Video: Little School Girl Dancing To Viral Kaccha Badam Song, Goes Trending In Social Media - Sakshi
Sakshi News home page

Viral Video: కచ్చా బాదమ్‌ పాటకు చిన్నారి క్యూట్‌ స్టెప్పులు

Published Mon, Mar 14 2022 2:53 PM | Last Updated on Tue, Mar 15 2022 8:58 AM

Viral Video Of Little School Girl Dancing to Kacha Badam - Sakshi

పల్లీలు అమ్ముకునే వ్యక్తి పాడిన కచ్చాబాదం పాట ఏ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించిందో అందరికి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో వీధి వీధి తిరుగుతూ ప‌ల్లీలు అమ్ముకునే భుబ‌న్ బ‌ద్యాక‌ర్ అనే వ్య‌క్తి పాడిన ఈ ఒక్క పాట అతన్ని ఓవర్‌నైట్‌ స్టార్‌ను చేసింది. ప్రస్తుతం ఎక్కడా చూసిన ఇదే పాట వినిపిస్తోంది. సోష‌ల్ మీడియాలోనూ కచ్చా బాదం పాట తెగ వైరలవుతోంది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కచ్చాబాదం పాట‌కు స్టెప్పులేస్తున్నారు.

తాజాగా  కచ్చా బాదమ్‌ పాటకు ఓ చిన్నారి డ్యాన్స్‌ చేసిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో చిన్నారి స్కూల్‌ యూనిఫామ్‌ ధరించి అంగన్‌వాడీ కేంద్రంలో అందరి ముందు స్టెప్పులేసింది. ముఖం మీద చిరునవ్వుతో పాప చేసిన  క్యూట్‌ డ్యాన్స్‌ స్టెప్పులు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను ఐఏఎస్‌ అధికారి అవనీష్‌ శరన్‌ షేర్‌ చేశారు. కాగా ఈ వీడియో గుజరాత్‌లో తీసినట్లు ఓ యూజర్‌ తెలిపారు. 
చదవండి: అత్యంత వృద్ధ జంట...వాళ్లుకు ఇది ఎ‍న్నో వివాహ వార్షికోత్సవమో తెలుసా!

అదే విదంగా ఈ వీడియోను మహిళా, శిశు అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ నేహా కంఠారియా ట్విట్టర్‌లో వీడియోను పోస్టు చేశారు. ‘ట్రెండ్స్‌ పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాదు.. గ్రామాల్లో కూడా వ్యాప్తి చెందుతోంది. గుజరాత్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో అందమైన చిన్నారి డ్యాన్స్‌’ అంటూ కామెంట్‌ చేశారు. ఇక చిన్నారి వీడియోను నెటిజన్లు బాగా ఆకర్షిస్తోంది. ఇంత చిన్న వయసులోనే అందంగా పర్‌ఫెక్ట్‌గా స్టెప్పులేసిందని ప్రశంసిస్తున్నారు.
చదవండి: ఆశ్చర్యం: మనిషి నాలుకపై వెంట్రుకలు.. ఎందుకలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement