చిన్నారుల నుంచి పెద్దల దాకా గుండెపోటుతో సంభవిస్తున్న హఠాన్మరణాలు ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కారణంలో చిన్నారుల గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తుండటం కలచివేస్తోంది. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈసారి 8 ఏళ్ల బాలిక (School Girl) ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని (Ahmedabad) థల్తేజ్ ప్రాంతంలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి.
అహ్మదాబాద్‌లోని గార్గి రాణపరా(Gargi Ranapara) జేబార్ స్కూల్ ఫర్ చిల్డ్రన్‌లో గార్గి మూడో తరగతి చదువుతోంది. పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటికే ఛాతీ నొప్పికి గురైంది. క్లాస్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా నొప్పి రావడంతో కాసేపు అక్కడే నిలబడింది. నొప్పితో బాధపడుతూనే అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. అంతే కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన టీచర్లు ఆమెకు సపర్యలు చేశారు. బాలికను కాపాడేందుకు టీచర్లు సీపీఆర్ చేశారు. అయినా బాలికలో ఎలాంటి చలనం లేదు. వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే సమయానికే బాలిక పరిస్థితి విషమించింది. వైద్యులు ఆమెను బతికించేందుకు తీవ్రంగా శ్రమించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గార్గి గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ శర్మిష్ఠ సిన్హా వెల్లడించారు.గార్గి పాఠశాల ఆవరణలో కొంచెం అనారోగ్యంగా కనిపించిందని, కొద్దిసేపు కూర్చున్న వెంటనే కుప్పకూలిపోయిందని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన టీచర్లు, విద్యార్థులు వెంటనే ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించినా, ఆమెనుకాపాడలేకపోయామని విచారం వ్యక్తం చేశారు.
మరోవైపు దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక గుండెపోటుకు గల కారణాలలపై అన్ని కోణల్లో దర్యాప్తు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నీరజ్ బడ్గుజర్ ప్రకటించారు.
🚨HEART BREAKING
A 8 year old girl , all of a sudden fell down and died in school. Video from Krnavati (Ahmedabad) , Gujarat.
What is happening to kids and youngsters ?? Almost every week we see or hear such cases . Instead of blaming Covid vaccines , we need to get into the… pic.twitter.com/R66mcrOIK9— Amitabh Chaudhary (@MithilaWaala) January 10, 2025
> కాగా ముంబైకి చెందిన గార్గి, తన బంధువుల ఇంటిలో ఉంటూ అహ్మదాబాద్‌లో చదువుకుంటోంది. గతంలో పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని సమాచారం. ఇటీవల బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలిక తేజస్విని పాఠశాల కారిడార్‌లో గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.
గుండెపోటు లక్షణాలు
ఛాతీ నొప్పి,
ఊపిరి ఆడకపోవడం
వికారం, చెమటలు పట్టడం
చేతులు, వీపు లేదా దవడలో నొప్పి వంటివి సాధారణ లక్షణాలు
నోట్: గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. అయితే, గుండె పోటు వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. అందుకే ఏ చిన్న అనారోగ్యం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మరీ ముఖ్యంగా జిమ్ చేస్తున్నాం కదా, ఆరోగ్యంగానే ఉన్నాం కదా అని అస్సలు అనుకోకూడదు. ఇటీవలి కేసులను దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లల్లో అయినా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి కారణాలను రూల్ అవుట్ చేసుకోవడం చాలా అవసరం.
Comments
Please login to add a commentAdd a comment