ఆ రోజు రానే వచ్చింది | Singer Sunitha gets engaged to Rama Veerapaneni | Sakshi
Sakshi News home page

ఆ రోజు రానే వచ్చింది

Dec 8 2020 12:03 AM | Updated on Dec 8 2020 5:25 AM

Singer Sunitha gets engaged to Rama Veerapaneni - Sakshi

రామ్‌, సునీత

ప్రముఖ గాయని సునీత ఏడడుగులు వేయబోతున్నారనే వార్త కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్త నిజమే. వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్టు సోమవారం సునీత స్వయంగా ప్రకటించారు. మ్యాంగో మీడియా గ్రూప్‌ హెడ్‌ రామ్‌ వీరపనేనిని పెళ్లి చేసుకోబోతున్నారామె. సోమవారం వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థపు ఫొటోలను షేర్‌ చేస్తూ, ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. ‘‘ప్రతి తల్లిలానే నా పిల్లలు జీవితంలో స్థిరపడాలని కలలు కన్నాను.

నా జీవితం గురించి కూడా బాగా ఆలోచించే పిల్లలు, తల్లిదండ్రులు నాకుండటం అదృష్టం. నువ్వు లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలని వాళ్లు అంటుంటారు. ఆ రోజు రానే వచ్చింది. మంచి స్నేహితుడిలా రామ్‌ నా జీవితంలోకి వచ్చారు. ఇప్పుడు నా జీవిత భాగస్వామి కాబోతున్నారు. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాం. నా జీవితాన్ని ఎప్పుడూ చాలా ప్రైవేట్‌గా ఉంచాలనే అనుకుంటాను. నా మంచి కోరుకునేవాళ్లందరూ అర్థం చేసుకుంటారని, మీ ప్రేమ ఎప్పుడూ అలానే ఉంటుందనీ అనుకుంటున్నాను’’ అన్నారు సునీత.

సునీత కుమారుడు ఆకాశ్, రామ్, ఆయన తల్లి, సునీత తల్లిదండ్రులు, సునీత, ఆమె కుమార్తె శ్రేయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement