ప్రాణం మీదకు తెచ్చిన చిట్టీల వివాదం | life and death problem created by chitties business | Sakshi
Sakshi News home page

ప్రాణం మీదకు తెచ్చిన చిట్టీల వివాదం

Published Mon, Feb 12 2018 5:39 PM | Last Updated on Mon, Feb 12 2018 5:39 PM

life and death problem created by chitties business - Sakshi

ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితురాలు అనిత

సంగారెడ్డి జిల్లా: చిట్టీల వివాదంతో ఒక మహిళ తన ప్రాణాలు పోగొట్టుకోగా..మరో మహిళ ప్రాణాలతో పోరాడుతోంది. వివరాలు..పటాన్‌చెరు మండలం బీడీఎల్ టౌన్‌షిప్‌లోని 321 క్వార్టర్లో అనిత, వెంగళ హిమసుధలు పక్కపక్క నివాసం ఉంటున్నారు. ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరి భర్తలు కూడా బీడీఎల్‌ ఉద్యోగులే. వీరు ఈ నడుమ చిట్టీల వ్యాపారం చేస్తున్నారు.

ఈ చిట్టీల విషయంలో వివాదం తలెత్తడంతో ఆవేశంలో హిమసుధ, అనిత గొంతు కోసి హత్యచేసేందుకు ప్రయత్నం చేసింది. ఆ తర్వాత భయపడిపోయి ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గాయపడిన మహిళను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అనిత పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై భానూరు బీడీఎల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement