చాలామందికి ఫిట్‌గా ఉండటానికి ప్రాధాన్యతిస్తారు. దీని కోసం డైట్ ఫాలో అవడం, జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం చేస్తుంటారు. లేదా ఇంట్లోనే చిన్నసైజ్ జిమ్‌ను ఏర్పాటు చేసుకొని ప్రాక్టిస్ చేస్తుంటారు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు ఎక్సర్‌సైజ్ చేస్తే కండరాలు పట్టుకోవడం, బ్యాలెన్స్ తప్పడంలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి.
అలాంటి ఓ షాకింగ్ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఓహియాకు చెందిన క్రిస్టిన్ ఫాల్డ్స్ అనే మహిళ తెల్లవారు జామున 3గంటలకు ఒంటరిగా ఇంట్లోని జిమ్‌లో ఇన్వర్షన్ టేబుల్ అనే ఎక్విప్‌మెంట్‌పై వర్కౌట్స్ చేస్తోంది. వెన్నెముక, నడుమునొప్పి తగ్గేందుకు దీనిని ఉపయోగించి ఎక్సర్‌సైజ్ చేస్తుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అప్పుడే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఉన్నట్టుండి మహిళ ఇన్వర్షన్ టేబుల్‌పై తలకిందులైంది. కాళ్లు అందులో ఇరుక్కుపోవడంతో ఎంత ప్రయత్నించినా తిరిగి మామూలు స్థితికి రాలేకపోయింది.
చదవండి: వీడియో వైరల్ చేద్దామనుకున్నాడు.. పాపం తానే వైరల్ అయ్యాడు
సాయం కోసం జిమ్‌లో జాసన్ అనే మరో వ్యక్తిని పిలిచినా భారీ సౌండ్‌తో మ్యూజిక్ ప్లే అవుతుండటం వల్ల అతనికి వినిపించలేదు. పైకి లేవలేక, బయటకు రాలేక అలాగే ఇబ్బంది పడింది. కాసేపు ఏం చేయాలో తోచలేదు. వెంటనే ఆమెకు ఓ ఉపాయం తట్టింది. తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ ఉపయోగించి ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేసింది. తన పరిస్థితిని వివరించి, సాయం కావాలని కోరింది. స్పందించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని తలకిందులుగా ఉన్న ఆమెను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్వయంగా ఆమెనే టిక్‌టాక్‌లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'This is so embarrassing' — A woman went viral after getting stuck upside down on an exercise machine and calling 911 for help 😅 pic.twitter.com/8nod8P6oQl
— NowThis (@nowthisnews) September 5, 2022
Comments
Please login to add a commentAdd a comment