత్రి పాల్గొనాల్సిన ఓ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. చదవండి: Delhi: కాస్త ఎండ.. అంతలోనే విపరీతమైన చలి! -
18 ఏళ్లుగా తలలో బుల్లెట్‌తో జీవిస్తున్న వ్యక్తి..చివరికి..
ఓ వ్యక్తికి తన ప్రమేయం లేకుండానే పదేళ్ల వయసులో తలలోకి బుల్లెట్ దిగింది. ఆ తర్వాత నుంచి ఆ బాలుడి దుస్థితి చాలా అధ్వాన్నంగా మారిపోయింది. అలా దాదాపు 18 ఏళ్లు గడిపాడు. సంప్రదించని ఆస్పత్రిలేదు. ప్రతి ఒక్కరు బుల్లెట్ తీయడం కష్టమనే చెప్పారు. ఆ బుల్లెట్ కారణంగా విపరీతమైన తలనొప్పి, చెవి ఇన్ఫెక్షన్లతో దుర్భర జీవితాన్ని గడిపాడు. చివరికి బెంగళురు ఆస్పత్రి వైద్యులు అతడు ఎదుర్కొన్న నరకం నుంచి విముక్తి కలిగించారు. ఇంతకీ అతడికి తలలో ఎలా బుల్లెట దిగింది? ఎవరా వ్యక్తి అంటే..! యోమెన్‌కి చెందిన సలేహ్ అనే 29 ఏళ్ల వ్యక్తి తలలో సమారు 3 సెంటీమీటర్ల బుల్లెట్ ఉంది. అతనికి పదేళ్ల ప్రాయంలో ఉండగా.. రెండు ఇరు వర్గాల మధ్య జరిగిన పోరులో ఓ బుల్లెట్ అతడి చెవిలోకి దూసుకుని తలలోని ఎడమవైపు ఎముకలోకి దిగిపోయింది. దీంతో అతనికి విపరీతమైన రక్తస్రావం అయ్యింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు గానీ ఆ బుల్లెట్‌ని మాత్రం తీయలేకపోయారు వైద్యులు. ఎందుకంటే? అది చెవిలోపలకి వెళ్లడం, పైగా దాని ముందర భాగం తలలోపలకి ఉండటం కారణంగా తీయడం వైద్యులకు కష్టంగా మారింది. దీంతో గాయం తగ్గేందుకు మాత్రమే మందులు ఇచ్చి పంపించేశారు సలేహ్ని. అప్పటి నుంచి సుమారు 18 ఏళ్లుదాక ఆ బుల్లెట్‌తోనే జీవించాడు. ఆ తర్వాత అతడు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ బుల్లెట్ కారణంగా చెవి వినికిడిని కోల్పోయాడు. పైగా చెవి ఇన్ఫెక్షన్లు, తలనొప్పితో నరకయాతన అనుభవించాడు. అతడికి ఇద్దరు సోదరులు, చెల్లెళ్లు ఉన్నారు. ప్రస్తుతం సలేహ్కి 29 ఏళ్లు. అతడకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ బుల్లెట్ అతడి తల నుంచి ఎప్పుడు పోతుందా అనుకునేవాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి విసిగిపోయిన సలేహ్ స్నేహితుల ద్వారా బెంగళూరులోని ఆస్టర్ ఆస్పత్రి గురించి తెలుసుకుని మరీ ఎంతో ఆశతో వెళ్లాడు. అయితే వైద్యుల పలు టెస్ట్‌లు చేసి అసాధ్యం అని తేల్చేశారు. ఎందుకంటే? బుల్లెట్ సరిగ్గా చెవి లోపల ఎడమవైపు ముఖ్యమైన టెంపోరల్ ఎముక లోపల వాస్కులర్ నిర్మాణాలకు దగ్గరగా ఉంది. ఇది శస్ర చికిత్సకు అది పెద్ద సవాలు. అందువల్లే వైద్యులు రిస్క్ చేసే సాహసం చేయలేకపోయారు. అయితే వైద్యులు ఆ బుల్లెట్ కరెక్ట్‌గా ఏ ప్రదేశంలో ఉందో తెలిస్తే తీయడం ఈజీ అని గుర్తించారు. అందుకోసం కాంట్రాస్ట్ సీటీ యాంజియోగ్రఫీని ఎంచుకుంది. టూ డైమెన్షియల్ ఎక్స్‌రే సాయంతో బుల్లెట్ స్థానాన్నిగుర్తించి విపరీతమైన రక్తస్రావం కాకుండా సులభంగా తొలగించారు వైద్యులు. సర్జరీ చేస్తున్నంత సేపు అనుమానంగానే ఉందని అన్నారు వైద్యులు. ఎట్టకేలకు ఈ శస్త్రచికిత్సతో అతడికి తలనొప్పి తగ్గింది. అలాగే స్పష్టంగా వినిపిస్తోంది కూడా. అంతేగాదు పూర్తి స్థాయిలో కోలుకున్న వెంటనే సలేహ్ యెమెన్‌కి తిరిగి వెళ్లిపోయాడు కూడా. (చదవండి: ఆల్కహాల్ తీసుకున్నప్పుడల్లా అలా అవుతుంటే అలర్జీ అనుకుంది! కానీ చివరికి..) -
మూగజీవిపై ప్రేమ అంటే ఇదే..!
ఈ రోజుల్లో సాటి మనుషులపై, జంతువులపై దయ, ప్రేమ చూపేవారు చాలా అరుదైపోయారు. ఆపదలో ఉన్న జంతువులను, మనుషులను కనీసం పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి సమయంలో ఎవరైనా ఇతరులకు తోచిన సహాయం చేస్తూ కనిపించినప్పుడు జనం ఆ వ్యక్తిని అమితంగా గౌరవిస్తారు. ఇతరుల మీద దయ, ప్రేమలను ఎవరైనా చూపిస్తే అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన కుక్కను కాపాడుతూ కనిపించాడు. ‘ఎక్స్’లో గుడ్ న్యూస్ కరస్పాండెంట్ పేరుతో పోస్ట్ అయిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. రోడ్డు పక్కన భయంతో వణికిపోతున్న ఆ కుక్కపిల్లను చేరుకునేందుకు ఆ వ్యక్తి ట్రాఫిక్‌ను ఎంతో ధైర్యంగా దాటాడు. ఆ కుక్కకు ప్రేమతో కూడిన స్పర్శను అందించాడు. ఈ అద్భుతమైన క్లిప్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో 43 వేలకు మించిన వీక్షణలను దక్కించుకుంది. ఈ వీడియో మూగజీవాలపై చూపాల్సిన సానుభూతి గురించి తెలియజేస్తుంది. ఇది కూడా చదవండి: 4 రాష్ట్రాలను తాకే ఏకైక జిల్లా ఏది? An angel saving another angel This kind soul spotted an abandoned puppy on a busy freeway and rushed to save him from a certain injury or worse. The herododges traffic and approaches the dog gently to gain his trust, petting him sweetly. pic.twitter.com/MtmxPQ8f77 — GoodNewsCorrespondent (@GoodNewsCorres1) October 1, 2023 -
చిన్నారి ప్రాణం తీసిన పునుగులు.. ఆసుపత్రికి తరలించేలోపే
సాక్షి, సిరిసిల్ల: ఆ తల్లిదండ్రుల నిర్లక్ష్యం వారి ఇంటి దీపం ఆరిపోయేలా చేసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డ ఉసురుతీసింది. ఈ హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండలం కేంద్రంలో క్రాంతి కుమార్ అనే 13 నెలల బాలుడు మృతి చెందాడు. గొంతులో పునుగులు ఇరుక్కోవడంతో అతడిని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, శ్వాస ఆడకపోవడంతో అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన క్రాంతి.. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచినట్టు వైద్యులు తెలిపారు. కొమురం భీమ్ జిల్లా కౌటాల మండలం వెల్డండి గ్రామానికి చెందిన మారుతి, కవితల సంతానం క్రాంతి కుమార్. రెండేళ్ల నుంచి ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
నదిలో చిక్కుకున్న బస్సు.. 40 మంది అందులోనే.. వీడియో వైరల్..
లక్నో: కొద్ది రోజులుగా వర్షాలు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. వరదలతో నదులు ఉప్పొంగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో కోత్వాలీ నది ఉద్దృతంగా ప్రవహిస్తోంది. దీంతో యూపీ-ఉత్తరఖండ్ సరిహద్దుల్లో రోడ్డుపై వరద నీరు ఉవ్వెత్తున ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో హరిద్వార్ వెళ్తున్న ఓ బస్సు వరదల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువ ఉండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం.. జేసీపీ మిషన్లతో సహాయక చర్యలు చెపట్టింది. #उत्तरप्रदेशः #बिजनौर के मंडावली में #कोटावाली नदी का जलस्तर बढ़ा, एक बस तेज बहाव में फंसी, बस में करीब 40 यात्री सवार, जेसीबी से सभी का रेस्क्यू किया गया#UttarPradesh #bus #river #Bijnor #NewsUpdate pic.twitter.com/ZVUghS0wYm — News of Rajasthan (@NewsRajasthani) July 22, 2023 జేసీబీ మిషన్లతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు చేర్చారు. ఆ తర్వాత బస్సును కూడా బయటకు లాగారు. ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #बिजनौर में कोटा वाली नदी के बीच तेज बहाव में फंसी नजीबाबाद से हरिद्वार जा रही बस नदी में बस फंसने के बाद बस में मौजूद सवारियों को जेसीबी के सहारे सकुशल बाहर निकाला गया.#Bijnor #bijnorviralvideo #bijnorbus #bus #kotariver #haridwar #bijnaur #viralvideo #ManipurVideo pic.twitter.com/lEetwrOuGQ — Shailendra Singh (@Shailendra97S) July 22, 2023 ఇదీ చదవండి: తప్పతాగి.. రైల్వే ట్రాక్‌పై కారు నడిపి.. -
తొమ్మిదేళ్ల చిన్నారి తలలోకి కత్తెర దిగడంతో..
ఇంట్లో చిన్నారులు ఉంటే చాలా జాగ్రత్తగా గమనిస్తుండాలి వారిని. ఎప్పటికప్పుడూ వేయికళ్లతో పర్యవేక్షించాలి. ఏమరుపాటున పదునైన వస్తువులో లేదా ప్రమాదకరమైన పరికరాలో సమీపంలో ఉంచామో ఇక అంతే. ఇక్కడ కూడా ఓ చిన్నారి విషయంలో అలానే జరిగింది. ఆ చిన్నారి తల్లిందండ్రలు కడు పేదవాళ్లు. దీంతో వారి బాధ అంత ఇంత కాదు. ఇంతకీ ఆ చిన్నారికి ఏమైందంటే.. ఈ షాకింగ్ ఘటన ఫిలప్పీన్స్‌లో చోటు చేసుకుంది. 9 ఏళ్ల పాఠశాల విద్యార్థిని నికోల్ తలలో కత్తెర దిగింది. దీంతో ఆ చిన్నారి బాధ అంతా ఇంతా కాదు. అసలేం జరిగిందంటే..ఆ చిన్నారి తన సోదరుడితో పెన్సిల్ విషయమై గొడవపడింది. దీంతో ఆ బాలుడు కోపంతో కత్తెర తీసుకుని ఆ చిన్నారి తల వెనుక దాడి చేశాడు. అది అనుకోకుండా తలలోకి బలంగా దిగింది. ఈ అనూహ్య ఘటనతో కంగుతిన్న తల్లిదండ్రులు ఆ చిన్నారిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఐతే ఆ చిన్నారికి వెంటనే శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. కడు పేదవాళ్లైనా ఆ తల్లిదండ్రుల ఆ ఆపరేషన్‌కి అయ్యే ఖర్చు తట్టుకునే శక్తి లేక విలవిల్లాడింది. దీంతో ఆ చిన్నారి ఆ కత్తెరతోనే వారం పాటు ఆస్పత్రిలో గడపాల్సి వచ్చింది. ఐతే స్థానికులు అతడి పరిస్థితి చూసి.. సాయం చేసేందుకు ముందకు రావడంతో ఆ చిన్నారికి జులై 9న విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది. ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆ చిన్నారి తండ్రి తమ కూతురు శస్త్ర చికిత్సకు సాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలంటూ భావోద్వేగంగా చెప్పాడు. ఆ చిన్నారి త్వరితగతిన కోలుకుంటుందని, ఆమె మెదడుకు ఎలాంటి నష్టం జరగలేదని వైద్యులు తెలిపారు. అంతేగాదు ఆ చిన్నారి తండ్రి ఇలాంటి ప్రమాదకరమైన వస్తువులు వారి సమీపంలో ఉండకుండా జాగ్రత్త పడతామని అన్నారు. (చదవండి: పదేళ్లలో ఏడుసార్లు భర్తను అరెస్టు చేయించింది..మళ్లీ భార్యే..) -
గొంతులో ఇరుక్కున్న లెగ్ పీస్.. వైద్యుని వింత సలహాకు కంగుతిన్న మహిళ..!
ఒక మహిళకు ఎదురైన వింత అనుభవం ఇప్పుడు వైరల్‌గా మారింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ తాను చికెన్ తింటున్న సమయంలో తన గొంతులో ఒక చిన్నపాటి ఎముక ఇరుక్కుపోయిందని తెలిపింది. దీంతో తనకు గొంతునొప్పి తలెత్తడంతో వైద్యుని దగ్గరకు వెళ్లానని, ఆయన సర్జరీ చేసేందుకు బదులు ఇచ్చిన ఒక సలహా అద్భుతంగా పనిచేసిందన్నారు. దీంతో తనకు నొప్పి నుంచి ఉపశమనం లభించిందని తెలిపారు. ఈ ఉదంతం న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. ఇచ్ మీడియా కంపెనీ స్టఫ్ తెలిపిన వివరాల ప్రకారం బెథ్ బ్రెష్ అనే మహిళ గత వారంలో వెల్లింగ్టన్లోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ ఆమె చికెట్ డిష్ ఆర్టర్ చేసింది. అప్పుడు వెయిటర్ ఆమెను ఎముకలతో కూడిన చికెన్ కావాలా లేదా బోన్‌లెస్ చికెన్ కావాలా అని అడిగాడు. దీనికి ఆమె బోన్‌తో కూడిన చికెన్ కావాలని తెలిపింది. ఆ చికెన్ తింటున్న సమయంలో ఆమె గొంతులో చిన్నపాటి ఎముక ముక్క ఇరుక్కుపోయింది. ఆమెకు కొంచెం నొప్పిగా అనిపించినప్పటికీ, రెస్టారెంట్‌తో ఎటువంటి ఫిర్యాదు చేయకుండానే ఇంటికి వెళ్లిపోయింది. అయితే రెండుమూడు రోజుల పాటు ఆ నొప్పి కొనసాగడంతో తన ఇంటికి సమీపంలోని వైద్యుని దగ్గరకు వెళ్లి, తన సమస్య వివరించింది. వైద్యుని పరీక్షలో ఆమె గొంతులో చిన్నపాటి బోన్ ముక్క ఉందని స్పష్టమయ్యింది. దీంతో ఆమె తనకు సర్జరీ చేస్తారని అనుకుంది. అయితే ఆ వైద్యుడు సర్జరీకి బదులుగా ఒక విచిత్ర ఉపాయం తెలిపారు. వైద్యుని సలహా గురించి బెథ్ బ్రెష్ మాట్లాడుతూ ఆ వైద్యుడు తనను కొద్ది రోజులు కూల్‌డ్రింక్ తాగాలని, అప్పుడు తన గొంతులోని బోన్ పీస్ దానంతట అదే కరిగిపోతుందని తెలిపారన్నారు. ఆమెకు ఆ సలహా పనిచేయదేమోనని అనిపించినా దానిని అనుసరించింది. ఫలితంగా ఆమె గొంతు రెండు రోజులలో మునుపటి మాదిరిగా సవ్యంగా మారిపోయింది. ఈ ఘటన గురించి డచ్ మెడికల్ ఎక్స్పర్ట్ డాక్టర్ బ్రాయన్ బెట్టీ మాట్లాడుతూ గొంతులో ఎముక ముక్క ఇరుక్కుపోతే ఇది పరిష్కారం కాదన్నారు. ఎసిడిక్ డ్రింక్ కారణంగా ఎముక ముక్క కరిగిపోయే అవకాశం ఉందన్నారు. అయితే ఈ విధంగా బాధితులకు కూల్ డ్రింక్ తాగాలంటూ సలహా ఇవ్వడం సరికాదన్నారు. ఇది కూడా చదవండి: 11 ఏళ్లకే రూ.72 కోట్లకు యజమాని.. బిజినెస్‌లో సక్సెస్.. లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. -
ఫ్లాట్ ఫామ్..ట్రైన్ కు మధ్యలో ఇరుక్కుపోయిన మహిళ
-
కొండచరియల బీభత్సం చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు..!
-
మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం
-
ఏపీ ప్రభుత్వం ముమ్మర చర్యలు.. స్పెషల్ ఫ్లైట్‌కు ఒప్పుకున్న సివిల్ ఏవియేషన్ శాఖ
అమరావతి: మణిపూర్‌లో అల్లర్లు కారణంగా చిక్కుకుపోయిన ఆంధ్ర విద్యార్థుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విద్యార్థులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ముమ్మర చర్యలు చేపట్టింది. ప్రత్యేక విమానం ద్వారా సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంతోనూ కేంద్ర ప్రభుత్వంతోనూ సమన్వయం చేసుకుంటున్నారు ఏపీ అధికారులు. ఈ మేరకు పౌరవిమానయానశాఖ అధికారులతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రత్యేక విమానం ఏర్పాటుకు సివిల్ ఏవియేషన్ శాఖ అంగీకరించింది. ప్రత్యేక విమానాన్ని ఎన్నిగంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌర విమానయానశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 100 మంది ఏపీ విద్యార్ధులు మణిపూర్‌లో చదువుతున్నట్టు గుర్తించారు. -
మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. ఏపీ ప్రభుత్వ హెల్ప్ లైన్
సాక్షి, ఢిల్లీ: మణిపూర్‌లో చిక్కుకున్న ఆంధ్ర విద్యార్థుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విద్యార్థులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ప్రత్యేక అధికారిగా మైఖేల్ అంఖమ్‌ను నియమించింది. ఏపీ భవన్లో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీ భవన అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. మణిపూర్‌లోని వివిధ యూనివర్సిటీల్లో ఏపీకి చెందిన 150 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా. గిరిజన తెగల మధ్య ఘర్షణతో విద్యార్థులు భయాందోళనకు లోనవుతున్నారు. మణిపూర్‌లో హింసను అదుపు చేసేందుకు ఆర్మీ రంగంలోకి దిగడంతో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. సహాయం కోసం డయల్ చేయాల్సిన హెల్ప్ లైన్ నంబర్లు : 011-23384016, 011-23387089 మణిపూర్ ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్ : 8399882392 , 9436034077, 7085517602 చదవండి: AP: టెన్త్‌లో పెరిగిన ఉత్తీర్ణతా శాతం.. ఫస్ట్, లాస్ట్ జిల్లాలు ఇవే -
Medak: చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని మహిళ మృతి
సాక్షి, మెదక్ : చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశాకు చెందిన సంతోషి(30) అనే మహిళ కూలి పనుల కోసం వలస వచ్చింది. ముసాయిపేట్ మండలం కొప్పులపల్లి గ్రామ శివారులో ని ఇటుక బట్టీలలో పని చేసుకుంటూ జీవిస్తుంది. మంగళవారం తూప్రాన్ సంతకు వెళ్లిన మహిళ.. మద్యం సేవించి ఇంటికి వచ్చింది. అనంతరం ఇంట్లో చికెన్ వండుకుని తింటున్న సమయంలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తూప్రాన్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మహిళ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. వెల్దుర్తి ఎస్ఐ మధుసూదన్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: ‘సాక్షి’ చేతిలో సాత్విక్ సూసైడ్ నోట్.. నివ్వెరపోయే విషయాలు -
చిరుత బోనులో కోడి దొంగ!
చిరుతపులి కోసం ఏర్పాటు చేసిన బోనులో.. గాలానికి పడ్డదాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అదొక మనిషి. తనను బయటకు తీయండి మహాప్రభో అంటూ బోను తలుపులను పట్టుకుని.. అధికారులను అతను వేడుకోవడం ట్విటర్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలోని బసెందువా గ్రామంలో చిరుత సంచారం గురించి అధికారులు సమాచారం అందుకున్నారు. దానిని పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. చిరుతకు ఎరగా.. ఓ కోడిని అందులో ఉంచారు. అయితే ఆ కోడి కోసం వెళ్లి.. ఆ వ్యక్తి బోనులో చిక్కుకున్నాడు. దొంగతనగా కోడిని బోనులోంచి తీసేందుకు యత్నిస్తుండగా.. ఒక్కసారిగా బోను తలుపు పడిపోయింది. దీంతో బయటకు తీయాలని అధికారులను వేడుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. #WATCH | Uttar Pradesh: A man got stuck in a cage, installed to nab a leopard, in Basendua village of Bulandshahr dist. Forest Dept says that the man had entered the cage to get a rooster that was kept there as bait for the leopard. (Video: viral video confirmed by Forest Dept) pic.twitter.com/8ujj23I2AO — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 24, 2023 (చదవండి: మీ సంగతి ప్రజలే చూసుకుంటారు: నరేంద్ర మోదీ) -
రివర్ క్రూయిజ్ చిక్కుకోలేదు! భద్రత దృష్ట్యా అలా చేశాం
ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గంగా విలాస్‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. లగ్జరీ రివర్ క్రూయిజ్ ఒకచోట చిక్కుకుపోయిందంటూ వచ్చిన వార్తలు గుప్పుమన్నాయి. కానీ అవి ఎంతమాత్రం వాస్తవం కావని క్రూయిజ్‌ని నిర్వహస్తున్న ఎక్సోటివ్ హెరిటేజ్ గ్రూప్ చైర్మన్ రాజ్‌సింగ్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఓడ పాట్నా చేరుకుంది. ఓడ నదిలో లంగరు వేయగా..పర్యాటకులు సందర్శన కోసం పడవలు తీసుకుని బయలుదేరారని తెలిపారు. "ఓడ ఎల్లప్పుడూ ప్రధానంగా లోతైన ప్రదేశంలోనే ఉంటుంది. పెద్ద ఓడలు ఎప్పుడూ ఒడ్డుకు వెళ్లలేవు. ఈ ఓడను చూడటానికి వేలాదిమంది తరలి వచ్చారు. ఓడ గోప్యత, ప్రయాణికుల భద్రత తదితర కారణాల రీత్యా తాము పాట్నాకి తీసుకువచ్చామని, జెట్టీకి తీసుకురాలేకపోయామని చెప్పారు". అలాగే పర్యాటకులు అక్కడ చిరాంద్ అనే పర్యాట ప్రదేశాన్ని చూడటానికి పడవలను తీసుకుని వెళ్లారని, మళ్లీ సురక్షితంగా తిరిగి వచ్చేశారని వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్లు, బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని షాహిగంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, అస్సాంలోని గౌహతి, బంగ్లాదేశ్‌లోని ఢాకా వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రాంతాలను ఈ క్రూయిజ్ కవర్ చేస్తుంది. శాకాహార భారతీయ వంటకాలు, ఆల్కహాల్ లేని పానీయాలు, స్పా, కాల్‌లోనే అందుబాటులో ఉండే వైద్యులు తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఈ రివర్ క్రూయిజ్‌కి రోజుకు సుమరు రూ. 25 వేల నుంచి రూ. 50 వేలు వరుకు ఖర్చు అవుతుంది. మొత్తం 51 రోజుల ప్రయాణానికి ప్రతి ప్రయాణికుడికి దాదాపు రూ. 20 లక్షలు ఖర్చవుతుంది. (చదవండి: ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు) -
కారు కింద ఇరుక్కుందని తెలుసట!
న్యూఢిల్లీ: ఢిల్లీలో డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి దాటాక స్కూటీపై వెళ్తున్న అంజలీ సింగ్‌ను ఢీకొట్టి, 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన ఘటనలో పోలీసు విచారణలో మరికొన్ని విషయాలు వెలుగు చూశాయి. తమ కారు కింద ఒక మహిళ ఇరుక్కుపోయిన విషయం తెలుసునని, కారాపి ఆమెను విడిపించినప్పటికీ హత్య కేసు నమోదవుతుందని భయపడ్డామని నిందితులు తెలిపారని పోలీసులు ఆదివారం వెల్లడించారు. అందుకే, మహిళ శరీరం కారు నుంచి విడిపోయేదాకా ఆపకుండా నడిపినట్లు చెప్పారన్నారు. సుల్తాన్‌పురి నుంచి కంఝావాలా వరకు పలుమార్లు కారును యూ టర్న్ తీసుకుని 12 కిలోమీటర్ల మేర అంజలిని లాక్కెళ్లగా ఆమె తీవ్ర గాయాలతో చనిపోయిన విషయం తెలిసిందే. తమ కారు కింద ఒక మహిళ ఇరుక్కున్న విషయం తెలియదని, విషయం తెలిశాక అక్కడి నుంచి పరారైనట్లు అంతకుముందు నిందితులు తెలిపిందంతా అబద్ధమని తేలింది. అంజలి, తన స్నేహితురాలు నిధి కలిసి స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో నిధి స్వల్పగాయాలతో బైటపడగా, అంజలి కారు కింద ఇరుక్కుంది. కాగా, ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
ఘోర ప్రమాదం..ఏకంగా నెత్తిమీద ఉన్న చర్మంతో సహా జుట్టు ఊడి..
భారత సంతతి టీనేజ్ అమ్మాయికి దారుణమైన ప్రమాదం బారిన పడింది. ఏకంగా నెత్తిపై జుట్టుతో సహా చర్మం ఊడొచ్చి.. వెన్నుకి సైతం తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకెళ్తే..దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో గేట్‌వే మాల్లో భారత సంతతికి చెందిన క్రిస్టినా అనే టీనేజ్ అమ్మాయి గో కార్ట్ అనే స్పోర్ట్స్ కారుని నడుపుతోంది. అనుహ్యంగా ఆమె జుట్టు ఆ కారు చక్రాల్లో ఇరుక్కుపోయింది. దీంతో తలపై ఉన్న హెల్మట్ పడిపోయి.. నెత్తిమీద ఉన్న జుట్టుతో సహా చర్మం ఊడొచ్చేసింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. అంతేకాదు ఈ ప్రమాదంలో ఆమె వెన్నుకి కూడా తీవ్రగాయాలయ్యయి. ఈ ఘటన డర్బన్‌లోని ప్రముఖ గేట్ వే మాల్లోని ఎంటర్టైన్మెంట్ సెంటర్లో గత బుధవారం జరిగింది. కానీ క్రిస్టినా ఇప్పటికీ ఐసీయూలోనే చికిత్స పొందుతోంది. ఈ మేరకు బాధితురాలి తండ్రి వెర్నాన్ గోవేందర్ మాట్లాడుతూ...రేసింగ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియనిబంధనలు పాటించిందని అన్నారు. కానీ ఆ గో కార్ట్(స్పోర్ట్స్) కారులోని పరికరాలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆరోపించారు. ఆమె తన జుట్టును కూడా పోనీటైల్లా కట్టేసిందని చెబుతున్నారు. అలాగే ఈ ప్రమాదం జరిగిన వెంటనే యాజమాన్యం తక్షణ సాయం అందించడంలో విఫలమైందని చెప్పారు. ఆ సమయంలో తన కూతురు వద్ద తన 13 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని ఈ ఘటన గురించి చెప్పేందుకు గో కార్ట్ కార్యాలయానికి కూడా వెళ్లాడని చెప్పారు. ఐతే అప్పటికే కార్యాలయాన్ని మూసేసి, వారంతా వెళ్లిపోయినట్లు వాపోయారు. రేసింగ్ కోర్సులో భాగంగా తన కూతురు క్రిస్టినా గో కార్ట్‌ని నేర్చుకుంటుండగా.. స్పిన్ అవుతున్న సమయంలో గో కార్ట్‌లోని చట్రంలో ఆమె జుట్లు ఇరుక్కుపోయి ఈ ఘోర ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మరొకరెవరూ.. ఇలాంటి ఘోరమైన ప్రమాదం బారినపడకూదని..సదరు గోకార్ట్ యాజమాన్యంపై ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలి తండరి గోవేందర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో సదరు యాక్షన్ కార్టింగ్ గేట్‌వే యజమాని స్టీవెన్ పూల్ మాట్లాడుతూ.."రేస్ జరుగుతున్న ట్రాక్ వద్ద అన్ని భద్రతా చర్యలు తీసుకున్నాం. ఎనిమిదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి అనుహ్య ఘటన జరగలేదు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది సాయం చేసేందుకు ముందుకు వచ్చిందని, కానీ ఆ సమయంలో బాధితురాలు క్రిస్టినా మామ చాలా దూకుడుగా ప్రవర్తించాడు. మాకు ఆ కుటుంబం పట్ల సానుభూతి ఉంది. క్లైయింట్స్ అందరికీ సంరక్షణ పద్ధతులకు సంబంధించిన రేసింగ్ వీడియోని చూపిస్తాం. అలాగే కార్ట్‌ని ఎలా నడపాలి, ఎలా హ్యాండిల్ చేయాలనేదానిపై కూడా మాకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఆఖరికి ఇలాంటివి చేసేటప్పుడూ..జుట్టును ఎలా కట్టుకోవాలో కూడా పూర్తిగా వివరిస్తాం. ఐతే ఒకప్పుడూ ఈ రేసింగ్ నేర్చుకుంటున్న వాళ్లకి తమ సిబ్బందే జుట్టును దగ్గరుండి ముడివేసి కట్టేదని, కానీ తల్లిదండ్రుల అయిష్టత చూపడం తోపాటు ఫిర్యాదుల చేయడంతో వారి వ్యక్తిగతానికే వదిలేశామని" వివరించాడు స్టీవెన్ పూల్. (చదవండి: భార్య పిల్లలను చంపేందుకు పక్కా ప్లాన్? కొండపై నుంచి కారును అమాంతం..) -
ఏనుగు విగ్రహం కింద ఇరుక్కొని నానా అవస్థలు
-
గుడిలోనే భక్తుడి కష్టాలు.. ఏనుగు విగ్రహం కింద ఇరుక్కొని నానా అవస్థలు
సాధారణంగా కష్టాలు తొలగించి మంచి జీవితాన్ని అందించమని దేవుడిని ప్రార్థిస్తుంటారు. దైవానుగ్రహం కోసం తరచుగా పుణ్యక్షేత్రాలను సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. దేవుడిని స్మరిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే భగవంతుడి ఆశీస్సులు ఉండాలని గుడికి వెళ్లిన ఓ వ్యక్తికి దేవాలయంలోనే ఓ వింత కష్టం ఎదురైంది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆలయంలో ఓ ఏనుగు విగ్రహం ఉండగా.. ఆచారంలో భాగంగాఆ విగ్రహం కింద నుంచి పడుకొని బయటకు వస్తే మంచి జరుగుతుందని అక్కడి భక్తులు నమ్ముతుంటారు. ఆ వ్యక్తి కూడా అలాగే నమ్మి ఏనుగు విగ్రహం కిందకు వెళ్లాడు. కానీ ముందుకు వెనక్కి రాలేక విగ్రహం మధ్యలో చిక్కుకుపోయాడు. కొంత సేపటి వరకు అలాగే ఇరుక్కుపోయి నానా అవస్థలు పడ్డాడు. శరీరాన్ని ఇటు ఇటు తిప్పుతూ ఉక్కిరిబిక్కిరైపోయాడు. బయటకు రావడానికి చాలా ప్రయత్నించినా వీలు పడలేదు. అతని బాధలు చూసిన తోటి భక్తులు, పూజారి సలహాలు సూచనలు కూడా చేశారు. కానీ ప్రయోజనం లేదు. Any kind of excessive bhakti is injurious to health 😮 pic.twitter.com/mqQ7IQwcij — ηᎥ†Ꭵղ (@nkk_123) December 4, 2022 దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో సదరు వ్యక్తి విగ్రహం నుంచి బయట పడేందుకు పడుతున్న కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే చివరికి ఆ వ్యక్తి మరి విగ్రహం నుంచి బయటకు వచ్చాడా అనేది తెలియరాలేదు. వీడియో అక్కడికే ముగియడంతో సస్పెన్స్‌గా మిగిలిపోయింది. కాగా 2019లో అదే విగ్రహం కింద ఓ మహిళ ఇరుక్కుపోయింది. విగ్రహం నుంచి బయటకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. చివరికి పలువురు ఆమెకు సాయం చేయడం ద్వారా సురక్షితంగా బయటపడింది. ఈ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయ్యింది. చదవండి: ఒకే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన కవలలు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ -
దొంగతనానికి వచ్చి..డోర్లో తల ఇరుక్కుని చనిపోయాడు
ఒక ఇంటిలో దొంగతనం చేసేందుకు వచ్చిన ఒక దొంగ ఏమి దొరక్కా.. ఆ ఇంటిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన మరువక మునేపే అలాంటి మరో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. చోరీ చేసేందుకు వచ్చి డోర్లో తల ఇరుక్కుని చనిపోయాడు ఒక దొంగ. ఈ ఘటన వారణాసిలో సార్నాథ్ ప్రాంతంలోని డానియాల్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలపిని కథనం ప్రకారం....నిజాం అనే వక్తి విద్యుత్ యంత్రాలతో పనిచేసే మగ్గం సెంటర్లోకి చోరబడేందుకు యత్నించాడు. వాస్తవానికి ఆ సెంటర్ సరైన పని లేక గత రెండు రోజులుగా మూతబడి ఉంది. ఐతే ఈ దొంగ ఆ సెంటర్లో చోరీ చేసేందుకు వచ్చాడు. ఐతే ఆ సెంటర్‌ను బద్దలుగొట్టే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్న తలుపుల్లో దొంగ తన తలను పెట్టడంతో అతడి తల ఇరుక్కుపోయింది. ఆ తలుపులు పైన తాళం వేసి ఉందని తెలియక చోరబడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతని తల రెండు డోర్ల మధ్య ఇరుక్కుపోయింది, అతడి మిగతా శరీర భాగం బయటవైపు ఉండిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృదొ చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తిని పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న 30 ఏళ్ల జావేద్గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: మహిళ చేతివాటం.. మాటల్లో దింపి రూ.10 లక్షల నెక్లెస్ కొట్టేసింది) -
వరంగల్‌లో విషాదం.. బాలుడిని చంపేసిన ‘చాక్లెట్’
సాక్షి, వరంగల్ జిల్లా: చాక్లెట్ గొంతులో ఇరుక్కుని వరంగల్ జిల్లాలో ఓ బాలుడు మరణించాడు. కంగర్‌సింగ్ తన ఎనిమిదేళ్ల కుమారుడు సందీప్‌ను స్కూల్ దగ్గర దించి.. ఇటీవలే విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్ ఇచ్చాడు. సందీప్ చాక్లెట్ తీసుకుని పాఠశాల మొదటి అంతస్తులోని తన తరగతి గదికి వెళ్లాడు. చాక్లెట్ తింటూ క్లాస్‌రూమ్‌లోనే సృహ తప్పి పడిపోయాడు. వెంటనే పాఠశాల యాజమాన్యం తండ్రికి సమాచారం అందించడంతో కంగర్ సింగ్ స్కూల్‌కు చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న సందీప్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేదు. ఊపిరి అందక సందీప్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్ వరంగల్‌లో స్థిరపడ్డారు. ఎలక్ట్రికల్ షాపును ఆయన నిర్వహిస్తున్నారు. చదవండి: క్యాన్సర్‌ను నివారించేందుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందా? ఎవరికి మేలు.. -
Viral: జిమ్‌లో వర్కౌట్ చేస్తూ తలకిందులుగా ఇరుక్కుపోయిన మహిళ
చాలామందికి ఫిట్‌గా ఉండటానికి ప్రాధాన్యతిస్తారు. దీని కోసం డైట్ ఫాలో అవడం, జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం చేస్తుంటారు. లేదా ఇంట్లోనే చిన్నసైజ్ జిమ్‌ను ఏర్పాటు చేసుకొని ప్రాక్టిస్ చేస్తుంటారు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు ఎక్సర్సైజ్ చేస్తే కండరాలు పట్టుకోవడం, బ్యాలెన్స్ తప్పడంలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి ఓ షాకింగ్ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఓహియాకు చెందిన క్రిస్టిన్ ఫాల్డ్స్ అనే మహిళ తెల్లవారు జామున 3గంటలకు ఒంటరిగా ఇంట్లోని జిమ్‌లో ఇన్వర్షన్ టేబుల్ అనే ఎక్విప్‌మెంట్‌పై వర్కౌట్స్ చేస్తోంది. వెన్నెముక, నడుమునొప్పి తగ్గేందుకు దీనిని ఉపయోగించి ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అప్పుడే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఉన్నట్టుండి మహిళ ఇన్వర్షన్ టేబుల్‌పై తలకిందులైంది. కాళ్లు అందులో ఇరుక్కుపోవడంతో ఎంత ప్రయత్నించినా తిరిగి మామూలు స్థితికి రాలేకపోయింది. చదవండి: వీడియో వైరల్ చేద్దామనుకున్నాడు.. పాపం తానే వైరల్ అయ్యాడు సాయం కోసం జిమ్‌లో జాసన్ అనే మరో వ్యక్తిని పిలిచినా భారీ సౌండ్‌తో మ్యూజిక్ ప్లే అవుతుండటం వల్ల అతనికి వినిపించలేదు. పైకి లేవలేక, బయటకు రాలేక అలాగే ఇబ్బంది పడింది. కాసేపు ఏం చేయాలో తోచలేదు. వెంటనే ఆమెకు ఓ ఉపాయం తట్టింది. తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ ఉపయోగించి ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేసింది. తన పరిస్థితిని వివరించి, సాయం కావాలని కోరింది. స్పందించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని తలకిందులుగా ఉన్న ఆమెను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్వయంగా ఆమెనే టిక్‌టాక్‌లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'This is so embarrassing' — A woman went viral after getting stuck upside down on an exercise machine and calling 911 for help 😅 pic.twitter.com/8nod8P6oQl — NowThis (@nowthisnews) September 5, 2022 -
అనంతపురం జిల్లా డోనెకల్ వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
-
మరోసారి మానవత్వం చాటుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి మానవవత్వాన్ని చాటుకొన్నారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా మసులుకొన్నారు. వర్షంలో తడుస్తూనే తనవంతు సహయ సహకారం అందించి అందరి మన్ననలు పొందారు. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి నిత్యం రద్దీగా ఉండే నెల్లూరులోని మాగుంటలే అవుట్ అండర్ బ్రిడ్జిలోకి మోకాళ్లలోతు నీరు చేరింది. చదవండి: జగనన్న విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తుల ఆహ్వానం ఓ పెళ్లకి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి బ్రిడ్జి ముందే ఆగిపోయారు. కార్పొరేషన్ అధికారులకు విషయం చెప్పి మోటార్లతో నీటిని తోడేయాలని ఆదేశించారు. పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటం ముహూర్తానికి టైం అయిపోతుండటంతో సాహసం చేసిన ఇద్దరు వాహన చోదకులు బ్రిడ్జి దాటే ప్రయత్నం చేసి మధ్యలో ఇరుక్కు పోయారు. జనం చోద్యం చూస్తూ ఉండిపోయారు. స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్షంలో తడుస్తూనే తన అనుచరులతో కలిసి నీటిలో ఆగిపోయిన వాహనాలను ఒడ్డుకు చేర్చారు. ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగటంతో మిగిలిన వాళ్లు కూడా ముందుకొచ్చారు. బాధ్యతగా మసులుకొన్న ఎమ్మెల్యేకి చేతులెత్తి నమస్కరించారు. -
సహారాలో భారీగా ఇరుక్కున్న ఇన్వెస్టర్లు.. మొత్తం లక్ష కోట్లు పైనే!
Sahara Group-Sebi ప్రయివేట్ రంగ సంస్థ సహారా ఇండియా గ్రూప్‌నకు చెందిన వివిధ సంస్థలు, పథకాలలో దాదాపు 13 కోట్లమంది ఇన్వెస్టర్లు ఇరుక్కున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ పార్లమెంటులో వెల్లడించారు. ఈ మొత్తం సొమ్ము రూ. 1.12 లక్షల కోట్లుగా తెలియజేశారు. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలు, జస్టిస్ బీఎన్ అగర్వాల్ సూచనలమేరకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. సొమ్మును తిరిగి చెల్లించేందుకు వీలుగా పలు ప్రకటనలు జారీ చేసింది. తద్వారా తమ సొమ్మును తిరిగి పొందేందుకు ఇన్వెస్టర్లకు వీలు కల్పించినట్లు మంత్రి రాతపూర్వక సమాధానంలో వివరించారు. తదుపరి 2021 అక్టోబర్‌లో సెబీ మధ్యంతర ఆదేశాల కోసం సుప్రీం కోర్టులో మరోసారి అప్లికేషన్‌ను దాఖలు చేసింది. ఇది ప్రస్తుతం కోర్టువద్ద పెండింగ్‌లో ఉన్నట్లు పంకజ్ తెలియజేశారు. సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో రూ. 47,245 కోట్లు, సహారా ఇండియన్ రియల్టీ కార్పొరేషన్లో రూ. 19,401 కోట్లు, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లో రూ. 6,381 కోట్లు చొప్పున పెట్టుబడులు ఇరుక్కున్నట్లు వెల్లడించారు. ఇదేవిధంగా హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో రూ. 12,958 కోట్లు, సహారాయన్ యూనివర్శల్ మల్టీపర్పస్ సొసైటీలో రూ. 18,000 కోట్లు, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీలో రూ. 8,470 కోట్లు నిలిచిపోయినట్లు తెలియజేశారు. కాగా.. సహారా గ్రూప్ ‘సెబీ సహారా రిఫండ్’ ఖాతాలో అసలు రూ. 25,781 కోట్లకుగాను దాదాపు రూ. 15,507 కోట్లు డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. చదవండి: టెక్కీలకు గడ్డుకాలం, వరస్ట్ ఇయర్‌గా 2022 -
సంతాయిపేట వద్ద వాగు అవతల చిక్కుకున్న రైతులు సురక్షితం
-
ములుగు జిల్లా: ముత్తారం వాగులో చిక్కుకున్న ట్రాక్టర్
-
ములుగు జిల్లా: వరదల్లో చిక్కుకున్న కారు
-
మహబూబాబాద్ జిల్లా: వరద నీటిలో చిక్కుకున్న ఆర్యభట్ట పాఠశాల బస్సు
-
గాల్లోనే ఆరు గంటలు హైరానా
సిమ్లా: ప్రకృతి అందాలను ఆస్వాదించాలని కేబుల్‌కార్ ఎక్కిన పర్యాటకులు రోప్‌వేలో సాంకేతిక లోపంతో కొన్ని గంటలపాటు తీవ్ర భయాందోళనల మధ్య గాల్లోనే గడపాల్సి వచ్చింది. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం సొలాన్ జిల్లా పర్వానూ సమీపంలోని టింబర్ ట్రయల్ ప్రైవేట్ రిసార్ట్ వద్ద ఢిల్లీకి చెందిన 11 మంది పర్యాటకులు సోమవారం టింబర్ ట్రయల్ కేబుల్ కార్ ఎక్కారు. రోప్‌వేలో సాంకేతిక లోపం కారణంగా అది మధ్యలోనే సుమారు 250 అడుగుల ఎత్తులో నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం అక్కడికి చేరుకుని, మరో కేబుల్ కార్ ట్రాలీని అక్కడికి పంపించి, ఒక్కొక్కరికీ తాడు కట్టి క్షేమంగా కిందికి దించింది. 6 గంటలు శ్రమించి అందులో చిక్కుకు పోయిన ఐదుగురు మహిళలు సహా మొత్తం 11 మందిని సురక్షితంగా కిందికి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడినట్లు సీఎం జైరాం ఠాకూర్ చెప్పారు. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌తోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఆయన వెంటనే ఘటనాస్థలికి పంపించారని వెల్లడించారు. 1992లోనూ టింబర్ ట్రయల్ వద్ద ఇలాంటి ఘటనే చోటుచేసుకోగా, కేబుల్ కార్లో చిక్కుకుపోయిన 10 మందిని ఆర్మీ కాపాడింది. గత ఏప్రిల్‌లో జార్ఖండ్‌లోని త్రికూట్ పర్వతాల వద్ద రోప్‌వే గాల్లోనే నిలిచిపోయింది. ఆర్మీ సుమారు 40 గంటలపాటు శ్రమించి 12 మందిని రక్షించగా మరో ముగ్గురు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. చదవండి: Breaking: ఆర్మీలో అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల #HimachalPradesh :- Eleven People are stucked in the Timber Trail due to techanical problem. They have been getting rescued by the management.#Himachal pic.twitter.com/EgMfJy0UPY — Gorish (@IGorishThakur) June 20, 2022 కాగా 1992 అక్టోబర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇదే రోప్‌వేలో 11 మంది ప్రయాణికులు చిక్కుకుపోగా ఆర్మీ, వైమానిక దళం జరిపిన ఆపరేషన్‌లో 10 మందిని రక్షించారు. ఒకరు మరణించారు. అలాగే జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలో గత ఏప్రిల్‌లో పర్యాటకులు 40 గంటలకు పైగా కేబుల్ కార్లలో చిక్కుకుపోయారు. వారిలో ముగ్గురు మరణించారు. -
మా లగేజ్ ఎక్కడ ?.. ఎయిర్‌పోర్టులో హీరోయిన్‌కు చేదు అనుభవం
బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ దియా మీర్జాకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం (మే 21) జైపూర్ ఎయిర్‌పోర్టులో లగేజీ లేకుండా చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెబుతూ తెలియజేసింది. దియా ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆమె ప్రయాణిస్తున్న విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు. దియా మీర్జా అక్కడ ఎయిర్‌పోర్టులోనే సుమారు 3 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. తర్వాత తన లగేజ్ గురించి ఎయిర్పోర్ట్ సిబ్బందిని అడిగితే ఎవరు ఎలాంటి సమాధానం, కానీ సహాయం అందించలేదట. ఈ విషయాన్ని ట్విటర్ హ్యాండిల్లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, విస్తారాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇందులో 'ఢిల్లీకి వెళ్లాల్లిన యూకె904 విమానం జైపూర్‌లో ల్యాండ్ అయింది. మేము 3 గంటలు విమానంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఫ్లైట్ రద్దు అయిందని, ఇక్కడ దిగమని చెప్పారు. కానీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు, సహాయం చేసేందుకు అక్కడ ఎవరూ లేరు. మా లగేజ్ బ్యాగులు ఎక్కడా ?' అని పేర్కొంది. దియా ట్వీట్ తర్వాత అనేక మంది ప్రయాణికులు ఆ ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యాన్ని ట్వీటర్ ద్వారా తెలిపారు. ఇంతలో వాతావరణం బాగా లేనందునే ఫ్లైట్‌ను జైపూర్‌కు మళ్లించినట్లు ఎయిర్‌లైన్స్ సంస్థ విస్తారా ట్వీట్ చేసింది. చదవండి: ఓటీటీలతో సినీ ఇండస్ట్రీకి ముప్పుపై దీపికా సమాధానం.. UK904 to Delhi, is diverted to land in Jaipur. We wait inside the aircraft for 3hrs. Then we are told the flight is cancelled and are asked to disembark. NO ONE for the airport authority or Vistara to offer any help or answers. Where are our bags? @airvistara @AAI_Official — Dia Mirza (@deespeak) May 20, 2022 -
‘డబ్బులు లేక అర్ధాకలి.. ఏ క్షణాన బాంబుల వర్షం కురుస్తుందో అని భయం వేస్తోంది’
సాక్షి,చంపాపేట(హైదరాబాద్): ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు స్వదేశానికి రాలేక, అక్కడ ఉండలేక... చేతిలో డబ్బులు లేక అర్ధాకలితో బిక్కుబిక్కుమంటూ అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మిర్యాలగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైతరుణి దీనస్థితి ఇది. వివరాలు... నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పొట్లపల్లి అశోక్, స్వరూప దంపతులు తమ కుమార్తె వైతరుణితో కలిసి కర్మన్‌ఘాట్‌లోని పవన్‌పురి కాలనీలో ఉంటున్నారు. (చదవండి: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో మంత్రి కేటీఆర్ ఆసక్తికర చర్చ ) వైతరుణి 2018లో నీట్లో క్వాలీఫై అయి ఉక్రెయిన్ దేశ రాజధాని కీవ్స్ నగరానికి 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న జఫరోజియా పట్టణంలోని ప్రభుత్వ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌లో చేరింది. ప్రస్తుతం ఆమె నాలుగో సంవత్సరం వైద్య విద్య పూర్తి చేసుకుంది. భారత దేశానికి చెందిన విద్యార్థులంతా తమ దేశానికి వెళ్లిపోవాలని కీవ్స్లోని భారత ఎంబసీ అధికారులు 15 రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేశారు. అయితే, యూనివర్సిటీ నిర్వాహకులు అప్పట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రస్తుతం భారత్‌కు వచ్చేందుకు విమాన సౌకర్యం లేక పోవటంతో వైతరుణితో పాటు కొందరు విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. హాస్టల్ గదిలోనే బిక్కుబిక్కు మంటూ భారతదేశానికి వచ్చేందుకు ఎదురు చూస్తోంది. భయంగా ఉంది: వైతరుణి జఫరోజియా పట్టణ రహదారులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. షాపింగ్ మాల్స్, ఏటీఎంలు మూసేశారు. రెండు రోజులకోసారి రోజుకు ఒక్క గంట మాత్రమే తెరుస్తున్నారు. ఏక్షణాన బాంబుల వర్షం కురుస్తుందో అని భయంగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పదించి మమ్మల్ని సురక్షితంగా భారతదేశానికి చేర్చాలని వైతరుణి ‘సాక్షి’ ప్రతినిధితో ఫోన్లో వేడుకుంది. వండుకునేందుకు నిత్యావసర వస్తువులన్నీ అయిపోయాయి. ఏటీఎంలు మూసివేయటంతో చేతిలో డబ్బులు లేవు.. అని ఆవేదన వ్యక్తం చేసింది. -
12.30కి పెళ్లి.. ధర్నాలో చిక్కుకున్న వధువు.. అక్కడే ఉన్న సోదరుడు..
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): వివాహ సమయం దగ్గరపడుతోంది.. ఫంక్షన్‌హాల్‌కు చేరుకోవాల్సిన పెళ్లికూతురు.. ఆశ వర్కర్లు చేస్తున్న ధర్నా ప్రాంతంలో చిక్కుకుంది.. పెళ్లి సమయానికి ఫంక్షన్ హాల్‌కు చేరకుంటే పరిస్థితి ఏమిటని బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.. కారులోంచి పెళ్లికూతురును బయటకు తీసుకొచ్చి.. ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టి పెళ్లి మండపానికి తీసుకెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పట్టణ శివారులోని టీఆర్‌నగర్ కాలనీకి చెందిన నేరెళ్ల సాహితికి మధుకర్‌తో జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డు నాయీబ్రాహ్మణ సంఘ భవనంలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. సాహితి తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి టీఆర్‌నగర్ నుంచి కారులో జగిత్యాలకు బయలు దేరారు. కలెక్టరేట్ వద్దకు రాగా నే అక్కడ ఆశ వర్కర్లు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ధర్నా చేస్తున్నారు. పెళ్లికూతురు కారు అక్కడే చిక్కుకుపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకారులతో మాట్లాడినా ఫలితం లేదు. ఆందోళనకారులు రోడ్డుపైనే బైఠాయించారు. చేసేదిలేక పెళ్లికూతురు సోదరుడు స్వరాజ్ కృష్ణ అక్కడే ఉన్న ఒకరి ద్విచక్ర వాహనం తీసుకున్నారు. పెళ్లి కూతురును దానిపై ఎక్కించుకుని వేరే మార్గం ద్వారా పెళ్లి మండపానికి తీసుకెళ్లాడు. నిర్దేశిత సమయానికి వివాహం జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: Transgender SI: మానవత్వం చాటుకున్న ట్రాన్స్‌జెండర్ ఎస్ఐ -
ఎస్కలేటర్‌లో చిక్కుకున్న బాలిక
విశాఖ పట్నం: విశాఖ పట్నంలోని ఒక షాపింగ్‌మాల్‌కు వెళ్లిన కుటుంబానికి అనుకోని సంఘటన ఎదురైంది. పై అంతస్థులో షాపింగ్ చేయడానికి.. ఎస్కలేటర్‌పై వెళ్తున్న ఒక పాప డ్రెస్సు ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న ఎస్కలేటర్‌లో ఇరుక్కుంది. దీంతో బాలిక ఎటు కదల్లేక అక్కడే ఉండిపోయింది. దీంతో వెంటనే ఆ బాలిక తండ్రి షాపింగ్‌మాల్ నిర్వాహకులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది బాలిక డ్రెస్సును బైటకు తీసి ఎస్కలేటర్‌ను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో.. బాలిక క్షేమంగా బయటపడటంతో షాపింగ్‌కు వచ్చిన కస్టమర్లంతా ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: Chittoor: మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ -
దొంగతనానికి వచ్చి.. రేకుల మధ్య చిక్కుకొని..
చంద్రశేఖర్‌కాలనీ (నిజామాబాద్): నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సుఖ్జిత్ ఫ్యాక్టరీ ప్రధాన గేట్ పక్కన గల శ్రీ మహాలక్ష్మి ఆలయంలో బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. అయితే ఆలయం రేకుల మధ్య చిక్కుకొని దొరికిపోయాడు. రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయంలో చోరీ చేయడానికి ఓ వ్యక్తి గోడపై నుంచి లోపలికి వెళ్లడానికి యత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆలయం రేకుల మధ్య ఇరుక్కుపోయాడు. రేకుల మధ్య ఉన్న నిందితుడిని చూసి పక్కన ఉన్న కొందరు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని బయటకు తీశారు. అనంతరం నిందితుడిపై దొంగతనం కేసు నమోదు చేసినట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు. అతడిని ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన రఘుగా గుర్తించామన్నారు. రఘుపై ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఉందని ఆయన పేర్కొన్నారు. చదవండి: Putta Madhu: ఫోన్ స్విచ్ఛాఫ్.. పుట్ట మధు ఎక్కడ..? Etela Rajender: ఈటలకు షాకిచ్చేందుకు ‘కెప్టెన్’ రెడీ! -
ఇంజన్లో ఇరుక్కున్న బైక్, ఆగిన రైలు
నెక్కొండ: గూడ్స్ రైలు ఇంజన్లో టూ వీలర్ వాహనం ఇరుక్కోవడంతో రైలు అర గంటపాటు నిలిచిపోయింది. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలోని గేటుపల్లిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. మండలం లోని గొల్లపల్లికి చెందిన ఓ రైతు తన ద్విచక్ర వాహనాన్ని గేటుపల్లి వద్ద రైలు పట్టాలను దాటిస్తున్నాడు. ఈ క్రమంలో వరం గల్ నుంచి విజయవాడ వెళ్తున్న గూడ్స్ రైలు దగ్గరకు రావడం తో గమనించిన రైతు తన వాహనాన్ని విడిచి వెళ్లిపోయాడు. అప్పటికే అప్రమత్తమైన డ్రైవర్ రైలు వేగాన్ని తగ్గించినప్పటికీ ఇంజన్‌లోకి బైక్ ఇరుక్కుపోయింది. అరగంటపాటు శ్రమించి టూవీలర్‌ను తొలగించాక రైలు తిరిగి బయలుదేరింది. చదవండి: టీచర్ మందలించాడని.. ఆత్మహత్య చేసుకున్న పదోతరగతి విద్యార్థి -
గేటు దూకబోయి.. ఇనుప రాడ్డులో
పిడుగురాళ్ల (గురజాల): వాకింగ్ కోసం వచ్చిన ఓ విద్యార్థి గేటు దూకబోయి.. అందులో చేయి ఇరుక్కొని తీవ్రంగా గాయపడిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో సోమవారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కొపావత్ వెంకట్ నిఖిల్ నాయక్ విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం వాకింగ్ కోసం స్థానిక మన్నెం పుల్లారెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాలకు వచ్చాడు. పాఠశాల గేటుకు తాళం వేసి ఉండటంతో గేటు దూకి లోపలికి వెళదామని ప్రయత్నించే క్రమంలో కాలు జారి గేటు పైనున్న ఇనుప కడ్డీలోకి ఎడమ చేయి పూర్తిగా చొచ్చుకునిపోయింది. (చదవండి: విషాదం.. వివాహమైన 28 రోజులకే..) కడ్డీలో నుంచి చేయి తీయాలని ప్రయతి్నంచినా రాలేదు. స్థానికుల సమాచారం మేరకు పల్నాడు ఆస్పత్రి వైద్యుడు అశోక్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని నిఖిల్‌కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి సుమారు గంటన్నర సమయం వెచ్చించి ఇనుప రాడ్డులో నుంచి చేయిని బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, వైద్యులు వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
అనంతపురం: గుత్తివాగులో చిక్కుకుపోయిన కారు
-
భివండీలో తెలంగాణ ప్రజల వెతలు
భివండీ: వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు పెళ్లిళ్లకి వచ్చిన తెలంగాణ ప్రజలు భివండీలో ఇరుక్కుపోయారు. భివండీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తెలుగు వారుండే ప్రాంతాల్లో ఇంకా కరోనా వ్యాపించనప్పటికీ భివండీలో 13 మందికిపైగా కరోనా బారిన పడినవారున్నారు. ఇలాంటి నేపథ్యంలో పెళ్లిళ్లకు వచ్చి లాక్డౌన్ కారణంగా స్వగ్రామాలకు వెళ్లలేక, భివండీలో ఉండలేక తెలంగాణప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందిన వివరాల మేరకు సుమారు 100 మందికిపైగా భివండీలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. తమను ఎలాగైనా స్వగ్రామాలకు చేర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇలాంటి వారు అనేక మంది ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి తమ వినతిని తెలపాలని కోరుతున్నారు. ముఖ్యంగా వీరిలో కొందరు వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులు ఉండడంతో పంటలకు నష్టం వాటిల్లే ముప్పు ఉందని వాపోతున్నారు. పద్మనగర్‌లో ... మార్చి 19వ తేదీ పవర్లూమ్ కార్మికుడు నవజీవన్ కాలనీలో నివసించే అకెన్ కనుకయ్య కుమారుడు శ్రీనివాస్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సిరిసిల్ల, కరీంనగర్ తదితర జిల్లాల నుంచి వచ్చిన సుమారు 35 మంది ఇరుక్కుపోయారు. అలాగే ఆదర్శనగర్‌లో టీ స్టాల్ నడిపే కూరపాటి వీరయ్య కుమార్తె స్రవంతి వివాహ వేడుకల కోసం వరంగల్ అర్బన్, జిల్లాలోని గట్ల నర్సింగపరం నుంచి వచ్చిన 11 మంది లాక్డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయారు. వ్యవసాయ కూలీలైన వీరు ఇరుకైన గదులలో ఉండలేక, సరైన భోజన వసతిలేక, పడుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొంటున్నారు. గాయత్రీనగర్ కి చెందిన జెల్ల రమేశ్ కూతురు రుషిక వివాహం కోసం యాదాద్రి జిల్లా ఆలేరు మండలంకు చెందిన ఆరుగురు భివండీ వచ్చి ఇక్కడే చిక్కుకుపోయారు. కామత్‌ఘర్‌లో... కామత్‌ఘర్‌లో కూడా కరీంనగర్, జనగాం జిల్లాలతోపాటు హైదరాబాద్ నుంచి వచ్చిన సుమారు 22 మందికిపైగా ఇరుక్కుపోయారు. మార్చి 19వ తేదీన మామిడాల ఈశ్వర్ కుమారుడు రాజేష్ వివాహం జరిగింది. ఈ వేడుకల కోసం వచ్చిన వీరందరూ లాక్ డౌన్ కారణంగా గత నెలరోజుల నుంచి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ధామన్‌కర్ నాకాలో.. ధామన్‌కర్ నాకా ప్రాంతంలో మార్చి 19వ తేదీన జరిగిన సైరెడ్డి మోహన్‌రెడ్డి కుమారుడు రాజశేఖర్ రెడ్డి వివాహ వేడుకల్లో సుమారు 80 మంది బంధువులు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి రాగా వీరిలో తొమ్మిది మంది మాత్రం భివండీలోనే ఇరుక్కుపోయారు. భివండీ తాలూకా కరివళి గ్రామంలో.. భివండీ తాలూకాలోని కరివళి గ్రామంలో సిరిసిల్లా నుంచి వచ్చిన తొమ్మిది మంది ఇరుక్కుపోయారు. వీరందరు కరివళి గ్రామానికి చెందిన తుమ్మ శ్రీనివాస్ కుమారుడు శైలేష్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. కోతకు వచ్చిన పంట ఏమవుతుందో... ఇంట్లో చిన్న పిల్లలను విడిచి వచ్చాం. వరి, మొక్కజొన్న కోతకు వచ్చింది. ఊర్లో గాలి దుమారం, వాన వచ్చిందంట. చేతికొచ్చిన పంట మట్టి పాలవుతుందోమోనని భయంగా ఉంది. మమ్మల్ని ఊరికి పంపించండి. –కొచెర్ల యాదగిరి (వరంగల్ జిల్లా కుమ్మరి గూడెం గ్రామం) వాతావరణం పడక ఇబ్బంది.. సిరిసిల్లలో మాకు పవర్లూమ్ పరిశ్రమలు ఉన్నాయి. మావద్ద 8 మంది ఉత్తర భారతీయులు పనిచేస్తున్నారు. మేము ఇక్కడ, వారు అక్కడా చిక్కుకుపోయాం. ఇక్కడ భోజనానికి కూడా ఇబ్బందులు పడుతున్నాం, నాకు ముందు నుంచే ఆరోగ్యం బాగా లేదు. ఇక్కడ వాతావరణం పడక మరింత ఇబ్బందులు పడుతున్నా. –ఆకెన్ రాజేశం (సిరిసిల్ల) కుమారుని ఆరోగ్యం క్షీణిస్తోంది... దగ్గరి బంధువులు కావడంతో పెండ్లికి మా ఇద్దరి పిల్లలను తీసుకొచ్చాను. నా భర్త సిరిసిల్లలోనే ఉన్నాడు, మా అబ్బాయి అభినవ్‌కి ఫిట్స్ వ్యాధి ఉంది. నెల రోజులుగా ఇక్కడ ఒకే గదిలో ఉండటం వలన ఆరోగ్యం క్షీణించిపోతోంది. మమ్మల్ని ఎలాగైనా మా ఊరికి తీసుకెళ్లండి. –క్యాతం రూప (సిరిసిల్ల) ఆసుపత్రి నుంచి ఫోన్లు వస్తున్నాయి... ప్రభుత్వ ఆసుపత్రిలో కంపౌండర్‌గా పనిచేస్తున్నాను. తిరిగి రమ్మని డాక్టర్లు ఫోన్లు చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా నేను భివండీలో ఇరుక్కుపోయాను. మా ఇంట్లో వృద్ధులున్నారు. –కొండ సంతోశ్ (సిరిసిల్ల) -
లండన్‌లో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులు
సిరిసిల్ల: ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన తెలంగాణ విద్యార్థులు స్వస్థలం వచ్చేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ప్రభావంతో అక్కడి విద్యా సంస్థలు మూసివేయగా స్వగ్రామానికి వచ్చేందుకు విద్యార్థులు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆదివారం నుంచి భారత దేశానికి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేయనుండటంతో లండన్‌లో ఉన్న విద్యార్థులకు ఇబ్బందులు మొదలయ్యాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన 50 మంది ఉన్నారు. తిరిగి వెళ్లేందుకు విమానాలు లేవని, టికెట్లు రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు సిబ్బంది చెప్పడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. భారత్ వచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. -
ఇలాంటి ప్రమాదాన్ని చూశారా!
-
వైరల్ వీడియో : ఇలాంటి ప్రమాదాన్ని చూశారా!
ముంబై : రైలు పట్టాలకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఎంత సన్నని గ్యాప్ ఉంటుందో చూసే ఉంటారు. అంత తక్కువ గ్యాప్‌లో పడితే ఇంకేమైనా ఉందా.. డైరెక్ట్‌గా పైకే. అమిత్ కూడా అలానే అనుకున్నాడు. కానీ అదృష్టం కొద్ది క్షేమంగా బయటపడ్డాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాలు అమిత్ అనే వ్యక్తి ముంబై ఖోపోలీ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కడానికి ప్రయత్నించి పట్టు తప్పి కింద పడిపోయాడు. అది కూడా పట్టాలకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఉన్న చిన్న సందులో. ఒకవేళ అప్పుడు గనక అమిత్ తల ఎత్తితే రైలు కింద పడి మరణించేవాడు. కానీ అదృష్టం కొద్ది అక్కడే ఉన్న అమిత్ స్నేహితుడు అతని చేతిని పట్టుకుని నిల్చున్నాడు. రైలు పూర్తిగా వెళ్లిపోయిన తరువాత అమిత్ స్నేహితుడు అతన్ని పైకి లాగాడు. దాంతో హమ్మయ్యా అనుకున్నాడు అమిత్. -
గంటన్నర.. గజగజ
కొత్తపల్లి : శ్రీశైలం డ్యాం బ్యాక్‌వాటర్ మధ్యలో ఓ బోటు నిలిచిపోయింది. దాదాపు గంటన్నర పాటు 25 మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. లైఫ్ జాకెట్లు కూడా లేకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. వివరాలు.. గురువారం మధ్యాహ్నం తెలంగాణలోని వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం చెర్లోపల్లికి చెందిన 25 మంది శివ స్వాములతో ఇంజిన్ బోట్ సోమశిలఘాట్ నుంచి సంగమేశ్వరం ఘాట్‌కు బయలుదేరింది. కృష్ణా జలాల నడి మధ్యకు చేరుకోగానే ఇంజన్‌కు వల తగిలి బోటు నిలిచిపోయింది. ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో గంటన్నర పాటు శివస్వాములు బోటులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. విషయం తెలుసుకున్న కర్నూలు ఆర్డీవో హుసేన్ సాహెబ్ వెంటనే ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, కొత్తపల్లి తహసీల్దారు రామకృష్ణను సంగమేశ్వరం పంపించారు. వారు మరో బోటును పంపించి శివస్వాములను ఒడ్డుకు చేర్చారు. -
రన్‌వేపై నిలిచిపోయిన విమానం: కలకలం
సాక్షి, లక్నో: సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వే పై నిలిచిపోవడం కలకలం రేపింది. లక్నో నుంచి రియాద్ వెళ్లాల్సిన సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వే పై నిలిచిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం అర్థాంతరంగా రన్‌వే పైనే నిలిచిపోయింది. ఈ సంఘటనతో కొన్ని విమానాలను దారి మళ్లించడం తోపాటు, మరికొన్ని సర్వీసులను నిలిపివేశారు. దీంతో సిబ్బంది, ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. లక్నో-రియాద్ విమానం గాల్లోకి ఎగిరే క్రమంలో రన్‌వేపైనే నిలిచిపోయింది. ఈ సంఘటనతో విమానాశ్రాయానికి వచ్చి వెళ్లే పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆరు విమానాలను ఢిల్లీకి మళ్లించారు. టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మరో మూడు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే విమాన సిబ్బంది, ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
రెండు ఇళ్ల మధ్య ఇరుక్కున చిన్నారి
-
గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేస్తూ ఇరుక్కుపోయాడు
ఓక్లాండ్: అమ్మాయి పక్కన ఉన్నా.. కనుచూపు మేరలో ఉన్నా ఆ అబ్బాయిని అప్పటికప్పుడు ఓ వింత ప్రవర్తన ఆవహిస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. గర్ల్ ప్రెండ్ అయినా లేక మరో అమ్మాయి అయినా.. ఆమెను ఆకర్షించేందుకు ఓ అబ్బాయి చేసే ప్రయత్నం అంతా ఇంతా ఉండదు. ఆ క్రమంలో సక్సెస్ అయ్యే వాళ్లేమోగానీ.. ఫేలై నవ్వులపాలయ్యేవారే అధికం. సరిగ్గా ఓక్లాండ్కు చెందిన ఓ అబ్బాయికి ఇదే పరిస్థితి ఎదురైంది. తన గర్ల్ ప్రెండ్ తో కలిసి భవనం పై అంతస్థుకు వెళ్లిన యువకుడు ఆమెను ఇంప్రెస్ చేసేందుకు పక్క భవనంపైకి దూకే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పట్టుదప్పి కాలు జారి రెండు భవనాల సందులో పడ్డాడు. దాదాపు నాలుగుగంటలపాటు అందులో ఇరుక్కుపోయి నరకం చూశాడు. పీటర్స్ బర్గ్ కు చెందిన అత్యవసర సేవల విభాగ అధికారులు గోడలకు రంధ్రం చేసి అతడిని బయటకు తీశారు. -
ఇస్తాంబుల్‌లో ఇరుక్కుపోయి...
– అవస్థలు పడ్డ తొండూరు యువకుడు – తుపాకుల మోత మధ్య బిక్కుబిక్కుమంటూ గడిపిన వైనం – ఎంబసీ అధికారుల చొరవతో స్వగ్రామానికి చేరిన గౌతమ్‌రెడ్డి సాక్షి, కడప : దక్షిణ కొరియాలోని క్యూంబంగ్ నేషనల్ యూనివర్సిటీలో పీహెచ్డీ కంప్యూటర్లో ఇంజనీరింగ్ చేస్తున్న పులివెందుల నియోజకవర్గం తొండూరు గ్రామానికి చెందిన యువకుడు అలవలపాటి గౌతమ్‌రెడ్డి నరకం అనుభవించాడు. సుమారు మూడు రోజులపాటు ఇస్తాంబుల్‌లో అవస్థలు ఎదుర్కొన్న గౌతమ్‌ను మంగళవారం సాక్షి పలకరించింది. ఆయన అనుభవించిన నరక యాతన ఏమిటో ఆయన మాటల్లోనే.. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న రద్దార్ యూనివర్సిటీలో జరుగుతున్న అత్యున్నత కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు శనివారం బయలుదేరా. దక్షిణ కొరియా నుంచి ఇస్తాంబుల్ మీదుగా విమానం వెళ్లాల్సి ఉంది. ఆ విమానం శనివారం అంతా ఇస్తాంబుల్‌లోనే ఉండి మరుసటి రోజు అమెరికా బయలుదేరి వెళుతుంది. అందువల్ల ఇస్తాంబుల్‌లో శనివారం సాయంత్రం టాజీం స్కైర్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేసుకొని అతిథి గృహానికి వెళదామని బయలుదేరా.. షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చి కొద్ది దూరం వెళ్లానో.. లేదో అంతలోనే ఒక్కసారిగా తెలియని ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఒక పక్క కాల్పులు... మరోపక్క పరుగులు : అక్కడ తుపాకుల మోత మోగుతోంది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు వేలల్లో ఉన్న జనం ఒక్కసారిగా ఉరుకులు.. పరుగులు.. ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎవరిని అడిగినా తెలియదంటున్నారు. ఏం చేయాలో దిక్కు తోచక మళ్లీ షాపింగ్ కాంప్లెక్స్‌కు వెళ్లాను. కళ్లెదుటే సైనికులు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతుంటే.. పదుల సంఖ్యలో జనం పట పటా రాలిపోతున్నారు. విషయం ఎవరికి తెలియదు.. తర్వాత ఆరా తీస్తే సైనికులకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న తిరుగుబాటు అని చెప్పుకుంటున్నారు తప్ప స్పష్టత లేదు. దేశం కాని దేశంలో ఒంటరిగా ఉన్న నేను ఒకదశలో భయంతో పరుగులు తీశా.. అది ఎలా అంటే.. దాదాపు 3 కిలో మీటర్ల మేర 40 నిమిషాల్లో పరుగెత్తుకుంటూ వెళ్లి ఎట్టకేలకు అర్థరాత్రి 12.30 గంటలకు అతిథి గృహానికి చేరుకున్నా.. నేను పరుగెడుతున్న సమయంలోనే ఎక్కడ చూసినా సైనికులు యుద్ధ ట్యాంకర్లతో దాడులకు తెగబడుతున్న దృశ్యాలు కళ్లెదుటే కనబడుతున్నాయి. రెండు రోజులపాటు ఎయిర్‌పోర్ట్‌లో పస్తులే.. ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో ఎట్టకేలకు ఎంబసీ అధికారుల సమాచారంతో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నా. అయితే నేను ప్రయాణించిన విమానం వెళ్లిపోవడంతో కనీసం ఎయిర్‌పోర్ట్‌లో సమాచారం ఇచ్చే అధికారి లేరు. పైగా అమెరికా, లండన్, ఐరోపా తదితర దేశాలు కూడా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విమానాలను రద్దు చేశాయి. దీంతో రెండు రోజులపాటు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయా.. నిద్రలేదు.. తిండిలేదు.. అమెరికా విమానాలు కూడా నడవకపోవడంతో చివరగా ఎంబసీ అధికారులు ఇండియాకు విమానాలు నడుస్తున్న నేపథ్యంలో వెళ్లాలని ఆదేశించడంతో తప్పని పరిస్థితిలో ఢిల్లీకి వచ్చి అక్కడి నుంచి తొండూరుకు సోమవారం చేరుకున్నా.. ఇప్పుడు ఆ సంఘటనను తలుచుకుంటూనే భయమేస్తోంది.. ఎంబసీ అధికారుల చొరవతో.. ఇస్తాంబుల్ సంఘటనలో నేను చిక్కుకోగానే.. అర్థరాత్రి రూంకు వచ్చిన తర్వాత ఫేస్బుక్, ట్విట్టర్లలో నేను ఇబ్బందులలో ఉన్నట్లు అందరికి పోస్ట్‌లు చేసి హెల్ప్ చేయమన్నా.. చాలామంది మిత్రులు వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖకు మెసేజ్‌లు పెట్టారు. వెంటనే నేను ఇస్తాంబుల్‌లోని దౌత్య కార్యాలయానికి.. తర్వాత రెండవ సారి కాన్సలేట్‌కు ఫోన్ చేయడంతో సమాచారం లభించింది. దౌత్య అధికారుల సమాచారం మేరకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని ఎట్టకేలకు ఇండియా చేరా.. అందుకు దౌత్య వేత్తలు, ఫ్రెండ్స్ సహాయం మరువలేనిది. కుటుంబీకులు, బంధువులు, స్నేహితులతో హడావుడిగా గౌతమ్ సోమవారం తొండూరు చేరుకున్న గౌతమ్‌రెడ్డిని చూడగానే తండ్రి, పులివెందుల ఇన్‌ఛార్జి ఎంపీడీవో ముకుందారెడ్డి, తల్లి, వైఎస్ఆర్సీపీ మండల నాయకురాలు, మాజీ ఎంపీటీసీ రమాముకుందారెడ్డిలు అక్కున చేర్చుకొని దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్లారు. గౌతమ్‌రెడ్డి వచ్చిన విషయం తెలుసుకున్న మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు బంధువులు, స్నేహితులు అతని ద్వారా విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. -
అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగువారు
జమ్మూకశ్మీర్: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన పలువురు తెలుగువారు.. శ్రీనగర్‌లో చెలరేగిన అల్లర్ల మూలంగా నానా అవస్థలు పడుతున్నారు. ప్రకాశం జిల్లా వాసులు 150 మంది ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బల్తాల్ వద్ద చిక్కుకుపోయారు. సోమవారం సాయంత్రానికి వారి రైలు టికెట్లు రద్దవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వాని ఎన్కౌంటర్ కు నిరసనగా చేపట్టన ఆందోళనలు హింసాత్మకంగా మారి 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. యాత్రికుల భద్రత దృష్ట్యా అధికారులు వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేస్తున్నారు. -
వాయిదా పద్ధతొద్దు దేనికైనా
బద్ధకిష్టులకు పరిష్కార మార్గాలు ‘అబ్బబ్బ... ఎన్నాళ్ళుగానో అనుకుంటున్న పని.ఇప్పటికీ పూర్తి కాలేదు... ’ మనలో చాలామంది నోట తరచూ వినిపించే మాట ఇది. నిజానికి ఇది ఒక లోపమే! ఒక్క ముక్కలో చెప్పాలంటే - వాయిదా మనస్తత్త్వం. స్థాయిలో తేడా ఉండవచ్చేమో కానీ, మనస్తత్త్వం మాత్రం కామన్. చెడు అలవాట్లు మానుకోవడం, మంచి అలవాట్లు చేసుకోవడం, చదువులో పూర్తి చేయాల్సిన పోర్షన్, ఆఫీసులో పూర్తి చేయాల్సిన పని - ఇలా రకరకాల వాటిలో ఈ లక్షణం తొంగి చూస్తుంటుంది. ఇలాంటి మనస్తత్త్వం ఉండేవారందరినీ మనస్తత్త్వ నిపుణులు వివిధ వర్గాలుగా విభజించారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎలా ఉంటారు, ఒత్తిడి పెరిగితే తడబడిపోతారా, ఫెయిల్యూర్ వస్తే తట్టుకుంటారా లాంటి పలు అంశాల ఆధారంగా ఈ వర్గీకరణ చేశారు. ఆ వర్గీకరణ, అలాంటి వాయిదా మనస్తత్త్వం ఉన్నవాళ్ళు తమను ఎలా చక్కదిద్దుకోవాలో చూద్దాం... అతి ధైర్యవంతుల రకం ఈ రకమైన వాయిదా వ్యక్తులు ఆఖరు క్షణంలో పని మొదలుపెడతారు. ఆఖరు క్షణం దగ్గర పడుతోందనే ఒత్తిడి ఉన్నప్పుడే తాము బాగా పనిచేయగలుగుతామని భావిస్తారు. సర్వసాధారణంగా వీళ్ళు తమ బద్ధకం కారణంగా ఆఖరు నిమిషం వరకు పని వాయిదా వేసుకుంటూ వస్తారు. చివరికి వచ్చేసరికి హడావిడిగా పని పూర్తి చేయాల్సొచ్చి, పొరపాట్లు చేసే ప్రమాదం ఉంటుంది. ఈ రకం వ్యక్తులు పని విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు కానీ, ఆ పని ఎంత నాణ్యంగా పూర్తయిందన్న దానిపై పట్టింపు పెట్టుకోరు. పరిష్కారం: ఇలాంటి వ్యక్తులు మెడ మీద కత్తి లాంటి డెడ్లైన్లు పెట్టుకోవాలి. ఒక క్రమపద్ధతిలో పనులు చేసుకుంటూ వెళ్ళాలి. తమ పనిని తామే అంచనా వేసుకుంటూ పోవాలి. పనిని అనుకున్నట్లు పూర్తి చేస్తే తమను తాము అభినందించుకోవాలి. పూర్తి చేయకపోతే తమకు తామే పనిష్మెంట్ కూడా వేసుకోవాలి. అలా స్వీయ నియంత్రణ వల్ల వాయిదా మనస్తత్త్వాన్ని దూరం చేసుకోగలుగుతారు. పనికి అడ్డంకులు సృష్టించుకొనే రకం ఈ రకం వాయిదా మనుషులు కూడా ఆఖరి నిమిషంలో ఒత్తిడి మధ్య పనిచేస్తేనే తాము బాగా పనిచేయగలమని పొరపడుతుంటారు. వీళ్ళలో విచిత్రం ఏమిటంటే - తమ పనికి తామే అడ్డంకులు సృష్టించుకుంటూ ఉంటారు. పనిచేసే క్రమంలోని ఈ అడ్డంకుల రీత్యా తమకు తామే ఆ పని నుంచి పక్కకు వస్తారు. పనిలో ఆలస్యమేమిటని అడిగితే, ఆ తప్పు మరొకరి మీద నెట్టేస్తుంటారు. అయితే, ఎన్ని అడ్డంకులు వచ్చినా, పనిలో క్వాలిటీ మాత్రం తగ్గకూడదనుకుంటారు. పరిష్కారం: మీరు గనక ఇలాంటి రకం వ్యక్తులైతే, అడ్డంకుల గురించి కూడా ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు, పనిలో కాసేపు విరామం తీసుకొని, ఆ టైమ్‌లో ఫేస్బుక్ చూసుకోవడం మీకు అలవాటు అనుకుందాం. దీని వల్ల పని టైమ్ వృథా అవుతుంది. ఆ మేరకు పని ఆలస్యమవుతుంది. ఈ సంగతి గ్రహించి, మీ లంచ్ బ్రేక్ టైమ్‌లోనో ఏమో ఈ ఫేస్బుక్ చూసే వ్యవహారం పెట్టుకున్నారనుకోండి. ఇటు ఫేస్బుక్ చూడడం ఆగదు. అటు పని సమయం వృథా కాదు. మామూలు టైమ్‌కే పని పూర్తయిపోతుంది. డెసిషన్‌ని తప్పించుకొనే రకం ఈ రకం వాయిదా మనుషులు ఏ నిర్ణయమూ తీసుకోకుండా వాయిదా వేస్తుంటారు. వీళ్ళకు పని విషయంలోనూ భయమే. ఆ భయంతో పని అసలు మొదలే పెట్టరు. ఇలా నిర్ణయం తీసుకోవడాన్ని వాయిదా వేయడం వల్ల ఫెయిల్యూర్ వస్తుందని కానీ, ఇతరులు తమను అంచనా వేస్తారని కానీ భయం ఉండదు కదా అని తృప్తి పడుతుంటారు. ఫలానా టైమ్‌లోగా పని పూర్తి కావాలనే డెడ్లైన్లు ఉన్నాయంటే, తెగ బాధపడిపోతారు. చేసే పని నాణ్యంగా ఉండాలని అనుకుంటారు కానీ, ఆఖరు నిమిషంలోని ఒత్తిడిని సరిగ్గా సంబాళించుకోలేరు. సాధారణంగా ఈ రకం వ్యక్తులు తమ పనితో సంతోషంగా ఉంటారు. కానీ, ఇతరులు తమ గురించి ఏమనుకుంటారో అని తెగ వర్రీ అవుతుంటారు. పరిష్కారం: ఇలాంటి వ్యక్తులు తమ ప్రవర్తనను మార్చుకొనేందుకు గట్టిగా నిర్ణయించుకోవాలి. ‘‘మనం ఏం చేసినా ఎదుటివాళ్ళు కొందరు జడ్జ్ చేసి, ఏదో ఒకటి అంటారు. కొన్ని విషయాల్లో మనం ఫెయిల్ కూడా అవుతాం. అయినా ఫరవాలేదు. ప్రపంచమేమీ తలకిందులు కాదు. దాని నుంచి కూడా నేర్చుకుంటా’’ అని తమకు తామే గట్టిగా చెప్పుకోవాలి. పక్కవాళ్ళ మీద నెట్టేసే రకం ఇలాంటి రకం వ్యక్తులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో గందరగోళంలో ఉంటారు. అందుకే, ఇతరులనే నిర్ణయం తీసుకోనిస్తారు. ఈ గందరగోళం వల్ల పని ఆలస్యమవుతుంది. ఫెయిల్యూర్ భారాన్ని కూడా ఇతరుల మీదే పడేస్తారు. వీళ్ళకు కూడా తమ పని పట్ల సంతృప్తి ఉంటుంది కానీ, ఇతరులు ఏమంటారోనన్న శంక పీడిస్తూ ఉంటుంది. ఈ రకం వాయిదా మనుషులు ఒక పట్టాన పని మొదలుపెట్టరు. పరిష్కారం: ఇలాంటి వ్యక్తులకు ఏది ముందుగా ఎంచుకోవాలనే మీమాంస వచ్చినప్పుడు - రెండు రకాల మార్గాలున్నాయి. ఉన్నవాటిలో అతి పెద్ద పనిని ముందుగా చేపట్టి, అది అయ్యాక మిగిలిన చిన్న పనుల్లోకి వెళ్ళాలి. ఇక, రెండో పద్ధతి ఏమిటంటే - పెద్ద పనిని ముందుగానే చిన్న చిన్న పనులుగా విడగొట్టుకోవాలి. ఒక్కొక్కటీ పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం మీద తమలోని వాయిదా మనస్తత్త్వాన్ని ఎవరికి వారు గుర్తించి, సరిదిద్దుకోవాలి. బద్ధకాన్ని వదిలించుకొని, పనిలో పడాలి. పైన చెప్పిన పరిష్కార మార్గాల్ని అలవాటు చేసుకోవాలి. అందుకోసం మానసికంగా కృతనిశ్చయంతో ఉండాలి. వాయిదా పద్ధతిని సరైన సమయంలో మార్చుకుంటే, మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. పనిలో పురోగతితో, జీవితం కూడా ఆనందంగా మారుతుంది. మరింకేం... వాయిదా వేయకుండా ఆచరణలో పెట్టండి. ఆల్ ది బెస్ట్! ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలనుకొనే రకం ఈ రకం వ్యక్తులు తమ పని ఏ మాత్రం తప్పు లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలని, అసలు విమర్శలే రాకూడదనీ అనుకోవడం వల్ల ఆలస్యం జరుగుతుంటుంది. ఈ పర్ఫెక్షనిజమ్కి మూలకారణం ఏమిటంటే మనస్సులోని ఆందోళన. వీళ్ళు పని మొదలుపెట్టేస్తారు కానీ చేయాల్సిన పనుల జాబితా మాత్రం కొండవీటి చాంతాడంత ఉంటుంది. కాబట్టి ఒత్తిడి ఎదురైనప్పుడు తడబడతారు. ఇలాంటి పర్ఫెక్షనిస్టులు అవతలివాళ్ళు ఏమంటారో అన్న దాని గురించి అతిగా ఆలోచిస్తుంటారు. ఇతరుల్ని నిర్ణయం తీసుకోనిచ్చి ఆందోళనను అప్పటికి దూరం చేసుకుంటూ ఉంటారు. పరిష్కారం: పర్ఫెక్షనిజమ్ తప్పు కాదు కానీ పనిని వాయిదా వేయకుండా టైమ్‌కి పూర్తి చేయడం కోసం ఇలాంటి వ్యక్తులు ‘ఎస్.ఎం.ఎ.ఆర్.టి’ (స్మార్ట్ -స్పెసిఫిక్, మెజరబుల్, ఎటైనబుల్, రిలవెంట్, టైమ్ బౌండ్) లక్ష్యాలను పెట్టుకోవాలి. లక్ష్యాలు నిర్ణీతంగా, అంచనా వేయడానికి వీలుగా, అందుకోదగినట్లుగా ఉండాలి. సమయానికి తగ్గవై ఉండాలి. నిర్ణీత కాలంలో పూర్తి చేసేలా ఉండాలి. ఎవరం ఏ పని చేసినా అందులో అసలు తప్పులే లేకుండా ఉండడం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు. జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. చేసే పనిలో ఎప్పటికప్పుడు మెరుగుదల సాధించాలి. -
ముక్కుపుడక తెచ్చిన తంటా!
చెన్నై: మగువుల సౌందర్యాన్ని ఇనుమడింపజేసే ముక్కుపుడక ఓ పెద్దావిడ ప్రాణం మీదికి తెచ్చింది. కేవలం అలంకరణ కోసమే కాకుండా.. మహిళలు సాంప్రదాయకంగా ముక్కు పుడకలు ధరించడం ఆనవాయితీ. అలా పెట్టుకున్న ముక్కుపుడక కాస్త ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. అది కాస్తా ప్రమాదవశాత్తు ఊపిరితిత్తుల్లో చేరి అపాయకరంగా మారిన ఘటన తమిళనాడు మదురై లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వెల్లమ్మాళ్ (78) అనే మహిళ ముక్కు పుడకను తొలగించడానికి బంధువులు ప్రయత్నిచినపుడు పొరపాటున దాని సీల నోట్లోకి జారి, ఊపిరితిత్తుల్లో అడ్డుపడింది. ఆ తర్వాత వారు ఆవిషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె అస్వస్థతకు గురైంది. తీవ్రమైన శ్వాస సమస్యతో గత నెలరోజులుగా ఇబ్బంది పడుతుండటంతో వైద్యులను సంప్రదించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ రే తీసినపుడు బంగారు ముక్కుపుడక స్క్రూ ఎడమ ఊపిరితిత్తిలో నిలిచిపోయినట్టు గమనించారు. ఆమెకు ఊపిరి తీసుకోవడం మరింత ఇబ్బంది కరంగా మారడంతో దాన్ని తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో థొరాసిక్ సర్జరీ ద్వారా నుంచి దానిని తొలగించారు. బ్రాంకో స్కోపీ (శ్వాస నాళ అంతర్దర్శిని) సహాయంతో ఫోర్ సెప్స్‌తో దానిని బయటకు తీసారు. ఆపరేషన్ అనంతరం వెల్లమ్మాళ్ ఆరోగ్యం నిలకడగా ఉందని , సాధారణంగా శ్వాస తీసుకోకలుగుతోందని మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్యులు తెలిపారు. సంక్లిష్టమైన ఈ ఆపరేషన్ కోసం గంట సమయం పట్టిందన్నారు. -
బోరుబావిలో పడ్డ మరో చిన్నారి
బోరుబావులు... పిల్లల పాలిట మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మరో ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ పాడుపడిన బోరు బావిలో పడిన బాలుడు... శ్వాస అందక తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో సహాయక చర్యలు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ ఇమ్రోతా గ్రామానికి చెందిన ఐదేళ్ల నిఖిల్... సుమారు 50 అడుగుల లోతు బావిలో చిక్కుకుపోయాడు. సహాయక చర్యల్లో భాగంగా బాలుడికి ఆక్సిజన్ అందిస్తున్నట్లు ఝాన్సీ పోలీసులు చెబుతున్నారు. బాలుడ్ని సురక్షితంగా బయటకు తీసేందుకు బోరుబావి చుట్టూ 35 అడుగుల వరకూ భూమిని తవ్వుతున్నారు. గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు సమీప పొలాల్లో పని చేస్తుండగా అక్కడే ఆడుకుంటున్న బాలుడు బోరు బావిలో పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. చిన్నారిని రక్షించడానికి సహాయక బృందం తీవ్రంగా కృషి చేస్తోందని, ఈ సాయంత్రానికి సురక్షితంగా బయటకు తీసే అవకాశం ఉందని జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ శుక్లా తెలిపారు. -
లిఫ్టులో చిక్కుకున్న సీఎం, ఆయన భార్య
లక్నో: అసెంబ్లీలో అత్యంత భద్రత మధ్య ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, అతని భార్య డింపుల్ యాదవ్ శుక్రవారం లిఫ్టులో ఇరుక్కుపోయారు. విధాన సభ భవనంలో నిర్వహించిన బాల సంసద్(పిల్లల పార్లమెంట్) కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఊహించని పరిణామంతో పోలీసులు, భద్రతా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎదురు చూస్తున్న ఉన్నతాధికారులు.. అఖిలేష్, డింపుల్ ఎంతకీ రాకపోవడంతో కంగారు పడి సెక్యురిటీని అప్రమత్తం చేశారు. చివరికి లిఫ్టు మధ్యలోనే ఆగిపోయిందని తెలుసుకుని హుటాహుటిన మరమ్మతు చర్యలు ప్రారంభించారు. సుమారు 20 నిమిషాల తరువాత వారిద్దరిని అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. రాష్ట్ర అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రికే చేదు అనుభవం ఎదురవడం చర్చనీయాంశం అయింది. -
తలకు బలమైన గాయం అవడం వల్లే...
-
వరద నీటిలో చిక్కుకున్న జాలర్లు
-
పిల్లిలా మారిపోయిన చిరుతపులి
-
కుక్కర్లో తల పెట్టిన ఐదేళ్ల బాలుడు
-
చోరీకి యత్నించి..ఇరుక్కుపోయాడు!
మేడ్చల్ (రంగారెడ్డి జిల్లా) : ఓ వ్యక్తి మద్యం దుకాణంలో దొంగతనానికి యత్నించి.. ఆనక పైకప్పు రేకుల్లో ఇరుక్కుపోయి, పోలీసులకు చిక్కాడు. ఘటన వివరాల్లోకి వెళ్తే... మేడ్చల్‌కు చెందిన శంకర్ అనే వ్యక్తి బుధవారం రాత్రి స్థానిక రంగసాయి వైన్స్‌లో దొంగతనానికి యత్నించాడు. మద్యం దుకాణం పైకప్పు రేకులకు రంధ్రం చేసి లోపలికి దూరేందుకు యత్నించాడు. ఆ క్రమంలో అతడు రంధ్రంలోనే ఇరుక్కుపోయాడు. పైకి రాలేక, కిందికి దిగలేక రాత్రంతా అవస్థలు పడుతూనే ఉన్నాడు. గురువారం ఉదయం కేకలు వేస్తుండటంతో అటుగా వెళ్లేవారు అతనిని గమనించి, దుకాణం యజమానికి తెలిపారు. ఆయన వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అంతా కలసి శంకర్‌ను రక్షించారు. అయితే రేకులు చీరుకుపోయి ఒళ్లంతా గాయాలైన శంకర్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ శశాంకరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సాదాసీదాగా జెడ్పీ ‘స్థాయి’ సమావేశాలు
కోరం లేక ‘ఒకటి’ వాయిదా కనీస గుర్తింపు లభించడం లేదని సభ్యుల ఆవేదన హన్మకొండ : జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు బుధవారం హన్మకొండలోని జిల్లా ప్రజా పరిషత్ కా ర్యాలయంలో జరిగాయి. ఏడు స్థాయి సంఘాలకుగాను ఆరుస్థాయి సంఘాలు యథావిధిగా కొన సాగారుు. కాగా చివరిగా జరుగాల్సిన ఒకటో స్థారుు సంఘం సమావేశం కో రం లేకపోవడంతో ఒకటవ స్థాయి సంఘం సమావేశం వా యిదా వేస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ గద్దలపద్మ ప్రకటించా రు. ఈ స్థాయి సంఘంలో కోరంకు అయిదుగురు జెడ్పీటీసీ సభ్యులు అవసరం కాగా నలుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మూలగుండ్ల వెంకన్న తో పాటు పలువురు జెడ్పీటీసీ సభ్యులు కార్యాలయం అవరణలో ఉన్నా సమావేశానికి హాజరు కాలేదు. ఒకటో స్థారుు సంఘంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దలపద్మ, రాష్ట్ర గిరిజన సంక్షే మశాఖ మంత్రి ఆజ్మీర చందూలాల్, ఎంపీ ప్రొఫెసర్ ఆజ్మీర సీతారాం నాయక్, ఎమ్మెల్యే లు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు స్వామి నాయక్, పా లకుర్తి సారంగపాణి, జాటోత్ కమలాకర్, వేముల స్వప్న, మూలగుండ్ల వెంకన్న, లేతాకుల సంజీవ రెడ్డి, బానోత్ విజయబాయి, బాకి లలిత సభ్యులుగా ఉన్నారు. ఇందులో జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు సభ్యులు కమలాకర్,విజయబా యి, లలిత మాత్రం రిజిస్టర్లో సంతకా లు చేశారు. కోరంకు మరో సభ్యుడు అవసరం కాగా ఫోన్లో సభ్యులను సంప్రదించారు. వాయిదా వేసిన అనంతరం పాలకుర్తి సారంగపా ణి చేరుకున్నారు. మిగతా సభ్యులు సమావేశానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మూల గుండ్ల వెంకన్న జెడ్పీ అవరణలో విలేకరులతో మాట్లాడుతూ జెడ్పీటీసీ సభ్యులకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, నిధుల సమాచారం చెప్ప డంలేదని, ప్రతిపాదనలు తీసుకురావాలని చెప్పుతూ పను లు కేటాయించడం లేదని ఆరోపించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చేసిన తీర్మాణాలు పట్టించుకోవడం లేదని వాపోయూరు. ఏ విషయం చైర్పర్సన్ , అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మంత్రి చెపితేనే చేస్తామని చెపుతున్నారని ఆరోపించారు. ఇందుకు నిరసనగానే తాము ఒక టోస్థారుు సంఘ సమావేశాన్ని బహిష్కరించినట్లు చెప్పా రు. ఈ ఆరోపణలను జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ కొట్టి పా రేశారు.కాగాఅంతకు ముందు 2,3,4,5,6,7వ స్థాయి సం ఘాల సమావేశాలు సాదాసీదాగా నడిచాయి. సమావేశంలో జెడ్పీ సీఈఓ అనిల్‌కుమార్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఆస్తుల పంపకం 3 నెలలు వాయిదా
-
ఆర్టీసీ ఆస్తుల పంపకం 3 నెలలు వాయిదా
షీలాభిడేతో ఆర్టీసీ అధికారుల భేటీ ఎటూ తేలకుండానే ముగిసిన సమావేశం జూలైకల్లా బోర్డు భేటీ జరిపి.. తీర్మానం కాపీ అందించాలన్న షీలాభిడే కమిటీ గడువు ఆగస్టు వరకు పెంపు? హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ఆస్తుల పంపకాల వ్యవహారం మరో మూడు నెలలు వాయిదా పడింది. ఆర్టీసీ విభజనపై ఏర్పాటు చేసిన ిషీలాభిడే కమిటీకి కేంద్రప్రభుత్వం విధించిన గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని పరిశ్రమల భవన్లో ఆర్టీసీ యాజమాన్యం హడావుడిగా ిషీలాభిడేతో సమావేశమైంది. ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, జేఎండీ రమణారావు, ఈడీలు ఇందులో పాల్గొన్నారు. అయితే ఉమ్మడిగా ఆర్టీసీ బోర్డు సమావేశం జరిపి తీర్మానం చేయకుండా ఆస్తుల విభజన తేలదని ిషీలాభిడే స్పష్టం చేశారు. దీంతో ఆర్టీసీ ఆస్తుల పంపకం వ్యవహారంపై ఎటూ తేలకుండానే ఈ భేటీ ముగిసింది. ఆర్టీసీ బోర్డులో తెలంగాణకు సరైన ప్రాతినిధ్యం లేదని అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో ఉమ్మడి బోర్డు సమావేశం రద్దయిందని అధికారులు ిషీలాభిడేకు ఈ సందర్భంగా తెలిపారు. బోర్డు సమావేశం వాయిదా వేసుకోవాలని కేంద్రప్రభుత్వం కూడా ఆదేశాలిచ్చిన విషయాన్ని వివరించారు. ిషీలాభిడే స్పందిస్తూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై ఆర్డర్ కాపీ ఉందా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ అధికారులు కేంద్రప్రభుత్వ ఉత్తర్వులను అందజేశారు. దీంతో జూలై నెలాఖరు కల్లా ఆర్టీసీ బోర్డు సమావేశాన్ని నిర్వహించి, ఆస్తుల పంపకంపై తీర్మానం చేసి ఆ కాపీని అందివ్వాలని షీలాభిడే వారిని ఆదేశించారు. ఆస్తుల పంపకానికి మరో 3 నెలల గడువు కావాలని ఏపీ అధికారులు ిషీలాభిడేను కోరినట్లు సమాచారం. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ఆస్తుల విభజన మరో 3 నెలలు వాయిదా పడిం ది. కాగా ఆర్టీసీ యాజమాన్యం తమ కమిటీకి అందించిన సంస్థ లెక్కల నివేదికల్లో కొన్ని మార్పులను ిషీలాభిడే సూచిం చినట్లు తెలిసింది. తప్పులను వెంటనే సరిచేయాలని ఆదేశాలిచ్చారు. కాగా కేంద్రం ిషీలాభిడే కమిటీ గడువును ఆగస్టు వరకు పొడిగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
గోదావరిలో అకస్మాత్తుగా ఆగిపోయిన లాంచీ
-
‘108’ సమ్మె వాయిదా !
కొలిక్కిరాని ఉద్యోగులు, జీవీకే మధ్య చర్చలు హైదరాబాద్: 108 వైద్య సర్వీసుల ఉద్యోగుల సంఘం, జీవీకే ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. కార్మిక శాఖ కమిషనర్ అజయ్ సమక్షంలో శుక్రవారం జరిగిన చర్చల్లో ఏమీ తేలక పోవడంతో తిరిగి ఈ నెల 13న సాయంత్రం 4 గంటలకు మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించారు. దీంతో 108 వైద్య సర్వీసుల ఉద్యోగుల సమ్మె 13వ తేదీకి వాయిదా పడింది. ఆ రోజు చర్చలు సఫలం కాకపోతే అదే రోజు అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని 108 ఉద్యోగుల ప్రతినిధులు స్పష్టం చేశారు. కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగ సంఘం ప్రతినిధులు, జీవీకే ప్రతినిధులతో కార్మిక శాఖ కమిషనర్ అజయ్ శుక్రవారం చర్చలు జరిపారు. ఉద్యోగుల సంఘం తరఫున షబ్బీర్ అహ్మద్, జూపల్లి రాజేందర్, మామిడి నారాయణ, రూప్సింగ్, అశోక్, మహేందర్‌రెడ్డి, జీవీకే తరఫున బ్రహ్మానందరావు, శ్రీరామచంద్రరాజు పాల్గొన్నారు. -
‘108’ సమ్మె ఒక రోజు వాయిదా
హైదరాబాద్: ‘108’ ఉద్యోగులు తమ సమ్మెను ఒక రోజు వాయిదా వేసుకున్నారు. కార్మికశాఖ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు చర్చలకు ఆహ్వానించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ 108 ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు పల్లి అశోక్ చెప్పారు. తమ సలహాదారు ప్రొఫెసర్ కోదండరాం సూచన మేరకు తామీ నిర్ణయం తీసుకున్నామన్నారు. చర్చల్లో కార్మికశాఖ అధికారులు, జీవీకే, 108 ఉద్యోగ ప్రతినిధులు పాల్గొంటారు. మరోవైపు జీవీకే యాజమాన్యంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జ్యోతిబుద్ధ ప్రకాష్ గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల డిమాండ్లపై తీసుకుంటున్న చర్యలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. 108 అంబులెన్స్ వాహనాలను నడిపేందుకు డ్రైవర్లను, సాంకేతిక నిపుణులను ఏర్పాటు చేసినట్లు జీవీకే పేర్కొందన్నారు. వేతనాలు పెంచే అవకాశాలను పరిశీలించాలని తాము యాజమాన్యాన్ని కోరినా ఎలాంటి స్పందన రాలేదన్నారు. వేతనాలు పెంచాలంటే ప్రభుత్వం ‘108’ వాహనాల నిర్వహణ ఖర్చులను పెంచాల్సి ఉం టుందన్న చర్చ జరుగుతోంది. ఒక్కో వాహనానికి నెలకు రూ. 1.30 లక్షల చొప్పున జీవీకేకు ప్రభుత్వం అందజేస్తుంది. అందులో రూ. 77 వేలు ఉద్యోగుల వేతనాలకే వెళ్తున్నాయి. నిర్వహణ సొమ్మును పెంచాలని జీవీకే ప్రతిపాదిస్తే సీఎం దృష్టికి తీసుకెళ్లేవాళ్లమని ఒక అధికారి పేర్కొన్నారు. తీసేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోబోం గతంలో వివిధ రకాల కేసుల్లో తీసేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలన్న ఉద్యోగుల డిమాండ్‌ను తాము అంగీకరించబోమని జీవీకే-ఈఎంఆర్ఐ ఆపరేషన్స్ రాష్ట్ర అధిపతి పి.బ్రహ్మానందరావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. 2011లో చేసుకున్న ఒప్పందం ప్రకారం వేతనాలను 10 శాతం అమలు చేస్తున్నామన్నారు. సమ్మె నోటీసులో పేర్కొన్న డిమాండ్లలో రెండింటిని మినహాయించి మిగిలినవాటిపై యాజమాన్యం సానుకూలంగా ఉందన్నారు. కార్మికశాఖ నిర్వహించే చర్చలు సఫలం కాకుంటే ‘108’ సర్వీసులను నడిపించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
లిఫ్ట్‌లో చిక్కుకున్న హోంమంత్రి, డిప్యూటీ సీఎం
-
అధికారుల హత్య కేసు విచారణ వాయిదా
తిరుపతిలీగల్: రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఫారెస్టు అధికారుల హత్య కేసు విచారణను తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి బి.రవీంద్రబాబు శని వారం వాయిదా వేశారు. 2013 డిసెంబర్ 15వ తేదీ ఎర్రచందనం దుంగల అక్రమరవాణాను అడ్డుకోబోయిన తిరుమల డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎన్ఆర్ శ్రీధర్, తిమ్మినాయుడుపాళ్యం బీట్, అసిస్టెంట్బీట్ ఆఫీసర్ ఎన్.డేవిడ్ కరుణాకర్ మామండూరు రిజర్వు ఫారెస్టులో హత్యకు గురయ్యారు. మరో ఫారెస్టు అధికారిపై ఎర్రకూలీలు హత్యాయత్నంకు పాల్పడ్డారు. దీనిపై ఎస్వీ నేషనల్ పార్కు ఎఫ్ఆర్వో రామలానాయక్ రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 430 మంది ఎర్రకూలీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో 351 మందిని పోలీసులు అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురు కేసు దర్యాప్తు దశలో మృతిచెందారు. ఇద్దరు మైనర్లు కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వారిపై జువైనల్ కోర్టులో కేసు విచారణ జరగాల్సి ఉంది. తమిళనాడుతోపాటు రాష్ట్రానికి చెందిన 351 మంది ఎర్రకూలీలను ఇదివరలో నెల్లూరు, కడప, రాజమండ్రి, చిత్తూరు, తిరుపతి జైళ్లలో పోలీసులు ఉంచారు. శనివారం కేసు వాయిదా ఉండడంతో పోలీసులు తిరుపతి జైలులో 188 మందిని, పీలేరు జైలులో 90 మందిని, శ్రీకాళహస్తి జైలులో 60 మందిని ఉంచి కోర్టులో హాజరుపరిచారు. మిగతా ఇద్దరిపై పీడీయాక్టు కింద కేసు నమోదు కావడంతో ఇద్దరినీ ప్రత్యేకంగా రాజమండ్రి జైలునుంచి పోలీసులు తీసుకువచ్చారు. 11 మందికి రాష్ట్ర హైకోర్టు వివిధ కారణాలతో ఇదివరలో బెయిల్ మంజూరు చేసింది. శనివారం 11 మంది కూడా కోర్టుకు హాజరయ్యారు. పిటిషన్దాఖలు చేసిన ఏపీపీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారు అధిక సంఖ్యలో నిందితులుగా ఉన్నారు. వారి సమక్షంలో కేసు విచారణ జరగాల్సి ఉన్నందున కోర్టు భవనం విచారణకు సరిపోవడం లేదు. కాబట్టి వేరే ప్రదేశంలో కేసు విచారణ చేపట్టాలని కోర్టును కోరుతూ జిల్లా డెప్యూటీ డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్, ఆ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీసీ రాజేంద్రకుమార్ శనివారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఏపీపీ, నిందితుల తరపున్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ పిటిషన్‌పై ఉత్తర్వులు జారీ చేయడానికి న్యాయమూర్తి ఈ నెల ఐదో తేదీకి వాయిదా వేశారు. కేసులో 64 మంది సాక్షులు ఉన్నారు. ట్రాన్స్‌లేటర్ నియామకం కేసులో అధిక సంఖ్యలో తమిళనాడుకు చెందినవారు నిందితులుగా ఉండడంతో కేసువిచారణ తదితర విషయాలు కోర్టుకు సహకరించడానికి ఎస్వీయూనివర్సిటీ తమిళవిభాగం ప్రొఫెసర్ జె.మేన్యూల్ను ట్రాన్స్‌లేటర్‌గా న్యాయమూర్తి నియమించారు. కేసు విచారణలో అన్నివిధాల కోర్టుకు సహకరించాలని న్యాయమూర్తి ప్రొఫెసర్‌కు సూచించారు. మొత్తం కేసు విచారణను న్యాయమూర్తి ఈనెల 9వ తేదీకి వాయిదా వేశారు. కే సు విచారణకు అనువైన భవనం దొరికిన తర్వాత కేసు విచారణ షెడ్యూల్‌ను 9వతేదీ ప్రకటించే అవకాశం ఉంది. కట్టుదిట్టమైన భద్రత తిరుపతి కోర్టు ఆవరణలో శనివారం పోలీసులతో నిండిపోయింది. 351 మంది ఎర్రకూలీలకు ఒక్కో కూలీకి ఒక్కో పోలీసును పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, ఏఆర్ పోలీసు డీఎస్పీ లియాజ్బాషా, కోర్టు మానటరింగ్ సిస్టమ్ సీఐ జగన్మోహన్రెడ్డి, ఎఎస్ఐ శ్రీరాములు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. 351 మందిపై ఐపీసీ 302, 307, 332, 147, 148, 333, 120 (బి)తో పాటు ఫారెస్టు చట్టం కింద కేసు విచారణ జరగబోతోంది. బంధువుల నిరీక్షణ జ్యుడిషియల్ కస్టడీ నుంచి కేసు విచారణకు నిందితులను హజరుపరుస్తున్నారన్న విషయం తెలుసుకున్న నిందితుల భార్యలు, పిల్లలు, బంధువులు వారి కోసం వేచి చూడడం కనబడింది. వారిని అదుపు చేయడానికి పోలీసులు ప్రత్యేకంగా మహిళా పోలీసులను ఏర్పాటు చేశారు. నిందితులతో కలసి మాట్లాడాలనే ప్రయత్నం మహిళలు చేయడం కనబడింది. -
ఎమ్మెల్యే రమేశ్ పౌరసత్వం కేసు నేటికి వాయిదా
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కేసు సుప్రీంకోర్టులో గురువారానికి వాయిదా పడింది. రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని 2009 ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్ గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రమేశ్ ఎన్నిక చెల్లదని హైకోర్టు గతేడాది తీర్పునివ్వగా రమేశ్ సుప్రీంకోర్టు ద్వారా స్టే పొందారు. స్టే వెకేట్ చేయాలని ఆది శ్రీనివాస్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ ఉండగా, బెంచ్‌పై దీనికి ముందు కేసు విచారణ సాయంత్రం వరకు కొనసాగింది. దీంతో రమేశ్ కేసును గురువారం విచారణకు స్వీకరించనున్నట్లు ధర్మాసనం ప్రకటించిందని ఆది శ్రీనివాస్ వెల్లడించారు. -
టీఆర్ఎస్ ప్లీనరీ వాయిదా
-
టీఆర్ఎస్ ప్లీనరీ వాయిదా?
తుపాను నేపథ్యంలో కేసీఆర్ యోచన హైదరాబాద్: టీఆర్ఎస్ ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ, బహిరంగ సభలను వాయిదా వేయాలని యోచిస్తోంది. అల్పపీడనం వల్ల ఆ రెండు రోజుల్లోనే భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని వాతావరణ శాఖ నుంచి వస్తున్న సమాచారంతో ఈ సమావేశాలను వాయిదా వేయాలని పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. భారీ వర్షాలుంటే ప్లీనరీ సమావేశం నిర్వహణకు ఇబ్బందులు వస్తాయని, బహిరంగ సభ నిర్వహణ సాధ్యం కాదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ రెండ్రోజుల్లో నిర్వహించాల్సిన సమావేశాలను వాయిదా వేయాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. బుధవారం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ప్లీనరీ, సభ వాయిదాపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. గురువారం వచ్చే వాతావరణ నివేదికలను బట్టి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. వేదికపై 210 మంది: ప్లీనరీ వేదికను 210 మంది కూర్చోవడానికి వీలుగా నిర్మిస్తున్నారు. వేదికకు సంబంధించిన ఏర్పాట్లను కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి, పూల రవీందర్ తదితరులు ఎల్బీ స్టేడియంలో బుధవారం పరిశీలించారు. దాదాపు 30 వేల మంది హాజరయ్యే ఈ ప్రతినిధుల సభకు నిజాం కాలేజీ మైదానంలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. భోజన ఏర్పాట్లను ఫుడ్ కమిటీ చైర్మన్, ఎంపీ జితేందర్ రెడ్డి పరిశీలించారు. కాగా, ప్లీనరీలో తీర్మానాలకు సంబంధించిన అంశాలపై తీర్మానాల కమిటీ... చైర్మన్ కె.కేశవరావు నివాసంలో బుధవారం సమావేశమైంది. ప్లీనరీలో 30 తీర్మానాలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. -
బేగంపేటలో లిఫ్ట్ లో ఇరుక్కున్న కేటీఆర్!
-
బేగంపేటలో లిఫ్ట్ లో ఇరుక్కున్న కేటీఆర్!
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ లు ఓ లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. బేగంపేటలోని వరుణ్ మోటార్స్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ లిఫ్ట్ లో కిందికి దిగుతుండగా మూడవ ఫ్లోర్ లోని లిఫ్ట్ స్తంభించింది. దాంతో వరుణ్ మోటార్స్ సిబ్బంది, కేటీఆర్ అంగరక్షకులు ఆందోళనకు లోనయ్యారు. సుమారు 5 నిమిషాలపాటు కేటీఆర్, బాల్క సుమన్ తోపాటు మరికొంతమంది లిఫ్ట్ లో చిక్కుకుపోయారు. సిబ్బంది లిఫ్ట్ బాగు చేసి మూడవ ఫ్లోర్ లోకి పంపించారు. ఆతర్వాత మూడవ ఫ్లోర్ నుంచి ఆయన అంగరక్షకులు క్షేమంగా కిందకి తీసుకురావడంతో వరుణ్ మోటార్స్ నిర్వాహకులు, ఇతర సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. వరుణ్ మోటార్స్ కంపెనీలో ఓ కొత్త కారును కేటీఆర్ ఆవిష్కరించినట్టు సమాచారం. -
నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
-
రాత్రికి రాత్రే మార్పులు చేయడం అసాధ్యం!
న్యూఢిల్లీ:యూపీఎస్సీపై ప్రతిపక్షాలు లేవనెత్తిన ఆందోళనకు ఇక్కడతో ముగింపు పలకాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయకుండా యూపీఎస్సీఅర్హత పరీక్ష జరగడానికి ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు విన్నవించారు. దీనిపై గురువారం లోక్ సభలో ప్రసంగించిన ఆయన.. ఈ సమస్యకు భవిష్యత్తులో తగిన పరిష్కారం కనుగొనేందుకు యత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 'ఆగస్టు 24 వ తేదీన యూపీఎస్సీ పరీక్ష జరుగనుంది. ఇప్పుడు ఈ వివాదం సరికాదు. ఈ తాజా గందరగోళంతో విద్యార్థులను మరింత ఆందోళనలోకి నెట్టవద్దు.'అని తెలిపారు. 2014లో యూపీఎస్సీ పరీక్షా విధానంపై విద్యార్థులు గళం విప్పారు. ముంగానే ఈ పరీక్షా విధానం ఖరారైంది. రాత్రికి రాత్రి మార్పులు తీసుకురావడం అసాధ్యం'అంటూ తనదైన శైలిలో వెంకయ్య తెలిపారు. అయితే సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ నెల 24న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసేందుకు మాత్రం సుముఖత చూపలేదు. గత వారం రోజులుగా సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న యూపీఎస్సీ వివాదంపై మంగళవారం రాజ్యసభ అట్టుడికింది. ఈ అంశంపై సత్వరమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. -
యూపీఎస్సీ వివాదంపై అఖిలపక్షం!
విపక్షాల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు నో న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ నెల 24న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసేందుకు మాత్రం సుముఖత చూపలేదు. గత వారం రోజులుగా సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న యూపీఎస్సీ వివాదంపై మంగళవారం రాజ్యసభ అట్టుడికింది. ఈ అంశంపై సత్వరమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రశ్నోత్తరాల సమయం పూర్తయిన వెంటనే విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. మెరిట్ నిర్ధారణలో ఇంగ్లిష్ మార్కులను పరిగణనలోకి తీసుకోబోమంటూ సోమవారం సిబ్బంది, శిక్షణ శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ ప్రకటన సమస్యను మరింత సంక్లిష్టం చేసిందని విమర్శించాయి. ప్రజా సమస్యలు, ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత పోరు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఈ అంశాన్ని సాగదీస్తోందని కాంగ్రెస్ సభ్యుడు ప్రమోద్‌తివారీ ఆరోపించారు. మరిం త చర్చ జరగాల్సి ఉన్నందున ఈ సమస్యపై ఆగస్టు 24లోగా పరిష్కారం సాధ్యం కాదని టీఎంసీ సభ్యుడు డెరిక్ఒబ్రీన్ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ అంటే లోహే కా పేఢ్.. సివిల్స్ ప్రశ్నపత్రంలోని అనువాద లోపాలను ఎస్పీ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ ఎత్తి చూపారు. ‘నార్త్ పోల్’ను హిందీలో ‘ఉత్తరీ ఖంభా’ అని, ‘స్టీల్ ప్లాంట్’ను ‘లోహే కా పేఢ్’ అని అనువదించారన్నారు. ఈ అంశంపై అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ సూచనకు పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి ప్రకాశ్ జవదేకర్ ‘తప్పకుండా అఖిలపక్ష భేటీ ఉంటుంది. అవసరమైతే అలాంటి సమావేశాలను మరికొన్నింటిని నిర్వహిస్తాం’ అని స్పష్టం చేశారు. ‘ఇది సున్నితమైన అంశం. పరీక్షావిధానంలో భారీ మార్పులు అవసరమా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ అన్నారు. ‘ఈ అంశంపై అన్ని పార్టీలు ఇప్పటికే తమ అభిప్రాయాలను తెలిపాయి. వాటి ఆధారంగా నిర్ణయం తీసుకోకుండా మళ్లీ అఖిలపక్ష భేటీ ఏంటీ?’ అని సీపీఎం సభ్యుడు సీతారాం యేచూరి ప్రశ్నించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎస్పీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. కాగా, సివిల్స్ ప్రశ్నాపత్రంలో ఆంగ్లం నుంచి హిందీకి చేసిన అనువాదంలో తప్పులేం లేవని ప్రభుత్వం ప్రకటించింది. -
ట్రెయిన్ కదలడంతో అక్కడికక్కడే మృతి