Gym equipment
-
ఫిట్నెస్ కోసం హోం జిమ్!
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో వివిధ అంశాలపై స్పందిస్తూ నెటిజన్లకు ఆసక్తి కలిగిస్తుంటారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌కు చాలామంది ప్రాధాన్యం ఇస్తారు. అందుకు జిమ్‌కు వెళ్లాలని అనుకుంటారు. కానీ ప్రత్యేకంగా జిమ్‌కు వెళ్లకుండా ఒకే పరికరంతో ఇంట్లోనే ఆ అనుభూతిని పొందుతూ ఫిట్‌గా ఉండొచ్చంటూ మహీంద్రా తెలిపారు. అందుకు సంబంధించి ఇటీవల ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అరొలీప్ అనే సంస్థ ద్వారా ఈ పరికరాన్ని నలుగురు ఐఐటీ విద్యార్థులు తయారు చేసినట్లు మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.Home gym created by 4 IIT grads. No rocket science here.But a clever convergence of mechanics & physical therapy principles to design a product that has global potential. In small apartments & even in Business Hotel rooms! Bravo! pic.twitter.com/Tz1vm1rIYN— anand mahindra (@anandmahindra) October 24, 2024ఇదీ చదవండి: ఏడేళ్ల తర్వాత రిలయన్స్ గుడ్‌న్యూస్‘ఈ హోమ్ జిమ్ పరికరాన్ని నలుగురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు తయారు చేశారు. ఇదేమంతా రాకెట్ సైన్స్ కాదు. ఈ పరికరాన్ని చిన్న అపార్ట్మెంట్లు, హోటల్ రూమ్‌ల్లో, చిన్న ఇళ్లల్లోనూ వినియోగించేలా ఏర్పాటు చేశారు. మెకానిక్స్, ఫిజికల్ థెరపీను అనుసందానిస్తూ దీన్ని తయారు చేయడం నిజంగా గొప్ప విషయం’ అని మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ కంపెనీలో స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా సీఈవో నితిన్ కామత్ కూడా ఇన్వెస్ట్ చేసినట్లు వీడియో ద్వారా తెలిసింది. ఇందులో ఏఐ ఆధారిత ట్రెయినింగ్ సెషన్లు కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
‘జిమ్’లో వర్కౌట్ చేయమంటే వీళ్లేంది ఇలా చేశారు!
వ్యాయామం చేసేందుకు చాలా మంది జిమ్‌కి వెళ్తుంటారు. అక్కడ ఉండే వాటిని ఒకరి తర్వాత ఒకరు వినియోగిస్తుంటారు. ఇద్దరు ఒకేసారి కావాలనుకుంటే ఎవరైనా ఒకరు తప్పుకోక తప్పదు. ఈ క్రమంలో ఎవరైనా సహనం కోల్పోతే ఇక అంతే.. అది కొట్టుకునే వరకు దారితీస్తుంది. అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలు వెయిట్ లిఫ్ట్ పరికరాల కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఓ మహిళ వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండగా మరో మహిళ తన వంతు కోసం ఎదురు చూస్తోంది. ఆమె అక్కడి నుంచి వెళ్లగానే తాను ఆ వర్కౌట్ చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే మరో మహిళ వెనకాల నుంచి వచ్చి ఆమెను తోసేసి వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్ చేయబోయింది. ఈ క్రమంలో ఇరువురు ఒక్కసారిగా గొడవకు దిగారు. నువ్వెంతంటే నువ్వెంత అంటూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. వారిని చూసి అక్కడే ఉన్న ఓ యువతి భయంతో పరుగులు పెట్టింది. మరో మహిళ వచ్చి వారిని విడిపించే ప్రయత్నం చేసింది. అయితే, ఈ కొట్లాటలో ఎవరికైనా గాయాలయ్యాయా అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. జిమ్‌లో పరికరాల కోసం కొట్టుకున్న ఈ సంఘటనపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ఈ ఫైట్ ద్వారా చాలా కేలరీలు కరిగిపోయాయి అని ఓ నెటిజన్ పేర్కొనగా.. దృఢమైన జుట్టు కోసం గొప్ప వర్కౌట్ అంటూ మరొకరు రాసుకొచ్చారు. ఇలాంటిదే.. జిమ్‌లో మ్యూజిక్ విషయంలో జరిగిన గొడవలో ఓ మహిళను పొడిచి చంపిన సంఘటన ఢిల్లీలో ఈ ఏడాది మార్చిలో జరిగింది. Kalesh Inside GYM for Smith Machine pic.twitter.com/KXy6v9UyWj — r/Bahar Ke Kalesh (@Baharkekalesh) October 9, 2022 ఇదీ చదవండి: రన్నింగ్ ట్రైన్ ఫుట్‌బోర్డుపై ఆయుధాలతో వీరంగం.. ఆకతాయిలు ఆట కట్ -
Viral: జిమ్‌లో వర్కౌట్ చేస్తూ తలకిందులుగా ఇరుక్కుపోయిన మహిళ
చాలామందికి ఫిట్‌గా ఉండటానికి ప్రాధాన్యతిస్తారు. దీని కోసం డైట్ ఫాలో అవడం, జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం చేస్తుంటారు. లేదా ఇంట్లోనే చిన్నసైజ్ జిమ్‌ను ఏర్పాటు చేసుకొని ప్రాక్టిస్ చేస్తుంటారు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు ఎక్సర్సైజ్ చేస్తే కండరాలు పట్టుకోవడం, బ్యాలెన్స్ తప్పడంలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి ఓ షాకింగ్ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఓహియాకు చెందిన క్రిస్టిన్ ఫాల్డ్స్ అనే మహిళ తెల్లవారు జామున 3గంటలకు ఒంటరిగా ఇంట్లోని జిమ్‌లో ఇన్వర్షన్ టేబుల్ అనే ఎక్విప్‌మెంట్‌పై వర్కౌట్స్ చేస్తోంది. వెన్నెముక, నడుమునొప్పి తగ్గేందుకు దీనిని ఉపయోగించి ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అప్పుడే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఉన్నట్టుండి మహిళ ఇన్వర్షన్ టేబుల్‌పై తలకిందులైంది. కాళ్లు అందులో ఇరుక్కుపోవడంతో ఎంత ప్రయత్నించినా తిరిగి మామూలు స్థితికి రాలేకపోయింది. చదవండి: వీడియో వైరల్ చేద్దామనుకున్నాడు.. పాపం తానే వైరల్ అయ్యాడు సాయం కోసం జిమ్‌లో జాసన్ అనే మరో వ్యక్తిని పిలిచినా భారీ సౌండ్‌తో మ్యూజిక్ ప్లే అవుతుండటం వల్ల అతనికి వినిపించలేదు. పైకి లేవలేక, బయటకు రాలేక అలాగే ఇబ్బంది పడింది. కాసేపు ఏం చేయాలో తోచలేదు. వెంటనే ఆమెకు ఓ ఉపాయం తట్టింది. తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ ఉపయోగించి ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేసింది. తన పరిస్థితిని వివరించి, సాయం కావాలని కోరింది. స్పందించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని తలకిందులుగా ఉన్న ఆమెను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్వయంగా ఆమెనే టిక్‌టాక్‌లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'This is so embarrassing' — A woman went viral after getting stuck upside down on an exercise machine and calling 911 for help 😅 pic.twitter.com/8nod8P6oQl — NowThis (@nowthisnews) September 5, 2022 -
‘దెయ్యాల పనే అంటారా?!’
లక్నో: ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోను చూస్తే.. ఒక్క క్షణం మనకు కూడా నిజంగానే దెయ్యాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇంతకు ఈ వీడియోలో ఏం ఉందంటే.. ఓ పార్కులోని జిమ్ పరికరం దానంతట అదే కదులుతుంది. దాని చుట్టూ చేరిన పోలీసులు ఈ అసాధరణ విషయాన్ని వీడియో తీయడంలో నిమగ్నమయ్యారు. నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. నెటిజనులు దీని గురించి రకరకాల వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఎక్కువ మంది మాత్రం ‘మానవ ప్రయత్నం లేకుండా ఈ పరికరం కదులుతుంది అంటే ఖచ్చితంగా ఇది దెయ్యాల పనే’ అంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ వార్తలు జోరుగా షికారు చేస్తుండటంతో ఝాన్సీ పోలీసులు రంగంలోకి దిగారు. ఇలా జరగడానికి గల కారణాన్ని వివరించారు. Fitness freak ghost 👻?@jhansipolice got a tip off about an open gym being used by ghosts!Team laid seige & soon found t real ghosts-Some mischievous person made video of moving swing & shared on #socialmedia. Miscreants will b hosted in a ‘haunted’ lockup soon #NoHostForGhost pic.twitter.com/JUaYt4IJMS — RAHUL SRIVASTAV (@upcoprahul) June 12, 2020 ‘ఓ పార్కులోని జిమ్ పరికరం దానంతట అదే కదులుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఝాన్సీ పోలీసులు ఇందుకు గల కారణాన్ని కనుగొన్నారు. గ్రీజు ఎక్కువ కావడంతో ఆ పరికరం దానంతట అదే కదులుతుంది. ఇది దెయ్యాల పని కాదు. దయచేసి ఇలాంటి పుకార్లను ప్రచారం చేయకండి ’అంటూ ఝాన్సీ పోలీసులు ట్వీట్ చేశారు. అసలు కారణం తెలియడంతో జనాలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. तेजी से वायरल हो रहे वीडियो जिसमें झूला अपने आप झूलता हुआ दिखाई दे रहा है, सत्यता की जाँच @COCityjhansi द्वारा मौके पर जाकर की गयी तो झूले में अधिक ग्रीस लगे होने से एक बार हिला देने पर कुछ समय तक हिलता रहता है। आप सभी से अपील है कि भूत आदि होने की अफ़वाह न फैलाएं #FakeNewsAlert pic.twitter.com/kvqpQCMCSv — Jhansi Police (@jhansipolice) June 13, 2020 -
బొజ్జ బాగోతం
సిరిసంపదలకు చిరుబొజ్జే ఆనవాలు అనే నమ్మకం నానా నాగరికతల్లో అనాదిగా ఉన్నదే. తరాలు మారినా, యుగాలు మారినా ఈ నమ్మకంలో పెద్దగా మార్పు రాలేదు. అలాగని ఇదేమీ మూఢనమ్మకంలాంటిది కాదు. సిరిసంపదలకు అనులోమానుపాతంగా ‘మగా’నుభావుల పొట్టపెరగడం ఒక సహజ పరిణామం. కొందరు పుడుతూనే నోట్లో వెండిచెమ్చాతో పుడతారు. వాళ్లకు బాల్యావస్థలోనే బొజ్జపెరగడం మొదలవుతుంది. ఇంకొందరు యవ్వనదశలోనూ చువ్వల్లా చురుగ్గానే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఢక్కామొక్కీలు తిని ఉంటారు. అవకాశం, అదృష్టం కలిసొస్తే ఇక విజృంభిస్తారు. ఈ తిప్పలన్నీ దేనికంటారు? జానెడు పొట్ట కోసం కాదూ! అన్ని రుచులూ తృప్తిగా ఆరగించకపోతే ఈ దిక్కుమాలిన సంపాదనంతా దేనికోసమంటారు? లోకంలో ఎవరేమనుకుంటే నాకేం..? ఎవరెలా పోతే నాకేం..? చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష! ఇదిగో! ఇలా అనుకోవడం వల్లనే చాలామంది జానెడు పొట్టను బానలా పెంచేసుకుపోతారు. పెళ్లయిన కొత్తలో కొసరి కొసరి వడ్డించే భార్య ‘చిరుబొజ్జే సింగారం’ అంటుంటే తెగ మురిసిపోతూ రెచ్చిపోయి మరీ భోజన ప్రతాపాన్ని ప్రదర్శిస్తారు. కొన్నేళ్లు గడిచాక చూసుకుంటే ఏముంటుంది? బానెడు పొట్ట... ఆ పొట్టతో పాటు వచ్చే నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, సుగర్, బీపీ... వగైరా వగైరా ఉచిత బహుమతులు. అసలే ఉచితంగా వచ్చిన బహుమతులాయె! వదిలించుకుందామనుకున్నా ఒక పట్టాన వదిలి చావవు. పుట్టినప్పుడు పొట్ట అందరికీ దాదాపు ఒకేలా ఉంటుంది. ఎదిగే క్రమంలోనే మార్పులు వస్తాయి. అలాగని జానెడు పొట్ట గాలి నింపిన బెలూన్లా అమాంతం ఒకేసారిగా ఉబ్బిపోదు. జిహ్వచాపల్యం ఆపుకోలేక దొరికినదల్లా నమిలి మింగేస్తూ ఉంటేనే... ఇంతై ఇంతింతై అన్నట్లుగా బానపొట్ట తయారవుతుంది. అదేపనిగా కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయని హెచ్చరించిన పెద్దలు ఆ పని వల్ల పొట్ట బానలా పెరిగిపోతుందని, అది ఒక పట్టాన తరగదని హెచ్చరించకపోవడం నిజంగా ఒక చారిత్రక అపరాధం. పెద్దల మాట చద్దిమూట అంటారు గానీ, ఈ రోజుల్లో పెద్దల మాటలు, చద్ది మూటలు ఎవరికి రుచిస్తున్నాయి గనుక? పిజ్జా బర్గర్ల కాలం వచ్చిపడ్డాక స్కూళ్లకు వెళ్లే పిల్లకాయలు కూడా బొజ్జగణపయ్యల్లా తయారవుతున్నారు. అసలు బొజ్జగణపయ్యకు తొలిపూజలు చేయడం ఆచారంగా వస్తున్నందు వల్లే మన దేశంలో బొజ్జకు గ్లామర్ పెరిగిందేమోనని అనుమానం! బానపొట్టల సమస్య మన దేశానికి మాత్రమే పరిమితం కాదు, అన్ని దేశాల్లోనూ ఉన్నదే. అమెరికాది అగ్రరాజ్యాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. అగ్రరాజ్యాలు ఇప్పుడిప్పుడే ఈ సమస్యను గుర్తించి, పొట్టలు కరిగించే దిశగా చర్యలు ప్రారంభిస్తున్నాయి. మన దేశంలో మాత్రం ఈ సమస్యపై ఏలినవారు ఇంకా కళ్లు తెరవలేదు. అఫ్కోర్స్, మన దేశంలో బానపొట్టలకు రెట్టింపు సంఖ్యలో వీపులను అంటుకుపోయే సైజ్‌జీరో పొట్టలూ ఉన్నాయనుకోండి. సైజ్‌జీరో పొట్టల్లో ముఖ్యంగా రెండురకాలు కనిపిస్తాయి. గ్లామర్ కోసం కష్టపడి కడుపు మాడ్చుకుని సాధించేవి కొన్నయితే, తప్పనిసరి పస్తుల వల్ల మలమలమాడి ఎండిన పొట్టలు మరికొన్ని. మాడిన పొట్టల్లో కాస్త ఆహారం నింపితే చాలు ఆరోగ్యంగా కోలుకుంటాయి. అయితే, బానపొట్టలను కరిగించి ఆరోగ్యకరంగా ఆరుపలకలతో అలరారేలా తీర్చిదిద్దడం అంత వీజీ కాదు గురూ! అసలే మగజన్మలకు బతుకే పెనుభారం. చిన్నప్పుడు చదువుల భారం. చదువు పూర్తయ్యాక ఉద్యోగ భారం. ఉద్యోగ భారం ఇంకా అలవాటు కాకముందే పెళ్ళయ్యాక మీదపడే సంసార భారం. అలాంటిది జానెడున్న పొట్ట కాస్త బానెడుగా విస్తరిస్తే, ఆ నడమంత్రపు అదనపు భారాన్ని తట్టుకోవడం అంత తేలిక కాదు. అడుగు తీసి అడుగు వేయడమే కష్టమవుతుంది. ఎలాగోలా శక్తి కూడదీసుకుని గునగునమని వీధిలో నడుస్తూ ఉంటే గమనించే కుర్రకారు ‘కొబ్బరిబొండాం’ వంటి బిరుదులతో బహిరంగ రహస్యంగా సత్కరించేస్తారు. తెల్లారగట్లే వాకింగ్‌కు వెళ్దామనే ఉంటుంది. వీధిలో పాడు కుక్కలు వెంటపడితే పరుగు లంఘించుకునే శక్తి ఉండదు కదా! అందుకే ఆ కార్యక్రమానికి వాయిదా పడుతుంది. ఆరుపలకలేం అక్కర్లేదు గానీ, చదునైన ఏకపలక పొట్ట దక్కితే చాలురా భగవంతుడా! అని మొరపెట్టుకోని రోజు ఉండదు. జిమ్‌లో చేరాలనే ఉంటుంది. బరువులను చూస్తే భయం, గుండెదడ మొదలవుతాయి. అయినా తెగించి, బరువులెత్తితే ఆయాసం ముంచుకొస్తుంది. పొట్ట కరగడం దేవుడెరుగు! ఒంటినొప్పులు మొదలవుతాయి. సిరిసంపదలకు చిరుబొజ్జే ఆనవాలు అనే నమ్మకం నానా నాగరికతల్లో అనాదిగా ఉన్నదే. తరాలు మారినా, యుగాలు మారినా ఈ నమ్మకంలో పెద్దగా మార్పు రాలేదు. అలాగని ఇదేమీ మూఢనమ్మకంలాంటిది కాదు. సిరిసంపదలకు అనులోమానుపాతంగా ‘మగా’నుభావుల పొట్టపెరగడం ఒక సహజ పరిణామం. కొందరు పుడుతూనే నోట్లో వెండిచెమ్చాతో పుడతారు. వాళ్లకు బాల్యావస్థలోనే బొజ్జపెరగడం మొదలవుతుంది. ఇంకొందరు యవ్వనదశలోనూ చువ్వల్లా చురుగ్గానే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఢక్కామొక్కీలు తిని ఉంటారు. అవకాశం, అదృష్టం కలిసొస్తే ఇక విజృంభిస్తారు. ఆబగా సిరిసంపదలను పోగేసుకుంటారు. బ్యాంకులో డబ్బును దాచుకున్నంత భద్రంగా ఒంట్లో కొవ్వును దాచుకుంటారు. వాళ్లకు సంప్రాప్తించిన నడమంత్రపు సిరిలాగానే, వాళ్ల నడమంత్రపు బొజ్జ కూడా అంతకంతకూ పెరిగిపోతూ ఉంటుంది. బొజ్జబాబులందరూ బొజ్జలు కరగాలని కోరుకుంటూ ఉంటారు. నానా దేవుళ్లకీ మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. ఇందులో వింతేమీ లేదు. ఈ ‘పైసా’చిక లోకంలో కొందరు మాత్రం దేశంలో బొజ్జలు వర్ధిల్లాలంటూ బొజ్జగణపయ్యకు పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకైనా మంచిదని భారీ బొజ్జతో అట్టహాసాన్ని చిందించే లాఫింగ్ బుద్ధుడిని కూడా ఆరాధిస్తూ ఉంటారు. బొజ్జలు కరిగించడమే వాళ్ల వ్యాపారం. జిమ్ పరికరాలతో కొందరు, లిపోసక్షన్స్ అంటూ ఇంకొందరు పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలతో ఊదరగొట్టేస్తూ ఉంటారు. సిటింగుకు ఐదు కిలోల చొప్పున అరడజను సిటింగుల్లోనే ఎంతటి భారీ బొజ్జలనైనా అవలీలగా కరిగించేస్తామంటూ నమ్మబలుకుతూ ఉంటారు. బొజ్జలోనే కాదు, ఒంట్లో ఎక్కడ కొవ్వు పేరుకుపోయినా రిటైల్‌గా, హోల్‌సేల్‌గా కరిగించేస్తాం అంటూ టీవీ ప్రకటనల్లో బొద్దుగుమ్మల చేత చెప్పిస్తారు. బొర్ర తప్ప బుర్ర పెరగని బకరాలు అలాంటి ప్రకటనలను అమాయకంగా నమ్మేస్తారు. అక్కడికి వెళితే పొట్ట కరిగినా కరగకపోయినా, పర్సు కరగడం మాత్రం ఖాయం. మరీ ఆత్రపడి, కొవ్వు తొలగించుకోవడానికి కోతలకు సిద్ధపడితే ప్రాణాల మీదకు వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు. - పన్యాల జగన్నాథ దాసు