
సూరత్: గాలిపటం ఎగరేసే దారం మెడకు చుట్టుకొని ఓ బైకర్ ప్రాణాలు కోల్పోయాడు. మాంజా చాలా పదునుగా ఉంటడంతో అతని గొంతు తెగి చనిపోయాడు. గుజరాత్‌లోని సూరత్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
మృతుడి పేరు బల్వంత్ పటేల్(52). కమ్రేజ్‌లోని నవగామ్‌లోని నివాసముంటాడు. వజ్రాల పరిశ్రమలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగివస్తుండగా శంకర్ నగర్‌లో ఓ పతంగి దారం అతని మెడకు చుట్టుకుంది. అతను ఎలాగోలా బైక్‌ను ఆపి కిందపడిపోయాడు. మెడ తెగి రక్తం కారుతున్న అతడ్ని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
అయితే చికిత్స అందించిన వైద్యులు బల్వంత్ చనిపోయాడని సోమవారం రాత్రి ప్రకటించారు. మాంజా పదునుగా ఉండటంతో గొంతు లోతుగా తెగిందని, ప్రాణాలు కాపాడలేకపోయామని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. ఇంజనీరింగ్ విద్యార్థినిని దారుణంగా కత్తితో..
Comments
Please login to add a commentAdd a comment