అను ఇమ్మాన్యుయేల్ సైకలాజికల్ థ్రిల్లర్‌.. టీజర్ గ్లింప్స్ చూశారా? | Anu Emmanuel Latest Movie Boomerang Teaser Out Now | Sakshi
Sakshi News home page

Anu Emmanuel: అను ఇమ్మాన్యుయేల్ సైకలాజికల్ థ్రిల్లర్‌.. టీజర్ గ్లింప్స్ చూశారా?

Published Mon, Feb 24 2025 7:16 PM | Last Updated on Mon, Feb 24 2025 8:05 PM

Anu Emmanuel Latest Movie Boomerang Teaser Out Now

అను ఇమ్మాన్యుయేల్‌, శివకందుకూరి  ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బూమరాంగ్ (Boomerang Movie). ఈ మూవీని సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బూమరాంగ్ టీజర్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ చిత్రాన్ని ఓ సందేశాత్మక సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి  ఆండ్రూ బాబు దర్శకత్వం వహించారు. కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ సినిమా తీసినట్లు డైరెక్టర్‌ వెల్లడించారు. సితార ఫిల్మ్స్‌ లిమిటెడ్‌ లైన్‌ ప్రోడక్షన్‌ బ్యానర్‌పై లండన్‌ గణేశ్, డా. ప్రవీణ్‌ రెడ్డి ఊట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement