bhadradri kothagudem district
-
భద్రాద్రి కొత్తగూడెం: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఉమ్మడి ఏపీలో బూర్గంపాడు నుంచి 1983లో సీపీఐ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1994, 2009లో టీడీపీ నుంచి రెండుసార్లు ఇల్లందు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన.. ఇల్లందు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 టీఆర్ఎస్ నుంచి, 2018లో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఆయన మృతిపట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు. -
కమలా హారిస్ కోసం పాల్వంచలో 11 రోజుల పాటు మహాయజ్ఞం
పాల్వంచ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ విజయాన్ని కాంక్షిస్తూ శ్రీరాజ శ్యామలాంబ సుదర్శన మహాయజ్ఞం నిర్వహించారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ పేరుతో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ మహాయజ్ఞం నిర్వహించారు. 11 రోజుల కిందట ప్రారంభమైన ఈ యజ్ఞం బుధవారం పూర్ణాహుతితో ముగిసింది.అమెరికా అధ్యక్ష ఎన్నికలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఎలాగైనా కమలా హారిస్ గెలవాలనే ఆకాంక్షతో ఈ యజ్ఞం నిర్వహించినట్లు సొసైటీ చైర్మన్ నల్లా సురేశ్‌రెడ్డి తెలిపారు. తాను కొంతకాలం అమెరికాలో పని చేశానని, ఆ సమయంలో సెనేటర్‌గా ఉన్న కమలా హారిస్‌ను కలిశానని చెప్పారు. భారతీయ మూలాలు కలిగిన ఆమె తల్లి శ్యామలా గోపాలన్ గురించి తెలుసుకుని ఆమె పేరుతో పాల్వంచలో ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించామని ఆయన వెల్లడించారు.కాగా, యజ్ఞం ముగింపు సందర్భంగా 40 మంది వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణాహుతి వేడుకను ఘనంగా నిర్వహించామని, భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. త్వరలో కమలా హారిస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని, ఈ కార్యక్రమానికి అమెరికా నుంచి ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.తిరునక్షత్ర మహోత్సవానికి రండి: సీఎం, డిప్యూటీ సీఎంలకు ఆహ్వానం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ శివారులో సమతాస్ఫూర్తి కేంద్రంలో నవంబర్ 1 నుంచి జరగనున్న శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి తిరునక్షత్ర మహోత్సవానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నిర్వాహకులు ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని శ్రీ అహోబిల జీయర్ స్వామి బుధవారం వీరద్దరిని కలిసి ఈ మేరకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.చదవండి: ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు చదివిస్తా.. పేద విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి అండ -
మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ..!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఓ వైపు మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరుగా ఎన్కౌంటర్లలో మృతి చెందడం, మరోవైపు మావోయిస్టుల కీలక ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు పట్టుసాధిస్తుండటం మావోయిస్టులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం దంతెవాడ–బీజాపూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మావోయిస్టు తొలితరం అగ్రనాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ మృతిచెందిన విషయం తెలిసిందే.ఈ ఏడాది ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేరు జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు సహా మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ, ఆర్కేబీ డివిజన్ కమిటీ కార్యదర్శి సుగులూరి చిన్నన్న, అలియాస్ విజయ్, అలియాస్ శంకర్రావు హతమైన విషయం తెలిసిందే. తాజాగా గురువారం రఘునాథపాలెంలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. \దళం తుడిచిపెట్టుకుపోయినట్లే... కర్కగూడెం గ్రామానికి అతి సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీస్ పాట్రో టీంకు తారసపడిన బీఏ–ఏఎస్ఆర్ డివిజన్ కమిటీ సభ్యుడు లచ్చన్న, లచ్చన్న సతీమణి తులసి అలియాస్ పునెం లక్కీ, పాల్వంచ మణుగూరు ఏరియా కమాండర్ కామ్రేడ్ రాము, పార్టీ సభ్యులు కోసి, సీనియర్ సభ్యులు గంగాల్, కామ్రేడ్ దుర్గేశ్ ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌తో తెలుగు ప్రాంతాల్లో మావోయిస్టులకు చెందిన అత్యంత కీలకమైన భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే–ఏఎస్ఆర్) దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్లయింది. ఇటీవల కాలంలో తెలంగాణ సరిహద్దులోపల ఇదే భారీ ఎన్కౌంటర్ కావడం గమనార్హం. ఇదే డివిజన్ కమిటీకి చెందిన మరో మావోయిస్టు విజయేందర్‌ను సైతం పోలీసులు ఈ ఏడాది జూలైలో గుండాలలో జరిగిన ఎన్కౌంటర్లో హతమార్చారు.ఇలా దెబ్బమీదదెబ్బతో బీకే–ఏఎస్ఆర్ డివిజన్‌కు తీవ్ర నష్టం జరిగింది.క్రమంగా పట్టుసాధిస్తున్న పోలీసులు..మరోవైపు చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులకు అత్యంత పట్టుఉన్న ప్రాంతాల్లోనూ ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర, స్థానిక పోలీస్ బలగాలు చొచ్చుకుపోతున్నాయ. కాంకేర్, కొండగావ్, నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల్లోనూ వరుస ఎన్కౌంటర్లలో కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు మావోయిస్టులపై పట్టు సాధిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు తెలంగాణ నుంచి ప్రాణహిత నది దాటి మహారాష్ట్రంలోకి అడుగుపెడుతుండగా హతమార్చారు. ఈ ఏడాది జూన్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లోనూ 8 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారు. ఇలా వరుస దాడులతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చత్తీస్‌గఢ్ వైపు ఒత్తిడి పెరగడంతో తెలంగాణలోకి ప్రవేశించేందుకు మావోయిస్టులు ప్రయతి్నస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలను తెలంగాణ గ్రేహౌండ్స్, టీజీఎస్పీ, స్థానిక పోలీసు బలగాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి. మావోయిస్టులు తెలంగాణ వైపు రాకుండా ముమ్మర కూంబింగ్ నిర్వహిస్తూ వారిని అడ్డుకుంటున్నాయి. ఏ మాత్రం సమాచారం దొరికినా వెంటనే బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. అయితే, తాజాగా గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 9న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంద్‌కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తూటాల మోత.. భారీ ఎన్కౌంటర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తూటాల మోత మోగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. కరకగూడెం అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసు బలగాలకు, మావోయిస్టులకు కాల్పులు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో సరిహద్దు జిల్లాల గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. మృతిచెందిన మావోయిస్టులు లచ్చన్న దళంకు చెందినవారిగా గుర్తించారు. ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు గాయపడ్డారు.కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ –బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ జిల్లా లోహాగావ్, పురంగేల్ అడవుల్లో ఆండ్రి గ్రామం వద్ద 40 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ దళాల జవాన్లు కూంబింగ్ చేపట్టారు.ఇరువర్గాల మధ్య మొదలైన ఎదురుకాల్పులు దాదాపు మూడు గంటలపాటు సాగాయి. అనంతరం బలగాలు ఘటనా స్థలిలో పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా 9 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తేలింది. వీరిని దక్షిణ బస్తర్, పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ–2కు చెందిన వారిగా భావిస్తున్నారు. ఘటనాస్థలిలో ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, 12 బోర్ రైఫిల్, 315 బోర్‌గన్లతోపాటు బారెల్ గన్ లాంఛర్లు ఒక్కొక్కటి చొప్పున దొరికాయి. -
పురుడు పోసిన ఎమ్మెల్యే..
భద్రాచలం అర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పురిటినొప్పులతో ఇబ్బంది పడుతున్న గర్భిణికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పురుడుపోసి ప్రశంసలు అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబల్లికి చెందిన భీమనబోయిన స్వప్నకు పురిటినొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు సోమవారం ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు.కాగా, మంగళవారం స్వప్నకు పురిటినొప్పులు తీవ్రం కాగా, డ్యూటీ డాక్టర్ (ఈఎన్టీ) పరీక్షించి వెంటనే ప్రసవం చేయాలని నిర్ధారించారు. కానీ ఆ సమయానికి ఆస్పత్రిలో గైనిక్ వైద్యులు లేకపోవడంతో స్వతహాగా వైద్యుడైన ఎమ్మెల్యే వెంకట్రావుకు సమాచారం అందింది. దీంతో ఆయన సిజేరియన్ ద్వారా స్వప్నకు ప్రసవం చేయడంతో 3.2 కేజీల మగ శిశువుకు జన్మనిచ్చింది. -
అయ్యో రియాన్షిక.. ప్రాణం తీసిన పెన్ను
భద్రాచలం అర్బన్, సాక్షి: కళ్ల ముందే చిరునవ్వులతో హోం వర్క్ చేస్తున్న చిన్నారి(4) ఊహించని రీతిలో ప్రమాదానికి గురైంది. తలలో పెన్నుతో నరకయాతన పడుతున్న ఆ బిడ్డను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఎలాగైనా ఆమెను బ్రతికించుకునేందుకు శతవిధాల ప్రయత్నించారు. కానీ, విధికి కన్నుకుట్టి ఆ పసికందు ప్రాణాన్ని బలిగొంది.భద్రాచలం సుభాష్‌నగర్‌కు చెందిన చిన్నారి రియాన్షిక తలలో పెన్ను గుచ్చుకుని ప్రాణం పొగొట్టుకుంది. సోమవారం రాత్రి ఆమె హోం వర్క్ చేస్తున్న టైంలో బెడ్ మీద నుంచి కింద పడిపోయింది. అయితే ప్రమాదవశాత్తు పెన్ను ఆమె తలలో గుచ్చుకుంది. వెంటనే ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతికష్టం మీద వైద్యులు శస్త్రచికిత్స చేసి పెన్ను తొలగించారు. పెన్ను తొలగించడంతో బాలికకు ప్రాణాపాయం తప్పినట్టేనని వైద్యులు భావించారు. ఆమె తల్లి, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం వైద్యులకు ఫోన్ చేసి ఆరా తీశారు. కానీ, పరిస్థితి విషమించి రియాన్షిక కన్నుమూసింది. సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ సోకడంతోనే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. బతికిందని సంతోషించే లోపే బిడ్డ మృతి చెందిందన్న వార్త విని ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గుండెలు అవిసేలా రోదిస్తుండడం.. చూసేవాళ్లను కంటతడి పెట్టిస్తోంది. -
శ్రీరామనవమికి సర్వాంగ సుందరంగా.. ముస్తాబవుతున్న భద్రాద్రి (ఫొటోలు)
-
ఇదొక్కటే ‘ఆధారం’!
భైంసాటౌన్/భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల కోసం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్‌కార్డే ప్రధానంగా మారిపోయింది. అయితే ఆధార్ కార్డుల్లో ఏపీకి బదులు తెలంగాణ ఉండాలని, పేర్లలో ఏమైనా తేడాలుంటే సరి చేసుకోవాలనే ప్రచారం జోరందుకుంది. దీంతో కొత్తగా ఆధార్ నమోదు, కార్డుల్లో సవరణల కోసం ఈ–సేవ ఆధార్ కేంద్రాల వద్దకు ప్రజలు వెళ్తుండటంతో అక్కడ సందడి నెలకొంది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఈ–సేవ ఆధార్ కేంద్రం వద్ద అయితే గురువారం ఉదయం 5 గంటల నుంచే దరఖాస్తుదారులు బారులు తీరారు. చిన్నపిల్లలతో వచ్చిన మహిళలు, వృద్ధులు గంటల తరబడి క్యూలో నిల్చోలేక చెప్పులను వరుసలో ఉంచారు. రెండురోజులుగా కేంద్రం తెరువకముందే టోకెన్ల కోసం వేచి ఉంటున్నారు. ముథోల్, తానూర్, దిలావర్పూర్, కడెం మండల కేంద్రాల్లోని ఆధార్ ఆపరేటర్ల ఐడీలు తాత్కాలికంగా డియాక్టివ్ చేయడంతో ఈ సమస్య నెలకొందని ఈడీఎం నదీం పేర్కొన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో ఆధార్‌కార్డు అప్డేట్కు స్థానిక ఏపీజీవీ బ్యాంక్‌లో ఒక్కటే కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ సెంటర్లో రోజుకు 30 మందికి మాత్రమే ఆధార్ అప్డేట్ చేస్తున్నారు. దీంతో మండల వాసులు తెల్లవారుజామున 3 గంటల నుంచే చలిలో ఇబ్బంది పడుతూ బ్యాంక్ ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఆయా మండల కేంద్రాల్లో తాత్కాలికంగా మూతపడిన ఆధార్ కేంద్రాలను త్వరగా తెరిపించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. -
స్వామీజీల ముసుగులో గంజాయి రవాణా
భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సోమవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.1.21 కోట్ల విలువైన 484 కేజీల గంజాయి స్వాదీనం చేసుకున్నారు. కాషాయ వ్రస్తాలు ధరించి, వాహనంలో దేవతామూర్తుల విగ్రహాలతో తిరుగుతూ భిక్షాటన ద్వారా జీవనం సాగిస్తున్నట్లు నమ్మిస్తున్న కొందరు వ్యక్తులు అదే వాహనంలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. భద్రాచలం టౌన్ సీఐ నాగరాజురెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్వామీజీల వేషధారణలో కొందరు వాహనంలో ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి వాహనంలో గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారంతో భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరియాణా రాష్ట్రానికి చెందిన మున్షీరాం, భగత్, గోవింద్ పట్టుబడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో బల్వన్ అనే వ్యక్తి ప్రోద్బలంతో వీరు ఆటో కొనుగోలు చేసి దేవుడి ప్రచార రథంలా మార్చారు. ఏపీ–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కలిమెలిలో గంజాయిని కొనుగోలు చేసి హరియాణాలో విక్రయించేందుకు వీరు బయలుదేరారని సీఐ తెలిపారు. -
ఆయన అహంకారమేంటో అర్థం కావడం లేదు: కేసీఆర్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నికలు వచ్చాయని ఆగం కావొద్దని.. అభ్యర్థి గుణగణాలు కూడా చూడాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సోమవారం అశ్వరావుపేట నియోజకవర్గ పరిధిలోని దమ్మపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(రెండో విడత సభలు)కు హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘మనదేశంలో ప్రజాస్వామ్య పరిణతి పూర్తిస్థాయిలో రాలేదు. ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పచ్చి అబద్ధాలు చెబుతున్నాయి. అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. ఎన్నికల్లో మంచి చెడులను ఆలోచించాలి. ఎన్నికలు నేతలు కాదు.. ప్రజలే గెలవాలి. పార్టీ వెనుక ఉన్న చరిత్ర కూడా చూడాలి.. .. తెలంగాణను, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసింది కాంగ్రెస్ పార్టీ కాదా?. 2004లో ఇవ్వాల్సిన తెలంగాణను పదేళ్లు ఆలస్యం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలోని చాలా జిల్లాల నుంచి ప్రజలు వలస వెళ్లేవారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించాం. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుంది. గతంలో రైతుల్ని ఆదుకోవాలని ఏ ప్రభుత్వం అనుకోలేదు. గతంలో కరెంట్ ఉండేది కాదు.. వలసలు పోయి బతికేవారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా బీజేపీ 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదు.. ..బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని గమనించండి. ఎలాంటి అలజడులు లేకుండా రాష్ట్రం క్రమబద్ధంగా ముందుకు పోతోంది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్ ఇస్తోంది. 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తోంది. నీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా.. రైతుల కోసం రైతు బంధు తీసుకొచ్చాం. రైతు చనిపోతే రైతుబీమా కింద రూ.5 లక్షలను వారంలోనే చెల్లిస్తున్నాం. ధరణితోనే రైతు బంధు సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ధరణితో రైతులకే అధికారం ఇచ్చాం. అలాంటిది ధరణిని తీసేయాలంటూ కొందరు మాట్లాడుతున్నారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుంది’’.. అని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారాయన. ‘‘..పీసీసీ అధ్యక్షుడు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రైతులకు మూడు గంటల కరెంట్‌చాలని అంటున్నారు. మూడు గంటల కరెంట్‌తో ఎకరానికి నీరు పారుతుందా? ఆయన అహంకారం ఏంటో అర్థం కావడం లేదు. 24 గంటల కరెంట్ కావాలా? 3 గంటల కరెంట్ కావాలా?. కాంగ్రెస్ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అధికారం ఇస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారు. కాంగ్రెస్ వస్తే ధరణిని తీసేస్తారు’’ అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు బూర్గంపాడు ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘పినపాక నియోజకవర్గంలో గిరిజనులు, దళిత వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వారి బతుకులు ఏమాత్రం బాగాలేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితి ఎలా ఉండేదో మీకు తెలుసు. ఎన్నో సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాం. ఈ పదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించుకున్నాం. ఇవాళ తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీ అందరికి కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటు నాటికి అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోయారు. వారిలో ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. ధరణి ఉండటం వల్ల ప్రభుత్వం వేసే డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోనే పడుతున్నాయి. ధరణి ఉండాలో.. వద్దో.. ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ నేతల గోల్మాల్ మాటలు నమ్మి మోసపోవద్దు’’ అని కేసీఆర్ సూచించారు. దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ.. నర్సంపేట సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘దేశం లేదా రాష్ట్రాలు అభివృద్ధిలో ఎక్కడ ఉన్నాయి అనేది నిర్ణయించే వాటిలో తలసరి ఆదాయం ముఖ్యమైనది. తెలంగాణ వచ్చినప్పుడు తలసరి ఆదాయంలో మనం 18వ స్థానంలో ఉండేవాళ్లం. ఇవాళ మనం అగ్రస్థానంలో ఉన్నాం. ఇదే కాదు.. అన్ని రంగాల్లోనూ తెలంగాణ అగ్రస్థానంలో దూసుకుపోతోంది. మనం ఇప్పుడు మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నాం. మరో 2 ప్రాజెక్టులు పూర్తయ్యే స్థాయిలో ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేస్తే నాలుగు కోట్ల టన్నుల ధాన్యం పండించేందుకు వీలుంటుంది. అప్పుడు దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ అవతరిస్తుంది’’ అని కేసీఆర్ అన్నారు. -
మిగతా వరిరకాలతో పోలిస్తే బ్లాక్ రైస్ కు మంచి ధర
-
చికెన్ షాపులో కొండచిలువ.. షాకైన యజమాని.. తర్వాత ఏం జరిగిందంటే?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రోజు అడవిలో ఎలుకలు, ఉడతలు తిని తిని బోర్ కొట్టిందో ఏమో ఒక కొండచిలువ చికెన్ షాప్‌లో దూరింది. చక్కగా అత్తారింటికి వచ్చిన అల్లుడిలా దర్జాలు వలకబోసి బాగా బలిసిన బ్రాయిలర్ కోళ్లను చూసి తన పంట పండిందనుకుంది. చక్కగా ఓ రెండు కోళ్లను గుటుక్కున మింగి సేదతీరింది. తెల్లారే వచ్చి చూసిన చికెన్ షాపు యజమానికి కొత్త అల్లుడిలా కోళ్ల ఫామ్ లో కొండచిలువు కనిపించింది. వెంటనే ఫారెస్ట్ వారికి సమాచారం ఇవ్వగా వచ్చిన సిబ్బంది తిన్న కోళ్లు కక్కించి బుద్ధిగా ఉండమని మళ్లీ అడవికి పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురంలో జరిగింది ఘటన. చదవండి: Telangana: నేడు, రేపు వర్షాలు -
తెలంగాణ నర్సుకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు.. 27 ఏళ్లుగా సేవలు
వృత్తే దైవంగా,సేవే పరమార్థంగా భావించిన తేజావత్ సుశీలకు ఈ యేడాది ప్రతిష్టాత్మక ‘ఫ్లారెన్స్ నైటింగేల్’ అవార్డు దక్కింది.తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట ప్రాథమిక వైద్యశాలలోఏఎన్ఎంగా సేవలందిస్తున్న సుశీల గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా 27 ఏళ్ల తన కెరీర్ గురించి సుశీల ‘సాక్షి’తో పంచుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన తేజావత్ సుశీల జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా నర్సులు చేస్తున్న ఉత్తమ సేవలకుగాను జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ఏటా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2022, 2023 సంవత్సరాలకుగాను జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించారు. ఇందులో 2022కుగాను ఏఎన్ఎమ్ కేటగిరీలో తెలంగాణకు చెందిన నర్సు తేజావత్ సుశీల రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట సమీపంలో కనీసం రహదారి సదుపాయం కూడా లేని మారుమూల ప్రాంతంలో ఉండే గుత్తికోయలకు అందించిన సేవలకు గుర్తుగా నైటింగేల్ అవార్డును అందించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 1973 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 614 మంది నర్సులు ఉత్తమ నర్సులకు నైటింగేల్ అవార్డులు అందుకున్నారని కేంద్రం తెలిపింది. ‘‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోని వీ వెంకటాయపాలెం అనే గ్రామం మా సొంతూరు. 1996లో ఏఎన్ఎంగా తొలి పోస్టింగ్ మణుగూరులో వచ్చింది. ఆ తర్వాత సుజాతనగర్లో కొన్నాళ్లు పని చేశాను. 2010 నుంచి ఏజెన్సీ ప్రాంతమైన ఎర్రగుంట పీహెచ్సీలో పని చేస్తున్నాను. 27 ఏళ్ల కెరీర్లో పనిలోనే సంతృప్తి వెతుక్కుంటూ వస్తున్నాను. మా ఇల్లు, నాకు కేటాయించిన గ్రామాలు తప్ప పెద్దగా బయటకి పోయిందీ లేదు. హైదరాబాద్‌కు కూడా వెళ్లడం తక్కువే. చదువుకునేప్పటి నుంచి ఈ రోజు వరకు... ఏనాటికైనా ఢిల్లీని చూస్తానా అనుకునేదాన్ని. కానీ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ వరకు నా ప్రయాణం ఉంటుందని అనుకోలేదు. దేశ ప్రథమ మహిళ చేతుల మీదుగా అవార్డు అందుకున్న క్షణాలు మరువలేనివి. రెండు ప్రయాణాలు 2010 సమయంలో ఛత్తీస్గడ్ నుంచి గుత్తి కోయలు తెలంగాణకు రావడం ఎక్కువైంది. నా పీహెచ్సీ పరిధిలో మద్దుకూరు సమీపంలో గుత్తికోయలు వచ్చి మంగళబోడు పేరుతో ఓ గూడెం ఏర్పాటు చేసుకున్నట్టు అక్కడి సర్పంచ్ చెప్పాడు. ఆ గ్రామానికి తొలిసారి వెళ్లినప్పుడు ఎవ్వరూ పలకరించలేదు. నేనే చొరవ తీసుకుని అన్ని ఇళ్లలోకి తలుపులు తీసుకుని వెళ్లాను. ఓ ఇంట్లో ఓ మహిళ అచేతనంగా పడుకుని ఉంది. పదిహేను రోజుల కిందటే ప్రసవం జరిగిందని చెప్పారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మనిషి నీరసించిపోయి ఉంది. ఒళ్లంతా ఉబ్బిపోయి ఉంది. వెంటనే ఆ గ్రామ సర్పంచ్‌ను బతిమాలి ఓ సైకిల్ ఏర్పాటు చేసి అడవి నుంచి మద్దుకూరు వరకు తీసుకొచ్చాను. అక్కడి నుంచి ఆటోలో కొత్తగూడెం ఆస్పత్రికి వచ్చాం. పరిస్థితి విషమించడంతో వరంగల్ తీసుకెళ్లాలని సూచించారు. 108లో ఆమెను వెంటబెట్టుకుని వరంగల్‌కు తీసుకెళ్లాను. 21 రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత ఆ తల్లిబిడ్డలు ఇద్దరూ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత అక్కడున్న వలస గుత్తి కోయలకు నాపై నమ్మకం కలిగింది. ఏదైనా సమస్య ఉంటే సంకోచం లేకుండా చెప్పుకోవడం మొదలు పెట్టారు. రక్తం కోసం బతిమాలాను ఓసారి గుత్తికోయగూడెం వెళ్లినప్పుడు పిల్లలందరూ నా దగ్గరకు వచ్చారు కానీ జెమిలీ అనే ఏడేళ్ల బాలిక రాలేదు. ఏమైందా అని ఆరా తీస్తూ ఆ పాప ఇంట్లోకి వెళ్లాను. నేలపై స్పృహ లేని స్థితిలో ఆ పాప పడుకుని ఉంది. బ్లడ్ శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తే మలేరియా పాజిటివ్‌గా తేలింది. వెంటనే పీహెచ్‌సీకి అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకువస్తే పాప పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెప్పారు. ఖమ్మం తీసుకెళ్లమన్నారు. ఆక్కడకు వెళ్తే వరంగల్ పొమ్మన్నారు. కానీ డాక్టర్లను బతిమాలి అక్కడే వైద్యం చేయమన్నాను. ఆ పాపది ఓ-నెగెటివ్ గ్రూప్ రక్తం కావడంతో చాలా మందికి ఫోన్లు చేసి బతిమాలి రెండు యూనిట్ల రక్తం సంపాదించగలిగాను. చివరకు ఆ పాప ప్రాణాలు దక్కాయి. మరోసారి ఓ గ్రామంలో ఓ బాలింత చంటిపిల్లకు ఒకవైపు రొమ్ము పాలే పట్టిస్తూ రెండో రొమ్ముకు పాలిచ్చేందుకు తంటాలు పడుతున్నట్టు గమనించాను. వెంటనే ఇన్ఫెక్షన్ గుర్తించి ఆస్పత్రికి తరలించాను. అర్థం చేసుకోవాలి మైదానం ప్రాంత ప్రజలకు ఒకటికి రెండు సార్లు చెబితే అర్థం చేసుకుంటారు. వారికి రవాణా సదుపాయం కూడా బాగుంటుంది. కానీ వలస ఆదివాసీల గుత్తికోయల గూడేల్లో పరిస్థితి అలా ఉండదు. ముందుగా వారిలో కలిసిపోవాలి. ఆ తర్వాత అక్కడి మహిళలను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే భర్త/తండ్రి తోడు రావాలి. వాళ్లు పనులకు వెళితే సాయంత్రం కానీ రారు. వచ్చే వరకు ఎదురు చూడాలి. వచ్చినా పనులు వదిలి ఆస్పత్రికి వచ్చేందుకు సుముఖంగా ఉండరు. ఆస్పత్రి కోసం పని వదులుకుంటే ఇంట్లో తిండికి కష్టం. అన్నింటికీ ఒప్పుకున్నా.... ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే అడవుల్లో ఉండే గుత్తికోయ గ్రామాలకు రవాణా కష్టం. క్షేత్రస్థాయిలో ఉండే ఈ సమస్యలను అర్థం చేసుకుంటే అత్యుత్తమంగా వైద్య సేవలు అందించే వీలుంటుంది. కోవిడ్ సమయంలో మద్దుకూరు, దామరచర్ల, సీతాయిగూడెం గ్రామాలు నా పరిధిలో ఉండేవి. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఈ మూడు గ్రామాల్లో కలిపి ఓకేసారి 120 మందిని ఐసోలేçషన్లో ఉంచాను. ఇదే సమయంలో మా ఇంట్లో నలుగురికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రాణనష్టం రాకుండా సేవలు అందించాను. నా పరిధిలో ఉన్న గ్రామాల్లో ఏ ఒక్కరూ కోవిడ్‌తో ఇంట్లో చనిపోలేదు. వారి సహకారం వల్లే వృత్తిలో మనం చూపించే నిబద్ధతను బట్టి మనకంటూ ఓ గుర్తింపు వస్తుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకప్పుడు అర్థరాత్రి ఫోన్ చేసినా డాక్టర్లు లిఫ్ట్ చేసి అప్పటికప్పుడు సలహాలు ఇస్తారు. అవసరాన్ని బట్టి హాస్పిటల్‌కు వచ్చి కేస్ అటెండ్ చేస్తారు. అదే విధంగా నాతో పాటు పని చేసే ఇతర సిబ్బంది పూర్తి సహకారం అందిస్తారు. ఇక ఆశా వర్కర్లు అయితే నా వెన్నంటే ఉంటారు. ఏదైనా పని చెబితే కొంత ఆలçస్యమైనా ఆ పని పూర్తి చేస్తారు. వీరందరి సహకారం వల్లే నేను ఉత్తమ స్థాయిలో సేవలు అందించగలిగాను. ఈ రోజు నాకు దక్కిన గుర్తింపుకు డాక్టర్ల నుంచి ఆశావర్కర్ల వరకు అందరి సహకారం ఉంది’’ అని వివరించారు సుశీల. – తాండ్ర కృష్ణగోవింద్ సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం -
దేశంలోనే ఉత్తమ పల్లె జగన్నాథపురం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు మంచినీటి వనరుల విభాగంలో మరో జాతీయ అవార్డు లభించింది. దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జగన్నాథపురం గ్రామం నిలిచింది. ఉత్తమ జిల్లాల కేటగిరీలో ఆదిలాబాద్ జిల్లా దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. దీంతోపాటు హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లను సరిగ్గా వినియోగించుకున్న విద్యాసంస్థల కేటగిరీలో రెండో స్థానాన్ని పొందింది. ఈ నెల 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. తెలంగాణ మరోసారి జాతీయ స్థాయిలో అవార్డు సాధించడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. అవార్డు ప్రకటించిన కేంద్రానికి, ఈ అవార్డులు రావడానికి ప్రేరణగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. జగన్నాథపురం గ్రామ పంచాయతీకి, పాలకవర్గం, సిబ్బంది, అధికారులను మంత్రి అభినందించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 11 కేటగిరీలలో 41 మంది విజేతలను ప్రకటించింది. ఇందులో ఉత్తమ రాష్ట్రంగా మధ్యప్రదేశ్, ఉత్తమ జిల్లాగా ఒడిశాలోని గంజాం, ఉత్తమ గ్రామ పంచాయతీగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం నిలిచాయి. నీటి వనరుల నిర్వహణకు... జలవనరులు, నదుల అభివృద్ధి గంగా పునరుజ్జీవన శాఖ అధ్వర్యంలో 2018 నుంచి జల, నీటి వనరుల నిర్వహణ అవార్డులను అందజేస్తున్నారు. ’జల సంపన్న భారత్’అనే ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసేందుకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న డ్రైవ్‌లో భాగంగా జాతీయ నీటి అవార్డులు వివిధ వ్యక్తులు, సంస్థలు చేసిన మంచి పని, ప్రయత్నాలను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తాయి. ఇది నీటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పనకు, ఉత్తమ నీటి వినియోగ పద్ధతులను అవలంబించేలా వారిని ప్రేరేపించడానికి దోహదపడుతుంది. -
‘గూడెం’లో నేడే ప్రజాగర్జన
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భారత కమ్యూనిస్టు పా ర్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న ప్రజాగర్జన బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో జరిగే సభకు పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా ముఖ్య అతి థిగా హాజరు కానున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కో రుతూ ఈ ఏడాది ఏప్రిల్ 14న సీపీఐ ఆధ్వర్యంలో ప్రజాపో రు యాత్రలు చేపట్టి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు నిర్వహించారు. పోడు సాగుదారులకు పట్టాల పంపిణీ, సింగరేణి ప్రైవేటీకరణ, రాజ్యాంగ, లౌకిక వ్యవస్థల పరిరక్షణ తదితర అంశాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. ఎర్ర జెండా రెపరెపలతో..: ప్రజాగర్జన బహిరంగ సభ నేపథ్యంలో కొత్తగూడెం పట్టణం ఎరుపెక్కింది. ప్రకాశం స్టేడియంలో భారీ వేదిక ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు లక్ష మంది జన సమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టే గత నెలరోజులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. బెల్లంపల్లి నుంచి ప్రత్యేక రైలు..: కొత్తగూడెంలో నిర్వహించే బహిరంగ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రధా నంగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఇందుకో సం వెయ్యి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా 300 చొప్పున బస్సుల్లో కార్యకర్తలు తరలివస్తారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని తెలిపారు. ఒక్క కొత్తగూడెం నియోజకవర్గం నుంచే 25 వేల మందికి పైగా ప్రజలను తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశామని, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్నారని చెప్పా రు. సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వేలాదిగా కార్మికులు వచ్చేందుకు బెల్లంపల్లి నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తారని వివరించారు. హాజరుకానున్న రాజా..: ఈ సభకు జాతీయ కార్యదర్శి డి.రాజాతో పాటు సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ, అజీజ్ పాషా, చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, వాసిరెడ్డి సీతారామయ్య, ప్రముఖ కళాకారులు గోరటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు హాజరుకానున్నారు. -
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాయత్తు మహిమతోనే ఈ స్థాయిలో ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందని డీహెచ్ శ్రీనివాస్ అన్నారు. కొత్తగూడెం ఇఫ్తార్ విందులో తాయత్తు గురించి ప్రస్తావించారు. కాగా, హెల్త్ డైరెక్టర్ కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఇదేం తొలిసారి కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు పితృ సామానులని ఆయన పాద పద్మాలు తాకడం నా అదృష్టంగా భావిస్తున్నానంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది.. కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ డీఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో సినిమా పాటకు డ్యాన్స్ చేశారు. డీజే టిల్లు పాటకు బతుకమ్మ ముందు స్టెప్పులేశారు. దీనిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రంగా భావించే బతుకమ్మ సంబరాల్లో సినిమా పాటలకు స్టెప్పు లేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇంతకముందు ఓ తండాలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొనడంతో శ్రీనివాసరావు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ప్రచారం జరిగింది. చదవండి: ఓయో రూమ్స్ మేనేజర్ ఆత్మహత్య -
భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం కార్యక్రమం.. హాజరైన గవర్నర్
భద్రాచలం: శ్రీరామనవమి వసంత ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్యను గవర్నర్ తమిళసై దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం భద్రాద్రి రామయ్య దర్శించుకోవడానికి వెళ్లిన గవర్నర్ తమిళసైకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళసై స్వామి వారికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. భద్రాచలం మిధిలా స్టేడియంలో రామయ్య పుష్కర పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. దేశంలోని వివిధ పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి రుత్వికులు తీసుకొచ్చిన 12 నది జలాలతో స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించారు. ఈ క్రమంలోనే రామయ్య పుష్కర పట్టాభిషేక కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. నేటి భద్రాద్రి వేడుకలకు మంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్‌లు హాజరయ్యారు. -
సీతారామ కల్యాణం.. కమనీయం
సాక్షి, భద్రాద్రి: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో.. సీతారామకల్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. అభిజిత్ లగ్నముహూర్తాన మాంగల్యధారణ జరిగింది. భద్రాద్రి నుంచి ప్రత్యక్ష ప్రసారం.. ► తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ► ప్రతీ ఏడాది కంటే ఈసారి భిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈసారి సువర్ణ ద్వాదశ వాహనాలపై సీతారాముల్ని ఊరేగించారు. భక్తరామదాసు కాలంలో ఇలా సువర్ణ ద్వాదశ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ► భద్రాద్రి సీతారాముల కళ్యాణం కోసం లక్ష మందికి పైగా భక్తులు హాజరుకానున్నట్లు అంచనా. అందుకు తగ్గట్లే ఉదయం నుంచి భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ►మిథిలా స్టేడియంలో జరగనున్న సీతారామా కల్యాణం కోసం.. రామ భక్త జనసంద్రం తరలి వచ్చింది. ► కల్యాణం వీక్షించేందుకు వీఐపీతో పాటు 26 సెక్టార్లు.. ఎల్ఈడి తెర లు ఏర్పాటు చేశారు. ► చిన్నజీయర్ స్వామి ఇతర ప్రముఖులు కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. ► భక్తులకు మూడు లక్షల మంచినీరు ,లక్ష మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కి సిద్దం చేశారు. ► భక్తులకు అందుబాటులో రెండు లక్షల లడ్డు ప్రసాదాలు, 200 క్వింటాల తలంబ్రాలు.. వాటి పంపిణీకి 70 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ► మొదట గర్భగుడిలో రామయ్య మూలవిరాట్‌కు లఘుకల్యాణం నిర్వహిస్తారు. ► ఆపై అభిజిత్ లగ్నంలో వేలాది మంది భక్తుల నడుమ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కల్యాణం జరగనుంది. ► రేపు(శుక్రవారం) స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ► భద్రాద్రి రాములోరి కల్యాణాన్ని వీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భద్రాదికి తరలివచ్చారు భక్తులు. -
జట్టీ కట్టి.. 5 కి.మీ. మోసుకొచ్చి..
చర్ల: ఆదివాసీ పల్లెల్లో కనీస సౌకర్యాల లేమికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. గ్రామం ఏర్పడి 30 ఏళ్లు కావస్తున్నా నేటికీ సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో మంగళవారం ఓ నిండు గర్భిణిని గ్రామస్తులు ఐదు కిలోమీటర్ల దూరం జట్టీ ద్వారా మోసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాళ్లాపురం గ్రామానికి చెందిన నూపా సిద్దు భార్య లిల్లీ నిండు గర్భిణి. మంగళవారం లిల్లీ ప్రసవ వేదన పడుతుండగా కొందరు యువకులు హుటాహుటిన మొబైల్ సిగ్నల్ వచ్చే ప్రాంతానికి వెళ్లి 108కు ఫోన్ చేశారు. అయితే ఆ గ్రామానికి వాహనం వచ్చేందుకు దారి లేదని, తిప్పాపురం వరకు వస్తే అక్కడి నుంచి ఆస్పత్రికి తరలిస్తామని 108 సిబ్బంది తెలిపారు. దీంతో చేసేదేమీ లేక సిద్దు బంధువులు జట్టీ కట్టి ఆమెను అటవీ మార్గం గుండా తిప్పాపురం సమీపంలోని ప్రధాన రహదారి వరకు మోసుకొచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌లో కొయ్యూరు వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రిలో లిల్లీ ఆడబిడ్డకు జన్మనివ్వగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. -
ఇల్లందులో వేడెక్కిన రాజకీయం
-
సీతా రాముల కల్యాణానికి ముహూర్తం
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కల్యాణం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతారాముల తిరుకల్యాణోత్సవం నిర్వహణకు ముహూర్తం నిశ్చయించారు. కాగా, 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కర పట్టాభిషేకం మార్చి 31న జరగనుండగా, బ్రహ్మోత్సవాలు, పట్టాభిషేక మహోత్సవం షెడ్యూల్‌ను వైదిక కమిటీ, ఆలయ ఈవో శివాజీ సోమవారం ప్రకటించారు. ఉగాది పర్వదినాన... మార్చి 22 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు, మార్చి 22 నుంచి మార్చి 31 వరకు పుష్కర పట్టాభిషేక ప్రయుక్త ద్వాదశ కుండాత్మక చతుర్వేద సహిత శ్రీరామాయణ మహాక్రతువు ఉత్సవాలను జరపనున్నారు. మార్చి 22న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పుష్కర పట్టాభిషేకం క్రతువుకు అంకురార్పణ జరగనుంది. 26న ఉత్సవమూర్తులకు విశేష స్నపనం, బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం, 27న గరుడ ధ్వజపట భద్రక మండల లేఖనం, గరుడాధివాసం, 28న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, 29న ఎదుర్కోలు ఉత్సవం, గరుడ వాహన సేవలను జరుపుతారు. 30న శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కల్యాణమహోత్సవం, శ్రీరామపునర్వసు దీక్షా ప్రారంభం, చంద్రప్రభ వాహనసేవ, 31న పుష్కర పట్టాభిషేక మహోత్సవం, శ్రీరామాయణ మహాక్రతువు పూర్ణాహుతి, రథోత్సవం ఉంటాయి. ఏప్రిల్ 5న చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణ, శ్రీ పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు సమాప్తి కానున్నాయి. కాగా, బ్రహ్మోత్సవాల సమయాన రోజువారీ ప్రత్యేక పూజలు నిలిపివేయనున్నారు. ఈ ఏడాది పుష్కర పట్టాభిషేకం భద్రా చలం పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంతోపాటు మరుసటి రోజే జరిగే రామయ్య పట్టాభిషేకానికి ఎంతో విశిష్టత ఉంది. రాముడికి భద్రాచలంలో ప్రతీ 60 ఏళ్లకు ఒక్కసారి మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఈ పట్టాభిషేక మహోత్సవం భద్రాచలంలో 1927, 1987ల్లో జరగగా, మళ్లీ 2047లో మాత్రమే కళ్లారా చూసేందుకు అవకాశముంది. ఇది కాకుండా ప్రతీ 12 ఏళ్లకోసారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరుపుతారు. 1999, 2011లో ఈ పుష్కర పట్టాభిషేకం నిర్వహించగా, ఈ ఏడాది మార్చి 31న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, వైదిక కమిటీ బాధ్యులు స్వామివారి వాహన సేవలకుగాను నూతన వాహనాలను తయారు చేయిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం
ఇల్లెందు/ఇల్లెందు రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సమీపంలోని జెండాలవాగు వద్ద శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. ప్రాథమిక సమాచారం మేరకు.. మృతులది హన్మకొండ జిల్లాలోని కమలాపురం మండలంగా తెలుస్తోంది. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లుగా పని చేస్తున్న రాము, అరవింద్ ఏపీలోని చింతూరు మండలం మోతెలో జరిగే ఓ వెడ్డింగ్ షూట్లో పాల్గొనేందుకు కమలాపురం నుంచి కారు(టీఎస్ 03 ఎఫ్‌సీ 9075)లో బయల్దేరారు. హన్మకొండలో స్నేహితులు రుషి, కల్యాణ్, రణధీర్ జత కలిశారు. ఐదుగురూ కలిసి మహబూబాబాద్ మీదుగా మోతె వెళ్తుండగా ఇల్లెందు సమీపాన జెండాలవాగు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా.. ముగ్గురు ప్రమాద స్థలిలోనే మరణించారు. ఆ మార్గంలో వెళ్తున్న వారు కారులో గాయపడిన ఇద్దరిని కాపాడేందుకు ప్రయత్నించారు. 108కు సమాచారం ఇచ్చి తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఇల్లెందు ఆస్పత్రికి తీసుకు వచ్చారు. వీరిలో ఒకరు ఆస్పత్రిలో మృతి చెందగా, తీవ్ర గాయాల పాలైన రణధీర్‌ను 11:30 గంటలకు ఖమ్మం తరలించారు. ఇతని పరిస్థితి విషమంగానే ఉంది. ప్రమాద స్థలిలో రెండు మృతదేహాలను పోలీసులు కట్టర్ల సాయంతో కారును కట్ చేసి బయటకు తీయాల్సి వచ్చింది. -
జరిమానా చెల్లించలేదని కుల బహిష్కరణ
ములకలపల్లి: కుల పెద్దలు విధించిన జరిమానా కట్టలేదనే నెపంతో ఓ కుటుంబాన్ని బహిష్కరించడమే కాక తాగునీటి పైపులైన్ తొలగించి, వారి ఇంటికి ఎవరూ వెళ్లొద్దని చాటింపు వేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్నగూడెంలో ఈ ఘటన జరిగింది. రాచ న్న గూడెంకు చెందిన గిరిజనుడు పెనుబల్లి శ్రీనివాస్.. తన తల్లిదండ్రులు, తమ్ముడు, తాత పోతరాజుతో కలసి ఉంటున్నాడు. ఆయనకు దమ్మపేట మండలం ఎర్రగుంపు గ్రామా నికి చెందిన శారదతో వివాహం జరిగింది. అయితే, భా ర్యాభర్తల మధ్య మనస్పర్థలతో శారద ఏడాది కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, నెల క్రితం శ్రీనివాస్ కూడా అక్కడికే వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈనెల 10వ తేదీన శ్రీనివాస్ తాత కన్ను మూయగా.. భార్య శారదతో కలసి అతను రాచన్నగూడెంలోని ఇంటికి వచ్చాడు. కుల పెద్దలకు చెప్పకుండా భార్య వద్దకు వెళ్లడం, ఏడాది క్రితం వెళ్లిపోయిన ఆమెను తీసుకువచ్చాడని శ్రీనివాస్ తాత అంత్యక్రియలు ముగియగానే కులపంచాయితీ పెట్టారు. శ్రీనివాస్ రూ.1.5 లక్షల జరిమానా కట్టాలని పెద్దలు తీర్పు చెప్పారు. కానీ పేదలమైనందున రూ.20 వేలు చెల్లిస్తామని శ్రీను తెలపడంతో కులపెద్దల సమక్షంలోనే కొందరు అతని కుటుంబీకులపై దాడి చేసి డబ్బు మొత్తం చెల్లించాలని హుకుం జారీ చేశారు. అలాగే ఇంటి తాగునీటి పైపులైన్ తొలగించారు. కరెంట్ కూడా నిలిపివేస్తామని హెచ్చరించి.. శ్రీను ఇంటికి ఎవరూ వెళ్లొద్దని చాటింపు వేయించారు. దీంతో బాధిత కుటుంబం బుధవారం పోలీసులను ఆశ్రయించగా సర్పంచ్‌కు చెప్పి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. కానీ గురువారం చిన్నకర్మ చేస్తుండగా, వచ్చిన గ్రా మస్తులు మళ్లీ నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో బాధిత కుటుంబం శుక్రవారం మరోసారి పోలీస్‌స్టేషన్‌కు రాగా, పండుగ తర్వాత మాట్లాడుదామని చెప్పి పంపించారని శ్రీనివాస్ వాపోయాడు. ఈ విషయమై ఎస్సై సురేశ్‌ను వివ రణ కోరగా శనివారం విచారణ చేపడతామని తెలిపారు. -
భద్రాద్రి: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూలు.. భక్తుల కౌంటర్ నిరసన
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మరోసారి బూజు పట్టిన లడ్డూల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదం కొనుగోలు చేసిన కొందరు భక్తులకు షాక్ తగిలింది. లడ్డూలు వాసన వస్తుండడంతో సిబ్బందిని నిలదీశారు భక్తులు. బూజు పట్టిన లడ్డూలు ఎలా విక్రయిస్తారని కౌంటర్ సిబ్బందిని నిలదీశారు భక్తులు.ఈ క్రమంలో.. ‘ఇచ్చట బూజు పట్టిన ప్రసాదం లడ్డూలు ఇస్తారు’’ అని పేపర్ మీద రాసి లడ్డూ కౌంటర్‌కి అతికించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో లడ్డూలు మాయం కావడంపై తీవ్ర దుమారం రేగి.. చర్చ నడిచి దర్యాప్తు దాకా వెళ్లింది. తాజా ఘటనతో.. లడ్డూల నాణ్యత వ్యవహారంపై చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై సిబ్బంది స్పందించాల్సి ఉంది. -
వాళ్లు ఏం పాపం చేశారు.. దేవుడా ఎందుకిలా చేశావయ్యా..
చిన్నతనంలోనే వారిద్దరూ తల్లిదండ్రుల్ని కోల్పోయారు. పేరెంట్స్‌ను కోల్పోయిన అన్నాచెల్లెలిని.. పెదనాన్న, నానమ్మలే పెంచి పెద్దచేశారు. స్వయంకృషితో చదవి అన్న ఉద్యోగం చేస్తుండగా.. చెల్లి మరో రెండు రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఇంతలోనే రోడ్డు ప్రమాదం వారిని మృత్యువు రూపంలో వెంటాడింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లెందులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండలం ఎన్.కె.నగర్ పంచాయతీకి చెందిన మరికంటి నీరజ్(27), నిహారిక(22)లు అన్నాచెల్లెలు. తల్లిదండ్రులు విజయ్‌కుమార్, లలితలు వీరి చిన్నతనంలోనే మృతిచెందారు. ఈ క్రమంలో పెద్దదిక్కును కోల్పోవడంతో పెద్దనాన్న అశోక్, నాయనమ్మల వద్దే వారిద్దరూ పెరిగారు. కాగా, ఇంటర్ పూర్తి చేసిన నీరజ్.. స్థానికంగా ఓ కార్ల షోరూంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. నిహారిక డిగ్రీ చదివి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఇటీవల ఉద్యోగం సంపాదించింది. రెండు రోజుల్లో కొలువులో చేరేందుకు వెళ్లాల్సి ఉంది. దీంతో, వారు జీవితంలో సెటిల్ అయ్యారని ఎంతో సంతోషించారు. ఈ సందర్భంగా నిహారిక.. సోదరుడు నీరజ్, స్నేహితురాలు మేరీతో పార్టీ కోసం బైక్‌పై పాల్వంచ బయలుదేరారు. ఒక ధాబాలో డిన్నర్ చేసి రాత్రి తిరుగు పయనమయ్యారు. రేగళ్ల క్రాస్‌రోడ్డు సమీపంలో వీరి వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ముగ్గురూ కిందపడ్డారు. తలలకు తీవ్ర గాయాలై నీరజ్, నిహారికలు అక్కడికక్కడే మృతిచెందారు. మేరీ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో, ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
భద్రాద్రిలో రాష్ట్రపతి పర్యటన.. 144 సెక్షన్ విధింపు
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి జిల్లాలో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్‌కు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు(బుధవారం) ఆమె భద్రాచలం ఆలయానికి రానున్నారు. బుధవారం భద్రాచలం శ్రీసీతారాముడిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా.. భద్రాచలంలో 144 సెక్షన్ విధించారు. ఉదయం ఏడు గంటల నుంచి 144 సెక్షన్ అమలులోకి రానుంది. రాకపోకల నిలిపివేత ఉంటుంది. సుమారు 2 వేల మంది పోలీసులతో, 350 అధికారులు రాష్ట్రపతి భద్రతను పర్యవేక్షించనున్నారు. అలాగే.. రాష్ట్రపతి రాక నేపథ్యంలో సారపాక బీపీఎల్ స్కూల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు అధికారులు. హెలిప్యాడ్ నుంచి ఆలయం చుట్టూ ప్రోటోకాల్ కాన్వాయ్ ట్రయల్ నిర్వహించారు. ఉదయం పది గంటల ప్రాంతంలో సీతారాములను దర్శించుకుంటారు. దేశ ప్రథమ పౌరురాలి రాక సందర్భంగా.. ఉదయం 8 గంటల నుంచి 11.30గం. దాకా అన్ని దర్శనాలు బంద్ కానున్నాయి. ఇక తెలంగాణలో మూడు రోజులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తారు. ఈ నెల 28న అంటే బుధవారం భద్రాచలం సీతారాములను దర్శించుకుంటారు. ఈ నెల 29న ముచ్చింతల్ సమతా స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ నెల 30న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. -
ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు
కొత్తగూడెం టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నిషేధిత మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) వారోత్సవాల సందర్భంగా వాటిని విజయవంతం చేయాలని మావోయిస్టులు ఇప్పటికే ప్రకటనలు విడుదల చేశారు. మరోపక్క ఆదివాసీలను మావోయిస్టులు వేధిస్తున్నారంటూ ఊరూరా పోస్టర్లు వేయించిన పోలీసులు ఇంకో పక్క కూంబింగ్ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఐదుగురు మిలీషియా సభ్యులు పట్టుబడగా, వివరాలను కొత్తగూడెంలోని తన కార్యాలయంలో శనివారం ఎస్పీ డాక్టర్ వినీత్ వెల్లడించారు. చర్ల మండలం ఎర్రంపాడు ఆటవీప్రాంతంల్లో పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బందితోపాటు స్పెషల్ పార్టీ, 81, 141 బెటాలియ¯న్ల సిబ్బంది ఉదయం కూంబింగ్ చేపట్టారని, ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా మిలీషియా సభ్యులని తేలిందని చెప్పారు. వీరిలో ఛత్తీస్‌గఢ్‌లోని పోలీసు కిష్టారాం నిమ్మలగూడెంకు చెందిన బెడమ బీమయ్య, సోడి మూయా, పోడియం అడమయ్య, పూనం నగేశ్, జట్టపాడుకు చెందిన మడకం నగేశ్ ఉన్నారని తెలిపారు. వీరు రెండేళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. కాగా, తెలంగాణ ప్రజలు, ఆదివాసీలు వివేకంతో ఆలోచించి అభివృద్ధి నిరోధకులైన మావోయిస్టులను తరిమివేయగా, ఛత్తీస్‌గఢ్‌కు పారిపోయి ఇక్కడ ఇన్ఫార్మర్ల సాయంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎస్పీ ఆరోపించారు. మావోయిస్టులకు ఎవరైనా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సహకరిస్తే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో ఓఎస్డీ సాయి మనోహార్, భద్రాచలం ఏఎస్పీ ఆకాం„Š యాదవ్, చర్ల సీఐ అశోక్, బెటాలియన్ల అధికారులు కమల్వీర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందే
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు శివారు ఎర్రబోడులో నివాసం ఉంటున్న గొత్తికోయలు అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. ఎర్రబోడుకు చెందిన ఇద్దరు గొత్తికోయలు ఈనెల 22న చేసిన దాడిలో ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు మృతి చెందిన ఘటనతో తీవ్రస్థాయిలో నిరసన పెల్లుబికింది. ఈ క్రమంలో బెండాలపాడు పంచాయతీ పాలకవర్గం సైతం గొత్తికోయలను ఈ ప్రాంతం నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేసింది. ఇక ఆదివారం ఎఫ్డీఓ అప్పయ్య అధ్వర్యంలో వివిధ రేంజ్‌ల అధికారులు, సిబ్బంది సుమారు 50 మంది.. గొత్తికోయల ఇళ్ల వద్దకు వెళ్లి ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చారు. కాగా తమ ఇళ్ల ముందు నోటీసులు అంటించి, ఫొటోలు తీసుకుని అనంతరం వాటిని తొలగించారని గొత్తికోయలు చెబుతున్నారు. వాస్తవానికి ఈ వ్యవహారాన్ని తొలుత అటవీ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ ఘటనపై ఎఫ్డీఓ అప్పయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా.. అడవి నుంచి ఖాళీ చేయాలని గొత్తికోయలకు నోటీసులు ఇచ్చిన విషయం వాస్తవమేనన్నారు. ఎఫ్ఆర్వో హత్యతో అడవిలో విధులు నిర్వర్తించేందుకు అధికారులు, సిబ్బంది భయపడుతున్నారని చెప్పారు. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం వారు అడవుల్లో ఉండేందుకు అనర్హులని పేర్కొన్నారు. ఒకరిద్దరు తప్పు చేస్తే అందరికీ శిక్షా ? మా గూడెంలోని ఇద్దరు వ్యక్తులు చేసిన దుర్మార్గపు చర్యకు మా అందరికీ శిక్ష విధిస్తారా. ఛత్తీస్‌గఢ్‌లో శాంతిభద్రతల పరిస్ధితి అధ్వానంగా ఉండగా ప్రాణభయంతో జీవనోపాధి కోసం 20 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి వచ్చాం. పోడు వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాం. మా తెగకు చెందిన పొడియం తుల, మడకం నంగా రేంజర్ శ్రీనివాసరావుపై దాడి చేసి హతమార్చడాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. వారు చేసిన తప్పునకు మేమంతా ఎందుకు శిక్ష అనుభవించాలి. మాకు ఇక్కడ రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, ఉపాధి పనుల కార్డులు ఇచ్చారు. ఓటుహక్కు కూడా కల్పించారు. మా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లలతో మేం ఎక్కడికి వెళ్ళాలి. తెలంగాణ ప్రభుత్వం మాపై కనికరించాలి. – రవ్వ రమేశ్, గొత్తికోయ కులపెద్ద, ఎర్రబోడు -
ఎఫ్ఆర్వో దారుణ హత్య.. గుత్తికోయల బహిష్కరణ!
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుపై దాడి.. హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ ఇవాళ కీలక తీర్మానం చేసింది. గుత్తి కోయలందర్నీ గ్రామం నుంచి బహిష్కరించాలని బెండాలపాడు గ్రామసభ తీర్మానించింది. సాక్షి, భద్రాద్రి జిల్లా: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు మృతికి కారణమై గుత్తి కోయలను బహిష్కరిస్తూ శనివారం బెండాలపాడు గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య ఘటనను ఈ సందర్భంగా గ్రామసభ ముక్తకంఠంతో ఖండించింది. బెండలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రబోడు నుంచి అక్కడ నివసిస్తున్న గుత్తి కోయలను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు.. వాళ్లను వాళ్ల స్వరాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు పంపాలంటూ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ సందర్భంగా.. బెండాలపాడు గ్రామస్తులు గుత్తి కోయలపై పలు ఆరోపణలు చేశారు. గుత్తి కోయలు రోజూ గంజాయి, నాటుసారా సేవిస్తూ విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. గుత్తి కోయల తీరు చాలా ప్రమాదకరంగా ఉందని, మారణాయుధాలు ధరించి తిరుగుతున్నారని, వాళ్ల వల్ల తమకూ ప్రాణహాని పొంచి ఉందని ఆ తీర్మానంలో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గుత్తి కోయలను వాళ స్వస్థలమైన ఛత్తీస్‌గఢ్‌కు తరలించాల్సిందేనని సభ తీర్మానించింది. పోడు సాగుకు అడ్డొస్తున్నారని చంద్రుగొండ రేంజ్ ఎఫ్ఆర్వో చలమల శ్రీనివాసరావు(45)ను గొత్తికోయలు దారుణంగా దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. -
20మంది జెడ్పీ హైస్కూలు విద్యార్థులకు అస్వస్థత
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం పోకలగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 20 మంది సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతుండగా, మధ్యాహ్న భోజనం కలుషితమైనట్లు అనుమానిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 111 మంది విద్యార్థులు భోజనం చేయగా, సాయంత్రం 20 మందికి పైగా విద్యార్థులు దగ్గు, గొంతు మంటతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో హెచ్ఎం జుంకీలాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి వారిని చండ్రుగొండ పీహెచ్‌సీకి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని చికిత్స అందిస్తున్న డాక్టర్ వెంకట్ ప్రకాష్ తెలిపారు. డీఎంహెచ్ఓ దయానందస్వామి వచ్చి విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. -
చనిపోయిన వ్యక్తికి కరోనా టీకా!
భద్రాచలం అర్బన్: లక్ష్యం చేరడంలో ఆలస్యమవుతుందని అనుకుంటున్నారో ఏమో నాలుగు నెలల క్రితం చనిపోయిన వ్యక్తి కూడా వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా వైద్యారోగ్య శాఖ మెసేజ్‌లు పంపిస్తోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రెవెన్యూ కాలనీకి చెందిన చుక్కా సూర్యప్రకాశరావు జూలైలో మరణించగా, ఆయన కుటుంబీకులు మరణ ధ్రువీకరణ పత్రం కూడా తీసుకు న్నారు. అయితే ఆయన కుమారుడు, న్యాయ వాది అంబేడ్కర్ ఫోన్‌కు శుక్రవారం సూర్య ప్రకాశరావు కరోనా బూస్టర్ డోస్ వేయించుకున్నట్లు ఆ మెసేజ్ రావడంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. -
తల్లయిన ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ.. పాపకు పేరు పెట్టిన కేసీఆర్
సాక్షి,ఇల్లెందు(కొత్తగూడెం): హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావం రోజు బుధవారం ఉదయం ఆ పార్టీ ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, మార్కెట్ చైర్మన్ బానోతు హరిసింగ్ నాయక్ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. బీఆర్ఎస్ ఆవిర్భావం వేళ జన్మించిన బిడ్డకు ‘సుచిత్ర భారత ప్రియ’గా నామకరణం చేయాలని తనను కలిసిన హరిసింగ్ నాయక్‌కు సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. హరిప్రియ దంపతులకు ఇరవై ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడం, అదేరోజు దసరా కావడం విశేషం. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: నేతలకు గాలం వేస్తున్న ‘ఈటల’.. ఒక్కొక్కరుగా ‘గులాబీ’ పార్టీకి గుడ్ బై -
గుండెల్లో రైళ్లు.. ఎవరికి వాళ్లు ఫిక్స్ అయిపోయారు..!
కొత్తగూడెం రాజకీయాల్లో మునుగోడు ఎఫెక్ట్ కనిపిస్తోందా? ఈ ఉపఎన్నిక తెలంగాణలో పొత్తు రాజకీయాల్ని సమూలంగా మార్చబోతోందా? జరుగుతున్న పరిణామాలు కొత్తగూడెం గులాబీ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అయితే అక్కడి పాలిటిక్స్ ఎందుకు అంతలా హీటెక్కాయో పరిశీలిస్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యునిస్టులకు కంచుకోట. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ కూడా బలం పుంజుకుంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనకే టికెట్ లభిస్తుందనే ధీమాతో వనమా ఉన్నారు. అయితే ఈసారి టికెట్ తనకే ఇస్తారంటూ మాజీ ఎమ్మెల్యే జలగం వెంగళరావు ప్రచారం చేసుకుంటున్నారు. గులాబీ పార్టీలోనే ఇద్దరు నేతలు టికెట్ కోసం పోటీ పడుతుంటే.. తాజాగా మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో గూడెం సీటు నాదే అంటున్నారట. దీంతో అధికార పార్టీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. గత ఎన్నికల్లో తెలంగాణలో రకరకాల పొత్తులు నడిచాయి. అయితే ఈ సారి ఏడాదిముందే పొత్తుల విషయంలో క్లారిటీ వస్తున్నట్లుగా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్తో పొత్తు కొనసాగుతుందని సీపీఐ నాయకులు అంటున్నారు. అలా కుదిరితే సీపీఐ వాళ్లు కోరుకునే సీట్లలో కొత్తగూడెంకు అగ్రప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఇక్కడి నాయకుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తానే కొత్తగూడెంలో పోటీ చేసేదని టీఆర్ఎస్ నేతలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. సీపీఐ నాయకుడి ఆర్భాటం, ప్రచారంతో టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. చదవండి: (అది సక్సెస్ చేస్తే.. వారిరువురికి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్‌కు గ్రీన్‌సిగ్నల్!) ఇదిలా ఉంటే, వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేది తానే అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా. ఈమేరకు ఆయన శపథం కూడా చేశారు. టికెట్ కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, పొత్తుల్లో తెచ్చుకుంటామని కథలు చెప్పినా అంతిమంగా పోటీచేసేది తానేనని ఘంటాపథంగా చెబుతున్నారు వనమా. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదంటూ కొందరు సోషల్ మీడియాలో అదేపనిగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు జలగం వెంగళరావు సైతం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. వనమా ఎంత చెబుతున్నా, సీపీఐ ఎంత డిమాండ్ చేసినా చివరి నిమిషంలో టికెట్ తనకే ఇస్తారని జలగం గట్టిగా చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న జలగం నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు మాత్రం హాజరుకావడం లేదు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా పాల్గొనే కార్యక్రమాలవైపు అయితే కన్నెత్తి కూడా చూడటం లేదు. గత ఎన్నికల్లో సీటు తనకు రాకుండా తన్నుకుపోయిన వనమా అంటే జలగంకు కోపం. అందుకే ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే టికెట్ కోసం కొట్టుకుంటుంటే ఈ ఎపిసోడ్‌లోకి సీపీఐ ఎంట్రీ ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా 25సీట్లు అడగాలని భావిస్తోంది. అందులో టాప్-3లో కొత్తగూడెం ఉంటుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇంకా మునుగోడు ఉప ఎన్నిక జరగలేదు. టీఆర్ఎస్తో పొత్తు ఖరారు కాలేదు. అప్పుడు సీపీఐ అభ్యర్థిగా ప్రకటించుకున్న కూనంనేని సాంబశివరావు గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. గులాబీ నేతలేమో సీటు కోసం పోటీపడుతూ శపథాలు చేస్తుంటే.. నేనున్నానంటూ సీపీఐ ఎంట్రీ ఇవ్వడంతో కొత్తగూడెం రాజకీయాలు అప్పుడు హీటెక్కాయి. -
కీలక ముందడుగు.. తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా మరో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేపట్టిన మణుగూరు – రామగుండం రైల్వేలైను నిర్మాణంలో కీలక అడుగు పడింది. దీంతో రాబోయే బడ్జెట్లో ఈ లైనుకు నిధులు మంజూరు కావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. చదవండి: కేసీఆర్ ఆదిపురుష్: ఆర్జీవీ సంచలన ట్వీట్ చాన్నాళ్లుగా.. బొగ్గు, విద్యుదుత్పత్తి కేంద్రాలుగా ఉన్న మణుగూరు, రామగుండం మధ్య కొత్తగా రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని రెండు దశాబ్దాల కిందట లాలూప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా సర్వే నిర్వహించారు. ఆ తర్వాత కూడా అనేక మార్లు సర్వేలు జరిగాయి. ఇరవై ఏళ్లుగా సర్వేలు తప్ప లైన్ విషయంలో మరే పురోగతి కనిపించలేదు. భద్రాచలం రోడ్డు – కొవ్వూరు రైల్వే లైన్ తరహాలోనే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలకే పరిమితమవుతుందనే సందేహాలు నెలకొన్నాయి. కానీ ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు కదలిక వచ్చింది భూసామర్థ్య పరీక్షలు ఇటీవల సరుకు రవాణాకు రైల్వే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. త్వరగా సరుకు రవాణా కోసం ప్రత్యేక ట్రాక్‌లను సైతం నిర్మిస్తోంది. దీంతో పాటు ట్రిపుల్ ఆర్(రివర్, రైల్, రోడ్డు) కాన్సెప్‌్టతో సరుకు రవాణాకు గల అవకాశాలను పరిశీలిస్తోంది. ఇటు మణుగూరు, అటు రామగుండం రెండు పట్టణాలు గోదావరి నదీ తీరంలో ఉన్నాయి. ఈ రెండు పట్టణాల మధ్య రోడ్డు మార్గం ఉంది. ఇప్పుడు అదనంగా రైలు మార్గం నిర్మాణంపై కేంద్రం దృష్టి సారించి, ఇప్పటికే సర్వే పూర్తయినందున రైలు మార్గం నిర్మాణానికి రెడీ అవుతోంది. అందులో భాగంగా రైలు మార్గం వెళ్లే ప్రాంతాల్లో భూసామర్థ్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ మేరకు ములుగు జిల్లాలో పలు ప్రాంతాల్లో మట్టి నమూనా పరీక్షలు జరుగుతున్నాయి. ప్రయోజనాలు ప్రస్తుతం రామగుండం – కాజీపేట – డోర్నకల్ – భద్రాచలంరోడ్డు – మణుగూరు మార్గం 291 కి.మీ. నిడివితో ఉంది. కొత్త మార్గం అందుబాటులోకి వస్తే దాదాపు వంద కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అదే విధంగా భూపాలపల్లిలో ఉన్న సింగరేణి బొగ్గుగనులు, కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్లకు రైలుమార్గం అందుబాటులోకి వస్తుంది. న్యూఢిల్లీ – చెన్నై గ్రాండ్‌ట్రంక్ లైన్లో నాగ్‌పూర్ – విజయవాడ సెక్షన్లో కీలక ప్రత్యామ్నాయ మార్గంగా ఈ లైన్ నిలవనుంది. రైలు మార్గం ఇలా మణుగూరు – రామగుండం కొత్త మార్గానికి సంబంధించి రామగుండం దగ్గర ఉన్న రాఘవాపురం రైల్వే స్టేషన్ నుంచి ఈ లైన్ ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి మంథని – భూపాలపల్లి – మేడారం – తాడ్వాయి – కాటాపూర్ – గోపాలపురం – రామనుజపురం మీదుగా మణుగూరుకు చేరుకుంటుంది. మొత్తంగా రాఘవాపురం నుంచి మణుగూరు వరకు 197 కి.మీ నిడివితో ఈ మార్గాన్ని నిర్మించాల్సి ఉంది. చివరి సారిగా చేసిన సర్వేలో ఈ లైన్ నిర్మాణానికి రూ. 3,000 కోట్లు ఖర్చు కావొచ్చని అంచనా వేశారు. -
మన మైసూర్.. ఇల్లెందు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: దసరా ఉత్సవాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులకు గుర్తొచ్చేది ఇల్లెందు. కర్ణాటకలోని మైసూర్ తరహాలో ఇక్కడ భారీగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ముఖ్యంగా విజయదశమి రోజున జరిగే జమ్మిపూజ, దేవుడి శావ(ఊరేగింపు) చూసేందుకు ఇతర ప్రాంతాల వారు సైతం ఇల్లెందుకు వస్తుంటారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచీ జరుగుతున్న ఉత్సవాల తీరుతెన్నులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. గోవింద్ సెంటర్ చుట్టూ.. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా బొగ్గుతవ్వకాలు ఇల్లెందులో ప్రారంభమయ్యాయి. బొగ్గు గనుల్లో పని కోసం ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. బొగ్గు తవ్వకం, రవాణా ఇతర పనుల పర్యవేక్షణ కోసం బ్రిటిష్ సిబ్బంది, అధికారులు ఇల్లెందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక బొగ్గు గనులకు, బ్రిటీషర్లకు రక్షణగా నాటి సైన్యాన్ని, ఇతర సిబ్బందిని నిజాం రాజు నియమించాడు. అలా ఇల్లెందులపాడు చెరువు నుంచి ప్రస్తుత గోవింద్ సెంటర్ వరకు ఉన్న ప్రదేశంలో స్థానికులు, బ్రిటీషర్లు, నిజాం సేనలు నివసించేవారు. ఉల్లాసం కోసం భజన బృందాలు సాంకేతిక పరిజ్ఞానం అంతగాలేని ఆ రోజుల్లో చిన్న చిన్న బావులను తవ్వి బొగ్గు వెలికితీసేవారు. ఆ బావుల చుట్టే కార్మికులు ఇళ్లు నిర్మించుకుని ఉండేవారు. ప్రస్తుతం దో నంబర్ బస్తీగా పిలుస్తున్న ప్రాంతాన్ని అప్పుడు బండమీద బాయిగా పిలిచేవారు. అక్కడ రెండో నంబర్ పేరుతో గని ఏర్పాటు చేశారు. అందులో పనిచేసే కార్మికులు అక్కడే నివసించేవారు. పని ప్రదేశాన్ని మినహాయిస్తే చుట్టూ దట్టమైన అడవిగా ఉండేది. రాత్రివేళ అడవి జంతువుల భయంతో కార్మికులు వణికిపోయేవారు. అంతేకాదు.. దుర్భరమైన పరిస్థితుల మధ్య ప్రాణా లకు తెగించి బొగ్గు ఉత్పత్తి చేసేవారు. దీంతో వారికి మానసికోల్లాసం కోసం తొలిసారిగా నంబర్ 2 బస్తీ ఏరియాలోని కార్మికుల కుటుంబాలతో కలిసి శ్రీకృష్ణ భజన బృందం ఏర్పడింది. రాత్రివేళ కార్మికులు, వారి కుటుంబసభ్యులు ఒక చోట చేరి కృష్ణుడి భజన చేసేవారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇల్లెందులోని ఇతర కార్మిక వాడల్లోనూ భజన బృందాలు ఏర్పడ్డాయి. అలా ఇల్లెందులపాడులో హనుమాన్, శ్రీరామ భజన బృందాలు ఏర్పాటయ్యాయి. ఇల్లెందులో జరిగిన దసరా ఉత్సవాలకు హాజరైన ప్రజలు (ఫైల్) మిషన్ స్కూల్ వద్ద జమ్మిపూజ ప్రస్తుతం మిషన్ స్కూల్‌గా పిలుస్తున్న ప్రాంతంలో బ్రిటిష్ అధికారుల వసతిగృహం, మిషన్ హాస్పిటల్ ఉండేవి. ఈ బంగళాల సమీపంలోనే జమ్మిచెట్టు ఉండేది. దసరా రోజున ఈ జమ్మిచెట్టు చెంతన పూజలు నిర్వహించేవారు. దీంతో విజయదశమి నాడు నంబర్ 2 బస్తీకి చెందిన కృష్ణ భజన బృందం, ఇల్లెందుల పాడు నుంచి శ్రీరామ భజన బృందం సభ్యులు కృష్ణుడు, రాముడి ప్రతిమలను కావడి/పల్లకిలో మోసుకూంటూ ఈ జమ్మిచెట్టు మైదానానికి చేరుకునేవారు. అక్కడ సామూహిక భజనతో పాటు జమ్మిపూజలు ఘనంగా జరిగేవి. 1940వ దశకంలో మొదలు గోవింద్ సెంటర్ పరిసర ప్రాంతాల్లోనే అధికంగా నివసించే బ్రిటిష్ కుటుంబాలు, నిజాం ఉద్యోగుల కుటుంబాలు సైతం క్రమంగా ఈ వేడుకల్లో భాగస్వాములయ్యేవి. అలా 1940వ దశకం నుంచి ప్రభుత్వ, పాలకులంతా కలిసి ఘనంగా దసరా నిర్వహించడం మొదలైంది. దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. సందడే సందడి.. ఒకప్పుడు శ్రీరామ, శ్రీ కృష్ణ భజన బృందాలే ఇక్కడికి శావలు తీసుకొచ్చేవి. ఆ తర్వాత ఇతర కాలనీలు, అసోసియేషన్ల తరఫున కూడా శావలు తీసుకురావడం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి వరకు శావలు జమ్మిగ్రౌండ్‌కు చేరుకునేవి. జమ్మిపూజకు వచ్చిన భక్తులు చివరి శావ వచ్చేవరకూ ఎదురు చూసేలా ఉండడం కోసం 1993 నుంచి మ్యూజికల్ నైట్ సైతం ఈ వేడుకల్లో భాగమైంది. ఆ తర్వాత డ్యాన్స్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. 2013 నుంచి రావణవధ సైతం ఇక్కడ వేడుకగా నిర్వహిస్తున్నారు. వీఐపీల రాక.. రాష్ట్రంలో విజయదశమి వేడుకలు అంటే ఇల్లెందులోనే అనేంత ఘనంగా జరుగుతాయి. ప్రతీ దసరా కు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా ముఖ్య అతిథులుగా వస్తుంటా రు. క్రమంగా ఇల్లెందులో కార్మికుల సంఖ్య తగ్గినా ఉత్సవాల నిర్వహణలో మాత్రం ఏ మార్పూ రాలే దు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం దసరాకు ఇల్లెందు రావడానికి ఆసక్తి కనబరుస్తారు. జమ్మి వేడుకల అనంతరం సమీపంలోని కోటమైసమ్మ జాతరకు పోటెత్తుతారు. విజయదశమి రోజు న పట్టణంలోని అన్ని సినిమా థియేటర్లలో తెల్లవార్లూ ప్రదర్శనలు ఉంటాయి. దాదాపు 80 ఏళ్లుగా మిషన్ స్కూల్ మైదానంలో జరుగుతున్న ఉత్సవాలను ఈసారి జేకే స్కూల్ గ్రౌండ్‌కు మార్చారు. ఈ కొత్త వేదికలో జమ్మి వేడుకలు ఎలా జరుగుతాయో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. భక్తి భావాన్ని కొనసాగిస్తున్నాం.. మా పూర్వీకులు ప్రతిరోజూ సాయంత్రం శ్రీరామ భజన మందిరంలో స్వామివారిని స్మరిస్తూ భజన చేసేవారు. దసరా ఉత్సవాల సమయంలో రథాన్ని అందంగా అలంకరించి జమ్మి గ్రౌండ్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి పూజలు చేసేవారు. 80 ఏళ్ల క్రితం నాటి ఆనవాయితీని నేటికీ కొనసాగిస్తున్నాం. – శ్రీరామ భజన బృందం సభ్యులు, ఇల్లెందు భక్తులను ఉత్సాహ పర్చేందుకే ఇల్లెందులో దసరా, వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవాళ్లం. దసరా ఉత్సవాల్లో జమ్మిగ్రౌండ్‌కు వచ్చే భక్తులను ఉత్సాహపర్చేందుకు 1983 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 2013 నుంచి రావణ వధ కూడా చేస్తున్నాం. – మడత వెంకట్‌గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, ఇల్లెందు భక్తులు ఆశించిన విధంగా దసరా ఉత్సవాలు దశాబ్దాలుగా ఇల్లెందులో దసరా ఉత్సవాలు మైసూర్ తరహాలో కొనసాగుతున్నాయి. గతానికి ఏ మాత్రం తీసిపోకుండా ఈసారి కూడా ఘనంగా నిర్వహిస్తాం. ఇందుకోసం మున్సిపల్ పాలకవర్గం, స్థానిక ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అందరం కలిసి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. – దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్, ఇల్లెందు. -
కాయ కష్టం చేసి రూ. 1.5 లక్షలు దాచుకుంటే.. చెద తినేసింది!
ఇల్లెందు: రెక్కలు ముక్కలు చేసుకుని పొదుపు చేసిన డబ్బు చెద పడితే..? అదే జరిగింది. దాచుకున్న రూ.1.5 లక్షలనోట్లు చెద పట్టడంతో ఒక సుతారి మేస్త్రీ లబోదిబోమంటున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలాజీనగర్ పంచాయతీ సమ్మక్క గద్దెల వద్ద నివసించే గడ్డం లక్ష్మయ్య సుతారి మేస్త్రీ. రోజూ సంపాదించే ఆదాయంలో కొంత డబ్బును ఇంట్లోని సజ్జెపై సూట్‌కేసులో భద్రపరుస్తున్నాడు. అలా రూ.1.5 లక్షలు దాచాడు. ఇటీవలి వర్షాలకు గోడలు నాని సజ్జెకు చెమ్మ రావడంతో చెదపట్టింది. ఈ క్రమంలో ఇటీవల ఆయన సూట్ కేసు తెరిచి చూసేసరికి అందులోని రూ.2 వేలు, రూ.500 నోట్లను చెద పురుగులు తినేశాయి. ఆ నోట్లతో గురువారం ఇల్లెందులోని మూడు బ్యాంకులకు వెళ్లగా హైదరాబాద్‌కు వెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారు. హైదరాబాద్ వెళ్లే స్తోమత లేని తనను ఎవరైనా ఆదుకోవాలని లక్ష్మయ్య కోరుతున్నాడు. -
ఆజాద్ హైదరాబాద్: సాయుధ పోరులో చేయి కలిపిన సింగరేణి
దేశమంతా స్వాతంత్య్ర సంబురాలు జరుపుకొంటున్న వేళ... తెలంగాణ మాత్రం నిజాం రాజు ఏలుబడిలోనే కొనసాగింది. ఎందరో వీరుల పోరాట ఫలితంగా బ్రిటీష్ వాళ్లు దేశాన్ని వదిలి వెళ్లాక కూడా హైదరాబాద్ సంస్థానాదీశుడైన నిజాం ఆధ్వర్యాన రజాకారులు హైదరాబాద్ సంస్థానం పరిధిలో అరాచకాలు సాగించారు. కొంతకాలం పంటి బిగువున భరించిన ప్రజలు... దుర్మార్గాలు పెచ్చరిల్లడంతో తిరుగుబాటుకు దిగారు. యువత ఏకమై సాయుధపోరాటాలు సాగించి నిజాం సైన్యాలను తిప్పికొట్టింది. ఈ పోరాటంలో పలువురు అమరులైనా మిగతా వారు వెనక్కి తగ్గకుండా చేసిన పోరాటంతో తెలంగాణకు సైతం స్వాతంత్య్రం లభించింది. ఈ సందర్భంగా జిల్లాలోని పలు గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట గాధలను స్థానికులు గుర్తు చేసుకుంటుంటారు. ఆనాటి అమరులకు గుర్తుగా నిర్మించిన స్థూపాలు సాక్షిగా నిలుస్తున్నాయి. ఈమేరకు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న పలు గ్రామాలపై కథనాలు.. ఈటెలతో తిరగబడిన మీనవోలు ఎర్రుపాలెం : తెలంగాణ సంస్థానాన్ని ఏలుతున్న నైజాం పాలనను వ్యతిరేకిస్తూ చేపట్టిన సాయుధ పోరాటంలో ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయ్యారు. పోరాటాల పురిటిగడ్డగా మీనవోలు గ్రామం చరిత్ర పుటలకెక్కింది. ఎర్రుపాలెం మండల కేంద్రంలో నైజాంలు అప్పట్లో పోలీస్ క్యాంపు నిర్వహించేవారు. అందులో బ్రిటీష్ ప్రభుత్వ అధికారి లెఫ్టినెంట్ సార్జంట్ తరచూ మీనవోలు గ్రామంపై దాడులు చేసి ప్రజల సొమ్మును అపహరించేవాడు. సార్జంట్ తీరుకు తోడు రజాకారులు కూడా ప్రజలను చిత్రహింసలు పెడుతుండగా... 1948 సంవత్సరం జనవరి 15న గ్రామస్తులంతా మూకుమ్మడిగా తిరగబడ్డారు. ఈక్రమంలో సార్జంట్ తన బలగాలే కాకుండా రజాకార్లతో కలిసి మీనవోలుకు వస్తున్నాడన్న సమాచారంతో గ్రామస్తులు ఈటెలతో దండెత్తారు. ప్రజల తిరుగుబాటును ఊహించని సార్జంట్ అప్పటికప్పుడు విచక్షణా రహితంగా తుపాకీతో కాల్పులు జరపగా రాంపల్లి రామయ్య, సుఖబోగి ముత్తయ్య, తోట బాలయ్య, పిల్లి కాటయ్య, బండి వీరయ్య, మెట్టెల శ్రీరాములు, తోట వెంకయ్య ప్రాణాలు కోల్పోయారు. అయినా కోపం చల్లారని సార్జెంట్.. నైజాం నవాబు సాయంతో రజాకార్లను రైలులో రప్పించి పలువురి ఇళ్లను తగలబెట్టారు. అలా పరిస్థితి విషమించడంతో పలువురు గ్రామస్తులు మీనవోలు విడిచివెళ్లారు. అనంతర కాలంలో పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ గ్రామాలకు చేరుకున్నారు. కాగా, రజాకార్లను ఎదురొడ్డి పోరాడి అమరులైన వారికి గుర్తుగా గ్రామస్తులు 1958 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన స్థూపాన్ని నిర్మించారు. కాలక్రమంలో ఈ స్థూపం శిథిలం కావడంతో మరమ్మత్తులు చేయించడంతో పాటు అదే రీతిలో ప్రధాన రహదారిపై మరో స్థూపాన్ని నిర్మించారు. గుర్రాలతో తొక్కించినా నోరువిప్పని పోరాటపటిమ కొణిజర్ల : నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో యువకులు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడగా... అందులో కొణిజర్ల మండలంలోని తనికెళ్లకూ స్థానముంది. తనికెళ్లకు చెందిన గడల సీతారామయ్య, గడల రామకృష్ణయ్య, గడల సుబ్బయ్య, గడల నర్సయ్య తుళ్లూరి అప్పయ్య, కొణిజర్లకు చెందిన దొండపాటి వెంకయ్య తాళ్లపల్లి రాములు ఆనాడు మల్లెల వెంకటేశ్వరరావు దళంలో పనిచేశారు. నాటి సాయుధ పోరాటంలో నల్లమల వెంకటేశ్వరరావు, షేక్ రజబ్అలీ నేతృత్వంలో తుపాకులు చేతబట్టి కదన రంగంలో కాలుమోపి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. దళంలో పనిచేసిన వీరికి ఇదే గ్రామానికి చెందిన గడల ముత్తయ్య, పేరసాని అప్పయ్య, యాసా వెంకటలాలయ్య, పిన్నం సత్యం, యాసా మాణిక్యమ్మ సాయం చేసేవారు. ఓ సమయాన రజాకార్లు గ్రామాలపై విచక్షణారహితంగా దాడి జరిపి మహిళలు, చిన్నారులను చిత్రహింసలకు గురిచేయడమే కాక పురుషులను పట్టుకుని జైలులో పెట్టారు. అందులో పలువురిని కాల్చి చంపడం ద్వారా గ్రామస్తులకు భయాందోళనకు గురిచేసేవారని చెబుతారు. ఆ సమయాన గడల సీతారామయ్య ఆచూకీ తెలపమని రజాకార్లు గుర్రాలతో తొక్కించినా గ్రామస్తులెవరూ నోరు విప్పలేదట! నాటి తెలంగాణ సాయుధ పోరాట ఆద్యుడు పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పలువురు పోరాటంలో పాల్గొనగా, గ్రామానికి చెందిన యాసా మాణిక్యమ్మ అడవుల్లో తలదాచుకుంటున్న పోరాటవీరులకు భోజనం సమకూర్చేది. ఆమెను గుర్తించి రజాకార్లు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టినా ఎవరి వివరాలు తెలియనివ్వలేదు. మండలంలోని లాలాపురానికి చెందిన సంక్రాంతి రామనర్సయ్య గుబ్బగుర్తి అటవీ ప్రాంతంలో ఆరికాయలపాడు దళం ఆర్గనైజర్‌గా పనిచేశారు. 1945 ప్రాంతంలో సింగరాయపాలెం జాగీర్దార్, నిజాం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ సాయుధ పోరాటం నిర్వహించాడు. వివాహమైన ఏడాదికే దళంలో చేరిన రామనర్సయ్య చేసిన పోరాట పటిమను తట్టుకోలేని నిజాం ప్రభుత్వం 1947లో ఆయనతో పాటు మరికొందనిని గుబ్బగుర్తి అడవుల్లో పట్టుకుంది. ఆతర్వాత మున్నేరువాగు వద్దకు తీసుకెళ్లి ఎవరి గోతులు వారినే తవ్వుకోమని చెప్పి కాల్చి చంపి పూడ్చి పెట్టారు. ఆయన స్ఫూర్తితోనే రామనర్సయ్య సోదరుడు సంక్రాంతి మధుసూదన్‌రావు కమ్యూనిస్టు నాయకుడిగా కొనసాగుతున్నారు. పోరాటాల గడ్డ మేదేపల్లి ఏన్కూరు : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఏన్కూరు మండలం మేడేపల్లి గ్రామస్తులు ఎందరో రజాకార్లను ఎదురొడ్డి పోరాటం చేశారు. తద్వారా పోరాటాల గడ్డగా మేడేపల్లి చరిత్రకెక్కింది. మేడేపల్లి గ్రామంలో గిరిజనులు రజాకార్లను ఎదిరించి పోరాటాలు చేశారు. తాటి సీతమ్మ, తాటి సత్యం, ముక్తి ఎర్రయ్య, బండ్ల పెద్ద జోగయ్య, ముక్తి రాములు తుపాకులు పట్టి అడవుల్లో తలదాచుకుంటూ రజాకార్లను తుదముట్టించారు. నల్లమల గిరిప్రసాద్ నాయకత్వంలో వీరు పోరాటం చేసినట్లు చెబుతారు. తాటి సీతమ్మ, తాటి సత్యంతో పాటు తెలంగాణ సాయుధ పోరాట వీరుల స్మృతిచిహ్నాలుగా గ్రామంలో స్థూపాలను ఏర్పాటుచేశారు. పోలీస్ చర్య తర్వాతా యుద్ధమే.. సత్తుపల్లి : సత్తుపల్లి నుంచి పది కి.మీ. దూరంలో ఉన్న ఆంధ్రా ప్రాంతంలోని గురుభట్లగూడెం, కృష్ణారావుపాలెం తదితర ప్రాంతాలపై రజాకార్ల నిర్బంధం కొనసాగేది. ఆ సమయంలో దమ్మపేట మండలం జమేదారుబంజరు ప్రాంతం నుంచి సోయం గంగులు నాయకత్వంలో సాయుధ పోరాటం మొదలైంది. ఆయనకు మద్దతుగా గిరిజనులు, గిరిజనేతరులు రజాకారులపై గెరిల్లా దాడులు పాల్పడుతుండేవారు. అనంతర కాలంలో పోలీసు చర్యతో తెలంగాణకు విముక్తి లభించింది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు – భారత మిలటరీకి 1948 నుంచి 1950 వరకు రెండేళ్ల పాటు హోరాహోరీ పోరు నడిచింది. గ్రామాల్లోకి భారత సైన్యం వస్తుంటే కమ్యూనిస్టులు సాయుధులై తిరుగుబాటు చేసేవారు. క్షేత్ర స్థాయిలో పరిపాలనను అందించేందుకు ఆ సమయానభారత మిలటరీకి మద్దతుగా గ్రామాల్లో రక్షణ దళాలు ఏర్పాటయ్యాయి. ఈ దళాల్లోని సభ్యులకు తుపాకీతో శిక్షణ ఇచ్చేవారు. వీరు ఉదయమంతా గ్రామాల్లో గస్తీ తిరగటం.. చీకటిపడే సమయానికి సత్తుపల్లి పాత సెంటర్లోని జెండా చింతచెట్టు వద్ద సమావేశ కావటం జరుగుతుండేది. భారత మిలటరీని మలబార్ రెజిమెంట్ ఆధ్వర్యంలో రక్షణ దళం ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులను హోంగార్డులుగా కూడా వ్యవహరించేవారు. ఇందులోభాగంగా 1948లో సత్తుపల్లి గ్రామ రక్షణ దళం ఏర్పాటు కాగా.. చల్లగుళ్ల సీతారామయ్య, నరుకుళ్ల వెంకయ్య, దిరిశాల సత్యం, మట్టా రామయ్య, చల్లగుండ్ల వీరయ్య, మట్టా వెంకయ్య, మొరిశెట్టి సత్యం, నరుకుళ్ల రామయ్య, పల్లబోతు నాగభూషణం, కొత్తూరు సుబ్బారావు, సీతారామయ్య, మహాదేవ రామలింగం, వల్లభనేని సకలయ్య తదితరులు సభ్యులుగా ఉండే వారని పెద్దలు చెబుతుంటారు. నాకు గర్వంగా ఉంటుంది.. 18 ఏళ్ల వయస్సులో మా నాన్న చల్లగుళ్ల వీరయ్య సత్తుపల్లి గ్రామ రక్షణ దళంలో పని చేశారు. కమ్యూనిస్టు సాయుధ పోరాటం విరమించే వరకు రక్షణ దళం భారత మిలటరీ మద్దతుతో పని చేసేదని మానాన్న చెప్పేవారు. సత్తుపల్లి చరిత్రలో మా కుటుంబం పేరు కూడా ఉండటం నాకు గర్వకారణంగా ఉంది. – చల్లగుళ్ల నర్సింహారావు, సత్తుపల్లి -
మావోయిస్టుల ఇలాకాలో పోలీస్ బాస్‌లు
చర్ల: మావోయిస్టుల ఇలాకాగా పేరున్న ఛత్తీస్‌గఢ్‌కు సరిహ ద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్ సింగ్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నాపురం వద్ద సీఆర్పీఎఫ్ క్యాంపును వారు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి హెలీకాఫ్టర్ ద్వారా చెన్నాపురం చేరుకున్న వారు క్యాంపు పరిసరాలతో పాటు అధికారులు, సిబ్బందికి కల్పించిన వసతులను పరిశీలించారు. అదనపు డీజీపీ ఎస్.ఎస్.చతుర్వేది, సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ అదనపు డీజీ నళిన్‌ప్రభాత్, సదరన్ సెక్టార్ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా, కుంట డీఐజీ రాజీవ్‌కుమార్ ఠాకూర్, డీఐజీ ఎస్.ఎన్.మిశ్రా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా క్యాంపులు సీఆర్పీఎఫ్ క్యాంపు ప్రారంభించిన అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, నక్సల్స్ నిర్మూలన కోసం కేంద్ర హోం శాఖ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బలగా లను పటిష్టం చేసేందుకు ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా చెన్నాపురం, పూసుగుప్ప, ఉంజుపల్లి, చెలిమల, తిప్పాపురం, కలివేరులో క్యాంపులు ఏర్పాటుచేయగా, జిల్లా పోలీసు యంత్రాంగం, సీఆర్పీఎఫ్ బలగాల సమన్వయంతో ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా మరింత పటిష్టమవుతుందని వెల్లడించారు. కాగా, అమాయకపు ఆదివాసీ గిరిజనులపై దుశ్చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులు తెలంగాణలో ఆదరణ కోల్పోయారని మహేందర్‌రెడ్డి పేరొన్నారు. సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్సింగ్ మాట్లాడుతూ మావోయిస్టులకు అడ్డుకట్ట వేయడంలో తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల పోలీసుల పనితీరు అభినందనీయమని తెలిపారు. -
ఇద్దరు మహిళా మావోయిస్టుల అరెస్టు
కొత్తగూడెంటౌన్: పోలీసులు, ప్రజాప్రతినిధులే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్‌తో వచ్చిన ఇద్దరు మహిళా మావోయిస్టులను అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ వెల్లడించారు. అరెస్టు అయినవారిలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర నేత దామోదర్ భార్య, చర్ల ఏరియా కమిటీ మెంబర్ మడకం రజిత, దళసభ్యురాలు మడవి ధని ఉన్నట్లు తెలిపారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 7న కుర్నపల్లి–బోదనెపల్లి మధ్య అటవీ ప్రాంతాల్లో చర్ల, స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహించగా వీరు పట్టుబడ్డారని తెలిపారు. రజిత స్వగ్రామం భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం ములకనాపల్లి కాగా, ధనిది ఛత్తీస్‌గఢ్. మొత్తం 81 ఘటనల్లో తన ప్రమేయం ఉందని రజిత అంగీకరించినట్లు ఎస్పీ తెలి పారు. కాగా, పోలీసులు చర్లలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు మావోయిస్టులు చెబుతున్నారు. కానీ, ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించిన నేపథ్యాన మిగతా నలుగురి విషయమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. -
ఇన్ఫార్మర్ నెపంతో ఉపసర్పంచ్ హత్య.. లేఖలో హెచ్చరిక
చర్ల: పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చర్ల మండలం కుర్నవల్లి గ్రామ ఉపసర్పంచ్, సీపీఎం నాయకుడు ఇర్పా రాము అలియాస్ రాముడు(36)ను మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి హతమార్చారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రాము, అతడి భార్య ఇంటి వరండాలో నిద్రిస్తుండగా, అర్ధరాత్రి 12 గంటలకు సాధారణ దుస్తుల్లో వచ్చిన నలుగురు వ్యక్తులు రామును నిద్ర లేపారు. మాట్లాడే పనుందంటూ తీసుకెళ్తుండగా, రాము భార్య కనకమ్మ ఇంట్లో నిద్రిస్తున్న అత్త, మామలు, మరిదిని లేపింది. వాళ్లు లేచేలోపే రామును తీసుకెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి రహదారి వెంట రాత్రి 2గంటల వరకు వెదికారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు మరోసారి వెదుకుతుండగా ఛత్తీస్‌గఢ్‌లోని నిమ్మలగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై రక్తపు మడు గులో రాము మృతదేహం కనిపించింది. ముఖం, తల భాగంలో గొడ్డళ్లు, కత్తులతో నరికి చంపినట్లు ఆనవాళ్లు కనిపించాయి. పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నందునే ఈ శిక్ష విధించామనిమావోయిస్టు చర్ల–శబరి ఏరియా కమిటీ పేరిట ఒక లేఖ వదలివెళ్లారు. ఇన్ఫార్మర్లుగా మారి ప్రజాద్రోహులుగా తయారైతే ఎవరికైనా ఇదే శిక్ష విధిస్తామని లేఖలో హెచ్చరించారు. -
భద్రాద్రి రామయ్యకు ముస్లిం భక్తుడి వితరణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి గురువారం ఖమ్మానికి చెందిన రామయ్య భక్తుడు ఎస్కే జాన్ మహ్మద్ రూ.1,00,116 వితరణగా అందజేశారు. రామయ్య ఆలయాన్ని గతంలో కూడా పలువురు ముస్లిం భక్తులు సందర్శించి స్వామివారిని దర్శించుకున్న సందర్భాలున్నాయి. – భద్రాచలం -
భద్రాద్రి వద్ద గోదావరి ఉధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం/కాళేశ్వరం/వాజేడు: తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు 38.70 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం బుధవారం ఉదయానికి 50 అడుగులకు చేరువైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. చదవండి: మీ వాహనం సేఫ్‌గా ఉండాలా.. వానాకాలంలో ఈ టిప్స్ పాటించాల్సిందే ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి వస్తున్న వరదలతో గోదావరి 55 అడుగులు దాటే అవకాశమున్నందని, ముంపు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరించారు. జాలర్లు చేపలవేటకు వెళ్లొద్దని, ప్రజలు వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించొద్దని సూచించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో దుమ్ముగూడెం మండలంలో సున్నంబట్టి–బైరాగులపాడు ప్రధాన రహదారిపైకి వరద భారీగా చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాలలోని సీతమ్మ నారచీరల ప్రాంతం ముంపునకు గురైంది. తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో మంగళవారం 9 గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. -
ఇంటికి పంపలేదని.. భవనం పైనుంచి అందరూ చూస్తుండగానే..
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యా లయంలో చదువుతున్న విద్యార్థిని.. ఇంటికి పంపించలేదనే ఆవేదనతో భవనం పైనుంచి దూకగా గాయాలయ్యాయి. మండలంలోని తుంగారానికి చెందిన పప్పుల మురళి–కృష్ణ కుమారి దంపతుల కుమార్తె ప్రమీలను గత నెలలో కేజీబీవీలో చేర్పించారు. అప్పటి నుంచి ప్రమీల విద్యాలయంలో ఉండనని రోదిస్తుండగా, 3రోజులుగా ఇంటికి పంపించాలని కోరుతోంది. ఈ క్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కాంతకుమారి విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇంతలోనే మంగళవారం ఉదయం బట్టలు ఆరేసేందుకు భవనం పై అంతస్తుకు వెళ్లి ప్రమీల అందరూ చూస్తుండగానే దూకింది. అయితే, ఆమె పడిన ప్రదేశంలో బురద గుంత ఉండటంతో గాయాలతో బయటపడింది. ఈమేరకు స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తర్వాత కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
-
వరద కుమ్మేసింది.. బురద కమ్మేసింది!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి వరద మోసుకొచ్చిన ఒండ్రుమట్టి, బురద ముంపు గ్రామాలను కమ్మేసింది. వరద వెనక్కి తగ్గగానే తమ ఊళ్లు, ఇళ్లను చూసుకుని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రాణాలు తప్ప సమస్తం కోల్పోయామంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 మండలాల ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు. ఆ తర్వాత అంచనాలకు మించి వరద రావడంతో ఊళ్లకు ఊళ్లే నీళ్లలో మునిగిపోయాయి. దీంతో ఇళ్లలో ఉన్న సమస్తం మట్టికొట్టుకుపోయాయి. వరద కొద్దిగా నెమ్మదించడంతో క్రమంగా ఇళ్లకు చేరుకుంటున్న జనం తిండితిప్పలు మాని ఇళ్లల్లోంచి బురదను తొలగిస్తున్నారు. వరదలో నాని కుళ్లిన చెట్లు, జంతువులు, చేపల కళేబరాలు, ఇతర వ్యర్థాల కారణంగా ముంపు ప్రాంతాల్లో దుర్గంధం నెలకొంది. వరద కారణంగా జిల్లాలో మొత్తం 12,277 ఇళ్లు నీట మునగగా సోమవారం సాయంత్రానికి 11,061 ఇళ్లు ముంపు నుంచి బయటపడ్డాయి. 2,330 మంది శానిటేషన్ సిబ్బంది నిర్విరామంగా బురద తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 4,434 గ్రామాలు బురద నుంచి బయటపడ్డాయి. ఆయా గ్రామాల్లో దోమలు వ్యాప్తిచెందకుండా ఫాగింగ్ చేస్తున్నారు. వరద కారణంగా ముంపు ప్రాంత ప్రజల్లో తొంభైశాతం మంది వ్యక్తిగత ఆస్తులను నష్టపోయారు. వరద ముంచుకొస్తుండటంతో కట్టుబట్టలు, విలువైన సామగ్రి మాత్రమే తీసుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లారు. దీంతో ఇళ్లలో ఉన్న ఇతర సామగ్రి, దుస్తులు, బియ్యం, నిత్యావసరాలు, వంట పాత్రలు.. ఇలా ఒకటేమిటి అన్నీ బురదలో కొట్టుకుపోయాయి. ‘తేలని’నష్టం లెక్క! వరద తగ్గితే కానీ ఎంత మేరకు పంట నష్టం వాటిల్లిందనేది తెలియని పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు మునకలోనే ఉన్నాయి. చాలాచోట్ల రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. కాగా ఎగువ నుంచి 9 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటం, స్థానికంగా వర్షాలు జోరుగా కురుస్తుండటంతో గోదావరి నీటిమట్టం తగ్గుదల ఆగింది. సోమవారం మ«ధ్యాహ్నం నుంచి రాత్రి వరకు 56 అడుగుల వద్ధ స్థిరంగా కొనసాగుతోంది. దీంతో పలుచోట్ల వరద సహాయ శిబిరాల్లోనే ప్రజలు తలదాచుకుంటున్నారు. గ్రూప్స్‌కు ప్రిపేరయ్యేదెలా? గ్రూప్ నోటిఫికేషన్ వెలువడింది మొదలు బూర్గంపాడుకు చెందిన రాజేష్ పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు. ఎలాగైనా మంచి ఉద్యోగం సాధించి తన కుటుంబానికి ఆసరాగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. గత వారం గ్రూప్స్ ప్రిపరేషన్స్‌కు సంబంధించి సన్నాహాక పరీక్షకూ హాజరయ్యాడు. ఇంతలోనే వరదలు వచ్చాయి. పైసాపైసా కూడబెట్టిన డబ్బుతో కొనుగోలు చేసిన పుస్తకాలే కాదు.. ఆయన కుటుంబం సమకూర్చుకున్న సామగ్రి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. తడిసిన పుస్తకాలతో రాజేష్ కంటతడి పెడుతున్నాడు. ఈమె పేరు ఇమాంబీ. భద్రాచలం సుభాష్‌నగర్‌కు చెందిన ఈమె నెలనెలా వచ్చే వృద్ధాప్య ఫించను జమచేసుకుంటూ రూ.12 వేలు వెచ్చించి తన గుడిసెపై రేకులు వేయించుకుంది. ఇటీవలి వరదల్లో ఆమె గుడిసె నామరూపాల్లేకుండాపోయింది. కొడుకులున్నా తనకు నిలువ నీడలేదని.. కనిపించిన వారికల్లా తన బాధ చెప్పుకుంటోంది. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పునరావాస కేంద్రంలో బతుకీడుస్తోంది. ఇది ఒక్క ఇమాంబీ బాధ మాత్రమే కాదు గోదావరి వరదల్లో చిక్కున్న 12 వేల కుటుంబాల వ్యథ. -
తగ్గేదేలే.. ఎవరికి వారే.. అటు గవర్నర్.. ఇటు కేసీఆర్ పోటాపోటీగా..
సాక్షి, ఖమ్మం జిల్లా: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఓ వైపు సీఎం కేసీఆర్, మరో వైపు గవర్నర్ తమిళిసై పర్యటనలు కొనసాగుతున్నాయి. భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను గవర్నర్ పరిశీలిస్తున్నారు. తమిళిపై పర్యటనలో కలెక్టర్, జిల్లా ఎస్పీ కనిపించలేదు. గవర్నర్ వెంట ఏఎస్పీ, ఆర్డీవో మాత్రమే ఉన్నారు. పోటోకాల్ వివాదంపై నో కామెంట్ అంటూ గవర్నర్ మాట దాట వేశారు. బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని ఆమె పేర్కొన్నారు. చదవండి: వర్షంలోనే సీఎం కేసీఆర్ పర్యటన.. గోదారమ్మకు శాంతి పూజలు 36 ఏళ్ల తర్వాత గోదావరి రికార్డు స్థాయి నీటి ప్రవాహంతో రావడంతో భద్రాచలం నీట మునిగింది. వరద ముంపు ప్రాంతాలలో సీఎం, గవర్నర్ పర్యటిస్తున్నారు. రోడ్డు మార్గాన హనుమకొండ నుంచి భద్రాచలంకు సీఎం వచ్చారు. మరో వైపు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మణుగూరు చేరుకుని అక్కడ నుంచి అశ్వాపురంలోని వరద ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. భద్రాచలంలో సీఎం కేసీఆర్, అశ్వాపురంలో గవర్నర్ తమిళ్ సై పర్యటనలు పోటా పోటీగా సాగుతున్నాయి. -
గోదావరి ఉధృతి.. పాత రికార్డులన్నీ బద్దలు..?!
భద్రాచలం: భద్రాచలం వద్ద ఈసారి గోదావరి ఉధృతి పాత రికార్డులన్నీ బద్దలుగొట్టే పరిస్థితి కనిపిస్తోంది. గోదావరి చరిత్రలో 1986 ఆగస్టు 16న 75.6 అడుగుల వరద రావడం ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఆ తర్వాత 1990 ఆగస్టు 24న 70.8 అడుగుల వరద రెండో స్థానంలో నిలిచింది. ఈసారి వరద రెండో రికార్డును శుక్రవారం రాత్రి 8గంటలకు దాటేసింది. ఇప్పటివరకు జూలై నెలలో గోదావరికి వచ్చిన వరదల్లో ఇదే అత్యధికం. ప్రవాహం మరింతగా పెరుగుతుందన్న అంచనాల మేరకు.. 1986 నాటి రికార్డును కూడా తాజా వరద అధిగమిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే జూలై నెలలోనే కాకుండా.. గోదావరి వరదల్లోనే ఇదే అతి పెద్దదిగా నమోదు కానుంది. -
భద్రా‘జలం': క్షణక్షణం భయం భయం.. రంగంలోకి సైన్యం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి మరింత ఉధృతంగా మారుతోంది. గంటగంటకూ మరింతగా వరద మట్టం పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయానికి 71 అడుగులతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏకంగా 24,13,509 క్యూసెక్కుల వరద వేగంగా దిగువకు ప్రవహిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాతి నుంచి శనివారం తెల్లవారుజామున 6 గంటల మధ్య వరద స్థాయి మరింతగా పెరుగుతుందని.. ఆ సమయంలో 72 నుంచి 75 అడుగుల వరకు నీటిమట్టం పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ స్థాయిలో వరద వస్తే భారీగా ముంపు నమోదయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే భద్రాచలం సహా ఏజెన్సీ మండలాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించింది. 101 మందితో కూడిన ఆర్మీ బృందం కూడా భద్రాచలానికి చేరుకుంది. అత్యవసర పరిస్థితిలో వినియోగించేందుకు ఒక ఆర్మీ హెలికాప్టర్‌ను కూడా భద్రాచలంలో సిద్ధంగా ఉంచారు. టూరిజం, అగ్నిమాపక శాఖకు చెందిన బోట్లతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకోవాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉండగా, మరిన్ని బృందాలను పంపాలని కేంద్రాన్ని కోరారు. ప్రత్యేక బలగాల మోహరింపు వరద కారణంగా ఎలాంటి ఇబ్బందులు, ఇతర సమస్యలు తలెత్తకుండా పెద్ద సంఖ్యలో పోలీసులనూ భద్రాచలం ఏజెన్సీకి తరలించారు. ఐజీ నాగిరెడ్డి భద్రాచలం చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన ప్రభుత్వ సిబ్బందిని వరద సహాయ కార్యక్రమాల కోసం రప్పించారు. వీరితోపాటు నలుగురు డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు వరద సహాయ కార్యక్రమాల ప్రత్యేకాధికారిగా బాధ్యత అప్పగించారు. సీఎం కేసీఆర్‌తోపాటు చీఫ్ సెక్రెటరీ సోమేశ్‌కుమార్ సహాయ కార్యక్రమాల్లో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భద్రాచలంలో సహాయక కేంద్రాలకు వెళ్లాలని బాధితులకు చెబుతున్న మంత్రి పువ్వాడ అంధకారంలోనే ఏజెన్సీ వరద కారణంగా విద్యుత్ స్తంభాలు, సబ్స్టేషన్లు మునిగిపోవడంతో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, పినపాక మండలాలు అంధకారంలో మునిగిపోయాయి. మణుగూరు వద్ద మిషన్ భగీరథ ఇన్‌టేక్ వెల్ వరదలో మునిగిపోవడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 1,730 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. శిబిరాల్లో ఆకలి కేకలు గోదావరి వరద 80 అడుగుల వరకు చేరుకోవచ్చనే ప్రచారం జరగడంతో.. గురువారం రాత్రి నుంచి లోతట్టు ప్రాంతాల ప్రజలు సహాయ శిబిరాలకు పోటెత్తారు. సొంత వాహనాల్లో సామాన్లతో సహా తరలివచ్చారు. ఒకేసారి ఎక్కువ మంది రావడంతో.. తగిన స్థలం చూపించడం, సమయానికి ఆహారం అందించడంలో ఆలస్యం జరిగింది. అన్నం పెట్టాలంటూ సహాయ శిబిరాల్లోని బాధితులు శుక్రవారం మధ్యాహ్నం ఆందోళన చేశారు. అతి పెద్ద వరదగా మారుతుందా? భద్రాచలం: భద్రాచలం వద్ద ఈసారి గోదావరి ఉధృతితో పాత రికార్డులన్నీ బద్దలుగొట్టే పరిస్థితి కనిపిస్తోంది. గోదావరి చరిత్రలో 1986 ఆగస్టు 16న 75.6 అడుగుల వరద రావడం ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఆ తర్వాత 1990 ఆగస్టు 24న 70.8 అడుగుల వరద రెండో స్థానంలో నిలిచింది. ఈసారి వరద రెండో రికార్డును శుక్రవారం రాత్రి 8గంటలకు దాటేసింది. ఇప్పటివరకు జూలై నెలలో గోదావరికి వచ్చిన వరదల్లో ఇదే అత్యధికం. ప్రవాహం మరింతగా పెరుగుతుందన్న అంచనాల మేరకు.. 1986 నాటి రికార్డును కూడా తాజా వరద అధిగమిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే జూలై నెలలోనే కాకుండా.. గోదావరి వరదల్లోనే ఇదే అతి పెద్దదిగా నమోదు కానుంది. కలవరపెడుతున్న కరకట్ట భద్రాచలం పట్టణానికి రక్షణగా ఉన్న కరకట్ట అధికారులను కలవరపెడుతోంది. 1986లో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకుని ఈ కరకట్టను డిజైన్ చేసినా.. భారీ వరదను ఏమేరకు తట్టుకుంటుందనే ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే కరకట్టకు ఉన్న డ్రైనేజీ స్లూయిస్ల నుంచి నీరు లీకవుతోంది. భద్రాచలంలోని అయ్యప్పకాలనీ, యటపాక దగ్గర కరకట్టలో లీకేజీలు శుక్రవారం బయటపడ్డాయి. అప్పటికప్పుడు ఇసుక బస్తాలు వేశారు. కరకట్టపై ఎక్కడ లీకేజీలు వచ్చినా అడ్డుకునేందుకు ప్రతీ వంద మీటర్లకు ఒకచోట ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచారు. ఆ ఆరు గంటలే కీలకం శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు భద్రాచలం వద్ద గోదావరికి గరిష్ట వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. తర్వాత క్రమంగా ఉధృతి తగ్గుతుందని అంటున్నారు. వరద ప్రవాహం 60 అడుగులకన్నా దిగువకు చేరితే.. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి సహాయ శిబిరాల్లో ఉన్నవారిని ఇళ్లకు పంపిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. అప్పటివరకు ప్రజలు సహకరించాలని కోరారు. నీట మునిగిన గ్రామాలు.. చర్ల మండలంలో 18 గ్రామాలు, దుమ్ముగూడెం మండలంలో 20, మణుగూరులో 3 గ్రామాలు, అశ్వాపురంలో 8, బూర్గంపాడు, చుట్టూ ఉన్న గ్రామాలు నీట మునిగాయి. భద్రాచలంలోని సుభాష్ నగర్, కొత్తకాలనీ, అయ్యప్పకాలనీ, ఇండస్ట్రియల్ ఏరియా, రాజుపేట, శాంతినగర్, అశోక్ నగర్, ఏఎంసీ కాలనీ, రామాలయం పరిసర ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. దుమ్ముగూడెం వద్ద కరకట్టపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ఇసుక బస్తాలు వేశారు. వరద పెరిగితే కరకట్టకు గండ్లు పడే అవకాశం ఉంది. పోటెత్తిన వరదతో 42 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో కోల్ యార్డులోకి వరద నీరు చేరుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం చెప్పినా పట్టించుకోరా?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పోడు భూముల అంశంపై అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి మంత్రులకు ఊహించని పరిణామం ఎదురైంది. పోడు భూముల్లో అటవీ అధికారులు కందకాలు తీయడం, మొక్కలు నాటడం వంటి పనులతో గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారని వారు గళం విప్పారు. అధికారుల తీరుతో తాము ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. భద్రాచలంలో శుక్రవారం జరిగిన ఐటీడీఏ పాలకమండలి వేదికగా పోడు భూములపై వాడీ వేడి చర్చ జరిగింది. ఆవేదనతో చెబుతున్నా: వనమా పోడు భూములకు పట్టాల అంశంపై చర్చ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని సీఎం కేసీఆర్ చెప్పారని తాము అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు ఖాతరు చేయడం లేదన్నారు. ఒకవైపు టీఆర్ఎస్ది ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటుంటే అటవీ అధికారులు గిరిజనులను, గ్రామీణ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, దీనిపై మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. అడవి నుంచి కనీసం రోడ్డు నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకర్గంలో పలు రోడ్లకు రూ.50 కోట్ల వరకు నిధులు మంజూరైనా అటవీ శాఖ అడ్డంకులతో పనులు జరగడం లేదన్నారు. రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరిస్తాం: సత్యవతి రాథోడ్ పోడు అంశంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందిస్తూ.. పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే లబ్ధిదారులను గుర్తించడంలో అనేక సమస్యలు ఉన్నందున ఆలస్యం అవుతోందన్నారు. దీనిపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించిందని తెలిపారు. ఈనెల 11న ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని, 15 నుంచి జరిగే రెవెన్యూ సదస్సుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ట్రెంచ్‌లు కొట్టొద్దు: పువ్వాడ పోడు భూములకు యాజమాన్య హక్కులు కల్పించే అంశంపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వివాదం లేని పోడు భూముల జోలికి వెళ్లొద్దని ఆయన అటవీ శాఖకు సూచించారు. ఎక్కడైనా సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించి ట్రెంచ్‌లు కొడితే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినట్టుగా పరిగణిస్తామ న్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. పంటలు వేసిన తర్వాత ట్రెంచ్‌లు కొట్టడం, ప్లాంటేషన్ చేయడం వల్ల ఈ సమస్య జటిలంగా మారుతోందని అన్నారు. -
దారి లేక.. దవాఖానా లేక ఆగిన ఊపిరి
బూర్గంపాడు: గుక్కపట్టి ఏడుస్తున్న నాలుగు నెలలు చిన్నారి బాబు.. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక ఆస్ప త్రికి తీసుకు వెళదామంటే సైకిల్ కూడా వెళ్లలేని స్థితిలో బురద రోడ్డు.. మరో పక్క వర్షం. చిన్నారి యాతన చూడ లేక భుజాన వేసు కుని ఆస్పత్రికి బయలుదేరిన తల్లిదండ్రులకు కడు పుకోతే మిగిలింది. బురద దారిపై వెళ్తుండగా చి న్నారి ఏడుపు ఆగిపోయినా ఆశతో ఆస్పత్రికి తీసు కెళ్లేసరికి ప్రాణం పోయిందని వైద్యులు నిర్ధారించడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. బూర్గంపాడు మండలం సారపాకకు కూతవేటు దూరంలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి చెందిన చెందిన శ్యామల వెంకయ్య, రత్తమ్మ దంపతులకు నాలుగు నెలల కొడుకు ఉన్నాడు. ఆ చిన్నారి గురువారం ఉదయం గుక్కపట్టి ఏడుస్తుండగా, ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుకున్నారు. అయితే ఓ పక్క భారీ వర్షం.. దానికి తోడు వీరి కాలనీ నుంచి ప్రధాన రహదారికి వెళ్లే రోడ్డు బురదతో నిండిపోయి కనీసం సైకిల్ కూడా వెళ్లలేని స్థితికి చేరింది. చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తల్లిదండ్రులు భుజాన వేసుకుని బురద దారిలోనే కాలినడకన బయలుదేరారు. అంతలోనే గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారి మధ్యలో ఒక్కసారిగా ఏడుపు ఆపేశాడు. ఉలుకూపలుకూ కూడా లేదు. అయినా తల్లిదండ్రులు ఉరుకులు, పరుగులపై సారపాక చేరుకుని అక్కడి నుంచి ఆటోలో భద్రాచలంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాబు మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి.. ఇరవై ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 150 ఆదివా సీ కుటుంబాలు సారపాకకు మూడు కిలోమీటర్ల దూరంలోని శ్రీరాంపురం కాలనీకి వచ్చి ఆవాసా లు ఏర్పాటు చేసుకున్నాయి. వీరందరికీ ఆధార్, రేషన్‌కార్డులతోపాటు ఓటుహక్కు కూడా ఉంది. అయితే అటవీ ప్రాంతంలో ఉండడంతో గ్రామాని కి తాగు నీరు, విద్యుత్ సహా ఎలాంటి వసతులు లేవు. సరైన దారి కూడా లేదు. అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనం వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. -
నువ్వొస్తేనే నేనెళ్తా.. హామీ ఇచ్చేవరకు కదిలేదే లేదు!
తెలంగాణలో విద్యార్థులను బడులకు రప్పించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే బతిమాలి మరీ పిల్లలను పాఠశాలలకు తీసుకువస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం డీఈవో, సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు వినూత్నంగా స్పందించి విద్యార్థులను బడికి రప్పించారు. నువ్వొస్తేనే నేనెళ్తా: డీఈవో జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ గురువారం జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులు ఎక్కువ మంది రాకపోవడాన్ని ఆయన గమనించారు. దీంతో విద్యార్థుల చిరునామాలు తీసుకుని వారి ఇళ్లకు వెళ్లారు. విద్యార్థి పాలెపు జశ్వంత్ మరికొద్ది రోజుల తర్వాత వస్తానని చెప్పగా.. ఈరోజే రావాలంటూ శర్మ అక్కడే బైఠాయించారు. చివరకు ఒప్పించి విద్యార్థిని తీసుకెళ్లి పాఠశాలలో దిగబెట్టారు. కదిలేదే లేదు: హెచ్ఎం పుల్కల్ (అందోల్): బడి మానేసిన పిల్లలను తిరిగి బడికి పంపిస్తామని తల్లిదండ్రులు హామీ ఇచ్చేవరకు కదిలేది లేదంటూ సంగారెడ్డి జిల్లా ముదిమాణిక్యం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్‌రావు వినూత్న ప్రచారం చేస్తున్నారు. మొండికేసిన, బడి మానేసిన పిల్లల్ని పాఠశాలకు పంపాలంటూ బుధవారం గ్రామంలో కొందరి ఇళ్ల ముందు నేలపై పడుకున్నారు. రెండు రోజుల్లో బడి మానేసిన నలుగురు విద్యార్థులను పాఠశాలలో చేర్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. (క్లిక్: కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన జూనియర్ సివిల్ జడ్జి) -
భద్రాచలంలో ‘బాహుబలి’ బేబీ
భద్రాచలంఅర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళ.. బేబీ బాహుబలికి మంగళవారం జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వైద్యులు బుధవారం మీడియాకు వెల్లడించారు. అప్పుడే పుట్టిన పిల్లలు సాధారణంగా 2.3 కేజీల నుంచి 3.7 కేజీల వరకు బరువుంటారు. కానీ, ఈ పాప ఏకంగా 5 కేజీల బరువుంది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ సాకేత తెలిపారు. దుమ్ముగూడెం మండలం దబ్బనుతాళం గ్రామానికి చెందిన గంగా భవానీ ఈనెల 2న ఆస్పత్రిలో చేరగా మంగళవారం సిజేరియన్ చేశారు. (క్లిక్: వస్తామన్న బస్సు రానే వచ్చింది.. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్..) -
రామయ్య హుండీ ఆదాయం రూ.2 కోట్లు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. 59 రోజులకు హుండీల ద్వారా రూ.2,00,22,897 ఆదాయం లభించింది. ఈ నగదుతో పాటు 140 గ్రాముల బంగారం, 2.500 కేజీల వెండి వచ్చాయి. 780 అమెరికన్ డాలర్లు, 300 మలేషియా రింగిట్స్, 150 ఆస్ట్రేలియా డాలర్లు, 100 రష్యా రూబుల్స్, 30 దీరామ్స్, 101 బూటాన్ కరెన్సీ, ఒక సౌదీ రియాల్ లభించాయి. రెండేళ్ల అనంతరం శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం వేడుకలను మిథిలా స్టేడియంలో నిర్వహించడంతో అ«ధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో భద్రాద్రి రామయ్యకు రూ.2 కోట్లకు పైగా ఆదాయం లభించిందని ఈవో శివాజీ తెలిపారు. -
అభిమానుల మధ్య వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అభిమానుల మధ్య వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వైఎస్ విజయమ్మకు వైఎస్ షర్మిల తినిపించారు. లక్ష్మీదేవిపల్లిలో వైఎస్ షర్మిల పాదయాత్ర క్యాంపు వద్ద వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగుతోంది. లక్ష్మీదేవిపల్లి మండలం రేగుళ్లలో నిరుద్యోగ నిరాహార దీక్షలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. చదవండి: సమస్యలు లేవంటే ముక్కు నేలకు రాస్తా -
ప్రోటోకాల్ కంటే.. అది సంతోషానిచ్చింది: తమిళిసై
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచల దేవస్థానం ఆహ్వానం మేరకు సీతారామ పట్టాభిషేకం కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మంగళవారం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. ప్రొటోకాల్ వివాదంపై మాట్లాడటానికి ఇష్టపడని గవర్నర్.. వివాదం ఏమి లేదని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ప్రోటోకాల్ కంటే జనం నుంచి వచ్చే కాంప్లిమెంటరీ సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోనీ పర్యటనలో గిరిజనులు ఎంతో ఆప్యాయంగా పలకరించారని చెప్పారు. గతంలో గర్భిణులుకు పౌష్టికాహారం, వైద్య సదుపాయం కల్పించడం కోసం రాష్ట్రంలో 6 గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగిందని అన్నారు. చాలా గోండు గ్రామాల్లో చాలామంది గర్భిణీ మహిళలు పౌష్టికాహారం లోపంతో వుండడం గమనించామని తెలిపారు. చాలా మంది గర్భిణీ స్త్రీలు వారి బీపీ కూడా చాలా ఎక్కువగా ఉండడం గమనించామని పేర్కొన్నారు. దీనికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా పచ్చళ్లు తినడం వల్లే జరిగినట్లు తెలుస్తోందని అన్నారు. చాలా మంది పౌష్టికాహారం లోపం, అనిమియాతో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. వారందరికీ మెడికల్ క్యాంపులు పెట్టి వారికి వెరీ హైజన్ ఉండే కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. ముందు ముందు కూడా ఎక్కువగా గిరిజనుల సమస్యలపై రాజ్‌భవన్ నుంచి దృష్టి పెట్టడం జరుగుతుందని తెలిపారు. -
పామునాడించి.. ప్రాణాలు కోల్పోయి
మణుగూరు టౌన్: ఎక్కడ పాము కనిపించినా చాకచక్యంగా బంధించే వ్యక్తి.. అదే పాము కాటుతో మృతి చెందిన సంఘటన విషాదం నింపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారానికి చెందిన షరీఫ్ (31) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూనే పాములను పడుతుంటాడు. దీంతో ఎవరి ఇంట్లోకి పాము వచ్చినా స్థానికులు ఆయనకు సమాచారం ఇస్తారు. ఇదే క్రమంలో రిక్షా కాలనీకి చెందిన బానోత్ వెంకట్రావ్ ఇంట్లోని బావిలో మంగళవారం తాచు పాము కనిపించగా, షరీఫ్ దాన్ని బయటికి తీసుకొచ్చి సుమారు గంట పాటు రోడ్డుపై సరదాగా ఆడించాడు. ఈ సమయంలోనే అతని చేతిపై పాము కాటు వేసింది. అదేమీ పట్టించుకోని షరీఫ్ పామును బస్తాలో వేసుకుని తీసుకెళ్లి అడవిలో వదిలివేసి తిరిగి వస్తుండగా సురక్షా బస్టాండ్ వద్ద కింద పడిపోయాడు. దీంతో స్థానికులు ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని తల్లి కమరున్నీసా బేగం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మణుగూరు సీఐ ముత్యం రమేష్ తెలిపారు. పాములను అత్యంత చాకచక్యంగా బంధించే షరీఫ్ అదే పాముకాటుతో మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది. పాము కాటు వేయగానే ఆస్పత్రికి వెళ్లాలని సూచించినా షరీఫ్ పట్టించుకోలేదని సమాచారం. -
కన్నబాబుతో స్ట్రెయిట్ టాక్ ప్రోమో
-
గులాబీలో నేతల మధ్య గలాట
-
రూపాయికే గులాబీ దోశ.. ఎక్కడో తెలుసా?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు(ఫిబ్రవరి15) నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రెండు, మూడు రోజుల ముందు నుంచే వేడుకలు పండుగలా నిర్వహిస్తున్న విషయం తెలిందే. అన్నదానం, రక్తదానం, బట్టలు పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ పుట్టిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. చదవండి: చనిపోయిన వ్యక్తికి బూస్టర్ డోస్ ఇచ్చారట.. ఇంకేముంది!! మంత్రి పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో ఒక్క రూపాయికే దోశ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ దోశలో ఇంకో స్పెషల్ కూడా ఉంది. బీట్రూట్తో తయారు చేసిన గులాబీ రంగు దోశలను చేయించి ఒక్కో దోశను కేవలం రూపాయికే స్థానికులకు అందజేశారు. దీంతో కొత్త రంగులో ఉన్న దోశలను తినేందుకు ప్రజల ఎగబడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
దమ్ముంటే మిలియన్ మార్చ్ ఢిల్లీలో పెట్టు: హరీశ్‌రావు
కొత్తగూడెం అర్బన్ /సత్తుపల్లి/సూర్యాపేట: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ చేస్తామని చెబుతున్నారు. ఆయనకు దమ్ముంటే ఢిల్లీలో మిలియన్ మార్చ్ నిర్వహిస్తే దేశవ్యాప్తంగా నిరుద్యోగులు తరలివచ్చి పోరాటం చేస్తారు’ అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించిన ఆయన సత్తుపల్లిలో 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు పాల్వంచ నర్సింగ్, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. విలేకరుల సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. ఇచ్చిందెవరు.. ఇవ్వనిదెవరు? బీజేపీ నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని, ఉద్యోగాలు ఇచ్చిందెవరు, ఇవ్వనిదెవరో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం ఎంత పెరి గిందో, నిరుద్యోగ యువత ఎంత బాధ పడుతుం దో బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. తమ ప్రభుత్వం నియామకాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని, వివిధ శాఖల్లో 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేయగా, మరో 60 వేల పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోందని తెలిపారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు లభించేలా కొత్త జోనల్ విధానాన్ని తీసుకొచ్చి, 317 జీవోను విడుదల చేస్తే దాన్ని కూడా అడ్డుకునేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నారని.. తద్వారా తెలంగాణలో స్థానిక యువత కు ఉద్యోగ అవకాశాలు దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఆర్ఆర్బీ ద్వారా రైల్వేలో 1.03 లక్షల పోస్టుల భర్తీకి 2019 ఫిబ్రవరిలో కేంద్రం నోటిఫికేషన్ ఇస్తే దాదాపు కోటి మంది నిరుద్యో గులు దరఖాస్తు చేసుకున్నారని, అయితే మూడేళ్లయినా ఇంతవరకు పరీక్ష నిర్వహించలేదని హరీశ్ విమర్శించారు. ఆర్మీ, రైల్వే, ప్రభుత్వరంగ బ్యాంకు ల్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని సంజయ్‌కు హితవు పలికారు. ఇప్పటికే అనేక ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేసిన కేంద్రం, ఎయిరిండియాను సైతం టాటాలకు అప్పగించిందని.. ఇలాంటి పనులతో దాదాపు రెండున్నర లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారని తెలిపారు. బీజేపీ నేతలు చిల్లర రాజకీయా లు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, నిబంధనలు పాటిస్తే థర్డ్‌వేవ్ నుంచి బయటపడతామని అన్నారు. కాంగ్రెస్‌తో ఒరిగిందేమీ లేదు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్దపెద్ద కాంగ్రెస్ నేత లున్నారని.. అయినా ఫలితం శూన్యమని, వారు జిల్లాకు చేసింది ఏమీ లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సమైక్య పాలనలో మెడికల్ కాలేజీల కోసం ఆందోళనలు, ధర్నాలు చేసినా మంజూరు కాలేదని, కానీ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన కొద్ది కాలంలోనే జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందడమే కాకుండా.. మెడికల్ కళాశాలలు వచ్చాయన్నారు. శనివారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి 20 పడకల నవజాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ నల్లగొండకు ఐదు, సూర్యాపేటకు మరో ఐదు డయాలసిస్ మిషన్లు మంజూరు చేస్తామన్నారు. ఇక నుంచి 3 షిఫ్ట్‌లలో 24 గంటలూ కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తామని చెప్పారు. -
నాటేసేందుకు వెళ్తుండగా కాటేసిన మృత్యువు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చండ్రుగొండ: నాటేసేందుకు బయలుదేరినవారి లో నలుగురిని మృత్యువు టిప్పర్ రూపంలో కాటేసింది. మరో 13 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. మృతులు, క్షతగాత్రులందరూ ఒకే గ్రామానికి చెందినవారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. బొగ్గులోడ్ తో వెళ్తున్న ఓ టిప్పర్ అతివేగంగా వచ్చి ఢీకొని 100 మీటర్ల వరకు బొలేరోను ఈడ్చుకుంటూ వెళ్లింది. ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పక్కనే ఉన్న ఇంటి ముందు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కూలీలు కత్తి స్వాతి(26), ఎక్కి రాల సుజాత(35) అక్కడికక్కడే మృతి చెం దగా, గాయపడిన కత్తి సాయమ్మ, గుర్రం లక్ష్మి కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. మరోకూలీ కత్తి లక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. కత్తి నాగయ్య, ఆయన భార్య వెంకటరమణ, కత్తి సుగుణ, గుర్రం అచ్చమ్మ, రాందాస్, గుర్రం నర్సమ్మ, కత్తి సుశీల, వెంకటనారాయణ, పిడమర్తి సావిత్రి, రైతు ఆళ్ల వీరయ్య, ఆయన భార్య ఆళ్ల పద్మ, బొలెరో డ్రైవర్ రాందాస్ కూడా గాయాలపాలయ్యారు. వీరి లో కొందరికి కొత్తగూడెం జిల్లా ఆస్పత్రిలో, మరికొందరిని ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఎవరీ కూలీలు చండ్రుగొండ మండలంలోని తుంగారం గ్రామానికి చెందిన ఆళ్ల వీరయ్య తన వరి పొలం నాటు వేసేందుకు సుజాతనగర్ మండలం హరిజనవాడకు చెందిన 15 మంది కూలీలను మాట్లాడుకున్నాడు. అన్నపురెడ్డిపల్లి మండలంలోని రాజాపురంలో ఓ రైతు వద్ద కొనుగోలు చేసిన నారును తీసుకురావడానికి బొలేరో వాహనంలో కూలీలను తీసుకొని బయల్దేరాడు. మార్గమధ్యంలో తిప్పనపల్లి వద్ద ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బొలేరోలో డ్రైవర్‌తోపాటు 16 మంది ఉన్నారు. టిప్పర్ తమ ఇంటి ముం దే బోల్తా పడిందని, అక్కడే ఉన్న తాము తృటి లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నామని ఖాజాబీ, ఆమె మనవడు అబ్దుల్ ముఖీబ్ ‘సాక్షి’తో చెప్పారు. పదిగంటలపాటు ఆందోళన బొగ్గు లారీల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మృతుల బంధువులు, స్థానికులు తిప్పనపల్లిలో హైవేపై పదిగంటలపాటు ఆందోళనకు దిగారు. ఆర్డీవో స్వర్ణలత ఆందోళనకారులతో చర్చలు జరిపారు. సింగరేణి డైరెక్టర్(పా) చెన్నై నుంచి ఫోన్లో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.50 వేల తక్షణసాయం, కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు విషయమై మంత్రులతో చర్చిస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించారు. -
బడేసాహెబ్ బతికే ఉన్నాడు.. ‘చనిపోయినట్లు రికార్డుల్లో నమోదైంది’
సాక్షి, చండ్రుగొండ(ఖమ్మం): ఓ మనిషి బతికుండగానే మరణించాడంటూ రికార్డుల్లో నమోదు చేసిన అధికారులు అతడికి వచ్చే ఆసరా పింఛను నిలిపేశారు. దీంతో ఏడు నెలలుగా పింఛను కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి పంచాయతీ మహ్మద్‌నగర్ గ్రామానికి చెందిన ఎస్కే బడేసాహెబ్‌కు సుమారు 15 ఏళ్లుగా వృద్ధాప్య పింఛను వస్తోంది. ఏడు నెలల క్రితం పింఛను డబ్బు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో జమ కాలేదని బ్యాంకు అధికారులు చెప్పారు. అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి అడిగితే ‘నీవు చనిపోయినట్లు రికార్డుల్లో నమోదైంది’అని సమాధానం చెప్పడంతో అతడు ఆశ్చర్యపోయాడు. అప్పటి నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పింఛను మాత్రం పునరుద్ధరించలేదు. వృద్ధాప్యంతో ఏ పనీ చేయలేనని, పూట గడవడమే కష్టంగా ఉందని, కనీసం మందులు కొనే పరిస్థితి కూడా లేదని బడేసాహెబ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు పింఛన్ వచ్చేలా చూడాలని వేడుకుంటున్నాడు. దీనిపై ఎంపీడీఓ అన్నపూర్ణను వివరణ కోరగా గ్రామ కార్యదర్శి ఇచ్చిన నివేదిక మేరకే బడేసాహెబ్ పింఛను రద్దు చేసినట్లు తెలిపారు. -
వనమా రాఘవ రిమాండ్ పొడిగింపు
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచకు చెందిన మండిగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఖమ్మం జైలులో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కుమారుడు వనమా రాఘవ రిమాండ్‌ను పొడిగించారు. ఈ కేసులో రాఘవను 8వ తేదీన అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. ఆయన రిమాండ్ గడువు శుక్రవారంతో ముగియగా శనివారం ఆన్లైన్ విధానంలో కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా మరో 14రోజుల పాటు అంటే.. వచ్చేనెల 4వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముద్దసాని నీలిమ ఆదేశాలు వెలువరించారు. కాగా, ఇప్పటికే రాఘవ తరఫున బెయిల్ కోసం పిటిషన్ వేయగా తిరస్కరణకు గురైంది. అలాగే, ఇదే కేసులో నిందితులుగా ఉన్న రామకృష్ణ తల్లి సూర్యావతి, సోదరి మాధవి కూడా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా శుక్రవారం తిరస్కరించారు. దీంతో వీరు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది. ఇక రాఘవను విచారణ కోసం ఈసారైనా పోలీసులు కస్టడీకి కోరతారా, లేదా అన్నది త్వరలోనే తేలనుంది. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ పట్టణ పోలీసుస్టేషన్లలో మరో రెండు కేసులకు సంబంధించి పోలీసులు పిటీ (ప్రిజనల్ ట్రాన్స్ఫర్) వారెంట్లు దాఖలు చేయడం కూడా రిమాండ్‌ను పొడిగించేందుకు దోహదపడినట్లు తెలుస్తోంది. -
పెళ్ళి కుమారుడు ఎస్కేప్
-
మరికాసేపట్లో పెళ్లి.. కనిపించకుండాపోయిన పెళ్లికొడుకు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: మరికాసేపట్లో పెళ్లనగా పెళ్లి కొడుకు కనిపించకుండాపోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. శుక్రవారం పెళ్లికి ముహుర్తం దగ్గరపడుతున్నా పెళ్లికొడుకు కళ్యాణ మండపానికి చేరుకోలేదు. అనుమానం వచ్చి పెళ్లికొడుకుకి ఫోన్ చేస్తే రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నాడు. చివరగా పెళ్లి చేసుకోవడం లేదని తేల్చి చెప్పాడు. దీంతో పెళ్లిపీటలపైనే ఆ యువతి కన్నీటిపర్యంతమైంది. ఏం చేయాలో తెలియక న్యాయం కోసం పెళ్లి బట్టలతోనే చర్ల పోలీసులను ఆశ్రయించింది. చదవండి: (Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్) -
పోషకాహార లోపంతోనే వ్యాధులు
జూలూరుపాడు: పోషకాహార లోపమే వ్యాధులకు ప్రధాన కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)– జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ జె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామానికి వచ్చిన ఐసీఎంఆర్ – ఎన్ఐఎన్ బృందం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలసి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ..తెలంగాణలో గిరిజన జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశ్రీ, నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే(ఎన్హెచ్ఎఫ్ఎస్), ఇతర జాతీయ సంస్థల నివేదికల్లో వెల్లడైందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మహిళలు, యువతులు, చిన్నారుల్లో 60% మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు సర్వే ద్వారా తేలిందని చెప్పారు. మరోసారి నమూనాల సేకరణ గ్రామంలో కిడ్నీ వ్యాధులతో పలువురు మరణించిన నేపథ్యంలో ‘సాక్షి’ప్రధాన సంచికలో గతేడాది అక్టోబర్ 10న ‘ఆ ఊరికి ఏమైంది?’శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని బృందం అదే నెల 26న గ్రామాన్ని సందర్శించి కిడ్నీ వ్యాధిగ్రస్తుల నుంచి నమూనాలను సేకరించారు. ఈ నేపథ్యంలో గురువారం వ్యాధిగ్రస్తులనుంచి మరోసారి నమూనాలను తీసుకున్నారు. అనంతరం వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ..ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రజలు మిషన్ భగీరథ నీళ్లు తాగాలని సూచించారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ దయానంద్, డీఎంఓ డాక్టర్ భూక్యా వీరబాబు,తహసీల్దార్ లూథర్ విల్సన్, జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబం ఆత్మహత్య.. సంచలనంగా మారిన సూసైడ్ నోట్
-
కుటుంబం ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి పేరు?
సాక్షి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ సంచలనంగా మారింది. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడి పేరు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వనమా రాఘవేందర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పాల్వంచ ఎఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం వనమా రాఘవేందర్ పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నామని తెలిపారు. సూసైడ్ లెటర్లో రామకృష్ణ తల్లి సూర్యవతి, అక్క మాధవీ పేర్లు కూడా ఉన్నాయనీ.. ఘటనపై పూర్తి విచారణ జరుగుతుందని ఎఎస్పీ తెలిపారు. చదవండి: భార్యతో వివాహేతర సంబంధం.. భర్త, మరో ముగ్గురు కలిసి.. పాత పాల్వంచ పరిధిలోని ఒక ఇంట్లో గ్యాస్‌లీక్ చేసుకుని కుటుంబం సాముహిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. నాగ రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులు. వీరికి సాహితి, సాహిత్య అనే ఇద్దరు పిల్లలు. నాగ రామకృష్ణ మీ సేవాలోఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనలో దంపతులతో సహా చిన్న కూతురు సజీవ దహనమయ్యారు. మరో కూతురుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. -
దూసుకొచ్చిన మృత్యువు
పాల్వంచ: యాష్ ట్యాంకర్ రూపంలో మృత్యువు ఇద్దరు మహిళలను బలి తీసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్కు రాజమండ్రి నుంచి బూడిద కోసం వస్తున్న ట్యాంకర్ అల్లూరి సెంటర్ నుంచి అంబేడ్కర్ సెంటర్ (కేటీపీఎస్) మధ్యలో రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లపైకి దూసుకెళ్లింది. డ్రైవర్ శంకర్ లాల్ మద్యం మత్తులో అతి వేగంతో నడపడంతోనే ప్రమాదం జరిగింది. తొలుత ఇంటి ముందు కూర్చున్న మహిళలపైకి దూసుకెళ్లడంతో శీలం కోటేశ్వరమ్మ (50) అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన గార్లపాటి వెంకటనర్సమ్మ (45)ను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. మహిళలపై నుంచి దూసుకెళ్లిన లారీ.. ఇంటిని, ఆటోను, స్కూటీని, చెట్టును, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో ఇంటి గోడలు కూలిపోయి ఆటో, స్కూటీ నుజ్జునుజ్జయ్యాయి. వేప చెట్టు కొమ్మలు విరిగిపోయి విద్యుత్ స్తంభం కూలిపోయింది. ఒక్కసారిగా ట్యాంకర్ దూసుకురావ డంతో స్థానికులంతా హాహాకారాలు చేశారు. మృతురాలు కోటేశ్వరమ్మకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. వెంకట నర్సమ్మకు భర్త, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కేబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగడంతో ట్యాంకర్ కేబిన్ భాగం దెబ్బతింది. కేబిన్‌లో చిక్కుకున్న లారీ డ్రైవర్ శంకర్ లాల్‌ను స్థానికులు, పోలీసులు బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. మృతురాలు కోటేశ్వరమ్మ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. -
పర్ణశాల ఆలయం అభివృద్ధి పై అధికారుల నిర్లక్ష్యం
-
‘పోరు’ ఎవరికోసం? మావోయిస్టులకు 25 ప్రశ్నలు ఎక్కుపెట్టిన ఆదివాసీలు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా ఆదివాసీల సంఘాల పేరిట పలు గ్రామాల్లో ఆదివారం పెద్దఎత్తున కరపత్రాలు కనిపించాయి. మండల కేంద్రంతోపాటు ఆర్.కొత్తగూడెం, కుదునూరు, కలివేరు గ్రామాల్లో వెలసిన ఈ కరపత్రాలలో ఆదివాసీ సం ఘాలు 25 ప్రశ్నలను సంధించాయి. ‘మావోయిస్టులు ఉన్నది పేదలమైన ఆదివాసీల బతుకులు మార్చడం కోసమే అయితే, మీవల్ల మా బతుకులు ఏం మారాయి? రోడ్లు లేక వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రులకు వెళ్లలేక ఇంకా ఎంతమంది చనిపోవాలి? కరెంట్ లేక ఇంకెంతకాలం చీకటిలో మగ్గాలి? మా ఊళ్లకు రోడ్లు ఎందుకు వేయనియ్యరు? జల్ జంగిల్ జమీన్ మీ కోసమా.. మా కోసమా? అడవుల్లో బాంబులు పెడుతూ మమ్మల్ని తిరగనివ్వకుండా ఎందుకు చేస్తున్నారు? మీరు పెట్టే మీటింగులకు మమ్ముల్ని భయపెట్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి? మీకు, మీ పార్టీకి ఇలా భయపడుతూ ఎంతకాలం బతకాలి? అంటూ కరపత్రాల్లో పలు ప్రశ్నలను సంధించాయి. (చదవండి: 51 కేసులు, నేరాలు చేయడంలో దిట్ట.. ఏడేళ్లుగా అజ్ఞాతంలో.. చివరికి..) -
వీల్‌చైర్‌లో వకీల్ సాహెబా..
కొత్తగూడెం టౌన్: చదువుకు అంగవైకల్యం అడ్డుకాదని నిరూపించిన ఓమహిళ తన లక్ష్యం నెరవేర్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన దివ్యాంగురాలు మౌనిక ఎల్ఎల్బీ పూర్తిచేసి న్యాయవాదిగా మంగళవారం తన ప్రాక్టీస్ ప్రారంభించారు. వీల్‌చైర్‌లో జిల్లా కోర్టుకు వచ్చిన ఆమెకు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు ఘనస్వాగతం పలికారు. సవాళ్లను అధిగమించి విజయం సాధించిన మౌనిక అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు. -
అన్న పెట్రోల్ పోసుకుంటే.. తమ్ముడు నిప్పంటించబోయాడు
చండ్రుగొండ: తహసీల్దార్ కార్యాలయంలో ఓ గిరిజన రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో మంగళవారం జరిగింది. వివరాలివి. మండలంలోని బాల్యాతండాకు చెందిన భూక్య రాధాకృష్ణ, జయకృష్ణ సోదరులకు సర్వే నంబర్ 81లో 1.14 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో ఇద్దరూ బోర్లు వేసుకున్నారు. వారి పక్కన వరుసకు సోదరులయ్యే భూక్య రాందాస్, భూక్య దేవి, భూక్య రాజేష్‌కు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. వాళ్లు కూడా మూడు బోర్లు వేసుకుని సాగు చేస్తున్నారు. రాధాకృష్ణ ఈ ఏడాది మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి వేశాడు. తన భూమి పక్కనే రాందాస్ కుటుంబీకులు బోరు బావులు తవ్వించడంతో రాధాకృష్ణ బోరులో నీళ్లు తగ్గాయి. దీంతో రాధాకృష్ణ ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరపాలని కలెక్టర్ అనుదీప్ తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఉషా శారద ఈనెల 8న ఆ భూములను పరిశీలించి బోరు బావులను సీజ్ చేశారు. అయితే రాందాస్ తదితరులు దొంగతనంగా పంటలకు నీళ్లు పెట్టుకుంటున్నారని రాధాకృష్ణ, జయకృష్ణ ఈనెల 13న గ్రీవెన్స్‌లో మళ్లీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తూ అన్నదమ్ములిద్దరూ మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద కాసేపు ఆందోళన చేశారు. తహసీల్దార్ బయటికి రావడంతో ఆమె ఎదుట రాధాకృష్ణ పెట్రోల్ పోసుకోగా.. జయకృష్ణ నిప్పంటించే ప్రయత్నం చేశాడు. దీంతో రెవెన్యూ సిబ్బంది వారిద్దరినీ వారించి బయటికి పంపించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం తాము చర్యలు తీసుకున్నామని, రాధాకృష్ణ, జయకృష్ణ ఎలాంటి అనుమతులు లేకుండా బోరుబావులు తవ్వించారని చెప్పారు. ఆత్మహత్యాయత్నంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
Singareni: ఆ‘గని’.. సమ్మె
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో నాలుగు బొగ్గు గనులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు శుక్రవారం కూడా విజయవంతమైంది. విధులను బహిష్కరించిన కార్మికులు పలుచోట్ల నిరసనలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులను ఆపి పూలు ఇచ్చి సమ్మెకు మద్దతు తెలపాలని వేడుకున్నారు. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా 11 ఏరియాలు, నాలుగు రీజియన్ల పరిధిలోని 25 ఓపెన్ కాస్టులు, 20 భూగర్భ గనులు బోసిపోయాయి. డంపర్లు, డోజర్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో గనులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మొదటి, రెండో షిఫ్టుల్లో మొత్తం 34,753 మంది కార్మికులు విధులకు హాజరు కావాల్సి ఉండగా 29,300 మంది గైర్హాజరయ్యారు. భూగర్భ గనుల్లో పని చేసే అత్యవసర సేవల సిబ్బంది 4,709 మంది మాత్రమే విధులకు వచ్చారు. మరోవైపు 13,701 మంది కాంట్రాక్ట్ కార్మికుల్లో 4,340 మంది గైర్హాజరై సమ్మెకు మద్దతు తెలిపారు. రెండు రోజుల సమ్మెతో 4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. దీంతో సంస్థకు సుమారు రూ.160 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇటు కార్మికులు సైతం వేతన రూపంలో రూ.40 కోట్లు నష్టపోయారు. బొగ్గు రవాణాపై ఎఫెక్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గు తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు, సిమెంట్, ఐరన్, హెవీ వాటర్ ప్లాంట్, సిరామిక్స్, ఫార్మా, ఆగ్రో తదితర నాన్ పవర్ కంపెనీలకు రవాణా అవుతుంది. తెలంగాణలోని ప్రతిరోజూ 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. ఇందులో ప్రతి రోజూ 1.30 లక్షల టన్నుల బొగ్గు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతుంది. 70 వేల టన్నుల బొగ్గును రాష్ట్ర అవసరాలకు వాడుతుంటారు. రెండు రోజుల సమ్మెతో ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన 2.40 లక్షల టన్నుల బొగ్గు రవాణాకు బ్రేక్ పడింది. 15న కేంద్రమంత్రితో చర్చలు.. సింగరేణి కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింపజేసేందుకు కేంద్రం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రీజినల్ లేబర్ కమిషనర్ సమ్మెకు ముందే పలుమార్లు కార్మిక సంఘ నేతలతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. సమ్మె కొనసాగుతున్నా సంఘ నేతలతో చర్చలు జరిపారు. మొత్తం 12 డిమాండ్లతో సమ్మె చేపట్టగా, వాటిలో రాష్ట్రంలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ మినహా మిగిలిన డిమాండ్లను దశల వారీగా పరిష్కరించేందుకు సింగరేణి సిద్ధమైంది. ప్రధానమైన బ్లాకుల ప్రైవేటీకరణ డిమాండ్ విషయంలో యాజమాన్యం ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో అధికారులు, కార్మిక సంఘ నేతలతో ఏర్పడిన జేఏసీ బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషితో చర్చించేందుకు ఈనెల 15, 16 తేదీల్లో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో సింగరేణి సంస్థ నుంచి డైరెక్టర్ (పీఏడబ్ల్యూ) బలరాంనాయక్, జీఎం (పర్సనల్) ఆనందరావు, యూనియన్ నాయకులు వెంకట్రావ్ (టీబీజీకేఎస్), వాసిరెడ్డి సీతారామయ్య (ఏఐటీయూసీ), జనక్ ప్రసాద్ (ఐఎన్టీయూసీ), రాజిరెడ్డి (సీఐటీయూ), రియాజ్ (హెచ్ఎంఎస్), మాధవన్నాయక్ (బీఎంఎస్) ఢిల్లీలో జరిగే చర్చల్లో పాల్గొననున్నారు. -
భద్రాద్రి జిల్లాలో పులి సంచారం
టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం, పినపాక, లక్ష్మీదేవిపల్లి మండలాల అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోంది. శుక్రవారం పినపాక మండలం అమరారం అటవీ ప్రాంత సమీపాన ఆవుల మందపై దాడి చేసి లేగదూడను చంపిన పెద్ద పులి శనివారం తెల్లవారుజామున టేకులపల్లి మండలంలోకి వచ్చింది. మండలం పరిధిలోని సిద్ధారం నుంచి మొట్లగూడెం మధ్యలో ఉన్న జంగాలపల్లి జంగిల్ క్యాంపు అభయారణ్యంలోకి శుక్రవారం అర్ధరాత్రి దాటాక పులి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో క్యాంపు ఏర్పాటుచేసిన అటవీ అధికారులకు పెద్దపులి కనిపించడంతో సెల్ఫోన్లో వీడియో తీశారు. ఇక శనివారం ఉదయం అధికారులు అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడల కోసం ఆరా తీయగా.. జంగాలపల్లి–మొట్లగూడెం మధ్య ఉన్న గుట్టలో సేద తీరిందని, సాయంత్రం 5 గంటల సమయంలో నిద్ర లేచి వెళ్లిపోయిందని తెలిపారు. ఈమేరకు పులి ఆచూకీ కోసం గాలిస్తూ, అటవీ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
12 ఏళ్ల తర్వాత ఊరికి బస్సొచ్చింది
జూలూరుపాడు: 12 ఏళ్ల తర్వాత ఓ గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసు తిరిగి ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి కొత్తగూడెం డిపోకు చెందిన బస్సు సర్వీసు శుక్రవారం మొదలైంది. ఈ గ్రామానికి గతంలో బస్సు నడిచినా రోడ్డు బాగా లేదని, ఆదరణ ఉండడం లేదనే కారణంతో 12 ఏళ్ల కిందట సర్వీసు నిలిపివేశారు. దీంతో గ్రామానికి చెందిన చెవుల బాలరాజు ఈనెల 7న ట్విట్టర్లో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు తమ సమస్యపై విన్నవించారు. దీంతో ఆయన రూట్ మ్యాప్ పరిశీలించి గ్రామానికి బస్సు నడపాలని కొత్తగూడెం డిపో మేనేజర్ వెంకటేశ్వరబాబుకు రీట్వీట్ చేశారు. ఈమేరకు 11న సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాంచా నాయక్, కంట్రోలర్ జాకంతో కలిసి కొత్తగూడెం డీఎం.. గ్రామానికి చేరుకుని సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అనంతరం సర్వీసు ప్రారంభించగా.. గ్రామస్తులు బస్సుకు మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులు కట్టి స్వీట్లు పంచుకున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ గ్రామంలో డప్పు చాటింపు కూడా వేయించారు. ఈటల భూముల్లో నాలుగో రోజు సర్వే వెల్దుర్తి(తూప్రాన్): మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివారుల్లో మాజీ మంత్రి ఈటల కుటుంబీకుల భూముల్లో నాలుగో రోజు కూడా సర్వే కొనసాగింది. శుక్రవారం రెవెన్యూ అధికారులు సర్వే నంబర్లు 77, 78, 79, 80, 81, 82లోని భూములను సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆయా సర్వే నంబర్లతో పాటు రైతుల వారీగా హద్దులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం అధికారులు 500 హద్దురాళ్లు తెప్పించారు. మాసాయిపేట రెవెన్యూ కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన రికార్డులను తూప్రాన్ ఆర్డీఓ శ్యాంప్రకాశ్ పరిశీలించారు. సర్వే నంబర్ల వారీగా పట్టా భూమి ఎంత ఉంది.. అసైన్డ్, సీలింగ్ భూములు ఎన్ని ఉన్నాయి.. ప్రభుత్వం పంపిణీ చేసిన సీలింగ్ భూముల్లో ఇతరులు పాగా వేశారా? వంటి వివరాలను ఆయన తెలుసుకున్నారు. -
Evaru Meelo Koteeswarulu: రాజా రవీంద్రను కోటీశ్వరున్ని చేసిన ప్రశ్న ఇదే..
Evaru Meelo Koteeswarulu 1cr Question: రాజా రవీంద్ర.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. అనుకోకుండానే 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమానికి హాజరై జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో అడిగిన 15 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి కోటి రూపాయలు గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. అనంతరం మంగళవారం నాటి ఎపిసోడ్లో చెక్కు అందుకున్నారు. దీంతో ఈ సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి వ్యక్తిగా తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన రాజా రవీంద్ర నిలిచారు. ఈ షోలో రాజా రవీంద్ర ప్రయాణాన్ని మనం ఒకసారి గమనిస్తే.. రాజా రవీంద్రను హాట్ సీట్‌కి తీసుకెళ్లిన ప్రశ్న.. హైదరాబాద్ నుంచి వాటి దూరాల ప్రకారం, ఈ నగరాలను తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి? A)న్యూయార్క్ B)ముంబయి C)దుబాయ్ D)విజయవాడ ప్రశ్న చదవగానే సమాధానం అందరికీ తెలిసినట్టు అనుకున్నా హాట్‌సీట్‌పై కూర్చొని తక్కువ సమయంలోనే సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్‌కు తొలి ప్రాధాన్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇందులో రాజా రవీంద్ర కేవలం 2.637 సెకన్లలోనే సమాధానం ఇచ్చి హాట్‌సీట్‌ను చేరుకున్నారు. ఇక అక్కడ నుంచి ఆయన వరుసగా సరైన సమాధానాలు చెప్తూ ఎన్టీఆర్‌ను సైతం ఆకట్టుకున్నారు. చదవండి: (Evaru Meelo Koteeswarulu: రూ.కోటి గెలిచినా దక్కేది ఇంతేనా!) సోమవారం ప్రసారమైన ప్రోగ్రాంలో ఆయన 12 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఉన్న మూడు లైఫ్ లైన్లలో కేవలం ఒక్క దానిని మాత్రమే ఉపయోగించుకొని 12,50,000 గెలుచుకున్నారు. కోటి రూపాయలు గెలుచుకోవడానికి మరో మూడు ప్రశ్నల దూరంలో నిలిచారు. దీనికి కొనసాగింపుగా మంగళవారం జరిగిన షోలో రాజా రవీంద్ర కోటి రూపాయల వైపు అడుగులు వేసిన ప్రశ్నలను ఒకసారి చూస్తే.. ఆట ప్రారంభం కాగానే జూనీయర్ ఎన్టీఆర్.. రాజా రవీంద్రను 25 లక్షల రూపాయల ప్రశ్న అడిగారు. ఒక్క లైఫ్ లైన్‌ను అప్పటికే ఉపయోగించడం వల్ల ఇక రెండు మాత్రమే యాక్టివ్‌లో ఉన్నాయి. 25 లక్షలకు రాజా రవీంద్రను అడిగిన ప్రశ్న.. 2020లో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఏ పదం, ఇటాలియన్ భాషలో '40 రోజులు' అని అర్థం వచ్చే ఒక పదం నుండి వచ్చింది? A)లాక్డౌన్ B)ఐసోలేషన్ C)క్వారంటైన్ D)పాండమిక్ ఈ ప్రశ్నకు చాలాసేపు ఆలోచించిన రాజారవీంద్ర మరో లైఫ్ లైన్‌ను ఉపయోగించుకుని క్వారంటైన్ అని సరైన సమాధానం చెప్పాడు. దీంతో 50 లక్షల రూపాయల ప్రశ్నకు చేరుకున్నారు. ఈ షోలో పాల్గొని 50 లక్షల ప్రశ్నకు చేరుకున్న అతి తక్కువ మందిలో రాజారవీంద్ర ఒక్కరు. 50లక్షల ప్రశ్నను పరిశీలిస్తే.. జాతీయ వైద్యుల దినోత్సవం ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు వైద్యుడు అయిన ఒక వ్యక్తి జ్ఞాపకార్థం జరుపుతారు? A)మిజోరాం B)పశ్చిమబెంగాల్ C)ఉత్తరప్రదేశ్ D)కేరళ ఈ ప్రశ్నకు కొద్దిసేపు ఆలోచించి ఆప్షన్ బీ అంటూ కాన్ఫిడెంట్‌గా సరైన సమాధానం చెప్పారు. ఇప్పుడు కోటి రూపాయల ప్రశ్న. ఎవరు మీలో కోటీశ్వరులు చరిత్రలోనే ఇద్దరు మాత్రమే కోటి రూపాయల ప్రశ్నను చూశారు. వారిలో ఒకరు సెకండ్ సీజన్లో అయితే.. ఇప్పడు రాజారవీంద్ర మాత్రమే. ఇక కోటి రూపాయల ప్రశ్నను పరిశీలిస్తే.. 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణమైన కమిషన్‌కు, ఎవరు అధ్యక్షత వహించారు? A)రంగనాథ్ మిశ్రా B)రంజిత్‌సింగ్ సర్కారియా C)బీపీ మండల్ D)ఫజల్ అలీ కమిషన్ ఈ ప్రశ్నకు చాలా సేపు థింక్ చేసి ఉన్న మరో లైఫ్ లైన్ ఉపయోగించుకొని ఆప్షన్ డీ అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా సరైన సమాధానం చెప్పారు. దీంతో ఈఎమ్‌కే చరిత్రలోనే కోటి రూపాయలు గెలుచుకున్న తొలి వ్యక్తిగా రాజా రవీంద్ర నిలిచారు. చదవండి: (Evaru Meelo Koteeswarulu: కోటితో ఆగను.. అదే నా అసలు స్వప్నం) -
Evaru Meelo Koteeswarulu: కోటితో ఆగను.. అదే నా అసలు స్వప్నం
అనుకోకుండానే కార్యక్రమానికి హాజరై చరిత్ర సృష్టించిన ఈ కోటీశ్వరుడు సోమవారం రాత్రి 8ç:30 గంటలకు టీవీలో ప్రసారమైన కార్యక్రమంలో చెక్కు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మిగతా సగం మంగళవారం ప్రసారం కానుంది. ఖమ్మం జిల్లా సుజాతనగర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి బి.వి.ఎస్.ఎస్ రాజు, శేషుకుమారి దంపతుల సంతానం రవీంద్ర. రవీంద్రకు భార్య సింధూజ, కుమారుడు దేవాన్ కార్తికేయ, కూతురు కృతి హన్విక ఉన్నారు. 2000 – 2004 మధ్య హైదరాబాద్‌లోని వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేశారు. ఇదివరకు సాఫ్ట్వేర్, బ్యాంకు, ఇతర ఉద్యోగాలు సాధించారు. దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా 2012లో పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సంపాదించారు. హైదరాబాద్‌లోని సీఐడీ సైబర్ క్రైంలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న రవీంద్ర పిస్టల్, ఎయిర్ రైఫిలింగ్‌లోనూ దిట్ట. ఈ సందర్భంగా రవీంద్రను ‘సాక్షి’ ఫోన్లో పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే.. సివిల్స్ ప్రిపరేషన్ సహకరించింది.. గతంలో సివిల్స్‌కు సిద్ధమై ఉండటం నా గెలుపునకు తోడ్పడింది. ఒలింపిక్ క్రీడల్లో ఇండియా తరఫున పాల్గొని స్వర్ణ పతకం సాధించడం నా కల. ఇప్పటికే జాతీయ స్థాయి పోలీసు క్రీడాపోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొని రెండుసార్లు బంగారు, రజతం, ఒకసారి కాంస్య పతకాలు సాధించాను. 2017 తెలంగాణ స్టేట్ షూటింగ్ చాంపియన్‌షిప్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో, అదే ఏడాది గుహవాటిలో జరిగిన జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో బంగారు పతకాలు కైవసం చేసుకున్నా. 2019లో జరిగిన ఆలిండియా పోలీస్ పిస్టల్ విభాగం పోటీల్లో రజతం సాధించా. వచ్చిన రూ.కోటితో నాణ్యమైన శిక్షణ పొందుతా. నాలాగా అవసరం ఉన్నవారికీ సహకరిస్తాను. -
ప్రభుత్వ వైద్యులు.. భేష్
కొత్తగూడెం రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యులకు మరోమారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నుంచి ప్రశంసలు దక్కాయి. గత నెల 26న అడవి దున్న దాడిలో పాల్వంచ మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన సమ్మయ్య ముఖం ఛిద్రం కావడంతోపాటు ఎడమ కన్ను దెబ్బతినగా, డవడ ఎముక, కుడి పక్క ఆరు పక్కటెముకలు విరిగాయి. దీంతో ఆయనను కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో చేర్పించగా జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త ముక్కంటేశ్వరావు, ఆర్ఎంఓ డాక్టర్ రవిబాబు నేతృత్వంలో జనరల్ సర్జన్ డాక్టర్ విజయ్‌కుమార్, ఎండీ ఫిజీషియన్ డాక్టర్ వెంకన్న, డాక్టర్ నవీన్‌లు ఫేషియల్ రీ కన్‌స్ట్రక్టన్ సర్జరీ చేశారు. ఈ సర్జరీకి ప్రైవేట్ ఆస్పత్రుల్లోనైతే రూ.10 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. సర్జరీ ద్వారా వెంకన్న ముఖం పూర్వ స్థితికి చేరుకోవడంతో శనివారం డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ అనుదీప్ ట్విట్టర్ వేదికగా డాక్టర్లను అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందిస్తున్నామనడానికి సమ్మయ్య ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. -
82 కిలోల గంజాయి స్వాధీనం
బూర్గంపాడు: ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఈమేరకు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజర వద్ద 82 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు. ఈ సందర్భంగా వివరాలను బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో ఆయన వెల్లడించారు. శనివారం ఉదయం మోరంపల్లి బంజర వద్ద బూర్గంపాడు ఎస్సై జితేందర్ వాహ నాలను తనిఖీ చేస్తూ రెండు ద్విచక్ర వాహనా లను ఆపుతుండగా వాటిపై ఉన్న నలుగురు పారిపో యేందుకు యత్నించారు. దీంతో వారిని వెంబ డించి తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. మహా రాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన రాజేశ్ రమేశ్ సావ్లే, ఆకాశ్ విలాస్ భలేరావు, ఉమేశ్ రమేశ్ సావ్లే, ఆకాశ్ సుధాకర్ భలేరావు ఏపీలోని సీలేరులో సురేశ్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి తీసు కెళ్తున్నట్లు విచారణలో వెల్లడించారు. కాగా, ఔరం గాబాద్‌కు చెందిన సందీప్ సాటే వీరిని గంజా యి కోసం పంపించినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకు న్న గంజాయి విలువ రూ.16.48 లక్షలు ఉంటుం దని ఏఎస్పీ తెలిపారు. పెద్ద వాహనాలైతే పట్టుబ డతామనే భావనతో వీరు గంజాయి తర లింపునకు ద్విచక్ర వాహనాలను ఎంచుకున్నారని తెలిపారు. సమావేశంలో పాల్వంచ సీఐ సత్యనారాయణ, బూ ర్గంపాడు ఎస్సై జితేందర్, ట్రైనీ ఎస్సై విజయలక్ష్మి, ఏఎస్సై ఖాజా మొయినుద్దీన్ పాల్గొన్నారు.