kite flying thread
-
ప్రాణం తీసిన పతంగి దారం.. బైకర్ గొంతు తెగి..
సూరత్: గాలిపటం ఎగరేసే దారం మెడకు చుట్టుకొని ఓ బైకర్ ప్రాణాలు కోల్పోయాడు. మాంజా చాలా పదునుగా ఉంటడంతో అతని గొంతు తెగి చనిపోయాడు. గుజరాత్‌లోని సూరత్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు బల్వంత్ పటేల్(52). కమ్రేజ్‌లోని నవగామ్‌లోని నివాసముంటాడు. వజ్రాల పరిశ్రమలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగివస్తుండగా శంకర్ నగర్లో ఓ పతంగి దారం అతని మెడకు చుట్టుకుంది. అతను ఎలాగోలా బైక్‌ను ఆపి కిందపడిపోయాడు. మెడ తెగి రక్తం కారుతున్న అతడ్ని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అందించిన వైద్యులు బల్వంత్ చనిపోయాడని సోమవారం రాత్రి ప్రకటించారు. మాంజా పదునుగా ఉండటంతో గొంతు లోతుగా తెగిందని, ప్రాణాలు కాపాడలేకపోయామని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. ఇంజనీరింగ్ విద్యార్థినిని దారుణంగా కత్తితో.. -
కపోత విషాద గీతిక!
చైనా మాంజా ప్రాణాంతకంగా మారుతోందనేందుకు ఈ చిత్రాలే నిదర్శనం. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో మాంజా ఓ వ్యక్తిని బలిగొనడం విషాదాన్ని నింపింది. సోమవారం నగరంలోని నెక్లెస్ రోడ్డులోని విద్యుత్ స్తంభానికి చిక్కుకుపోయిన మాంజా.. పావురం మెడకు చుట్టుకుని నిలువునా దాని ప్రాణాలను తీసింది. ఊపిరి పోతుండగా అది స్తంభంపైనుంచి విగతజీవిగా నేలపై పడుతూ అకటా.. దయలేని వారు ఈ మానవులు! అనే విషాద గీతికను ఆలపిస్తున్నట్లు.. ఆ కపోతం కన్నీరు కారుస్తున్నట్లు కనిపించిందీ దృశ్యం. -
బాప్రే! గాలి పటంతో పాటు మనిషి కూడా గాల్లోనే... !!
నిజంగా ఎవరికైన గాలిపటం ఎగరు వేయడం సరదాగా ఉంటుంది. పైగా కొంతమంది అదోక హాబీలా ఎప్పుడూ గాలిపటాలను ఎగరువేసే వాళ్లు కూడా ఉన్నారు. అయితే శ్రీలంకకు చెందిన ఒక వ్యక్తి సరదాగా తన స్నేహితులతో గాలిపటాలు ఎగరువేసేడు. కానీ అనుహ్యంగా అతను కూడా గాల్లోకి ఎగిరిపోయాడు. (చదవండి: పంచాయితీ ఎన్నికల్లో ఒక అభ్యర్థికి కనివినీ ఎరుగని ఓట్లు!... కచ్చితంగా షాక్ అవుతారు!!) అసలు విషయంలోకెళ్లితే... శ్రీలంకలో తై పొంగల్ నాడు నిర్వహించే గాలిపటాలు ఎగరు వేసే పోటీల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. పైగా శ్రీలంకవాసులు పొంగల్ పండుగను బాగా జరుపుకోవడమే కాక అత్యంత సృజనాత్మకమైన గాలిపటాలు తయారు చేసి స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఎగరువేస్తారు. ఈ మేరకు ఎప్పుడూ జరిగే విధంగానే శ్రీలంకలో జాఫ్నాలోని పాయింట్ పెడ్రోలో అకైట్ ఫ్లయింగ్ గేమ్ పోటీలు నిర్వహించారు. దీనిలో భాగంగా చాలామంది రకరకాల గాలిపటాలను ఎగరువేసి గెలిచేందుకు పాల్గొంటారు. ఇదేవిధంగా ఒక వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఒక పెద్ద గాలిపటాన్ని ఎగరువేసే నిమిత్తం ఆ పోటీలో పాల్గొన్నాడు అయితే ఆ పోటిదారుని బృందం అంతా ఆ గాలిపటాన్ని జనపనారతో కూడిన తాళ్లతో ఒక పెద్ద గాలిపటాన్ని ఎగరువేశారు. ఈ మేరకు ఆ బృందంలోని ఆరుగురు నెమ్మదిగా ఆ తాడుని వదిలేస్తే ఈ పోటీదారుడు మాత్రం అనుహ్యంగా తాడుని వదిలి పెట్టడంతో... దీంతో అతను గాలిపటం తోపాటు గాలిలో కొన్ని సెకన్లు ఉన్నారు. దీంతో అతని బృందంలోని సభ్యులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురై 'తాడు వదిలేయ్' అంటూ అరిచారు. కానీ అతను మాత్రం తాడు వదలడానికి భయపడి అలాగే గాల్లో ఉండిపోయాడు. ఆ తర్వాత కాసేపటికి ఆ వ్యక్తి తాడుని వదిలేసి గాయాలు పాలుకాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. (చదవండి: విరిగిపడిన కొండచరియలు.. 70 మంది గల్లంతు) Dramatic video shows a youth swept into the air with a kite in Jaffna area. The youth was reportedly suffered minor injuries.pic.twitter.com/W0NKrYnTe6 #Kiteman #Kite #LKA #Jaffna #SriLanka — Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) December 21, 2021 -
చైనా మాంజానా.. మజాకా!
దేశ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీన పతంగులు ఎగరేయడానికి ఉపయోగించిన 'చైనా మాంజా' కారణంగా ఢిల్లీలో ముగ్గురు మరణించడంతో ఆ మర్నాడే ఢిల్లీ ప్రభుత్వం దాన్ని నిషేధించింది. గత రెండేళ్లలోనే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో ఈ మాంజా కారణంగా 15 మందితో పాటు వందలాది పక్షులు మరణించాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు చైనా మాంజాపై నిషేధం విధించాయి. ఇప్పుడు డిల్లీ ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచింది. 1986 నాటి పర్యావరణ పరిరక్షిణ చట్టం కింద వివిధ రాష్ట్రాలు గుడ్డిగా చైనా మాంజాను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేశాయని చెప్పవచ్చు. ఎందుకంటే చైనా మాంజా అంటే ఏమిటీ, దాన్ని నిజంగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారా? దాన్ని ఎవరు తయారు చేస్తున్నారు, మాంజా తయారీకి పాటించాల్సిన ప్రమాణాలు ఏమిటీ? ఎలాంటి మాంజాలను నిషేధించాలి? నిషేధాన్ని ఎలా అమలు చేయాలన్న అంశాల జోలికి వెళ్లకుండానే పలు రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్డిగా నిషేధ ఉత్తర్వులు జారీ చేశాయి. దాంతో నిషేధిత రాష్ట్రంలో కూడా ఇప్పటికీ చైనా మాంజా మార్కెట్లో లభిస్తోంది. 'చైనా మాంజా అనగానే సాధారణంగా అందరూ చైనా నుంచి దిగుమతి చేసుకున్న మాంజా అని పొరపాటు పడతారు. ప్రభుత్వాలు కూడా అదే భావంతో ఉన్నట్లు ఉన్నాయి. వాస్తవానికి చైనా, తైవాన్‌ల నుంచి దిగుమతి చేసుకొనే గ్లాస్ కోటెడ్ పాలిమర్ లేదా పోలిప్రోపిలిన్ ఉపయోగించి స్థానికంగానే ఈ మాంజాను ఉత్పత్తి చేస్తున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్నదని అనుకోవాలనే ఉద్దేశంతోనే దానికి ఆ పేరు పెట్టారు. ఇది ఒట్టి మార్కెటింగ్ జిమ్మిక్కు మాత్రమే' అని బెంగుళూరుకు చెందిన మాంజా ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి, అమ్మకాల విభాగం అధిపతి మోహిత్ కార్తికేయన్ మీడియాకు తెలిపారు. బెంగళూరుతోపాటు సోనెపట్, నోయిడాల్లో ఈ మాంజాను ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారని పాత ఢిల్లీకి చెందిన చేతి పతంగి ఉత్పత్తిదారుల సంఘం ఉపాధ్యక్షడు సచిత్ గుప్తా తెలిపారు. కాటన్ దారం మాంజా కన్నా పదునెక్కువగా ఉండటమే కాకుండా తక్కువ ధరకు కూడా దొరుకుతుండటంతో చైనా మాంజాకు డిమాండ్ పెరిగిందని ఆయన చెప్పారు. ఈ మాంజా కోసం చైనా నుంచి కనీసం దారం కూడా దిగుమతి చేసుకోరని, దిగుమతి చేసుకున్న సింథటిక్ పాలిమర్‌తో దీన్ని స్థానికంగానే తయారు చేస్తున్నారని ఆయన వివరించారు. చైనా మాంజాపై నిషేధం విధించిన ప్రభుత్వాలు మాంజాల ఉత్పత్తికి పాటించాల్సిన ప్రమాణాలను సూచించాలని, అంతవరకు నిషేధం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, చైనా మాంజానే మళ్లీ పేరు మార్చుకొని మార్కెట్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని కార్తికేయన్ చెప్పారు. మనుషుల మరణాల విషయానికొస్తే కాటన్ మాంజాల వల్ల కూడా ప్రమాదం ఉంటుందని ఆయన అన్నారు. గుజరాత్ ప్రభుత్వం 2009 నవంబర్‌లో, మహారాష్ట్ర 2015లో, ఆంధ్రప్రదేశ్ 2016 మేనెలలో, కర్ణాటక ప్రభుత్వం 2016 జూలై నెలలో చైనా మాంజాపై నిషేధం విధించగా, ఇప్పుడు వాటి సరసన ఢిల్లీ ప్రభుత్వం చేరింది.