Surat
-
ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ మహిళా నేత ఆత్మహత్య
సూరత్ : ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ మహిళా నేత ఆత్మహత్యకు పాల్పడింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్‌లోని వార్డ్నెంబర్ 30లో బీజేపీ మహిళా మోర్చా విభాగానికి దీపికా పటేల్ నాయకత్వం వహిస్తున్నారు.అయితే, ఒత్తిడి తట్టుకోలేక ఆదివారం తన నివాసంలో దీపికా పటేల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యాయత్నంపై సమాచారం అందుకున్న స్థానిక కార్పొరేటర్, కుటుంబసభ్యులు బాధితురాలిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు దీపికా పటేల్ అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.దీపికా పటేల్ మరణంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరిస్తున్న దీపికా పటేలా్ బలవన్మరణం చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుందని పోలీసులు ఆరా తీసుకున్నారు. కాగా, దీపికా పటేల్ భర్త వ్యవసాయం చేస్తుండగా ఆమెకు ముగ్గురు పిల్లలు.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
సోషల్ మీడియా గెలిపించింది..!
కోవిడ్ లాక్డౌన్ ప్రపంచాన్ని స్తంభింప చేసింది. కానీ కోవిడ్ కాలం కొందరికి కెరీర్ బాటను వేసింది. ఆ బాటలో నడిచిన ఓ సక్సెస్ఫుల్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ముస్కాన్ జైన్. ఇంట్లో టైమ్‌పాస్ కోసం చేసిన డోనట్ ప్రయత్నం ఆమెను డోనటేరియా ఓనర్ని చేసింది. ముస్కాన్ జైన్ ఎంబీఏ చేసింది. కరోనా లాక్డౌన్ సమయంలో యూట్యూబ్‌లో చూసినవన్నీ వండడం మొదలు పెట్టింది ముస్కాన్. ఆమె అప్పటికే యూ ట్యూబ్ స్టార్. ఆమె డాన్స్ కొరియోగ్రఫీ చానెల్‌కు యాభై వేలకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వంటగదిలో అడుగుపెట్టిన ముస్కాన్ చేసిన డోనట్స్ ఇంట్లో అందరికీ నచ్చాయి. ఇదే నీకు సరైన కెరీర్ అని ప్రోత్సహించారు. కానీ ముస్కాన్ వెంటనే మొదలు పెట్టలేదు. ‘ఇంట్లో వాళ్లు అభిమానం కొద్దీ ప్రశంసల్లో ముంచేస్తున్నారు. అది చూసి బిజినెస్ ప్రారంభిస్తే కష్టం అనుకున్నాను. కొన్నాళ్లకు ఒకామె ‘‘ఇప్పుడు కూడా డోనట్స్ చేస్తున్నారా, ఆర్డర్ మీద చేసిస్తారా’’ అని అడిగింది. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అలా 2023లో ‘డోనటేరియా’ స్టార్టప్‌ను ప్రారంభించాను. తక్కువ పెట్టుబడితో ఇంటి కిచెన్లోనే మొదలు పెట్టాను. డోనట్‌ని పరిచయం చేయడానికి బేకరీలు, స్టాల్స్‌కి మొదట ఫ్రీ సాంపుల్స్ ఇచ్చాను’’ అంటూ తన స్టార్టప్ తొలినాళ్ల కష్టాలను వివరించారు ముస్కాన్.ముస్కాన్ జైన్‌ను సూరత్తోపాటే ప్రపంచం కూడా గుర్తించింది. అందుకు కారణం సోషల్ మీడియా. ‘‘నా ప్రతి ప్రయత్నాన్నీ ఇన్‌స్టాలో షేర్ చేసేదాన్ని. డోనట్ల తయారీ నుంచి ప్యాకింగ్ వరకు ప్రతిదీ షేర్ చేయసాగాను. ఇన్‌స్టా ద్వారా కూడా ఆర్డర్లు రాసాగాయి. ఇప్పుడు రోజుకు మూడు వందల ఆర్డర్లు వస్తున్నాయి’’ అని సంతోషంగా చెప్పారు ముస్కాన్. ఆమె డోనట్ తయారీ గురించి దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు యూఎస్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వాళ్లకు కూడా ఆన్లైన్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. తన డోనటేరియాను జాతీయస్థాయి బ్రాండ్‌గా విస్తరించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. (చదవండి: ప్రతి తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే..!) -
వజ్రాల ధగధగలపై చీకట్ల ముసురు!
సూరత్ అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది వజ్రాలే. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను సూరత్‌లోనే ప్రాసెస్ చేస్తారు. దీనికోసం ఇక్కడ ఏకంగా 5000 కంటే ఎక్కువ ప్రాసెస్ యూనిట్స్ ఉన్నాయి. ఇందులో సుమారు ఎనిమిది లక్షల మందికిపైగా పాలిషర్స్ ఉపాధి పొందుతున్నారు. అయితే గత కొన్నేళ్లుగా సూరత్‌లో వజ్రాల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది.వజ్రాల వ్యాపారం దెబ్బతినడానికి కారణం▸ఉక్రెయిన్, రష్యా యుద్ధం తరువాత యూరోపియన్ యూనియన్ దేశాలు, జీ7 దేశాలు దిగుమతులను నిషేధించడం. ▸కరోనా మహమ్మారి తరువాత విధించిన లాక్డౌన్ వల్ల ఎగుమతులు మందగించడం.▸పాశ్చాత్య దేశాల నుంచి డిమాండ్ తగ్గిపోవడం, ఆర్ధిక వ్యవస్థలు మందగించడం.▸ల్యాబ్‌లో తాయారు చేసిన వజ్రాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడం. ఎందుకంటే సహజమైన వజ్రాల కంటే ల్యాబ్‌లో తయారైన వజ్రాల ధరలు కొంత తక్కువగానే ఉంటాయి. ఇది డైమండ్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది.కటింగ్, పాలిషింగ్ వంటి వాటికోసం 30 శాతం రఫ్ డైమండ్లను భారత్.. రష్యా నుంచి దిగుమతి చేసుకునేది. అయితే కరోనా, ఇతర కారణాల వల్ల చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో వజ్రాల వ్యాపారం మందగించిందని ఇండియన్ డైమండ్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ దినేష్ నవాడియా పేర్కొన్నారు.ఆర్థిక మాంద్యం కారణంగా సుమారు వెయ్యి పాలిషింగ్ యూనిట్స్ మూతపడ్డాయి. దీంతో సుమారు రెండు లక్షలమంది ఉపాధి కోల్పోయారు. ఉపాధి కోల్పోవడంతో గత 16 నెలల్లో సుమారు 65 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు, డైమండ్ పాలిషర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేట్ డైమండ్ వర్కర్స్ యూనియన్ నేతలు పేర్కొన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన తరువాత.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక, కుటుంబాలను పోషించలేకే ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: అంబానీ చెప్పిన మూడు విషయాలు ఇవే..బంగారం, వజ్రాల వ్యాపారం దేశ ఆర్ధిక వ్యవస్థ పెరగడానికి దోహదపడుతోంది. 2022లో ఈ వ్యాపారం దేశ జీడీపీ దాదాపు ఏడు శాతం దోహదపడింది. అయితే 2024 ఆర్ధిక సంవత్సరంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. ఈ ఎగుమతుల విలువ 1.87 లక్షల కోట్లు. -
11 వేల వజ్రాలతో రతన్ టాటా చిత్రం
సూరత్: రతన్ టాటా తన 86వ ఏట ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మన దేశానికి అమూల్యమైన రత్నం మాదిరిగా నిలిచిన రతన్ టాటాకు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఒక వ్యాపారి వజ్రాలతో రతన్ టాటాకు నివాళులు అర్పించారు.ఉన్నత వ్యక్తిత్వం కలిగిన రతన్ టాటాను దేశంలోని ఏ ఒక్కరూ మరచిపోలేరు. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి విపుల్భాయ్ 11 వేల అమెరికన్ వజ్రాలతో రతన్ టాటా చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం రూపకల్పనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వతహాగా కళాకారుడైన విపుల్.. రతన్ టాటా చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు అమెరికన్ డైమండ్స్ వినియోగించారు. ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో పలువురు షేర్ చేస్తున్నారు. सूरत में एक व्यापारी ने 11000 अमेरिकन डायमंड की मदद से बनाया रतन टाटा जी का डायमंड पोट्रेट💎 pic.twitter.com/2Q8QMJJfwy— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) October 12, 2024ఇది కూడా చదవండి: డెంగ్యూకు టీకా.. బీహార్‌లో తుది ట్రయల్స్ -
Surat: వినాయక మండపంపై రాళ్ల దాడి.. పలువురు అరెస్ట్
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లోని ఒక గణేష్ మండపంపై అల్లరి మూకలు రాళ్ల దాడి చేశాయి. ఈ నేపధ్యంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అల్లరిమూకలు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని శాంతింపజేశారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం పోలీసులు వినాయక మండపం దగ్గర నెలకొన్న పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జీ చేయడంతో పాటు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ స్వయంగా ఆ గణేశ్ మండపం దగ్గరకు వచ్చి, పరిస్థితులను అధికారులతో సమీక్షించారు. సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్, సూరత్ మేయర్ దాఖేష్ మవానీ ఆయన వెంట ఉన్నారు.సూరత్‌లోని సయ్యద్‌పురా ప్రాంతంలోని గణేష్ మండపంపై ఆరుగురు వ్యక్తులు రాళ్లు రువ్వారని మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. వీరితో పాటు వీరికి సహకరించిన మరో 27 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్ష్ సంఘ్వీ తెలిపారు. -
‘టీ’పాట
‘చాయ్ హోటల్‌కు ఎందుకు వెళతారు?’ అనే ప్రశ్నకు–‘చాయ్ కోసమే వెళతారు’ అనే జవాబు మాత్రమే వినిపిస్తుంది. అయితే సూరత్‌లోని విజయ్భాయి పటేల్ అలియాస్ డాలీ చాయ్‌వాలా అలియాస్ సింగింగ్ చాయ్‌వాలా హోటల్‌కు ‘పాట’ కోసం వెళతారు. డాలీ చాయ్‌వాలా కస్టమర్లకు వేడి వేడి టీ అందిస్తూనే, మైక్రోఫోన్లో అద్భుతంగా పాడుతుంటాడు. ఆయన గానం వింటూ ‘మరో చాయ్’ అనే మాట కస్టమర్ల నోటి నుంచి వినిపించడం అక్కడ సాధారణ దృశ్యం. ఈ ‘సింగింగ్ చాయ్‌వాలా’కు సంబంధించిన వీడియో క్లిప్‌ను ముంబైలోని సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ బయాని ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేస్తే వైరల్ అయింది. -
సూరత్‌లో కుప్పకూలిన ఆరు అంతస్తుల బిల్డింగ్.. 15 మందికి గాయాలు
గాంధీనగర్: గుజరాత్‌లోని సూరత్‌లో ఓ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సచిన్ పాలి గ్రామంలో ఆరు అంతస్థుల భవనం కూలింది. ఈ ఘటనలో భవనంలోని పలువురు చిక్కుకున్నారు. దాదాపు పదిహేను మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బిల్డింగ్ కాంక్రీట్ బండల కింద ఎవరైనా చిక్కుకొని ఉండచ్చని గాలిస్తున్నారు. శిథిలాలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. భవనం శిథిలావస్థలో ఉందని, దానికి తోడు భారీ వర్షాలతో కూలిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో బిల్డింగ్ కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #WATCH | Gujarat: A Four-floor building collapsed in Sachin area of Surat. Many people feared trapped. Police and fire department team at the spot. Rescue operations underway. pic.twitter.com/FIJJUGzbEQ— ANI (@ANI) July 6, 2024 -
డేరింగ్ దాది
బకుళాబెన్ పటేల్‌ను సూరత్‌లో అందరూ ‘డేరింగ్ దాదీ’ అని పిలుస్తారు. 80 ఏళ్ల వయసులో నదుల్లో, సముద్రంలో ఆమె చేపలా ఈదడమే కాదు ఈత పోటీల్లో వందల మెడల్స్ సాధించడమే కారణం. 57 ఏళ్ల వయసులో మొదలెట్టిన ఈత తనకు ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అంటోంది బకుళాబెన్. పెద్ద వయసు వారికి పెద్ద స్ఫూర్తి ఆమె.సూరత్‌లోని తాపి నది ఒడ్డున ఏ ఉదయాన ఐదు, ఆరు గంటల మధ్యన వెళ్లినా డేరింగ్ దాది అని ఆ ఊళ్లో పిలుచుకునే బకుళా బెన్ కనిపిస్తుంది. 80 ఏళ్ల వయసులో ఆమె దినచర్య గమనించదగ్గది. తెల్లవారు జామున 4 గంటలకు లేస్తుంది. ఒక గంటసేపు ఇంట్లో తేలికపాటి యోగా చేస్తుంది. ఆ తర్వాత జాగింగ్‌కు వీలైన దుస్తుల్లోకి మారి సూరత్ దారుల గుండా కనీసం గంటసేపు జాగింగ్ చేస్తుంది. ఆ తర్వాత తాపి ఒడ్డున ఈత దుస్తుల్లోకి మారి నదిలోకి దూరి దాదాపు రెండు గంటల సేపు ఈత కొడుతుంది. ఆ తర్వాతే ఆమె ఇంటికి చేరుతుంది. ‘నేను రోజులో ఒక పూట భోజనం అయినా లేకుండా ఉంటాను కాని ఏ రోజూ ఈత కొట్టకుండా ఉండలేను’ అంటుంది బకుళా బెన్.కొత్త జీవితంబకుళా బెన్ది అందరు సగటు ఆడవాళ్ల జీవితం వంటిదే. పెళ్లి, పిల్లలు... ఆమెకు నలుగురు సంతానం. వారిని పెంచి పెద్ద చేయడంలో జీవితం గడిచిపో యింది. ఆమెకు 50 ఏళ్లు ఉండగా భర్త మరణించాడు. కొన్నాళ్లకు ఆమెకు జీవితం బోరు కొట్టింది. ‘ఏదో ఒకటి చేయాలి’ అని క్రీడల వైపు ఆసక్తి కనపరిచింది. ‘నాకు చిన్నప్పుడు నీళ్లంటే భయం. ఈత నేర్చుకోలేదు. కాని ఎన్నాళ్లు నీళ్లకు దూరంగా జరుగుతాను. ఈత నేర్చుకుందాం అనుకున్నాను.ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నా వయసు 58’ అని తెలిపింది బకుళా బెన్. కాని ఆమె ఈత నేర్చుకోవడం అంత సులువు కాలేదు. బంధువులు, ఇరుగు పొరుగు వారు ‘హవ్వ’ అని నోరు నొక్కుకున్నారు. హేళన చేస్తూ వెనుక మాట్లాడుకున్నారు. ‘అవన్నీ నా చెవిన పడుతున్నా ఈత నేర్చుకోవడం మానలేదు’ అంటుంది బకుళ. ఇలా నవ్విన వారే తాపీనదిలో చేపలా ఈదుతున్న బకుళను చూసి ఆశ్చర్యపో యారు. హేళన స్థానంలో గౌరవం వచ్చింది.అన్నీ భిన్నమేపిల్లలు సెటిల్ కావడం వల్ల దొరికిన తీరుబడిని బకుళ సంపూర్ణంగా జీవించదలుచుకుంది. ‘నేను నా 60వ ఏట బి.ఏ. కట్టాను. పాఠాలు చదవడం గుర్తు పెట్టుకోవడం కష్టమైంది. రోజుకు 10 గంటలు చదివేదాన్ని. అలాగే ఎప్పుడో వదిలేసిన రాత కూడా ప్రాక్టీసు చేసి పరీక్షలు రాసి డిగ్రీ ΄పొందాను. అలాగే యోగా నేర్చుకున్నాను. 80 ఏళ్ల వయసులో శీర్షాసనం వేయగలను. 75 ఏళ్ల వయసులో నాకు భరతనాట్యం నేర్చుకోవాలనిపించింది. మన దేశంలో ఆ వయసులో భరతనాట్యం చేసి అరంగేట్రం చేసింది నేనొక్కదాన్నే. ఆ ఆరంగేట్రం చూసి చాలామంది మెచ్చుకున్నారు’ అంటుంది బకుళ.500 మెడల్స్‘నన్ను చూసి అందరూ స్ఫూర్తి పొందాలని ఇన్ని పనులు చేస్తున్నాను. సమాజంలో మహిళల పట్ల వివక్ష ఉంది. ఆ వివక్షను ఎదిరించాలంటే ఇలాంటి కృషి చేయాలి. నేను జాతీయ అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ ఈత పో టీల్లో ఇప్పటివరకు 500 మెడల్స్ గెలుచుకున్నాను. అట్లాంటిక్, పసిఫిక్, బంగాళాఖాతాల్లో ఈత కొట్టాను. అమెరికా, ఆస్ట్రేలియా, కెనెడా, మలేసియా దేశాల్లో ఈతపో టీల్లో పాల్గొన్నాను. ఇంగ్లిష్ చానల్ ఈది గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరాలని నా కోరిక. ఇప్పటికి 400 మందికి ఈత నేర్పాను. ఈతలో ఉన్న ఆరోగ్యం, ఆనందం అంతా ఇంతా కాదు’ అంటుంది బకుళా బెన్. -
సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మిస్సింగ్.. అదే కారణమా?
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలు, ఫలితాలు వెలువడకముందే గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ నియోజకవర్గం నుచి బీజేపీ అభ్యర్ధి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన నీలేశ్ కుంభానీ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు సక్రమంగా లేవంటూ రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ తిరస్కరించడం, మిగతా అభ్యర్ధులు సైతం తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ముకేశ్ గెలుపు తథ్యమైంది.. తాజాగా సూరత్ కాంగ్రెస్ అభ్యర్ధి నీలేష్ కుంభానీ కనిపించడం లేదు. కనీసం ఫోన్లో కూడా అందుబాటులో లేడని, ఆయన ఇంటికి తాళం వేసి ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే కుంభానీ త్వరలో బీజేపీలో చేరనున్నట్లు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, ఆయన ఇంటి ముందు నిరసన చేపట్టారు. ఇంటి గోడలపై ‘ప్రజల ద్రోహి’ అంటూ పోస్టర్లు అంటించారు. అయితే గుజరాత్లో అధికార బీజేపీ తప్పుడు ప్రభావం చూపిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. సూరత్‌లో ఎన్నికలను వాయిదా వేయాలని, అలాగే ఎన్నికల ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని కోరినట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కుంభానీ అభ్యర్ధిత్వాన్ని నలుగురు ప్రతిపాదకులు నామినేట్ చేశారని, అయినా.. అకస్మాత్తుగా నలుగురు తమ సంతకాలను తిరస్కరించడం ఆశ్యర్యంగా ఉందన్నారు. ఇది యాదృచ్ఛికం కాదని, అభ్యర్థి చాలా సమయం నుంచి కనిపించడం లేదని ఆరోపించారు. చదవండి: MLC Kavitha: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు సాధారణంగా రాజ్యసభకు సభ్యులు నామినేట్ అవడం చూస్తుంటాం. కానీ లోక్‌సభలో ఏకగ్రీవం అనేది చాలా అరుదైన విషయం. కోట్లు కుమ్మరించి వ్యూహప్రతివ్యూహాలు పన్నిగెలుపు గుర్రాన్ని ఎక్కాల్సి ఉంటుంది. అయితే ప్రత్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడం, మిగతా వాళ్లు నామినేషన్లు ఉపసంహరించుకున్న ఘటనల్లో ఏకైక అభ్యర్థి పోటీలో నిలవడంతో.. వారే విజయపీఠాన్ని అధిరోహించిన సందర్భలు అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. తాజాగా అలాంటి పరిణామమే సూరత్‌లో బీజేపీ అభ్యర్ధి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంతో చోటుచేసుకుంది. సూరత్ కాంగ్రెస్ తరపున నీలేశ్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాలు సరిపోలడం లేదని ఆయన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. అంతేగాక నీలేశ్‌కు ప్రత్యామ్నాయంగా సురేశ్ పడ్సాలాతోనూ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేయించినప్పటికీ అది కూడా ఇతర కారణాలతో తిరస్కరణకు గురైంది. మరోవైపు, ఇదే స్థానం నుంచి పోటీకి దిగిన మిగతా 8 మంది సైతం తమ నామినేషన్లను చివరి రోజైన సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో ముకేశ్ దలాల్ ఒక్కరే పోటీలో నిలవడంతో ఆయన ఏకగ్రీవంగా గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. సూరత్‌లో బీజేపీ బోణీ కొట్టడంపై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ స్పందించారు.‘ ప్రధాని మోదీకి సూరత్ మొదటి కమలాన్ని అందజేసిందని తెలిపారు. ’’ అని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. ‘‘ సూరత్‌లో సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపార వర్గాలు బీజేపీపై గుర్రుగా ఉన్నాయి. 1984 తర్వాత తొలిసారిగా సూరత్‌లో ఓడిపోతామన్న భయంతో ఇలా మ్యాచ్‌ఫిక్సింగ్ చేశారు’’ అని కాంగ్రెస్ ఆరోపించింది. -
అయోధ్య రామయ్యకి విలువైన కిరీటం, దాత ఎవరంటే..
వందల ఏళ్ల నీరిక్షణ సాకారమైంది. కోట్లాది మంది భక్తుల కలను నిజం చేస్తూ ఆయోధ్యలో అద్భుతం ఆవిష్కృతమైంది. భవ్య రామమందిరంలో దివ్య రాముడు కొలువుదీరాడు. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఒక్క అయోధ్యలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రజలు ఈ వేడుకను వైభవంగా జరుపుకున్నారు. జై శ్రీరామ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఎంతోమంది భక్తులు విరాళాలు అందించారు. .దేశ విదేశాలకు చెందిన రామభక్తులు కానుకలు, విరాళాలు సమర్పించారు. రోజూ కూలి పని చేసుకునే వారి నుంచి బడా వ్యాపారుల వరకు తమకు తోచినంతా సాయం చేసి రామలయ నిర్మాణంలో భాగమయ్యారు. ఈ క్రమంలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ముకేష్ పటేల్రాముడికి భారీ విరాళం అందించారు. ‘ల్యాబ్ డైమండ్ కంపెనీ’ యజమాని అయిన ముకేష్ పటేల్, ఆయన కుటుంబం రాముడికి రూ. 11 కోట్ల విలువైన కిరీటం చేయించారు. కిరీటాన్ని నాలుగు కిలోల బంగారం. వజ్రాలు, జెమ్‌స్టోన్స్, కెంపులు, ముత్యాలు, నీలమణితో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ మేరకు ముకేష్ తన తండ్రితో కలిసి అయోధ్యను సందర్శించి ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ అధికారులకు అందజేశారు. చదవండి: Ayodhya: అయోధ్యకు తొలిరోజు పోటెత్తిన భక్తులు అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు సమాచారం. ఈ బంగారంతో రామాలయం తలుపులు, గర్భ గుడి, త్రిశూలం మొదలైనవి చేయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత బంగారం ధర ప్రకారం 101 కేజీల బంగారం అంటే రూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావించాలి. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్‌కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అగ్రస్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణలో 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ.2100 కోట్లు సేకరించారు. వీరిలో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ లాఖి, ఆయన కుటుంబం రాముల వారికి భూరి విరాళం ఇచ్చినట్టు సమాచారం. దిలీప్ కుటుంబం అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు తెలుస్తోంది..ప్రస్తుత బంగారం ధర ప్రకారంరూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఈ బంగారాన్ని రామాలయ తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరు, పిల్లర్లకు కేటాయించారు. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్‌కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అధికమని తెలుస్తోంది. మరోవైపు నేటి నుంచి(జనవరి 23) సాధారణ భక్తులకు దర్శనం అనుమతించడంతో అయోధ్యకు భక్తులు పోటెత్తారు. చలిలోనూ ఉదయం మూడు గంటల నుంచి ఆలయం భయట భారీగా క్యూ కట్టి శ్రీరాముడిని దర్శించుకుంటున్నారు. భక్తులకు రెండు స్లాట్లు కల్పించారు. ఉదయం 7గం. నుంచి 11.30 వరకు.. అలాగే.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గం. వరకు రెండు దఫాలుగా భక్తులను అనుమతించనున్నారు. -
ఎన్కోర్–ఆల్కమ్ కొత్త ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అల్యూమినియం డోర్స్, విండోస్ తయారీ కంపెనీ ఎన్కోర్–ఆల్కమ్ రూ.60 కోట్లతో గుజరాత్‌లోని సూరత్ వద్ద అత్యాధునిక ప్లాంటు నెలకొల్పుతోంది. అల్యూమినియం డోర్స్, విండోస్ విభాగంలో భారత్‌లో తొలి ఆటో రోబోటిక్ ఫెసిలిటీ ఇదేనని సంస్థ ఫౌండర్, సీఎండీ అవుతు శివకోటిరెడ్డి బుధవారం తెలిపారు. ‘1,80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దేశంలో అతిపెద్ద కేంద్రం ఇదే. జర్మనీ సాంకేతికతతో రోజుకు 30,000 చదరపు అడుగుల తయారీ సామర్థ్యంతో మార్చికల్లా రెడీ అవుతుంది. ఇప్పటికే సూరత్‌లో అల్యూమినియం డోర్స్, విండోస్ ప్లాంటు ఉంది. కస్టమర్ కోరుకున్నట్టు ఆర్కిటెక్చరల్ ఉత్పాదనలు మా ప్రత్యేకత. 60 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. హైదరాబాద్ సమీపంలోని మోకిల వద్ద ఫ్యాబ్రికేషన్ యూనిట్, ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ మార్చికల్లా ప్రారంభం అవుతాయి. ఎన్కోర్ ఇప్పటికే వుడ్ డోర్స్ తయారీలో ఉంది. దక్షిణాదిన ఎన్కోర్, ఉత్తరాదిన ఆల్కమ్ బ్రాండ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాం’ అని వివరించారు. హైటెక్స్‌లో జనవరి 19 నుంచి జరిగే ఏస్‌టెక్ ట్రేడ్ ఫెయిర్‌లో విభిన్న ఉత్పత్తులను ప్రదర్శిస్తామని ఆల్కమ్ డైరెక్టర్ జయంతి భాయ్ మనుభాయ్ తెలిపారు. ఎన్కోర్–ఆల్కమ్ ఫౌండర్ అవుతు శివకోటిరెడ్డి -
మరోసారి సత్తా చాటిన ఇండోర్.. వరుసగా ఏడోసారి నెంబర్ వన్..
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మరోసారి నెంబర్ వన్‌గా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డుల్లో వరుసగా ఏడోసారి తొలి స్థానాన్ని దక్కించుకుంది . ఇండోర్‌తోపాటు గుజరాత్‌లోని సూరత్ కూడా క్లీనెస్ట్ సిటీ తొలి ర్యాంక్‌ను సంయుక్తంగా గెలుచుకుంది.ఈ జాబితాలో మహారాష్ట్రలోని నవీ ముంబై మూడో స్థానంలో నిలిచింది. పరిశుభ్రత నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా సత్తా చాటాయి. ఏపీలో విశాఖపట్నం నాలుగు, విజయవాడ (6), తిరుపతి (8), తెలంగాణ రాజధాని హైదరాబాద్ (9) నగరాలు తొలి 10 సిటీల్లో చోటు దక్కించుకున్నాయి. అయితే టాప్ 100 లిస్ట్‌లో తమిళనాడు నుంచి ఏ నగరం కూడా ఎంపికవ్వలేదు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో చెన్నై 199 స్థానంలో ఉండటం గమనార్హం. Speaking at the Swachh Survekshan awards event in New Delhi, President Droupadi Murmu said that if we deeply understand the concept of value from waste, it becomes clear that everything is valuable and nothing is waste.https://t.co/l5hs7J7Vmb pic.twitter.com/goP4l8zTyw — President of India (@rashtrapatibhvn) January 11, 2024 విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను అందజేశారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంత పరిశుభ్రత రాష్ట్రంగా మహారాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ గెలుచుకుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. నాల్గో స్థానంలో ఒడిశా, అయిదో స్థానంలో తెలంగాణ నిలిచింది. -
అయోధ్యకు ప్రత్యేక చీర.. రామమందిర చిత్రాలతో తయారీ
సూరత్: సర్వాంగసుందరంగా నిర్మితమైన అయోధ్యలోని రామమందిర ప్రారంభోవత్సవ కార్యక్రామనికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధిగాంచిన సురత్ నగరంలోని టెక్స్టైల్ అసోషియేషన్ ప్రత్యేకంగా ఓ చీరను తయారు చేసింది. ఈ చీరపై అయోధ్యలోని రామ మందిర్, భగవాన్ శ్రీరాముడి చిత్రాలను ప్రింట్ చేసింది. అయితే ఈ ప్రత్యేకమైన చీర అయోధ్యలోని సీతా మాతా విగ్రహానికి తయారు చేసినట్లు ఆదివారం సూరత్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధి లలిత్ శర్మా తెలిపారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో ప్రపంచం అంతా ఆనందం ఉంది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ సాకారం కాబోంది. జానకీ మాత, భగవన్ హనుమాన్ కూడా మందిర నిర్మాణంపై ఆనందపడతారు’ అని శర్మా తెలిపారు. ఇప్పటికే ఒక చీరను స్థానిక శ్రీరాముని ఆలయంలో అందజేసినట్లు తెలిపారు. తాము తయారు చేసిన ప్రత్యేకమైన చీరను ఆయోధ్యకు పంపిస్తామని అన్నారు. చీర తయారు చేయాలని తమకు ఆర్డర్ వచ్చిందని, అయితే తాము ఉచితంగా తయారు చేసి పంపుతున్నామని పేర్కొన్నారు. మరిన్ని శ్రీరాముని ఆలయాల్లో కూడా సీతా మాతా విగ్రహాలకు ఉచితంగా ప్రత్యేక చీరను తయారు చేసి పంపిస్తామని తెలిపారు. ఇటీవల నేపాల్‌లోని జనాకీ మాతా జన్మస్థలం నుంచి పలు కానుకలు అయోధ్యకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక.. జనవరి 22 తేదీన అయోధ్య రామమందిరంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖలకు ఆహ్వానాలు అందించిన విషయం తెలిసిందే. చదవండి: Delhi: 22న దీపకాంతులలో ఢిల్లీ ఆలయాలు -
Narendra Modi: నా మూడో ఇన్నింగ్స్ పక్కా!
సూరత్: ప్రధానమంత్రిగా తన మూడో ఇన్నింగ్స్‌లో మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తద్వారా తాను వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికవుతానని పరోక్షంగా తేలి్చచెప్పారు. గుజరాత్‌లోని సూరత్ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య సముదాయంగా అభివృద్ధి చేసిన ‘సూరత్ డైమండ్ బోర్స్’ భవనాన్ని ఆయన ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ వాణిజ్య కేంద్రం నూతన భారతదేశ బలానికి, అంకితభావానికి ఒక ప్రతీక అని చెప్పారు. సూరత్ వజ్రాల పరిశ్రమ 8 లక్షల మందికి ఉపాధి కలి్పస్తోందని ప్రశంసించారు. కొత్త వాణిజ్య సముదాయంతో మరో 1.5 లక్షల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. సూరత్ కీర్తికిరీటంలో మరో వజ్రం చేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఇది చిన్న వజ్రం కాదని, ప్రపంచంలోనే అత్యుత్తమమైన వజ్రమని వ్యాఖ్యానించారు. దీని వెలుగుజిలుగుల ముందు ప్రపంచంలోనే పెద్దపెద్ద భవనాలు కూడా వెలవెలబోతాయని అన్నారు. ప్రపంచంలో వజ్రాల పరిశ్రమ గురించి ఎవరూ మాట్లాడుకున్నా ఇకపై సూరత్‌ను ప్రస్తావించాల్సిందేనని చెప్పారు. సూరత్ భాగస్వామ్యం పెరగాలి వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలకు ప్రభుత్వం నిర్దేశించుకుందని మోదీ చెప్పారు. దేశాన్ని దాదాపు 10 ట్రిలియన్ డాలర్ల(10 లక్షల కోట్ల డాలర్లు) ఆర్థిక వ్యవస్థగా మార్చడంతోపాటు ఎగుమతుల్లో కొత్త రికార్డులు సృష్టించాలన్నదే తమ ధ్యేయమని వివరించారు. దేశం నుంచి ఎగుమతుల విషయంలో సూరత్ సిటీ భాగస్వామ్యం మరింత పెరగాలని పిలుపునిచ్చారు. వజ్రాలు, ఆభరణాల పరిశ్రమకు ఇదొక గొప్ప అవకాశమని అన్నారు. భారత్ వైపు ప్రపంచ దేశాల చూపు నేడు ప్రపంచ దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఎన్నో అంశాల్లో మనపై ఆధారపడుతున్నాయని, మన దేశ పేరు ప్రతిష్టలు పెరిగాయని, మేడిన్ ఇండియా ఇప్పుడు బలమైన బ్రాండ్‌గా మారిందన్నారు. లక్షలాది మంది యువతకు సూరత్ డ్రీమ్ సిటీగా మారిందని, ఇక్కడ ఐటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆనందం వ్యక్తం చేశారు. సూరత్ ఎయిర్‌పోర్టులో నూతన ఇంటిగ్రేటెడ్ టెరి్మనల్ బిల్డింగ్‌ను మోదీ ఆదివారం ప్రారంభించారు. -
ఈ రైల్వే స్టేషన్ పేరు సచిన్!
స్టేడియంల సంగతి ఏమిటోగానీ రైల్వేస్టేషన్లకు క్రికెటర్ల పేర్లు ఊహించలేము. అయితే గుజరాత్‌లోని సూరత్ సమీపంలోని ఒక రైల్వేస్టేషన్ పేరు సచిన్. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ రైల్వేస్టేషన్ ముందు దిగిన ఫోటో వైరల్‌గా మారింది. ‘ఈ రైల్వేస్టేషన్‌కు మన ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకరైన నా ఫేవరెట్ క్రికెటర్, నా అభిమాన వ్యక్తి పేరు పెట్టారు. గత శతాబ్దానికి చెందిన పెద్దల ముందు చూపు అబ్బురపరుస్తుంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు సునీల్ గవాస్కర్. ఇది చూసి ‘సచిన్‌లో సన్నీని చూడడం ఆనందంగా ఉంది’ అంటూ స్పందించాడు సచిన్ తెందూల్కర్. నిజానికి ఈ రైల్వేస్టేషన్‌కి ‘సచిన్’ అనే పేరు సచిన్ తెందూల్కర్ తాతముత్తాల కాలంలోనే ఉంది. సచిన్ తెందూల్కర్ పేరుకు, ఈ రైల్వేస్టేషన్ పేరుకు ఎలాంటి సంబంధం లేకపోయినా సరదా కోసం ‘పూర్వీకుల ముందుచూపు అబ్బురపరిచింది’ అని రాశాడు గవాస్కర్. -
రసాయనాల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లోని ఓ రసాయనాల కర్మాగారంలో సంభవించిన పేలుడు, ఘోర అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 25 మంది గాయాలపాలయ్యారు. సచిన్ పారిశ్రామిక ప్రాంతంలోని ఈథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో గురువారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో రసాయనాలు నిల్వ ఉన్న ట్యాంకులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. అనంతరం చెలరేగిన మంటలు కర్మాగారాన్ని చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు 9 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. -
రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌లోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. ఈథర్ రసాయనం తయారు చేయు పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఇండస్ట్రీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణ్లాలోనే అగ్ని కీలలు ఫ్లోర్ అంతా వ్యాపించాయి. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అదృశ్యమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ఏడుగురు కార్మికుల మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియదు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి అసలు కారణాన్ని వెల్లడిస్తామని తెలిపారు. అయితే.. ఈ ప్రమాదంలో దాదాపు 1.3 మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించినట్లు పరిశ్రమ యజమాని అశ్విన్ దేశాయ్ తెలిపారు. ఇదీ చదవండి: నూతన రామాలయ ప్రారంభోత్సవంలో పాక్ కళాకారుల ప్రదర్శనలు -
సూరత్‌లో ‘దీపావళి ప్రయాణికుల’ తొక్కిసలాట.. పలువురికి అస్వస్థత!
దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. గ్రామాలకు వెళ్లేవారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను రద్దీగా మారాయి. ఈ నేపధ్యంలో కొన్నిచోట్ల తొక్కిసలాటలు కూడా చోటుచేసుకుంటున్నాయి. గుజరాత్‌లోని సూరత్ రైల్వే స్టేషన్‌కు సొంతూళ్లకు వెళ్లేందుకు భారీగా ప్రయాణికులు తరలివచ్చారు. వీరంతా రైళ్లు రాగానే ఒక్కసారిగా రైలులోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో టిక్కెట్లు ఉన్న వారు కూడా రైలు ఎక్కలేని పరిస్థితి నెలకొంది. दीपावली घर जाने को सूरत रेलवे स्टेशन पहुंचे यूपी और बिहार के मजदूर दम घुटने के कारण घायल हो गए। pic.twitter.com/zPMRZ0mpbg — Rakesh chaudhari (@Rakeshchau58578) November 11, 2023 ఈ సమయంలో తోపులాట జరిగి, పలువురు ప్రయాణికులు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. కొందరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీనిని గమనించిన రైల్వే పోలీసులు బాధిత ప్రయాణికులకు సీపీఆర్ ఇచ్చి వారిని కాపాడారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ఉపాధి రీత్యా సూరత్‌లో ఉంటున్నారు. వీరంతా దీపావళి పండుగకు తమ ఊళ్లకు వెళ్లాలని రైల్వే స్టేషన్‌కు తరలివస్తున్నారు. ఫలితంగా రైల్వే స్టేషన్లో రద్దీ నెలకొంటోంది. ఇది కూడా చదవండి: ‘గ్రేవ్‌యార్ట్ ఫర్ చిల్డ్రన్’ అంటే ఏమిటి? -
యుద్ధనౌక సూరత్.. సిద్ధమైంది.!
సాక్షి, విశాఖపట్నం: తీర ప్రాంత రక్షణకు అగ్ర దేశాలతో పోటీగా ఆయుధ సంపత్తిని పెంచుకోవడమే లక్ష్యంగా భారత నౌకాదళం వడివడిగా అడుగులు వేస్తోంది. అరేబియా సముద్ర జలాల్లో కీలకంగా ఉంటూ క్షిపణుల్ని తీసుకెళ్లడమే కాకుండా.. మిసైల్ డిస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్త యుద్ధ నౌక ఐఎన్ఎస్ సూరత్ సిద్ధమైంది. ఈ నౌక నిర్మాణంలో కీలకమైన క్రెస్ట్ (శిఖరావిష్కరణ) కార్యక్రమాన్ని సోమవారం సూరత్‌లో నిర్వహించనున్నారు. అనంతరం తుది దశ పరిశీలనల తర్వాత భారత నౌకాదళానికి అప్పగించనున్నారు. ముంబైలో తయారైన ఈ యుద్ధ నౌక గంటకు 56 కి.మీ. వేగంతో దూసుకుపోతూ శత్రు సైన్యంలో వణుకు పుట్టించగలదు. ప్రాజెక్టు–15బీలో చివరి యుద్ధ నౌక.. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్–15బీ పేరుతో రూ. 35,800 కోట్లతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం, మర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లని పెట్టాలని నిర్ణయించారు. తొలి షిప్‌ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు. 2011 జనవరి 28న ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. ఇప్పటికే ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్ యుద్ధ నౌకలు భారత నౌకాదళంలో చేరాయి. తాజాగా చివరి నౌకగా ఐఎన్ఎస్ సూరత్ వార్ షిప్ కూడా విధుల్లో చేరేందుకు సిద్ధమైంది. ఈ షిప్‌కు సంబంధించి 2018 జూలైలో కీల్ నిర్మించగా.. 2022 మే 17న షిప్ తయారీ పనుల్ని బ్లాక్ కనస్ట్రక్షన్ మెథడాలజీ సాంకేతికతతో ముంబైలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్(ఎండీఎల్) ప్రారంభించింది. ఈ నౌకకు తొలుత గుజరాత్లో ప్రధాన ఓడరేవు అయిన పోర్బందర్ పేరు పెట్టాలని నౌకాదళం భావించింది. తర్వాత.. రక్షణ మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఐఎన్ఎస్ సూరత్‌గా నామకరణం చేశారు. ఈ 4 షిప్స్‌ని 2024 కల్లా నౌకాదళానికి అప్పగించాలని ఒప్పందం. కాగా, తుదిదశకు ఐఎన్ఎస్ సూరత్ పనులు చేరుకున్న తరుణంలో ముఖ్యమైన క్రెస్ట్ (యుద్ధనౌకకు సంబంధించి ప్రత్యేకమైన సంప్రదాయ చిహ్నం. క్రెస్ట్ పూర్తయితే నౌక జాతికి అంకితం చేసేందుకు సిద్ధమైనట్లే.) ఆవిష్కరణ సూరత్‌లో జరగనుంది. అనంతరం తుది దశ ట్రయల్స్ నిర్వహించి నౌకాదళానికి అప్పగించనున్నారు. బ్రహ్మోస్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం విశాఖపట్నం–క్లాస్ స్టెల్త్ గైడెడ్–మిసైల్ డిస్ట్రాయర్ యర్ నౌకల్లో ఆఖరిది ఐఎన్ఎస్ సూరత్. విశాఖపట్నం క్లాస్ యుద్ధ నౌకలన్నీ బ్రహ్మోస్ క్షిపణుల్ని మోసుకెళ్లగల సామర్థ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోదగ్గ ఐఎన్ఎస్ సూరత్‌ను అత్యాధునిక ఆయుధ సెన్సార్లు, అధునాతన ఫీచర్లు, పూర్తిస్థాయి ఆటోమేషన్తో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ఈ యుద్ధనౌక భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక విశేషాలు.. బరువు: 7,400 టన్నులు పొడవు: 163 మీటర్లు బీమ్: 17.4 మీటర్లు డ్రాఫ్ట్: 5.4 మీటర్లు వేగం: గంటకు 30 నాటికల్ మైళ్లు (56 కిమీ) స్వదేశీ పరిజ్ఞానం: 80 శాతం పరిధి: 45 రోజుల పాటు ఏకధాటిగా 8 వేల నాటికల్ మైళ్లు ప్రయాణం చేయగల సత్తా సిబ్బంది– 50 మంది అధికారులు, 250 మంది సిబ్బంది సెన్సార్స్, ప్రాసెసింగ్ వ్యవస్థలు– మల్టీ ఫంక్షన్ రాడార్, బ్యాండ్ ఎయిర్ సెర్చ్ రాడార్, సర్ఫేస్ సెర్చ్ రాడార్ ఆయుధాలు: 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు విమానాలు: రెండు వెస్ట్‌ల్యాండ్ సీకింగ్ విమానాలు లేదా రెండు హెచ్ఏఎల్ ధృవ్ విమానాలు తీసుకెళ్లగలదు ఏవియేషన్ ఫెసిలిటీ: రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యే సౌకర్యం ఎల్రక్టానిక్ వార్ఫేర్: డీఆర్డీవో శక్తి సూట్, రాడార్ ఫింగర్ ప్రింటింగ్ సిస్టమ్ ఏర్పాటు, 4 కవచ్ డెకాయ్ లాంచర్లు, 2 కౌంటర్ టార్పెడో సిస్టమ్స్. -
ఏం కష్టం వచ్చిందో.. ముగ్గురు చిన్నారులు సహా కుటుంబం ఆత్మహత్య
సూరత్: గుజరాత్లో విషాదం చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో ఏమో ఓ కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు చిన్నారులతో సహా కుటుంబంలోని ఏడుగురు విగతజీవులుగా మారారు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలకు విషమిచ్చిన ఓ వ్యాపారి ఉరేసుకొని తాను కూడా ప్రాణాలు వదిలాడు. కుటుంబం మొత్తం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా అలజడి నెలకొంది. ఈ ఘోర ఘటన సూరత్‌లో శుక్రవారం అర్ధరాత్రి వెలుగుచూసింది. వివరాలు.. సూరత్‌లోని పాలన్ పూర్లోని ఓ అపార్ట్ మెంట్లో ఫర్నీచర్ వ్యాపారి మనీష్ సోలంకి కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి మనీష్ తన పిల్లలకు, తల్లిద్రండులకు, భార్యకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలతో సహా కుటుంబంలోని ఏడుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం ఉదయం మనీష్ సహోద్యోగి కాల్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపులు కూడా తీయకపోవడంతో అనుమానం వచ్చి వెనక డోర్ వద్దనున్న కిటీకిని ధ్వంసం చేసి ఇంట్లోగా వెళ్లగా ఈ దారుణం గురించి తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. మృతులను మనీష్ సోలంకి(35) అతని భార్య రీటా(32), ముగ్గురు పిల్లలు, మనీష్ తల్లిదండ్రులు కాంతిలాల్(65), శోభన(60) గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం అప్పు తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువకావడంతో మనీష్ సోలంకి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. యువతి హత్య -
తీవ్ర విషాదంలోనూ దుఃఖాన్ని దిగమింగుకుని..
అహ్మదాబాద్: నవమాసాలు మోసి కన్న తల్లికి, బిడ్డ కోసం ఎన్నో కలలు కన్న ఆ తండ్రికి చివరకు కన్నీళ్లే మిగిలాయి. పుట్టిన బిడ్డలో బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు చెప్పిన మాటలతో ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. అయితే అంత దుఃఖంలోనూ వాళ్లు తీసుకున్న నిర్ణయం.. వార్తల్లోకి ఎక్కింది. డైమండ్ ఫ్యాక్టరీలో పని చేసే హర్షద్, చేతన దంపతులకు ఈ నెల 13న మగబిడ్డ పుట్టాడు. అయితే.. శిశువులో కదలికలేవీ లేకపోవడంతో బిడ్డను ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి.. వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఐదురోజుల తర్వాత పసికందుకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని ప్రకటించారు. దీంతో ఆ తల్లిదండ్రులు శోకంలో మునిగిపోయారు. ఈలోపు జీవన్‌దీప్ ఆర్గాన్ డొనేషన్ ఫౌండేషన్ శిశువు తల్లిదండ్రులను సంప్రదించింది. అంత బాధలోనూ అవయవదానానికి సమ్మతించడంతో పీపీ సవానీ ఆసుపత్రి వైద్యులు బుధవారం శిశువు రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించారు. వీటిని గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో అవసరం ఉన్న ఆరుగురు చిన్నారులకు విజయవంతంగా అమర్చినట్లు సదరు ఫౌండేషన్ ప్రకటించింది. బ్రెయిన్‌డెడ్ (జీవన్మృతి) అయిన అయిదు రోజుల పసికందు అవయవాలు.. ఆరుగురు పిల్లలకు కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. -
సూరత్‌లో బాలుడి వీరగాథ.. సముద్రంలో గల్లంతై..
సూరత్: వినాయక నిమజ్జనాల సందర్బంగా గుజరాత్‌లోని సూరత్‌లో అద్భుతం జరిగింది. నిమజ్జనం సమయంలో సముద్రంలోకి కొట్టుకుపోయిన టీనేజి బాలుడు 24 గంటలపాటు జీవన్మరణ పోరాటం చేసి చివరికి సురక్షితంగా ఒడ్డుకు చేరాడు. ప్రతి ఏటా జరిగినట్లే ఈ యేడు కూడా వినాయాక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాధుడు అనంతరం గంగాదేవి ఒడిలో ఒదిగిపోయాడు. అయితే ఉత్సవాల సందర్బంగా సూరత్ లో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అందరి భక్తుల్లాగే నిమజ్జనోత్సవాన్ని చూసేందుకు డుమాస్ బీచ్‌కు తన బామ్మ, సోదరుడు సోదరితో కలిసి వెళ్ళాడు. అందరిలాగే ఆ సంబరాల్లో ఉన్న లఖన్‌ను సముద్రంలోని అలలు లోపలి లాక్కెళ్లిపోయాయి. లఖన్ దేవీపూజక్ సముద్రంలోకి కొట్టుకుపోయిన తర్వాత అతని అమ్మమ్మ అక్కడి వారిని సాయమడగటంతో కొంతమంది యువకులు సహాయం చేసే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటికి అగ్నిమాపక బృందాలు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగడంతో గజ ఈతగాళ్లు సముద్రంలోకి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. బాలుడు గల్లంతై 24 గంటలు దాటడంతో ఆ కుటుంబం తీవ్ర దుఖంలో మునిగిపోయింది. కానీ ఆ గణనాధుని చల్లని దయ వలన బాలుడు నడిసంద్రంలో నిమజ్జనం చేసిన ఒక గణేశుడి ప్రతిమ కింద ఉండే చెక్కబల్లను పట్టుకుని రాత్రంతా నీటిపై తేలియాడుతూ అలాగే ఉన్నాడు. ఆ మరునాడు అటుగా వచ్చిన జాలరులు పడవ కనిపించడంతో చేతిని పైకి ఊపుతూ వారికి సైగ చేశాడు లఖన్. అది గమనించిన మత్స్యకారుడు రసిక్ తండేల్ బాలుడిని రక్షించి పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు బాలుడిని ఆసుపత్రికి తరలించి కుటుంబానికి కబురు పంపించారు. అప్పటికే బాలుడిపై ఆశలు వదులుకున్న కుటుంబ సభ్యులు లఖన్ మళ్ళీ మృత్యుంజయుడై వారి కళ్లెదుట ప్రత్యక్షమవడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇది కూడా చదవండి: ఆసుపత్రి డీన్‌తో టాయ్‌లెట్ శుభ్రం చేయించిన ఎంపీ -
దేశీయ దిగ్గజం కొత్త స్క్రాపింగ్ ప్లాంట్ - ఏడాదికి 15,000 వాహనాలు తుక్కు.. తుక్కు!
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారతదేశంలో తన మూడవ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF) ప్రారంభించింది. గుజరాత్ సూరత్‌లో ప్రారంభమైన ఈ ఫెసిలిటీ పేరు Re.Wi.Re Recycle with Respect. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా మోటార్స్ ఇప్పటికీ ఈ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీలను భువనేశ్వర్, జైపూర్ ప్రాంతాల్లో ప్రారంభించింది. కాగా ఇప్పుడు తన మూడవ ఫెసిలిటీని సూరత్‌లో ఏర్పాటు చేసింది. ఇందులో ప్రతి ఏటా 15,000 వాహనాలను స్క్రాప్ చేయడానికి అనుకూలంగా నిర్మించారు. ఆర్విఎస్ఎఫ్ని టాటా మోటార్స్ భాగస్వామి శ్రీ అంబికా ఆటో అన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగానే దాదాపు అన్ని బ్రాండ్లకు సంబంధించిన ఎండ్ ఆఫ్ లైఫ్ ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలను స్క్రాప్ చేస్తుంది. ఈ సందర్భంగా టాటా మోటార్స్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాలాజీ మాట్లాడుతూ.. Re.Wi.Re లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సూరత్‌లో ఈ ఫెసిలిటీ రానున్న రోజుల్లో మరింత వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: భారత్ మీదే ఆశలన్నీ.. జర్మన్, జపనీస్ కంపెనీల తీరిది! నిజానికి పాత వస్తువులు కాలుష్య కారకాలుగా మారతాయి. వీటిని తుక్కు కింద మార్చి మళ్ళీ రీ-సైకిల్ పద్దతిలో ఉపయోగిస్తారు. ఈ విధానంలో పనికిరాని వస్తువులు మళ్ళీ ఉపయోగించడానికి అనుకూలంగా మారతాయి. స్క్రాపింగ్ పాలసీ కింద 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న కమర్షియల్ వాహనాలు & 20 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాహనాలు తుక్కు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గించవచ్చు. -
నడిరోడ్డుపై ఖరీదైన డైమండ్లు, ఎగబడిన జనం: అదిరిపోయే ట్విస్ట్
డైమండ్ సిటీ సూరత్ డైమండ్ బిజినెస్‌కు పెట్టింది పేరని అందరికీ తెలుసు. అయితే తాజాగా సూరత్‌లో ఒక వ్యాపారి కోట్ల విలువైన డైమండ్లున్న ఒక వీడియో పోగొట్టు కున్నాడని వార్త వైరల్ అయింది. దీంతో డైమండ్ల కోసం వేట మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. గుజరాత్లోనివరచ్చా ప్రాంతంలో ఒక వ్యక్తి అనుకోకుండా వజ్రాల ప్యాకెట్‌ను పడవేసుకున్నట్టు పుకార్లు వ్యాపించడంతో వజ్రాలకోసం ఎగబడ్డారు జనం. అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం, కోట్ల విలువైన వజ్రాలు ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోయాయనే వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ రద్దీ ఏర్పడింది. కొందరైతే ఏకంగా మార్కెట్ రోడ్డులోని దుమ్మును కూడా వదిలిపెట్టకుండా డైమండ్స్ కోసం వెతికేశారు. కొంతమంది వజ్రాలను దక్కించు కుని సంబరాలు చేసుకున్నారు. కానీ అవి నకిలీ వజ్రాలని తేలడంతో ఉసూరుమన్నారు. (మస్క్ మామూలోడు కాదయ్యా..వీడియో వైరల్! ఇక ఆ రోబో కూడా?) అయితే తనకు దొరకింది నకిలీ వజ్రం అని తేలిందని, ఇది ఇమిటేషన్ జ్యూయల్లరీ, లేదా చీర పనిలో ఉపయోగించే అమెరికన్ డైమండ్ అని అరవింద్ పన్సేరియా వాపోయారు. ఇది ఎవరో కావాలని చేసిన ప్రాంక్ అయి ఉంటుందన్నారు. వజ్రాల కొనుగోలు, అమ్మకానికి ప్రసిద్ధి చెందిన మినీ బజార్ వరచ్చా ప్రాంతంలో వ్యాపారి పొరపాటున వజ్రాల ప్యాకెట్‌ను జారవిడిచినట్టు వదంతులు వ్యాపించాయని తెలుస్తోంది. #સુરત વરાછા મિનિબજાર રાજહંસ ટાવર પાસે હીરા ઢોળાયાની વાત થતા હીરા શોધવા લોકોની ભીડ થઈ. પ્રાથમિક સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે આ હીરા CVD અથવા અમેરિકન ડાયમંડ છે..#Diamond #Surat #Gujarat pic.twitter.com/WdQwbBSarl — 𝑲𝒂𝒍𝒑𝒆𝒔𝒉 𝑩 𝑷𝒓𝒂𝒋𝒂𝒑𝒂𝒕𝒊 🇮🇳🚩 (@KalpeshPraj80) September 24, 2023 -
'విక్రమ్ ల్యాండర్ నేనే డిజైన్ చేశా..' సోషల్ మీడియాలో ప్రచారం.. చివరికి..
అహ్మదాబాద్: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని తాకిన క్షణాన దేశం అంతా ఉప్పొంగిపోయింది. అయితే.. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని తాకగానే.. ఓ వ్యక్తి ఆ క్రెడిట్ తనదేనని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. తాను ఇస్రోలో చంద్రయాన్ 3 మిషన్‌లో పనిచేశానని చెప్పుకున్నాడు. తాను తయారు చేసిన ల్యాండర్ డిజైన్ జాబిల్లిని తాకిందని గొప్పలకు పోయాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూరత్‌కు చెందిన మితుల్ త్రివేది.. ఇస్రోలో పనిచేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో పాలు పంచుకున్నట్లు చెప్పుకున్నారు. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అవగానే గొప్పగా ప్రచారం చేసుకున్నారు. దీనిపై గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మితుల్ త్రివేది వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ప్రాథమిక విచారణలో తేలినట్లు సూరత్ పోలీసు కమీషనర్ అజయ్ తోమర్ తెలిపారు. లోకల్ మీడియాలో ఆయన చెప్పినవన్నీ అబద్దాలేనని తేలినట్లు వెల్లడించారు. త్రివేది ఇన్‌స్టాలో ఇస్రో శాస్త్రవేత్తగా పేరు పెట్టుకున్నప్పటికీ ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఆయనకు పీహెచ్డీ ఉన్నట్లు చెప్పుకోవడం కూడా అబద్ధమేనని వెల్లడించారు. ఆయనకు కేవలం బీకాం డిగ్రీ మాత్రమే ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నాసాకు ఫ్రీలాన్సర్‌గా పనిచేసినట్లు చెప్పుకోవడం కూడా క్రెడిట్ సంపాదించుకునే ప్లాన్‌లో భాగమేనని వెల్లడించారు. మరోమారు మితుల్ త్రివేదిని ప్రశ్నించనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఎడారిలో పచ్చదనం కోసం కృషి చేస్తున్న స్కూల్ టీచర్.. ఇప్పటికే 4లక్షల మొక్కలు