‘జిమ్‌’లో వర్కౌట్‌ చేయమంటే వీళ్లేంది ఇలా చేశారు! | Viral Video Women Fight Over Gym Equipment Smith Machine | Sakshi
Sakshi News home page

Viral Video: జిమ్‌కు వెళ్లి మహిళల డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్‌

Published Wed, Oct 12 2022 10:20 AM | Last Updated on Wed, Oct 12 2022 10:20 AM

Women Fight Over Gym Equipment Smith Machine - Sakshi

వ్యాయామం చేసేందుకు చాలా మంది జిమ్‌కి వెళ్తుంటారు. అక్కడ ఉండే వాటిని ఒకరి తర్వాత ఒకరు వినియోగిస్తుంటారు. ఇద్దరు ఒకేసారి కావాలనుకుంటే ఎవరైనా ఒకరు తప్పుకోక తప్పదు. ఈ క్రమంలో ఎవరైనా సహనం కోల్పోతే ఇక అంతే.. అది కొట్టుకునే వరకు దారితీస్తుంది. అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలు వెయిట్‌ లిఫ్ట్‌ పరికరాల కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వీడియో ప్రకారం.. ఓ మహిళ వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తుండగా మరో మహిళ తన వంతు కోసం ఎదురు చూస్తోంది. ఆమె అక్కడి నుంచి వెళ్లగానే తాను ఆ వర్కౌట్‌ చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే మరో మహిళ వెనకాల నుంచి వచ్చి ఆమెను తోసేసి వెయిట్‌ లిఫ్టింగ్‌ వర్కౌట్‌ చేయబోయింది. ఈ క్రమంలో ఇరువురు ఒక్కసారిగా గొడవకు దిగారు. నువ్వెంతంటే నువ్వెంత అంటూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. వారిని చూసి అక్కడే ఉన్న ఓ యువతి భయంతో పరుగులు పెట్టింది. మరో మహిళ వచ్చి వారిని విడిపించే ప్రయత్నం చేసింది. 

అయితే, ఈ కొట్లాటలో ఎవరికైనా గాయాలయ్యాయా అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. జిమ్‌లో పరికరాల కోసం కొట్టుకున్న ఈ సంఘటనపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ఈ ఫైట్‌ ద్వారా చాలా కేలరీలు కరిగిపోయాయి అని ఓ నెటిజన్‌ పేర్కొనగా.. దృఢమైన జుట్టు కోసం గొప్ప వర్కౌట్‌ అంటూ మరొకరు రాసుకొచ్చారు. ఇలాంటిదే..  జిమ్‌లో మ్యూజిక్‌ విషయంలో జరిగిన గొడవలో ఓ మహిళను పొడిచి చంపిన సంఘటన ఢిల్లీలో ఈ ఏడాది మార్చిలో జరిగింది.

ఇదీ చదవండి: రన్నింగ్‌ ట్రైన్‌ ఫుట్‌బోర్డుపై ఆయుధాలతో వీరంగం.. ఆకతాయిలు ఆట కట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement