Engagement program
-
త్వరలోనే శర్వానంద్ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?
టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకరైన హీరో శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కానున్నారు. యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న అమ్మాయి మెడలో త్వరలోనే మూడు ముళ్లు వేయనున్నారు. అయితే శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు. తాజాగా ఆ అమ్మాయి ఎవరనే ఉత్కంఠకు తెర పడింది. ఈనెల 26న సాఫ్ట్వేర్ ఇంజినీర్ రక్షితా రెడ్డితో ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. శర్వానంద్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి రక్షితా రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తెగా తెలుస్తోంది. త్వరలోనే రక్షితా రెడ్డి మెడలో మూడు మూళ్లు వేయనున్నారు. ఆమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలిగా సమాచారం. అయితే ఇటీవల అన్‌స్టాపబుల్ షో పాల్గొన్న శర్వానంద్ పెళ్లి వార్తలపై స్పందించారు. -
కేజీఎఫ్ విలన్‌తో హీరోయిన్ ఎంగేజ్మెంట్.. వీడియో వైరల్
మరో ప్రేమజంట పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయింది. కొన్నేళ్లుగా డేటింగ్లో మునిగితేలిన జంట వివాహబంధంలోకి అడుగు పెట్టనుంది. కన్నడ నటుడు వశిష్ట సింహ, నటి హరిప్రియ ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ప్రేమజంట. మా జంటను ఆశీర్వదించండి అంటూ వశిష్ట సింహ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. వీరిద్దరి డేటింగ్‌పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇటీవలే బెంగళూరు ఎయిర్‌పోర్టులో వశిష్ట సింహ, హరిప్రియ ఒక్కసారిగా మెరిశారు. ఇద్దరు చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. పెళ్లికి సంబంధించి షాపింగ్ కోసమే దుబాయ్‌కి వెళ్లి వచ్చినట్లు వార్తలు వైరలయ్యాయి. కాగా వశిష్ట సింహ, హరిప్రియ ఓ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. తొలిచూపులోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కొద్ది రోజుల క్రితమే వశిష్ట తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. హరిప్రియ కన్నడలో నటిగా మంచిపేరు సంపాదించారు. ఉగ్రమ్, రన్న, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ, బెల్ బాటమ్ చిత్రాలతో ఫేమ్ సాధించారు. మరోవైపు సింహా ఆర్య లవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. రాజా హులి, రుద్ర తాండవలో ప్రధాన ప్రతినాయకుడిగా మెప్పించారు. కేజీఎఫ్‌లో విలన్ పాత్ర పోషించారు. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) -
ప్రముఖ దర్శకుడి కుమార్తె నిశ్చితార్థం.. భావోద్వేగానికి గురైన తండ్రి
ప్రముఖ చిత్రనిర్మాత, బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ కుమార్తె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇటీవల జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను విక్రమ్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఆయన కూతురు కృష్ణ భట్‌కు వేదాంత్ సర్దా అనే అబ్బాయితో నిశ్చితార్థం నిర్వహించారు. తాజాగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. విక్రమ్ భట్ తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. నేను చేతులపై మోసిన చిన్నారి నా కూతురేనా అంటూ ఎమోషనల్ అయ్యారు. ఆమె తలపై ఒక ముద్దు పెట్టి కుమార్తెపై ప్రేమను చాటుకున్నారు విక్రమ్ భట్. ఫోటోలు చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ నటులు సైతం జంటపై క్రేజీ కామెంట్స్ చేశారు. సుస్మితా సేన్, నటుడు రాహుల్ దేవ్, బిపాసా బసు, ఈషా గుప్తా ఇరువురి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. వీరితో పాటు ఇతర సెలబ్రెటీలు కూడా ఈ పోస్ట్‌పై కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Vikram Bhatt (@vikrampbhatt) -
నిశ్చితార్థానికి హాజరైన వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు
సాక్షి, ప్రకాశం(చీమకుర్తి): వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు దుంపా రమణమ్మ కుమారుడు దుంపా ఇంద్రసేనారెడ్డి, దివ్యజ్యోతిల నిశ్చయ తాంబూలాల వేడుకను శనివారం ఒంగోలులోని విష్ణుప్రియ ఫంక్షన్ హాలులో వైభవంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, శచీదేవి దంపతులు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, యువనేత బాలినేని ప్రణీత్‌రెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ మాజీ చైర్మన్లు ఇనగంటి పిచ్చిరెడ్డి, మారం వెంకారెడ్డి, పలు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ స్థానిక నాయకులు, జిల్లాలోని పలువురు అధికారులు హాజరై ఇంద్రసేనారెడ్డి, దివ్యజ్యోతి జంటను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: (డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో కల్వర్టును ఢీకొన్న కారు.. వరుడు సహా..) -
Zoom: లక్ష కోట్లతో జూమ్ భారీ డీల్...! అందుకోసమేనా..!
వీడియో కాన్ఫరెన్సింగ్ దిగ్గజం జూమ్ కీలక ఒప్పందాన్నికుదుర్చుకోనుంది. ప్రముఖ క్లౌడ్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ ఫైవ్9 ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. జూమ్ తన కస్టమర్లకు మరింత సేవలను అందించడం కోసం సుమారు 14.7 బిలియన్ డాలర్ల( సుమారు రూ. లక్ష కోట్ల)తో ఫైవ్9 ను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫైవ్9 క్లౌడింగ్ సాఫ్ట్వేర్ జూమ్‌కు ఆపరేటింగ్ యూనిట్‌గా మారనుంది. అంతేకాకుండా ఫైవ్9 కంపెనీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ రోవాన్ ట్రోలోప్ జూమ్ సంస్థకు ప్రెసిడెంట్ కానున్నారు. రెండు కంపెనీల మధ్య ఒప్పందం 2022 మొదటి అర్ధభాగంలో ముగుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఒప్పందం ప్రకారం..రెండు కంపెనీల బోర్డులచే ఆమోదం పొందిన తరువాత, ఫైవ్ 9 కంపెనీ ప్రతి వాటాకు ఫైవ్ 9 స్టాక్ హోల్డర్లు క్లాస్ ఎ కామన్ స్టాక్ ఆఫ్ జూమ్ 0.5533 షేర్లను అందుకుంటారు. అంతర్జాతీయ మార్కెట్లో ఫైవ్ 9 షేర్లు శుక్రవారం 0.6 శాతం పెరిగి 177.60 డాలర్లకు చేరుకున్నాయి. జూమ్ 1.4 శాతం పెరిగి 361.97 డాలర్ల వద్ద స్థిర పడింది. జూమ్ కంపెనీ విలువ సుమారు 106 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,92,450 కోట్లు). ఈ భారీ డీల్ అందుకోసమేనా..! ఫైవ్ 9 కంపెనీ క్లౌడ్-బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో మేటి. దీని అత్యంత స్కేలబుల్ , సురక్షితమైన క్లౌడ్ కాంటాక్ట్ సెంటర్. అనేక రకాల ఛానెళ్లలో కస్టమర్ ఇంటరాక్షన్ల నిర్వహణ, ఆప్టిమైజేషన్‌ను అనుమతించే సులభమైన యాప్. ఈ క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో జూమ్ ఆన్లైన్ సమావేశాల్లో పంచుకునే వివిధ అంశాలకు చెందిన డాక్యుమెంట్లు మరింత సురక్షితంగా ఉంటాయని తెలుస్తోంది. -
ఆ రోజే మా నిశ్చితార్థం: రాయ్ లక్ష్మి
రాయ్ లక్ష్మి జీవితం ఒక కొత్త మలుపు తీసుకోనుంది. ఈ విషయం గురించి ఆమే చెప్పారు. ‘మీ పెళ్లి పిక్సయిందట’ అని ఈ మధ్య కాలంలో చాలామంది ఈ బ్యూటీని అడిగారట. ఈ ప్రశ్నకు ఫుల్స్టాప్ పెట్టేయాలనుకున్నారామె. ‘‘కొంత కాలంగా చాలామంది నన్ను పదే పదే అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేయాలనుకున్నాను. నేను నా రిలేషన్‌షిప్‌ని దాచాలనుకోవడం లేదు. ఆ మాటకొస్తే నా రిలేషన్షిప్ గురించి వేరేవాళ్లకు అనవసరం. నాకంటూ కొంత స్వేచ్ఛ కావాలి. నా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలను బయటపెట్టాలనుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు రాయ్ లక్ష్మి. ఆమె ఇంకా మాట్లాడుతూ– ‘‘మా ఎంగేజ్మెంట్ తేదీ ఫిక్సయింది. ఈ నెల 27న జరగనున్న మా నిశ్చితార్థానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను గత వారమే మా సన్నిహితులకు పంపాం. ఇది ఎప్పుడో ప్లాన్ చేసుకున్నది కాదు. అనుకోకుండా జరిగింది. అయితే నా కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉన్నారు. నా ‘లవ్’తో జీవితాన్ని పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు రాయ్ లక్ష్మి. చదవండి: (ఈ పుట్టినరోజును ఎప్పటికీ మరచిపోలేను: రష్మికా) -
‘చూడచక్కగా ఉన్నారు.. మీ జంట సూపర్’
‘‘చూడచక్కగా ఉన్నారు. మీ జంట సూపర్’’ అంటూ మెహరీన్ స్నేహితులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భవ్యా బిష్ణోయ్‌తో మెహరీన్ పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ తాజాగా మెహరీన్ స్కూల్ ఫ్రెండ్ తమన్నా నిశ్చితార్థంలో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఫొటో చూసినవాళ్లు సూపర్ అంటున్నారు. ఈ శుక్రవారం (మార్చి 12) జైపూర్‌లోని అలీలా కోటలో మెహరీన్–భవ్య నిశ్చితార్థం జరగనుంది. భవ్యా బిష్ణోయ్ హరియానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు. భవ్య కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. మెహరీన్–భవ్యాల వివాహ తేదీని నిశ్చితార్థం రోజున ప్రకటిస్తారట. ప్రస్తుతం మెహరీన్ ‘ఎఫ్3’లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
ఆ రోజు రానే వచ్చింది
ప్రముఖ గాయని సునీత ఏడడుగులు వేయబోతున్నారనే వార్త కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్త నిజమే. వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్టు సోమవారం సునీత స్వయంగా ప్రకటించారు. మ్యాంగో మీడియా గ్రూప్ హెడ్ రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకోబోతున్నారామె. సోమవారం వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థపు ఫొటోలను షేర్ చేస్తూ, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘‘ప్రతి తల్లిలానే నా పిల్లలు జీవితంలో స్థిరపడాలని కలలు కన్నాను. నా జీవితం గురించి కూడా బాగా ఆలోచించే పిల్లలు, తల్లిదండ్రులు నాకుండటం అదృష్టం. నువ్వు లైఫ్‌లో సెటిల్ అవ్వాలని వాళ్లు అంటుంటారు. ఆ రోజు రానే వచ్చింది. మంచి స్నేహితుడిలా రామ్ నా జీవితంలోకి వచ్చారు. ఇప్పుడు నా జీవిత భాగస్వామి కాబోతున్నారు. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాం. నా జీవితాన్ని ఎప్పుడూ చాలా ప్రైవేట్‌గా ఉంచాలనే అనుకుంటాను. నా మంచి కోరుకునేవాళ్లందరూ అర్థం చేసుకుంటారని, మీ ప్రేమ ఎప్పుడూ అలానే ఉంటుందనీ అనుకుంటున్నాను’’ అన్నారు సునీత. సునీత కుమారుడు ఆకాశ్, రామ్, ఆయన తల్లి, సునీత తల్లిదండ్రులు, సునీత, ఆమె కుమార్తె శ్రేయ -
బిల్‌గేట్స్ అల్లుడు ఇతడే
వాషింగ్టన్ డిసి : ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మెలిండా దంపతుల కుమార్తె జెన్నిఫర్ గేట్స్ నిశ్చితార్థం పూర్తి అయింది. ఈజిప్టుకు చెందిన గుర్రపు స్వారీ ఆటగాడు నయెల్ నాసర్(29) జెన్నిఫర్(23)తో తన నిశ్చితార్థం అయిందని జెన్నిఫర్ ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా తెలిపింది. ఈ మేరకు మంచుకొండల్లో నయెల్ నాసర్తో దిగిన ఫోటన్ను షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ జీవితంలో ప్రేమను పంచుకుంటూ తాము ముందుకు వెళ్తామని ఆమె పేర్కొన్నారు. కాగా, గత కొన్నేళ్లుగా నాసర్, జెన్నిఫర్లు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Nayel Nassar, you are one of a kind. Absolutely swept me off my feet this past weekend, surprising me in the most meaningful location over one of our many shared passions. I can’t wait to spend the rest of our lives learning, growing, laughing and loving together. Yes a million times over. 💍 AHHH!!! A post shared by Jennifer Gates (@jenniferkgates) on Jan 29, 2020 at 12:29pm PST జెన్నిఫర్ ఇన్‌స్ట్రాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె పోస్ట్‌కు ఇప్పటికే 46వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. పలువురు నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక జెన్నిఫర్ ఇన్‌స్ట్రాగ్రామ్ పోస్ట్‌పై ఆమె తల్లిదండ్రులు హర్షం వెలిబుచ్చారు. ‘ నేను ఆశ్చర్యానికి గురయ్యాను. అభినందనలు’ అని బిల్‌గేట్స్ కామెంట్ చేయగా, ‘నిన్ను, నయెల్ నాసర్‌ను జంటగా చూడడం సంతోషంగా ఉంది’ అని మెలిండా గేట్స్ ట్వీట్ చేశారు. ఇక నయెల్ నాసర్ కూడా తన నిశ్చితార్థానికి సంబందిన విషయాన్ని ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా తెలిపారు. ‘ చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరేమో’ అంటూ జెన్నిఫర్‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు. View this post on Instagram SHE SAID YES!! 💍 I’m feeling like the luckiest (and happiest) man in the world right about now. Jenn, you are everything I could have possibly imagined..and so much more. I can’t wait to keep growing together through this journey called life, and I simply can’t imagine mine without you anymore. Love you more than you can possibly imagine, and thank you for making every single day feel like a dream to me. Here’s to forever! 😘❤️ A post shared by Nayel Nassar (@nayelnassar) on Jan 29, 2020 at 12:49pm PST నాసర్ తల్లిదండ్రులది ఈజిప్టు కాగా అమెరికాలో స్థిరపడ్డారు. నాసర్ చికాగోలో జన్మించాడు. అతనికి ఈజిప్టు పౌరసత్వం ఉన్న కారణంగా గుర్రపు స్వారీ ఆటలో ఆ దేశం తరఫున 2020 ఒలంపిక్స్‌లో సైతం పాల్గొనబోతున్నాడు. -
లండన్‌లో అమీ ఎంగేజ్మెంట్
ముంబై : నటి అమీ జాక్సన్ తన బాయ్‌ఫ్రెండ్ జార్జ్ పనయిటుతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. లండన్‌లో జరిగిన ఎంగేజ్మెంట్ పార్టీకి వారి సన్నిహిత మిత్రులు, బంధువులు హాజరయ్యారు. ఎంగేజ్మెంట్ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతకుముందు తమ జీవితంలోకి చిన్నారి ప్రవేశిస్తోందని ఇన్‌స్టాగ్రామ్‌లో అమీ జాక్సన్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అమీ పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. రామ్‌చరణ్ నటించిన ఎవడు మూవీతో పాటు 2.0లో అమీ జాక్సన్ నటన ఆకట్టుకుంది. -
ఘనంగా భువనేశ్వర్ నిశ్చితార్థం
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నిశ్చితార్థం ప్రేయసి నుపూర్ నగార్‌తో బుధవారం గ్రేటర్ నోయిడాలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు భువీ-నుపూర్ దగ్గరి స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. డిసెంబర్లో వీరి వివాహాం జరిపించాలని కుటుంబ సభ్యులు నిశ్చయించారు. ఇక ఈ నిశ్చితార్థంకు ముందు భువీ తన ప్రియురాలు నుపూర్ నగార్ అని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపిన విషయం తెలిసిందే. భువి స్వస్థలం గంగానగర్‌లోనే నుపుర్ కుటుంబం నివాసం ఉండేది. భువి తండ్రి కిరణ్‌పాల్ సింగ్, నుపుర్ తండ్రి యశ్పాల్ సింగ్ పోలీస్ ఇద్దరూ యూపీ పోలీసు డిపార్టుమెంట్లో సబ్ఇన్స్పెక్టర్లుగా చేసి రిటైర్ కావడం విశేషం. నుపూర్ నగార్ ఇంజనీరింగ్ చదివి నోయిడాలోని ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ‘మా రెండు కుటుంబాలు ఒకరికొకరికి బాగా తెలుసు. ఇక అమ్మాయి బాగా చదువుకున్నది. భువనేశ్వర్ వరుస సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు. ఒక పదిరోజుల సమాయాన్ని చూసుకొని పెళ్లి డేట్‌ను ఫిక్స్ చేస్తాం’ అని భువనేశ్వర్ తండ్రి మీడియాకు తెలిపారు. -
బాల్య వివాహ నిశ్చితార్థాన్ని అడ్డుకున్న అధికారులు
కణేకల్లు : 16 ఏళ్ల బాలికకు తల్లిదండ్రులు నిర్వహిస్తున్న నిశ్చితార్థ కార్యక్రమాన్ని అధికారులు అడ్డుకున్న సంఘటన మండలంలోని గోపులాపురం గ్రామంలో గురువారం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన బాలికకు ఆమె తల్లిదండ్రులు సమీప బంధువులకు చెందిన ఓ అబ్బాయితో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో గురువారం ఇంట్లో నిశ్చితార్థ కార్యక్రమం పెట్టుకొన్నారు. విషయం తెలియడంతో ఐసీడీఎస్ సీడీపీఓ పార్వతమ్మ, రెవెన్యూ, పోలీసు సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని నిశ్చితార్థాన్ని అడ్డుకొన్నారు. మైనర్ బాలికకు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని అధికారులు సూచించారు. అధికారుల హెచ్చరికతో నిశ్చితార్థం ఆగింది.