
ముంబై : నటి అమీ జాక్సన్ తన బాయ్‌ఫ్రెండ్ జార్జ్ పనయిటుతో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నారు. లండన్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ పార్టీకి వారి సన్నిహిత మిత్రులు, బంధువులు హాజరయ్యారు. ఎంగేజ్‌మెంట్ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అంతకుముందు తమ జీవితంలోకి చిన్నారి ప్రవేశిస్తోందని ఇన్‌స్టాగ్రామ్‌లో అమీ జాక్సన్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అమీ పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. రామ్‌చరణ్ నటించిన ఎవడు మూవీతో పాటు 2.0లో అమీ జాక్సన్ నటన ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment