కొన్నికేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. కారణాల రీత్యా చిక్కుముడి వీడని కేసులు అకస్మాత్తుగా తెరపైకి వచ్చి అధికారులను షాక్ గురి చేస్తాయి. క్లోజ్ అయ్యిందన్న కేసు కాస్త అంతుపట్టని విధంగా అధికారులకు మరో సమస్యను తెచ్చిపెడుతుంటాయి . అచ్చం అలాంటి ఘటనే బిహార్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆరు నెలల క్రితం చనిపోయాడు. ఆ వ్యక్తి తాను బతికే ఉన్నానని, తనకు పెళ్లైందంటూ సీఎం నితీష్ కుమార్‌కు, డీజీపీకి, పోలీస్టేషన్‌కి లేఖ రాశాడు. ఆ లేఖ రాసిన వ్యక్తి ఆరు నెలలక్రితం చనిపోయిన మిస్సింగ్ కేసు వ్యక్తి సోనుగా శ్రీ వాస్తవ్‌గా గుర్తించారు.
పోలీసుల రికార్డుల ప్రకారం..పాట్నాలోని ఓ కుటుంబం 30 ఏళ్ల సోను శ్రీ వాస్తవ్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. అతను ఇంటికి కావాల్సిన వస్తువులు కొనడానికి వెళ్లి తిరిగా రాలేదంటూ సోను తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసు అధికారి ఉదయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..బాధితుడు(సోను) తండ్రి ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా..రెండు రోజుల అనంతరం సోషల్ మీడియాలో గొంతుకోసిన మృతదేహం వైరల్ అయ్యింది. ఆ చనిపోయిన వ్యక్తి తమ కొడుకేనని సోను కుటుంబం చెప్పడంతో మేము కిడ్నాప్ కమ్ హత్య కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించాం
అతను మిస్సైన రోజు చివరి ఫోన్‌కాల్ లోకేషన్ ట్రేస్ చేసి పట్టుకునేందుకు యత్నించినా సాధ్యం కాలేదు, శ్రీ వాస్తవ్ అదృశ్యం కేసు చిక్కుముడి వీడలేదన్నారు ఉదయ్ సింగ్. కాగా, పోలీసులు కూడా అతడు చనిపోయాడనే భావించారు. కానీ ఇప్పుడూ తెరపైకి వచ్చి ఈ లేఖ ఘటనతో ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు అధికారులు. అంతేగాదు ఆ చనిపోయాడనుకున్న సోను తన లేఖలో తాను ఉత్తరప్రదేశ్‌లో తన భార్యతో కలిసి ఉంటున్నానని చెప్పాడు.
పైగా తాను ఇంటికి కావల్సిన వస్తువులు కొనడానికని చెప్పి రూ. 50 వేలు తీసుకుని బస్సు ఎక్కినట్లు తెలిపాడు. సోను ఆ లేఖ తోపాటు తనకు పెళ్లైనట్లు ప్రూవ్ చేసే సాక్ష్యాధారాలను సైతం జత చేయడం విశేషం. లేఖ చివర్లో తన పేరు మీద కిడ్నాప్ కమ్ మర్డర్ కేసు పెట్టడం సరికాదని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు అతడి కుటుంబానికి సమాచారం అందించడమే గాక తదుపరి దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
(చదవండి: సీనియర్ సిటిజన్లకు రాయితీల రద్దుతో.. రైల్వే శాఖకు రూ.2,242 కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment