Sandalwood Stars Vasishta Simha and Haripriya Engagement Today - Sakshi
Sakshi News home page

కేజీఎఫ్‌ విలన్‌తో హీరోయిన్ ఎంగేజ్‌మెంట్.. వీడియో వైరల్

Dec 9 2022 4:47 PM | Updated on Dec 9 2022 6:00 PM

Sandalwood Stars Vashishta Simha and Hari Priya Engagement Today - Sakshi

మరో ప్రేమజంట పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయింది. కొన్నేళ్లుగా డేటింగ్‌లో మునిగితేలిన జంట వివాహబంధంలోకి అడుగు పెట్టనుంది. కన్నడ నటుడు వశిష్ట సింహ, నటి హరిప్రియ ఇటీవలే ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది ప్రేమజంట. మా జంటను ఆశీర్వదించండి అంటూ వశిష్ట సింహ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.   వీరిద్దరి డేటింగ్‌పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

ఇటీవలే బెంగళూరు ఎయిర్‌పోర్టులో వశిష్ట సింహ, హరిప్రియ ఒక్కసారిగా మెరిశారు. ఇద్దరు చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. పెళ్లికి సంబంధించి షాపింగ్ కోసమే దుబాయ్‌కి వెళ్లి వచ్చినట్లు వార్తలు వైరలయ్యాయి. కాగా ‍వశిష్ట సింహ, హరిప్రియ ఓ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. తొలిచూపులోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కొద్ది రోజుల క్రితమే వశిష్ట తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. 

హరిప్రియ కన్నడలో నటిగా మంచిపేరు సంపాదించారు. ఉగ్రమ్, రన్న, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ, బెల్ బాటమ్ చిత్రాలతో ఫేమ్ సాధించారు. మరోవైపు సింహా ఆర్య లవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. రాజా హులి, రుద్ర తాండవలో ప్రధాన ప్రతినాయకుడిగా మెప్పించారు. కేజీఎఫ్‌లో విలన్ పాత్ర పోషించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement