హరిప్రియ
ఫొటో చూసి, హెడ్డింగ్ చదివి హీరోయిన్ హరిప్రియకు పెళ్లి సెట్ అయ్యిందని ఆలోచించి తప్పులో కాలేయకండి. ముహూర్తం కుదిరింది ఆమె నెక్ట్స్ చేయబోయే చిత్రానికి. జయతీర్థ దర్శకత్వంలో రిషబ్ శెట్టి, హరిప్రియ జంటగా రూపొందనున్న సినిమా ‘బెల్ బాటమ్’. ఈ చిత్రాన్ని రేపు లాంఛనంగా స్టార్ట్ చేయడానికి చిత్రబృందం ముహూర్తం నిర్ణయించారు. ఎయిటీస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగనుందట.
వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం లొకేషన్స్‌ను సెర్చ్ చేస్తున్నారట చిత్రబృందం. ‘‘నా నెక్ట్స్ చిత్రం ‘బెల్ బాటమ్’లో నటించనున్నందుకు సంతోషంగా ఉంది. జయతీర్థగారితో సెకండ్ టైమ్, రిషబ్ శెట్టితో థర్డ్ టైమ్ కలిసి వర్క్ చేయబోతున్నాను. నాకు వెరీ వెరీ స్పెషల్ మూవీ ఇది. టీమ్ అందరితో కలిసి సెట్లో సందడి చేసేందుకు వెయిట్ చేస్తున్నాను’’ అని హరిప్రియ పేర్కొన్నారు. సంతోష్ కేసీ నిర్మించనున్న ఈ సినిమాకు సంగీతం: అంజేష్ లోక్‌నాథ్, కెమెరా: అరవింద్ కశ్యప్, ఎడిటింగ్: ప్రకాశ్.
Comments
Please login to add a commentAdd a comment