యువతి రౌడీయిజం | Surat Woman Brandishing with Billhook Viral | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 6 2018 8:20 PM | Last Updated on Tue, Mar 6 2018 8:23 PM

Surat Woman Brandishing with Billhook Viral - Sakshi

అస్మితా గోహిల్‌

సూరత్‌ : ఆ అమ్మాయి వయసు సుమారు 20 ఏళ్లు ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఆ అమ్మాయి పెట్టే ఫోటోలు గనుక చూస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు. అంత కోమలంగా ఉంటుంది. కానీ, కొడవలి పట్టి రౌడీయిజం చూస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. 

సూరత్‌కు చెందిన అస్మితా గోహిల్‌ స్థానికంగా ఓ కాలేజీలో చదువుతోంది. ఆమె స్నేహితుడు సంజయ్‌ అలియాస్‌ భూరో ఓ పెద్ద రౌడీ షీటర్‌. అతనితో స్నేహం మానుకోవాలని ఇంట్లోవాళ్లు వారించగా.. వాళ్లను కాదనుకుని బాయ్‌ ఫ్రెండ్‌తో వచ్చి సెటిల్‌ అయిపోయింది. ఇదిలా ఉంటే హోలీ పండగ రోజు భూరో ఓ వ్యక్తితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో అతను పారిపోతుండగా.. భూరోతోపాటు అస్మితా కూడా అతని వెంటపడ్డారు. 

ఎట్టకేలకు వరచ్ఛా ప్రాంతంలో అతన్ని పట్టుకుని కత్తితో ఖతం చేస్తామంటూ బెదిరింపులు దిగారు. భూరో ఓ చిన్న కత్తితో అతనికి వార్నింగ్‌ ఇస్తుంటే.. అస్మితా ఏకంగా కొడవలి పట్టుకుని గిరగిరా తిప్పుతూ సదరు వ్యక్తిపైకి వెళ్లింది. ఆ సమయంలో ఇద్దరు తాగి ఉన్నట్లు తెలుస్తోంది. ధైర్యం చేసి కొందరు వారిని అడ్డుకోవాలని చూస్తే.. ఆమె వారికి కూడా వార్నింగ్‌ ఇచ్చింది. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫోన్‌లో షూట్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశాడు. విషయం తమ దాకా చేరటంతో పోలీసులు ఇప్పుడు భూరో, అస్మితల కోసం గాలింపు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement