Haripriya
-
ప్రియా సిస్టర్స్‌కు జీవన సాఫల్య పురస్కారం...
ప్రముఖ సంగీత విద్వాంసులు, ప్రియా సిస్టర్స్‌గా పేరొందిన అక్కాచెల్లెళ్లు హరిప్రియా, షణ్ముఖప్రియలకు జీవన సాఫల్య పురస్కార ప్రదానం చేస్తున్నారు. శ్రీ వాసవీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, కె.రోశయ్య 91వ జయంతి సందర్భంగా నగరంలోని రవీంద్రభారతిలో సాయంత్రం 5.45గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగనుంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. -
శిరోజాలు దానం చేయండి
అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం...ఇలా మన సంస్కృతిలో దానగుణానికి విశేష గౌరవం ఉంది.అయితే భువనేశ్వర్‌కు చెందిన హరిప్రియ నాయక్ ప్రచారం చేసేది మాత్రం ‘శిరోజాల దానం’. ‘మీరు దానం చేసే శిరోజాల పేద కేన్సర్ పేషెంట్ల ముఖంలో చిరునవ్వు తీసుకొస్తుంది’ అంటుందామె. సేకరించిన జుట్టుతో విగ్గులు తయారు చేయించి పంచుతున్న హరిప్రియ నాయక్ అనేక ప్రశంసలు పొందుతోంది. కేన్సర్‌తో పోరాడి గెలవ డానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. చాలామంది గెలుస్తారు. అయితే దిగువ మధ్యతరగతి స్త్రీలు, పేద స్త్రీలు ఈ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేన్సర్ చికిత్స సమయంలో కిమోథెరపీ వల్ల జుట్టు రాలిపో తుంది. ఆ సమయంలో శిరోముండనం కూడా చేయించుకోవాల్సి వస్తుంది. స్తోమత కలిగిన వర్గాల స్త్రీలు తిరిగి పూర్తి జుట్టు వచ్చేవరకూ విగ్గులు ధరిస్తారు. కాని పేద వర్గాల స్త్రీలకు ఆ అవకాశం ఉండదు. వారి కోసం, వారి ఆత్మవిశ్వాసం కోసం ఉచితంగా విగ్గులు ఏర్పాటు చేస్తోంది హరిప్రియ నాయక్. ‘శిరోజాల దానం ఇవాళ్టి అవసరం’ అంటుందామె. సామాజిక సేవ ఒడిశ్సాలోని ఖుర్దా జిల్లాకు చెందిన 32 ఏళ్ల హరిప్రియ నాయక్ సామాజిక సేవారంగంలో పని చేస్తోంది. ‘ఒకసారి నేను కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోయిన పేదస్త్రీలను చూశాను. వారు ఇంటినుంచి బయటకు రావడానికే సిగ్గుపడుతున్నారు. కేన్సర్‌తో పో రాడే సమయంలో మానసికంగా, శారీరకంగా గట్టిగా ఉండాలి. మానసికంగా కుచించుకుపో తే కష్టం. స్త్రీలు జుట్టును ఇష్టపడతారు. వారికి సరైన విగ్గు ఇవ్వగలిగితే ఆత్మవిశ్వాసం వస్తుందని పనిలోకి దిగాను’ అంటుంది హరిప్రియ నాయక్. ఆమె 2021లో ‘మిషన్ స్మైల్ ఫర్ ది కేన్సర్ ఫైటర్స్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని శిరోజాల సేకరణ కోసం మొదలుపెట్టింది. శిరోజాల దానం కోసం ప్రచారం కొనసాగించింది. 9 మంది సాయం ఒకరికి మేలు ‘సింథటిక్ విగ్గులు త్వరగా పాడవుతాయి. వాటివల్ల చర్మ సంబంధ ఇబ్బందులు వస్తాయి. అదే సహజమైన జుట్టుతో చేసిన విగ్గులు మన్నికగా ఉంటాయి. ఇందుకోసం ఎవరైనా సరే శిరోజాలు ఇవ్వొచ్చు. కాని 12 అంగుళాల కంటే ఎక్కువ పోడవు ఉన్నప్పుడే అవి ఉపయోగపడతాయి. 9 మంది ఇచ్చిన జుట్టుతో ఒక్క విగ్గు తయారవుతుంది. మా ప్రచారం ఒడిస్సాలో మాత్రమే కాదు జార్ఖండ్‌లో కూడా కొనసాగుతోంది. ఒక ఆరేళ్ల పాప మాకు శిరోజాలు ఇవ్వడం ఒక రికార్డు’ అంటుంది హరిప్రియ నాయక్. హెయిర్ డొనేషన్ ఒడిశా ‘హెయిర్ డొనేషన్ ఒడిశా’ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది హరిప్రియ నాయక్. వాలెంటీర్లు పని చేసేవారిని ఆహ్వానిస్తుంది. ఇప్పటికి 150 మంది వాలెంటీర్లు ఆమెతోపాటు పని చేస్తున్నారు. శిరోజాలు దానం చేసే వారి నుంచి వాటిని సేకరించి హైదరాబాదులోని ‘హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఫర్ కేన్సర్ పేషెంట్స్’ సంస్థకు పంపుతారు. అది ఉచితంగా విగ్గులు తయారు చేసి ఇస్తుంది. వాటిని కేన్సర్ ఫైటర్స్‌కు అందజేస్తారు.‘నా జుట్టు తగినంత పెరిగిన ప్రతిసారీ నేను దానం చేస్తుంటాను. మీరు కూడా చేయండి. ఇది కూడా పుణ్యకార్యమే’ అంటుంది హరిప్రియ నాయక్. -
ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై కిడ్నాప్ కేసు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై కిడ్నాప్ కేసు నమోదు నమోదైంది. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా.. ఓ కౌన్సిలర్‌ను ఎమ్మెల్యే కనకయ్య కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఎమెల్యే కోరం కనుకయ్య, మరో 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఇల్లందు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్‌పై అవిశ్వాస ఓటింగ్‌కు ముందు హైడ్రామా చోటుచేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాసం నేపథ్యంలో పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. ఛైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వరారావుపై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడానికి 17 మంది కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు. మరో ఇద్దరు కౌన్సిలర్లు ఆయనకు మద్దతు తెలిపితే అవిశ్వాసం వీగిపోతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ నాగేశ్వరరావును కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య బలవంతంగా లాక్కెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
213 మందికి ఇద్దరు ఎమ్మెల్యేలు.. చిన్న తండాకు పెద్ద తంటాలు!
హన్మకొండ: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని 71 ఇళ్లు, 213 మంది ఓటర్లు కలిగిన ఓ చిన్న తండాకు ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఐదవ వార్డు పరిధి లచ్చాతండా మధ్యలో సీసీ రోడ్డు ఉంటుంది. తండాలోకి వెళ్తుండగా కుడివైపున డోర్నకల్ మున్సిపాలిటీ ఐదవ వార్డు పరిధిలో 40 ఇళ్లు ఉండగా, 140 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తారు. రోడ్డుకు ఎడమ వైపున లచ్చాతండా ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం, బర్లగూడెం పరిధిలోని 10వ వార్డులో ఉండగా ఇక్కడ 31 ఇళ్లు, 73 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి ఓటర్లంతా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. తండాలో ఒకే కుటుంబానికి చెందిన వారు విడిపోయి రోడ్డుకు ఇరు పక్కల ఇళ్లు నిర్మించుకోవడంతో తండ్రి కుటుంబం ఓ నియోజకవర్గంలో, కుమారుడి కుటుంబం మరో నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఈ తండాకు డోర్నకల్ నియోజకవర్గం నుంచి డీఎస్ రెడ్యానాయక్, ఇల్లెందు నుంచి హరిప్రియ ప్రాతినిథ్యం వహించారు. ఎర్రమట్టితండా.. డోర్నకల్ మున్సిపాలిటీ మూడో వార్డు పరిధిలోని ఎర్రమట్టి తండా, గార్ల మండలం రాజుతండా గ్రా మపంచాయతీలు కలిసి ఉన్నాయి. రోడ్డుకు ఓ వైపు ఎర్రమట్టితండా, మరో వైపు రాజుతండా ఉండగా రెండు తండాలను విడదీస్తూ మధ్యలో రోడ్డు ఉంది. అయితే తండాలు కలిసి ఉన్నా డోర్నకల్, ఇల్లెందు నియోజకవర్గాల పరిధిలో ఉండడం గమనార్హం. -
అసమ్మతి స్వరాన్ని తట్టుకోగలరా?
ఇల్లందు బీఆర్ఎస్ అసమ్మతి మంటలు కాకరేపుతున్నాయి.. ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి మధ్య వర్గపోరు పార్టీకి తలనొప్పిగా మారింది. ఇద్దరి మధ్యా గొడవతో హైకమాండ్ సీన్లోకి ఎంటరైంది. అసమ్మతి నేతల బుజ్జగింపులూ మొదలయ్యాయి. ఇంతకీ అసలక్కడ ఇంత రచ్చ జరగటానికి కారణం ఎవరు?. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది? ఇల్లందు నియోజకవర్గం అధికార పార్టీలో అసమ్మతి రాగం సెగలు రేపుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్ తీరుపై అసమ్మతి వర్గం భగ్గుమంటోంది. ఇల్లెందులో ఇంటిపోరుకు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు నాయకత్వం వహిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేసినా ఎమ్మేల్యే దంపతుల వల్ల పార్టీ బద్నాం అయిందని అందుకే హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దంటూ అసమ్మతి నేతలు అధిష్టానం వద్ద పెద్ద పంచాయతీ పెట్టారు. షాడో ఎమ్మెల్యేగా పని చేస్తోన్న హరిసింగ్ కాంట్రాక్ట్ పనుల్లో కమీషన్లు, సింగరేణి కోల్ ట్రాన్స్ పోర్ట్ లో వాటాల వసూళ్లు మొదలెట్టారని సొంతపార్టీ నేతలు హైకమాండ్‌కు కంప్లయింట్ చేశారు. హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దంటూ 120 మంది స్థానిక నేతలతో కలసి మంత్రి హరీష్‌ను కలిశారు. అసమ్మతి నేతల ఫిర్యాదులతో హరిప్రియ వర్గం తెగ టెన్షన్ పడిపోయింది. బీ ఫామ్ దక్కకపోతే ఏట్లా ఆని ఆలోచించింది. అయితే లాస్ట్ మినిట్‌లో లక్కీగా టికెట్ హరిప్రియకే దక్కింది. ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టిన రాజ్యసభ మెంబర్ రవిచంద్ర బుజ్జగింపులు మొదలుపెట్టినా పెద్దగా ఫలితం లేదని లోకల్ టాక్. తాము వద్దన్నా హరిప్రియకే టికెట్ ఇవ్వటం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న దమ్మాలపాటి తన అసమ్మతి స్వరం మరింత పెంచారు. దీనికి తోడు హరిప్రియ భర్త హరి సింగ్ తో వస్తున్న తలనొప్పులను సర్దుబాటు చేయటం రవిచంద్రకు తలకు మించిన భారంగా మారింది.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి ఆరు నెలల్లోనే అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు ఎమ్మెల్యే హరిప్రియ...ఇల్లందు నియోజకవర్గానికి బస్ డిపో, సివిల్ ఆస్పత్రి అప్ గ్రేడ్, మినహా నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి జరగలేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. బయ్యారం స్టీల్ ప్లాంట్, ఇల్లందులో మూతపడ్డ రైల్వే స్టేషన్ పున ప్రారంభం, సీతారామ ప్రాజెక్టు రీ డిజైన్ లాంటి హామీలు అలాగే మిగిలిపోవడంతో జనం ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఇవే కీలక అంశాలు కాబోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇల్లందు అధికార పార్టీ లో వ్యవహారం ఇలా ఉంటే ... కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అంతకంటే ఎక్కువే ఉంది. నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్ బ్యాంకు ఉన్నా పార్టీని ముందుండి నడిపించే సరైన లీడర్ లేకపోవటం పెద్ద మైనస్ పాయింట్. పొంగులేటి అనుచరుడు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరటం ఉపయోగకరమే అంటున్నారు. ఆయనకే టికెట్ ఖాయం కానుందన్న ప్రచారం మొదలవడంతో కనకయ్య గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారు. అఫిషియల్‌గా హైకమాండ్ నుంచి బిఫామ్ పుచ్చుకున్నాక ప్రచారంలో స్పీడు పెంచాలని కనకయ్య ప్లాన్. మొత్తానికి ఈసారి ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల మధ్య రసవత్తరమైన ఖాయమంటున్నారు స్థానికులు. -
హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దు
ఇల్లెందు: ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు మరోమారు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వొద్దని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అధిష్టానాన్ని కోరారు. ఎమ్మెల్యే భర్త, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బానోతు హరిసింగ్ అరాచకాలు మితిమీరాయని, సెటిల్మెంట్లు, భూదందాలేకాక సొంత పార్టీ నేతలపైనే కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో హరిప్రియకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని గెలిపించుకుంటామని అన్నారు. ఈ మేరకు శనివారంరాత్రి ఇల్లెందులోని మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గృహంలో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న ఇల్లెందు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నేతలు సమావేశమయ్యారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ అ«ధికార ప్రతినిధి పులిగళ్ల మాధవరావు, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, ఇల్లెందు, బయ్యారం సొసైటీల చైర్మన్లు మెట్ల కృష్ణ, మూల మధుకర్‌రెడ్డి, మహబూబాబాద్ జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు తండ్రి శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు. ఇల్లెందులో ఎమ్మెల్యే భర్త తీరుతో బీఆర్ఎస్కు నష్టం చేకూరుతోందని తెలిపారు. గత ఐదేళ్లలో ఇల్లెందు అభివృద్ధి నిధులను ఇతర ప్రాంతాల కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కమీషన్లు పొందారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులను పక్కనబెట్టి పీఆర్ శాఖ ఇంజనీర్లతో సుమారు రూ.30 కోట్ల నిధులతో పనులు చేయించాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీని కాపాడుకునేందుకు సీఎంను కలిసే అవకాశం తమకు లేనందున మీడియా ద్వారా ప్రజలు, సీఎం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. అభ్యరి్ధని మారిస్తే తప్ప ఇల్లెందులో పార్టీ గెలిచే అవకాశం లేదని, అయితే, ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఆదేశాలను శిరసా వహిస్తామని స్పష్టం చేశారు. -
ఇల్లెందు (ఎస్టి) నియోజకవర్గంలో ఈ సారి గెలుపు ఎవరిదో..!
ఇల్లెందు (ఎస్టి) నియోజకవర్గం ఇల్లెందు గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన బానోత్ హరిప్రియ నాయక్ గెలుపొందారు. ఆమెకు 2907 ఓట్ల ఆదిక్యత వచ్చింది. ఇల్లెందు సిటింగ్ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్ది కోరం కనకయ్యపై ఆమె విజయం సాదించారు. గతంలో కనకయ్య కూడా కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచి టిఆర్ఎస్లో చేరగా, ఈసారి కూడా హరిప్రియ కూడా కాంగ్రెస్ ఐకి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్లో చేరిపోయారు. హరిప్రియకు 70259 ఓట్లు రాగా, కోరం కనకయ్యకు 67352 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్‌గా పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు 12900 ఓట్లు వచ్చాయి. నరసయ్య గతంలో ఐదుసార్లు ఇల్లెందులో గెలిచారు. కాని ఇప్పుడు మూడో స్థానానికి పరిమితం అయ్యారు. చాలాకాలం తర్వాత 2014లో ఇల్లందులో కాంగ్రెస్ ఐ అభ్యర్ధి విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున పోటీచేసిన కోరం కనకయ్య తన సమీప టిడిపి ప్రత్యర్ధి బాణోత్ హరిప్రియను 11507 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. కాని ఆ తర్వాత కొద్ది కాలానికే కనకయ్య అదికార టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. 2014లో టిఆర్ఎస్ అభ్యర్ధి ఊకే అబ్బయ్యకు 20865 ఓట్లు వచ్చాయి. 2018లో హరిప్రియ కాంగ్రెస్ ఐ పక్షాన గెలవడం విశేషం. 1972 తర్వాత ఇల్లందులో అంటే నలభై రెండు ఏళ్ల తర్వాత 2014లో కాంగ్రెస్ ఐ గెలవడం విశేషం. 2009లో టిడిపి పక్షాన ఇల్లెందు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఊకే అబ్బయ్యకు 2014లో టిక్కెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన టిఆర్ఎస్లో చేరారు. అంతకుముందు అబ్బయ్య సిపిఐ పక్షాన రెండుసార్లు (బూర్గంపాడు, ఇల్లందు)లలో గెలిచి, తదుపరి టిడిపి పక్షాన గెలిచారు. 2009లో ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీచేసిన శంకర్ నాయక్ 2014లో టిఆర్ఎస్ తరపున పినపాకలో పోటీచేసి ఓడిపోయారు. ఇల్లెందులో అత్యధికంగా సిపిఎం ఎమ్ఎల్ న్యూడెమొక్రసి నేత గుమ్మడి నరసయ్య ఐదుసార్లు గెలుపొందారు. ఇల్లెందు నియోజకవర్గం 1952, 57లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. కమ్యూనిస్టు నాయకుడు కె.ఎల్. నరసింహారావు ఆ రెండుసార్లే కాక, 1962లో కూడా గెలిచారు. 1978 నుంచి రిజర్వు అయిన తర్వాత ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు.తెలంగాణ ఆవిర్బావం తర్వాత తొలిసారి 2014, 2018లలో గెలిచింది. కానీ గెలిచినవారు కాంగ్రెస్‌ను వదలి టిఆర్ఎస్లో చేరిపోయారు. ఆరుసార్లు ఇండిపెండెంట్లు గెలవడం కూడా ఒక రికార్డుగానే తీసుకోవాలి. జనరల్ నియోజక వర్గంగా ఉన్నప్పుడు ఒక కమ్మ, నాలుగుసార్లు బ్రాహ్మణ సామాజికవర్గం గెలుపొందింది. పదకుండుసార్లుగా గిరిజనులు గెలుస్తున్నారు. ఇల్లెందు (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కేజీఎఫ్ విలన్‌ను పెళ్లాడిన హీరోయిన్.. ఫోటోలు వైరల్
'పిల్ల జమీందార్' హీరోయిన్ హరిప్రియ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. కేజీఎఫ్ సినిమాలో విలన్‌గా నటించిన వశిష్ట సింహాతో కలిసి ఆమె ఏడుడుగులు వేసింది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట మైసూరులోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. శివరాజ్‌కుమార్, డాలీ ధనంజయ్, అమృత అయ్యంగార్ తదితర సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కన్నడ బ్యూటీ హరిప్రియకు తెలుగు పరిశ్రమతోనూ మంచి అనుబంధం ఉంది. తకిట తకిట సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు నాని సరసన పిల్ల జమిందార్ సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలయ్యతో జై సింహ, వరుణ్ సందేశ్‌తో ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ వంటి నటించింది.మరోవైపు వశిష్ట సింహా ఆర్య లవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. రాజా హులి, రుద్ర తాండవలో ప్రధాన ప్రతినాయకుడిగా మెప్పించారు. కేజీఎఫ్‌లో విలన్ పాత్ర పోషించారు. View this post on Instagram A post shared by 𝐻𝒶𝓇𝒾𝒫𝓇𝓇𝒾𝓎𝒶 𝐹𝒸 (@hariprriyafc) -
కేజీఎఫ్ విలన్‌తో హీరోయిన్ ఎంగేజ్మెంట్.. వీడియో వైరల్
మరో ప్రేమజంట పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయింది. కొన్నేళ్లుగా డేటింగ్లో మునిగితేలిన జంట వివాహబంధంలోకి అడుగు పెట్టనుంది. కన్నడ నటుడు వశిష్ట సింహ, నటి హరిప్రియ ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ప్రేమజంట. మా జంటను ఆశీర్వదించండి అంటూ వశిష్ట సింహ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. వీరిద్దరి డేటింగ్‌పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇటీవలే బెంగళూరు ఎయిర్‌పోర్టులో వశిష్ట సింహ, హరిప్రియ ఒక్కసారిగా మెరిశారు. ఇద్దరు చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. పెళ్లికి సంబంధించి షాపింగ్ కోసమే దుబాయ్‌కి వెళ్లి వచ్చినట్లు వార్తలు వైరలయ్యాయి. కాగా వశిష్ట సింహ, హరిప్రియ ఓ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. తొలిచూపులోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కొద్ది రోజుల క్రితమే వశిష్ట తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. హరిప్రియ కన్నడలో నటిగా మంచిపేరు సంపాదించారు. ఉగ్రమ్, రన్న, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ, బెల్ బాటమ్ చిత్రాలతో ఫేమ్ సాధించారు. మరోవైపు సింహా ఆర్య లవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. రాజా హులి, రుద్ర తాండవలో ప్రధాన ప్రతినాయకుడిగా మెప్పించారు. కేజీఎఫ్‌లో విలన్ పాత్ర పోషించారు. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) -
కుక్క పిల్ల కారణంగానే ఆ హీరోతో ప్రేమలో పడ్డా: హీరోయిన్
‘తకిట తకిట’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచమైంది కన్నడ బ్యూటీ హరిప్రియ. ఆ తర్వాత నానితో పిల్ల జమీందార్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో హరిప్రియకు వరుస అవకాశాలు వచ్చాయి. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా చిత్రాల తర్వాత ఏకంగా నటసింహం బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది. ‘ జై సింహా’లో బాలయ్య సరసన నటించి,మెప్పించింది. ఆ సినిమా తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు కానీ.. కన్నడలో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్లింది. షబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, శ్రీమురళి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఈ క్రమంలో తన సహచర నటుడు వశిష్ట సింహతో ప్రేమలో పడింది. ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా తన లవ్‌స్టోరీని రివీల్ చేసింది ఈ కన్నడ బ్యూటీ. ఓ కుక్కపిల్ల కారణంగా తాను వశిష్టతో ప్రేమలో పడిపోయానని చెప్పుకొచ్చింది. ‘నా దగ్గర లక్కీ, హ్యాపీ అనే రెండు కుక్క పిల్లలు ఉండేవి. వాటిలో లక్కీ అనే కుక్క చనిపోయింది. దీంతో హ్యాపీ ఒంటరైపోయింది. అలాంటి సమయంలో వశిష్ట సింహం నాకు ఓ కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు క్రిస్టల్. కొత్తగా వచ్చిన క్రిస్టల్‌తో హ్యాపీ కలిసిపోయింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే క్రిస్టల్‌ని బహుమతిగా ఇచ్చినప్పుడు.. వశిష్ట ఓ సందేశాన్ని కూడా పంపించాడు. క్రిస్టల్ పొట్టపై గుండె ఆకారంలో ఓ మచ్చ ఉంది. క్రిస్టల్‌తో పాటు ఆ మచ్చ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది. అలా మా ప్రేమకు క్రిస్టల్ కారణమైంది’ అని హరిప్రియ తన ప్రేమ కహానిని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Hariprriya (@iamhariprriya) -
Khammam: అమ్మానాన్న లేకున్నా... నేనున్నా
సాక్షి, ఇల్లెందు(ఖమ్మం): అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులకు నేనున్నా అని గతంలో ప్రకటించిన ఎమ్మెల్యే ఇప్పుడు వారిని స్వయంగా తీసుకెళ్లి పాఠశాలలో చేర్పించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆదర్శంగా నిలిచారు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని 13వ నంబర్ బస్తీకి చెందిన భట్టు గణేశ్ గొంతు కేన్సర్‌తో 2018లో, ఆయన భార్య స్రవంతి కిడ్నీ సమస్యతో మూడు నెలల క్రితం మృతి చెందారు. దీంతో వారి ఇద్దరు పిల్లలు కృషన్, హరిప్రియ పోషణభారం అమ్మమ్మ నాగమణిపై పడింది. వీరు ఓ చిన్న రేకుల షెడ్డులో నివసిస్తున్నారు. ఈ విషయాన్ని గణేశ్ మిత్రుడు ఫణి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా తెలియజేయగా, ఆయన స్పందిస్తూ పిల్లల బాధ్యత చూడాలని ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా కలెక్టర్ డి.అనుదీప్‌లకు సూచించారు. దీంతో అప్పట్లోనే ఎమ్మెల్యే చిన్నారుల ఇంటికి వెళ్లి చదువు, పోషణ బాధ్యత స్వీకరించడంతోపాటు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి వారి బాధ్యత చూస్తున్న ఎమ్మెల్యే, తాజాగా పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో బుధవారం చిన్నారులిద్దరినీ తీసుకెళ్లి ఇల్లెందులోని మార్గదర్శిని ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 1, 3వ తరగతుల్లో చేర్పించి పుస్తకాలు, దుస్తులు అందజేశారు. ఆమె వెంట మార్కెట్ చైర్మన్ హరిసింగ్ నాయక్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. చదవండి: అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ -
కన్నడ బ్యూటీ హరిప్రియ లేటెస్ట్ ఫోటోలు
-
కరోనా అనుమానానికి గర్భిణి బలి!
హన్మకొండ చౌరస్తా: కరోనా వైరస్ సోకిందనే అనుమానం ఓ గర్భిణి ప్రాణాలను బలిగొంది. మృత శిశువుతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు అత్యవసర వైద్యం అందించాల్సిన వైద్యులు.. కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితం కోసం ఎదురుచూశారు. దీంతో 12 గంటల వేదన అనంతరం ఆమె తుదిశ్వాస విడిచింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన హరిప్రియ ఎనిమిది నెలల గర్భవతి. రెండు రోజుల క్రితం నొప్పులతో బాధపడుతున్న ఆమెను భర్త నాగరాజు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించాడు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. గర్భంలో శిశువు మృతి చెందిందని గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి (జీఎంహెచ్)కి వెళ్లాలని సూచించారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో హుటాహుటిన జీఎంహెచ్‌కు తీసుకెళ్లారు. అప్పటికే హరిప్రియ తీవ్ర ఆయాసంతో బాధ పడుతుండగా కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో సిబ్బంది ముట్టుకోవడానికి కూడా సాహసించలేదని భర్త నాగరాజు రోదిస్తూ తెలిపాడు. వైరస్ నిర్ధారణ కోసం నమూనాలు తీసుకుని పంపించారని, రాత్రంతా చికిత్స చేయకపోవడంతో హరిప్రియ తీవ్ర ఆయాసంతో నరకయాతన అనుభవించిందని పేర్కొన్నాడు. తీరా.. శుక్రవారం ఉదయం 9 గంటలకు వైద్య సిబ్బంది ‘చావు’కబురు చెప్పారని నాగరాజు రోదిస్తూ చెప్పాడు. వైద్యులు సకాలంలో చికిత్స చేసి ఉంటే తన భార్య బతికేదని పేర్కొన్నాడు. వైరస్ అనుమానం ఉంటే చికిత్స చేయరా? అని నిలదీశాడు. చికిత్స చేశాం: హరిప్రియను ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పటికే గర్భంలోని శిశువు మృతి చెందిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమా సరళాదేవి అన్నారు. అప్పటికే హరిప్రియ బీపీ, ఆయాసంతో బాధపడుతోందని, చికిత్స అందిస్తున్న క్రమంలో పల్మనరీ ఎంబాలిజం సమస్య ఎదురైందన్నారు. గర్భంలో మృత శిశువు, బీపీ ఎక్కువగా ఉన్న వారికి ఈ సమస్య వస్తుందన్నారు. తద్వారా రక్తం గడ్డకట్టి ఊపిరితిత్తుల్లోకి చేరడం కారణంగా ఆమె చనిపోయిందని తెలిపారు. -
ఆ ముద్దుతో పోలికే లేదు
‘రష్మికా మండన్నా ముద్దుకి, నా ముద్దుకి అస్సలు పోలికే లేదు’ అంటున్నారు కథానాయిక హరిప్రియ. ‘తకిట తకిట, పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, జై సింహా’ వంటి చిత్రాల్లో నటించారీ కన్నడ బ్యూటీ. ‘జై సింహా’ సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించని హరిప్రియ కన్నడలో మాత్రం వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు. తేజస్వి దర్శకత్వంలో హరిప్రియ, సృజన్ లోకేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఎల్లిదే ఇల్లితనకా’ శుక్రవారం (11) విడుదలైంది. ఈ సినిమాలో సృజన్, హరిప్రియల మధ్య ఓ ముద్దు సన్నివేశం ఉంది. ఇది కాస్తా ‘గీత గోవిందం’ చిత్రంలోని విజయ్ దేవరకొండ–రష్మికా మండన్నాల మధ్య వచ్చే ముద్దు సీన్లా ఉందని, ఆ సన్నివేశంలో రష్మికలా హరిప్రియ కూడా జీవించారంటూ సోషల్ మీడియాలో పోలికలు పెట్టారు. వీటి గురించి హరిప్రియ మాట్లాడుతూ– ‘‘నా సినిమాలను నా అభిమానులు, ప్రేక్షకులు వారి కుటుంబంతో సహా చూడాలనుకుంటాను. ఇప్పటి వరకూ రొమాంటిక్, ముద్దు సన్నివేశాల్లో నేను నటించలేదు. కాకపోతే ‘ఎల్లిదే ఇల్లితనకా’ చిత్రంలో కథకు అవసరం కాబట్టి ముద్దు సన్నివేశంలో పాల్గొన్నా. అయితే అది రష్మికా మండన్నాలా లిప్‌లాక్ సన్నివేశం కాదు. నాది మామూలు ముద్దే’’ అన్నారు. -
సేవలోనూ ‘సగం’
‘ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడం.. వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపడంలోనే తృప్తి ఉంటుంది. చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులు లేకపోయినా ఉన్నదాంట్లోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ.. రాజకీయ కార్యకలాపాలు నడిపేందుకు వెచ్చిస్తున్నా. విద్యా సంస్థలు ఉన్నా.. వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రజా సేవకే వినియోగిస్తున్నా. చిన్న వయసులోనే 2002లో ఇంటర్ పూర్తయి.. ఎంసెట్ పరీక్ష రాసిన వెంటనే పెళ్లి కావడం.. రాజకీయ నేపథ్యం లేకున్నా రాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చాను. పార్టీపరంగా.. పదవులపరంగా అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నా. నా భర్త హరిసింగ్ సహకారంతోనే నిత్యం ప్రజల మధ్య ఉంటూ రాజకీయంగా రాణించగలుగుతున్నా. ఉన్నత విద్యను అభ్యసించడం.. చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడంతో బాధ్యతలు మరింతగా పెరిగాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ.. కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం కేటాయిస్తూ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నా. నా భర్త బానోతు హరిసింగ్‌నాయక్ బండికి ఇరుసులా మారి రాజకీయంగా నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. రాజకీయ సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు’. ‘సాక్షి’ పర్సనల్ టైమ్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియనాయక్ ఇల్లెందు: మాది కొత్తగూడెంలోని బాబు క్యాంప్ ప్రాంతం. నాన్న బాదావత్ సీతారాంనాయక్ సింగరేణిలో ఉద్యోగం చేసేవారు. అమ్మ దర్జన్ గృహిణి. 2002లో ఇంటర్ పూర్తయి, ఎంసెట్ రాసిన వెంటనే టేకులపల్లికి చెందిన హరిసింగ్ నాయక్‌తో వివాహం అయింది. పెళ్లయ్యాకే భర్త హరిసింగ్ ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశాను. 2006లో టేకులపల్లిలో హరిసింగ్ విద్యాసంస్థలను ప్రారంభించారు. క్రమంగా హైదరాబాద్‌లోనూ ప్రైవేటు స్కూల్ పెట్టాం. నాతోపాటు మా బంధువుల పిల్లలం అందరం కలిసి హైదరాబాద్‌లో ఉండేవాళ్లం. స్కూల్లో బోధించడంతోపాటు చదువు కోసం కాలేజీకి వెళ్లడం, అందరికీ వంట చేయడం.. ఇలా రోజంతా కష్టపడేదాన్ని. టేకులపల్లి, హైదరాబాద్‌లో కలిపి ఇప్పుడు నాలుగు ప్రైవేటు స్కూళ్లు, నాలుగు జూనియర్ కాలేజీలు ఎనిమిది బ్రాంచీలు ఉన్నాయి. మొత్తం 3,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో అనేక మంది పేద పిల్లలకు ఉచితంగానే విద్యా బోధన చేస్తున్నాం. ఉన్నత విద్యతోనే రాజకీయాల్లోకి.. 2004లో ఇల్లెందు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి కల్పనాబాయి పోటీ చేశారు. ఆమె సోదరుడు నా భర్త హరిసింగ్‌నాయక్‌కు మిత్రుడు కావడంతో ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రభావంతోనే హరిసింగ్‌కు రాజకీయాలపై దృష్టి మళ్లింది. 2008లో టీడీపీలో చేరారు. అనతి కాలంలోనే తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ టీడీపీ నుంచి ఊకె అబ్బయ్యకు అవకాశం రావడంతో.. హరిసింగ్ రెబెల్‌గా నామినేషన్ వేశారు. అప్పుడు ఎన్నికల ప్రచారం కోసం చంద్రబాబునాయుడు ఇల్లెందుకు వచ్చినప్పుడు హరిసింగ్‌తో మాట్లాడి.. ‘నీకు మంచి భవిష్యత్ ఉంటుంది.. పోటీనుంచి తప్పుకో’ అని సూచించారు. అప్పటికే నామినేషన్ విత్‌డ్రాకు సమయం అయిపోవడంతో బరిలో ఉంటూనే అబ్బయ్య గెలుపు కోసం పనిచేశారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు మళ్లీ విద్యాసంస్థలపై దృష్టి పెట్టాం. వాటినే పటిష్టం చేసి, అందులోనే నిలదొక్కుకోవాలనుకున్నాం. ఇంతలోనే 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇల్లెందు అభ్యర్థిని మార్చాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో ఉన్నత విద్యావంతురాలైన నన్ను బరిలోకి దింపితే బాగుంటుందని, గెలిచే అవకాశం ఉంటుందని నాటి బయ్యారం మండల టీడీపీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. తుమ్మల ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పడంతో ఇల్లెందు టికెట్ నాకు ఇవ్వాలని నిర్ణయించారు. టికెట్ ఇవ్వడానికి ఐదు గంటల ముందు మమ్మల్ని హైదరాబాద్‌కు రమ్మని ఫోన్ వచ్చింది. దీంతో హడావిడిగా వెళ్లి నాటి సీఎం చంద్రబాబును కలిశాము. ఆయనతో మాట్లాడిన తర్వాత టికెట్ నాకే ఇస్తున్నారనే సంకేతం వచ్చింది. మరుసటి రోజు పేపర్లో వార్త చూసి వచ్చి నామినేషన్ వేశాం. అయితే తొలిసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఐదేళ్ల పాటు టీడీపీ సమన్వయకర్తగా పని చేసి, అనేక సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాం. 2017లో కాంగ్రెస్‌లోకి.. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ బలహీనపడడంతో 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో చేరాం. గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీచేసి, ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మళ్లీ పార్టీ మారాల్సి వచ్చింది. అయితే మేము రాజకీయాల్లోకి వచ్చి సంపాదించింది ఏమీ లేదు. ప్రస్తుతం మా విద్యాసంస్థలను మా బంధువుల పిల్లలే నిర్వహిస్తున్నారు. వాటిపై వచ్చే ఆదాయాన్ని ఇక్కడ ఖర్చు చేస్తున్నాం. ఎమ్మెల్యేగా నాకు ప్రతి నెలా వచ్చే జీతంతో పాటు విద్యాసంస్థల డబ్బు కూడా రాజకీయాలు నడిపేందుకే వెచ్చిస్తున్నాం. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడంలో ఎంతో ఆనందం ఉంది. రాజకీయాలతో పాటు కుటుంబ సమస్యలను కూడా మేమిద్దరం సమానంగా పంచుకుంటూ ముందుకు సాగుతున్నాం. నాకు రాజకీయాలపై అవగాహన లేకున్నా హరిసింగ్ సహకారంతోనే రాణించగలుగుతున్నా. ఉన్నత విద్యావంతురాలిని కావడం, చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడంతో అందరూ ఎంతో అభిమానం చూపుతున్నారు. నేను సభలు, సమావేశాలకు వెళ్లినా.. అక్కడ ఏ మాట్లాడాలనేది ఇద్దరం చర్చించుకుంటాం. రాజకీయాలు, కుటుంబ విషయాల్లోనూ ఇద్దరిది ఒకే మాట–ఒకే బాట కావడం వల్లే దిగ్విజయంగా ముందుకు సాగుతున్నా. రాజకీయ జీవితానికి అలవాటు పడి విహారయాత్రలు కూడా మరిచిపోయాం. అయితే రాజకీయాల్లో ఉండాలనే బలమైన కోరికతో వచ్చిన భర్త హరిసింగ్ తన కుర్చీని నాకు త్యాగం చేశారు. -
ఎమ్మెల్యే హరిప్రియను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
-
ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియపై రాళ్లదాడి
సాక్షి, ఖమ్మం : ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లదాడికి యత్నించారు. కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి ఈ మధ్యనే టీఆర్ఎస్లో చేరిన హరిప్రియ శనివారం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఆమెను అడ్డుకున్నారు. ఈ సంఘటన ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామంలో చోటుచేసుందకుంది. ఎమ్మెల్యేను అడ్డుకున్ననేపథ్యంలో వారితో టీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరువర్గాలు రాళ్లతో దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితి అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నా వెనుక ప్రజాబలముంది: హరిప్రియ దాడి ఘటనపై ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ..‘ నెల రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరుగుతున్నా. అలాంటిది ఎక్కడాలేని ఘటననలు కామేపల్లి మండలంలో జరుగుతున్నాయి. 11మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చారు. మరి ఎక్కడా ఇటువంటి సంఘటనలు జరగలేదు. నాపై దాడి చేసినవారిపై ప్రజలు తిరగబడ్డారు. నా వెనుక ప్రజా బలముంది. ఈ రోజు జరిగిన దాడి గిరిజన మహిళల మీద జరిగిన దాడి. టీఆర్ఎస్ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. ఈ ఘటన ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసు’ అని అన్నారు. -
అందుబాటులో ఉంటా.. ఆశీర్వదించండి
ఇల్లెందు: నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించటమే తన చిరకాల కోరికని, ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవటం కోసమే మీ ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించాలని మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత కోరారు. ఆదివారం రాత్రి ఇల్లెందులోని కరెంటాఫీఎస్ నుంచి గోవింద్ సెంటర్ మీదుగా కొత్త బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌షోలో ఎంపీ అభ్యర్థి కవితతో పాటు ఎమ్మెల్సీ, పార్లమెంటు ఇన్చార్జ్ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్, జీసీసీ చైర్మన్ మోహన్‌గాంధీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్పర్సన్ మడత రమలు ప్రజలకు అభివాదం చేశారు. ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు తన సేవలు అందించాలనే తన చిరకాల కోరిక ఈ విధంగా తీరనుందన్నారు. సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని వేడుకున్నారు. ఇక్కడి అన్ని వర్గాలు, గ్రూపుల సహకారం తీసుకుంటానని, అందరిని కలుపుకుని ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. బయ్యారంలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటు, సీతారామా ప్రాజెక్టు నిర్మాణం, ఇల్లెందు రైలు సమస్యలతో పాటు బస్‌డిపో ఏర్పాటు లాంటి సమస్యలు తీరాలంటే టీఆర్ఎస్ ఎంపీ ఉంటేనే సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు మడత వెంకట్‌గౌడ్, దమ్మాలపాటి వెంకటేశ్వర రావు, పరుచూరి వెంకటేశ్వరరావు, కొక్కు నాగేశ్వరరావు, బానోతు హరిసింగ్ నాయక్, అక్కిరాజు గణేష్, లకావత్ దేవీలాల్ నాయక్, కనగాల పేరయ్య, సుధీర్‌తోత్లా, మండల రాము, బోళ్ల సూర్యం, సూర్నబాక సత్యనారాయణ, బి. లాల్ సింగ్ నాయక్, భావ్‌సింగ్ నాయక్, బానోతు స్వామినాయక్, తోటలలిత శారధ, కొక్కు సరిత తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు మరో షాక్.. ఎమ్మెల్యే హరిప్రియ రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ’హస్తం’ కు చేయిచ్చి కారు ఎక్కేందుకు సిద్ధమయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు షాక్.. టీఆర్ఎస్లోకి సబితా ఇంద్రారెడ్డి..! తాజాగా ఖమ్మం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. అవసరం అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ బీఫాంపై ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని తెలిపారు. మరోవైపు మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరికపై ఇప్పటికే ఆమె...టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో చేరికపై రేపు ఉదయం (సోమవారం) తన అనుచరులతో సబితారెడ్డి సమావేశం కానున్నారు. కార్యకర్తల భేటీ అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉంది. కాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో పార్టీ నేతలు టీఆర్ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’ కు చిక్కడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో గుబులు రేపుతోంది. పార్టీ మారుతున్నట్లు వార్తల నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డితో కాంగ్రెస్ నేతలు భేటీ బుజ్జగింపుల పర్వం చేపట్టినా అవి సఫలం కాలేదని తెలుస్తోంది. -
చాలా సంతోషంగా ఉంది
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలుగా ఎన్నికై శాసనసభకు రావడం చాలా సంతోషంగా ఉందని తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారు. ప్రజలు తమపై నమ్మకాన్ని ఉంచి నియోజకవర్గ ప్రతినిధులుగా అసెంబ్లీకి పంపారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని చెప్పారు. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన హర్షవర్ధన్‌రెడ్డి(కొల్లాపూర్), హరిప్రియానాయక్(ఇల్లెందు), పైలట్ రోహిత్‌రెడ్డి(తాండూరు) గురువారం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. పెండింగ్ సమస్యలపై పోరాడుతా.. ప్రజలు నాకిచ్చిన అరుదైన అవకాశం ఇది. కొల్లాపూర్ ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. నియోజకవర్గంలో 20 సంవత్సరాలకుపైగా కొన్ని సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు శాసనసభ్యునిగా పోరాటం చేస్తాను. కొల్లాపూర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను.’ – హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే, కొల్లాపూర్ నమ్మకాన్ని వమ్ము చేయను ‘ఈ రోజు కోసం పదేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. ఆ రోజు వచ్చింది. తాండూరు నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తా.’ – రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్యే, తాండూరు పోడు సమస్య పరిష్కారానికి కృషి చాలా సంతోషంగా ఉంది. ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. మా నియోజకవర్గంలో పోడుభూముల సమస్య ఉంది. దీన్ని పరిష్కరించేందుకు ఎమ్మెల్యేగా కృషి చేస్తా. బయ్యారం స్టీలు ప్లాంటు ఏర్పాటుతోపాటు స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళతా. – హరిప్రియ, ఎమ్మెల్యే, ఇల్లెందు -
డాటర్ ఆఫ్ పార్వతమ్మ
వైదేహీ.. పేరు కాస్త క్లాస్‌గా ఉంది కదా అమ్మాయి కూడా అలాగే ఉంటుందనుకోకండి. రఫ్ అండ్ టఫ్. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అంటే ఆ మాత్రం రఫ్‌నెస్ లేకపోతే ప్రొఫెషన్లో రాణించడం కష్టం. ‘తకిటతకిట, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా’.. రీసెంట్గా ‘జై సింహా’ సినిమాలతో తెలుగు తెరపై కనిపించారు కథానాయిక హరిప్రియ. తెలుగులో అప్పుడప్పుడూ నటించినప్పటికీ కన్నడలో ఆమె బిజీ. హరిప్రియ లేటెస్ట్గా నటించిన కన్నడ చిత్రం ‘డాటర్ ఆఫ్ పార్వతమ్మ’. సీనియర్ నటి సుమలత ఈ సినిమాలో పార్వతమ్మ క్యారెక్టర్ చేశారు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ౖవైదేహీ పాత్రలో హరిప్రియ నటించారు. చిత్రీకరణ పూర్తయింది. ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కించారట. ‘‘వండర్ఫుల్ యాక్ట్రస్ సుమలతగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు హరిప్రియ. త్వరలో ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. -
ఉగ్ర నరసింహ!
దాన.. వీర.. శూర.. కర్ణ... నరసింహుడతడు! కానీ, కత్తిపట్టి సింహంలా రంగంలోకి దూకాడో... శత్రువులు శరణు కోరాల్సిందే. సింహం ముందు లొంగిపోవాల్సిందే. దానవీర శూరకర్ణుడు లాంటి వ్యక్తి కసితో రగిలే నరసింహుడిలా ఎందుకు మారాడు? అసలేమైంది? ఉగ్ర నరసింహ అవతారంలో బాలకృష్ణ ఏం చేశారు? అనేది వచ్చే సంక్రాంతికి తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మిస్తున్న సినిమా ‘జై సింహా’. బుధవారం ఈ సినిమాలో బాలకృష్ణ ఫస్ట్ లుక్, టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఇటీవలే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్, సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లోని కంటైనర్ యార్డులో పూర్తి చేశారు. త్వరలో చిత్రీకరణ అంతా పూర్తి చేసి, సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నఈ చిత్రానికి కథ–మాటలు: యం. రత్నం, సంగీతం: చిరంతన్ భట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సి. వరుణ్‌కుమార్–సి. తేజ, సహనిర్మాత: సీవీ రావు. -
సింహా... జై సింహా!
అభిమానులు నందమూరి బాలకృష్ణను ముద్దుగా ఏమని పిలుచుకుంటారు? ‘నటసింహా’! ఈ పిలుపుకు తగ్గట్టు.. ‘సింహా’లో తెరపై సింహంలా బాలకృష్ణ నట విశ్వరూపమే చూపారు. ఇప్పుడు హీరోగా నటిస్తున్న 102వ సినిమాలో అంతకు మించి అనేలా ఉంటుందట! ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్, యాక్షన్, లవ్, కామెడీ.. బాలకృష్ణ నుంచి అభిమానులు ఆశించే హీరోయిజమ్‌తో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ‘జై సింహా’ టైటిల్‌ని ఖరారు చేశారని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారమ్. గతంలో ‘కర్ణ’తో పాటు కొన్ని టైటిల్స్‌ని పరిశీలించారు. అయితే... బాలకృష్ణ ఇమేజ్, కథను దృష్టిలో పెట్టుకుని ‘జై సింహా’ను ఫిక్స్ చేశారట! నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అరకులో జరుగుతోంది. ఈ చిత్రానికి కథ–మాటలు: ఎం. రత్నం, సంగీతం: చిరంతన్ భట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: వరుణ్–తేజ, సహనిర్మాత: సీవీ రావు. -
పెద్ద సైతాన్
విజయ్ రాఘవేంద్ర, హరిప్రియ జంటగా ఆదిరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘రణతంత్ర’. ఎస్. రమేశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి లతా మార్టోరి సమర్పణలో డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ వెంకట్రావ్ మార్టోరి ‘ఇది పెద్ద సైతాన్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. వెంకట్రావ్ మాట్లాడుతూ – ‘‘లవ్ అండ్ యాక్షన్ రొమాంటిక్ హారర్ మూవీ ఇది. తెలుగులో వచ్చిన హారర్ సినిమాలు పెద్ద సక్సెస్ అయ్యాయి. మా చిత్రం కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఆగస్టు 4న ఈ సినిమా విడుదల చేస్తాం. అలాగే మా బ్యానర్లో ‘మహాబలి’, గోలీసోడా’ వంటి చిత్రాల్ని కూడా రిలీజ్ చేస్తున్నాం. పెద్ద స్టార్ కాస్టింగ్‌తో తెలుగులో దసరాకి స్ట్రెయిట్ సినిమాను ప్రారంభించనున్నాం’’ అన్నారు. -
శ్రీమఠంలో సినీ నటి హరిప్రియ
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం సినీ నటి హరిప్రియ ఆదివారం మంత్రాలయం వచ్చారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆమెకు అధికారులు మఠం మర్యాదలతో స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మ ఆలయంలో అర్చనల అనంతరం రాఘవేంద్రస్వామి మూలబృందావనం దర్శించుకుని పూజలు, హారతులు పట్టారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు శేషవస్త్రాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, ఫల,పూల మంత్రాక్షింతలతో ఆశీర్వదించారు. తెలుగులో పిల్ల జమిందార్, తకిట తకిట, ఈ వర్షం సాక్షిగా, గలాట చిత్రాలు, కన్నడలో 16, తమిళంలో ఓ చిత్రంలో నటించినట్లు హరిప్రియ విలేకరులకు తెలిపారు. పిల్ల జమిందార్ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు లభించిందన్నారు.