తల్లి కాబోతున్న సింగిల్ టేక్ హీరోయిన్‌.. బాలకృష్ణ సినిమాతో గుర్తింపు | Balakrishna Movie Actress Haripriya Will Be Pregnancy | Sakshi
Sakshi News home page

తల్లి కాబోతున్న సింగిల్ టేక్ హీరోయిన్‌.. బాలకృష్ణ సినిమాతో గుర్తింపు

Published Wed, Jan 8 2025 2:30 PM | Last Updated on Wed, Jan 8 2025 2:42 PM

Balakrishna Movie Actress Haripriya Will Be Pregnancy

కన్నడ నటుడు వశిష్ఠ ( Vasishta N. Simha), హీరోయిన్‌ హరిప్రియ (Haripriya) తల్లిదండ్రులు కాబోతున్నారు. రెండేళ్ల క్రితం వారు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా వారు ఒక్కటయ్యారు. కన్నడలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే ఆమె ఏడడుగుల బంధంలోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె తమిళ్‌, తెలుగులో కూడా అనేక చిత్రాల్లో మెప్పించింది.

నటి భూమిక భర్త భరత్ ఠాకూర్ నిర్మించిన ‘తకిట తకిట’ చిత్రంతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు హరిప్రియ పరిచయమైంది.  ఆ తర్వాత నానితో  పిల్ల జమీందార్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో హరిప్రియకు వరుస అవకాశాలు వచ్చాయి.  అబ్బాయి క్లాస్‌ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా చిత్రాల తర్వాత ఏకంగా  బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది. ‘ జై సింహా’లో (Jai Simha) బాలయ్య  సరసన నటించి తెలుగు వారిని కూడా మెప్పించింది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఆమె సినిమాలు చేయలేదు. కానీ, కన్నడలో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్లింది.

ఇద్దరినీ కలిపిన కుక్క పిల్ల
హరిప్రియ గతంలో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, శ్రీమురళి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఈ క్రమంలో తన సహచర నటుడు వశిష్ట సింహతో ప్రేమలో పడింది. ఓ కుక్కపిల్ల కారణంగా తాను వశిష్టతో ప్రేమలో పడిపోయానని గతంలో ఆమె ఇలా చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ఇదే జరిగితే దంగల్‌ రికార్డ్‌ను 'పుష్ప' కొట్టేస్తాడు.. బన్నీకి గోల్డెన్‌ ఛాన్స్‌)

‘నా దగ్గర  లక్కీ, హ్యాపీ అనే రెండు కుక్క పిల్లలు ఉండేవి. వాటిలో లక్కీ అనే కుక్క చనిపోయింది. దీంతో హ్యాపీ ఒంటరైపోయింది. అలాంటి సమయంలో వశిష్ట సింహం నాకు ఓ కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు క్రిస్టల్‌. కొత్తగా వచ్చిన క్రిస్టల్‌తో హ్యాపీ కలిసిపోయింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే క్రిస్టల్‌ని బహుమతిగా ఇచ్చినప్పుడు.. వశిష్ట ఓ సందేశాన్ని కూడా పంపించాడు. క్రిస్టల్ పొట్టపై గుండె ఆకారంలో ఓ మచ్చ ఉంది. క్రిస్టల్‌తో పాటు ఆ మచ్చ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది. అలా మా ప్రేమకు క్రిస్టల్‌ కారణమైంది’ అని హరిప్రియ తన ప్రేమ కహానిని చెప్పుకొచ్చింది.

వశిష్ఠ కూడా మరెవరో కాదు… కన్నడ నుంచి రిలీజ్‌ అయిన సూపర్ డూపర్ హిట్ మూవీ 'కేజీఎఫ్‌'లో ఆయన విలన్‌గా నటించాడు. కన్నడలో ఆర్య లవ్‌, రాజా హులి, రుద్ర తాండవలో  మెప్పించాడు. ఆ తర్వాత తెలుగులోనూ ‘నయీమ్ డైరీస్, నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్ వంటి సినిమాల్లో చాలా కీలక పాత్రలు పోషించాడు. హరిప్రియ కూడా కన్నడలో ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఉగ్రమ్‌ సినిమాతో పాటు రన్న, రికీ, నీర్‌ దోసె, భర్జరి, సంహారా, లైఫ్‌ జోతే ఓంద్‌ సెల్ఫీ, బెల్‌ బాటమ్‌ చిత్రాలతో గుర్తింపు పొందింది.  అలా ఇద్దరూ కన్నడ, తెలుగు పరిశ్రమలో గుర్తంపు తెచ్చుకోవడం వల్ల వారికి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

బాలయ్యను మెప్పించిన హరిప్రియ
నందమూరి బాలకృష్ణ నటించిన జై సింహా సినిమా 2018 సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా వేడుకలో భాగంగా బాలయ్య మాట్లాడుతూ హరిప్రియపై ప్రశంసలు కురిపించారు.  జై సింహా సినిమాలో ఆమె చాలా కీలకమైన పాత్ర చేశారని బాలయ్య చెబుతూనే.. ఒక సీన్‌లో ఆమె అద్భుతంగా మెప్పించారని తెలిపారు. ఆ సీన్‌ చేయాలంటే మరోక నటికి ఒకరోజు పట్టవచ్చని తెలిపారు. హరిప్రియ సింగిల్ టెక్ ఆర్టిస్ట్ అని కూడా ఆయన పొగిడారు. బాలయ్య నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ప్రశంసలు అందుకున్న నటి హరిప్రియ మాత్రమేనని చెప్పవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement