
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : ఇంటర్ ఫలితాలు రాష్ట్రంలోని పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫలితాల కారణంగా 20కిపైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెంలో మరో విద్యార్థిని బలయ్యారు. జిల్లాలోని జూలూరుపాడు మండలం వెంగన్న పాలెం గ్రామానికి చెందిన సాయిల మానస (17) ఇంటర్ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురయింది. దీంతో 20 రోజుల కిందట ఆమె పురుగులమందు తాగింది. వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం మానస ప్రాణాలు విడిచింది. దీంతో మానస కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇంటర్ ఫలితాల వెల్లడిలో తీవ్ర అవకతవకలు జరిగినట్టు వెలుగుచూడటం రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడేవిధంగా ఇంటర్ ఫలితాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇంటర్ బోర్డు తీరుపైన, ఇంటర్ ఫలితాల కాంట్రాక్ట్ దక్కించుకున్న గ్లోబరీనా సంస్థపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment