Brazil: Flight Delays For 2 Hours After Women Flight Over Window Seat, Video Viral - Sakshi
Sakshi News home page

విమానంలో విండో సీటు కోసం ఫైట్‌..ఏకంగా జుట్లు పట్టుకుని మరీ..

Published Sun, Feb 5 2023 5:34 PM | Last Updated on Sun, Feb 5 2023 6:34 PM

Brazil Flight Delays For 2 Hours After Women Flight Over Window Seat - Sakshi

విమానంలో విండో సీటు కోసం ఇద్దరు మహిళలు బీభత్సం సృష్టించారు. దీని కారణంగా ఫ్లైట్‌ రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బ్రెజిల్‌లోని గోఫస్ట్‌ ఎయిర్‌లైన్‌లో ఇద్దరు మహిళలు విండో సీటు కోసం ఘోరంగా గొడవపడ్డారు. వాస్తవానికి ఒక బిడ్డ తల్లి విండో సీటు కావాలని తన సహ ప్రయాణికురాలిని కోరింది. అందుకు ఆ ప్రయాణికురాలు తిరస్కరించింది.

అంతే ఇరువురి మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆ మహిళా ప్రయాణికులిద్దరూ జుట్లు పట్టుకుని మరీ దారుణంగా కొట్టుకున్నారు.  ఆఖరికి ఫ్లైట్‌ అటెండెంట్‌, స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ విమానంలో మొత్తం 15 మంది ప్రయాణికులు గొడవకు దిగారు. దీంతో భద్రత సిబ్బంది సదరు ప్రయాణకులందర్నీ విమానం నుంచి దించేసి పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత విమానం గమ్యస్థానానికి చేరుకుంది. అందుకు సంబంధించిన వీడియోని ఒక ప్రయాణికుడు ట్విట్టర్‌లో పోస్ట్‌్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: శునకానికి కుల ధృవీకరణ పత్రమా! కంగుతిన్న అధికారులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement