shocking
-
మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియో
చిన్నారుల నుంచి పెద్దల దాకా గుండెపోటుతో సంభవిస్తున్న హఠాన్మరణాలు ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కారణంలో చిన్నారుల గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తుండటం కలచివేస్తోంది. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈసారి 8 ఏళ్ల బాలిక (School Girl) ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని (Ahmedabad) థల్తేజ్ ప్రాంతంలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి.అహ్మదాబాద్‌లోని గార్గి రాణపరా(Gargi Ranapara) జేబార్ స్కూల్ ఫర్ చిల్డ్రన్‌లో గార్గి మూడో తరగతి చదువుతోంది. పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటికే ఛాతీ నొప్పికి గురైంది. క్లాస్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా నొప్పి రావడంతో కాసేపు అక్కడే నిలబడింది. నొప్పితో బాధపడుతూనే అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. అంతే కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన టీచర్లు ఆమెకు సపర్యలు చేశారు. బాలికను కాపాడేందుకు టీచర్లు సీపీఆర్ చేశారు. అయినా బాలికలో ఎలాంటి చలనం లేదు. వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే సమయానికే బాలిక పరిస్థితి విషమించింది. వైద్యులు ఆమెను బతికించేందుకు తీవ్రంగా శ్రమించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గార్గి గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ శర్మిష్ఠ సిన్హా వెల్లడించారు.గార్గి పాఠశాల ఆవరణలో కొంచెం అనారోగ్యంగా కనిపించిందని, కొద్దిసేపు కూర్చున్న వెంటనే కుప్పకూలిపోయిందని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన టీచర్లు, విద్యార్థులు వెంటనే ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించినా, ఆమెనుకాపాడలేకపోయామని విచారం వ్యక్తం చేశారు.మరోవైపు దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక గుండెపోటుకు గల కారణాలలపై అన్ని కోణల్లో దర్యాప్తు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నీరజ్ బడ్గుజర్ ప్రకటించారు.🚨HEART BREAKING A 8 year old girl , all of a sudden fell down and died in school. Video from Krnavati (Ahmedabad) , Gujarat.What is happening to kids and youngsters ?? Almost every week we see or hear such cases . Instead of blaming Covid vaccines , we need to get into the… pic.twitter.com/R66mcrOIK9— Amitabh Chaudhary (@MithilaWaala) January 10, 2025 > కాగా ముంబైకి చెందిన గార్గి, తన బంధువుల ఇంటిలో ఉంటూ అహ్మదాబాద్‌లో చదువుకుంటోంది. గతంలో పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని సమాచారం. ఇటీవల బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలిక తేజస్విని పాఠశాల కారిడార్‌లో గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.గుండెపోటు లక్షణాలుఛాతీ నొప్పి,ఊపిరి ఆడకపోవడంవికారం, చెమటలు పట్టడం చేతులు, వీపు లేదా దవడలో నొప్పి వంటివి సాధారణ లక్షణాలునోట్: గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. అయితే, గుండె పోటు వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. అందుకే ఏ చిన్న అనారోగ్యం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మరీ ముఖ్యంగా జిమ్ చేస్తున్నాం కదా, ఆరోగ్యంగానే ఉన్నాం కదా అని అస్సలు అనుకోకూడదు. ఇటీవలి కేసులను దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లల్లో అయినా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి కారణాలను రూల్ అవుట్ చేసుకోవడం చాలా అవసరం. -
మెట్రోలో వర్షం.. కంగుతిన్న ప్రయాణికులు
ముంబై: దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనం పలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో మహారాష్ట్రలోని ముంబైలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది.ప్రయాణీకులతో నిండిన ముంబై మెట్రోలోని ఒక కోచ్‌లో అకస్మాత్తుగా వర్షం పడింది. ప్రయాణికులతో రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.కోచ్‌లో ఉన్న ఏసీ వెంట్ నుంచి అకస్మాత్తుగా నీరు బయటకు రావడాన్ని వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ దృశ్యాన్ని అక్కడున్న పలువురు తమ కెమెరాల్లో బంధించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన అనేక వైరల్ వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. ఇప్పుడు ఇదే రేంజ్లో ముంబై మెట్రో వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన కొందరు.. ‘మెట్రోలో ప్రయాణించేందుకు వారు టికెట్ తీసుకున్నారని, అయితే ఇప్పుడు వారంతా స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నట్లుందని కామెంట్ చేశారు. ఈ ఘటనపై కొందరు సరదాగా కామెంట్ చేస్తుండగా, మరికొందరు మెట్రో పరిస్థితిని సీరియస్‌గా తీసుకుంటున్నారు. మెట్రో యాజమాన్యం ఈ సమస్యను పరిష్కరించాలని పలువురు యూజర్లు కోరుతున్నారు. Life in a metro ❌Rain in a metro ✅#Mumbai #MumbaiRain pic.twitter.com/B2m90FsbuW— Miss Ordinaari (@shivangisahu05) September 24, 2024ఇది కూడా చదవండి: నేడు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు -
ఇంటికి మరమ్మతు చేస్తుండగా.. బాత్ టబ్ కింద ‘మరో ప్రపంచం’
ఇంటిలోని స్టోర్‌రూమ్‌ను శుభ్రం చేస్తున్నప్పుడో లేదా ఇంటికి మరమ్మతులు చేస్తున్నప్పుడో మనకు అనుకోని రీతిలో పాతబడిన వస్తువులు కనిపించి ఆశ్చర్యం కలిగిస్తాయి. అటువంటి సందర్భాల్లో ఆ వస్తువులతో మనకు ఆనాడు ఉన్న అనుబంధం గుర్తుకు వస్తుంది. ఇటువంటి ఘటనే ఒక జంటకు ఎదురయ్యింది. వివరాల్లోకి వెళితే అమెరికాలోని మిచిగాన్ స్టేట్‌కు చెందిన హేలీ గిల్మార్టిన్, ఆమె భర్త ట్రెవర్లు లేక్ హురాన్ సమీపంలో ఉంటున్నారు. వారు తమ ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ నేపధ్యంలో వారు ఇంటిలోని ఒక బాత్ టబ్‌ను తొలగించాలని భావించారు. పనివారి చేత వారు ఆ బాత్ టబ్‌ను తొలగించగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి వారు షాక్ అయ్యారు.ఆ బాత్‌టబ్ కింద కొంతవరకూ నీటితో నిండిన ఒక గది కనిపించింది. ఇది వారికి ఎంతో వింతగా అనిపించింది. ఆ భార్యాభర్తలు సాహసం చేసి, ఆ గదిలోనికి ఎలాగోలా వెళ్లారు. నీటితో నిండిన ఆ గదిలో ఒకవైపు నుంచి మరోవైపునకు వెళ్లారు. అది ఒక సరస్సుకు దారి తీసున్నదని తెలిసి వారు అవాక్కయ్యారు. దీనిని పూర్వకాలంలో స్మగ్లింగ్‌కు వినియోగించేవారేమోనని వారు భావిస్తున్నారు. అయితే ఆ చుట్టుపక్కల ఇళ్లలోనూ ఇలాంటి సొరంగాలు ఉన్నట్లు వారు గుర్తించారు. కాగా ఆ జంట ఆ బాత్ టబ్‌ను తొలగించి, ఆ ప్లేస్‌ను గేమ్ రూమ్‌గా మార్చాలనుకున్నారట. -
రిలీజ్ కి ముందే రికార్డులు
-
రాజస్థాన్‌లో అమానుషం.. మహిళను వివస్త్రను చేసి, గ్రామంలో ఊరేగించి
రాజస్థాన్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య(21) పట్ల భర్త దుర్మార్గంగా ప్రవర్తించాడు. భార్యపై దాడి చేసి, ఆమె బట్టలు విప్పి గ్రామంలో నగ్నంగా ఊరేగించాడు. ఈ దారుణం ప్రతాప్‌గఢ్ జిల్లాలో గురువారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం. 21 ఏళ్ల గిరిజన యువతికి ఇంతకుముందే పెళ్లి అయ్యింది. అయితే ఆమె పక్కింటి యువకుడితో సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అతడితో వివాహిత పరారయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఆమె భర్త, అత్తమామలు ఆగ్రహించి..మహిళను కిడ్నాప్ చేసి వాళ్ల గ్రామానికి తీసుకొచ్చి ఆమెపై దాడి చేశారు. అక్కడితో ఆగకుండా ఆమె ఒంటిపై ఉన్న దుస్తులు తొలగించి.. వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. అంతేగాక మహిళ సాయం కోసం అర్తించినా అక్కడ ఉన్న వాళ్లు ఆమెకు హెల్ప్ చేసేందుకు ముందుకు రాకపోగా.. ఈ తతంగాన్ని మొత్తం సెల్ఫోన్లో రికార్డు చేశారు..దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిలో అందరిముందే మహిళను ఆమె భర్త దుస్తులు విప్పిందుకు ప్రయత్నించడం కనిపిస్తుంది. బాధితురాలు సాయం కోసం వేడుకోవడం, అక్కడున్న వారంతా విడ్డూరం చూసినట్లు చూస్తుండటం కూడా కనిపిస్తోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై మొత్తం 10 మందిపై పోలసులు వివిధ కేసులు నమోదు చేశారు. ఆరు బృందాలుగా వీడి దర్యాప్తు చేపట్టారు. ప్రతాప్‌గఢ్ ఎస్పీ అమిత్ కుమార్ గ్రామంలోనే ఉండి విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని.. మరికొంతమందిని అరెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. చదవండి: జేడీఎస్ నేత యువతులతో రాసలీలలు .. సోషల్ మీడియాలో వీడియో వైరల్ प्रतापगढ़ जिले में पीहर और ससुराल पक्ष के आपसी पारिवारिक विवाद में ससुराल पक्ष के लोगों द्वारा एक महिला को निर्वस्त्र करने का एक वीडियो सामने आया है। पुलिस महानिदेशक को एडीजी क्राइम को मौके पर भेजने एवं इस मामले में कड़ी से कड़ी कार्रवाई के निर्देश दिए हैं। सभ्य समाज में इस… — Ashok Gehlot (@ashokgehlot51) September 1, 2023 కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీవ్రంగా స్పందించారు. దీనిని ఖండిస్తూ గురువారం అర్థరాత్రి ట్వీట్ చేశారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా ఒక మహిళను ఆమె భర్త, అత్తమామలు వివస్త్రను చేసిన వీడియో కలవరానికి గురిచేస్తోందన్నారు. ఈ విషయంలో ఏడీజీపీని సంఘటనా స్థలానికి పంపి ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నీచమైన చర్యకు పాల్పడిన ఇలాంటి నేరగాళ్లకు సమాజంలో చోటు లేదని, వీరిని వీలైనంత త్వరగా కటకటాల వెనక్కి నెట్టి విచారణ చేపడతామని చెప్పారు. राजस्थान में अब महिलाओं पर अमानवीयता की सारी सीमाएं पार हो चुकी हैं। धरियावद में एक नारी को निर्वस्त्र कर पीटा गया है, जिसका वीडियो वायरल है, लेकिन महिला सुरक्षा पर बड़े-बड़े दावे करने वाले गहलोत जी जाने किस राज्य के मुख्यमंत्री और गृहमंत्री हैं? दो दिन बीत गए पुलिस ने रिपोर्ट… pic.twitter.com/iQUt0PIdNQ — Gajendra Singh Shekhawat (@gssjodhpur) September 1, 2023 బీజేపీ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్ స్పందిస్తూ.. ఈ సంఘటన కాంగ్రెస్ వంచనను బయటపెట్టిందని విమర్శించారు. అశోక్ గహ్లోత్‌ను రాజీనామా చేయాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. అలాగే రాజస్థాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధర రాజే సైతం కాంగ్రెస్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహిళలపై జరిగే నేరాల్లో రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉందని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. -
మ్యారేజ్ డే ఏమోగానీ, 24 లక్షల ఉబెర్ బిల్లు చూసి గుడ్లు తేలేసిన జంట
గ్వాటెమాలాలో విహారయాత్రకు వెళ్లిన అమెరికాకు చెందిన ఓ జంటకు ఉబెర్ చుక్కలు చూపించింది తమరైడ్కు ఏకంగా 24 లక్షలు వసూలు చేయడం చూసి పాపం గుడ్లు తేలేసారు. ఎంతో ఆనందంగా తమ వివాహ ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి వెళ్లిన జంటకు ఈ చేదు అనుభవం ఎదురైంది. వివరాలను పరిశీలిస్తే.. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం ఆస్ట్రేలియన్ జంట డగ్లస్ ఆర్డోనెజ్ డొమినిక్ ఆడమ్స్ గ్వాటెమాలాకు తమ వివాహ వార్షికోత్సవం సందర్బంగా సుందరమైన పర్యాటక ప్రాంతం గ్వాటెమాలా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి నిర్దేశిత బిల్లు 55 డాలర్లు (దాదాపు రూ. 4,500) దీనికి దాదాపు 600 శాతం ఎక్కువగా 29,994 డాలర్ల (సుమారు రూ. 24 లక్షలు) వసూలు చేసింది. దీంతో ఏకంగా అకౌంట్మొత్తం ఖాళీ అయిపోయింది. (AI Anchor Lisa: అదరగొట్టేస్తున్న యాంకరమ్మ: దిమ్మతిరిగే వీడియో హల్చల్) ఈ విషయాన్ని డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పుడు నో సఫీషియంట్ ఫండ్స్ అని మెసేజ్ వచ్చినపుడు గానీ గమనించలేదు. అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకుని 24 లక్షల రూపాయలు ఖతం కావడంతో లబోదిబోమన్నారు. ఇది తమ ఉత్సాహాన్ని నీరు గార్చేసిందని డగ్లస్ ఆర్డోనెజ్ వాపోయాడు. అయితే కొన్ని రోజుల తరువాత అదృష్టవశాత్తూ మొత్తం రీయింబర్స్మెంట్ అయినప్పటికీ, ఎంతో ఆనందంగా గడపాల్సిన క్షణాలు ఆందోళనలో మునిగి పోయాయని సంస్థ కస్టమర్ సర్వీస్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది ఆడమ్స్. (గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు) ఈ ఎర్రర్‌ను గుర్తించి, రీయింబర్స్మెంట్ చేశామని ఉబెర్ ప్రతినిధి తెలిపారు. బ్యాంక్ లోపం కారణంగా పొరపాటుగా కాలన్లలో కాకుండా డాలర్లలో ఫీజు వచ్చిందని తెలిపింది. కస్టమర్లు ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుంటామని, స్వీకరించిన, వారి సమస్యను తమ టీం త్వరగా సరిదిద్దిందని వెల్లడించారు. నిర్దిష్ట బ్యాంకుల విధానాల ఆధారంగా రీఫండ్ సమయం మారుతుందని ప్రతినిధి పేర్కొన్నారు. -
కీర్తి, కృతీ.. ఇద్దరిది ఒకే స్థితి… ఏమిటి ఈ పరిస్థితి?
దక్షిణాదిన స్టార్ హీరోయిన్ల జాబితాలో కీర్తిసురేష్ ఉన్నారు. ఆమె ఒక పక్క గ్లామర్ పాత్రలు చేస్తూనే... మరోపక్క కథానాయిక ప్రాధాన్యమున్న కథలతోనూ మెరుస్తున్నారు. ఆమె గత సినిమాలు కాస్త నిరాశపర్చినా.. ప్రస్తుతం ఆమె చేతుల్లో చాలా వరకు తమిళ ప్రాజెక్టులే ఎక్కువున్నాయి. దీంతో అవకాశాలు వచ్చిన చోటుకే వెళ్లే ఆలోచనలో కీర్తి ఉందట. టాలీవుడ్లో స్కీన్ షో చేసినా అంతగా అవకాశాలు రాకపోవడంతో మద్రాస్ ఫ్లైట్ ఎక్కడమే బెటర్ అనుకుంటుందట. తమిళంలో ఆమె చేతిలో సుమారు నాలుగుకు పైగా చిత్రాలున్నాయి. (ఇదీ చదవండి: Devara: ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్నారా?) తెలుగులో మాత్రం చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో మాత్రమే కనిపించనుంది. అది కూడా చెల్లెలు పాత్రలో.. కానీ నాగచైతన్య, చందు మొండేటి కాంబోలో రాబోతున్న సినిమాకు కోసం కీర్తి సురేష్‌ను తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారట. ఏదేమైనా ఎక్కడ అవకాశాలు పిలిస్తే అక్కడికి వెళ్లడంలో తప్పులేదని నెటిజన్స్ అంటున్నారు. మరోవైపు 'ఉప్పెన'తో నటిగా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే భారీ క్రేజ్ సంపాదించుకున్న నటి కృతీశెట్టి పరిస్థితి కూడా దాదాపు కీర్తి మాదిరే ఉంది. ఈమెకు చాలానే ఛాన్స్‌లు అయితే వచ్చాయి కానీ హిట్లు మాత్రం రాలేదు. వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ వంటి చిత్రాలు వరుస డిజాస్టర్లు వచ్చాయి. దీంతో ఆమెకు టాలీవుడ్లో కొంత మేరకు అవకాశాలు తగ్గాయి. కానీ తమిళ, మలయాళంలో మాత్రం భారీగానే ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయి. మలయాళంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా 'అజయంతే రాండమ్ మోషణం'లో కృతిశెట్టికి ఛాన్స్ దక్కింది. ఇందులో '2018' సినిమాతో సంచలనం రేపిన టోవినో థామస్ హీరో. తమిళ్ నుంచి రెండు సినిమాలు ఈ అమ్మడు చేతిలో ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ఈ ఇద్దరు భామలు టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పనున్నారా అనిపిస్తుంది. (ఇదీ చదవండి: వాళ్లు నన్ను అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు.. పాయల్ సంచలన కామెంట్స్) -
Bad News: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం, షాక్‌లో ఉద్యోగులు!
సాక్షి, ముంబై: భారతీయ రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ఉద్యోగులకు చేదువార్త. 2022-23 ఆర్థిక సంవత్సరం క్యూ4లో తన ఉద్యోగులకు సగటున 60 శాతం వేరియబుల్ వేతనాన్ని అంద జేయనుంది. (ఇదీ చదవండి: Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ) ఆర్థిక మాంద్యం, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఐటీ మేజర్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బిజినెస్ టుడే రిపోర్ట్ ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి- మార్చి)లో ఉద్యోగులకు 60 శాతం వేరియబుల్ పే మాత్రమే అందించనుంది. మాంద్యం ఆందోళనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, బ్యాంకింగ్ సంక్షోభం ప్రభావంతోనే కంపెనీ ఈ మేరకు నిర్ణయించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో ఐటీ పరిశ్రమపై పెరుగుతున్న ఒత్తిడికి ఇది సూచిక అని నిపుణుల అంచనా. ఇన్ఫోసిస్ గతంలో (2022-23 ఆర్థిక సంవత్సరం) మొదటి త్రైమాసికంలో 70 శాతం వేరియబుల్ పే ప్రకటించింది. రెండో త్రైమాసికంలో దీన్ని 65 శాతం శాతానికి తగ్గించింది. కాగా ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌ల ప్రకారం, డిసెంబర్లో 24.3 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు మార్చి త్రైమాసికంలో 20.9 శాతానికి దిగి వచ్చింది. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) మరిన్ని బిజినెస్వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
ఆర్సిబీ వరుస ఓటములు...విరాట్ షాకింగ్ ట్వీట్
-
షాకింగ్ ఘటన: ‘చనిపోయిన వ్యక్తి’ సీఎం, డీజీపీలకి లేఖ!
కొన్నికేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. కారణాల రీత్యా చిక్కుముడి వీడని కేసులు అకస్మాత్తుగా తెరపైకి వచ్చి అధికారులను షాక్ గురి చేస్తాయి. క్లోజ్ అయ్యిందన్న కేసు కాస్త అంతుపట్టని విధంగా అధికారులకు మరో సమస్యను తెచ్చిపెడుతుంటాయి . అచ్చం అలాంటి ఘటనే బిహార్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆరు నెలల క్రితం చనిపోయాడు. ఆ వ్యక్తి తాను బతికే ఉన్నానని, తనకు పెళ్లైందంటూ సీఎం నితీష్ కుమార్‌కు, డీజీపీకి, పోలీస్టేషన్‌కి లేఖ రాశాడు. ఆ లేఖ రాసిన వ్యక్తి ఆరు నెలలక్రితం చనిపోయిన మిస్సింగ్ కేసు వ్యక్తి సోనుగా శ్రీ వాస్తవ్గా గుర్తించారు. పోలీసుల రికార్డుల ప్రకారం..పాట్నాలోని ఓ కుటుంబం 30 ఏళ్ల సోను శ్రీ వాస్తవ్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. అతను ఇంటికి కావాల్సిన వస్తువులు కొనడానికి వెళ్లి తిరిగా రాలేదంటూ సోను తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసు అధికారి ఉదయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..బాధితుడు(సోను) తండ్రి ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా..రెండు రోజుల అనంతరం సోషల్ మీడియాలో గొంతుకోసిన మృతదేహం వైరల్ అయ్యింది. ఆ చనిపోయిన వ్యక్తి తమ కొడుకేనని సోను కుటుంబం చెప్పడంతో మేము కిడ్నాప్ కమ్ హత్య కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించాం అతను మిస్సైన రోజు చివరి ఫోన్‌కాల్ లోకేషన్ ట్రేస్ చేసి పట్టుకునేందుకు యత్నించినా సాధ్యం కాలేదు, శ్రీ వాస్తవ్ అదృశ్యం కేసు చిక్కుముడి వీడలేదన్నారు ఉదయ్ సింగ్. కాగా, పోలీసులు కూడా అతడు చనిపోయాడనే భావించారు. కానీ ఇప్పుడూ తెరపైకి వచ్చి ఈ లేఖ ఘటనతో ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు అధికారులు. అంతేగాదు ఆ చనిపోయాడనుకున్న సోను తన లేఖలో తాను ఉత్తరప్రదేశ్‌లో తన భార్యతో కలిసి ఉంటున్నానని చెప్పాడు. పైగా తాను ఇంటికి కావల్సిన వస్తువులు కొనడానికని చెప్పి రూ. 50 వేలు తీసుకుని బస్సు ఎక్కినట్లు తెలిపాడు. సోను ఆ లేఖ తోపాటు తనకు పెళ్లైనట్లు ప్రూవ్ చేసే సాక్ష్యాధారాలను సైతం జత చేయడం విశేషం. లేఖ చివర్లో తన పేరు మీద కిడ్నాప్ కమ్ మర్డర్ కేసు పెట్టడం సరికాదని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు అతడి కుటుంబానికి సమాచారం అందించడమే గాక తదుపరి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: సీనియర్ సిటిజన్లకు రాయితీల రద్దుతో.. రైల్వే శాఖకు రూ.2,242 కోట్లు) -
సల్మాన్ ఖాన్ తో డేటింగ్ ? పూజ హెగ్డే షాక్ కామెంట్స్..
-
గిల్ దెబ్బకు ప్రీతి జింటా షాకింగ్ రియాక్షన్
-
సీఎస్కే కు స్ట్రోక్ ఇచ్చిన స్ట్రోక్స్..
-
షాకింగ్: కదులుతున్న బస్సు కింద తల పెట్టిన వ్యక్తి.. వీడియో వైరల్
ముంబై: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రద్దీగా ఉన్న రోడ్డుపై కదులుతున్న బస్సు కింద తల పెట్టి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం అంధేరి వెస్ట్‌లోలోని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీని ప్రకారం.. జనాలు, వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో అటువైపుగా వస్తున్న బస్సును గమనించాడు. బస్సు దగ్గరికి రావడంతో వెంటనే దాని చక్రాల మధ్య పడుకుండిపోయాడు. డ్రైవర్ గమనించకుండా బస్సును అలాగే ముందుకు వెళ్లనివ్వడంతో అతని నడుము భాగం మీద నుంచి వెనక టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. డిసెంబర్ 6న ఈ ఘటనకు సంబంధించిన వీడియో పోలీసుల దృష్టికి రాకముందే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ గఫార్ ఇస్మాయిల్ సయ్యద్ (59)గా పోలీసులు గుర్తించారు. అతని మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. బాధిత వ్యక్తి ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడనే దానిపై స్పష్టత రాలేదు. చదవండి: బస్ టైర్ల కిందకు దూసుకెళ్లిన బైకర్.. హెల్మెట్ ఉండడంతో సేఫ్.. #Watch | On Camera, Mumbai Man Lunges Under Moving Bus On Busy Road, Dies pic.twitter.com/lWmv3cQE9V — NDTV Videos (@ndtvvideos) December 13, 2022 -
వార్నీ.. అందుకని ఆమెను హత్య చేశాడట!
ఆమె హత్య కేసు ఒక సంచలనం. నాలుగేళ్లుగా నిందితుడి కోసం గాలింపు చేస్తూనే ఉన్నారు అధికారులు. ఏ దేశంలో ఉన్నాడో తెలిసి కూడా.. ట్రేస్ చేయలేకపోయాడు. చివరికి... ఆచూకీ చెబితే భారీ నజరానా ఇస్తామని ప్రకటించారు కూడా. ఎలాగైతేనేం భారత్‌లో అతన్ని మొత్తానికి అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్యకు ప్రేరేపించిన కారణం తెలిసి.. మన పోలీసులు కంగు తిన్నారు. 24 ఏళ్ల తోయా కార్డింగ్లీ.. అక్టోబర్ 21, 2018 నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబం క్వీన్స్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్ చస్తే.. మరుసటి రోజు తోయా శరీరం అతిదారుణంగా.. బీచ్ ఇసుకలో పాతిపెట్టిన స్థితిలో పోలీసుల కంట పడింది. ఆమె పెంపుడు కుక్కను ఆ దగ్గర్లోనే ఉన్న ఓ చెట్టుకు కట్టేసి ఉంచారు. ఉన్మాదంతో కూడిన, దారుణమైన హత్య.. అని తోయా హత్య కేసుపై ఆస్ట్రేలియా పోలీసులు ప్రకటన చేశారు. ఆపై దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా.. రాజ్విందర్ సింగ్ అనే మేల్ నర్స్పై అనుమానపడ్డారు. అయితే ఘటన జరిగిన 48 గంటల్లోపే భార్యాపిల్లలతో పాటు ఉద్యోగాన్ని వదిలేసి దేశం విడిచి పారిపోయాడు రాజ్విందర్ సింగ్. దీంతో రాజ్విందర్పై అనుమానం బలపడింది. ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కేముందు అతని ఫొటోను కూడా పోలీసులు ఆచూకీ కోసం ఉపయోగించుకున్నారు. కానీ, ఇండియాలో అతని ఎక్కడ ఉన్నాడనే ఆచూకీ కష్టతరంగా మారింది. దీంతో మోస్ట్ వాంటెడ్ రాజ్విందర్ సింగ్ ఆచూకీ కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. కిందటి ఏడాది మార్చిలో భారత విదేశాంగ శాఖ సాయం కోరింది క్వీన్స్లాండ్ పోలీస్ శాఖ. ఈ క్రమంలో.. తాజాగా రాజ్విందర్ గురించి సమాచారం అందించిన వాళ్లకు 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 5.5 కోట్లు) బహుమతి ప్రకటించింది క్వీన్స్లాండ్ ప్రభుత్వం. అయితే తాజాగా రాజ్విందర్ను శుక్రవారం ఢిల్లీలోని జీటీ కర్నల్ రోడ్లో స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. క్వీన్స్లాండ్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. అతన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి అప్పగించే విషయంలో త్వరలో కోర్టు విచారణ జరుగుతుందని వెల్లడించారు. అయితే హత్యకు దారి తీసిన పరిణామం గురించి రాజ్విందర్ చెప్పిన విషయంతో ఢిల్లీ పోలీసులు కంగుతిన్నారు. భారత సంతతికి చెందిన రాజ్విందర్ సింగ్.. ఆస్ట్రేలియాలో నర్సుగా పని చేసేవాడు. 2018 అక్టోబర్ 21వ తేదీన తన భార్యతో గొడవ పడ్డాడు. ఆ కోపంలో కత్తి, కొన్ని పండ్లు తీసుకుని రిలాక్స్ అయ్యేందుకు బీచ్‌కు వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో.. తోయా కార్డింగ్లీ తన పెంపుడు కుక్కతో అక్కడికి వచ్చింది. ఆ కుక్క రాజ్విందర్ను చూసి పదేపదే మొరిగిందట. అసలే భార్యతో గొడవ పడిన చిరాకులో ఉన్న అతను.. ఈ విషయంలో ఆమెతో వాగ్వాదానికి దిగారు. అది చిలికి చిలికి హత్యకు దారి తీసిందని నేరం ఒప్పుకున్నాడు రాజ్విందర్. తొలుత ఆమెను కత్తితో కసి తీరా పొడిచాడు. ఆపై రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను లాక్కెళ్లి.. ఇసుక దిబ్బల్లో పాతేశాడు. ఆ కుక్కను వెంటాడి పట్టుకుని చెట్టుకు కట్టేశాడు. ఆపై రక్తపు మరకలు ఉన్న కత్తిని నీళ్లలోకి విసిరేశాడు. ఇంటికి తిరిగి వచ్చాక ఆ రోజంతా ఆందోళనగానే ఉన్నాడు. ఆ మరుసటి రోజు ఎవరికీ చెప్పకుండా లగేజ్ సర్దుకుని భారత్‌కు పయనం అయ్యాడు. హత్య చేసి పారిపోయి వచ్చాక.. ఎవరితో సంబంధం లేకుండా ఉన్నాడు రాజ్విందర్ సింగ్. అటు భార్యతోగానీ ఇటు తల్లిదండ్రులతో కానీ ఎలాంటి సంభాషణలు జరపలేదు. కానీ, పంజాబ్-ఢిల్లీ మధ్యే మార్చిమార్చి తిరుగుతూ వచ్చాడు. అధికారులు గుర్తు పట్టకుండా గెటప్ మార్చేస్తూ పోయాడు. ఇక ఇప్పుడు హత్యకు అతను కారణం చెప్పడంతో ఇక్కడి పోలీసుల వంతు పూర్తైంది. అతన్ని ప్రశ్నించడం పూర్తి కావడంతో.. కోర్టులో ప్రవేశపెడతాం అని ఓ ఢిల్లీ పోలీస్ అధికారి తెలిపాడు. రాజ్విందర్ సింగ్ మీద ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసింది. మరోవైపు అప్పగింత చట్టం(extradition act) కింద నవంబర్ 21వ తేదీన పాటియాలా హౌజ్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసింది. దీంతో ఢిల్లీ పోలీసుల గాలింపు ముమ్మరం అయ్యింది. అందిన కొద్దిపాటి సమాచారంతో అతనున్న గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్లి గాలింపు చేపట్టారు. చివరకు.. గడ్డం, తలపాగాతో ఉన్న రాజ్విందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చూసేయండి -
ఈ బుడతడి మాటలకూ పోలీసులు ఫిదా
-
24 వేల ఏళ్లుగా గడ్డకట్టే మంచులోనే పడిఉంది... కానీ ఆ జీవి బతికే ఉంది!
Cold grave for nearly 24,000 years without eating or drinking: చాలా షాకింగ్ ఘటనలు చూస్తే అసలు అదేలా సాధ్యం అని కూడా అనుకుంటాం. నిజానికి ఈ విశాలా విశ్వంలో మన ఊహకు అందని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కాకపోతే అసాధ్యం అనుకునేవి జరిగేంత వరకు కూడా మనం అంత తేలిగ్గా నమ్మం. అచ్చం అలాంటి సంఘటనే ఆర్కిటిక్ మంచు ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఆర్కిటిక్‌లో మైనస్ డిగ్రీల ఉష్టోగ్రత ఉంటుంది. పైగా చాలా దారుణమైన గడ్డకట్టుకుపోయేంత చలి. అలాంటి ప్రాంతంలో మంచు తుపానులో చిక్కుకున్న లేదా కూరుకుపోయిన బతికే ఛాన్స్ లేనే లేదు. కానీ శాస్త్రవేత్తలు ఆర్కిటిక్‌లోని గడ్డకటట్టే చలిలో పరిశోధనలు చేయడానికి వెళ్లినప్పుడూ వారికి ఒక ఊహించని షాకింగ్ ఘటన ఎదురైంది. అక్కడ మంచులో కూరుకుపోయి పడి ఉన్న ఒక వింత జీవిని చూశారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది నిక్షేపంగా బతికే ఉంది. అయితే ఆ జీవి దాదాపు 24 వేల ఏళ్లుగా ఏమి తినకుండా, తాగకుండా మంచులోనే పడి ఉంది. ఇలాంటి వాటిని మైక్రో-జోంబీ జీవులు అంటారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇలాంటి జంతువులు 50 మిలియన్ల ఏళ్ల క్రితం వివిధ నీటి ప్రాంతాల్లో కనుగొన్నారని చెప్పారు. అయితే ఈ జీవి చర్మం మంచు ప్రభావం ఏ మాత్రం కనిపించలేదని చెప్పారు. ఇది మాత్రమే కాదు, వీటిని లేడ్ రోటిఫర్స్ లేదా వీల్ యానిమల్స్ అని కూడా పిలుస్తారని అన్నారు. అయితే వీటి చర్మంపై చాలా కణాలతో కూడిన సూక్ష్మ జీవుల ఉంటాయని, పైగా నోటి చుట్టూ దట్టంగా వెంట్రుకలు ఉంటాయని అన్నారు. ఇంతకుముందు రష్యన్ శాస్త్రవేత్తలు -20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పది సంవత్సరాల వరకు జీవించగల అటువంటి రోటిఫర్‌లను కనుగొన్నారని కూడా చెప్పారు. అయితే ఇవి జన్మనివ్వవని, అలైంగికమైనవని తెలిపారు. అయితే శరీరం పొడవుగా ఉంటుందన్నారు. వాటి పొడవు 0.04 నుంచి 2 మిల్లీమీటర్ల వరకు ఉంటుందని, కానీ చాలా వరకు 0.5 మిల్లీమీటర్లకు మించి పెరగవు అని వెల్లడించారు. పరిమాణంలో చిన్నది అయినప్పటికీ వారి శరీరంలో చాలా క్లిష్టమైన అవయవాలు ఉన్నాయని వాటిని మైక్రోస్కోప్ లేకుండా చూడలేమని చెబుతున్నారు. ఈ రోటిఫర్‌లను చూస్తే ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింత జీవులు ఉన్నాయని అనిపిస్తుంది కదా (చదవండి: ఇంతకీ ఐపీఎస్ అధికారి సూట్ కేస్‌లో ఏముందో తెలుసా!) -
Chain Snatcher: తెంచిన గొలుసులన్నీ ఇక్కడే పడిపోయాయి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో రెండు రోజుల్లో అయిదు స్నాచింగ్స్ సహా ఎనిమిది నేరాలు చేసిన సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ వ్యవహారంలో గుజరాత్ పోలీసులు షాక్ ఇచ్చారు. అతగాడు ఇక్కడ స్నాచ్ చేసిన 18.5 తులాల బంగారాన్నీ వాళ్లు ‘కాజేశారు’. దాన్ని తమ వద్ద జరిగిన నేరాల్లో రికవరీ చూపించిన అధికారులు ఇక్కడ ఒక స్నాచింగ్‌లో తెంచిన గొలుసు మరో నేరం చేస్తున్నప్పుడు రోడ్డుపై పడిపోయినట్లు రికార్డుల్లో పొందుపరిచారు. ఉమేష్ నేరాంగీకార వాంగ్మూలంలో ఈ విధంగానే రికార్డు చేశారు. దీన్ని చూసిన తెలంగాణ పోలీసుల అధికారులు కంగుతిన్నారు. మరోపక్క ఉమేష్‌ను ఇక్కడకు తరలించడానికి అనుమతి కోరుతూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు స్థానిక కోర్టుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేశారు. రికవరీలు కష్టం కావడంతో.. ► చాలా కాలం క్రితం తమ ప్రాంతాల్లో జరిగిన నేరాలకు సంబంధించిన సొత్తు ఇప్పుడు రికవరీ కావడం కష్టం కావడంతో గుజరాత్ పోలీసులు అతి తెలివితో వ్యవహరించారు. ఉమేష్ ఈ నెల 19న హైదరాబాద్ చేరుకున్నాడు. అదే రోజు ఆసిఫ్‌నగర్‌లో యాక్టివా చోరీ చేశాడు. దానిపై సంచరిస్తూ 20న పేట్ బషీరాబాద్ మొదలుపెట్టి మేడిపల్లి వరకు అయిదు స్నాచింగ్స్ చేశాడు. మరో ఇద్దరు మెడలోని గొలుసులు లాగేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక్కడ స్నాచ్ చేసిన 18.5 తులాల బంగారంతో నేరుగా అహ్మదాబాద్‌లోని చంద్లోడియా ప్రాంతంలో ఉన్న తన ఇంటికి చేరుకున్నాడు. ► సుదీర్ఘ దర్యాప్తు నేపథ్యంలో ఈ విషయం 21 రాత్రి గుర్తించిన సిటీ పోలీసులు అహ్మదాబాద్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో 22న తెల్లవారుజామున ఉమేష్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈలోపు అతడు ఇక్కడ నుంచి ‘లాక్కెళ్లిన’ బంగారాన్ని అమ్మేందుకు ఆస్కారం లేదు. అయినప్పటికీ అతడి నేరాంగీకార వాంగ్మూలంలో ఎక్కడా మన బంగారం రికవరీ చూపించలేదు. దీన్ని ఆ అధికారులు తమ వద్ద జరిగిన నేరాల లెక్కలో వేసేసుకున్నారు. వరుసపెట్టి పడిపోయిందంటూ.. ► ఇక్కడి పోలీసులు ఉమేష్ ఖతిక్‌ను తీసుకురావాలన్నా, నగరంలో నేరాలకు సంబంధించిన బంగారం రికవరీ చేయాలన్నా దానికి అక్కడి పోలీసులకు అతడిచ్చిన నేరాంగీకార వాంగ్మూలమే ఆధారం. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్ పోలీసులను సంప్రదించిన ఇక్కడి అధికారులు దాన్ని సేకరించారు. అందులోని అంశాలను చూసిన మూడు కమిషనరేట్ల పోలీసులూ షాక్ తిన్నారు. మేడిపల్లిలో స్నాచింగ్ మినహా మిగిలిన అన్ని నేరాలను ఇందులో పొందుపరిచారు. వీటిలో కొన్ని స్నాచింగ్‌కు యత్నాలు ఉన్నాయి. ► తాను ఓ నేరంలో మహిళ మెడ నుంచి లాక్కున్న గొలుసు మరో నేరం చేస్తున్న సమయంలో రోడ్డు పైనో, ఎక్కడో తెలియని ప్రాంతంలోనే పడిపోయిందని ఉమేష్ చెప్పినట్లు నమోదు చేశారు. దీని ప్రకారం చూస్తే ఉమేష్ నగరంలో స్నాచ్ చేసిన 18.5 తులాల బంగారం ఇక్కడే పడిపోయానట్లు లెక్క. ఫలితంగా అహ్మదాబాద్ పోలీసులను అడగడానికి కానీ, ఉమేష్ నుంచి రికవరీ చేయడానికి కానీ ఆస్కారం లేకుండా పోయింది. ఈ విషయంలో ఏం చేయాలనే అంశంపై మూడు కమిషనరేట్లకు చెందిన అధికారులు మల్లగుల్లాలుపడుతున్నారు. అక్కడివి అమ్మినట్లు రికార్డుల్లో.. ఉమేష్ ఖతిక్‌పై గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోనూ అనేక కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్టు చేసినట్లు అహ్మదాబాద్‌లోని వడజ్ పోలీసుస్టేషన్ అధికారులు మంగళవారం ప్రకటించారు. అతడిని కోర్టులో హాజరుపరుస్తున్న సమయంలో నేరాంగీకార వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇందులో ఉమేష్ గేర్లు లేని వాహనాలను చోరీ చేసి వాటిపై సంచరిస్తూ చైన్ స్నాచింగ్స్ చేశాడని పొందుపరిచారు. ఇవన్నీ గతేడాది మే నుంచి నవంబర్ మధ్య చోటు చేసుకున్నవే అని చూపించారు. ఆ సొత్తును అహ్మదాబాద్‌లోని ఆనంద్‌నగర్‌కు చెందిన లబ్ధి జ్యువెలర్స్ యజమాని హర్ష భాయ్, మానిక్ చౌక్‌లోని హిమ్మత్ చౌక్, చాణక్యపురి ప్రాంతానికి చెందిన మహంకాళి జ్యువెలర్స్ యజమాని గిరీష్ భాయ్లకు అమ్మినట్లు రికార్డు చేశారు. -
అగ్రతారల షాకింగ్ అండ్ మిస్టీరియస్ మరణాలు
తొమ్మిది నెలలముందే కమింగ్ సూన్ అంటూ ఈ ప్రపంచానికి చెప్పేస్తాం.. కానీ కాలం ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. కరియర్లో ఒక వెలుగు వెలుగుతూ నిశ్శబ్దంగా నిష్క్రమించిన తారలు చాలామందే ఉన్నారు. విధి లిఖితమో, రాజీపడలేకో, ఇంకేముందీ జీవితంలో అన్న వైరాగ్యమో , ధైర్యమో , ఆత్మహత్యలో, హత్యలో , ఏమాయో ఏమో తెలియదు గానీ, అర్థాంతరంగా ఈ ప్రపంచాన్ని వీడటం విషాదం నింపింది. ఈ రోజు సిల్క్ స్మిత పుట్టిన రోజు సందర్భంగా చిన్న వయసులోనే ఈ లోకాన్ని వీడిన సినీ తారల జీవితం మరోసారి చర్చకు వచ్చింది. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గావెలుగొందిన శ్రీదేవి ఆకస్మిక మరణం యావత్ సినీ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. కార్డియాక్ అరెస్ట్‌తో మరణించినట్టు ప్రకటించినప్పటికీ 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్లో బాత్‌టబ్‌లో మునిగిపోయివిగతజీవిగా కనిపించిన తీరు అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది. బాలీవుడ్ నటి కమ్ మోడల్ కుల్జీత్ రాంధావా (28)జుహులోని తన ఇంట్లో శవమై కనిపించింది. తన జీవితంలో ఎదురైన అనేక సంక్లిష్టతలను తట్టుకోలేక జీవితాన్ని ముగిస్తున్నట్టు ఆమె సూసైడ్ నోట్ రాసింది. 1997లో మిస్ ఇండియా, వీజే బాలీవుడ్ నటి, నఫీసా జోసెఫ్ (26) అనుమానాస్పదమరణం కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. తీవ్ర ఒత్తిడితో 2004లో ముంబైలోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
వైరల్: రోడ్లపైకి కోట్ల సంఖ్యలో దండెత్తిన పీతలు.. సినిమా గ్రాఫిక్స్ అనుకుంటే పొరపాటే!
Crores Of Red Crabs On The Roads: సాధారణంగా హాలీవుడ్ సినిమా మమ్మీ లో రోడ్లపైకి లక్షల సంఖ్యలో తేళ్లు వచ్చిన సన్నివేశం గుర్తుందా. అయితే ఆ సన్నివేశం చిత్రీకరించడానికి దర్శకుడికి చాలా ఖర్చు అయ్యుంటుంది. తాజాగా ఎలాంటి ఖర్చు లేకుండానే సరిగ్గా ఆ సీన్ లానే ఓ ప్రాంతంలో లక్షలాది పీతలు వలస వెళ్తూ.. రోడ్లపైకి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆ ప్రాంత దారులన్నీ స్థానిక అధికారులు మూసివేశారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో క్రిస్మస్ ఐలాండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రిస్మస్ ఐలాండ్ సమీపంలోని అడవి నుంచి వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉన్న ఓ పార్క్ తీరం వైపు ఏటా వేల సంఖ్యలో క్రాబ్స్ వెళ్తుంటాయి. అక్టోబర్, నవంబర్ నెలలో అక్కడ అడవుల్లో వానలు కురవడం ఆగిపోయిన తరువాత ఇది సముద్రంలోకి వెళ్లిపోతాయి. అలా వెళ్లాలంటే క్రిస్మస్ ఐటాండ్‌లోని రోడ్లు, బ్రిడ్జిల మీదుగానే వెళ్లాలి. ఇది ప్రతి ఏడాది జరిగేతంతే అయినా ఈ సారి మాత్రం వాటి సంఖ్య వేల కాదు లక్షలు కాదు ఏకంగా కోట్లలో ఉన్నాయి. స్థానికుల సమాచారం మేరకు దాదాపు 5 కోట్ల పీతలు ఉన్నట్లు తెలుస్తోంది. క్రిస్ మస్ లో రోడ్లు, బ్రిడ్జిలు, పార్కులు, ఇళ్ల మీదకు ఒక్కసారిగా పీతలు ఎగబడ్డాయి. కోట్ల సంఖ్యలో వచ్చిన పీతలను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లను విడిచి బయటకు రావడడానికి భయపడిపోతున్నారు. చివరకు రోడ్లు కూడా మూసి వేశారు. Roads on Christmas Island were closed as thousands of red crabs emerged from the forest to begin their annual migration journey to the ocean on the island off the coast of Western Australia pic.twitter.com/zRvP2iCdC4 — Reuters (@Reuters) November 18, 2021 -
సూప్ నచ్చకపోతే మరీ అలా చేస్తావా!
టెక్సాస్: రెస్టారెంట్లలో సర్వ్ చేసేవాళ్లతో కొంతమంది కస్టమర్లు ఎంత తలబిరుసుగా ప్రవర్తిస్తుంటారో చూసే ఉంటాం. అంతేకాదు మరికొంతమంది కస్టమర్లు ఆర్డర్ లేటుగా తీసుకువచ్చాడంటూ సర్వ్ చేసేవాళ్లను చేయి చేసుకుడమే కాక అక్కడ ఉన్న ఫర్నేచర్ను పాడు చేసిన వార్తలు కూడా విన్నాం. కానీ ఇక్కడొక రెస్టారెంట్‌లోని మహిళా ఆ కస్టమర్లందరీ కంటే ఒక అడుగు ముందుకేసి ఇంకా దారుణంగా ప్రవర్తించింది. (చదవండి: విమానాలకు రన్‌వేగా....) అసలేం జరిగిందంటే.. టెక్సాస్‌లోని రెస్టరెంట్లో ఒక కస్టమర్ స్పైసీ స్పైసీ మెక్సికన్ సూప్ ఆర్డర్ చేసింది. అయిత ఆమెకు సర్వ్ చేసిన సూప్ కంటైనర్‌లో ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయి. అంతే ఆమె కోపంతో రెస్టారెంట్ మేనేజర్ జన్నెల్లే బ్రోలాండ్ వద్దకు వచ్చి జరిగిన విషయం వివరిస్తుంది. అంతేకాదు ఏవిధంగా ఆ సూప్ కంటైనర్ మూత కరిగిపోయిందో చూపిస్తూ మేనేజర్‌పై కోపంగా అరుస్తూంది. కాసేపటికి ఉన్నటుండి ఆ వేడివేడి సూప్‌ను మేనేజర్ బ్రోలాండ్ ముఖంపైన విసిరేసి హడావిడిగా పరుగెత్తుతూ వెళ్లిపోతుంది. ఈ ఘటనకు బ్రోలాండ్ షాక్‌కి గురవుతోంది. ఈ మేరకు బ్రోలాండ్ వెంటనే ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది అక్కడ ఉన్న కొంతమంది మహిళల సాయంతో ఆమె వెళ్లిపోతున్న కారుని ఫోటోలు తీసి టెక్సాస్‌లో పోలీసులకు కంప్లెయింట్ చేస్తుంది. ప్రస్తుతం సదరు కస్టమర్ ఆరోపణలు ఎదుర్కొంటుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సదరు కస్టమర్ తీరుని విమర్శిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: దగ్గు, తుమ్ము, నీరసంతో బాధపడుతున్న సింహాలు) -
ఆ ఇంట పాములు బాబోయ్ పాములు.. చూస్తే చెమటలు పట్టాల్సిందే!
సాధారణంగా ఒకటి రెండు పాములను చూస్తేనే రన్నింగ్ రేసులో రన్నర్‌లా మారుతాం. అలాంటిది ఓ వ్యక్తి తన ఇంటి కింద సుమారు 100 ర్యాటిల్ స్నేక్స్ తిష్ట వేయడం చూసి ఖంగుతిన్నాడు. ఈ ఘటన యూఎస్ లోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి ఇంటో కొన్ని పాములు ఎప్పుడు వచ్చాయో తెలీదు గానీ చక్కగా అక్కడే పిల్లలను కూడా పెట్టాయి. అలా వాటి సంఖ్య సెంచరీకి చేరువైంది. కొన్ని రోజుల తర్వాత ఆ బాహుబలి సైన్యాన్ని చూసిన ఇంటి యజమాని ఆశ్చర్యపోయాడు. కాస్త భయపడ్డాడు కూడా. వెంటనే లేట్ చేయకుండా రెస్క్యూ టీంకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న సిబ్బంది.. దాదాపు 4 గంటలు కష్టపడి ఇంట్లో నుంచి సుమారు 92 ర్యాటిల్ స్నేక్స్ ను బయటికి తీశారు. అందులో కొన్ని పాము పిల్లలు కూడా ఉన్నాయి. కరువు కారణంగా బయట పాములకు తిండి దొరకక అవి ఇంట్లోకి వచ్చి ఉండే అవకాశం రెస్క్యూ టీంలో ఒకరు తెలిపారు. అదృష్టం ఏంటంటే ఆ ఇంటి యజమాని ఇంకాస్త ఆలస్యంగా చూసుంటే అవి డబుల్ ,ట్రిపుల్ సెంచరీ చేసుండేవి. పాములను వెలికి తీశాక.. వాటి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు వామ్మో.. ఇన్ని పాములా? దేవుడా.. అని కామెంట్ చేయగా, మరొకందరు.. మ్యాగీ న్యూడిల్స్‌లా స్నేక్ న్యూడిల్స్ లా ఉన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: Bride Video: వరుడిని అక్కడ కొట్టేసి.. చుట్టూ పరిగెత్తి.. చివర్లో ‘ఆర్ యూ ఓకే బేబీ’ -
స్వతంత్ర భారతంలో.. ఇంతటి ఘోర విషాదం లేదు: రిపోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్ సృష్టించిన కల్లోలం అంతా ఇంకా కాదు. రికార్డు స్తాయిలో రోజుల వారీ 4 లక్షలకు పైగా కేసులతో, 4 వేలకు పైగా మరణాలతో పెను విపత్తును మరిపించింది. మందులకొరత, బెడ్ల కొరత, ఆక్సిజన్ దొరక్క బాధితుల బాధలు అన్నీ ఇన్నీ కావు. అయితే అధికారిక లెక్కలతో పోలిస్తే దాదాపు రెట్టింపు మరణాలను ప్రభుత్వం దాచిపెట్టిందన్న తీవ్ర విమర్శల మధ్య షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. నిజమైన మరణాలు వందల వేలు కాదు అనేక లక్షలు ఎక్కువ అని.. స్వాతంత్ర్యం తరువాత దేశంలో ఇదే అత్యంత ఘోరమైన మానవ విషాదమని వ్యాఖ్యానించింది. దేశ విభజన తరువాత భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విషాదం మరొకటి లేదని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ తయారుచేసిన ఒక నివేదిక పేర్కొంది. జూన్ 2021 నాటికి భారత అధికారిక కోవిడ్-19 మరణాల సంఖ్య 4 లక్షలుగా ఉండగా వాస్తవానికి, విపత్తుగా అధ్వాన్నంగా ఉందని వ్యాఖ్యానించింది. అధికారిక లెక్క లకంటే 49 లక్షల అదనపు మరణాలు సంభవించాయని తెలిపింది. 2020 జనవరి 2021 జూన్ మధ్య దాదాపు 50 లక్షలు (4.9 మిలియన్లు) మంది మరణించి ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. మొదటి వేవ్ కాలంలో 20 లక్షలమంది మరణించి ఉండవచ్చని కూడా తెలిపింది. ఫస్ట్‌వేవ్ ఉధృతిని, విషాదాన్ని, గుర్తించడంలో వైఫల్యమే సెకండ్ వేవ్ బీభత్సానికి దారితీసిందని అని నివేదిక పేర్కొంది. వాషింగ్టన్ ఆధారిత థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ దీన్ని తయారు చేసింది. అంతేకాదు భారత మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియన్ సహ రచయితగా వ్యవహరించిడం విశేషం. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అభిషేక్ ఆనంద్, సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్కు చెందిన జస్టిన్ సాండేఫర్ ఈ నివేదికను రూపొందించారు. సెరోలాజికల్ అధ్యయనాలు, గృహ సర్వేలు, రాష్ట్ర స్థాయి పౌర సంస్థల అధికారిక సమాచారం, అంతర్జాతీయ అంచనాల ఆధారంగా, వాషింగ్టన్ ఆధారిత గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ దేశంలో మంగళవారం మూడు అంచనాలతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. కచ్చితమైన కోవిడ్ మరణాలను అంచనా వేయడం కష్టమే అని అంగీకరించినప్పటికీ అధికారిక లెక్కలతో పోలిస్తే వాస్తవ మరణాలు చాలా ఎక్కువ అని తెలిపింది. -
నడిరోడ్డుపై ప్రసవించిన మహిళ..
జవహర్‌నగర్: ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తూ ఎన్ని రకాల ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నప్పటికీ నేటికీ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందని పరిస్థితే ఉంది. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలోగల జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓ పేద గర్భిణి రోడ్డుపైనే బిడ్డను ప్రసవించింది. తీవ్ర ప్రసవ వేదనను అనుభవిస్తూ శిశువుకు జన్మనిచ్చినప్పటికీ కనీసం తల్లి నుంచి శిశువును వేరు చేసేందుకు పేగును కత్తిరించేవారు లేకపోవడంతో ఈ లోకంలోకి అడుగుపెట్టిన ఆ ప్రాణం కొద్ది నిమిషాల్లోనే తుదిశ్వాస విడిచింది. ఈ విషాదకరమైన జవహర్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే జరగడం మరింత విషాదకరం. రోడ్డుపై స్పృహతప్పి పడిపోయి..ప్రసవం మేడ్చల్‌కు చెందిన లక్ష్మి 8 నెలల గర్భిణి. కొంత కాలంగా ఆమె కాలి గాయంతో బాధపడుతోంది. తీవ్రమైన నొప్పితో ఆమె చికిత్స కోసం సోమ వారం ఉదయం 11.30 గంటలకు జవహర్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌కు చేరుకుంది. ఆసుపత్రి ఆవరణలో ఉన్న బెంచ్‌పై కూర్చొని ఉండగా కాలి గాయం నుంచి చీము కారుతుండటాన్ని ఫార్మసిస్ట్ గమనించింది. ఇదే అంశాన్ని స్టాఫ్ నర్సు సుశీలకు వివరించింది. గాయానికి డ్రెసింగ్ చేయాల్సిందిగా కోరడంతో హోలీ సెలవు నేపథ్యంలో డ్రెసింగ్ చే యడం కుదరదని, మంగళవారం ఉదయం వస్తే చేస్తామని చెప్పి, నొప్పి నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్ మందులు ఇచ్చి పంపారు. దీంతో లక్ష్మి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆసుపత్రి నుంచి బయటికి వెళ్లింది. కాగా, నీరసంతో ఉ న్న ఆమె ఆసుపత్రి సమీపంలోని రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో రోడ్డుపైనే మగబిడ్డకు జన్మనివ్వడాన్ని స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని పేగును కత్తిరించి తల్లి నుంచి బిడ్డను వేరు చేశారు. అప్పటికే శిశువు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. స్పృహతప్పి పోయిన ఆ బాలింతను మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించగా, అత్యవసర విభాగంలో అడ్మిట్ చేసుకుని వైద్యసేవలు అందిస్తున్నారు. గర్భవతి అని చెప్పలేదు: సుశీల స్టాఫ్ నర్సు, జవహర్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లక్ష్మి తను కాలి నొప్పితో బాధపడుతున్నట్లు చె ప్పింది. గాయానికి డ్రెస్సింగ్ చేయాలని కోరింది. మంగళవారం రావాల్సిందిగా సూచించాను. అయి తే తను గర్భిణి అనే విషయాన్ని చెప్పలేదు. -
అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి..
-
రైలు కింద పడబోయి తృటిలో బతికిపోయింది
-
ఆరేళ్ల బాబును రక్తం వచ్చేలా కొట్టిన తల్లి
-
'దిగ్భ్రాంతి.. మొత్తం సమాజానికే సిగ్గు చేటు'
న్యూఢిల్లీ: బులంద్ షహర్ లో తల్లి కూతుళ్లపై జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని, అందరూ సిగ్గుపడాల్సిన విషయం అని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పీఎల్ పునియా అన్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ పునియా, కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ ప్రశ్నించారు. 'బులంద్ షహర్ లో జరిగిన ఈ ఘటన దిగ్భ్రాంతికరమైనది. మొత్తం సమాజానికి సిగ్గు చేటు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఘటనకు కొందరు పోలీసు అధికారులను బాధ్యులను చేస్తూ వారిని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. అంతకుమించి ఏమీ జరగలేదు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఏదో ఒక కొత్త పరిష్కార మార్గం తీసుకురావాలి. పోలీసులు అవినీతికి పాల్పడి లంఛాలు తీసుకుంటున్నారు కానీ విధులు నిర్వర్తించడం లేదు. ఉత్తరప్రదేశ్ లో ఇలాంటివి ప్రతి రోజు జరుగుతున్నాయి. అఖిలేశ్ ఈ ఘటనకు బాధ్యత తీసుకోవాల్సిందే' అని పునియా అన్నారు. ఇక అనుప్రియ మాట్లాడుతూ 'ముఖ్యమంత్రి అఖిలేశ్ ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాలి. ఒక మహిళగా ఒక సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తాను. అయితే, ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయనేది ప్రధాన ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వం మహిళ రక్షణ తప్పకుండా చూడాలి. 2017 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు' అని అన్నారు. -
ఏడాదికి 40వేలమంది బాలికల అక్రమ రవాణా
న్యూఢిల్లీ: భారతదేశంలో బాలికల అక్రమ రవాణాపట్ల జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2014 లో వెల్లడైన ఓ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం ఏడాదికి 40 వేలమంది బాలికల అక్రమ రవాణా జరుగుతోంది. వీరిలో 11వేలమంది జాడ కనిపించకుండా పోతున్నారు. ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక బాలిక కనిపించకుండా పోతుందని తమ వద్ద నివేదికలు ఉన్నాయని, ఈ సమస్యను పట్టించుకోకుంటే తీవ్రంగా మారుతుందని హక్కుల కమిషన్ హెచ్చిరించింది. ఇలా అక్రమ రవాణా చేసిన వారిని భిక్షాటనకు, వేశ్యా గృహాలకు తరలిస్తున్నారని, క్లబ్బుల్లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నాలుగేళ్ల బాలికల నుంచి ఆ పైడిన వారి వరకు ఎవరినీ వదలకుండా అక్రమ రవాణా చేస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం ఈ సమస్యను పట్టించుకోవాలని సూచించింది. -
అప్పుడే పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి
-
గర్ల్‌ఫ్రెండ్‌ను ఉతికి ఆరేశాడు
న్యూయార్క్: ఓ బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్‌కు చుక్కలు చూపించాడు. వరుస పంచ్‌లు ఇచ్చి కిందపడేసి మరి కొట్టాడు. అనంతరం ఆమె స్నేహితురాలిని కూడా పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత గర్ల్ ప్రెండ్ ని బుద్ధిగా తీసుకెళ్లి తన కార్లో కూర్చొబెట్టాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అది అమెరికాలోని ఓ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్.. దాని ఎదురుగా విశాలమైన రోడ్డు. అక్కడే కార్లు పార్క్ చేసే చోటు. అక్కడ ఒకమ్మాయి అబ్బాయి గొడవ పడుతుండగా ఆ షాపింగ్ కాంప్లెక్స్ రెండో ఫ్లోర్ లో ఉన్న ఓ వ్యక్తి అదంతా వీడియో తీశాడు. ఆ వీడియోలో ఏం ఉందంటే.. తొలుత కారు పార్కింగ్ ప్లేస్ వద్ద తూలుతూ ఉన్న ఓ బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ పెదాలపై గట్టిగా చుంబించాడు. అంతకుముందు అతడు ఏం తప్పు చేశాడో ఏమోగానీ ఆ అమ్మాయి అతడి ముఖంపై, ఛాతీపై పంచ్‌లు చేయడం మొదలుపెట్టింది. కాలితో కూడా తన్నడం ప్రారంభించింది. అలాగే చేస్తుండగా అతడు మాత్రం ఆమెను ప్రేమగా దగ్గరకు లాక్కోవడం చేశాడు. అయినా, ఆ అమ్మాయి అదే తీరుతో వ్యవహరించింది. తన పంచ్‌లు కొనసాగించింది. అయితే, అతడు ఏదో చెబుతూ కౌగిలించుకొని ఆమెను కూల్ చేసేందుకు ప్రయత్నించాడు. అయినా వినకుండా ఆమె అలాగే కొడుతూ తిడుతూ ఉండటంతో ఆగ్రహం ఆపుకోలేని అతడు ఫటాఫటా పంచ్‌లు గుప్పించాడు. దెబ్బకు ఆ గర్ల్ ప్రెండ్ కిందపడిపోయింది. ఆ తర్వాత కూడా కొట్టాడు. అనంతరం ఆమె కాలు చెప్పు ఊడిపోతే తొడిగే ప్రయత్నం చేశాడు. ఈ గొడవ సమయంలో తన స్నేహితురాలు వారించేందుకు రాగా ఆమెను కూడా ఉరికించి కొట్టే ప్రయత్నం చేశాడు. అనంతరం కిందపడిపోయిన తన గర్ల్‌ఫ్రెండ్‌ను అమాంతం చేతుల్లోకి తీసుకొని మెల్లగా వెళ్లి కార్లో కూర్చొబెట్టాడు. ఈ రెండు నిమిషాల వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. -
షాకింగ్: పెళ్లిలో సరదా కాల్పులతో విషాదం!
ఆనందోత్సాహల మధ్య సాగుతున్న పెళ్లికొడుకు ఊరేగింపు ఘటనలో ఊహించని విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహ వేడుకలో భాగంగా వరుడిని తీసుకొస్తుండగా.. అతని బంధువులు తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వరుడికి సమీపంలోనే తుపాకీ పేల్చడంతో ఈ తూటా వరుడికి తగిలింది. సంఘటన స్థలంలోనే అతడు కుప్పకూలాడు. వెంటనే వరుడిని ఆస్పత్రికి తరలించారు. హర్యానాలోని హిసార్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ న్యూస్ ఏజెన్సీ పోస్టు చేసింది. పెళ్లికొడుకుకు అత్యంత సమీపంలో ఉన్న ఓ వ్యక్తి నల్లరంగు పిస్తోల్‌తో గాలిలోకి కాల్పులు జరుపబోయాడు. ఆ కాల్పులు గురితప్పి వరుడికి తగిలాయి. దీంతో అక్కడే వరుడు కుప్పకూలడం వీడియోలో చూడవచ్చు. ఈ ఘటనలో వరుడికి గాయాలైనట్టు తెలుస్తోంది. వరుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేశామని హిసార్ పోలీసు అధికారి మన్దీప్ సింగ్ తెలిపారు. -
మెట్రో రైల్వే స్టేషన్లో దారుణం
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్వేస్టేషన్ లో ఓ సంఘటన పలువురిని విస్మయ పర్చింది. ఓ 16 ఏళ్ల అమ్మాయి కేశవ్ పురం మెట్రో స్టేషన్ టాయిలెట్ లో చనిపోయిన పిండానికి జన్మనివ్వడం కలకలం రేపింది. అపస్మారక స్థితిలో వున్న ఆ బాలికను మెట్రో స్టేషన్ వైద్య సిబ్బంది, రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దీంతో ఉద్యోగం పేరుతో మైనర్ బాలికను మభ్యపెట్టి లైంగికదాడికి పూనుకోవడమే కాకుండా, బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన వైనం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఆశచూపిన గుల్షన్ అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం తనను లొంగదీసుకున్నాడని బాధితురాలు వాపోయింది. తనను బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడని ఆరోపించింది. అయితే గర్భవతినని తెలియగానే అబార్షన్ చేయించడానికి వెళుతుండగా... తాను తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా గుల్షన్, అతని స్నేహితుడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులపై లైంగిక దాడి, విమెన్ ట్రాఫికింగ్ అభియోగాలు కింద కేసు నమోదు చేశామన్నారు. -
సఫారీ కారుపై చిరుత హల్చల్!
ఆఫ్రికాలో పర్యాటకులకు ఎదురైన వింత అనుభవం.. వారిని ఊపిరాడకుండా చేసింది. సఫారీ జీప్ లో ప్రయాణిస్తున్న వారికి అకస్మాత్తుగా ఎదురుపడ్డ ఓ చిరుత... ఉన్నట్టుండి జీపుపై ఉరికి ఎంతో ఆనందంగా వారిని చూస్తూ కూర్చుంది. అయితే ఎంతైనా చిరుత కదా.. దాని మౌనం వెనుక ఏ ఆలోచన ఉందోనని పర్యాటకులు ఎంతో భయపడ్డారు. గంటపాటు వారి ఓపికను పరీక్షించిన చిరుత చివరకు తనంతట తానుగా జీపు దిగి.. దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడా పర్యాటకులు తీసిన వీడియో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కెన్యాలోని మారా నేషనల్ రిజర్వ్ లో ప్రయాణికుల సఫారీ కారును అడ్డుకున్న చిరుత దాదాపు గంటపాటు వారిని కదలనీయలేదు. అయితే జీపులో ఉన్నవారికి మాత్రం ఎలాంటి హాని తలపెట్టలేదు. చిరుత ఉన్నంతసేపు వారు ప్రాణాలు ఉగ్గబట్టుకుని చూస్తూ ఉన్న ఈ మూడు నిమిషాల వీడియో క్లిప్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. మసాయ్ మారా రిజర్వ్ పార్కునుంచి ఓపెన్ టాప్ సఫారీ కారు ప్రయాణిస్తుండగా ఉన్నట్లుండి కారుపైకి చిరుత ఎక్కడం ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తోంది. ముందుగా పక్కనే ఉన్న గడ్డిలోంచి ప్రత్యక్షమైన ఆ అడవి మృగం... కుడిపక్కనుంచి జీపుఎక్కి పర్యాటకుల కెమేరావైపు తేరిపార చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత అక్కడే ప్రశాతంగా కూర్చుండిపోయింది. దీంతో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కారులోని పర్యాటకులు తమ భయాన్ని పంచుకుంటూ ధైర్యాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేశారు. చిరుత వెళ్ళిన తర్వాత ఊపిరి పీల్చుకుని.. అమ్మో గుండె ఎంత స్పీడుగా కొట్టుకుందో అంటూ తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. 45 నిమిషాలపాటు ఊరుకున్న టూరిస్టు గైడ్ ఇక లాభం లేదని.. చిరుత కదిలేలా లేదని తమ వాహనం ఇంజిన్ ను మెల్లగా స్టార్ట్ చేశాడు. దీంతో అప్పటిదాకా తీరిగ్గా కూచున్న చిరుత పులి పెద్దగా కాళ్ళు చాచి ప్రయాణీకులవైపు చూసింది. ఒళ్ళు విరుచుకొని కారు ముందుకు దిగి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. దీంతో పర్యాటకులు అంతా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఎట్టకేలకు ప్రాణాలు నిలిచినందుకు ఆనందం వ్యక్తం చేస్తుండగా వీడియో ముగుస్తుంది. -
బాత్రూం సైజు ఇళ్లలో వేలమంది నివాసం!
తీవ్రవాద చర్యలకు భయపడి పారిపోతున్న శరణార్థులు... సహాయ శిబిరాల్లోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న బాత్రూం పరిమాణంలో ఉన్న ఇళ్లలో వేలమంది నివసిస్తున్నారు. తాజాగా బయటపడ్డ కొన్ని ఫొటోలు అక్కడి పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ నుంచి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోయినవారంతా మఫ్ రాక్ నగరానికి దగ్గరలోని అల్ జతారి క్యాంప్‌లో తలదాచుకుంటున్నారు. జోర్డాన్‌లోని ఆ శిబిరాలే ఇప్పుడు అందరికీ విస్మయం కలిగిస్తున్నాయి. తీవ్రవాదానికి దూరంగా.. మెరుగైన జీవితం గడపడం కోసం సిరియా, ఇరాక్ దేశాల నుంచి పారిపోయి వచ్చిన శరణార్థులు సుమారు ఆరు లక్షల మంది జోర్డాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. లక్షల మంది ఈ అగ్గిపెట్టెల్లాంటి శిబిరాల్లో తల దాచుకొని కాలం వెళ్లదీస్తున్నారు. వీరికి అందుబాటులో కాఫీ, పిజ్జా, బార్బర్ షాప్‌లు కూడా వెలిశాయి. ఇప్పుడీ ప్రాంతం.. వారి సొంత నగరంగానే మారిపోయినా, సమస్యలు మాత్రం రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జోర్డాన్ రాజుకు శరణార్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ నివపిస్తున్నట్లు గుర్తింపు పొందిన మొత్తం 6 లక్షల మంది శరణార్థులకే కాక, లెక్కల్లో లేని సుమారు మరో 10 లక్షల మంది సిరియన్లకు కూడా సహాయం అందించాలని కోరుతున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా మాత్రం తమ విద్యావ్యవస్థ, ఆరోగ్య విషయాల్లో శరణార్థులకు హాని ఏమీ లేదని అంటున్నారు. అంతర్జాతీయ సమాజాన్ని నిర్మించడంలో తాము సహకరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ప్రతిరోజూ 15.5 టన్నుల బ్రెడ్‌ను శిబిరానికి పంపిణీ చేస్తున్నన్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో శరణార్థ శిబిరాల్లో రద్దీ తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం తీసుకురావాలని భావించినా.. సిరియాలో సంక్షోభం వల్ల అది సాధ్యం కావట్లేదు. ఇప్పటికైనా శరణార్థుల సమస్య తీరి.. యూరోపియన్ దేశాల్లో ప్రశాంత వాతావరణం ఏర్పడాలని అంతా కోరుకుంటున్నారు. -
'హైడ్ అండ్ సీక్' తో పిల్ల టెర్రరిస్టుల దాష్టీకం!
ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు తాజాగా పోస్టు చేసిన ఓ వీడియో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. ఓ పురాతన కోట లోపల బంధించిన ఖైదీలను పిల్ల టెర్రరిస్టులు పట్టుకునే హైడ్ అండ్ సీక్ ఆటలా కనిపిస్తున్నా... నిజంగానే వారిని పట్టి బలవంతంగా చంపే వికృత చర్యలతో వీడియోను చిత్రించారు. సిరియాలోని మారుమూల డేయిర్ ఆజోర్ ప్రావిన్స్ ప్రాంతంలో దాచిన ఖైదీలను వెతుకుతూ చారిత్రక కట్టడాల మధ్య వాళ్లు శోధిస్తున్న దృశ్యాలను వీడియోలో పొందుపరిచారు. చేతులు రెండూ వెనక్కు విరిచి కట్టిన బందీలను..కనిపిస్తే కాల్చి చంపేందుకు సిద్ధంగా... ఆ పిల్ల పిశాచులు ఓ తుపాకీతో వేచి చూస్తుండటం ఆ పురాతన కట్టడాల మధ్య వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి భయంకర దాడుల్లో పాల్గొన్న వారు చాలావరకూ ఉత్తర ఆఫ్రికా, తజకిస్తాన్ నుంచి వచ్చినవారిలా ఉన్నారు. ఒకరి వెంట ఒకరు చారిత్రక అల్ రభా కోట ప్రవేశ ద్వారంనుంచి వారి శిక్షకుడిని కలుసుకుని, వారు చెప్పినట్లు కోట లోపల దాచిన ఖైదీలను అన్వేషించి మట్టుబెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు పిల్ల టెర్రరిస్టులకు కావలసిన తుపాలకులను అప్పగించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న బందీలను లోపలి చీకట్లో కనుగొనేందుకు చిన్నదీపం వెలిగించి ఇచ్చారు. ఒకరి తర్వాత ఒకరు వారిని వెతికి...పని పూర్తి చేసి తిరిగి తమ ట్రైనర్ వద్దకు వచ్చి, అనంతరం ఆ తుపాకులను మరో బాల టెర్రరిస్టుకు ఇస్తే అతడు తిరిగి ఆట(వేట) ప్రారంభిస్తాడు. ఇలా ఖైదీలను వేర్వేరు ప్రాంతాల్లో తప్పించుకొనేందుకు వీలు లేనట్లుగా బంధించారు. చివరికి ఓ ఖైదీని నరికి చంపిన దృశ్యం కూడా వీడియోలో కనిపిస్తుంది. సిరియా ఇరాక్ లలో తమ ఉగ్రవాద కార్యకలాపాల కోసం వందలాదిమంది పిల్లలకు ఇస్లామిక్ స్టేట్ శిక్షణ ఇస్తున్న విషయం తెలిసి టర్కీ పోలీసులు అరెస్టు చేసిన వార్తలు గతంలో సంచలనం రేపాయి. తాజాగా బందీలను చంపేందుకు బాల టెర్రరిస్టులతో 'హైడ్ అండ్ సీక్' గేమ్ ఆడిస్తున్న వీడియో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. -
ప్రపంచాన్ని కదిలించిన చిత్రాలు
చిత్రం దృశ్యాన్ని బంధిస్తుంది. చిత్రం మాట్లాడుతుంది. మాటలకందని భావాలను సైతం పలికిస్తుంది. చివరికి కంటతడి కూడా పెట్టిస్తుంది. తాజాగా టర్కీ సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన అయలాన్ కుర్దీ అనే మూడేళ్ల బాలుడి చిత్రం ప్రపంచాన్ని కదిలించింది. ప్రతి ఒక్కరిని చలింపచేసింది. మనసున్న ప్రతి గుండెను కన్నీరు పెట్టించింది. స్వార్థపు మత్తుతో గాఢనిద్రలో ఉన్న మానవత్వాన్ని తట్టిలేపింది. కేవలం ఫొటోలతో ప్రపంచాన్ని కదిలించి..చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన.. ఇలాంటి మరొకొన్ని చిత్రాలను ఒక సారి పరికిస్తే... అమెరికా-వియత్నాం యుద్ధం అమెరికా, వియత్నాం యుద్ధం మిగిల్చిన చేదు జ్ఞాపకాలకు తార్కాణమీచిత్రం.సైన్యం ప్రయోగించిన నాపాం బాంబు దాడిలో ఒళ్లంతా కాలిన గాయాలతో బట్టలు విప్పేసి నగ్నంగా నడిరోడ్డుపై ప్రాణభయంతో పరుగెడుతున్న వియత్నాం బాలిక ఫాన్ ది కిమ్ ఫుట్ ఫొటో ఇది. ఆ యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందో, దాని తీవ్రత ప్రజలపై, ముఖ్యంగా పసిపిల్లలపై చూపిన ఆనాటి భయానిక పరిస్థితులు..ఈ ఒక్క చిత్రంచూస్తే అర్థమవుతుంది. అమెరికా యుద్ధోన్మోదానికి సజీవ ఉదాహరణ ఈ చిత్రం. నిక్ అనే ఫొటోగ్రాఫర్ ఈ ఫొటోని తీశాడు. ఫొటో తీసిన తరువాత నిక్ ఆ పాప ఒంటిపై తన కోట్‌ను కప్పి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి..కిమ్ ప్రాణాలను కాపాడాడు. ఒక విధంగా అమెరికా వియత్నాం యుద్ధాన్ని విరమించడానికి ఈ చిత్రం కూడా ఒక కారణమే. వియత్నాంపై అమెరికా చేస్తున్న యుద్ధానికి అమెరికన్ల నుంచే తీవ్ర వ్యతిరేకత రావటంతో ఆ దేశం యుద్ధాన్ని విరమించింది. యుద్ధాల్లో పసిపిల్లలు ఎలా బాధితులవుతన్నారో ప్రపంచానికి చెంపచెల్లుమనేలా చాటిచెప్పిన చిత్రమిది. కాటేసినకరవు .. ఆకలితో బక్కచిక్కిన శరీరం, ఎముకల గూడుతో ఉన్న చిన్నారి.. పక్కనే చనిపోతే తినడానే సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్న రాబందు. ఈ ఫొటోను చూస్తే చలించని వారు ఉండరు. సుడాన్లో ఆ నాటి కరువు పరిస్థితులు, పోషకాహారలోపానికి శిశువులు ఎలా బలయ్యారనే దానికి ఈ ఫోటో ప్రత్యక్ష ఉదాహరణ. కెవిన్ కార్టర్ అనే ఫొటోగ్రాఫర్ 1993లో ఈ ఫొటోను తీశారు. ఈ ఫొటో తీసి కార్టర్ తనమానాన తాను వెళ్లిపోయాడు. ఆ పిల్లవాడిని రక్షించే పని చేయలేదు. ఆ తరువాత ఆ రాబందు పసివాడిని తినేసిందో? లేక వదిలేసిందో? ఆ దేవుడికి తెలియాలి. ఈ ఫొటో తీసినందుకు కార్టర్‌కు పులిట్జర్ బహుమతి లభించింది. కానీ ఆ చిన్నారిని కాపాడనందుకు.. ఆ సమయంలో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాబందును నుంచి ఆ చిన్నారిని రక్షించకుండా అలాగే వదిలేసి వచ్చానన్న బాధతో.. కొన్ని నెలల తరువాత కెవిన్ కార్టర్ ఆత్మచేసుకుని చనిపోయాడు. సాహసమేరా జీవితం.. ఒక వ్యక్తి ఎంతో ధైర్యంగా యుద్ధ ట్యాంకులకు ఎదురుగా నిలబడి ఉన్న చిత్రం ఇది. చైనాలో రాజకీయ, ఆర్థిక సంస్కరణలకు పిలుపునిస్తూ 1989 లో సుమారు 10 లక్షల మంది ప్రజలు బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్ వద్ద కొన్ని వారాలపాటు నిరసన చేపట్టారు. అయితే చైనా ప్రభుత్వం ఈ నిరసనను అణచివేసేందుకు మిలటరీని ప్రయోగించింది. యుద్ధట్యాంకులు, ఫిరంగులతో నిరసనకారులను చెదరగొట్టడానికి మిలటరీ వెళుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి వాటికి ఎదురుగా వచ్చి నిలబడి తన నిరసన తెలిపాడు. చైనా మిలటరీ అతనిని కొట్టి ఈడ్చిపారేసింది. ఆ తరవాత అతనికి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. యుద్ధట్యాంకులకు ఎదురుగా నిలబడి నిరసన తెలుపుతన్న సమయంలో జెఫ్ వైడ్నర్ అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశాడు. చైనా ప్రభుత్వం ఈ ఫొటోను నిషేధించింది. కదిలించిన చిత్రం.... చిగురిస్తుందా మానవత్వం? ఇటీవల కాలంలో పత్రికల్లో, చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమై యూరప్ ద్వంద్వ ప్రమాణాలను బట్టబయలు చేసి..ప్రపంచం ముందు ఆ దేశాలను బోనెక్కించి దోషిగా నిలబెట్టిన బాలుడి చిత్రమిది. నిలోఫర్ డెమిర్ అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశాడు. అగ్రదేశాల స్వప్రయోజనాల మూలంగా గత నాలుగేళ్లుగా దావాగ్నిలా రగులుతున్న సిరియా నుంచి యూరప్‌కు పడవలో వలస పోతూ ప్రాణాలు పోగొట్టుకున్న మూడేళ్ల పసికందు. పేరు అయలాన్ కుర్దీ. శరణార్థుల పట్ల యూరోపియన్ దేశాలు వ్యవహరిస్తున్న దమననీతికి, సిరియా శరణార్ధుల దుర్భరస్ధితికి.. ఈ చిత్రం అద్దం పడుతోంది. యుద్ధవిమానాలు వేసే బాంబులకు, ఐఎస్ ఉగ్రవాదుల నరమేధానికి భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దొంగతనంగా, రహస్యంగా సిరియా నుంచి యూరప్ దేశాలకు వలసపోతున్న ఎందరో సామాన్య ప్రజల దయనీయ స్థితికి సజీవ తార్కాణమీచిత్రం. సిరియా అంతర్యుద్ధంలో అయలాన్ అన్న, అమ్మ కూడా చనిపోగా అతని తండ్రి మాత్రం ప్రాణాలతో మిగిలాడు. అయలాన్ కర్దీ మాదిరే సిరియా నుంచి సమీపంలోని యూరోపియన్ దేశాలకు వలసపోతూ నిత్యం అనేక మంది పౌరులు మృత్యువాత పడుతున్నారు. రాకాసి అలలు కాటేసినప్పుడు..తీరప్రాంత గస్తీదళాలు ఒడ్డుకు చేరుకుంటున్న వారిని నిర్దయగా వెనక్కి నెట్టేసినప్పుడు కూడా ఈ మరణాలు సంభవిస్తున్నాయి. పడవల్లో లెక్కకు మించి ఉండటం వల్ల.. ప్రయాణ మార్గంలో ఊపిరాడక మరికొందరు చనిపోతున్నారు. ఈ అడ్డంకులన్ని దాటుకుని యూరప్‌లోకి ప్రవేశిస్తే సరిహద్దుల్లో ముందుగా ముళ్ల కంచెలు స్వాగతం పలుకుతాయి. పోలీసుల వాటర్ క్యానన్లు, రబ్బరు బుల్లెట్లు వెన్నాడుతాయి. వీటిని దాటుకుని ఏదైనా గ్రామంలోకి ప్రవేశిస్తే జాత్యహంకార దూషణలు, దాడులు.. ఈ క్రమంలో ఒక కుటుంబంగా వచ్చిన వారు చెల్లా చెదురై చెట్టుకొకరు..పుట్టుకొకరుగా ఒంటరిగా మిగిలి..చావలేక బతకలేక అత్యంత దుర్భరమైన, దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మధ్యధరా సముద్రాన్ని దాటే క్రమంలో ఇప్పటివరకు 2,600 మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి నివేదికలు చెబుతున్నాయి. సిరియా, నైజీరియా, గాంబియా వంటి దేశాల నుంచి ఇంతవరకూ 3,50,000 మంది యూరప్‌లోకి ప్రవేశించారని సమాచారం. సిరియాలోని కొబాని పట్టణాన్ని ఐఎస్ తీవ్రవాదులు ధ్వంసం చేస్తే... తన పిల్లలకు భయంలేని సురక్షిత జీవితాన్ని, మంచి భవిష్యత్తును ఇవ్వాలనే ఏకైక కోరికతో... పుట్టిన గడ్డని వదిలి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, అత్యంత ధైర్యంతో, సాహసంతో ... కుటుంబంతో వందల కిలోమీటర్లు పడవలో ప్రయాణించి... గమ్యం చేరకుండానే తన పిల్లలను పొగొట్టుకున్న ఆ తండ్రి బాధ వర్ణాతీతం... పసిమనసులపై ఉగ్రపంజా.. చూడగానే ముద్దొచ్చే ఈ పాలబుగ్గల చిన్నారి ఫొటో కూడా ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా హల్చల్ చేసింది. సిరియా శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్న చిన్నారిని ఓ ఫొటోగ్రాఫర్ ఫొటో తీస్తుండగా..కెమెరాను తుపాకీగా భావించిన ఆ బాలిక..భయంతో చేతులు పెకైత్తి నిలబడి పోయింది. ఈ దృశ్యాన్ని చూసిన వారికి ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. నిత్యం బాంబులు, తుపాకీలు మధ్య లక్షలాది మంది చిన్నారులు ఈ నరకకూపంలో బతుకు వెళ్లదీస్తున్నారు. పసి మనసుపై ఉగ్రవాదం వేసిన ముద్రకు ఈ ఫొటో సజీవ తార్కాణం. బోపాల్ గ్యాస్ ఉదంతం అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటనల్లో బోపాల్ గ్యాస్ ఉదంతం ఒకటి. 1984లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసైనేట్ అనే విషవాయువు లీకవటం వల్ల సుమారు 15,000 మంది ప్రజలు చనిపోయారు. 5 లక్షల మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన తన కొడుకుని ఓ తండ్రి పూడ్చిపెడుతున్నటప్పుడు తీసిన చిత్రమిది. ఆ దుర్ఘటన తీవ్రతను తెలిపే సజీవ తార్కారణం ఈ ఫొటో. కంపించిన అమెరికా న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్లను అల్‌ఖైదా ఉగ్రవాదులు విమానంతో ఢీకొడుతున్నప్పుడు తీసిన చిత్రమిది. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చి...చిచ్చుపెట్టి తన స్వప్రయోజనాలు నెరవేర్చుకునే అమెరికాకు అల్‌ఖైదా తీవ్రవాదులు 2001, సెప్టెంబర్ 11న ఈ దాడితో ముచ్చెమలు పట్టించారు. భయకంపితుల్ని చేశారు. ఉగ్రవాదులు పక్కా వ్యూహంతో అమెరికాకు చెందిన విమానాలను హైజాక్ చేసి.. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌లపై దాడులు చేశారు. ఈ దుర్ఘటనలో 2,752 మంది ప్రజలు మరణించారు. -
కలామ్ మృతికి ‘పశ్చిమ’ దిగ్భ్రాంతి
కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి.. అంటూ యూవత్ భారతావనిని చైతన్యవంతం చేసిన మాజీ రాష్ట్రపతి, ప్రపంచ విఖ్యాత శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలామ్ మృతి జిల్లా ప్రజలను కలచి వేసింది. సోమవారం రాత్రి కలామ్ హఠాన్మరణం చెందారన్న విషయూన్ని తెలుసుకున్న ప్రజలు విషాదంలో మునిగారు. జిల్లాతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని పలువురు గుర్తుచేసుకున్నారు. కలామ్ మృతి ప్రపంచ శాస్త్ర, సాంకేతిక రంగానికి తీరని లోటన్నారు. పలువురు నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. - ఏలూరు (ఆర్ఆర్ పేట) భీమవరంపై కలామ్ ముద్ర భీమవరం : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ అకాల మృతి భీమవరం ప్రాంత ప్రజ లను కలచి వేసింది. శాస్త్రవేత్తగా.. రాష్ర్టపతిగా భీమవరానికి విచ్చేసి ఆయన గడిపిన ఆ మధుర క్షణాలను, కలాం ఆప్యాయ పలకరింపులను ఇప్పటికీ ఈ ప్రాంతవాసుల మదిలో ఎప్పుడు మెదులుతూనే ఉంటాయి. 1996లో శాస్త్రవేత్తగా మొదటిసారి పెదఅమిరంలోని మహాత్మాగాంధీ కేన్సర్ ఇన్స్టిట్యూట్ను సందర్శించిన కలాం ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. 2006 జనవరి 9న రాష్ట్రపతిగా అబ్దుల్ కలామ్ ఆయన స్నేహితుడు మహాత్మాగాంధీ కేన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు ఎమ్మార్ రాజు ఆహ్వానం మేరకు రెండోసారి భీమవరం పట్టణాన్ని సందర్శించారు. మిత్రుడు ఎమ్మార్ రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేన్సర్ ఇన్స్టిట్యూట్లో కేన్సర్ రీసెర్చ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి రోగులను ఆప్యాయంగా పలకరించారు. చినఅమిరంలోని బైర్రాజు ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ సిబ్బందితో ముచ్చటించారు. స్థానిక రైతులు, గ్రామస్తులతో మాట్లాడి వారి క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు. అక్కడి నుంచి బీవీ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విష్ణు విద్యాసంస్థలను అబ్దుల్ కలామ్ సందర్శించారు. విద్యాదాత బీవీ రాజు సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అదే క్యాంపస్‌లో స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. భీమవరంలో ఇద్దరు మిత్రులు అబ్దుల్ కలావ్‌ు భీమవరంతో విడదీయరాని బంధం ఉంది. వైద్యరంగంలో ఎమ్మార్ రాజు మిత్రుడు కాగా, వ్యాపార రంగంలో ఉన్న పద్మశ్రీ బీవీ రాజు కలావ్‌ు ఆప్తుమిత్రుడు. రాష్ర్టపతిగా బాధ్యతలు చేపట్టి భీమవరానికి కలాం వచ్చేనాటికి బీవీ రాజు మృతి చెందగా మరో మిత్రుడు ఎమ్మార్ రాజుతో కలసి బీవీ రాజు స్మారక చిహ్నాన్ని సందర్శించి నివాళులర్పించి తన స్నేహభావాన్ని చాటిచెప్పారు. జీర్ణించుకోలేకపోతున్నాం : ఇస్రో మాజీ డెరైక్టర్ ప్రసాద్ మొగల్తూరు : మాజీ రాష్ట్రపతి, అంతరిక్ష శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలామ్ మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని ఇస్రో మాజీ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కలామ్ మృతి విషయం తెలిసి ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యూరు. సోమవారం రాత్రి ఆయన ఫోన్లో విలేకరులతో మాట్లాడారు. 1975లో తాను తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో జూనియర్ సైంటిస్ట్‌గా బాధ్యతలు చేపట్టానని గుర్తు చేసుకున్నారు. ఆ సంస్థకు కలామ్ చైర్మన్‌గా వ్యవహరించేవారన్నారు. ఆయన సలహాలు, సూచనలు వల్లే తాను ఇస్రోలో డెరైక్టర్ స్థాయికి వెళ్లగలిగానని ప్రసాద్ చెప్పారు. కలామ్ తమకు స్ఫూర్తిగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. మంచిని ప్రోత్సహించేవారు కాళ్ల : అబ్దుల్ కలావ్‌ు మంచిని ప్రోత్సహించేవారు. ఆయన మృతి దేశానికి తీరనిలోటు. కలామ్తో నాకు ఏర్పడిన పరిచయం ఇప్పటివరకూ కొనసాగింది. 1996 అక్టోబర్‌లో తమ ఆసుపత్రినికలామ్ తొలిసారిగా సందర్శించారు. సాధారణ సైంటిస్ట్ హోదాలో ఆసుపత్రిని సందర్శించిన కలామ్ ఆ తరువాత రాష్ర్టపతి హోదాలో కూడా సందర్శించడం మాకు గర్వకారణం. దేశం ఒక సైంటిస్టును, ఒక పెద్ద మనిషిని, కోల్పోవడం విచారకరం. - పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు -
దిగ్భ్రాంతికి గురయ్యా!
పూరబ్ కోహ్లి ముంబై: ‘ఝలక్ దిఖ్లా జా’ ఏడో సీజన్ నుంచి తప్పించడం తనను దిగ్భ్రాం తికి గురిచేసిందని బాలీవుడ్ నటుడు పూరబ్ కోహ్లి పేర్కొన్నాడు. తన ప్రదర్శనకు న్యాయమూర్తుల చక్కని స్పం దన వచ్చిందని, అయినప్పటికీ ఈవిధంగా జరుగుతుం దని తాను ఊహిం చలేద ని ఈ ‘రాక్ ఆన్’ స్టార్ చెప్పాడు. ‘నేను తీవ్ర దిగ్భ్రాం తికి గురయ్యా. ఆ షోలో చక్క ని ప్రదర్శన ఇచ్చా. నా ప్రదర్శనకు న్యాయమూర్తులు సైతం ఉబ్బితబ్బిబ్బయ్యారు. వారి నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అయితే డేంజర స్ జోన్‌కు రావడమే తీవ్ర నిరాశకు గురిచేసింది. 35 ఏళ్ల ఈ నటుడు తాను డేంజరస్ జోన్‌కు చేరుకున్నానని తెలియగానే డ్యాన్స్ స్టెప్పులను సైతం మరిచిపోయాడు. ‘ నా కొరియోగ్రాఫర్‌తో కలసి ఈ వారం సెమి క్లాసికల్ డ్యాన్స్ చేశా. అసలు నేనే స్టెప్పులు మరిచిపోయానా అని నాకు అనిపిస్తోంది. ఈ షోకోసం మేము తీవ్రంగా కష్టపడ్డాం. న్యాయమూర్తులనుంచి అద్భుతమైన స్పందన వస్తుందని కూడా ఆశించాం.’ అంటూ పురబ్ బాధపడ్డాడు. ఈ షోలో పాల్గొన్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. మరోసారి అవకాశమిస్తే తన అదృష్టాన్ని పరిశీలించుకుంటానన్నాడు. శిక్షణ పొందిన నృత్యకారుడిని కాదని, అందువల్ల ఈ షోలనుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నాడు. కాగా ‘ఝలక్ దిఖ్లాజా’ షోలో ఇంకా 11 మంది సెలబ్రిటీ పోటీదారులు ఉన్నారు. వీరు తమ కొరియోగ్రాఫర్లతో కలసి ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంది. ఈ షోకు బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.