dead man
-
గుంతలో పడిన అంబులెన్స్ : బతికొచ్చిన తాత
గతుకులు, గుంతల రోడ్డు కారణంగా అనేక ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం చూశాం. కానీ అదే గుంత మనిషికి ప్రాణం పోసింది. నమ్మ శక్యంగా లేకపోయినా ఇది నిజం. హర్యానాలో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుసుకుంది. అనారోగ్య కారణాలతో దర్శన్ సింగ్ బ్రార్ (80)చనిపోయాడు.అతని మృతదేహాన్ని అంబులెన్స్‌లో పాటియాలా నుండి కర్నాల్ సమీపంలోని అతని ఇంటికి తీసుకు వెళుతున్నారు. మరోవైపు అతని బంధువులు అంత్యక్రియలు అన్ని ఏర్పాట్లు చేసేవారు. కానీ విధి మరోలా ఉంది. ఉన్నట్టుండి అంబులెన్స్ గుంతలో పడింది. అదే మృతుడికి ప్రాణం పోసింది. అంబులెన్స్‌లో అతనితో పాటు ఉన్న మనవడు తన తాత చేయి కదలడం గమనించాడు. వెంటనే ఊపిరి పరక్షీంచగా గుండె కొట్టుకోవడంతో వెంటనే బ్రార్‌ను ఆసుపత్రికి తరలించాడు. అతడు బతికే ఉన్నట్లు అక్కడి వైద్యులుప్రకటించారు. కర్నాల్‌లోని ఎన్‌పి రావల్ ఆసుపత్రిలో క్రిటికల్ ICUలో చికిత్స పొందుతున్నాడు. నిజంగా ఇది అద్భుతం, దేవుడి దయ, ఆయన త్వరగా కోలుకోవాలంటూ బంధువులు కోరుకుంటున్నారు భూమ్మీద ఇంకా నూకలున్నాయి అంటూ సంతాపం తెలపడానికి వచ్చిన బంధువులంతా ఆ కుటుంబాన్ని అభినందించి వెళ్లారు. క్రిటికల్, కానీ శ్వాస ఉంది బాధితుడు శ్వాస తీసుకుంటున్నాడు. రక్తపోటుతో పాటు పల్స్ ఉన్నాయి, అయితే ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉన్నందున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని రావల్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ నేత్రపాల్ తెలిపారు. -
మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): నగరంలోని తిలక్ రోడ్డు షిరిడీ సాయి మార్గ్ జంక్షన్లో నిర్మాణ దశలో ఉన్న డ్రెయినేజీలో గత వారం రోజుల కిందట దురదృష్టవశాత్తు కాలు జారి పడి మృతిచెందిన ఏరుకొండ నాగేశ్వరరావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. మృతుడు నాగేశ్వరరావు కుటుంబానికి నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని ఎంపీ భరత్ గురువారం అందజేశారు. అలాగే డ్రెయినేజీ కాంట్రాక్టర్ తరపున మరో రూ.5 లక్షలు నష్టపరిహారాన్ని ఎంపీ భరత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి సహాయ సహకారాలను బహిర్గతం చేయకూడదని, కానీ ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా టీడీపీ నాయకులు కొంతమంది శవ రాజకీయాలు చేయడం వల్ల చెప్పక తప్పడం లేదన్నారు. చదవండి: చంద్రబాబు నోరు.. రామోజీ రాతలు ఒక్కటే: మంత్రి బొత్స జరిగిన సంఘటన దురదృష్టకరం.. మానవతా దృక్పథంతో ఆదుకోవాలి.. తప్పిస్తే ఇటువంటి విషాదకర సంఘటనలను తమ స్వప్రయోజనాలకు వాడుకోవడం మంచిది కాదన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జరిగిన ఈ సంఘటనను సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని.. ఆయన చాలా బాధపడ్డారన్నారు. మృతుని ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. ఎంపీ వెంట నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, బొమ్మన జయ్ కుమార్, కొత్త బలమురళి, కంతారం పాటిల్,సీరపు నగేష్ చంద్రరెడ్డి, దుంగ సురేష్, తదితరులు ఉన్నారు. చదవండి: హోంశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
షాకింగ్ ఘటన: ‘చనిపోయిన వ్యక్తి’ సీఎం, డీజీపీలకి లేఖ!
కొన్నికేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. కారణాల రీత్యా చిక్కుముడి వీడని కేసులు అకస్మాత్తుగా తెరపైకి వచ్చి అధికారులను షాక్ గురి చేస్తాయి. క్లోజ్ అయ్యిందన్న కేసు కాస్త అంతుపట్టని విధంగా అధికారులకు మరో సమస్యను తెచ్చిపెడుతుంటాయి . అచ్చం అలాంటి ఘటనే బిహార్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆరు నెలల క్రితం చనిపోయాడు. ఆ వ్యక్తి తాను బతికే ఉన్నానని, తనకు పెళ్లైందంటూ సీఎం నితీష్ కుమార్‌కు, డీజీపీకి, పోలీస్టేషన్‌కి లేఖ రాశాడు. ఆ లేఖ రాసిన వ్యక్తి ఆరు నెలలక్రితం చనిపోయిన మిస్సింగ్ కేసు వ్యక్తి సోనుగా శ్రీ వాస్తవ్గా గుర్తించారు. పోలీసుల రికార్డుల ప్రకారం..పాట్నాలోని ఓ కుటుంబం 30 ఏళ్ల సోను శ్రీ వాస్తవ్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. అతను ఇంటికి కావాల్సిన వస్తువులు కొనడానికి వెళ్లి తిరిగా రాలేదంటూ సోను తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసు అధికారి ఉదయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..బాధితుడు(సోను) తండ్రి ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా..రెండు రోజుల అనంతరం సోషల్ మీడియాలో గొంతుకోసిన మృతదేహం వైరల్ అయ్యింది. ఆ చనిపోయిన వ్యక్తి తమ కొడుకేనని సోను కుటుంబం చెప్పడంతో మేము కిడ్నాప్ కమ్ హత్య కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించాం అతను మిస్సైన రోజు చివరి ఫోన్‌కాల్ లోకేషన్ ట్రేస్ చేసి పట్టుకునేందుకు యత్నించినా సాధ్యం కాలేదు, శ్రీ వాస్తవ్ అదృశ్యం కేసు చిక్కుముడి వీడలేదన్నారు ఉదయ్ సింగ్. కాగా, పోలీసులు కూడా అతడు చనిపోయాడనే భావించారు. కానీ ఇప్పుడూ తెరపైకి వచ్చి ఈ లేఖ ఘటనతో ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు అధికారులు. అంతేగాదు ఆ చనిపోయాడనుకున్న సోను తన లేఖలో తాను ఉత్తరప్రదేశ్‌లో తన భార్యతో కలిసి ఉంటున్నానని చెప్పాడు. పైగా తాను ఇంటికి కావల్సిన వస్తువులు కొనడానికని చెప్పి రూ. 50 వేలు తీసుకుని బస్సు ఎక్కినట్లు తెలిపాడు. సోను ఆ లేఖ తోపాటు తనకు పెళ్లైనట్లు ప్రూవ్ చేసే సాక్ష్యాధారాలను సైతం జత చేయడం విశేషం. లేఖ చివర్లో తన పేరు మీద కిడ్నాప్ కమ్ మర్డర్ కేసు పెట్టడం సరికాదని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు అతడి కుటుంబానికి సమాచారం అందించడమే గాక తదుపరి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: సీనియర్ సిటిజన్లకు రాయితీల రద్దుతో.. రైల్వే శాఖకు రూ.2,242 కోట్లు) -
చనిపోయిన వ్యక్తికి కరోనా టీకా!
భద్రాచలం అర్బన్: లక్ష్యం చేరడంలో ఆలస్యమవుతుందని అనుకుంటున్నారో ఏమో నాలుగు నెలల క్రితం చనిపోయిన వ్యక్తి కూడా వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా వైద్యారోగ్య శాఖ మెసేజ్‌లు పంపిస్తోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రెవెన్యూ కాలనీకి చెందిన చుక్కా సూర్యప్రకాశరావు జూలైలో మరణించగా, ఆయన కుటుంబీకులు మరణ ధ్రువీకరణ పత్రం కూడా తీసుకు న్నారు. అయితే ఆయన కుమారుడు, న్యాయ వాది అంబేడ్కర్ ఫోన్‌కు శుక్రవారం సూర్య ప్రకాశరావు కరోనా బూస్టర్ డోస్ వేయించుకున్నట్లు ఆ మెసేజ్ రావడంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. -
19 ఏళ్ల తర్వాత.. చనిపోయిన వ్యక్తి.. మళ్లీ ప్రాణాలతో..
మైసూరు: చామరాజనగర జిల్లాలోని కొళ్ళెగాల తాలూకా పాళ్య గ్రామంలో 19 ఏళ్ల తరువాత సీగేమారమ్మ జాతరలో బలి పండుగ నిర్వహించారు. ఇందులో ఒక భక్తుడు చనిపోయి 9 గంటల తరువాత మళ్లీ ప్రాణాలతో తిరిగి వస్తాడు. ఇందులో వాస్తవం ఎంతన్నది కాకుండా నమ్మకంతో ఆచరిస్తారు. ఇలా జరిగింది ఐదుమంది భక్తులు ఆలయంలో పూజలు చేసి బావిలో నుంచి రాగి తొట్టెలో నీటిని నింపుకొని వస్తారు. ఆ సమయంలో అమ్మవారి ఊరేగింపు వారికి ఎదురుగా వస్తుంది. కురిసిద్ద నాయకుడు అనే వ్యక్తి పైన అర్చకులు మంత్రాలు చదివి పూలు చల్లి అతని ఎదపైన కాలుతో తొక్కడంతో అతని ఊపిరి ఆగిపోతుంది. దీనినే బలి అంటారు. అతడు అచేతంగా 9 గంటలపాటు అలాగే ఉంటాడు. తరువాత కురిసిద్ద నాయకుడు ప్రాణాలతో లేవడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ బలి తంతును 19 ఏళ్ల తరువాత నిర్వహించినట్లు చెప్పారు. మరో ఘటనలో.. వ్యక్తి దారుణ హత్య తుమకూరు: తోట నుంచి ఇంటికి బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుని హత్య చేసిన ఘటన తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా కరిశెట్టిహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. హతుడిని కరిశెట్టిహళ్లి గ్రామానికి చెందిన మూడ్లయ్య(42)గా గుర్తించారు. మూడ్లయ్య సోమవారం అర్ధరాత్రి కరిశెట్టిహళ్లికి వెళ్తున్న సమయంలో దుండగులు అడ్డుకుని హత్య చేశారు. గుబ్బి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: ‘నాన్న క్షమించు.. నాకు బతకడం ఇష్టం లేదు’ -
చనిపోయినోడు... నడిచొచ్చాడు
-
చనిపోయాడనుకున్నారంతా.. చక్కగా తిరిగొచ్చాడు!!
-
హతుడిపై అనుమానం
విజయవాడ: కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదగున్నూరు గ్రామంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన స్థలంలో నాలుగు వరి రాశులు, రెండు వరి కుప్పలు, ఆరు గడ్డి వాములు దగ్ధమయ్యాయి. హత్యకు గురైన వ్యక్తే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.