
కుమార్తెతో ఎమ్మెల్యే హరిప్రియ దంపతులు
సాక్షి,ఇల్లెందు(కొత్తగూడెం): హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ ఆవిర్భావం రోజు బుధవారం ఉదయం ఆ పార్టీ ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, మార్కెట్ చైర్మన్ బానోతు హరిసింగ్ నాయక్ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. బీఆర్‌ఎస్ ఆవిర్భావం వేళ జన్మించిన బిడ్డకు ‘సుచిత్ర భారత ప్రియ’గా నామకరణం చేయాలని తనను కలిసిన హరిసింగ్ నాయక్‌కు సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.
హరిప్రియ దంపతులకు ఇరవై ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడం, అదేరోజు దసరా కావడం విశేషం. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నేతలు, అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
చదవండి: నేతలకు గాలం వేస్తున్న ‘ఈటల’.. ఒక్కొక్కరుగా ‘గులాబీ’ పార్టీకి గుడ్ బై
Comments
Please login to add a commentAdd a comment