Zoom: లక్ష కోట్లతో జూమ్‌ భారీ డీల్‌...! అందుకోసమేనా..! | Zoom To Buy Cloud Software Provider Five9 | Sakshi
Sakshi News home page

Zoom: లక్ష కోట్లతో జూమ్‌ భారీ డీల్‌...! అందుకోసమేనా..!

Published Mon, Jul 19 2021 4:23 PM | Last Updated on Mon, Jul 19 2021 4:26 PM

Zoom To Buy Cloud Software Provider Five9 - Sakshi

వీడియో కాన్ఫరెన్సింగ్‌ దిగ్గజం జూమ్‌ కీలక ఒప్పందాన్నికుదుర్చుకోనుంది. ప్రముఖ క్లౌడ్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రొవైడర్‌ ఫైవ్‌9 ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. జూమ్‌ తన కస్టమర్లకు మరింత సేవలను అందించడం కోసం సుమారు 14.7 బిలియన్‌ డాలర్ల( సుమారు రూ. లక్ష కోట్ల)తో ఫైవ్‌9 ను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫైవ్‌9 క్లౌడింగ్‌ సాఫ్ట్‌వేర్‌ జూమ్‌కు ఆపరేటింగ్‌ యూనిట్‌గా మారనుంది. అంతేకాకుండా ఫైవ్‌9 కంపెనీ ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రోవాన్‌ ట్రోలోప్‌ జూమ్‌ సంస్థకు ప్రెసిడెంట్‌ కానున్నారు.

రెండు కంపెనీల మధ్య ఒప్పందం 2022 మొదటి అర్ధభాగంలో ముగుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఒప్పందం ప్రకారం..రెండు కంపెనీల బోర్డులచే ఆమోదం పొందిన తరువాత, ఫైవ్ 9 కంపెనీ ప్రతి వాటాకు ఫైవ్ 9 స్టాక్ హోల్డర్లు క్లాస్ ఎ కామన్ స్టాక్ ఆఫ్ జూమ్ 0.5533 షేర్లను అందుకుంటారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఫైవ్ 9 షేర్లు శుక్రవారం 0.6 శాతం పెరిగి 177.60 డాలర్లకు చేరుకున్నాయి.  జూమ్ 1.4 శాతం పెరిగి 361.97 డాలర్ల వద్ద స్థిర పడింది. జూమ్‌ కంపెనీ విలువ సుమారు 106 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,92,450 కోట్లు). 

ఈ భారీ డీల్‌ అందుకోసమేనా..!
ఫైవ్ 9 కంపెనీ క్లౌడ్-బేస్డ్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో మేటి. దీని అత్యంత స్కేలబుల్ ,  సురక్షితమైన క్లౌడ్ కాంటాక్ట్ సెంటర్. అనేక రకాల ఛానెళ్లలో కస్టమర్ ఇంటరాక్షన్‌ల నిర్వహణ, ఆప్టిమైజేషన్‌ను అనుమతించే సులభమైన యాప్‌. ఈ క్లౌడ్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో జూమ్‌ ఆన్‌లైన్‌ సమావేశాల్లో పంచుకునే వివిధ అంశాలకు చెందిన డాక్యుమెంట్లు మరింత సురక్షితంగా ఉంటాయని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement