women fight
-
గాజువాక మార్కెట్ లో మహిళల కొట్లాట
-
బస్సులో రచ్చ రచ్చ..
-
సీట్ల కోసం గొడవ.. దారుణంగా కొట్టుకున్న మహిళలు
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా.. దాదాపు బస్సులన్నీ మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. కూర్చునేందుకు సీట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంటుండటంతో పలుచోట్లా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే ఘటన చోటుచేసుకుంది. సీటు కోసం ఇద్దరు మహిళలు తిట్టుకోవడం తో పాటు జుట్టుపట్టుకుని మరీ కొట్టుకున్నారు. ఫ్రీ బస్ ఎఫెక్ట్!! జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం గొడవ.. దారుణంగా కొట్టుకున్న మహిళలు. pic.twitter.com/ah7wceH6vl — Telugu Scribe (@TeluguScribe) January 1, 2024 దీంతో బస్సులోని గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీయగా.. అది కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కి చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. సోమవారం ఉదయం జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్లేందుకు పల్లెవెలుగు బస్సు బస్టాండ్‌కు వచ్చింది. ఇప్పటికే ఎక్కువగా రష్ ఉంటుండటం, సీట్ల కోసం పోటీ ఏర్పడుతుండటంతో ఓ మహిళ బస్సు ఆగగానే కిటికీలో నుంచి కర్చీఫ్ వేసింది. బస్సు ఆగిన అనంతరం పెద్ద సంఖ్యలో మహిళలు బస్సులోకి ఎక్కారు. బస్సులోనే కొట్లాట ఇద్దరు తిట్టుకుంటూనే జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. బస్సులో ఉన్న మిగతా మహిళలు, పురుషులు సర్ది చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఇద్దరూ సీటు కోసం కొట్లాడుకుంటుండటంతో బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సర్దిచెప్పినా వినకుండా గొడవ పడుతుండటంతో గందరగోళానికి గురయ్యారు. చివరకు బస్సులో ఉన్న ప్రయాణికులు ఇద్దరి మధ్య కలగజేసుకుని సర్ది చెప్పడంతో గొడవకు ఫుల్ స్టాప్ పడింది. -
విమానంలో విండో సీటు కోసం ఫైట్..ఏకంగా జుట్లు పట్టుకుని మరీ..
విమానంలో విండో సీటు కోసం ఇద్దరు మహిళలు బీభత్సం సృష్టించారు. దీని కారణంగా ఫ్లైట్ రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బ్రెజిల్‌లోని గోఫస్ట్ ఎయిర్‌లైన్‌లో ఇద్దరు మహిళలు విండో సీటు కోసం ఘోరంగా గొడవపడ్డారు. వాస్తవానికి ఒక బిడ్డ తల్లి విండో సీటు కావాలని తన సహ ప్రయాణికురాలిని కోరింది. అందుకు ఆ ప్రయాణికురాలు తిరస్కరించింది. అంతే ఇరువురి మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆ మహిళా ప్రయాణికులిద్దరూ జుట్లు పట్టుకుని మరీ దారుణంగా కొట్టుకున్నారు. ఆఖరికి ఫ్లైట్ అటెండెంట్, స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ విమానంలో మొత్తం 15 మంది ప్రయాణికులు గొడవకు దిగారు. దీంతో భద్రత సిబ్బంది సదరు ప్రయాణకులందర్నీ విమానం నుంచి దించేసి పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత విమానం గమ్యస్థానానికి చేరుకుంది. అందుకు సంబంధించిన వీడియోని ఒక ప్రయాణికుడు ట్విట్టర్లో పోస్ట్‌్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Massive brawl breaks out on airline flight to Brazil… over a window seat. pic.twitter.com/zTMZPYzzDy — Mike Sington (@MikeSington) February 3, 2023 (చదవండి: శునకానికి కుల ధృవీకరణ పత్రమా! కంగుతిన్న అధికారులు) -
థ్రిల్లింగ్ స్టోరీ: బాయ్‌ఫ్రెండ్ కోసం ఐదుగురు అమ్మాయిల బిగ్ ఫైట్
పట్నా: ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకున్న సంఘటనలు చూసే ఉంటారు. అలాంటిది ఒక అబ్బాయి కోసం ఏకంగా ఐదుగురు అమ్మాయిలు జుట్టు పట్టుకుని కొట్టుకోవటం ఎప్పుడైనా చూశారా? అలాంటి అరుదైన సంఘటనే బిహార్‌లో జరిగింది. సోన్‌పుర్ మేళలో బాయ్‌ఫ్రెండ్ కోసం ఐదుగురు అమ్మాయిలు గొడవ పడ్డారు. జట్టుపట్టుకుని చితక్కొట్టుకున్నారు. చుట్టూ వందల మంది ఉన్నా.. చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం ఈ ఫైటింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇంతకీ బాయ్‌ఫ్రెండ్‌ని వదిలేసి వారు కొట్టుకోవటానికి కారణాలేంటి? సోన్‌పుర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఒకేసారి ఐదుగురితో ప్రేమ వ్యవహారాన్ని నడిపించాడు. ఏ ఒక్కరికి అనుమానం రాకుండా ఇన్నాళ్లు చూసుకున్నాడు. అయితే, ఆ ఐదుగురు అమ్మాయిల్లో ఒకరితో సోన్‌పుర్‌లో జరుగుతున్న ‘మేళ’కు రావటమే అతడు చేసిన తప్పు. అదే మేళకు మిగిలిన నలుగురు అమ్మాయిలు రావటంతో రెడ్‌హ్యాండేడ్‌గా దొరికిపోయాడు. కానీ, ఆ యువకుడి కోసం అమ్మాయిలు గొడవకు దిగటమే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే, నలుగురు అమ్మాయిలు కలిసి ఆ యువకుడితో వచ్చిన యువతిని చితకబాదారు. ఆ యువకుడు ఆమెను కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఓ అమ్మాయి కాలితో తన్నుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది సేపటి తర్వాత అక్కడే ఉన్న కొంత మంది కలుగజేసుకుని గొడవను ఆపారు. #Bihar: Five girls fight for a boyfriend, in Sonpur's mela. The girls saw that the guy was roaming with another girl, and they attacked her.#Viral #viralvideo #india pic.twitter.com/LBDdqqQMaK — Siraj Noorani (@sirajnoorani) November 29, 2022 ఇదీ చదవండి: షాకింగ్ ఘటన.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు -
‘జిమ్’లో వర్కౌట్ చేయమంటే వీళ్లేంది ఇలా చేశారు!
వ్యాయామం చేసేందుకు చాలా మంది జిమ్‌కి వెళ్తుంటారు. అక్కడ ఉండే వాటిని ఒకరి తర్వాత ఒకరు వినియోగిస్తుంటారు. ఇద్దరు ఒకేసారి కావాలనుకుంటే ఎవరైనా ఒకరు తప్పుకోక తప్పదు. ఈ క్రమంలో ఎవరైనా సహనం కోల్పోతే ఇక అంతే.. అది కొట్టుకునే వరకు దారితీస్తుంది. అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలు వెయిట్ లిఫ్ట్ పరికరాల కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఓ మహిళ వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండగా మరో మహిళ తన వంతు కోసం ఎదురు చూస్తోంది. ఆమె అక్కడి నుంచి వెళ్లగానే తాను ఆ వర్కౌట్ చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే మరో మహిళ వెనకాల నుంచి వచ్చి ఆమెను తోసేసి వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్ చేయబోయింది. ఈ క్రమంలో ఇరువురు ఒక్కసారిగా గొడవకు దిగారు. నువ్వెంతంటే నువ్వెంత అంటూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. వారిని చూసి అక్కడే ఉన్న ఓ యువతి భయంతో పరుగులు పెట్టింది. మరో మహిళ వచ్చి వారిని విడిపించే ప్రయత్నం చేసింది. అయితే, ఈ కొట్లాటలో ఎవరికైనా గాయాలయ్యాయా అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. జిమ్‌లో పరికరాల కోసం కొట్టుకున్న ఈ సంఘటనపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ఈ ఫైట్ ద్వారా చాలా కేలరీలు కరిగిపోయాయి అని ఓ నెటిజన్ పేర్కొనగా.. దృఢమైన జుట్టు కోసం గొప్ప వర్కౌట్ అంటూ మరొకరు రాసుకొచ్చారు. ఇలాంటిదే.. జిమ్‌లో మ్యూజిక్ విషయంలో జరిగిన గొడవలో ఓ మహిళను పొడిచి చంపిన సంఘటన ఢిల్లీలో ఈ ఏడాది మార్చిలో జరిగింది. Kalesh Inside GYM for Smith Machine pic.twitter.com/KXy6v9UyWj — r/Bahar Ke Kalesh (@Baharkekalesh) October 9, 2022 ఇదీ చదవండి: రన్నింగ్ ట్రైన్ ఫుట్‌బోర్డుపై ఆయుధాలతో వీరంగం.. ఆకతాయిలు ఆట కట్ -
ప్రాణం మీదకు తెచ్చిన చిట్టీల వివాదం
సంగారెడ్డి జిల్లా: చిట్టీల వివాదంతో ఒక మహిళ తన ప్రాణాలు పోగొట్టుకోగా..మరో మహిళ ప్రాణాలతో పోరాడుతోంది. వివరాలు..పటాన్చెరు మండలం బీడీఎల్ టౌన్‌షిప్‌లోని 321 క్వార్టర్లో అనిత, వెంగళ హిమసుధలు పక్కపక్క నివాసం ఉంటున్నారు. ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరి భర్తలు కూడా బీడీఎల్ ఉద్యోగులే. వీరు ఈ నడుమ చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. ఈ చిట్టీల విషయంలో వివాదం తలెత్తడంతో ఆవేశంలో హిమసుధ, అనిత గొంతు కోసి హత్యచేసేందుకు ప్రయత్నం చేసింది. ఆ తర్వాత భయపడిపోయి ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గాయపడిన మహిళను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అనిత పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై భానూరు బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెజ్లింగ్ లెవల్లో తన్నుకున్న అమ్మాయిలు
-
రెజ్లింగ్ లెవల్లో తన్నుకున్న అమ్మాయిలు
న్యూయార్క్: ఇప్పుడు ఇంటర్నెట్లో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. అది కూడా ఇద్దరు మహిళలు చూసేవాళ్లు నోరు వెళ్లబెట్టుకునేలా తన్నుకున్న వీడియో. ఇది ఫ్లోరిడా రాష్ట్రంలో చోటుచేసుకుంది. బహుశా అది ఉదయం కావొచ్చు. అంతా చక్కటి వాతావరణం. జాగింగ్, ఇతర కసరత్తులు పూర్తి చేసుకునే వేళ. అంబర్ కుక్ అనే ఓ యువతి మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ అనుకుంటా.. చక్కగా నల్లటి బాస్కెట్ బాల్ టీషర్ట్, ఓ బ్లాక్ ప్యాంటు వేసుకొని ఉంది. తన ఇంటి డోర్ ముందు ఏదో ఆలోచించుకుంటు ఉన్న ఆమె వైపు ఓ ఎరుపు రంగు టీషర్ట్ దరించిన యువతి వేగంగా జాగింగ్ కు వచ్చినట్లు వచ్చి నేరుగా వెళ్లి ముఖంపై ఒక్క పంచ్ ఇచ్చింది. ఆ పంచ్ కు ప్రతి ఘటించిన అంబర్ కుక్ ఒక్కసారిగా భద్రకాళిలా మారింది. తనపై దాడికి దిగిన ఆ అమ్మాయిని ఏకంగా ఓ రెజ్లర్‌లా ఎత్తిపడేసింది. వరుసపెట్టి ముఖంపైనే పిడిగుద్దులు గుప్పించింది. సవారీ చేస్తున్నట్లుగా ఆమె జుట్టును చేతికందుకొని పైకి కిందికి ఊపుతూ ఎంత డేర్ ఉంటే నన్ను కొడతావ్ అంటూ అదనంగా తన్నడం కూడా మొదలు పెట్టింది. దాంతో దెబ్బలు తింటూ ఆమె చేతి కింద నలిగిపోతున్న యువతి లబోదిబోమంటూ అరవడం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఆఖరికి అంబర్ అలిసిపోయిన తర్వాత తన మార్గాన తాను వెళ్లిపోతున్నప్పటికీ మరోసారి దాడి చేసి చుక్కలు చూపించింది. అంబర్ ఎంత ఉగ్ర రూపం దాల్చిందటే వారి ఫైటింగ్ ఆపేందుకు వెళ్లిన పురుషుడు కూడా వెనక్కి తగ్గాడు. అంతలా రెచ్చిపోయి వీధుల్లో వారిద్దరు తన్నుకున్నారు. -
మద్యం మత్తులో చితకొట్టుకున్న మహిళలు
హైదరాబాద్ : మద్యం తాగారు... రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో వారి మధ్య మాటా మాటా పెరిగి అది కాస్తా రోడ్డుపైనే కొట్టుకునే వరకూ వచ్చింది. అయితే ఇదేదో మగాళ్ల గురించి అనుకుంటే పొరపాటే. కొంతమంది మహిళలు మద్యం మత్తులో కొట్టుకునే వరకూ వెళ్లారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఓ కల్లు కౌంపౌండ్లో కొందరు మహిళలు ఫుల్‌గా కల్లు సేవించారు. ఆ సమయంలో పక్కనే వున్న మరికొందరు మహిళలతో గొడవ జరిగింది. ఆ గొడవ కాస్తా... కొట్టుకునే వరకూ వెళ్లింది. పది మంది చూస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి... నడిరోడ్డుమీద జుట్టు..జుట్టు పట్టుకుని మరీ చితకొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జనావాసాల మధ్యలో కల్లు దుకాణాలు నిర్వహణపై స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.