ప్రేమికులు ఎలా ఉండాలి? | Ee Varsham Sakshiga is an upcoming Telugu Movie | Sakshi
Sakshi News home page

ప్రేమికులు ఎలా ఉండాలి?

Published Thu, Sep 19 2013 2:08 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ప్రేమికులు ఎలా ఉండాలి? - Sakshi

ప్రేమికులు ఎలా ఉండాలి?

వరుణ్‌సందేశ్, హరిప్రియ జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఈ వర్షం సాక్షిగా’. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై రమణ మొగిలి దర్శకత్వంలో బి. ఓబుల్‌సుబ్బారెడ్డి, శ్రీనివాస్ చవాకుల నిర్మిస్తున్నారు. 
 
 ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా వరుణ్‌సందేశ్ మాట్లాడుతూ -‘‘దర్శకుడు ఈ కథ చెప్పగానే ఎగ్జయిట్ అయ్యాను. ఎందుకంటే 1989 ఒరిస్సాలో వరదలొచ్చినప్పుడు నేను పుట్టాను. అందుకే మా నాన్నగారు నాకు వరుణ్ అని పేరు పెట్టారు’’ అని చెప్పారు. ఇందులో తన పాత్ర పేరు సీతామహాలక్ష్మీ అని, పరిణతి చెందిన అమ్మాయిగా చేశానని హరిప్రియ అన్నారు. 
 
 ప్రేమికులు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అని చెప్పే చిత్రం ఇది అని, ఇందులో ఐదు పాటలున్నాయని, యూనిట్ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుందని దర్శకుడు చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేశాం. అనిల్ గోపీరెడ్డి మంచి స్వరాలిచ్చారు. నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement