భద్రాచలం అర్బన్: లక్ష్యం చేరడంలో ఆలస్యమవుతుందని అనుకుంటున్నారో ఏమో నాలుగు నెలల క్రితం చనిపోయిన వ్యక్తి కూడా వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా వైద్యారోగ్య శాఖ మెసేజ్‌లు పంపిస్తోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రెవెన్యూ కాలనీకి చెందిన చుక్కా సూర్యప్రకాశరావు జూలైలో మరణించగా, ఆయన కుటుంబీకులు మరణ ధ్రువీకరణ పత్రం కూడా తీసుకు న్నారు. అయితే ఆయన కుమారుడు, న్యాయ వాది అంబేడ్కర్ ఫోన్‌కు శుక్రవారం సూర్య ప్రకాశరావు కరోనా బూస్టర్ డోస్ వేయించుకున్నట్లు ఆ మెసేజ్ రావడంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment