
రాయ్ లక్ష్మి జీవితం ఒక కొత్త మలుపు తీసుకోనుంది. ఈ విషయం గురించి ఆమే చెప్పారు. ‘మీ పెళ్లి పిక్సయిందట’ అని ఈ మధ్య కాలంలో చాలామంది ఈ బ్యూటీని అడిగారట. ఈ ప్రశ్నకు ఫుల్‌స్టాప్ పెట్టేయాలనుకున్నారామె. ‘‘కొంత కాలంగా చాలామంది నన్ను పదే పదే అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేయాలనుకున్నాను. నేను నా రిలేషన్‌షిప్‌ని దాచాలనుకోవడం లేదు. ఆ మాటకొస్తే నా రిలేషన్‌షిప్ గురించి వేరేవాళ్లకు అనవసరం. నాకంటూ కొంత స్వేచ్ఛ కావాలి. నా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలను బయటపెట్టాలనుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు రాయ్ లక్ష్మి.
ఆమె ఇంకా మాట్లాడుతూ– ‘‘మా ఎంగేజ్‌మెంట్ తేదీ ఫిక్సయింది. ఈ నెల 27న జరగనున్న మా నిశ్చితార్థానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను గత వారమే మా సన్నిహితులకు పంపాం. ఇది ఎప్పుడో ప్లాన్ చేసుకున్నది కాదు. అనుకోకుండా జరిగింది. అయితే నా కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉన్నారు. నా ‘లవ్’తో జీవితాన్ని పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు రాయ్ లక్ష్మి.
Comments
Please login to add a commentAdd a comment