Induvadana Teaser: ‘హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం’ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇందువదన’. ఎంఎస్‌ఆర్ దర్శకత్వం వహించారు. ఫర్నాజ్ శెట్టి హీరోయిన్. మాధవి ఆదుర్తి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథతో అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘ఇందువదన’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు.
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య కాలంలో నేను నటించిన సినిమా చూడాలనుకునేవారు మా తాతయ్య. కానీ, గత ఏడాది చనిపోయారు. అలా మా తాతయ్య కోరిక నెరవేరకపోవడం బాధగా ఉంది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇటీవలే విడుదలైన మా సినిమాలోని తొలి పాట యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడంతో పాటు చాట్‌బస్టర్‌గా నిలిచింది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: గిరిధర్, కెమెరా: బి మురళి కృష్ణ, సంగీతం: శివ కాకాని, లైన్ ప్రొడ్యూసర్స్: సూర్యతేజ ఉగ్గిరాల, వర్మ.
Comments
Please login to add a commentAdd a comment