క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ చిత్రాలకు ఆడియెన్స్ ఎప్పుడూ మొగ్గు చూపుతూనే ఉంటారు. అలాంటి ఓ ఇంటెన్స్ జానర్ మూవీతో వరుణ్ సందేశ్ రాబోతున్నారు. వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం 'కానిస్టేబుల్'. ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్‌గా పరిచయం కానున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన రిలీజ్ చేశారు.
ఈ టీజర్ చూస్తుంటే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇచ్చేలా ఉంది. ఓ అమ్మాయి అతి దారుణంగా హత్యకు గురవ్వడం, ఆ హత్యను ఛేదించే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో వరుణ్ సందేశ్ కనిపించబోతున్నారని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక ఈ టీజర్‌లోని విజువల్స్, ఆర్ఆర్ క్రైమ్, థ్రిల్లర్ జానర్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. ఈ టీజర్‌తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. నాలుగు భాషల్లో ఈ టీజర్ అందుబాటులో ఉంది. వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు ఈ చిత్రంలో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment