Vasishta Simha
-
త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్.. ఘనంగా సీమంతం
హీరోయిన్ హరిప్రియ (Hariprriya) త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ క్రమంలో నటుడు వశిష్ట సింహ భార్య సీమంతం వేడుకను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశాడు. తన సీమంతం ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోను ఈ దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు సెలబ్రిటీ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా హరిప్రియ, వశిష్ట సింహ 2023లో పెళ్లి చేసుకున్నారు.ఎవరీ హరిప్రియ?హరిప్రియ కర్ణాటకవాసి. విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే క్లాసికల్ డ్యాన్స్‌పై ఆసక్తితో భరతనాట్యం నేర్చుకుంది. అలా ఎన్నో ప్రోగ్రామ్స్‌కు హాజరయ్యేది. తను 12వ తరగతి చదువుతున్న సమయంలో తన డ్యాన్స్ స్టిల్స్ దర్శకుడు రిచర్డ్ కాస్టెలినో కంటపడ్డాయి. వెంటనే ఆమెను సినిమా కోసం సంప్రదించడం.. ఇంట్లో ఒప్పుకోవడంతో బడి అనే తుళు చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. మనసుగుల మత్తు మధుర చిత్రంతో కన్నడ వెండితెరకు హీరోయిన్‌కు పరిచయమైంది.(చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం)తెలుగులోనూ హీరోయిన్గా..యష్ సరసన నటించిన 'కళ్ళర సంతె'తో క్రేజ్ తెచ్చుకుంది. శివరాజ్‌కుమార్ 'చెలువెయె నిన్నే నోడలు' మూవీతో సెన్సేషన్ అయింది. ఉగ్రం, నీర్ దోసె, బెల్ బాటమ్, బిచ్చుగత్తి: చాప్టర్ 1 వంటి చిత్రాలతో అలరించింది. తకిట తకిట చిత్రంతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాట, జై సింహ, అలా ఇలా ఎలా అనే సినిమాలతో మెప్పించింది. తమిళంలోనూ రెండుమూడు మూవీస్‌లో నటించింది. ప్రస్తుతం కన్నడలో బెల్ బాటమ్ 2, హ్యాపీ ఎండింగ్, లగామ్ సినిమాలు చేస్తోంది.కేజీఎఫ్ మూవీలో విలన్‌గా..వశిష్ట (Vasishta N Simha) విషయానికి వస్తే ఇతడు కూడా కర్ణాటకవాసే! రుద్ర తాండవ, ఎలోన్, నాన్ లవ్ ట్రాక్, ముఫ్టీ, టగారు, ఉపేంద్ర మట్టె బా, 8 ఎమ్ఎమ్ బుల్లెట్ వంటి చిత్రాల్లో నటించాడు. కేజీఎఫ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగులో నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్, డెవిల్: ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్, యేవమ్, సింబా చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఓదెల రైల్వే స్టేషన్ సీక్వెల్లో నటిస్తున్నాడు. ఇతడు నటుడు మాత్రమే కాదు సింగర్ కూడా! తెలుగులో కిరాక్ పార్టీ మూవీలో ఓ సాంగ్ పాడాడు. కన్నడలో పలు చిత్రాల్లో పాటలు ఆలపించాడు.అలా మొదలైన ప్రేమకథఈ ఇద్దరికీ ఎలా ముడిపడిందో హరిప్రియ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ‘నా దగ్గర రెండు కుక్క పిల్లలు ఉండేవి. వాటిలో ఒకటి చనిపోవడంతో మిగతాది ఒంటరైపోయింది. అలాంటి సమయంలో వశిష్ట నాకు ఓ కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు క్రిస్టల్. కొత్తగా వచ్చిన పప్పీతో నా కుక్కపిల్ల కలిసిపోయింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే క్రిస్టల్‌ని బహుమతిగా ఇచ్చినప్పుడు.. వశిష్ట ఓ సందేశాన్ని కూడా పంపించాడు. క్రిస్టల్ పొట్టపై గుండె ఆకారంలో ఓ మచ్చ ఉంది. క్రిస్టల్‌తో పాటు ఆ మచ్చ కూడా పెరుగుతూ వచ్చింది. అలాగే మా మధ్య ప్రేమ కూడా పెరిగింది’ అని తన ప్రేమ కహానీ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) View this post on Instagram A post shared by Hariprriya Simha (@iamhariprriya) చదవండి: మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు! -
తల్లి కాబోతున్న సింగిల్ టేక్ హీరోయిన్.. బాలకృష్ణ సినిమాతో గుర్తింపు
కన్నడ నటుడు వశిష్ఠ ( Vasishta N. Simha), హీరోయిన్ హరిప్రియ (Haripriya) తల్లిదండ్రులు కాబోతున్నారు. రెండేళ్ల క్రితం వారు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా వారు ఒక్కటయ్యారు. కన్నడలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే ఆమె ఏడడుగుల బంధంలోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె తమిళ్, తెలుగులో కూడా అనేక చిత్రాల్లో మెప్పించింది.నటి భూమిక భర్త భరత్ ఠాకూర్ నిర్మించిన ‘తకిట తకిట’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు హరిప్రియ పరిచయమైంది. ఆ తర్వాత నానితో పిల్ల జమీందార్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో హరిప్రియకు వరుస అవకాశాలు వచ్చాయి. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా చిత్రాల తర్వాత ఏకంగా బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది. ‘ జై సింహా’లో (Jai Simha) బాలయ్య సరసన నటించి తెలుగు వారిని కూడా మెప్పించింది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఆమె సినిమాలు చేయలేదు. కానీ, కన్నడలో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్లింది.ఇద్దరినీ కలిపిన కుక్క పిల్లహరిప్రియ గతంలో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, శ్రీమురళి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఈ క్రమంలో తన సహచర నటుడు వశిష్ట సింహతో ప్రేమలో పడింది. ఓ కుక్కపిల్ల కారణంగా తాను వశిష్టతో ప్రేమలో పడిపోయానని గతంలో ఆమె ఇలా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఇదే జరిగితే దంగల్ రికార్డ్‌ను 'పుష్ప' కొట్టేస్తాడు.. బన్నీకి గోల్డెన్ ఛాన్స్)‘నా దగ్గర లక్కీ, హ్యాపీ అనే రెండు కుక్క పిల్లలు ఉండేవి. వాటిలో లక్కీ అనే కుక్క చనిపోయింది. దీంతో హ్యాపీ ఒంటరైపోయింది. అలాంటి సమయంలో వశిష్ట సింహం నాకు ఓ కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు క్రిస్టల్. కొత్తగా వచ్చిన క్రిస్టల్‌తో హ్యాపీ కలిసిపోయింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే క్రిస్టల్‌ని బహుమతిగా ఇచ్చినప్పుడు.. వశిష్ట ఓ సందేశాన్ని కూడా పంపించాడు. క్రిస్టల్ పొట్టపై గుండె ఆకారంలో ఓ మచ్చ ఉంది. క్రిస్టల్‌తో పాటు ఆ మచ్చ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది. అలా మా ప్రేమకు క్రిస్టల్ కారణమైంది’ అని హరిప్రియ తన ప్రేమ కహానిని చెప్పుకొచ్చింది.వశిష్ఠ కూడా మరెవరో కాదు… కన్నడ నుంచి రిలీజ్ అయిన సూపర్ డూపర్ హిట్ మూవీ 'కేజీఎఫ్'లో ఆయన విలన్‌గా నటించాడు. కన్నడలో ఆర్య లవ్, రాజా హులి, రుద్ర తాండవలో మెప్పించాడు. ఆ తర్వాత తెలుగులోనూ ‘నయీమ్ డైరీస్, నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్ వంటి సినిమాల్లో చాలా కీలక పాత్రలు పోషించాడు. హరిప్రియ కూడా కన్నడలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉగ్రమ్ సినిమాతో పాటు రన్న, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ, బెల్ బాటమ్ చిత్రాలతో గుర్తింపు పొందింది. అలా ఇద్దరూ కన్నడ, తెలుగు పరిశ్రమలో గుర్తంపు తెచ్చుకోవడం వల్ల వారికి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.బాలయ్యను మెప్పించిన హరిప్రియనందమూరి బాలకృష్ణ నటించిన జై సింహా సినిమా 2018 సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా వేడుకలో భాగంగా బాలయ్య మాట్లాడుతూ హరిప్రియపై ప్రశంసలు కురిపించారు. జై సింహా సినిమాలో ఆమె చాలా కీలకమైన పాత్ర చేశారని బాలయ్య చెబుతూనే.. ఒక సీన్లో ఆమె అద్భుతంగా మెప్పించారని తెలిపారు. ఆ సీన్ చేయాలంటే మరోక నటికి ఒకరోజు పట్టవచ్చని తెలిపారు. హరిప్రియ సింగిల్ టెక్ ఆర్టిస్ట్ అని కూడా ఆయన పొగిడారు. బాలయ్య నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ప్రశంసలు అందుకున్న నటి హరిప్రియ మాత్రమేనని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by Hariprriya Simha (@iamhariprriya) -
సలార్.. కన్నడలో ప్రభాస్‌కు డబ్బింగ్ చెప్పిన కేజీఎఫ్ విలన్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హైవోల్టేజ్ యాక్షన్ మూవీ 'సలార్' రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ 22 సలార్ వార్ డిసైడ్ చేయనున్నాడు. ఇక 'సలార్'కు పోటీగా షారుక్ ఖాన్ నటించిన 'డంకి' సినిమా బరిలోకి దిగనుంది. అలా క్రిస్టమస్ సంబరాల్లో 2 సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. ఈ రెండు సినిమాలతో పాటు హాలీవుడ్ 'అక్వామన్' సినిమా కూడా తెరపైకి వస్తోంది.ప్రస్తుతం చికిత్స కోసం ప్రభాస్ విదేశాల్లో ఉంటున్నాడు. త్వరలో ఆయన భారత్‌లో ల్యాండ్ కానున్నాడు. ఆయన ఎంట్రీ ఇచ్చాక 'సలార్' సినిమా ప్రచారం ప్రారంభం కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బిజీగా సాగుతోంది. గ్రాఫిక్స్ వర్క్ మరింత బెటర్ ఉండాలని భావించిన ప్రశాంత్ నీల్ సినిమా విడుదల తేదీని వాయిదా వేసి మరీ సలార్ పనులు చూస్తున్నాడు. ఇక 'కేజీఎఫ్' చిత్రానికి పనిచేసిన స్టార్లు 'సలార్' కోసం పనిచేస్తున్నారు. శ్రుతి హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, దేవరాజ్ సహా పెద్ద తారగణమే ఈ సినిమాలో ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న సలార్.. కన్నడలో ప్రభాస్ పాత్రకు నటుడు వశిష్ఠ సింహ వాయిస్ ఇస్తున్నాడు. కన్నడ నటుడు వశిష్ఠ సింహ 'సలార్' టీమ్‌తో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రకు గట్టిగా ధ్వనించే కంఠంతో వాయిస్ అందిస్తున్నాడు. ఈ వార్త విని అభిమానులు ఎంతగానో ఆనందిస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్‌కు ఆయన వాయిస్ బేస్ కరెక్ట్‌గా సెట్ అవుతుందని వారు అంటున్నారు. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేజీఎఫ్‌లో హీరో యష్‌కి తెలుగులో వాయిస్ ఇచ్చింది డబ్బింగ్ ఆర్టిస్ట్ గౌతమ్... మొదట ఆయన వాయిస్ సెట్ కాదని అందరూ చెప్పినా ప్రశాంత్ నీల్ ఓకే చేశాడట. ఫైనల్‌గా రిజల్ట్ తెలిసిందే. (ఇదీ చదవండి: లియో కొత్తగా మళ్లీ వస్తున్నాడు.. వారికి మాత్రమే ఎంట్రీ.. ఎందుకంటే?) అదే రీతిలో వశిష్ఠ కన్నడ వాయిస్ కూడా ప్రభాస్‌కు బాగా సెట్ అవుతుందని మేకర్స్ ప్లాన్ చేశారట. తెలుగులో ఎంతటి మాస్ డైలాగ్ అయినా సరే ప్రభాస్ చెబితే విజిల్స్ పడాల్సిందే.. కానీ కన్నడలో యంగ్ రెబల్ స్టార్ డబ్ చేసే సాహసం చేయడం లేదు. అందుకు తను పర్ఫెక్ట్ కాదని వశిష్ఠ వాయిస్‌ను సూచించారట. ఇప్పటికే ప్రభాస్ డైలాగ్స్ అన్నీ వశిష్ఠ పూర్తి చేశాడని తెలుస్తోంది. అతని వాయిస్ మన డైనోసార్ కటౌట్‌కు పక్కాగా సెట్ అయిందట. ఇదే విషయాన్ని ప్రభాస్ కూడా మేకర్స్‌కు తెలిపాడట. ఇదిలా ఉంటే శ్రుతి హాసన్ 5 భాషల్లోనూ తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. 1000 కోట్ల రూ. కలెక్షన్స్ టార్గెట్ చేసి సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక 'సలార్' ట్రైలర్ కోసం డార్లింగ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీపావళి సందర్భంగా సలార్ ట్రైలర్ విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. వశిష్ట ఎవరంటే.. వశిష్ట సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా ప్రవేశించాడు. అతను మొదట ఆర్‌యస్ లవ్ చిత్రం ద్వారా 2013లో వెండితెరపై మెరిశాడు. ఆ తర్వాత తమిళ్, తెలుగు చిత్రాలతో మెప్పించాడు. వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలో సీనప్ప పాత్రలో మెప్పించిన వశిష్ట.. ఒదెలా రైల్వే స్టేషన్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. KGF లో , బెంగుళూరుకు చెందిన గ్యాంగ్‌స్టర్ కమల్ పాత్రను వశిష్ట పోషించాడు , ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా ఆయన సూపర్ అనిపించాడు. సింగర్‌గా కూడా కన్నడలో పలు పాటలు పాడాడు. -
కేజీఎఫ్ విలన్‌ను పెళ్లాడిన హీరోయిన్.. ఫోటోలు వైరల్
'పిల్ల జమీందార్' హీరోయిన్ హరిప్రియ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. కేజీఎఫ్ సినిమాలో విలన్‌గా నటించిన వశిష్ట సింహాతో కలిసి ఆమె ఏడుడుగులు వేసింది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట మైసూరులోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. శివరాజ్‌కుమార్, డాలీ ధనంజయ్, అమృత అయ్యంగార్ తదితర సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కన్నడ బ్యూటీ హరిప్రియకు తెలుగు పరిశ్రమతోనూ మంచి అనుబంధం ఉంది. తకిట తకిట సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు నాని సరసన పిల్ల జమిందార్ సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలయ్యతో జై సింహ, వరుణ్ సందేశ్‌తో ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ వంటి నటించింది.మరోవైపు వశిష్ట సింహా ఆర్య లవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. రాజా హులి, రుద్ర తాండవలో ప్రధాన ప్రతినాయకుడిగా మెప్పించారు. కేజీఎఫ్‌లో విలన్ పాత్ర పోషించారు. View this post on Instagram A post shared by 𝐻𝒶𝓇𝒾𝒫𝓇𝓇𝒾𝓎𝒶 𝐹𝒸 (@hariprriyafc) -
కేజీఎఫ్ విలన్‌తో హీరోయిన్ ఎంగేజ్మెంట్.. వీడియో వైరల్
మరో ప్రేమజంట పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయింది. కొన్నేళ్లుగా డేటింగ్లో మునిగితేలిన జంట వివాహబంధంలోకి అడుగు పెట్టనుంది. కన్నడ నటుడు వశిష్ట సింహ, నటి హరిప్రియ ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ప్రేమజంట. మా జంటను ఆశీర్వదించండి అంటూ వశిష్ట సింహ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. వీరిద్దరి డేటింగ్‌పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇటీవలే బెంగళూరు ఎయిర్‌పోర్టులో వశిష్ట సింహ, హరిప్రియ ఒక్కసారిగా మెరిశారు. ఇద్దరు చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. పెళ్లికి సంబంధించి షాపింగ్ కోసమే దుబాయ్‌కి వెళ్లి వచ్చినట్లు వార్తలు వైరలయ్యాయి. కాగా వశిష్ట సింహ, హరిప్రియ ఓ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. తొలిచూపులోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కొద్ది రోజుల క్రితమే వశిష్ట తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. హరిప్రియ కన్నడలో నటిగా మంచిపేరు సంపాదించారు. ఉగ్రమ్, రన్న, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ, బెల్ బాటమ్ చిత్రాలతో ఫేమ్ సాధించారు. మరోవైపు సింహా ఆర్య లవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. రాజా హులి, రుద్ర తాండవలో ప్రధాన ప్రతినాయకుడిగా మెప్పించారు. కేజీఎఫ్‌లో విలన్ పాత్ర పోషించారు. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) -
కుక్క పిల్ల కారణంగానే ఆ హీరోతో ప్రేమలో పడ్డా: హీరోయిన్
‘తకిట తకిట’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచమైంది కన్నడ బ్యూటీ హరిప్రియ. ఆ తర్వాత నానితో పిల్ల జమీందార్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో హరిప్రియకు వరుస అవకాశాలు వచ్చాయి. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా చిత్రాల తర్వాత ఏకంగా నటసింహం బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది. ‘ జై సింహా’లో బాలయ్య సరసన నటించి,మెప్పించింది. ఆ సినిమా తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు కానీ.. కన్నడలో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్లింది. షబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, శ్రీమురళి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఈ క్రమంలో తన సహచర నటుడు వశిష్ట సింహతో ప్రేమలో పడింది. ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా తన లవ్‌స్టోరీని రివీల్ చేసింది ఈ కన్నడ బ్యూటీ. ఓ కుక్కపిల్ల కారణంగా తాను వశిష్టతో ప్రేమలో పడిపోయానని చెప్పుకొచ్చింది. ‘నా దగ్గర లక్కీ, హ్యాపీ అనే రెండు కుక్క పిల్లలు ఉండేవి. వాటిలో లక్కీ అనే కుక్క చనిపోయింది. దీంతో హ్యాపీ ఒంటరైపోయింది. అలాంటి సమయంలో వశిష్ట సింహం నాకు ఓ కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు క్రిస్టల్. కొత్తగా వచ్చిన క్రిస్టల్‌తో హ్యాపీ కలిసిపోయింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే క్రిస్టల్‌ని బహుమతిగా ఇచ్చినప్పుడు.. వశిష్ట ఓ సందేశాన్ని కూడా పంపించాడు. క్రిస్టల్ పొట్టపై గుండె ఆకారంలో ఓ మచ్చ ఉంది. క్రిస్టల్‌తో పాటు ఆ మచ్చ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది. అలా మా ప్రేమకు క్రిస్టల్ కారణమైంది’ అని హరిప్రియ తన ప్రేమ కహానిని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Hariprriya (@iamhariprriya) -
కోరుకున్నవాడితో హీరోయిన్ ఎంగేజ్మెంట్
కన్నడ నటుడు వశిష్ఠ, హీరోయిన్ హరిప్రియ డేటింగ్లో ఉన్నారంటూ శాండల్‌వుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇటీవలే వీరిద్దరూ దుబాయ్ నుంచి బెంగళూరుకు తిరిగివస్తూ ఎయిర్‌పోర్టులో మీడియాకు చిక్కడంతో వారి ప్రేమ విషయం నిజమేనని అందరూ ఫిక్స్ అయిపోయారు. త్వరలోనే వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. చూస్తుంటే ఇదే నిజం కాబోతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా వశిష్ఠ, హరిప్రియల నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. కాగా వశిష్ట, హరిప్రియ ఓ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. తొలిచూపులోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది కాస్తా ప్రేమగా మారింది. కాగా హరిప్రియ కన్నడలో ఉగ్రమ్, రన్న, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ, బెల్ బాటమ్ చిత్రాలతో ఫేమ్ సంపాదించారు. మరోవైపు సింహా ఆర్య లవ్ చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. రాజా హులి, రుద్ర తాండవలో విలన్‌గానూ మెప్పించాడు. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) చదవండి: RRR షూటింగ్లో అనారోగ్యంతో బాధపడ్డ రాజమౌళి టికెట్ టు ఫినాలే విన్ అయితే కప్పు కొట్టే ఛాన్సే లేదా? -
డేటింగ్లో ప్రముఖ నటి.. సోషల్ మీడియాలో వైరల్
కన్నడ నటుడు వశిష్ట సింహ, నటి హరిప్రియ డేటింగ్లో ఉన్నారా? ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందా? అనే సందేహాలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని శాండల్‌వుడ్‌లో టాక్ నడుస్తోంది. అంతే కాదు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కొన్ని రోజులుగా రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. సింహా, హరిప్రియ డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకుబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ జంట వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఈ వార్తలను ఇప్పటివరకు వీరిలో ఎవరూ ధృవీకరించలేదు. సోమవారం బెంగళూరు ఎయిర్‌పోర్టులో వశిష్ట సింహ, హరిప్రియ ఒక్కసారిగా మెరిశారు. తెల్లని దుస్తులతో చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. పెళ్లికి సంబంధించి షాపింగ్ కోసమే దుబాయ్‌కి వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. వశిష్ట, హరిప్రియ ఓ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. తొలిచూపులోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితమే వశిష్ట తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. తన పోస్ట్‌లో రాస్తూ.. 'మీరు ప్రతి విషయంలో ఉత్తమమైన భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నా. మీలో ఆనందం, ప్రేమ ఎప్పుడు ఉండాలి.. మీరు మీలా ఉన్నందుకు ధన్యవాదాలు' అంటూ రాసుకొచ్చారు. దీనికి హరిప్రియ కూడా 'థాంక్యూ పార్ట్నర్' అంటూ స్పందించింది. హరిప్రియ కన్నడలో నటిగా మంచిపేరు సంపాదించారు. ఉగ్రమ్, రన్న, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ, బెల్ బాటమ్ చిత్రాలతో ఫేమ్ సాధించారు. మరోవైపు సింహా ఆర్య లవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. రాజా హులి, రుద్ర తాండవలో ప్రధాన ప్రతినాయకుడిగా మెప్పించారు. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) -
‘నయీం డైరీస్’మూవీ రివ్యూ
టైటిల్ : నయీం డైరీస్ నటీనటులు : వశిష్ట సింహ, యజ్ఞ శెట్టి, దివి, బాహుబలి నిఖిల్, శశి కుమార్, జబర్దస్త్ ఫణి తదితరులు నిర్మాత : సీఏ వరదరాజు దర్శకత్వం: దాము బాలాజీ సంగీతం : అరుణ్ ప్రభాకర్ ఎడిటింగ్: కిషోర్ మద్దాలి విడుదల తేది : డిసెంబర్ 10, 2021 2016లో గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నక్సల్‌గా ప్రారంభమైన ఆయన జీవితం, పోలీసు కోవర్ట్‌గా మారి ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి వణుకు పుట్టించాడు. చివరకు పోలీసుల ఎన్‌కౌంటర్‌కి గురయ్యాడు. అలాంటి వ్యక్తి జీవిత కథలో తెరకెక్కిన సినిమా ‘నయీం డైరీస్’. ఈ చిత్రంలో వశిష్ఠ సింహ నయీం క్యారెక్టర్ లో నటించారు. సీఏ వరదరాజు నిర్మాణంలో తన తొలి ప్రయత్నంగా నయీం డైరీస్ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు దాము బాలాజీ. ఓ మోస్తారు అంచనాల మధ్య ఈ శుక్రవారం (డిసెంబర్ 10)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? నల్లగొండ జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన నయీం(వశిష్ట సింహ).. చిన్నతనంలోనే నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితుడై మావోయిస్ట్‌గా మారతాడు. నిస్వార్ధంగా సేవ చేస్తూ కొద్దికాలంలోనే నక్సలైట్ ఉద్యమంలో కీలక వ్యక్తిగా మారిపోతాడు. వ్యాస్ హత్య కేసులో జైలుకెళ్లిన నయీంకు అక్కడ ఊహించిన పరిస్థితులు ఎదురవుతాయి. నయీం సోదరిపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తికి నక్సల్స్ చిన్న శిక్ష విధించి వదిలేయడం నయీం, అతని సోదరుడి వలీకి నచ్చదు. జైల్లో ఉన్న నయీం సోదరుడు వలీ సహాయంతో తన సోదరిపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని చంపిస్తాడు. దీంతో పార్టీ గీత దాటినందుకు నయీంను నక్సలైట్లు కమిటీ నుంచి బహిష్కరిస్తారు. దాంతో నయీం పోలీసుల చేతుల్లో అసాంఘీక శక్తిగా మారిపోతాడు. క్సలైట్ ఉద్యమాన్ని ప్రాణంగా ప్రేమించిన నయీం, ఆ నక్సలైట్ల ఎన్ కౌంటర్ లకు ఎలా సారథ్యం వహించాడు? జైలులో నయీం ఎదుర్కొన్న సమస్యలు ఏంటి?నయీం సోదరుడు వల్లీ ఎందుకు హత్య గురయ్యాడు? సోదరుడి మరణం తర్వాత నయీం జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. నయీం పాత్రలో వశిష్ట సింహ ఒదిగిపోయాడు. భావోద్వేగం, కుటుంబం మీద ప్రేమ, శత్రువుల మీద పగ, పట్టరాని ఆవేశం, క్రోధం లాంటి హావభావాలన్నీ వశిష్ట సింహా చక్కగా పలికించాడు. డైలాగ్స్ కూడా అద్భుతంగా పలికి ఆ పాత్రకు న్యాయం చేశాడు. నయీం యువకుడి పాత్రలో బాహుబలి నిఖిల్ నటన బాగుంది. నయీం సోదరిగా నటించిన యజ్ఞశెట్టి తన మెప్పించింది. నయీం భార్యగా బిగ్‌బాస్ దివి తనదైన అందంతో ఆకట్టుకుంది. రొమాంటిక్ సన్నివేశాల్లో వశిష్ట, దివి కెమిస్ట్రీ బాగుంది. లత పాత్రలో సంయుక్త మెప్పించింది. తన ప్రేమనంతా మాటల్లో కాకుండా చూపుల్లోనే కనబర్చింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? తెలంగాణలో పేరమోసిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే ‘నయీం డైరీస్’.కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ని పక్కకి పెట్టి చూస్తే.. ‘అత్యంత వివాదాస్పద, సంచలనాత్మక గ్యాంగ్‌స్టర్ కథని అంతే బోల్డ్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు దాము బాలాజీ. నయీం జీవితంలో వెలుగు చూడని అంశాలను చక్కగా తెరమీదకు తీసుకురావడంలో సఫలమయ్యారు. నయీం అసలు నక్సల్ నుంచి పోలీస్ కోవర్ట్ గా మారడానికి దారి తీసిన అంశాలేంటి? తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని ఎన్కౌంటర్ చేయడానికి కారణాలేంటి? ఓ వైపు నక్సల్స్, మరోవైపు పోలీసులు, ఇంకోవైపు రాజకీయ నాయకులు ఆయన్ని ఎలా వాడుకున్నారు? అనేది ఆసక్తికరంగా చూపించాడు. నయీం సోదరుడి మర్డర్‌కు సంబంధించిన యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్‌గా ఉంటాయి. నయీం జీవితం గురించి దర్శకుడు చేసిన పరిశోధన సినిమాకు బలంగా మారిందనే చెప్పాలి. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం సినిమాకు మైనస్. సెకండాఫ్‌లో కథను అనుసరిస్తూ సాగిన హింస.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇబ్బందిగా ఉంటుంది. మొత్తనికి తొలి చిత్రంగా దర్శకుడు మంచి మార్కులే సంపాదించాడు. ఇక సాంకెతిక విషయాలకొస్తే.. ప్రభాకర్ అరున్ సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎన్కౌంటర్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌ని తెరపై చక్కగా చూపించారు. కిషోర్ మద్దాలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
నయీం క్యారెక్టర్ కోసం నక్సలైట్స్ గురించి ఆరా తీశా: వశిష్ట సింహా
‘నాకు సహజంగానే నెగిటివ్ రోల్స్ అంటే ఇష్టం. థియేటర్ నాటికల్లోనూ నెగిటివ్ పాత్రలు చేశాను. నెగిటివ్ రోల్స్ లో నటించేందుకు చాలా స్వేచ్ఛ ఉంటుంది . హీరోకు ఉండే పరిమితులు ప్రతినాయకుడికి ఉండవు. అందుకే నాకు విలన్ పాత్రలు అంటే ఇష్టం’అన్నారు హీరో వశిష్ట సింహా. కేజీఎఫ్, నారప్ప సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ యంగ్ హీరో.. తాజాగా ‘నయీం డైరీస్’లో ప్రధాన పాత్రలో నటించారు. . వరదరాజు నిర్మించిన ఈ చిత్రానికి దాము బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ నెల 10న నయీం డైరీస్ సినిమా విడుదలవుతున్న సందర్భంగా వశిష్ట సింహా మీడియాతో ముచ్చటించారు. ఈ విశేషాలు.. ►సంగీత దర్శకుడు హంసలేఖ నా అభిమాన సంగీత దర్శకుడు. ఆయన కన్సర్ట్ జరుగుతుంటే వెళ్లి కలవాలని ప్రయత్నించాను. ఆ తర్వాత హంసలేఖ నోటీస్ కు వెళ్లాను. ఒక రోజు ఆయన పిలిచి పాడమని అడిగారు. అలా సింగర్ గా నా జర్నీ మొదలైంది. పెద్ద ప్రొపెషనల్ సింగర్ ను కాదు కానీ...సినిమా మీద ఆసక్తి పెరిగింది. అలా ఇండస్ట్రీకి రాగలిగాను. ►కాలేజ్ లో ఉన్నప్పుడు రౌడీ గ్యాంగ్ మాది. కాలేజ్ లో ఉన్నప్పుడే కల్చరల్ యాక్టివిటీస్ చేసేవాళ్లం. నాటికను డైరెక్ట్ చేశాను. ఆ నాటికకు అవార్డ్ వచ్చింది. ఇదంతా నాకు ఎంకరేజింగ్ గా ఉండేది. బెంగళూరు థియేటర్ నాటికలకు తరుచూ వెళ్లేవాడిని. అలా సినిమా వైపు మరింత ఆకర్షితం అయ్యాను. థియేటర్ నాటికల్లో నటించడం మొదలుపెట్టాను. అరడజను నాటికల్లో నటించాను. జాబ్ చేస్తూనే ఇటు నాటికల్లో నటించేవాడిని. పనిచేసే కంపెనీ నుంచి బయటకొచ్చి నాటికల్లో పూర్తిగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. అక్కడి నుంచి నా సినిమా ప్రయాణం మొదలైంది. ►సినిమాల్లో డీవోపీ, ఎడిటింగ్ ఇలా. చాలా డిపార్ట్ మెంట్ ల్లో పనిచేశాను. యష్ సినిమాలో ఒక నెగిటివ్ రోల్ లో నటించాను. ఆ పాత్రకు బాగా పేరొచ్చింది. అలా విలన్ గా నా కెరీర్ మొదలైంది. ఆ తర్వాత మంచి మంచి క్యారెక్టర్స్ దొరికాయి. ఇక్కడ కిరాక్ పార్టీలో ఒక క్యారెక్టర్ లో నటించాను. అలా నేను బిజీగా మారిన టైమ్ లో నిర్మాత వరదరాజు గారు బెంగళూరు వచ్చారు. దర్శకుడు దాము బాలాజీ గారికి నయీం డైరీస్ కోసం పరిచయం చేశారు. ఈ కథ నాకు బాగా నచ్చింది. అలా నయీం డైరీస్ మూవీ లో జాయిన్ అయ్యాను. ►నయీం కథ విన్నప్పుడు మనిషి ఇంత క్రూరంగా ఉంటాడా అనిపించింది. జీవితంలో ఎన్నో సాధిస్తాం. ఎంతో సంపాదిస్తాం. కానీ ఒక ఘటన ఎదురైనప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది తర్వాత భవిష్యత్ ను నిర్ణయిస్తుంది. నయీం అనే మనిషి త్వరగా, గట్టిగా రియాక్ట్ అవుతాడు. తర్వాత ఏంటనేది ఆలోచించడు. ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు ఒక గ్యాంగ్ స్టర్ గా ఎదగడం సర్ ప్రైజింగ్ గా అనిపిస్తుంది. నారప్ప, కేజీఎఫ్ తర్వాత నయీం డైరీస్ సినిమా చేయడం నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. నయీం క్యారెక్టర్ లో ఉన్న డెప్త్, ఇంటర్నల్ ఎమోషన్ నాకు బాగా నచ్చింది. ఇలాంటి పాత్రలు తరుచూ దొరకవు. ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంటుంది. ►నయీం కథ ఎవరైనా ముందు వింటే కోపం వస్తుంది, ఆ తర్వాత జాలి కలుగుతుంది. నేను కూడా నయీం గురించి యూట్యూబ్ ద్వారా నెట్ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. మీడియా ఇంటర్వ్వూస్ చూశాను, ఆర్టికల్స్ చదివాను. నక్సలైట్స్ గురించి తెలుసుకున్నాను. ఇలా నయీం క్యారెక్టర్ కోసం కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యాను. స్క్రిప్ట్ కూడా చాలా బాగుంటుంది. క్రైమ్ ను, ఎమోషన్ ను దర్శకుడు కొత్తగా చూపించారు. డైలాగ్స్ బాగుంటాయి. ►నయీం ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అని అన్నప్పుడు కాంట్రవర్సీ వస్తుంది. ఇలాంటి సినిమాలో ఎందుకు నటించావు అనే ప్రశ్నలూ వస్తాయి. కానీ నేనొక నటుడిని. నయీంకు సంబంధించిన ఏ విషయాలతో నాకు సంబంధం లేదు. నయీంను ఈ సినిమాలో మంచిగా చూపించే ప్రయత్నం చేయలేదు. అతని జీవితం ఎలా సాగిందో, అలాగే ఒక అద్దంలా తెరకెక్కించాం. నాణేనికి రెండో వైపు ఉన్నట్లు ...నయీం కొందరికి హీరో అంటే ఆశ్చర్యం కలుగుతుంది.