Hari Priya
-
పెళ్లిరోజు నాడే గుడ్‌న్యూస్.. తల్లిదండ్రులైన టాలీవుడ్ జంట
కన్నడ నటుడు వశిష్ఠ ( Vasishta N. Simha), హీరోయిన్ హరిప్రియ (Haripriya) తల్లిదండ్రులు అయ్యారు. పండంటి మగబిడ్డకు హరిప్రియ జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తమ రెండో పెళ్లిరోజు నాడే బాబు జన్మించడం చాలా సంతోషాన్ని ఇస్తుందని ఆమె తెలిపింది. ఇలాంటి లక్ చాలా అరుదుగా కలిసొస్తుందని వారి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో హరిప్రియ బిడ్డకు జన్మనిచ్చింది. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగులో కూడా ఆమె చాలా సినిమాలలో నటించడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.కన్నడలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే ఆమె ఏడడుగుల బంధంలోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె తమిళ్, తెలుగులో కూడా అనేక చిత్రాల్లో మెప్పించింది. నటి భూమిక భర్త భరత్ ఠాకూర్ నిర్మించిన ‘తకిట తకిట’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు హరిప్రియ పరిచయమైంది. ఆ తర్వాత నానితో పిల్ల జమీందార్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో హరిప్రియకు వరుస అవకాశాలు వచ్చాయి. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా చిత్రాల తర్వాత ఏకంగా బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది. ( ఇదీ చదవండి: ఆమె నాకు చెల్లెలు లాంటిది.. డేటింగ్ వార్తలపై సిరాజ్ రియాక్షన్)‘జై సింహా’లో (Jai Simha) బాలయ్య సరసన నటించి తెలుగు వారిని కూడా మెప్పించింది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఆమె సినిమాలు చేయలేదు. కానీ, కన్నడలో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్లింది. వశిష్ఠ కూడా మరెవరో కాదు… కన్నడ నుంచి రిలీజ్ అయిన సూపర్ డూపర్ హిట్ మూవీ 'కేజీఎఫ్'లో ఆయన విలన్‌గా నటించాడు. ఆర్వాత తెలుగులో నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్, డెవిల్ వంటి చిత్రాల్లో నటించిన ఆయన ఓదెల రైల్వే స్టేషన్ సీక్వెల్ కోసం పనిచేస్తున్నాడు. అలా ఇద్దరూ కన్నడ, తెలుగు పరిశ్రమలో గుర్తంపు తెచ్చుకుని పలు సినిమాలతో రాణిస్తున్నారు. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) -
త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్.. ఘనంగా సీమంతం
హీరోయిన్ హరిప్రియ (Hariprriya) త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ క్రమంలో నటుడు వశిష్ట సింహ భార్య సీమంతం వేడుకను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశాడు. తన సీమంతం ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోను ఈ దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు సెలబ్రిటీ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా హరిప్రియ, వశిష్ట సింహ 2023లో పెళ్లి చేసుకున్నారు.ఎవరీ హరిప్రియ?హరిప్రియ కర్ణాటకవాసి. విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే క్లాసికల్ డ్యాన్స్‌పై ఆసక్తితో భరతనాట్యం నేర్చుకుంది. అలా ఎన్నో ప్రోగ్రామ్స్‌కు హాజరయ్యేది. తను 12వ తరగతి చదువుతున్న సమయంలో తన డ్యాన్స్ స్టిల్స్ దర్శకుడు రిచర్డ్ కాస్టెలినో కంటపడ్డాయి. వెంటనే ఆమెను సినిమా కోసం సంప్రదించడం.. ఇంట్లో ఒప్పుకోవడంతో బడి అనే తుళు చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. మనసుగుల మత్తు మధుర చిత్రంతో కన్నడ వెండితెరకు హీరోయిన్‌కు పరిచయమైంది.(చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం)తెలుగులోనూ హీరోయిన్గా..యష్ సరసన నటించిన 'కళ్ళర సంతె'తో క్రేజ్ తెచ్చుకుంది. శివరాజ్‌కుమార్ 'చెలువెయె నిన్నే నోడలు' మూవీతో సెన్సేషన్ అయింది. ఉగ్రం, నీర్ దోసె, బెల్ బాటమ్, బిచ్చుగత్తి: చాప్టర్ 1 వంటి చిత్రాలతో అలరించింది. తకిట తకిట చిత్రంతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాట, జై సింహ, అలా ఇలా ఎలా అనే సినిమాలతో మెప్పించింది. తమిళంలోనూ రెండుమూడు మూవీస్‌లో నటించింది. ప్రస్తుతం కన్నడలో బెల్ బాటమ్ 2, హ్యాపీ ఎండింగ్, లగామ్ సినిమాలు చేస్తోంది.కేజీఎఫ్ మూవీలో విలన్‌గా..వశిష్ట (Vasishta N Simha) విషయానికి వస్తే ఇతడు కూడా కర్ణాటకవాసే! రుద్ర తాండవ, ఎలోన్, నాన్ లవ్ ట్రాక్, ముఫ్టీ, టగారు, ఉపేంద్ర మట్టె బా, 8 ఎమ్ఎమ్ బుల్లెట్ వంటి చిత్రాల్లో నటించాడు. కేజీఎఫ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగులో నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్, డెవిల్: ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్, యేవమ్, సింబా చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఓదెల రైల్వే స్టేషన్ సీక్వెల్లో నటిస్తున్నాడు. ఇతడు నటుడు మాత్రమే కాదు సింగర్ కూడా! తెలుగులో కిరాక్ పార్టీ మూవీలో ఓ సాంగ్ పాడాడు. కన్నడలో పలు చిత్రాల్లో పాటలు ఆలపించాడు.అలా మొదలైన ప్రేమకథఈ ఇద్దరికీ ఎలా ముడిపడిందో హరిప్రియ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ‘నా దగ్గర రెండు కుక్క పిల్లలు ఉండేవి. వాటిలో ఒకటి చనిపోవడంతో మిగతాది ఒంటరైపోయింది. అలాంటి సమయంలో వశిష్ట నాకు ఓ కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు క్రిస్టల్. కొత్తగా వచ్చిన పప్పీతో నా కుక్కపిల్ల కలిసిపోయింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే క్రిస్టల్‌ని బహుమతిగా ఇచ్చినప్పుడు.. వశిష్ట ఓ సందేశాన్ని కూడా పంపించాడు. క్రిస్టల్ పొట్టపై గుండె ఆకారంలో ఓ మచ్చ ఉంది. క్రిస్టల్‌తో పాటు ఆ మచ్చ కూడా పెరుగుతూ వచ్చింది. అలాగే మా మధ్య ప్రేమ కూడా పెరిగింది’ అని తన ప్రేమ కహానీ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) View this post on Instagram A post shared by Hariprriya Simha (@iamhariprriya) చదవండి: మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు! -
తల్లి కాబోతున్న సింగిల్ టేక్ హీరోయిన్.. బాలకృష్ణ సినిమాతో గుర్తింపు
కన్నడ నటుడు వశిష్ఠ ( Vasishta N. Simha), హీరోయిన్ హరిప్రియ (Haripriya) తల్లిదండ్రులు కాబోతున్నారు. రెండేళ్ల క్రితం వారు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా వారు ఒక్కటయ్యారు. కన్నడలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే ఆమె ఏడడుగుల బంధంలోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె తమిళ్, తెలుగులో కూడా అనేక చిత్రాల్లో మెప్పించింది.నటి భూమిక భర్త భరత్ ఠాకూర్ నిర్మించిన ‘తకిట తకిట’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు హరిప్రియ పరిచయమైంది. ఆ తర్వాత నానితో పిల్ల జమీందార్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో హరిప్రియకు వరుస అవకాశాలు వచ్చాయి. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా చిత్రాల తర్వాత ఏకంగా బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది. ‘ జై సింహా’లో (Jai Simha) బాలయ్య సరసన నటించి తెలుగు వారిని కూడా మెప్పించింది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఆమె సినిమాలు చేయలేదు. కానీ, కన్నడలో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్లింది.ఇద్దరినీ కలిపిన కుక్క పిల్లహరిప్రియ గతంలో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, శ్రీమురళి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఈ క్రమంలో తన సహచర నటుడు వశిష్ట సింహతో ప్రేమలో పడింది. ఓ కుక్కపిల్ల కారణంగా తాను వశిష్టతో ప్రేమలో పడిపోయానని గతంలో ఆమె ఇలా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఇదే జరిగితే దంగల్ రికార్డ్‌ను 'పుష్ప' కొట్టేస్తాడు.. బన్నీకి గోల్డెన్ ఛాన్స్)‘నా దగ్గర లక్కీ, హ్యాపీ అనే రెండు కుక్క పిల్లలు ఉండేవి. వాటిలో లక్కీ అనే కుక్క చనిపోయింది. దీంతో హ్యాపీ ఒంటరైపోయింది. అలాంటి సమయంలో వశిష్ట సింహం నాకు ఓ కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు క్రిస్టల్. కొత్తగా వచ్చిన క్రిస్టల్‌తో హ్యాపీ కలిసిపోయింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే క్రిస్టల్‌ని బహుమతిగా ఇచ్చినప్పుడు.. వశిష్ట ఓ సందేశాన్ని కూడా పంపించాడు. క్రిస్టల్ పొట్టపై గుండె ఆకారంలో ఓ మచ్చ ఉంది. క్రిస్టల్‌తో పాటు ఆ మచ్చ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది. అలా మా ప్రేమకు క్రిస్టల్ కారణమైంది’ అని హరిప్రియ తన ప్రేమ కహానిని చెప్పుకొచ్చింది.వశిష్ఠ కూడా మరెవరో కాదు… కన్నడ నుంచి రిలీజ్ అయిన సూపర్ డూపర్ హిట్ మూవీ 'కేజీఎఫ్'లో ఆయన విలన్‌గా నటించాడు. కన్నడలో ఆర్య లవ్, రాజా హులి, రుద్ర తాండవలో మెప్పించాడు. ఆ తర్వాత తెలుగులోనూ ‘నయీమ్ డైరీస్, నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్ వంటి సినిమాల్లో చాలా కీలక పాత్రలు పోషించాడు. హరిప్రియ కూడా కన్నడలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉగ్రమ్ సినిమాతో పాటు రన్న, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ, బెల్ బాటమ్ చిత్రాలతో గుర్తింపు పొందింది. అలా ఇద్దరూ కన్నడ, తెలుగు పరిశ్రమలో గుర్తంపు తెచ్చుకోవడం వల్ల వారికి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.బాలయ్యను మెప్పించిన హరిప్రియనందమూరి బాలకృష్ణ నటించిన జై సింహా సినిమా 2018 సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా వేడుకలో భాగంగా బాలయ్య మాట్లాడుతూ హరిప్రియపై ప్రశంసలు కురిపించారు. జై సింహా సినిమాలో ఆమె చాలా కీలకమైన పాత్ర చేశారని బాలయ్య చెబుతూనే.. ఒక సీన్లో ఆమె అద్భుతంగా మెప్పించారని తెలిపారు. ఆ సీన్ చేయాలంటే మరోక నటికి ఒకరోజు పట్టవచ్చని తెలిపారు. హరిప్రియ సింగిల్ టెక్ ఆర్టిస్ట్ అని కూడా ఆయన పొగిడారు. బాలయ్య నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ప్రశంసలు అందుకున్న నటి హరిప్రియ మాత్రమేనని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by Hariprriya Simha (@iamhariprriya) -
బిగ్‌బాస్ ఎంట్రీపై నటి క్లారిటీ.. నాకు నేనే బాస్ అంటూ..
బిగ్‌బాస్ రియాలిటీ షో త్వరలో మొదలుకాబోతోంది. అవును, తమిళంలో బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్, హిందీలో 18వ సీజన్, కన్నడలో 11వ సీజన్ ప్రారంభానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల ఎంపిక ఓ కొలిక్కి రాగా సంబంధం లేని తారల పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వారిలో నటి హరిప్రియ ఒకరు.బిగ్‌బాస్ ఎంట్రీపై క్లారిటీఈమె కన్నడ బిగ్‌బాస్ 11వ సీజన్లో అడుగుపెడుతోందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాను ఏ రియాలిటీ షోలనూ పాల్గొనడం లేదంటూ పుకార్లకు చెక్ పెట్టింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. నేను నా ఇల్లు దాటి ఎక్కడికీ వెళ్లడం లేదు. నాకు నేనే బాస్ అని రాసుకొచ్చింది. ఇకపోతే కన్నడ బిగ్‌బాస్ 11వ సీజన్ రేపటి (సెప్టెంబర్ 29) నుంచే ప్రారంభం కానుంది.సినిమా..కన్నడలో అనేక సినిమాలు చేసిన హరిప్రియ తకిట తకిట, పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాట, జై సింహా, అలా ఇలా ఎలా వంటి పలు చిత్రాల్లో నటించింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎటువంటి గ్రూప్ గొడవలు లేకుండా చూస్తామన్న నేతలు
-
ఎన్నికల వేళ ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌కు షాక్..!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : ఎన్నికల వేళ ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌కు గడ్డు పరిస్థితులు ఎదురువుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎమ్మెల్యే భర్త, హరిసింగ్ నాయక్ షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తూ పార్టీ వ్యవహారాల్లో మితిమీరి జోక్యం చేసుకుంటూ అసలుకే ఎసరు తెచ్చారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్.. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా జెట్ స్పీడ్‌తో పట్టాలెక్కిస్తోంది. నియోజకవర్గాల వారీగా పార్టీ విజయావకాశాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్కు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 18 మందికి టికెట్లు గల్లంతు కావొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ 18 మందిలో జిల్లా నుంచి ఎవరైనా ఉన్నారా అనే ఆరాలు పెరిగాయి. నిన్నా మొన్నటి వరకు ఈ విషయంలో కొత్తగూడెం నియోజకవర్గ పేరు ఎక్కువగా వినిపించేది. వనమా ఎన్నికపై దాఖలైన కేసు తీర్పు, సుప్రీం కోర్టులో సవాల్ తదితర అంశాలతో ప్రస్తుతం కొత్తగూడెం సైడ్ ట్రాక్‌లోకి వెళ్లగా, ఆ స్థానాన్ని ఇల్లెందు నియోజకవర్గం ఆక్రమించింది. మా అభ్యర్థన ఆలకించండి.. గత ఆరు నెలలుగా ఇల్లెందులో సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియకు తిరిగి టికెట్ ఇవ్వొద్దంటూ అసమ్మతి వర్గం నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఆమెకు టికెట్ ఇస్తే క్షేత్రస్థాయిలో పూర్తి సహకారం అందించలేమని, తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. హరిప్రియకు బదులు ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో కూడా పార్టీ పెద్దలకు ఇప్పటికే సూచించారు. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పెద్దగా స్పందన రాలేదని తెలిసింది. కానీ గత రెండు వారాలుగా పరిస్థితిలో తేడా వచ్చింది. ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలు ఇల్లెందుపై దృష్టి పెడుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా చాపకింద నీరులా పని చేసుకుపోతున్నారు. జీవన్‌లాల్ సేవా క్యాంపులు.. వైరా ఎమ్మెల్యే రాములునాయక్ తనయుడు జీవన్‌లాల్ రాజకీయ ఆరంగేట్రానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ ఉద్యోగిగా ఆయన కొనసాగుతున్నారు. ఇంతవరకూ హైదరాబాద్‌కే ఎక్కువగా పరిమితం అయిన జీవన్‌లాల్.. సిట్టింగ్ అభ్యర్థుల్లో కొన్ని మార్పులు ఉంటాయనే ప్రచారంతో పావులు కదపడం ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ అనూహ్యంగా ఆయన ఇల్లెందులో క్యాంప్ కార్యాలయం ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. ఇల్లెందు నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగానే ఇక్కడ క్యాంప్ వెలిసిందనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. షాడో ప్రభావం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నుంచి హరిప్రియ కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వేదికగా హరిసింగ్ ఇటు ప్రభుత్వ, అటు పార్టీ కార్యక్రమాల్లో చక్రం తిప్పుతున్నారు. షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తూ తనకంటూ సొంత వర్గం ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో అప్పటివరకు పార్టీలో పని చేస్తూ వచ్చిన నేతలంతా తీవ్ర అసౌకర్యానికి గురవడం మొదలైంది. ద్వితీయ శ్రేణి నేతలు, వారి అభిప్రాయాలను హరిసింగ్ ఖాతరు చేయడం లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కామేపల్లి, గార్ల, బయ్యారం, ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో కారు పార్టీ నేతలకు హరిసింగ్ వ్యవహార శైలితో కంటి మీద కునుకు లేని పరిస్థితులు ఏర్పడ్డాయని కొందరు గులాబీ నేతలే అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మండలాల వారీగా ఉన్న అసమ్మతి నాయకులంతా ఒక్కటవుతున్నారు. షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తూ హరిసింగ్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు.. జూలైలో కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తగా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఇటీవల బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో ఆమె ఇల్లెందు నియోజకవర్గానికి వచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లెందు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఆ సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ స్థానికంగా లేరు. కవిత మాటల వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందనే చర్చ మొదలైంది. మహబూబాబాద్ జిల్లాలోని రెండు స్థానాల్లో పార్టీ టికెట్ దక్కని పక్షంలో ఇల్లెందు నుంచైనా అసెంబ్లీకి పోటీ చేసేందుకు కవిత రెడీగా ఉన్నారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. -
మహబూబాబాద్‌లో ఇల్లెందు రాజకీయం..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతల నడుమ ఉన్న పొరపొచ్చాలు తారాస్థాయికి చేరుతున్నాయి. సిట్టింగ్‌కే సీటు ఇవ్వాలని, కమ్యూనిస్టులను ప్రోత్సహించొ ద్దని ఓ నియోజకవర్గ నేతలు.. తమ పెత్తనం కొనసాగడం లేదని ఇంకో నియోజకవర్గంలో.. మరో చోట తాము ప్రతిపాదించే వారికే టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. అంతేకాక పక్క జిల్లాలకు వెళ్లి ఆంతరంగిక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని పాలేరు, వైరా, ఇల్లెందు నియోజకవర్గాల్లో కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలపై విస్తృతంగా చర్చ సాగుతోంది. అయితే, అధిష్టానం పెద్దలు మాత్రం అందరి ఫిర్యాదులను సావధానంగా విని సముదాయించి పంపుతున్నారని తెలుస్తోంది. ఏదేమైనా ఎన్నికల తరుణాన బీఆర్ఎస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. పాలేరు సీటుపై రచ్చ.. ఉమ్మడి జిల్లాలో ఆది నుంచి పాలేరు సీటుపై రచ్చ కొనసాగుతోంది. బీఆర్ఎస్తో సీపీఎం, సీపీఐకి పొత్తు కుదిరితే సీపీఎం ప్రాధాన్యతగా పాలేరును కోరుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ ఇప్పటివరకు పొత్తుపై ప్రకటన వెలువడలేదు. అయితే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వచ్చే ఎన్నికల్లో తప్పక బరిలో నిలుస్తామని ప్రకటించారు. మరోపక్క బీఆర్ఎస్ నేతలు పాలేరు నుంచి మళ్లీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డే పోటీ చేస్తారని వెల్లడించారు. వారం క్రితం ఎమ్మెల్యే కందాల అనుచరులు నియోజవర్గ రాజకీయ పరిస్థితులను విన్నవించేందుకు సీఎంను కలవడానికి వెళ్లగా అపాయింట్మెంట్ లభించకపోవడంతో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని కలిసినట్లు సమాచారం. కొందరు పార్టీ నేతలు కమ్యూనిస్టులను ప్రోత్సహిస్తున్నారని చెప్పినట్లు తెలిసింది. అయితే, నాయకులు మాత్రం ధాన్యం కొనుగోలు విషయమై పల్లాను కలిసినట్లు చెబుతున్నా, కందాలకు టికెట్, కమ్యూనిస్టుల దూకుడు పైనే చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. పెత్తనంపై వైరాలో వార్ వైరా నియోజవకర్గంలోని ఆత్మీ య సమ్మేళనాల్లో నేతల అలకలు వారి మధ్య అంతరా న్ని పెంచుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు, క్షేత్ర స్థాయి ఉద్యోగుల బదిలీల్లో తమ ప్రతిపాదనలను తొక్కిపెట్టి ఇతర నేతలు పెత్తనం చెలాయిస్తున్నారని పార్టీ నేతలు అధిష్టానం ముందు వాపోయినట్లు సమాచారం. ఎక్కడా తమకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఇతర నేతలు నియోజకవర్గ రాజకీయాల్లో తలదూర్చుతున్నట్లు చెప్పారని ప్రచారం జరుగుతోంది. మరోపక్క పార్టీపరమైన కార్యక్రమాలన్నీ మూడు గ్రూపులుగా నిర్వహిస్తున్నారు. గ్రూప్ రాజకీయాలు చేస్తున్న వారిని గాడిలో పెట్టకపోవడం, పార్టీ సమావేశాలకు వారిని ఆహ్వానించకపోవడం వంటి పరి ణామాలతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ మూడు ముక్కలాటలా మారిందని కేడర్‌లో చర్చ జరుగుతోంది. మహబూబాబాద్‌లో ఇల్లెందు రాజకీయం.. ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ రాజకీయం ఇటీవల మహబూబాబాద్ కేంద్రంగా వేడెక్కింది. కొందరు నేతలు మహబుబాబాద్‌లో సమావేశమై ఎమ్మెల్యే హరిప్రియపై అసమ్మతి జెండా ఎగురవేసినట్లు తెలిసింది. అలాగే, ఎంపీ కవితకు నియోజకవర్గంలోని పరిణామాలను వివరించి ఇకనుంచైనా దృష్టి సారించి పార్టీ కోసం పనిచేసే వారిని కాపాడుకోవాలని కోరినట్లు సమాచారం. అలాగే మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు అసమ్మతి నేతలు సమాయత్తమవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇల్లెందు మున్సిపాలిటీలో అవిశ్వాస రాజకీయం జోరుగా సాగినా ఆ తర్వాత చల్లారింది. ఇంతలోనే ఎమ్మెల్యేపై ఓ వర్గం తిరుగుబావుటా ఎగురవేసి మహబూబాబాద్‌లో భేటీ కావడం చర్చనీయాంశమైంది. -
కోరుకున్నవాడితో హీరోయిన్ ఎంగేజ్మెంట్
కన్నడ నటుడు వశిష్ఠ, హీరోయిన్ హరిప్రియ డేటింగ్లో ఉన్నారంటూ శాండల్‌వుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇటీవలే వీరిద్దరూ దుబాయ్ నుంచి బెంగళూరుకు తిరిగివస్తూ ఎయిర్‌పోర్టులో మీడియాకు చిక్కడంతో వారి ప్రేమ విషయం నిజమేనని అందరూ ఫిక్స్ అయిపోయారు. త్వరలోనే వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. చూస్తుంటే ఇదే నిజం కాబోతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా వశిష్ఠ, హరిప్రియల నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. కాగా వశిష్ట, హరిప్రియ ఓ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. తొలిచూపులోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది కాస్తా ప్రేమగా మారింది. కాగా హరిప్రియ కన్నడలో ఉగ్రమ్, రన్న, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ, బెల్ బాటమ్ చిత్రాలతో ఫేమ్ సంపాదించారు. మరోవైపు సింహా ఆర్య లవ్ చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. రాజా హులి, రుద్ర తాండవలో విలన్‌గానూ మెప్పించాడు. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) చదవండి: RRR షూటింగ్లో అనారోగ్యంతో బాధపడ్డ రాజమౌళి టికెట్ టు ఫినాలే విన్ అయితే కప్పు కొట్టే ఛాన్సే లేదా? -
డేటింగ్లో ప్రముఖ నటి.. సోషల్ మీడియాలో వైరల్
కన్నడ నటుడు వశిష్ట సింహ, నటి హరిప్రియ డేటింగ్లో ఉన్నారా? ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందా? అనే సందేహాలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని శాండల్‌వుడ్‌లో టాక్ నడుస్తోంది. అంతే కాదు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కొన్ని రోజులుగా రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. సింహా, హరిప్రియ డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకుబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ జంట వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఈ వార్తలను ఇప్పటివరకు వీరిలో ఎవరూ ధృవీకరించలేదు. సోమవారం బెంగళూరు ఎయిర్‌పోర్టులో వశిష్ట సింహ, హరిప్రియ ఒక్కసారిగా మెరిశారు. తెల్లని దుస్తులతో చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. పెళ్లికి సంబంధించి షాపింగ్ కోసమే దుబాయ్‌కి వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. వశిష్ట, హరిప్రియ ఓ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. తొలిచూపులోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితమే వశిష్ట తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. తన పోస్ట్‌లో రాస్తూ.. 'మీరు ప్రతి విషయంలో ఉత్తమమైన భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నా. మీలో ఆనందం, ప్రేమ ఎప్పుడు ఉండాలి.. మీరు మీలా ఉన్నందుకు ధన్యవాదాలు' అంటూ రాసుకొచ్చారు. దీనికి హరిప్రియ కూడా 'థాంక్యూ పార్ట్నర్' అంటూ స్పందించింది. హరిప్రియ కన్నడలో నటిగా మంచిపేరు సంపాదించారు. ఉగ్రమ్, రన్న, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ, బెల్ బాటమ్ చిత్రాలతో ఫేమ్ సాధించారు. మరోవైపు సింహా ఆర్య లవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. రాజా హులి, రుద్ర తాండవలో ప్రధాన ప్రతినాయకుడిగా మెప్పించారు. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) -
తల్లయిన ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ.. పాపకు పేరు పెట్టిన కేసీఆర్
సాక్షి,ఇల్లెందు(కొత్తగూడెం): హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావం రోజు బుధవారం ఉదయం ఆ పార్టీ ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, మార్కెట్ చైర్మన్ బానోతు హరిసింగ్ నాయక్ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. బీఆర్ఎస్ ఆవిర్భావం వేళ జన్మించిన బిడ్డకు ‘సుచిత్ర భారత ప్రియ’గా నామకరణం చేయాలని తనను కలిసిన హరిసింగ్ నాయక్‌కు సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. హరిప్రియ దంపతులకు ఇరవై ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడం, అదేరోజు దసరా కావడం విశేషం. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: నేతలకు గాలం వేస్తున్న ‘ఈటల’.. ఒక్కొక్కరుగా ‘గులాబీ’ పార్టీకి గుడ్ బై -
వీళ్లను కన్న బిడ్డల్లా చూసుకుంటా : మహిళా ఎమ్మెల్యే
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన ఇద్దరు అనాథ పిల్లలకు ఎమ్మెల్యే హరిప్రియ అండగా నిలిచారు. భట్టు గణేశ్, స్రవంతి దంపతులు. మూడేళ్ల క్రితం గొంతు కేన్సర్‌తో గణేశ్, మూడు నెలల క్రితం కిడ్నీ సమస్యలతో స్రవంతి మృతి చెందారు. దీంతో వారి పిల్లలు ఏడేళ్ల కృషన్, ఐదేళ్ల హరిప్రియ భారం అమ్మమ్మ నాగమణిపై పడింది. వారి ఇబ్బందులను గణేశ్ మిత్రుడు ఫణి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో వివరించాడు. వెంటనే స్పందించిన కేటీఆర్.. స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ, కలెక్టర్ డి.అనుదీప్, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మికి ఈ సమాచారం అందించారు. దీంతో ఎమ్మెల్యే హరిప్రియ చిన్నారుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. పిల్లలను కన్న బిడ్డల్లా చూసుకుంటానని, ఇద్దరికీ విద్య, ఇతర అవసరాలకు సాయం అందిస్తానని, డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. వారిని దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు. చదవండి: చిన్నారి వైద్యానికి కేటీఆర్ సాయం -
ఎమ్మెల్యే హరిప్రియకు ఘన స్వాగతం
సాక్షి, ఇల్లెందు: టీఆర్ఎస్లో చేరడంపై సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లి.. వారం తరువాత నియోజకవర్గానికి తిరుగుముఖం పట్టిన ఇల్లెందు ఎమ్మెల్యే బాణోతు హరిప్రియకు ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆమె రాకను పురష్కరించుకుని అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి స్వాగతం పలికారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తొలుత ఇల్లెందు నుంచి బయలు దేరిన టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బయ్యారం సరిహద్దు నుంచి స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కనగాల పేరయ్య, పులిగళ్ల మాధవరావు, గడ్డం వెంకటేశ్వర్లు, లింగాల జగన్నాధం, బండారి వెంకన్న, మేకల మల్లిబాబు యాదవ్, ప్రముఖ విద్యాసంస్థల అధిపతి దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు కొక్కు నాగేశ్వరరావు, ధాస్యం ప్రమోధ్కుమార్, యలమద్ధి రవి, సయ్యద్ ఆజం, సుధీర్తోత్లాలు అగ్ర భాగంలో నడిచారు. నెహ్రూనగర్, ముకుందాపురం, రాజీవ్‌నగర్ తండా, మహబూబాబాద్ క్రాస్ రోడ్డు, ఇల్లెందు కొత్తబస్టాండ్, జగదాంబా సెంటర్ మీదుగా వెళ్లిన ఎమ్మెల్యే.. క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అంతకు ముందు కొత్త బస్టాండ్ సెంటర్లో కొమురం భీం, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జగదాంబా సెంటర్లో తెలంగాణ తల్లికి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమాల్లో లాకావత్ దేవీలాల్ నాయక్, భావ్‌సింగ్ నాయక్, సూర్నబాక సత్యనారాయణ, దనుంజయ్, జేకే శ్రీను, భింగి వెంకన్న, మునిగంటి శివ, పోషం, వంగా సునిల్, మార్కెట్ రాజు, యలమందల వాసు, మధారమ్మ, వార రవి, ఆంజనేయులు, మెరుగు కార్తీక్ యాదవ్, వెంకటేష్, శ్రీకాంత్, కాంగ్రెస్ నేతలు నందకిశోర్, ఉప్పు శ్రీను, మనోహర్ తివారీ, ఓం, రవిప్రకాష్, దీపక్, ఎల్.కృష్ణ, గాజీ, రాజీవ్, మురళీ, మేకల శ్యాం, కడియాల అనిత,కంభంపాటి రేణుక, మంజ్యా శ్రీను, వత్స వెంకన్న, నూనావత్ లష్కర్, కొక్కు వెంకన్న, నల్ల సత్యనారాయణ,కొక్కు వెంకటేష్, మూల శ్రీనివాస్, వాసవీ రవీందర్, బొల్లి కొమురయ్య,భోజ్యా, జుంకిలాల్, వట్టం రాంబాబు, జీవనకుమారి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఇల్లెందు: ఎమ్మెల్యే బానోతు హరిప్రియ రాక కోసం పట్టణంలో పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు వాహనాలతో తరలి వెళ్లింది. ఇల్లెందు నుంచి బయ్యారం వరకు దారి పొడవునా ర్యాలీగా తరలి వెళ్లారు. కార్లు, టాటా ఏసీలు, మ్యాజిక్‌లు, ఆటోలు భారీ సంఖ్యలో పాల్గొన్నాయి. పూలమాలలు, శాలువాతో సన్మానం.. టేకులపల్లి: సీఎం కేసీఆర్ఆర్ను కలిసిన తరువాత తొలిసారి టేకులపల్లికి వచ్చిన ఇల్లెందు ఎమ్మెల్యే బాణోతు హరిప్రియ నాయక్‌ను కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, అనుచరులు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం టేకులపల్లికి వచ్చిన ఆమెను బోడు క్రాస్ రోడ్డు సెంటర్లో పూలు చల్లుతూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, హరిప్రియ నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనను గెలిపించిన వారికి, అభిమానంతో స్వాగతం పలికిన వారికి, తన వెంట నడిచేందుకు ముందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోడ బాలు, కంభంపాటి చంద్రశేఖర్, భూక్య లాలు, బాణోతు రామ, కందస్వామి, నల్లమాస రాజన్న, ఎం.శివకృష్ణ, ప్రసాద్, వీరు, శంకర్, కిషన్, సూర్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే హరిప్రియ గుడ్‌బై
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ను వీడుతున్న ఎమ్మెల్యేల జాబితాలో మరొకరు చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఆదివారం సాయంత్రం ఓ లేఖ విడుదల చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తాను సీఎం కేసీఆర్‌ను కలసి గిరిజన ప్రాంత అభివృద్ధిపై చర్చించానన్నారు. ఈ చర్చలో కేసీఆర్ మాట్లాడిన మాటలు స్వార్థ రాజకీయం కోసం కాకుండా రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ప్రస్ఫుటించాయని, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ఆయన విజన్, దాని కోసం ఆయన పడుతున్న తపన తనను మంత్రముగ్ధురాలిని చేశాయని లేఖలో హరిప్రియ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం రూపొందించిన ప్రణాళికలు తనను ఆకర్షింపజేశాయని, శతాబ్దాల చరిత్రగల ఇల్లెందు ప్రాంతం అభివృద్ధి కావాలన్నా, గిరిజనం అభివృద్ధి చెందాలన్నా కేసీఆర్ బాటలో పయనించడమే శ్రేయస్కరమని, అందుకే తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్‌తో కలసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నానన్నారు. ఎన్నికల్లో తన గెలుపు కోసం సహకరించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు, వారికి అభివృద్ధి ఫలాలు అందించేందుకు తాను ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని తెలిపారు. దీనిపై ఇప్పటికే పార్టీ శ్రేణులతో మాట్లాడానని, అందరినీ సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో హరి ప్రియ పేర్కొన్నారు. కేసీఆర్ మాత్రమే తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని అందరూ భావిస్తున్నారని, అందుకే అందరి నిర్ణయం మేరకు కేసీఆర్ బాటలో నడిచి బంగారు తెలంగాణలో భాగమవుతానని ప్రకటించారు. అవసరమైతే కాం గ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ బీఫారంపై పోటీ చేసేందుకు కూడా తాను సిద్ధమేనని లేఖలో హరిప్రియ వెల్లడించారు. -
మాయలేడి అరెస్ట్
కరీంనగర్: పలు మోసాలకు పాల్పడిన ఓ మాయ లేడీని కరీంనగర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. భక్తి భావం ముసుగులో మాతగా హరిప్రియ మోసాలు చేసినట్లు వెల్లడైంది. హరిప్రియతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా కంట పడకుండా రహస్యంగా కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. వారి నుంచి నకిలీ దేవతా విగ్రహాలు స్వాధీనం చేసుకున్నారు. వందల మంది వద్ద నుంచి సుమారు రూ.11 కోట్లు వసూలు చేసి మోసం చేసినట్లు సమాచారం. ఒక్కొక్కరుగా బాధితులు రహస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా
సాక్షి,బెంగళూరు: త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు ప్రము ఖ నటి హరిప్రియ స్పష్టం చేశారు. సోమవారం నగరంలోని ధర్మగిరి మంజునాథస్వామి దేవాలయంలో ఓ కొత్త చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం హరిప్రియ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాత్రమే నిర్ణయించుకున్నామని ఏ పార్టీ తరపున ఏ అభ్యర్థి తరపున ప్రచారం చేయాల్లో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. బహుభాష నటుడు ఉపేంద్ర స్థాపించిన ప్రజా పక్ష పార్టీ తరపున కూడా ప్రచారం చేసే అవకాశం ఉందని, దీనిపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామన్నారు. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం మాత్రమే నిర్వహిస్తామని, తదుపరి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్నారు. తన సొంత పట్టణం చిక్కబళ్లాపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. -
ముహూర్తం కుదిరింది
ఫొటో చూసి, హెడ్డింగ్ చదివి హీరోయిన్ హరిప్రియకు పెళ్లి సెట్ అయ్యిందని ఆలోచించి తప్పులో కాలేయకండి. ముహూర్తం కుదిరింది ఆమె నెక్ట్స్ చేయబోయే చిత్రానికి. జయతీర్థ దర్శకత్వంలో రిషబ్ శెట్టి, హరిప్రియ జంటగా రూపొందనున్న సినిమా ‘బెల్ బాటమ్’. ఈ చిత్రాన్ని రేపు లాంఛనంగా స్టార్ట్ చేయడానికి చిత్రబృందం ముహూర్తం నిర్ణయించారు. ఎయిటీస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగనుందట. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం లొకేషన్స్‌ను సెర్చ్ చేస్తున్నారట చిత్రబృందం. ‘‘నా నెక్ట్స్ చిత్రం ‘బెల్ బాటమ్’లో నటించనున్నందుకు సంతోషంగా ఉంది. జయతీర్థగారితో సెకండ్ టైమ్, రిషబ్ శెట్టితో థర్డ్ టైమ్ కలిసి వర్క్ చేయబోతున్నాను. నాకు వెరీ వెరీ స్పెషల్ మూవీ ఇది. టీమ్ అందరితో కలిసి సెట్లో సందడి చేసేందుకు వెయిట్ చేస్తున్నాను’’ అని హరిప్రియ పేర్కొన్నారు. సంతోష్ కేసీ నిర్మించనున్న ఈ సినిమాకు సంగీతం: అంజేష్ లోక్‌నాథ్, కెమెరా: అరవింద్ కశ్యప్, ఎడిటింగ్: ప్రకాశ్. -
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘జై సింహా’
నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా జై సింహా. ఈ సినిమాలో నయనతార, నటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలకృష్ణ 102వ సినిమాగా తెరకెక్కుతున్న ‘జై సింహా’ శుక్రవారంతో దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకొంది. బాలయ్య, నయనతారలపై ఒక పాట, బాలయ్య నటాషా జోషిలపై మరో పాట దుబాయ్ లో చిత్రీకరించారు. ఈ రెండు పాటలతో షూటింగ్ మొత్తం పుర్తయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘దుబాయ్ లో 30 మంది యూరోపియన్ డ్యాన్సర్స్ తో బాలయ్య నటాషా ల మధ్య డ్యూయోట్ సాంగ్‌ను జానీ మాస్టర్ నేతృత్వంలో, 20 మంది యూరోపియన్ డ్యాన్సర్స్ తో బాలయ్య నయనతారలపై మరో లవ్లీ సాంగ్ ను బృంద మాస్టర్ నేతృత్వంలో చాలా లావిష్ గా చిత్రీకరించాం. డిసెంబర్ నెలాఖరుకు చిరంతన్ భట్ సంగీత సారధ్యంలో రూపొందిన పాటలను భారీ వేడుక నిర్వహించి విడుదల చేయనున్నాం. జనవరి 12న బాలయ్య అభిమానులకు సంక్రాంతి కానుకగా ‘జై సింహా’ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. బాలయ్య ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, కె.ఎస్.రవికుమార్ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది’ అన్నారు. -
అనంతలో తమ్ముళ్ల ఆరాచకం
-
హరిప్రియపై జేసీ వర్గీయుల హత్యాయత్నం
-
హరిప్రియపై జేసీ వర్గీయుల హత్యాయత్నం
సాక్షి, అనంతపురం : జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి వర్గీయుల దాడులు కొనసాగుతున్నాయి. అప్పేచెర్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త హరిప్రియపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె చేతిని నరికేశారు. ఈ ఘటనలో హరిప్రియ తీవ్రంగా గాయపడ్డారు. జేసీ వర్గీయులే తనను చంపేందుకు ప్రయత్నించారని హరిప్రియ ఆరోపించారు. రెండేళ్ల కిందట హత్యకు గురైన వైఎస్ఆర్ సీపీ నేత విజయభాస్కర్ సోదరే హరిప్రియ. విజయభాస్కర్ హత్య కేసులో రాజీకి రావాలని గత రెండేళ్లుగా టీడీపీ వర్గీయులు తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని హరిప్రియ చెప్పారు. కొద్దిరోజుల కిందట కోర్టులో హత్య కేసు విచారణకు రావడంతో అప్పేచెర్లలో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని హరిప్రియ తెలిపారు. జేసీ వర్గీయుల నుంచి తనకు ప్రాణహాని ఉందని... వైఎస్సార్ సీపీ నేత విజయభాస్కర్ రెడ్డి హత్య కేసులో రాజీ కావాలని చాలారోజులుగా ఒత్తిడి తెస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేసిన హరిప్రియ లేఖ ఇది.. -
వైజాగ్ చుట్టొచ్చిన సింహం
బాలకృష్ణ నటిస్తోన్న 102వ చిత్రం ‘జై సింహా’. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. నయనతార, నటాషా జోషీ, హరిప్రియ కథానాయికలు. ఈ చిత్రం వైజాగ్‌లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సి.కళ్యాణ్ మాట్లాడుతూ– ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. వైజాగ్ బీచ్ రోడ్లో ఐదువేల మంది జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో ‘మహా ధర్నా’ సీక్వెన్స్ తీశాం. బాలకృష్ణ– హరిప్రియలపై రొమాంటిక్ సాంగ్‌తోపాటు, బాలయ్య–నయనతారపై ఓ మాంటేజ్ పాటను చిత్రీకరించాం. టైటిల్‌కి, ఇటీవల విడుదల చేసిన బాలయ్య ఫస్ట్ లుక్‌కి విశేషమైన స్పందన వస్తోంది. ఇప్పటివరకూ బాలయ్య కెరీర్లో ‘సింహా‘ టైటిల్స్‌తో వచ్చిన సినిమాలన్నీ హిట్. ‘జై సింహా‘ కూడా సూపర్ హిట్ అవడం ఖాయం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ నిర్మాత: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్–తేజ. -
‘ఈ వర్షం సాక్షిగా’ ఆడియో ఆవిష్కరణ
-
కన్నడ 'బాపుబొమ్మ' హరిప్రియ
కన్నడ అగ్రనటుడు సుదీప్ సరసన హరిప్రియ ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో ఘన విజయం సాధించిన 'అత్తారింటికి దారేది' ఆధారంగా సుదీప్ హీరోగా కన్నడంలో తెరకెక్కుతున్న చిత్రంలో హరిప్రియకు అవకాశం దక్కింది. 'బాపుబొమ్మ' ప్రణీత పోషించిన ప్రాత్రను కన్నడంలో ఆమె చేయబోతోంది. ఇక తెలుగులో సమంత చేసిన పాత్రను కన్నడంలో రచితా రామ్ దక్కించుకుంది. ఈ పాత్రను మొదట హన్సిన చేస్తుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ సినిమా చేయడం లేదని హన్సిక స్పష్టం చేసింది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు 'విక్టరీ' ఫేమ్ నందకిశోర్ దర్శకత్వం వహించనున్నారు. ప్రభాస్ 'మిర్చీ' సినిమాను కన్నడంలోకి రీమేక్ చేసి విజయం సాధించిన సుదీప్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాను రీమేక్ చేస్తున్నారు. -
ఈ వర్షం సాక్షిగా మూవీ స్టిల్స్
-
తియ్యని తలపుల ప్రణయం!
ప్రేమలోకంలో విహరిస్తుంటుంది ఆ జంట. తియ్యని కబుర్లు చెప్పుకోవడంతో పాటు చిరుకోపాలు, అడపా దడపా అలకలతో వారి ప్రేమ ప్రయాణం హాయిగా సాగిపోతుంటుంది. అలాంటి వారి జీవితాలు ఎటువంటి మలుపు తీసుకున్నాయి? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘గలాటా’.ఈ సినిమా ఆసాంతం వినోద ప్రధానంగా సాగుతుందని చిత్రదర్శకుడు కృష్ణ చెప్పారు. శ్రీ, హరిప్రియ జంటగా రాజేంద్రప్రసాద్ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఓ అల్లరి జంట ప్రేమకథ ఇది. ప్రేమలోని కొత్త కోణాన్ని ఇందులో ఆవిష్కరించాం. సునీల్ కశ్యప్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రం ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీతేజ నడింపల్లి. -
వైఎస్ లాంటి నేతలు కావాలి: హరిప్రియ
నాకు రాజకీయాల గురించి పెద్దగా తెలియని రోజులవి. కర్నాటకలో నేను డిగ్రీ చదవుకుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పుకునేవారు. చాలా పవర్‌పుల్ లీడర్ అని అందరూ అనుకుంటుంటే వినేదాన్ని. ఆ తర్వాత నేను హీరోయిన్గా టాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషలన్నింటిలో సినిమాలు చేశాను. ఆ సమయంలో కూడా అన్ని రాష్ట్రాల్లోనూ ఆయన పేరు మార్మోగేది. నిజంగా అలాంటి నేతలు పాలకులుగా రావాలి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉంది. ఇప్పుడైనా అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉండాలంటే సమర్థులైన నేతలకే ఓటెయ్యాలి. - హరిప్రియ, ‘ఈ వర్షం సాక్షిగా’ ఫేం -
వినోదాల గలాట
‘‘వినోదమే ప్రధానంగా రూపొందుతోన్న లవ్ ఎంటర్టైనర్ ఇది. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయి’’ అని దర్శకుడు కృష్ణ చెప్పారు. శ్రీ, హరిప్రియ జంటగా రాజేంద్రప్రసాద్‌వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేటి నుంచి వైజాగ్‌లో మూడో షెడ్యూలు జరగనుంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ షెడ్యూల్లో ఒక పాటను, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. దాంతో ఒక పాట మినహా షూటింగ్ పూర్తవుతుంది’’ అని తెలిపారు. నాగబాబు, సాయికుమార్, అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: ఫిరోజ్‌ఖాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీ తేజ నడింపల్లి.